one year
-
నవాల్నీ మృతికి ఏడాది
మాస్కో: వ్లాదిమిర్ పుతిన్ ఏకఛత్రాధిపత్యాన్ని ధిక్కరిస్తూ, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ రష్యాలో కీలక విపక్షనేతగా ఎదిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అలెక్సీ నవాల్నీ మరణించి ఏడాది అయింది. ఈ ఏడాదిలో విపక్షాలను ఏకతాటి మీదకు తెచ్చి ప్రభుత్వ వ్యతిరేకోద్యమాన్ని నడిపే సత్తా ఉన్న నేత లేకుండా పోయాడు. దాంతో రష్యా విపక్షాలు నాయకత్వ లోపంతో ఇబ్బందులు పడుతున్నాయి. విపక్ష పార్టీల్లో ఐక్యత లోపించడం ప్రధాన సమస్యగా తయారైంది. 47 ఏళ్ల నవాల్నీ 2024 ఏడాది ఫిబ్రవరి 16న రష్యా మారుమూల ఆర్కిటిక్ ఖండ సమీపంలోని పీనల్ కాలనీ కారాగారంలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఆయన మరణానికి కారణాలను రష్యా వెల్లడించలేదు. దీంతో రష్యా ప్రభుత్వమే ఆయనను చంపేసిందని విపక్షాలు ఆరోపించాయి. 2020లో సెర్బియా పర్యటనలో ఉన్నప్పుడు నవాల్నీపై నరాల సంబంధ విషప్రయోగం జరిగిన అంశాన్ని విపక్షాలు గుర్తుచేశాయి. నవాల్నీ మృతితో ఇప్పుడు పుతిన్ ఆగడాలకు అడ్డేలేకుండా పోయిందని ఒలెగ్ ఇవనోవ్ వ్యాఖ్యానించారు. 2022లో ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించడం మొదలెట్టాక నవాల్నీ మద్దతుదారు అయిన ఇవనోవ్ రష్యాను వీడి అమెరికాలోని లాస్ఏంజెలెస్లో స్థిరపడ్డారు. ‘‘ రష్యా విపక్షంలో ఇన్నాళ్లూ ఉన్న ఏకైక ఆశాదీపం నవాల్నీ. ఆ దీపాన్ని ఆర్పేశారు. ఇన్నాళ్లూ మా దేశంలో ఏదైనా మంచి మార్పు చోటుచేసుకుని, మంచి రోజులు వస్తాయని ఆశపడ్డాం. నవాల్నీ మరణంతో మా ఆశలు అడుగంటాయి. విపక్షాలు పుతిన్‌ను ఎదుర్కొంటాయన్న ఆశ దాదాపు పూర్తిగా చచ్చిపోయింది’’ అని ఇవనోవ్ ఆవేదన వ్యక్తంచేశారు. అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చే నవాల్నీ మరణం తర్వాత ఆయన తరఫున వాదించిన లాయర్లనూ ‘తీవ్రవాదులు’గా పేర్కొంటూ పుతిన్ ప్రభుత్వం జైలుపాలుచేసింది. అరెస్టు భయంతో నవాల్నీ మద్దతుదారులు రష్యాను వీడారు. కొందరు స్వదేశంలో ఉన్నా మౌనంగా ఉండిపోయారు. -
Bhupesh Baghel: ‘ఏడాదిలోపే మధ్యంతరం’
రాయ్‌పూర్: లోక్‌సభకు ఆరు నెలల నుంచి ఏడాదిలోపే మధ్యంతర ఎన్నికలు ఖాయమని కాంగ్రెస్ నేత భూపేశ్ బఘెల్ శుక్రవారం జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘బీజేపీకి చెందిన యూపీ సీఎం ఆదిత్యనాథ్, రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ పీఠాలు కదులుతున్నాయి. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయడం ఖాయం. రోజుకు మూడుసార్లు దుస్తులు మార్చుకునే అలవాటున్న మోదీ ఇప్పుడు ఒకే డ్రెస్‌తో మూడు కార్యక్రమాలకు వెళుతున్నారు. ఏం తిన్నదీ పట్టించుకోవడం మానేశారు’’ అంటూ బఘెల్ ఎద్దేవా చేశారు. -
ఏడాది పూర్తి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో హిట్ మూవీ!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది ఏకంగా మూడు సినిమాలతో అలరించాడు. వినరో భాగ్యము విష్ణుకథ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రంలో కాశ్మీరా పరదేశి హీరోయిన్గా నటించింది. చిత్రంలో కాశ్మీరా పరదేశి హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వచ్చిన రూల్స్ రంజన్, మీటర్ చిత్రాలతో ఫర్వాలేదనిపించాడు. గతేడాది ఫిబ్రవరి 18న విడుదలైన వినరో భాగ్యము విష్ణుకథ మొదటి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. నూతన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం అద్భుతమైన నటనతో మెప్పించారు. సకుటుంబంగా ప్రేక్షకులు చూసే మంచి కథా కథనాలతో అందరినీ ఆకట్టుకుందీ సినిమా. మీడియా నుంచి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న వినరో భాగ్యము విష్ణు కథ మల్టీ జానర్ మూవీగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. కిరణ్ అబ్బవరం ఇలాంటి తరహా చిత్రాలు మరిన్ని చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన దిల్ రూబా అనే సినిమాతో పాటు సొంత ప్రొడక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. -
ఏడాది క్రితం సరిగ్గా అదే రోజు ఇది RR కాదు CSK
-
రిజైన్ పెట్టు..ప్యాకేజీ పట్టు..
-
రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది
-
‘మా’ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న మంచు విష్ణు (ఫొటోలు)
-
AP: వారానికి ఐదు రోజుల పని.. మరో ఏడాది పొడిగింపు
సాక్షి, అమరావతి: సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వ పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు. చదవండి: మీకు తెలుసా?.. చెప్పింది చేస్తే.. నష్టపోవాల్సిందే! వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వారానికి ఐదురోజుల పని విధానాన్ని ఈ ఏడాది జూన్ 27వ తేదీ నుంచి ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదురోజుల పని విధానంలో ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు పని చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులు పని చేసే విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించిన సీఎం వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. -
డాక్టర్ వైఎస్సార్ ప్రాంతీయ వైద్యశాల సేవలకు ఏడాది పూర్తి
సాక్షి ప్రతినిధి, కడప : కడప కేంద్రంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్టీసీ ప్రాంతీయ వైద్యశాల ఏర్పాటై నేటితో ఏడాది పూర్తయింది. ఏడాదిగా రాయలసీమ జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఇక్కడే ఆధునిక వైద్య సేవలు అందుతున్నాయి. గతంలో వీరు ఆయా జిల్లాల పరిధిలోని డిస్పెన్సరీలలో వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ, హైదరాబాదు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కడపలో కోట్లాది రూపాయల వ్యయంతో ప్రాంతీయ ఆస్పత్రిని నిర్మించారు. ఏడాదిలో 49,812 మందికి వైద్య సేవలు గడిచిన ఏడాదిలో వైఎస్సార్ జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన 49,812 మందికి ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. 120 మందిని ఇన్‌పేషంట్లుగా చేర్చుకుని వైద్యం చేయగా, 100 మందికి వివిధ రకాల ఆపరేషన్లు చేశారు. 63 శాతం మంది ఉద్యోగులు, కార్మికులకు, 16.3 శాతం మంది కుటుంబ సభ్యులకు, 20.7 శాతం మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆస్పత్రిలో వైద్యం అందించారు. 2500 మందికి ఎక్స్‌రేలు తీశారు. వేలాది మందికి ల్యాబ్‌లలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. 170 రకాల ట్యాబెట్లు, 30 రకాల ఇంజెక్షన్లు ఈ ప్రాంతీయ వైద్య శాలలో బీపీ, షుగర్, గుండె జబ్బులకు యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, చర్మ వ్యాధులు, సీజనల్ వ్యాధులతోపాటు పలురకాల జబ్బులకు సంబంధించి ఇక్కడ ఉన్న ఫార్మసీ ద్వారా 170 రకాల ట్యాబెట్లు ఉచితంగా అందిస్తున్నారు. వీటితోపాటు వ్యాధులను బట్టి 20–30 రకాల ఇంజెక్షన్లను సైతం ఇస్తున్నారు. ఈ ఆస్పత్రికి 60 శాతం మందులు సెంట్రల్ స్టోర్స్ ద్వారా వస్తుండగా, మరో 40 శాతం మందులు అపోలో వారి నుంచి సరఫరా అవుతున్నాయి. మూడు షిఫ్ట్‌ల ద్వారా వైద్య సేవలు ఆస్పత్రిలో మూడు షిఫ్ట్‌ల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు షిఫ్ట్‌ల పద్దతిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఏడుగురు వైద్యులు, ఇద్దరు కన్సల్టెన్సీ డాక్టర్లు, రెగ్యులర్ ఔట్సోర్సింగ్ కలిపి 13 మంది సాఫ్ట్ నర్సులు, ఐదుగురు వార్డు బాయ్స్ ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇక్కడున్న ల్యాబ్‌లో 90 రకాల టెస్టులను చేస్తున్నారు. -
దమ్ము కొట్టి...
లండన్: సరిగ్గా ఏడాది క్రితం ఇంగ్లండ్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగి, సూపర్ ఓవర్ కూడా సమమై, చివరకు బౌండరీ లెక్కతో న్యూజిలాండ్ ఓడిన ఫైనల్లో స్టోక్స్ కీలకపాత్ర పోషించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ప్రధాన పోరులో 84 పరుగులతో అజేయంగా నిలిచిన అతను సూపర్ ఓవర్లో కూడా బ్యాటింగ్‌కు దిగాడు. అయితే ఈ రెండింటి మధ్య స్టోక్స్ తీవ్ర ఉత్కంఠను అనుభవించాడు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు దమ్ము కొట్టడం తప్ప అతనికి మరో మార్గం కనిపించలేదట. ఇంగ్లండ్ విజయం గురించి వచ్చిన కొత్త పుస్తకం ‘మోర్గాన్స్ మెన్ –ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఇంగ్లండ్స్ రైజ్ ఫ్రమ్ క్రికెట్ వరల్డ్ కప్ హ్యూమిలియేషన్ టు వరల్డ్‌కప్ గ్లోరీ’లో ఇలాంటి ఆసక్తికర అంశాలు ఎన్నో ఉన్నాయి. ‘ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే వరకు కెమెరా కళ్లు, 27 వేల మంది ప్రేక్షకుల అంచనాలు అతని మీదే ఉన్నాయి. గదిలో మోర్గాన్ తదుపరి వ్యూహం గురించి మాట్లాడుతుంటే స్టోక్స్ తనకు కాస్త ప్రశాంతత కావాలని పక్కకు వెళ్లిపోయాడు. అప్పటికే తీవ్ర ఒత్తిడిలో అతను రెండున్నర గంటలు బ్యాటింగ్ చేశాడు. సహచరులకు దూరంగా ఒంటరిగా వెళ్లి సిగరెట్ తాగిన తర్వాత మళ్లీ ఉత్సాహంతో వచ్చాడు’ అని పుస్తక రచయితలు నిక్ హాల్ట్–స్టీవ్ జేమ్స్ వెల్లడించారు. మరోవైపు కెప్టెన్ మోర్గాన్ నాటి మ్యాచ్‌లో ఒక కీలక క్షణాన్ని గుర్తు చేసుకున్నాడు. నీషమ్ బౌలింగ్‌లో స్టోక్స్ బంతిని గాల్లోకి లేపగా అతను కచ్చితంగా అవుట్‌గానే భావించానని, అప్పుడే తమ పని ముగిసిపోయినట్లు అనిపించిందని (ఈ షాట్ సిక్సర్‌గా మారింది) మోర్గాన్ అన్నాడు. తన దృష్టిలో ఈ విజయం క్రికెట్‌కంటే గొప్పదని ఇంగ్లండ్ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. -
నిర్మాణంలోని ప్రాజెక్టుల గడువు... ఏడాది పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: బిల్డర్లు, డెవలపర్లకు శుభవార్త. కరోనా సృష్టించిన సంక్షోభంతో కుదేలైన స్థిరాస్తి రంగ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో ఇటీవల స్థిరాస్తి వ్యాపార సంఘాల ప్రతినిధులు సమావేశమై చేసిన పలు విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని పలు వెసులుబాట్లను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కట్టడి కోసం లాక్డౌన్ అమలు చేయడంతో కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో స్థిరాస్తి ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కూలీలు లేక జాప్యం నిర్దేశిత గడువులోగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, కూలీలు లేకపోవడంతో పనులు పూర్తికాకున్నా గడువు ముగిసిపోయే పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్మాణంలోని ప్రాజెక్టుల గడువును మరో ఏడాది పాటు పొడిగించింది. 2020 మార్చి 25 నుంచి 2021 మార్చి 31 మధ్యకాలంలో గడువు పూర్తి కానున్న ప్రాజెక్టుల గడువు ఆటోమేటిక్‌గా మరో ఏడాది పాటు పొడిగించిందని, ప్రత్యేకంగా ఎలాంటి ఫీజులు/ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని పురపాలక శాఖ స్పష్టం చేసింది. సంబంధిత యజమాని/ డెవలపర్ దీని కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. ఈ మేరకు అరవింద్‌కుమార్ ఈ నెల 8న ఉత్తర్వులు జారీ చేశారు. ఇంపాక్ట్ ఫీజు వాయిదాల పొడిగింపు... భవన నిర్మాణ అనుమతుల కోసం చెల్లించాల్సిన ‘సిటీ లెవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజు’ను వాయిదాల్లో చెల్లించేందుకు గతంలో కల్పించిన వెసులుబాటు ఈ ఏడాది మార్చి 7 తో ముగిసిపోగా, తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని అరవింద్ కుమార్ ఈ నెల 6న ఉత్తర్వులిచ్చారు. ఈ అవకాశాన్ని వినియోగిం చుకోవడానికి భవన అనుమతుల జారీ సమయంలో వాయిదాలకు సంబంధించిన పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వాలని, గ్రౌండ్/ఫస్ట్/సెకండ్ ఫ్లోర్లో 5% అదనపు స్థలాన్ని తనఖా రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుందన్నారు. వాయిదాల్లో ఫీజులు చెల్లించవచ్చు.. కొత్త భవన, లేఅవుట్ నిర్మాణ ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతుల కోసం జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏకు చెల్లించాల్సిన బిల్డింగ్ పర్మిట్ ఫీజు, బెటర్మెంట్ చార్జీలు, డెవలప్మెంట్ చార్జీలు, క్యాపిటలైజేషన్ చార్జీలతో పాటు ఇతర అన్ని చార్జీలను నాలుగు సమాన అర్ధవార్షిక వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. 2021 మార్చి 31 వరకు పొందే అన్ని అనుమతులకు ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చు. 2021 మార్చి 31 నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు స్వీకరించిన కొత్త దరఖాస్తులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. అనుమతులు పొందే సమయంలో తొలి వాయిదాను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మూడు వాయిదాలను నిర్దేశిత గడువులోగా చెల్లిస్తామని హామీ ఇచ్చేలా పోస్ట్ డేటెడ్ చెక్కులను సమర్పించాలి. చెల్లించాల్సిన ఫీజుల వివరాలను తెలియజేస్తూ లేఖ జారీ చేసిన 30 రోజుల్లోగా తొలి వాయిదా చెల్లించాలి. భవనం/ లే అవుట్ అనుమతులు పొందే సమయంలో బిల్డర్/ డెవలపర్ మొత్తం ఫీజులను ఒకేసారి చెల్లించాలని భావిస్తే ప్రోత్సాహకంగా మొత్తం చార్జీలపై 5 శాతం తగ్గింపును అమలు చేయనున్నారు. నిర్దేశిత గడువులోగా చెల్లించడంలో విఫలమైతే జాప్యం కాలానికి 12 శాతం వడ్డీతో కలిపి వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. -
వైఎస్సార్పీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి నేటికి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం: నేటికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఇన్చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ చీరాలలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చీరాల ప్రాంతంలోని పలు వృధాశ్రమాల్లో వృద్ధులకు వ్యవసాయ మార్కెట్ ద్వారా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ సుధాకర్ వేసిన పిటిషన్‌ను సమర్ధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదన్నారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐ విచారణకు ఆదేశించటపై ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. న్యాయస్థానం సామాన్య విషయాలకు సైతం సీబీఐ విచారణకు ఆదేశిస్తుపోతే ప్రతి పోలీస్టేషన్ ఉన్న చోట కేంద్రం సీబీఐ ఆఫీసును ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన చెప్పారు. వైఎస్ఆర్: గత సంవత్సరం ఇదే రోజున 38 వేలపై చిలుకు ఓట్లతో ఎమ్మెల్యే గా గెలిపించిన రాజంపేట నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటికీ సరిగ్గా ఏడాది క్రితం అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రిగా ఎన్నికైన సీఎం జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది క్రితం రాష్ట్రంలో నారాసుర పాలనకు చరమగీతం పాడి, 151 సీట్లతో అఖండ మెజారిటీతో వైఎస్సార్పీపీకి పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సీఎం పదవి చేపట్టిన అనతికాలంలోనే రాజన్న పాలన మైమరిపించే ప్రజా సేవకుడు అనిపించుకున్నారని సీఎం జగన్‌ను ఆయన అభినందించారు. అనంతపురం: వెస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి చేసకున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని మారంపల్లి కాలనీలో వంద మంది నిరుపేద కుటుంబాలకు చీరలను పంపిణీ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం పదవి చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆకాంక్షలను నేరవేరుస్తున్నారని తెలిపారు. జగన్‌పై విశ్వాసం ఉంచిన ప్రజలకు సుపరిపాలన అందుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీల్లో 90 శాతం ఏడాదిలోపే అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిది అని ఆయన కొనియాడారు. ఆంధప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. పశ్చిమ గోదావరి: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గోపాలపురంలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలోని పేషెంట్లు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే వి. ఆర్. ఎలిజా దివంగతనేత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. నెల్లూరు: వైఎస్సార్సీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన నిజయం సాధించి ఏడాది పూర్తైన సందర్భంగా నాయుడుపేటలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేదలకు ఐదు రకాల పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, నేతలు రాజారెడ్డి, కొల్ రామ కృష్ణమరాజు, ధనలక్ష్మి, అభిమానలు పాల్గొన్నారు. విశాఖపట్నం: వైఎస్సార్పీపీ కార్యాలయంలో పార్టీ విజయోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఈ వేడుకల్లో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎం.వి. వి.సత్య నారాయణ, నగర అధ్యక్షులు శ్రీనివాస్ వంశీ కృష్ణ పాల్గొన్నారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎ రెహ్మాన్, ఈస్ట్ ఇంఛార్జి అక్రమాని విజయ నిర్మల, కొయ్య ప్రసాద్ రెడ్డి, మహిళా కన్వీనర్ గరికిన గౌరీ, పీలా వెంకట లక్ష్మీ, యువశ్రీ, రామలక్ష్మి పాల్గొన్నారు. వైఎస్సార్పీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా పాడేరు మూడు రోడ్ల కూడలి వద్ద దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి అరుకు ఎంపీ గొడ్డేటి మాధవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొట్టగూలీ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. పాడేరు ఏరియా ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రి ఎంపీ కార్యాలయంలో ఎంపీ మార్గాని భరత్ వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ పటిష్టంగా ఉందని అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోతోందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90% హామీలను సీఎం జగన్ అమలు చేశారని ఎంపీ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు మోషేన్ రాజు, పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు: మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు అని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రకటించిన నవ రత్నాలు ప్రజలు విశ్వసించడంతో భారీ ఎత్తున విజయాన్ని ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 90 శాతం మేరకు హామీలను నెరవేర్చి ప్రజారంజక నేతగా పేరుతెచ్చుకున్నారని ఆయన తెలిపారు. కృష్ణా: వైఎస్సార్సీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీని సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేటికి ఏడాది పూర్తైన సందర్భంగా జిల్లాలోని భవానిపురం 39వ డివిజన్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఆయన పేదలకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు చేయలేని పనులను సీఎం జగన్ చేశారని ఆయన గుర్తు చేశారు. ఆర్థికంగా రాష్ట్రం వెకనబడినప్పటికీ సీఎం జగన్ ప్రజలకు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న పరిశ్రమలు చంద్రబాబు నట్టేట్లో ముంచారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కావడంతో పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలు, నాయకులకు అందజేశారు. నియోజవర్గంలో కృత్తివెన్ను, బంటుమిల్లి, గూడూరు, పెడన మండలాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తెన సందర్భంగా పామర్రు నియోజకర్గ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగరవేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన రోజు సందర్భంగా తెనాలి, గుడివాడ, కొల్లిపరలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేదలకు నిత్యావసర వస్తువులు, విద్యార్థులకు నోట్ బుక్స్, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పిడుగురాళ్ల వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో అభిమానుల మధ్య గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి మోపిదేవి వెంకటరమణ రేపల్లె వైఎస్సార్సీపీ ఆఫీసులో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పౌష్టికాహారం అందించారు. విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ చీపురుపల్లి పార్టీ ఆఫీసులో అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏడాది అయి సందర్భంగా స్థానిక ఆర్టీసీ కూడలి వద్ద దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే జోగారావు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తీ చేసుకున్న సందర్భంలో బోగాపురంలోని సొసైటీ కార్యలయం వద్ద ఉన్న దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మేల్యే అప్పలనాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి నేటికి ఏడాది పూర్తీ చేసుకున్న సందర్భంగా కురుపాంలో పార్టీ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. -
భారత యువ క్రికెటర్‌పై ఏడాది నిషేధం
న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం న్యూజిలాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీతో భారత్‌ను గెలిపించిన ఓపెనర్ మన్‌జ్యోత్ కాల్రాపై... రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో ఆడకుండా ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఏడాదిపాటు నిషేధం విధించింది. దేశవాళీ అండర్–16, అండర్–19 వయో విభాగాల్లో ఆడిన సమయంలో కాల్రా అసలు వయసుకంటే తక్కువ వయసు చూపి జట్లలోకి ఎంపికయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు తప్పని కాల్రా రుజువు చేయలేకపోయాడు. దాంతో కాల్రాపై ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడకుండా రెండేళ్లు... రంజీ ట్రోఫీ ఆడకుండా ఏడాదిపాటు నిషేధం విధిస్తున్నట్లు డీడీసీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ (రిటైర్డ్) బదర్ దురెజ్ ప్రకటించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి రికార్డుల ప్రకారం మన్‌జ్యోత్ కాల్రా ప్రస్తుత వయస్సు 20 ఏళ్ల 351 రోజులుగా ఉంది. ఇటీవలే అండర్–23 క్రికెట్ టోర్నీలో బెంగాల్‌తో మ్యాచ్‌లో కాల్రా 80 పరుగులు చేశాడు. ఓపెనర్ ధావన్ లంకతో టి20 సిరీస్‌కు ఎంపిక కావడంతో అతని స్థానంలో కాల్రా ఢిల్లీ జట్టులోకి రావడం ఖాయమైంది. అయితే అంబుడ్స్‌మన్ తాజా నిర్ణయంతో కాల్రా ఎలాంటి క్రికెట్ ఆడే అవకాశం లేకుండా పోయింది. -
ఏడాది గరిష్టానికి పసిడి ధరలు
సాక్షి, ముంబై: పండుగ సీజన్ సందర్భంగా కొనుగోళ్లు పెరగడంతో పసిడి మిసమిసలాడుతోంది. అంతర్జాతీయ సంకేతాలతో బంగారం ధరలు బుధవారం సంవత్సర గరిష్టానికి చేరాయి. 10 గ్రాముల బంగారం రూ. 150 పెరిగి రూ. 32,500కు చేరింది. అయితే వెండి కిలో మీద స్వల్పంగా.. అంటే రూ. 20 తగ్గి రూ. 39,730గా పలుకుతోంది. ప్రపంచ మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్లతో పాటు స్థానిక జువెల్లర్స్ జరుపుతున్న ట్రేడింగ్స్ తో పుత్తడి ధరలు నింగివైపు చూస్తున్నాయి. విదేశీ మార్కెట్లో ధోరణి, పండుగ, పెళ్లిళ్ల సీజన్ కారణంగా స్థానిక నగలవారి కొనుగోలుతో ఈ ఏడాది అత్యధికంగా బంగారం ధరలను పెంచింది. జాతీయ రాజధానిలో, 99.9% బంగారం మరియు 99.5% స్వచ్చత బంగారం 10 గ్రా.150 రూపాయలు పెరిగి వరుసగా రూ.32,500, రూ.32,350గా ఉంది. సావరిన్ చాలా ఎనిమిది గ్రాములు ధర రూ. 100పెరిగా 24,800ని తాకింది. మరోవైపు ధంతేరస్, దీపావళి పర్వదినాలు సమీపిస్తున్న దృష్ట్యా కొనుగోళ్లు పుంజుకుని, ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడర్ల అంచనా. -
హిట్టా..ఫట్టా..: జీఎస్టీ అమలై ఏడాది పూర్తి
-
ఏడాది వరకు నేనే సీఎం
సాక్షి, బెంగళూరు: కనీసం సార్వత్రిక ఎన్నికలయ్యే వరకైనా తానే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉంటాననీ, అప్పటి వరకు తననెవరూ టచ్ చేయలేరని ఆ రాష్ట్ర సీఎం హెచ్డీ కుమారస్వామి శుక్రవారం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్–జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలా పనిచేయడమే తన తొలి ప్రాధాన్యమని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరని ఆయన పేర్కొనడం గమనార్హం. రుణమాఫీపై గందరగోళం వద్దని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. కుమారస్వామి వ్యాఖ్యలపై చర్చ ఐదేళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదనీ, ముఖ్యమంత్రిగా కుమారస్వామి కొనసాగుతారని కాంగ్రెస్ చెబుతున్నా.. సీఎం అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్రంలో చర్చ మొదలైంది. జేడీఎస్–కాంగ్రెస్‌లు అధికారం చేపట్టినప్పటి నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం ఇరు పక్షాల నేతలు తీవ్రస్థాయిలో లాబీయింగ్‌లు చేశారు. చివరకు ఇటీవల మంత్రివర్గ విస్తరణ పూర్తవడంతో పదవులు దక్కని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీకి జేడీఎస్ మద్దతు అవసరం కాబట్టి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తే ప్రసక్తే ఉండబోదని పరిశీలకులు భావిస్తున్నారు. ముసాయిదా కమిటీ ఏర్పాటు జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నెరవేర్చాల్సిన వివిధ హామీలను ఎంపిక చేసేందుకు ఐదుగురు సభ్యులతో ఓ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఇరు పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను పరిశీలించి వాటిని ఎలా నెరవేర్చాలో నివేదిక ఇవ్వడమే ఈ ముసాయిదా కమిటీ విధి. -
మెరుపులు..మరకలు
ఒంగోలు టౌన్ : జిల్లా కలెక్టర్‌గా వి.వినయ్‌చంద్ బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది సమయంలో పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా పనిచేయలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యల పరిష్కారంలో చొరవ చూపలేకపోయారు. జిల్లా పాలనలో తనదైన ముద్ర ఇది..అని చెప్పుకోదగినవేవీ లేవు. అయితే గతంలో నిరుపయోగంగా ఉన్న మినరల్ ఫండ్ నిధులను సద్వినియోగం చేశారు. ఆ నిధులతో రిమ్స్‌లో ప్లేట్లెట్ మిషన్ కొనుగోలు చేయించడంలో కీలకపాత్ర పోషించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రులకు సంబంధించిన వైద్య పరికరాల కొనుగోలు చేయించడంలో కూడా శ్రద్ధ తీసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ఆర్ధిక సంవత్సరంలో 4.05 లక్షల కుటుంబాలకు ఉపాధి పనులు కల్పించడంలో కలెక్టర్ ముఖ్య భూమిక పోషించారు. 106.1 శాతం లేబర్ బడ్జెట్ సాధించి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశారు. జిల్లాలో 2.39 కోట్ల పనిదినాలు కూలీలకు కల్పించి రూ.601 కోట్ల ఖర్చు చేయడం ద్వారా జిల్లాను రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిపారు. జిల్లాలో 540 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో కూడా చొరవ తీసుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్పొరేట్ స్కూల్స్‌కు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యను అందించేందుకు కృషి చేశారు. జెడ్పీ సమావేశాలకు దూరం: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత కీలకమైన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు వినయ్‌చంద్ దూరంగా ఉంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో కలెక్టర్ లేకుండా జిల్లా పరిషత్ సమావేశాలు ఏమిటంటూ సభ్యులు బాయ్‌కాట్ చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ వినయ్‌చంద్ జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు దూరంగానే ఉంటున్నారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాగునీటిని అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వందల కోట్ల రూపాయలతో ప్రతిపాదనల కోసం కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాసనసభ్యులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధికార తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను మాత్రమే పిలిచి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఇదే విషయమై ఇటీవల జరిగిన ఒక సమావేశంలో సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ జిల్లా యంత్రాంగం తీరును ఎండగడుతూ శాసనసభా కమిటీ ప్రివిలైజేషన్ కమిటీ దృష్టికి తీసుకువెళతానని స్పష్టం చేశారు. ఏడాదిలో ఒక్క విలేకరులసమావేశమూ లేదు.. కలెక్టర్‌గా వినయ్‌చంద్ బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలో ఒక్కసారి కూడా పాత్రికేయుల సమావేశం నిర్వహించకపోవడం విశేషం. ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలకు సంబంధించి కింది స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించే సమయంలో పాత్రికేయుల సమావేశాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఆయన వంతు వచ్చేసరికి మాత్రం ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. ఒంగోలు కార్పొరేషన్‌పై దృష్టేదీ.. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ దానిపై ఆయన ముద్ర కనిపించలేదు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టే పనుల్లో అధికారపార్టీ నేతలు అడ్డగోలుగా టెండర్లు దక్కించుకొని పనులు చేసుకుంటున్నప్పటికీ వాటిని నియంత్రించడంలో వినయ్‌చంద్ మౌనంగా ఉండటం చర్చనీయాంశమైంది. అదేవిధంగా పర్చూరు మండలంలోని దేవరపాలెం దళితుల భూములను నీరు–చెట్టు కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వారిని భూముల్లో నుంచి వెళ్లగొట్టిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ సమయంలో జిల్లా కలెక్టర్ తగిన రీతిలో స్పందించలేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. కలెక్టర్ సమీక్షలంటే జాప్యమే.. కలెక్టర్ వినయ్‌చంద్ సమీక్ష సమావేశాలు ఉన్నాయంటే అధికారులు హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సమీక్ష సమావేశానికి సకాలంలో హాజరైతే ఆ సమావేశం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అధికారులు గంటల తరబడి ఫైళ్లు చేతిలో పెట్టుకొని ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో ఉదయం నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అధికారులు ఎదురు చూసిన ఘటనలు ఉన్నాయి. జిల్లా అధికారుల్లో అనేకమంది షుగర్‌తో బాధపడుతున్నారు. అన్ని గంటలపాటు వారు ఎదురుచూసే సమయంలో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. ఎవరైనా ఆ ఒక్కరోజే! జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు ఎవరైనా వస్తే ఒక్కరోజు మాత్రమే ఆయనను కలుసుకునే అవకాశం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలోనే ప్రజలు కలెక్టర్‌ను కలవాలని, మిగిలిన రోజుల్లో కలిసేందుకు మాత్రం అనుమతి ఉండటం లేదు. ఏదైనా అత్యవసర సమయాల్లో కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నించి విఫలమైన సందర్భాలు అనేకం చోటు చేసుకున్నాయి. -
ఈ కవలలకు ఏడాది తేడా!
సాధారణంగా కవల పిల్లలంటే పావుగంటో, అరగంటో మహా అయితే గంటో మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. కానీ, వీరిద్దరిలో ఒకరు 2017లో పుడితే, మరొకరు 2018లో పుట్టారు. అయినా, వీరిద్దరూ కవలలే అయ్యారు మరి. అదెలాగంటారా? ఒకరు 2017 డిసెంబర్ 31 రాత్రి 11 గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పుడితే, మరొకరు 2018 జనవరి 1 న 12 గంటల పదహారు నిమిషాలకు పుట్టారు. దాంతో వారిద్దరికీ ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్లలో సంవత్సరం తేడా వచ్చేసింది. అయినా కానీ వారిద్దరూ కవలలే... అందులో కాదనడానికి ఏం లేదు. తల్లిదండ్రులు వీరిని చూసి మురిసిపోతున్నారు. శాండియాగోకు చెందిన మేరియాకి మొదటి బాబు జో ఆక్విన్ జూనియర్ పుట్టిన కొద్దిసేపటికి చెల్లెలు ఐతనా జీసస్ పుట్టింది. ఈ కొద్దిసేపటిలోనే క్యాలెండర్ మారిపోవడంతో అమ్మ మురిసిపోతూ, ఫేస్బుక్లో వారిద్దరి ఫొటోలు షేర్ చేసింది. అది కాస్తా వైరల్ అయింది. -
నోట్ల రద్దుకు ఏడాది
-
నేటితో స్వాతి ఘటనకు ఏడాది
టీనగర్: ప్రేమ పేరిట వెంటాడిన హంతకుడి చేతిలో మహిళా ఇంజినీర్ స్వాతి బలై నేటితో ఏడాది కావస్తోంది. ఈ సంఘటన నగర ప్రజల మనస్సుల్లో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. చెన్నై నుంగంబాక్కంకు చెందిన మహిళా ఇంజినీర్ స్వాతి తెల్లవారుజామున 6.30 గంటలకు విధులకు వెళ్లేందుకు రైలు కోసం వేచియుండగా హంతకుడి కత్తిపోట్లకు బలయ్యారు. పట్టపగలు అనేక మంది ఎదుట కిరాతకంగా ఎలా హత్య జరిగింది? హంతకుడు ఎవరనే విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్య జరిగిన మరుసటి రోజు జూన్ 25న రైల్వేస్టేషన్ సమీపంలోగల ఒక సీసీ కెమెరాలో యువకుడు పరారవుతున్న వీడియో దృశ్యాన్ని పోలీసులు విడుదల చేశారు. జూలై రెండవ తేదీన తిరునెల్వేలి జిల్లా సెంగోట్టై సమీపంలోగల గ్రామానికి చెందిన రాంకుమార్ అనే ఇంజినీరింగ్ పట్టభద్ర యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు మునుపు అతను బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో సంచలనం ఏర్పడింది. చెన్నైకి తీసుకొచ్చిన రాంకుమార్ ఆస్పత్రిలో చికిత్సలు ముగించుకుని పుళల్ జైలులో నిర్బంధించబడ్డాడు. సెప్టెంబరు 18వ తేదీన జైలులోనే విద్యుత్ వైరును కొరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ముగిసిన కేసు: చార్జిషీటు దాఖలు చేయబడిన ఈ కేసులో హంతకుడు కూడా మృతిచెందినందున కేసు విచారణ ముగిసింది. రాంకుమార్ స్వాతిని వెంబడించి ఆమెను ప్రేమించమని వేధింపులకు గురిచేసినట్లు, ఆమె నిరాకరించడంతో హతమార్చినట్లు విచారణలో తేలింది. ఈ హత్య సంఘటనతో మహిళలకు భద్రత లేదని, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలంటూ పలువురు కోరారు. దీంతో 52 శివారు ప్రాంతాల రైల్వేస్టేషన్లలో నిఘా కెమెరాలు, పోలీసు భద్రత పెంచేందుకు నిర్ణయించారు. చర్చకు దారితీసిన అనుమానాలు: స్వాతి, రాంకుమార్ ఇరువురూ ఈ ప్రపంచంలో లేనప్పటికీ అనేక అనుమానాలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. రాంకుమార్‌ను అరెస్టు చేసిన చెన్నై పోలీసు కమిషనర్ స్వాతి రాంకుమార్‌ను తిట్టడంతో హతమార్చినట్లు తెలిపారు. అయితే పోలీసులు పట్టుకునేందుకు వెళ్లగా అతను ఆవిధంగా బదులిచ్చే అవకాశం ఉందా? అనేది సందేహాస్పదమే. పోస్టుమార్టం నివేదిక ఎందుకివ్వలేదు. కేసు ముగిసిన తర్వాత కూడా కేసు ఆధారాలను కోర్టు ఇవ్వడానికి కోర్టు నిరాకరించడానికి కారణం అంటూ పలు ప్రశ్నలున్నాయి. చిత్రానికి నిషేధం: స్వాతి హత్య కేసు సంఘటన సినిమాగాను నిర్మించారు. స్వాతి కొలై వళక్కు అనే పేరుతో తీసిన ఈ సినిమాలో కొన్ని అనుమానాలను ఆధారాలతోపాటు తెరకెక్కించినట్లు సమాచారం. ఈ చిత్రం విడుదలకు స్టే విధించాలని కోరుతూ స్వాతి తండ్రి డిజిపికి పిటిషన్ అందజేశారు. ఈ చిత్రానికి నిషేధం విధించవచ్చని సమాచారం. -
ఉపహార్ కేసులో రియల్టర్‌కు జైలు..జరిమానా
న్యూఢిల్లీ: తీవ్ర విషాదాన్ని నింపిన ఉపహార్ సినిమా థియేటర్ ఉదంతం పై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో రియల్టర్, ఉపహార్ థియేటర్ యజమాని గోపాల్ అన్సల్ కి ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతోపాటు రూ.30 కోట్లను పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసును పాక్షికంగా విచారించిన కోర్టు 2.1 మెజార్టీతో తీర్పును వెలువరించింది. నాలుగు వారాల్లోగా కోర్టు ముందు లొంగి పోవాలని ఆదేశించింది. ఇప్పటికే నాలుగు నెలలుగా జైల్లో శిక్షను అనుభవించిన ఆయన మిగిలిన శిక్షా కాలాన్ని పూర్తి చేయాలని తీర్పు చెప్పింది. అయితే మరో యజమాని సుశీల్ అన్సల్ ను మాత్రం జైలు నుంచి తప్పించుకున్నారు. అతని వయసును దృష్టిలోపెట్టుకున్న సుప్రీం అయిదునెలల జైలు శిక్షను విధించింది. అయితే ఇప్పటికే ఆయన 5నెలల శిక్షను అనుభవించడంతో ఆయన శిక్షా కాలం పూర్తియినట్టే. అయితే సుశీల్ కూడా రూ. 30కోట్లను పరిహారం చెల్లించాలని పేర్కొంది. అయితే ఈ తీర్పుపై బాధిత అసోసియేషన్ అధ్యక్షులు నీలం కృష్ణమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగలేదని ఆరోపించారు. కోర్టును ఆశ్రయించి తన జీవితంలో అతి పెద్ద తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జూన్ 13, 1997లో ఉపహార్ సినిమా థియేటర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 59 మంది అగ్నికి ఆహుతయ్యారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. దీనిపై బాధితులు ఉపహార్ బాధితుల అసోసియేషన్ గా ఏర్పడి గత 20 ఏళ్లుగా పోరాడుతున్నారు. అయితే ఈ కేసు డిసెంబర్ 19, 2009న విచారించిన ఢిల్లీ హైకోర్టు థియేటర్ యజమానులు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్, ఢిల్లీ అగ్ని మాపక శాఖ సిబ్బంది హెచ్ఎస్ పన్వర్‌లకు ఏడాది జైలు శిక్ష విధించింది. అనంతరం తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆ తరువాత ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. అగ్ని ప్రమాదానికి అన్సల్ సోదరులను దోషులుగా ప్రకటించిన న్యాయస్థానం శిక్ష విధించే విషయంలో న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించిన సంగతి తెలిసిందే. -
‘ఉపాధి’ వేతనాలు నొక్కేశారు?
వెల్గటూరు : గ్రామీణ పేదలకు ఉపాధి కాల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం నిధులు అధికారులు నిర్లక్ష్యంతో దుర్వినియోగం అవుతున్నాయి. కూలీలు శ్రమదోపిడీకి గురువుతున్నారు. మండలంలోని పైడిపెల్లి గ్రామానికి చెందిన సుమారు 500 మంది కూలీలు గ్రామంలో ఉపాధి పనులు చేశారు. చేసిన పనులను ఎఫ్ఏ రికార్డు చేసి ఈజీఎస్ కార్యాలయానికి పంపించారు. ఈమేరకు కూలీలకు వేతనాలు విడుదలయ్యాయి. కానీ వీటిని ఫినో సిబ్బంది కూలీలకు పంపిణీ చేయలేదు. దీంతో రూ.2.93 లక్షల వేతనాలు ఏడాదిగా పెండింగ్‌లోనే ఉన్నాయి. కంచే చేను మేసినట్లుగా వేతనాల ఇచ్చే∙సీఎస్పీలే వాటిని నొక్కేశారని కూలీలు ఆరోపిస్తున్నారు. పెండింగ్‌లోని వేతనాల విషయంలో చర్యలు తీసుకోవాలస్సిన ఎంపీడీవో మీనమేషాలు లెక్కవేస్తున్నారు. నిధులు దుర్వినియోగం పైడిపల్లి గ్రామంలో ఈజీఎస్‌కూలీల వేతనాలు రూ.2.93 లక్షలు సీఎస్పీలే నొక్కేశారని ప్రజావేదికలో Ðð ల్లడయింది. వారం రోజుల్లో కూలీల పెండింగ్ వేతనాలు క్లీయర్ చేస్తానని ఏపీడీ అంజయ్యకు సీఎస్పీఅంజయ్య హామీ ఇచ్చారు. ఆ మేరకు కూలీల పెండింగ్ వేతనాలు పూర్తిస్థాయిలో చెల్లించకుండా 1.12 లక్షలు మాత్రమే చెల్లింపు చేశారు. మిగిలినవి పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో కూలీలు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. సీఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫినో జిల్లా కోఆర్డినేటర్ వెకటేశ్వర్లు శనివారం సమస్య పరిష్కరిస్తారని ఈజీఎస్ ఏపీవో చంద్రశేఖర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
తనీఒరువన్కు ఏడాది
తనీఒరువన్ చిత్రం తెరపైకి వచ్చి ఏడాది అయ్యింది. జయం రవి, నయనతార జంటగా నటించిన తొలి చిత్రం ఇది. ఇందులో అరవిందస్వామి ప్రతినాయకుడిగా నటించారు. కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు మోహన్‌రాజా నిర్వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ నిర్మాణ విలువలతో నిర్మించింది. తనీఒరువన్ గత ఏడాది విడుదలైన చిత్రాలలో ఒక సంచలనం. కథలో వైవిధ్యం,కథనంలో నవ్యత, దర్శకత్వంలో కొత్తదనం, వెరసి అద్భుత విజయం సాధించి 2015లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. జయంరవిని కమర్షియల్ హీరోగా మరింత ఉన్నత స్థాయికి చేర్చిన చిత్రం ఇది. దీంతోపాటు ఆయనకు పలు అవార్డులను,అభినందనలను అందించింది. మోహన్‌రాజాకు రీమేక్ దర్శకుడన్న ముద్రను తుడిచేస్తూ విడుదలై సంచలన విజయాన్ని సాధించిన తనీవరువన్ ఏడాదిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర హీరో జయంరవి తన ఆనందాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అందులో ఆయన పేర్కొంటూ తనీఒరువన్ తెరపైకి వచ్చి ఏడాది గడిచినా చిత్రంలో నటించిన తనకు ఇంకా ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయన్నారు. చిత్రం పేరు తనీఒరువన్ (ఒకే ఒక్కడు) అయినా చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరూ తమ శక్తి వంచన లేకుండా శ్రమించారన్నారు. ముఖ్యంగా ఎంతో పరిశోధించి అద్భుతమైన కథను తయారు చేసి నిరంతర శ్రమతో చిత్రాన్ని తెరపై ఆవిష్కరించిన దర్శకుడు మోహన్‌రాజాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. అలాగే చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం, నటీనటులు, చిత్ర నిర్మాతల శ్రమ, కృషే తనీఒరువన్ చిత్ర ఘన విజయానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఈ చిత్రం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఇకపై చేసే చిత్రాలను తనీఒరువన్కు దీటుగా చేయాలన్న లక్ష్యాన్ని సూచించిందని పేర్కొన్నారు. ఇక పోతే తనీఒరువన్ చిత్రానికి సీక్వెల్ గురించి పరిశ్రమలో చాలానే చర్చ జరుగుతోందన్నారు. అయితే తాను, తన సోదరుడు మోహన్‌రాజా వేర్వేరు చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల తనీఒరువన్ సీక్వెల్ గురించి సరిగా చర్చించలేదని తెలిపారు. -
ఉత్తమ కలెక్టర్‌గా డాక్టర్ యోగితా రాణా
నేడు గోల్కొండ కోటలో సీఎం చేతుల మీదుగా అవార్డు ఏడాది పరిపాలనలోనే లక్ష్యాలు పూర్తి ఉపాధిహామీ, హరితహారంలో రాష్ట్రంలో మొదటి స్థానం ఇందూరు :జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితా రాణాను రాష్ట్రంలో ఉత్తమ కలెక్టర్‌గా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏడాది కాలంలోనే నిజామాబాద్ కలెక్టర్‌గా పని చేసిన యోగితారాణా ప్రభుత్వంతో, ప్రజలతో, ప్రజాప్రతినిధులతో భేష్ అనిపించుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన హరితహారం కార్యక్రమంలో జిల్లాకు విధించిన లక్ష్యాన్ని చేధించి జిల్లాను ముందు వరుసలో నిలబెట్టారు. జిల్లాకు నిర్దేశించిన 3.35 కోట్ల మొక్కలు నాటే లక్ష్యానికి గాను ఈ నెల 13 నాటికే 3.36 కోట్ల మొక్కలు నాటించారు. ఇంకా మొక్కలు నాటింపజేస్తున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల కలెక్టర్ల పనితీరుతో పోలిస్తే కలెక్టర్ యోగితా రాణా అన్ని విధాలుగా ముందంజలో ఉన్నారని, పనితీరు, తపనను గుర్తించిన ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ కలెక్టర్‌గా ఎంపిక చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో నిర్వహించే స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా యోగితా రాణా అవార్డును అందుకోనున్నారు. అయితే ఉత్తమ జిల్లా కలెక్టర్‌గా నిజామాబాద్ కలెక్టర్‌కు అవార్డుకు రావడం జిల్లా చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది. ఉత్తమ కలెక్టర్‌గా ఎంపిక కావడం పట్ల జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏడాది పూర్తయిన కానుకగా... గత కలెక్టర్ రొనాల్డ్ రోస్ తరువాత జిల్లాకు కలెక్టర్‌గా యోగితా రాణా వచ్చారు. 2015 ఆగస్టు 14న బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ వచ్చి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఏడాదిలోనే కాలంలోనే ఆమె జిల్లా పరిపాలనపై పట్టు సాధించారు. ప్రభుత్వ పథకాల అమలు, అధికారులచే పనులు వేగవంతం చేయడంపై దృష్టిసారించారు. ఉపాధిహామీలో జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టి అవార్డును అందుకున్న యోగితా రాణా, ప్రస్తుతం హరితహారం కార్యక్రమాన్ని పూర్తి చేసి జిల్లాను మరో సారి రాష్ట్రంలో ముందు వరుసలో నిలబెట్టారు. విద్య, వైద్యం, సంక్షేమం పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి పనుల్లో, పథకాల్లో పురోగతి తీసుకువచ్చారు. మాతా,శిశు మరణాల రేట్లను తగ్గించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో గతంలో కంటే భిన్నంగా మంచి ఫలితాలు రాబట్టారు. సుడిగాలి పర్యటనలు, తనిఖీలతో జిల్లాపై తనదైన ముద్ర వేసుకున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను, ఉద్యోగులను మందలించి, పలువురిపై వేటు కూడా వేశారు. ఏడాది పరిపాలన, పని తనానికి రాష్ట్రం ప్రభుత్వం ఉత్తమ జిల్లా కలెక్టర్‌గా అవార్డును ఇవ్వడం కానుకగానే అనుకోవచ్చు. -
టెక్ దిగ్గజానికి ఏడాది జైలు శిక్ష
అమెరికాలోని రేడియం వన్ టెక్నాలజీ కంపెనీ వ్యవస్థాపకుడు గుర్భక్ష్ చాహల్‌కు ఏడాదిపాటు జైలుశిక్ష పడింది. పదే పదే గృహహిసంకు పాల్పడుతున్నందుకు గాను శాన్ప్రాన్సిస్కో కోర్టు ఈ శిక్ష విధించింది. మల్టిపుల్ అడ్వర్టైజింగ్ కంపెనీలను స్థాపించిన గుర్బక్ష్, గృహహింస ఘటనకు పాల్పడినందుకు గాను 2013లో అరెస్టయ్యాడు. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్ మెంట్లో గర్లఫ్రెండ్ ను 30 నిమిషాల వ్యవధిలో 117 సార్లు గుర్ భక్ష్ కొట్టినట్లు ఆధారంగా వీడియో ఫుటేజీని దర్యాప్తు అధికారులు కోర్టుకు సమర్పించారు. ఆ నేరాల నిరూపణ కావడంతో శాన్ఫ్రాన్సిస్కో సుపీరియర్ కోర్టు అతడికి మూడేళ్ల ప్రొబేషనరీ శిక్ష విధించింది. అలాగే 25 గంటల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. ఆ సమయంలో గుర్భక్ష్పై 47 అభియోగాలు నమోదయ్యాయి. మొదటి అభియోగాల అనంతరం ఏడాదిలోనే మళ్లీ గుర్భక్ష్ మరో యువతిపై దాడికి పాల్పడ్డాడు. కానీ అతనిపై క్రిమినల్ కేసు నమోదుచేయడానికి సరియైన ఆధారాలు లభించలేదు. ఈ ఏడాది వేసవిలో ఆయన మరోమారు గృహహింసకు పాల్పడినట్టు నిరూపితమైంది. ఈసారి ఆధారాలు లభించడంతో అతడికి ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తున్నట్టు శానిఫ్రానిస్కో కోర్టు పేర్కొంది. మొదటి అభియోగాల అనంతరం రేడియంవన్ బోర్డు, గుర్భక్ష్ను సీఈవోగా వ్యతిరేకించింది. రేడియంవన్ నుంచి తప్పుకున్నాక గ్రావిటీ4 పేరుతో మరో స్టార్టప్‌ను ఆయన స్థాపించారు. అనంతరం ఈ రెండు కంపెనీలను 340 మిలియన్ యూఎస్ డాలర్లకు అమ్మేశాడు. గుర్భక్ష్ చాహల్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. లాస్ వెగాస్ పర్యటనలో తన గర్ల్ ఫ్రెండ్ వేరే వ్యక్తికి దగ్గరై తనను మోసం చేసిందన్న కోపంతో గుర్ భక్ష్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. -
దాడి కేసులో నిందితుడికి ఏడాది జైలు
జంగారెడ్డిగూడెం : ఓ వ్యక్తిని కొట్టి గాయపర్చిన కేసులో నిందితుడికి జై లు, మరో నలుగురికి జరిమానా విధిస్తూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి డి. అజయ్‌కుమార్ గురువారం తీర్పు చెప్పారని ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలి పారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 2014 మే 12న కేమిశెట్టి మల్లికార్జునరావు అనే వ్యక్తిపై ఎం.సత్యనారాయణ, కె.కృష్ణ, కె.శ్రీను, కె.సిం హాచలం, బి.సతీష్ దాడి చేసి గాయపర్చారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఎం.సత్యనారాయణకు ఏడాది జైలు, రూ.2 వేలు, మిగిలిన నలుగురికి ఒక్కొక్కరికీ రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. -
దాడి కేసులో నిందితుడికికి ఏడాది జైలు
జంగారెడ్డిగూడెం : ఓ వ్యక్తిని కొట్టి గాయపర్చిన కేసులో నిందితుడికి జై లు, మరో నలుగురికి జరిమానా విధిస్తూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి డి. అజయ్‌కుమార్ గురువారం తీర్పు చెప్పారని ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలి పారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 2014 మే 12న కేమిశెట్టి మల్లికార్జునరావు అనే వ్యక్తిపై ఎం.సత్యనారాయణ, కె.కృష్ణ, కె.శ్రీను, కె.సిం హాచలం, బి.సతీష్ దాడి చేసి గాయపర్చారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఎం.సత్యనారాయణకు ఏడాది జైలు, రూ.2 వేలు, మిగిలిన నలుగురికి ఒక్కొక్కరికీ రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. -
ఆ భూవిలయానికి ఏడాది..
ఏప్రిల్ 25 ఈ తేది గుర్తుకు వస్తేనే నేపాల్ ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. మళ్లీ అలాంటి భూకంపం సంభవించే అవకాశం ఉందనే పరిశోధకుల మాటలు వారి మనసులను కకావికలం చేస్తున్నాయి. గత ఏడాది ఇదే రోజున నేపాల్‌లో సంభవించిన భూకంపంలో దాదాపు 9 వేల మంది మరణించగా, 22వేల మంది గాయపడ్డారు. 8 లక్షలకు పైగా నిర్వాసితులయ్యారు. అప్పటి నుంచి తాజాగా నేపాల్‌లో సంభవించిన 4.0 కన్నా ఎక్కువగా నమోదువుతూ సంభవించిన భూకంపాల సంఖ్య 451. మొత్తంమీద సంవత్సరకాలంలో నేపాల్ భూమి దాదాపు 30వేల సార్లు కంపించింది. ఈ సమస్య ఇక్కడితో అయిపోలేదని.. గత ఏడాది సంభవించిన భూకంపం మెయిన్ హిమాలయన్ థ్రస్ట్(ఎమ్హెచ్టీ) వద్ద ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల ఘర్షణకు నిదర్శమని, ఆ భూకంపం వల్ల తగ్గిన రెసిడ్యువల్ ఎనర్జీ కేవలం ఫ్రాక్షన్స్లోనే ఉంటుందని త్వరలోనే ఇలాంటి భూకంపాలు నేపాల్‌ను తాకనున్నాయని వారు పేర్కొంటున్నారు. నేచర్ జియోసైన్స్ గత ఆగష్టులో ప్రచురించిన జర్నల్‌లో 8.0 కన్నా తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశాలున్నట్లు తెలిపింది. గతంలో భూకంప బాధితులు తూర్పు నేపాల్‌లో ఎక్కువగా ఉండగా, ఈసారి మాత్రం 1505 సంవత్సరం నుంచి ఒక్క భూకంప కేంద్రం కూడా నమోదు కాని దక్షిణ నేపాల్‌లో భూకంపం సంభవింస్తుందని ప్రచురించింది. -
‘మామ్’కు మొదటి పుట్టినరోజు
కక్ష్యలోకి ప్రవేశించి ఏడాది పూర్తి సాక్షి: ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు దేశాలకే పరిమితమైన.. కిష్టమైన అంగారయాత్రను భారత్ దిగ్విజయంగా పూర్తిచేసి గురువారంతో సరిగ్గా ఏడాది. అతి తక్కువ ఖర్చుతో.. తొలి ప్రయత్నంలోనే.. ఆసియా అగ్రదేశాలైన చైనా, జపాన్ వంటి దేశాలను వెనక్కినెట్టి.. అరుణ గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపి.. అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది ఇస్రో. అమెరికా, రష్యా, యూరప్ దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచేటట్లు చేసిన మామ్..అంచనాలకు మించి అంగారకుడికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించింది. మామ్ అంగారక కక్ష్యలోకి ప్రవేశించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళయాన్ యాత్ర విశేషాలు తెలుసుకుందాం. అరుణ గ్రహ యాత్రలో కీలక ఘట్టాలు.. 10 నెలలు..67 కోట్ల కిలోమీటర్లు.. శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను 2013 నవంబర్ 5న అంతరిక్షంలోకి పంపారు. ఈ ఉపగ్రహం అప్పటి నుంచి 67 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారక కక్ష్యలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. కక్ష్యలో ఒక సారి తిరగడానికి 72 గంటల 51 నిమిషాల 51 సెకన్ల సమయం పడుతుంది. సెప్టెంబర్ 28న తన మొదటి ఛాయాచిత్రాన్ని తీసి పంపింది. అప్పటి నుంచి ఆ కక్ష్యలో పరిభ్రమిస్తూ అరుదైన ఛాయాచిత్రాలను, అత్యంత విలువైన సమాచారాన్ని చేరవేసింది. ఇప్పటికీ చేరవేస్తూనే ఉంది. నీరు మాయమవటంపై శోధన.. మామ్‌లో లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్, మీథేన్ సెన్సర్, కలర్ కెమెరా, థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రో మీటర్‌ను ఉంచారు. ఇవి అంగారక గ్రహం మీద డ్యూటీరియం, హైడ్రోజన్ల నిష్పత్తిని లెక్కించి, ఆ లెక్కల ఆధారంగా మార్స్‌పై నీరు ఎలా అదృశ్యమైందనే కోణంలో శోధన చేస్తాయి. కక్ష్యలో స్వల్పమార్పులు.. మామ్ కక్ష్యలోకి తోకచుక్క వచ్చి ఢీకొనే అవకాశం ఉండటాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు గతేడాది అక్టోబర్ 7న ఉపగ్రహ కక్ష్యలో స్వల్పమార్పులు చేశారు. ఆ తోకచుక్క 2014 అక్టోబర్ 19న అంగారక గ్రహంపై పడింది. దీని కారణంగా మామ్ పనితీరులో ఎలాంటి మార్పు జరగలేదు. అంతకు మించి.. 2015 మార్చి 24 నాటికి మామ్ తన నిర్దేశిత ఆరు నెలల కాలాన్ని పూర్తిచేసుకుంది. అయినప్పటికీ అంచనాలకు మించి సేవలు అందిస్తోంది. ఇంకా 35 కిలోల ఇంధనం మిగిలి ఉండటంతో శాస్త్రవేత్తలు దీని కాలపరిమితిని మరో ఆరు నెలల పొడిగించారు. ఇంధనం మిగిలి ఉండటం, అందులోని పరికరాలన్నీ బాగా పనిచేస్తుండడంతో మరి కొన్ని ఏళ్లపాటు మామ్ సేవలు అందించనుంది. తాత్కాలిక అంతరాయం ఈ ఏడాది జూన్ 2 నుంచి 22 వరకు కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయకుండా పోయింది. సూర్యుడి వెనుక భాగానికి అంగారకుడు వెళ్లిపోవటంతో ఈ సమస్య ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. విశేషాలు.. తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)ను ప్రవేశపెట్టిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా రికార్డు సృష్టించింది. కేవలం రూ.450 కోట్ల వ్యయం(6.7 కోట్ల డాలర్లు)తో ఇస్రో ఈ ప్రాజెక్టును దిగ్విజయంగా పూర్తిచేసింది. అంగారక యాత్ర కోసం అమెరికా ఏకంగా 67.1 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. మామ్‌కు ముందు అంగారకుడిపైకి 51 ప్రయోగాలు చేపట్టగా..అందులో 21 మాత్రమే విజయవంతమయ్యాయి. మామ్ అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించి నెల రోజులు పూర్తయిన సందర్భంగా..ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ పేజీపై ప్రత్యేకమైన డూడుల్‌ను పోస్ట్ చేసింది. మామ్ ఘనత.. అంగారకుని ఉపగ్రహమైన డియ్మోస్ అవతలి వైపున తన కెమెరాలో బంధించింది మామ్. అంగారకుని అవతలి వైపును ఫొటో తీసిన తొలి మిషన్ మామ్ ఉపగ్రహమే. అరుణ గ్రహంపై గతంలో వివిధ దేశాలు చేపట్టిన ఏడు మిషన్లలో ఏదీ కూడా అంగారకుని అవతలి వైపు ఫోటో తీయలేకపోయింది. అంగారకునికి ఉన్న రెండు ఉపగ్రహాల్లో డియ్మోస్ చిన్నది. పయనీర్ అవార్డు.. అత్యంత తక్కువ ఖర్చుతో తయారు చేసి, తొలి ప్రయత్నంలోనే విజయం సాధించటంతో మామ్ బృందానికి అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం 2015 సంవత్సరానికి స్పేస్ పయనీర్ అవార్డు అందజేసింది. ‘అట్లాస్’ విడుదల చేసిన ఇస్రో మామ్ అంగారక కక్ష్యలోకి ప్రవేశించి ఏడాది పూర్తయిన సందర్భంగా.. అంగారకుడి అట్లాస్‌ను ఇస్రో గురువారం అహ్మదాబాద్‌లో విడుదల చేసింది. ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్, ఇతర ప్రముఖులు అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్లో దీనిని విడుదల చేశారు. అట్లాస్‌లోని ఫొటోలన్నీ మామ్‌లో ఉన్న మార్స్ కలర్ కెమెరా(ఎంసీసీ) తీసినవే. నవంబర్ 5న మామ్ 2వ వార్షికోత్సవం సందర్భంగా ‘ఫిష్షింగ్ హామ్లెట్ టు మార్స్’ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేయాలని ఇస్రో సన్నాహాలు చేస్తోంది. -
పాసయ్యారు... కానీ..!
-
సవాలక్ష సవాళ్లు!
-
కడుపుకోతకు ఏడాది
-
వారే బతికుంటే ఇప్పుడేం చేస్తూ ఉండేవారో!
హైదరాబాద్: అందరిలో ఉల్లాసం.. ప్రకృతిలో సీతాకోకచిలుకల్లా కేరింతలు.. రాళ్లు రప్పలూ.. చెట్టూ పుట్టా అన్నింటిని ముద్దాడే ఆశ.. తనివి తీరా స్పర్షించాలన్న కోరిక.. ప్రతి కొత్త చోటును కెమెరాతో తమ వద్దకు చేర్చుకునే ప్రయత్నం.. తొలుత నిర్మలంగా నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్న ఆ నది పారే మార్గంలో స్నేహితులంతా కలిసి కోలాహలంగా గంతులు వేస్తూ కెమెరాలతో వీలయినన్ని ఫొటోలతో బిజీగా ఉండగా..మొదట చినుకై ఆ తర్వాత వరదై మరికాసేపట్లో ఉప్పెనైనట్లుగా ఒక్కసారిగా గంగమ్మ ఉగ్రరూపం దాల్చింది. ముందు సెలయేరుగా మారి వారి పాదాలను ముద్దాడింది.. ఆ వెంటనే వేగం పెంచి మరో రూపాన్ని సంతరించుకుంది. దీంతో భయపడినవారంతా పారిపోయేందుకు ప్రయత్నించినా అందరినీ అమాంతం హత్తుకుని తనలో కలిపేసుకుంది. వారి కుటుంబాల్లో విషాధం నింపింది. ఘటన తీరు చూసిన అందరి కళ్లలో వరదల్లే నీరు నింపింది. ఇది సరిగ్గా ఏడాది కిందట హైదరాబాద్ శివార్లలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజి నుంచి సరదాగా టూర్‌కు వెళ్లిన విద్యార్థుల విషణ్ణ వదనాల చరిత. హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నది వద్ద సంభవించిన ప్రమాదంలో దాదాపు 24 మంది మరణించగా కొందరే ప్రాణాలతో బయటపడ్డారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే పండో డ్యామ్ తలుపులు తెరవడంతో ఆ వరద నీటికి వారంతా కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. కాస్త అప్రమత్తంగా ఉన్నా.. అనుభవజ్ఞులు పక్కన ఉన్న వారు బతికి బయటపడేవారేమో. నది ప్రవహించే మార్గంలోని రాళ్ల గుట్టలు ఎక్కి ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధిస్తూ జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నారే తప్ప వారి ప్రాణాలు పోతాయన్న విషయం గమనించలేదు. కాళ్ల కిందకు నీళ్లు వస్తుండగా ఒడ్డున ఉన్న స్థానికులు అప్రమత్తం చేసే ప్రయత్నం చేసి బయటకు రమ్మంటూ చేతులు ఊపినా.. వాళ్లు హాయ్ చెబుతున్నారని అనుకొని వీరు కూడా చేతులు ఊపారు తప్ప.. అపాయాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయారు. క్షణాల్లో వీరంతా రాళ్ల నుంచి నీళ్లలో పడి కొట్టుకుపోయారు. కనీసం నెల రోజులపాటు వీరి మృతదేహాల కోసం గాలింపులు జరిగాయి. ఈ ఘటనలో కళాశాల, అక్కడి డ్యామ్ అధికారుల నిర్లక్ష్యం వెరసి 24 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇకముందైనా కళాశాలలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోగలిగితే అటు తల్లిదండ్రులకు, వారి పిల్లలకు బంగారు భవితకు భరోసా ఇచ్చినట్లవుతుంది. ఏదేమైనా.. ఉజ్వల భవిష్యత్ ఉండి అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయిన ఆ 24 మంది విద్యార్థులు బతికుంటే ఇప్పుడేం చేస్తూ ఉండేవారో. -
'ఏడాదిలో ఎంతో అభివృద్ధి సాధించాం'
-
'మోదీ హాల్‌మార్క్ సృష్టించారు'
న్యూఢిల్లీ : ఎన్డీయే అధికారపగ్గాలు చేపట్టిన సంవత్సరకాలం పూర్తికావస్తున్న సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సంవత్సర కాలంలో బీజేపీ ప్రభుత్వం విజయాలను, చేపట్టిన అభివృద్ధి పథకాలను మీడియా ముందుంచారు. మోదీ త్వరితంగా నిర్ణయాలు తీసుకోవటంలో కొత్త ప్రమాణాలు సృష్టించారన్నారు. ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత కొత్త శక్తి ప్రభుత్వానికి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో గత సంవత్సరకాలంగా అవినీతి రహిత పాలనను అందించామన్నారు. వేగంగా అభివృధ్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మనది కూడా ఒకటన్నారు. జీఎస్టీ బిల్లు, ల్యాండ్ బిల్లులను పార్లమెంటు ఆమోదానికి తీవ్రంగా కృషి చేశామని చెప్పారు. బ్యాంకుల పనితీరు బాగుపడిందనీ, గత సంవత్సర కాలం నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు ఓవర్ టైమ్ పనిచేస్తున్నాయని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఆర్థిక లోటును తగ్గించటంలో ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఉందని జైట్లీ పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల అధికార దుర్వినియోగం అనేది పాతమాట అనీ, ఇపుడవి చాలా చురుకుగా, పారవర్శకంగా పనిచేస్తున్నాయన్నారు. ప్రధాని విదేశీ పర్యటనపై విమర్శిస్తున్నవారు 55 రోజులు సెలవు గురించి ఏ మాట్లాడతారని అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. ప్రధాని మోదీ 18 దేశాల పర్యటన ద్వారా భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచామన్నారు.ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచినట్లు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వివాదంపై మాట్లాడతూ సమస్య రాజకీయమైనా.. రాజ్యాంగ బద్ధంగా వివాదాల్ని పరిష్కరించుకోవాలన్నారు. -
ఆరుగురు ఎమ్మెల్యేల అజ్ఞాతవాసం
అధికార (అమ్మ) పార్టీని నిందిస్తే ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో డీఎండీకే ఎమ్మెల్యేలకు స్పీకర్ ధనపాల్ రుచి చూపించారు. ఎమ్మెల్యేలమనే విషయాన్నే ఏడాదిపాటు మరిచిపోయేలా నిషేధం విధించారు. పంచపాండవుల అజ్ఞాతవాసాన్ని తలపించేలా అనేక ఆంక్షలను అమలులోకి తెచ్చారు. సస్పెన్షన్ మాత్రమే కాదు షరతులు వర్తిస్తాయి అంటూ ఉత్తర్వులు జారీచేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: గత అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో డీఎండీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రగడ సృష్టించారు. బడ్జెట్ ప్రతులను చింపివేయడం, స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లడం, మాజీ ముఖ్యమంత్రి జయలలితపై విమర్శనాస్త్రాలు సంధించడం వంటి గందరగోళాలకు పాల్పడ్డారు. చంద్రకుమార్, మోహన్‌రాజ్, పార్తిబన్, వెంకటేశన్, శేఖర్, దినకరన్ ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుత, రాబోయే అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరుకాకుండా స్పీకర్ సస్పెన్షన్ విధించారు. ఆనాటి సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 1వ తేదీ వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. అయితే సచి వాలయం ప్రాంగణంలో ప్రతిరోజూ ధర్నా చేపట్టి తమ నిరసన తెలిపారు. అంతేగాక డీఎంకే, కాంగ్రెస్ తదితర ప్రతిపక్షపార్టీల మద్దతు కూడగట్టుకున్నారు. ఇదిలా ఉండగా, డీఎండీకే ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని మరో పదిరోజుల పాటూ పొడిగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంటే రాబోయే శీతాకాల అసెం బ్లీ సమావేశాల్లో సైతం పాల్గొనే వీలులేకుండా చేశారు. ఇక ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు 2016 జనవరి లేదా ఫిబ్రవరిలోనే జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడా ది అసెంబ్లీ ఎన్నికలు సైతం ముంచుకొస్తున్న కారణం గా ఆనాటి అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. ఈ కారణాల వల్ల సస్పెన్షన్ వేటుకు గురైన ఆరుగురు డీఎండీకే ఎమ్మెల్యేలు ఇక అసెంబ్లీ ముఖం చూస్తారా అనేది అనుమానంగా మారింది. అవమానంతోపాటూ ఆర్థికపోటు: దాదాపు ఏడాది నిషేధం డీఎండీకే ఎమ్మెల్యేలను అవమానంతోపాటు ఆర్థికపోటుకు గురిచేసింది. ఒక్కో ఎమ్మెల్యే నెలసరి వేతనం కింద మొత్తం రూ.55 వేలు పొందుతుంటారు. సస్పెన్షన్ వేటు పడిన ఎమ్మెల్యేలు సుమారు ఏడాది పాటు ఈ మొత్తాన్ని కోల్పోనున్నారు. అలాగే ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కింద రూ.5వేలు, అసెంబ్లీ సమావేశాలకు హాజరైనపుడు చెల్లించే సిట్టింగ్ చార్జీ 500 కోల్పోనున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే హోదాలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకునేందుకు వీలులేదు. అంతేకాదు అసెంబ్లీ ప్రాంగణంలోని గ్రంథాలయం ప్రవేశం కూడా నిషిద్ధమే. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలోకి వెళ్లకూడదు, అధికారిక కార్యక్రమాలకు హాజరుకారాదని షరతులు ఉన్నాయి. ఏడాది పాటూ ఆరుమంది సభ్యులు తాము ఎమ్మెల్యేమనే విషయాన్ని మర్చిపోవాలి. అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో తిరుగుతూ పలుకుబడి పెంచుకునే వీలులేకుండా అధికారపక్షం ఎత్తుగడవేసింది. బహుశా ఎమ్మెల్యేలపై ఇంత పెద్ద వేటు, ఆర్థికపోటు మరే రాష్ట్రంలోనూ చోటుచేసుకోలేదని భావించవచ్చు. -
ఏడాదైనా 'జాడ'లేదు
కౌలాలంపూర్: సరిగ్గా ఏడాది కిందట.. మార్చి 8వ తేదీ అర్ధరాత్రి మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బయల్దేరింది ఎంహెచ్370 విమానం. అందులో 12 మంది విమాన సిబ్బంది, ఐదుగురు భారతీయులు సహా 227 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ఉదయం 6:30 గంటలకు చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకోవాలి. కానీ.. విమానం బయల్దేరిన అరగంటకే కంట్రోల్ సెంటర్లతో సంబంధాలు నిలిచిపోయాయి. మరి కాసేపటికే రాడార్ నుంచి అదృశ్యమైపోయింది. ఆదివారం నాటికి ఏడాది పూర్తవుతుంది. ఏడాదిగా ఈ విమానం జాడ దొరకలేదు. అందులోని వారు ఏమైపోయారో తెలియలేదు. ఈ బోయింగ్ 777 విమానం ఆచూకీ కోసం ప్రపంచ చరిత్రలో అతిపెద్ద గాలింపు కొనసాగుతోంది. ఏడాది కాలంగా మహాసముద్రాన్ని జల్లెడ పడుతున్నారు. కానీ.. విమానం జాడ మాత్రం లభించటం లేదు. మే నెలాఖరుకల్లా ఈ గాలింపు పూర్తవుతుందని.. అప్పటికల్లా విమానం జాడ లభిస్తుందని మలేసియా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ఎలా మాయమైంది?.. ఎంహెచ్370 విమానం దక్షిణచైనా సముద్రం నుంచి వియత్నాం గగనతలం మీదుగా చైనా దిశగా ప్రయాణించాల్సి ఉంది. కానీ.. బయల్దేరిన విమానం దక్షిణ చైనా సముద్రంలోకి వెళ్లి వియత్నాం గగనతలంలోకి ప్రవేశించకుండానే 1:22 గంటలకు యూ-టర్న్ తీసుకుని మళ్లీ మలేసియా మీదుగా అండమాన్ సముద్రం వైపు ప్రయాణించినట్లు సైనిక రాడార్‌లో నమోదైంది. ఉదయం 2:20 గంటల వరకూ సైనిక రాడార్‌పై కనిపించిన విమానం ఆ తర్వాత దాని నుంచీ మాయమైపోయింది. అయితే.. ఆ విమానం 4గంటల పాటు దక్షిణ హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించిందని.. దాని నుంచి ఇన్మార్సాట్ ఉపగ్రహానికి అందిన సంకేతాల ఆధారంగా గుర్తించారు. ఉదయం 8:19 నిమిషాలకు చివరిసారిగా ఈ విమానం నుంచి ఉపగ్రహానికి సంకేతాలు అందాయి. ఆ తర్వాత ఎటువంటి సంకేతాలూ లేవు. గాలింపు జరుగుతోందిలా... విమానం అదృశ్యమైన తర్వాత ఆగ్నేయాసియాలో దక్షిణ చైనా సముద్రం, వియత్నాం దక్షిణ ప్రాంతంలో 14 దేశాలు కొన్ని రోజులు గాలింపు నిర్వహించారు. కానీ ఫలితం లేకపోయింది. మరుసటి వారానికి.. సైనిక రాడార్ అందించిన సమాచారం, ఉపగ్రహం నుంచి లభించిన సమాచారాన్ని విశ్లేషించి.. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు పశ్చిమ దిశగా ఈ విమానం కూలిపోయి ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకూ 46 లక్షల చదరపు కిలోమీటర్ల మేర.. సముద్ర ఉపరితలంపై గాలింపు నిర్వహించారు. ఇందులో 40 నౌకలు, 34 విమానాలను వినియోగించారు. ఆ తర్వాత మే నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 17 వరకూ మొత్తం 20 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సర్వే నిర్వహించారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి సముద్ర గర్భంలో సైతం గాలింపు చేపట్టారు. ఈ సముద్రం కొన్నిచోట్ల ఆరు కిలోమీటర్ల వరకూ లోతు ఉండటం గమనార్హం. సైడ్ స్కాన్ సోనార్లు, మల్టీ-బీమ్ ఎకో సౌండర్‌లు, వీడియో కెమెరాలు, అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ వంటి అత్యాధునిక గాలింపు పరికరాలతో నిర్దేశించుకున్న ప్రాంతంలో ప్రతి చదరపు అడుగునూ పరిశీలిస్తూ ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సముద్రగర్భంలో మొత్తం 60,000 చదరపు కిలోమీటర్ల ప్రధాన గాలింపు ప్రాంతంలో ఇప్పటివరకూ 26,000 చదరపు కిలోమీటర్ల మేర గాలింపు పూర్తిచేశారు. ఈ గాలింపులో మలేసియాకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, సింగపూర్, ఇండొనేసియా, ఆస్ట్రేలియాలు సహకారం అందిస్తున్నాయి. 'అదృశ్యం'పై అంచనాలివీ.. విమానం.. బయల్దేరిన అరగంటకే వెనుదిరిగి హిందూ మహాసముద్రం దిశగా ప్రయాణించటం.. అదీ ‘ఆటో పైలట్’ మోడ్‌లో వెళ్తూ ఇంధనం అయిపోయాక సముద్రంలో కూలిపోయివుంటుందని భావిస్తున్నారు. ఈ భారీ బోయింగ్ 777 అదృశ్యానికి కారణాలపై వైమానిక నిపుణులు అనేక కోణా ల్లో పరిశీలించి పలు అంచనాలకు వచ్చారు. అందులో ప్రధానమైనది.. విమానం పైలట్లలో ఒకరు ఉద్దేశపూర్వకంగానే దారిమళ్లించారనేది. విమానం కెప్టెన్ జహారీ అహ్మద్ షా కుటుంబ కలహాలతో తీవ్రంగా కలతచెంది ఉన్నాడని.. ఆయన సహచరులు కొందరు చెప్పటం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అసలు కార ణం బ్లాక్ బాక్స్ లభ్యమైతే కానీ తెలియకపోవచ్చు. మలేసియా ఏం చెప్తోంది.. విమానం అదృశ్యాన్ని విమాన ప్రమాదంగా పరిగణిస్తున్నామని.. అందులో ప్రయాణిస్తున్న వారెవరూ జీవించి ఉండే అవకాశం లేదని భావిస్తున్నామని మలేసియా సర్కారు ఇటీవల అధికారికంగా ప్రకటించింది. విమానం ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని.. వచ్చే మే నెలకల్లా ప్రస్తుత గాలింపు పూర్తవుతుందని మలేసియా రవాణామంత్రి లియో టియాంగ్ శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు. అప్పటికల్లా విమానం ఆచూకీ కనుగొంటామన్న ఆశాభావం వ్యక్తంచేశారు. -
సరితాదేవిపై ఏడాది నిషేధం
న్యూఢిల్ల: భారత బాక్సర్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఏడాది పాటు నిషేధం విధించింది. ఆసియా గేమ్స్‌లో తనకు అన్యాయం జరిగిందని సరిత ఆరోపిస్తూ కాంస్య పతకాన్ని తీసుకునేందుకు నిరాకరించడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. తొలుత జీవితకాలం నిషేధం విధించాలని భావించారు. కాగా సరిత వెనక్కు తగ్గి కాంస్య పతకాన్ని మళ్లీ స్వీకరించడం, భారత బాక్సింగ్ సమాఖ్య చేసిన ప్రయత్నాలతో నిషేధాన్ని ఏడాదికి తగ్గించారు. గత అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 1 వరకు నిషేధం అమల్లో ఉంటుంది. ఇక భారత కోచ్ బీఐ ఫెర్నాండెజ్‌ను రెండేళ్లు నిషేధించారు. కాగా సరితపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ కేంద్ర క్రీడల శాఖ అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యకు లేఖ రాసింది. -
బంపర్ ఆఫర్ కొట్టేసిన సుందరాంగి
-
తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పదవీ కాలం పొడగింపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం పదవీ కాలాన్ని మరో ఏడాది పొడగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సోమవారం హైదరాబాద్ లో పర్యటించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఆహ్వానం మేరకు కేసీఆర్ పలు ప్రాంతాలను సందర్శించారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్లకు నేటితో ఏడాది పూర్తి
-
జంతర్‌మంతర్‌లో నేటికీ...
సాక్షి, న్యూఢిల్లీ: ‘డిసెంబర్ 16’ రాత్రి ఘటన ఇంకా ఢిల్లీవాసుల మదిలో మెదులుతూనే ఉంది. ఆడబిడ్డపై జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ చిన్నా పెద్దా.. ఆడ మగ అన్న తేడా లేకుండా అందరి పిడికిళ్లు బిగిశాయి. కన్నెర్ర చేసిన ఢిల్లీయువత ఆగ్రహానికి రైసినాహిల్స్ జనసంద్రంగా మారింది. నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీ యావత్తు ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. అంతా ఒక్కటై నిర్భయకు న్యాయం చేయాలని నినదించారు. పోలీసు ఆంక్షలు వారిని ఆపినా.. బారికేడ్లు అడ్డుపెట్టినా జనసామాన్యం గొంతుకను వినిపించే జంతర్‌మంతర్ ఆందోళనలో తాను పాలుపంచుకుంది. ఆందోళనకారులను తన అక్కున చేర్చుకుని నినాదాలతో ఘోషించి ంది. 16 డిసెంబర్ క్రాంతి పేరిట ఏర్పడిన సంస్థ నిర్భయ నిందితులను తుదముట్టించేవరకు పోరు సాగిస్తాంటూ జంతర్‌మంతర్‌లో నేటికీ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఏడాది గడిచినా జంతర్‌మంతర్‌లో నిర్భయ ఘటన అనంతర ఉద్యమాల తాలూకా జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నేటికి మారుమ్రోగుతున్న నినాదాలు: కదులుతున్న బస్సులో నిర్భయపై జరిగిన దాడి ఘటన తర్వాత జనాగ్రహం రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తూ వచ్చింది. రోజురోజుకు ఆందోళనలో పాల్గొనే వారి సంఖ్య వందల నుంచి వేలల్లోకి మారిపోయింది. ‘వీ వాంట్ జస్టిస్...’ ‘ఫాంసీదో.. ఫాంసీదో..’అంటూ చేసిన నినాదాలు నేటికి ఆ ప్రాంతానికి వెళితే చెవుల్లో మారుమ్రోగినట్టు అనిపిస్తూనే ఉంటుంది. ఎముకలు కొరికే చలిలోనూ రోడ్డుపై పడుకునేందుకు ఉడికిపోయారు యువత. నిరసన వ్యక్తం చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో పంథాను ఎంచుకున్నారు. కొందరు ఆవేదనతో దిక్కులు పిక్కటిల్లేలా ‘న్యాయం చేయండి’అంటూ నినదిస్తే.. జావత్ జాతిని మేల్కొలిపిన ‘చెల్లెమ్మ’ ఆరోగ్యం కుదుటపడాలంటూ నిరంతరం ప్రార్థనలు చేశారు. కళాకారులు సైతం కుంచె కలిపారు. తమ బొమ్మలతో మహిళలపై జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టినట్టు చూపారు. నిర్భయ సమాధిని ఏర్పాటుచేసి అక్కడ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. జంతర్‌మంతర్‌లో చేసే ధర్నాలు అన్నీ ఒక ఎత్తు అయితే నిర్భయ ఘటనలు ఒకటి. ఇక్కడ ఏళ్లుగా ఆందోళనలు చేసినా నెరవేరని ఎన్నో డిమాండ్లు ఉన్నా, నిర్భయ ఘటనలో యువత స్పందించిన తీరు.. జంతర్‌మంతర్‌లో కొనసాగిన నిరసనల హోరు పార్లమెంట్‌నూ కుదిపేసింది.ఘటన జరిగిన తర్వాత నుంచి నిర్భయ మతి ఆతర్వాతి పరిణామాల వరకు యావత్ దేశం చూపంతా జంతర్‌మంతర్‌పైనే కేంద్రీకతమై ఉంది. దేశ, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం చర్చకు దారితీసిన ఓ ‘ఘటన’కు జంతర్‌మంతర్ సజీవ సాక్ష్యం నిలిచింది. ఇక్కడ రోజుల తరబడి చేసిన ఆందోళనలే తర్వాతి కాలంలో ‘నిర్భయ చట్టం’రావడానికి కారణమాయ్యయనేది చరిత్ర మరువని సత్యం. -
ప్రణబ్‌కు రాష్ట్రపతిగా ఏడాది పూర్తి