cancer case
-
బిహార్ మాజీ ముఖ్యమంత్రికి వచ్చిన కేన్సర్ ఎలాంటిదంటే?
బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సోమవారం (మే 13) మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆరు నెలల క్రితమేకేన్సర్ నిర్ధారణ అయినట్టు ట్వీట్ ద్వారా వెల్లడించారు. గొంతు కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న మాజీ సీఎం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. అతనుఈ కేన్సర్ లక్షణాలు ఏమిటో? నివారణ మార్గాలేమిటో? ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ అభిషేక్ శంకర్ తెలియజేశారు.బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ గొంతు కేన్సర్‌కి గురవడంతో.. ఈ వ్యాధి క్రమంగా అతని ఊపిరితిత్తులకు చేరుకుంది. దీంతో ఆయన కన్నుమూశారు. ఈనేపథ్యంలో గొంతు కేన్సర్ లక్షణాలు, కారణాలు తెలుసుకుందాం.ఇవి.. గొంతు కేన్సర్ లక్షణాలు..– ఒక వ్యక్తికి తరచుగా దగ్గు సమస్య ఉన్నా, ఆహారం మింగడంలో ఎలాంటి ఇబ్బంది కొనసాగినా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి– ఇలాంటి లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. ఎందుకంటే గొంతు కేన్సర్‌లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.– దీనినే 'అన్నవాహిక' కేన్సర్ అని కూడా పిలుస్తారు. లక్షణాలు– కేన్సర్ కారణంగా.. గొంతునొప్పితో బాధపడుతున్న వ్యక్తి వాయిస్ ముద్దగా మారుతుంది.– ఆహారం తినేటప్పుడు గొంతులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీంతోపాటుగా వాపు కూడా సంభవిస్తుంది.– బాధితుడు గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు.. చెవి నొప్పి కూడా రావచ్చు.– దగ్గుతున్నప్పుడు శ్లేష్మంతో పాటు రక్తం కూడా వచ్చే అవకాశం ఉంది.– అలాగే బరువులో మార్పులు కూడా కనిపిస్తాయి. గొంతు కేన్సర్‌కు కారణమేమిటి?– ఒక వ్యక్తి నిరంతరం ధూమపానం చేయడంతో గొంతు కేన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది.– పొగాకు సేవించే వారిలోనూ ఈ వ్యాధి సోకే ప్రభావం ఉంది.– అలాగే ధూమపానంతోపాటు , మద్యం సేవించే వారికి కూడా గొంతు కేన్సర్ వస్తుంది.– ఈ వ్యాధి విటమిన్ ఎ లోపం వల్ల కూడా రావచ్చు.మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు?– కేన్సర్ ప్రమాదకరమైన ఒక ప్రాణాంతక వ్యాధి.– శరీరంలోని ఏదైనా భాగంలో కేన్సర్ సోకితే వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. అశ్రద్ధ వహిస్తే క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది.– గొంతు కేన్సర్ ఆహార నాళ ద్వారాన్ని అడ్డుకుంటుంది. దీంతో ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.– గొంతులో అకస్మాత్తుగా భారం, వాయిస్‌లో మార్పు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని డా. అభిషేక్ శంకర్ తెలిపారు.ఇవి చదవండి: ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి -
ఖదీర్.. నువ్వు బతకాలి !
సాక్షి, జమ్మలమడుగు(కడప) : అందరినీ నవ్వుతూ పలకరిస్తూ.. ఉల్లాసంగా తిరిగే ఆ అబ్బాయికి అకస్మాత్తుగా కేన్సర్ అని తేలింది. ఆ వార్త విన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కష్టం చేసి కూడబెట్టుకున్న అంతో ఇంతో డబ్బుతో చికిత్స చేయించారు. కానీ వ్యాధి పూర్తిగా నయం కావాలంటే రూ.40 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో తమ కుమారుడిని బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు దాతల సాయాన్ని అర్థిస్తున్నారు. జమ్మలమడుగు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న అచ్చుకట్ల హుస్సేన్ పీరా, అచ్చుకట్ల మస్తాన్ బీ దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో పెద్దకుమారుడు అచ్చుకట్ల అబ్దుల్ ఖదీర్. రెండేళ్ల క్రితం 8వతరగతి చదివేవాడు. ఆ సమయంలో అనారోగ్యం బారినపడటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్లడ్ కేన్సర్‌గా గుర్తించారు. ప్రాథమిక దశలో ఉండటంతో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కొంత మెరుగుపడింది. తమ కుమారుడు కోలుకున్నాడని ఆ తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ఇంతలోనే ఇటీవల తిరిగి తీవ్రమైన జ్వరం రావడంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చూపించారు. కేన్సర్ పూర్తి స్థాయిలో నయం కావాలంటే కనీసం రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్‌నుంచి తల్లిదండ్రులు భారంగా తమ కుమారుడు అబ్దుల్ ఖదీర్‌ను స్వగ్రామానికి తీసుకుని వచ్చారు. దాతలు కరుణించాలి.. కష్టం చేసి జీవనం సాగించేవాళ్లం. మా కుమారుడికి బ్లడ్ కేన్సర్ నయం కావాలంటే కనీసం 40 లక్షల రూపాయలు అవసరం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అంత డబ్బులు మా దగ్గర లేవు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. మా కుమారుడిని బతికించుకోవాలని ఉన్నా నిస్సహాయులంగా ఉండిపోవాల్సి వస్తోంది. దాతలు కరుణించి నా కుమారుడి ప్రాణం నిలబెట్టాలి. – అచ్చుకట్ల హుస్సేన్ పీరా. -
జాన్సన్ అండ్ జాన్సన్ కు భారీ జరిమానా
బేబీ ఫౌండర్ తో మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన ప్రముఖ ఎఫ్ ఎంసీజీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కు భారీ జరిమానా పడింది. కంపెనీకి చెందిన టాల్కం ఫౌడర్‌ను వాడటం వల్ల తనకు అండాశయ క్యాన్సర్ వచ్చిందంటూ ఓ మహిళ కోర్టుకు ఎక్కడంతో, అమెరికా కోర్టు ఈ సంస్థకు 110 మిలియన్ డాలర్ల(రూ.708కోట్లకుపైగా) జరిమానా విధించింది. వెర్జినీయాకు చెందిన లోయిస్ స్లేమ్ప్ అనే మహిళ నాలుగు దశాబ్దాలు టాల్కం ఫౌండర్లను వాడిన అనంతరం ఆమెకు అండాశయ క్యాన్సర్ సోకింది. అయితే ఈ ఫౌండర్ లో ఉండే కారకాల వల్ల క్యాన్సర్ వస్తుందని కంపెనీ ఎక్కడా కూడా హెచ్చరికలు చేయకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు వస్తున్నాయని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఈ జాన్సన్ అండ్ జాన్సన్ పై దాదాపు 2400 మేర ఫిర్యాదులు కోర్టులో ఉన్నాయి. అండాశయ క్యాన్సర్ సోకినట్టు లోయిస్ కు 2012లో డాక్టర్లు తేల్చారు. అనంతరం ఆ క్యాన్సర్ లివర్ కి కూడా సోకింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉత్పత్తులు బేబీ ఫౌండర్, షోవర్ టూ షోవర్ ఫౌండర్లను తాను వాడినట్టు లోయిస్ చెప్పడంతో, ఈ ఉత్పత్తులను వాడటం వల్లనే ఆమెకు క్యాన్సర్ వచ్చినట్టు నిర్ధారణైంది. అయితే ఈ కంపెనీ తనను తాను నిరూపించుకోవడంలో విఫలమవుతూ వస్తోంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపించడంలో ఈ కంపెనీలు మరోసారి నిరాకరించాయని, మహిళల విషయంలో కనీస బాధ్యతలు కూడా వారు నిర్వర్తించడం లేదని లోయిస్ లాయర్ చెప్పారు. ఇంతకముందు కూడా ఇలాంటి కేసులు నిర్ధారణ కావడంతో జాన్సన్ అండ్ జాన్సన్ కు భారీ జరిమానాలనే అమెరికా కోర్టులు విధించాయి. -
పొగాకును నిషేధించాల్సి ఉంది
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులను నిషేధించాల్సిన అవసరం ఉందని గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్‌వాలా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ‘వృద్ధ వయస్సులో వచ్చే ఆరోగ్యసమస్యలు-నివారణ’ విషయమై బెంగళూరులో సోమవారం జరిగిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... 90 శాతం క్యాన్సర్ కేసుల్లో వ్యాధి కారకం పొగాకు ఉత్పత్తులేనని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అందువల్ల పొగాకును నిషేధించాల్సి ఉంది ప్రాణాంతకమైన పొగాకును రాష్ట్రంలో నిషేధించడం అన్ని విధాల ఉత్తమమని వజుభాయ్ రుడాభాయ్ వాలా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవడం బాగుంటుందన్నారు. మారిన జీవన శైలి వల్ల ప్రజలు చిన్న వయసులోనే వివిధ రకాల వ్యాధులకు గురికావాల్సి వస్తోందన్నారు. అయితే శరీరానికి తగినంత శ్రమ ఇవ్వడం వల్ల చాలా రోగాల నుంచి దూరంగా ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. వృద్ధులకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలను రూపొందించాలని సూచించారు. వృద్దాప్యంలో తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరూ చేదోడువాదోడుగా ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్‌గుండూరావ్ పేర్కొన్నారు. కాగా, కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్య రంగ నిపుణులు ‘వృద్ధాప్య వయస్సులో వచ్చే ఆరోగ్యసమస్యలు-నివారణ విషయం పై రీసర్చ్పేపర్లను వెలువరించారు.