జాన్సన్ అండ్ జాన్సన్ కు భారీ జరిమానా
జాన్సన్ అండ్ జాన్సన్ కు భారీ జరిమానా
Published Fri, May 5 2017 6:09 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
బేబీ ఫౌండర్ తో మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన ప్రముఖ ఎఫ్ ఎంసీజీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కు భారీ జరిమానా పడింది. కంపెనీకి చెందిన టాల్కం ఫౌడర్ను వాడటం వల్ల తనకు అండాశయ క్యాన్సర్ వచ్చిందంటూ ఓ మహిళ కోర్టుకు ఎక్కడంతో, అమెరికా కోర్టు ఈ సంస్థకు 110 మిలియన్ డాలర్ల(రూ.708కోట్లకుపైగా) జరిమానా విధించింది. వెర్జినీయాకు చెందిన లోయిస్ స్లేమ్ప్ అనే మహిళ నాలుగు దశాబ్దాలు టాల్కం ఫౌండర్లను వాడిన అనంతరం ఆమెకు అండాశయ క్యాన్సర్ సోకింది. అయితే ఈ ఫౌండర్ లో ఉండే కారకాల వల్ల క్యాన్సర్ వస్తుందని కంపెనీ ఎక్కడా కూడా హెచ్చరికలు చేయకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు వస్తున్నాయని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
ఇప్పటికే ఈ జాన్సన్ అండ్ జాన్సన్ పై దాదాపు 2400 మేర ఫిర్యాదులు కోర్టులో ఉన్నాయి. అండాశయ క్యాన్సర్ సోకినట్టు లోయిస్ కు 2012లో డాక్టర్లు తేల్చారు. అనంతరం ఆ క్యాన్సర్ లివర్ కి కూడా సోకింది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉత్పత్తులు బేబీ ఫౌండర్, షోవర్ టూ షోవర్ ఫౌండర్లను తాను వాడినట్టు లోయిస్ చెప్పడంతో, ఈ ఉత్పత్తులను వాడటం వల్లనే ఆమెకు క్యాన్సర్ వచ్చినట్టు నిర్ధారణైంది. అయితే ఈ కంపెనీ తనను తాను నిరూపించుకోవడంలో విఫలమవుతూ వస్తోంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపించడంలో ఈ కంపెనీలు మరోసారి నిరాకరించాయని, మహిళల విషయంలో కనీస బాధ్యతలు కూడా వారు నిర్వర్తించడం లేదని లోయిస్ లాయర్ చెప్పారు. ఇంతకముందు కూడా ఇలాంటి కేసులు నిర్ధారణ కావడంతో జాన్సన్ అండ్ జాన్సన్ కు భారీ జరిమానాలనే అమెరికా కోర్టులు విధించాయి.
Advertisement