
రాయ్‌పూర్: లోక్‌సభకు ఆరు నెలల నుంచి ఏడాదిలోపే మధ్యంతర ఎన్నికలు ఖాయమని కాంగ్రెస్ నేత భూపేశ్ బఘెల్ శుక్రవారం జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
‘‘బీజేపీకి చెందిన యూపీ సీఎం ఆదిత్యనాథ్, రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ పీఠాలు కదులుతున్నాయి. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయడం ఖాయం. రోజుకు మూడుసార్లు దుస్తులు మార్చుకునే అలవాటున్న మోదీ ఇప్పుడు ఒకే డ్రెస్‌తో మూడు కార్యక్రమాలకు వెళుతున్నారు. ఏం తిన్నదీ పట్టించుకోవడం మానేశారు’’ అంటూ బఘెల్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment