రాయ్‌పూర్: దేశంలో ఆరు నెలల నుంచి ఏడాది లోపు మధ్యంతర ఎన్నికలు రానున్నాయని చత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర ఎన్నికల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ఓ బహిరంగ సభలో మాట్లాడారు.
‘‘ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. ఆరు నెలల నుంచి ఏడాది లోపు దేశంలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయి. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లను పక్కన పెట్టనున్నారు. యోగి ఆదిత్యనాథ్ కుర్చి కదులుతోంది. సీఎం భజన్‌లాల్ తడబడుతున్నారు. ఫడ్నవిస్ రాజీనామా చేస్తున్నారు.
.. రోజుకు మూడు డ్రెస్సులు మార్చే వారు (మోదీ) ఇప్పడు ఒకే డ్రెస్‌తో మూడు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇప్పడు వాళ్లు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఏం ధరిస్తున్నారనేది ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గట్టి గుణపాఠం. పార్టీలను విడగొట్టే, ప్రజల చేత ఎన్నకోబడిన సీఎంలను జైలులో పెట్టిన బీజేపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు’’ అని బఘేలా అన్నారు.
మరోవైపు.. ఎన్డీయే కూటమి పక్షనేతగా నరేంద్రమోదీని భాగస్వామ్య పక్షనేతలు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్న రోజునే భూపేష్ ఇటువంటి వ్యాఖ్యలు చేయటంతో సంచలనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment