ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కదు
ఒడిశా, జార్ఖండ్ ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ వ్యాఖ్య
ఫూల్‌బాణీ/బోలాంగిర్/బార్‌గఢ్/ఛాత్రా: కాంగ్రెస్ పార్టీ కనీసం 50 చోట్ల కూడా గెలవబోదని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. విజయం కాదుకదా కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఒడిశా, జార్ఖండ్‌లోని ఫూల్‌బాణీ, బోలాంగిర్, బార్‌గఢ్, ఛాత్రాలలో ఎన్నికల ప్రచారసభల్లో మోదీ ప్రసంగించారు.
‘‘ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన కనీసం 10 శాతం సీట్లు కూడా కాంగ్రెస్ సాధించబోదు. వాళ్లు కనీసం 50 సీట్లు కూడా గెలవలేరు’ అని అన్నారు. రాహుల్ గాం«దీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ గాంధీ యువరాజు 2014 నుంచి అదే స్క్రిప్ట్ చదువుతున్నారు. నా మాటలు రాసిపెట్టుకోండి. ఎన్‌డీఏ అన్ని రికార్డులను బద్దలుకొట్టి 400 సీట్లు సాధిస్తుంది’’ అని అన్నారు.
సొంత ప్రజల్నే కాంగ్రెస్ భయపెడుతోంది
మణిశంకర్ అయ్యర్ ‘అణుబాంబు’ వ్యాఖ్యలను మోదీ ప్రస్తావించారు. ‘ పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని సొంత ప్రజల్నే కాంగ్రెస్ భయపెడుతోంది. వర్చువల్‌గా ఇప్పటికే చనిపోయిన కాంగ్రెస్ నేతలు ప్రజల గుండెల్లో నిండిన దేశ స్ఫూర్తిని చంపేస్తున్నారు. సొంత అణుబాంబుల నిర్వహణ బాధ్యతలు కూడా పాక్‌కు చేతకావట్లేదు.
అందుకే అణుబాంబులను అమ్మేద్దామని భావిస్తోంది. బాంబులను అమ్ముదామన్నా కొనేవారు లేరు. అవి ఎంత నాసిరకానివో ఇతర దేశాలకు తెలుసు. జమ్మూకశీ్మర్ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న బలహీనమై న నిర్ణయాల వల్ల ఆ ప్రాంతం ఆరు దశాబ్దా లు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంది. కాంగ్రెస్ హ యాంలో భారత్ ఎన్నోసార్లు ఉగ్రదాడుల బా రినపడింది. కఠిన నిర్ణయాలకు బదులు చర్చలకు మొగ్గుచూపింది’’ అని ధ్వజమెత్తారు.
పాండియన్‌పై విసుర్లు
తమిళనాడుకు చెందిన మాజీ ఉన్నతాధికారి పాండియన్‌పై మోదీ విమర్శలు గుప్పి ంచారు. ‘‘ పటా్నయక్ తన ప్రభుత్వ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చేశారు. బయటివ్యక్తి(ఔట్‌సైడర్) పాండియన్ ఒడిశాను పాలిస్తున్నారు. ముఖ్యమంత్రిని మించి సూపర్ సీఎం పాలిస్తున్నారు. ఒడిశా బిడ్డలు, కూతుళ్లకు సొంత ప్రభుత్వాన్ని నడుపుకునే సత్తా లేదా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దమ్ము ఇక్కడి వారికి లేదా?’’ అని ప్రశ్నించారు.
నవీన్ పటా్నయక్ జిల్లాల పేర్లు చెప్పగలరా?
‘‘ఒడిశాకు ఇన్నేళ్లు సీఎంగా ఉన్న నవీన్ పటా్నయక్‌కు ఇదే నా సవాల్. ఆయన ఒడిశాలోని అన్ని జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లను ఏ పేపర్‌లో చూడకుండా, ఎవరి సాయం లేకుండా ఒడియా భాషలో చెప్పగలరా?. పేర్లే చెప్పలేని వ్యక్తి పేదల బాధలెలా తీర్చగలరు? ప్రజా సమస్యలను ఎలా అర్థంచేసుకోగలరు?’’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment