
టెక్ దిగ్గజానికి ఏడాది జైలు శిక్ష
అమెరికాలోని రేడియం వన్ టెక్నాలజీ కంపెనీ వ్యవస్థాపకుడు గుర్భక్ష్ చాహల్కు ఏడాదిపాటు జైలుశిక్ష పడింది. పదే పదే గృహహిసంకు పాల్పడుతున్నందుకు గాను శాన్ప్రాన్సిస్కో కోర్టు ఈ శిక్ష విధించింది. మల్టిపుల్ అడ్వర్టైజింగ్ కంపెనీలను స్థాపించిన గుర్బక్ష్, గృహహింస ఘటనకు పాల్పడినందుకు గాను 2013లో అరెస్టయ్యాడు. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్ మెంట్లో గర్లఫ్రెండ్ ను 30 నిమిషాల వ్యవధిలో 117 సార్లు గుర్ భక్ష్ కొట్టినట్లు ఆధారంగా వీడియో ఫుటేజీని దర్యాప్తు అధికారులు కోర్టుకు సమర్పించారు. ఆ నేరాల నిరూపణ కావడంతో శాన్ఫ్రాన్సిస్కో సుపీరియర్ కోర్టు అతడికి మూడేళ్ల ప్రొబేషనరీ శిక్ష విధించింది. అలాగే 25 గంటల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది.
ఆ సమయంలో గుర్భక్ష్పై 47 అభియోగాలు నమోదయ్యాయి. మొదటి అభియోగాల అనంతరం ఏడాదిలోనే మళ్లీ గుర్భక్ష్ మరో యువతిపై దాడికి పాల్పడ్డాడు. కానీ అతనిపై క్రిమినల్ కేసు నమోదుచేయడానికి సరియైన ఆధారాలు లభించలేదు. ఈ ఏడాది వేసవిలో ఆయన మరోమారు గృహహింసకు పాల్పడినట్టు నిరూపితమైంది. ఈసారి ఆధారాలు లభించడంతో అతడికి ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తున్నట్టు శానిఫ్రానిస్కో కోర్టు పేర్కొంది.
మొదటి అభియోగాల అనంతరం రేడియంవన్ బోర్డు, గుర్భక్ష్ను సీఈవోగా వ్యతిరేకించింది. రేడియంవన్ నుంచి తప్పుకున్నాక గ్రావిటీ4 పేరుతో మరో స్టార్టప్ను ఆయన స్థాపించారు. అనంతరం ఈ రెండు కంపెనీలను 340 మిలియన్ యూఎస్ డాలర్లకు అమ్మేశాడు. గుర్భక్ష్ చాహల్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. లాస్ వెగాస్ పర్యటనలో తన గర్ల్ ఫ్రెండ్ వేరే వ్యక్తికి దగ్గరై తనను మోసం చేసిందన్న కోపంతో గుర్ భక్ష్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు.