sentenced
-
హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష
కాచిగూడ: నలుగురిని పెట్రోల్ పోసి చంపిన కేసులో ఒకరికి మరణ శిక్ష, మరో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ నాంపల్లి అడిషనల్ సెషన్స్ జడ్జి వినోద్ కుమార్ తీర్పు వెలువరించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 2022లో రాగుల సాయి అనే వ్యక్తి తన మాజీ భార్య ఆర్తికి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. రాగుల సాయి స్నేహితుడైన నాగరాజును ఆర్తి రెండో వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత నాగరాజు ఆర్తిని వేధింపులకు గురి చేసేవాడు. ఆర్తిని చెల్లిగా పిలవాలని నాగరాజు స్నేహితుడైన రాగుల సాయికి తెలపడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిని మనసులో పెట్టుకున్న రాగుల సాయి తన స్నేహితుడు ఎ.రాహుల్ ఇద్దరూ కలిసి గర్భంతో ఉన్న ఆర్తిని, నాగరాజును, వీరి ఏడాది కుమారుడు విష్ణుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల స్టేట్మెంట్స్ నారాయణగూడ పోలీసులు రికార్డ్ చేసుకొని కేసు నమోదు చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్తి, నాగరాజు, వీరి ఏడాది కుమారుడు విష్ణు, ఆర్తి కడుపులోని బిడ్డతో సహా నలుగురూ మృతి చెందారు. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న నారాయగూడ పోలీసులు దర్యాప్తు సాగించారు. మొదటి ప్రాధాన్యతగా ఈ కేసుగా తీసుకున్న నాంపల్లి క్రిమినల్ కోర్టు జడ్జి వినోద్ కుమార్ శుక్రవారం నిందితుడైన రాగుల సాయికి మరణశిక్ష, అతని స్నేహితుడైన రాహుల్‌కు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు నారాయణగూడ ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ తెలిపారు. -
సవతి కుమార్తెపై అత్యాచారం.. 141 ఏళ్ల జైలు శిక్ష
మలప్పురం: మైనర్ అయిన సవతి కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ కోర్టు 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం, ఐపీసీ, జువెనైల్ జస్టిస్ చట్టం కింద వివిధ నేరాలకు గాను దోషి ఏక కాలంలో ఈ శిక్ష అనుభవించాలంటూ మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి అష్రాఫ్ ఏఎం నవంబర్ 29వ తేదీన తీర్పు వెలువరించారు. అయితే, దోషి 40 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అతడికి విధించిన శిక్షల్లో ఇదే అత్యధికమని ఆయన ఆ తీర్పులో పేర్కొన్నారు. అదేవిధంగా, బాధితురాలికి పరిహారంగా రూ.7.85 లక్షలు చెల్లించాలని కూడా దోషిని ఆదేశించారు. బాలికపై ఆమె తల్లి ఇంట్లో లేని సమయాల్లో 2017 నుంచి సవతి తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి ఒకరు తెలిపార -
ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..
కొన్ని ఘటనలు చూస్తే ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? అన్నంత బాధగా ఉంటుంది. అలాంటి వాళ్లను చూస్తే..అస్సలు తల్లి అన్న పదానికి ఉన్న గొప్ప అర్థం కూడా విలువలేనిదిగా అయిపోతుంది. తల్లి మనసు బహు సున్నితంగా ఉంటుంది. తన బిడ్డకు ఏమైనా అయితే అంత ఎత్తున కోపంతో లేగిసిపోతుంది. అలాంటిది ఈ తల్లి చేసిన ఘోరం వింటే మనసు చివుక్కుమంటుంది. అస్సలు ఈమె తల్లేనా..ఇలాంటి ఆమెకు దేవుడు పిల్లల్ని ఎందుకిచ్చాడు అన్నంత బాధకలుగుతుంది. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని ల్యాండ్ ప్రాంతానికి చెందిన క్రిస్టల్ కాంటే లారియో (32).. సంపన్న కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు ఆగర్భ శ్రీమంతులు. క్రిస్టల్ కు 16 నెలల జైలిన్ అనే పాప ఉంది. డబ్బు బాగా ఉండటంతో క్రిస్టల్ విలాసావంత జీవితానికి అలవాటు పడింది. అయితే ఆమెకు భర్త ఉన్నాడో లేక ఆమె విలాసాలను చూసి తట్టుకోలేక వదిలేశాడో తెలియదు గాని..క్రిస్టల్ మాత్రం తన కూతురితో క్లీవ్ ల్యాండ్ ప్రాంతంలో ఉంటుంది. గత ఏడాది జూన్ నెలలలో తన 16 నెలల కూతుర్ని ఉయ్యాలలో పడుకోబెట్టి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. ఈ తర్వాత మరో నగరానికి చక్కర్లు కొట్టింది. అయ్యే ఇంట్లో పాపం ఏమవుతుందన్న బాధ ఇసుమంత కూడా లేకుండా నిసిగ్గుగా ఎంజాయ్ చేసింది. ఇలా దాదాపు పదిరోజులు ఇంటి పట్టున లేకుండా పోయింది. ఆ తర్వాత తీరిగ్గా ఇంటికి వచ్చి చూడగా.. పాప ఉయ్యాలలో నిర్జీవంగా కనిపించింది. వెంటనే క్రిస్టల్ ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని,విచారణ నిమిత్త కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టులో క్రిస్టల్ చేసిన ఘనకార్యాన్ని విని నిర్ఘాంతపోయారు. ఈ కేసును సుమారు 9 నెలలపాటు క్షుణ్ణంగా విచారించారు. అనంతరం కనివిని ఎరుగని స్థాయిలో తీర్పు ఇచ్చారు. "ఇది మానవజాతి తలదించుకునే సంఘటన. ఒక తల్లి తన బిడ్డను ఇలా వదిలేసి వెళ్లడం బహుశా చరిత్రలోనే తొలిసారి కావొచ్చు. ఇలాంటి తప్పు భవిష్యత్తులో మరే ఏ తల్లి చేయకుండా ఉండేలా కఠిన తీర్పు ఇస్తున్నాను. ఈమెకు బెయిల్ అనేది లేకుండా యావ జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నానని" జడ్జి తీర్పు చెప్పారు. దీంతో ఆమె తరపు న్యాయవాదులు.. సరికొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. క్రిస్టల్ మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వ వైద్యులు ఆమెను పరీక్షించి అలాంటి మానసిక వ్యాధులు ఆమెకు లేవని తేల్చారు. దీంతో జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారం ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది. ఇక క్రిస్టల్ వ్యవహారం విని అమెరికా మాత్రమే కాదు యావత్ ప్రపంచం దిగ్బాంతికి గురయ్యింది. ఇలాంటి పాషణ హృదయంతో ఉండే తల్లులు కూడా ఉన్నారా..? అని విస్తుపోయింది . (చదవండి: డైట్లో ఈ వంటకాన్ని చేరిస్తే..మెరిసే గ్లాస్ స్కిన్ మీ సొంతం!) -
బండ్లగణేశ్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో జైలు శిక్ష!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు బండ్లగణేశ్‌కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది. అంతే కాకుండా శిక్షతో పాటు బండ్లగణేశ్‌కు రూ.95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలో ఆరునెలల జైలు శిక్ష గతంలో 2017లో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. కాగా.. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసు(సైఫర్)లో న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ తీర్పును వెలువరించింది. సైఫర్ కేసు.. సైఫర్ కేసు అనేది దౌత్య పరమైన సమాచారానికి సంబంధించినది. గత ఏడాది మార్చిలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారని ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ సైఫర్ కేసులో తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి కుట్ర జరుగుతోందని అప్పట్లోనే ఖాన్ ఆరోపించారు. ఏప్రిల్ 2022లో అవిశ్వాస తీర్మానంలో ఓడి పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవి నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు మూడు ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆగస్టు 5, 2023న ఇమ్రాన్ జైలు పాలయ్యారు. పోలీసులు ఆయన్ని అటాక్ జైలులో ఉంచారు. అయితే.. ఇస్లామాబాద్ హైకోర్టు ఈ శిక్షను రద్దు చేసింది. కానీ ఇతర కేసులలో ఇమ్రాన్‌ను నిర్బంధంలో ఉంచారు. ఇదీ చదవండి: పాకిస్థాన్ నావికుల్ని కాపాడిన భారత నేవీ -
అవినీతి కేసులో తమిళనాడు మంత్రికి మూడేళ్ల జైలు
చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడిని మద్రాసు హైకోర్టు దోషిగా తేల్చింది. మూడేళ్ల జైలుశిక్షను విధించింది. రూ.50 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పొన్ముడి ఆయన భార్యపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ 2002లో కేసు నమోదు చేసింది. ఏఐఏడీఎంకే ప్రభుత్వం 1996-2001 వరకు అధికారంలో ఉన్నప్పుడు కేసు నమోదైంది. అప్పట్లోనే పొన్ముడి ఆయన భార్య ఆదాయం రూ. 1.4 కోట్లుగా ఉంది. ఆర్థిక వనరులకు మించి వారి వద్ద డబ్బు ఉందని తెలింది. 1996-2001 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో పొన్ముడి అక్రమ సంపదను కూడబెట్టారని అధికారులు ఆరోపించారు. తగిన సాక్ష్యాధారాలను సమర్పించడంలో విఫలమైందని పేర్కొంటూ జూన్ 28న వెల్లూరులోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు పొన్ముడి ఆయన భార్యను నిర్దోషులుగా ప్రకటించింది. పొన్ముడి ఆయన భార్యను నిర్దోషులుగా విడుదల చేసిన తీర్పును ఆగస్టులో మద్రాస్ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. అయితే.. కేసు చాలా పాతదని, ప్రస్తుతం పొన్ముడికి 73 ఏళ్లు కాగా, ఆయన భార్యకు 60 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా కనీస శిక్ష తగ్గించాలని దంపతులు కోరారు. ఇదీ చదవండి: లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు -
పిల్లలపై వేధింపులు.. నిందితునికి 707 ఏళ్లు జైలు శిక్ష..!
కాలిఫోర్నియా: అమెరికాలో పిల్లలపై వేధింపులకు పాల్పడిన ఓ రాక్షసునికి న్యాయస్థానం 707 ఏళ్ల జైలు శిక్ష విధించింది! 16 మంది పిల్లలపై లైంగిక వేధింపులకు గురిచేయడంతోపాటు అశ్లీల చిత్రాలు చూపించిన కేసుల్లో ధర్మాసనం దోషిగా తేల్చింది. మొత్తం 34 కేసుల్లో నిందితునికి ధర్మాసనం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. మాథ్యూ జక్ర్జెవ్స్కీ(34) బేబీకేరింగ్ తరహా సేవలు అందించేవాడు. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న 16 మంది మగ పిల్లలను లైంగికంగా వేధించాడు. చిన్నారులకు అశ్లీల చిత్రాలు కూడా చూపించేవాడని న్యాయస్థానం గుర్తించింది. ఈ నేరాల్ని నిందితుడు 2014 నుంచి 2019 మధ్య పాల్పడ్డాడు. 2 నుంచి 12 ఏళ్ల పిల్లలపై మాథ్యూ వేధింపులు జరిపాడు. ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న మ్యాథ్యూ విదేశాలకు వెళ్తుండగా.. 2019 మే 17న పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల్లో తాజాగా తుది తీర్పును న్యాయస్థానం వెలువరించింది. దోషిపై ఎలాంటి దయ చూపించవద్దని, ఉరిశిక్ష విధించాలని ధర్మాసనాన్ని ఇద్దరు పిల్లలకు చెందిన బామ్మ కోరింది. తమ పిల్లలను చూసుకోవడానికి ఇలాంటి రాక్షసున్ని నియమించుకున్నందుకు బాధపడుతున్నామని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాథ్యూ తన రహస్యాలను బయటకు చెప్పకుండా పిల్లలను హెచ్చరించేవాడని ఓ బాలుడి తల్లి దుయ్యబట్టింది. న్యాయస్థానం తీర్పు వెలువరించిన తర్వాత మ్యాథ్యూ నేరాలకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. నవ్వుకుంటూ ముందుకు కదిలాడు. తాను పిల్లలకు ఆనందాన్నే పంచానని న్యాయమూర్తికి తెలిపాడు. పిల్లల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాడు. తాను ఎలాంటి అపరాధం చేయలేదని, తన చర్యలను సమర్థించుకున్నాడు. ఇదీ చదవండి: Sexiest Bald Man of 2023: ఈ యేడు బట్టతల అందగాడు ఇతడే.. -
ప్రేమించకపోతే దాడి చేస్తావా? ఇదేం పిచ్చి..?
ఇటీవల ప్రేమించకపోయినా లేదా ఏ కారణాల చేత ప్రేమ జంటలు విడిపోతే ఆ కథలు చివరికి చంపుకోవడంతో ముగింపు పలుకుతున్నాయి. అప్పటి వరకు ప్రేమించిన అమ్మాయి/అబ్బాయ్ చిన్న మనస్పర్థలకు వేరైతే ఎవ్వరి వారు ఉండాలి. లేదా ఆ వ్యక్తికి మనమనుసులో చోటు లేదని లైట్ తీసుకునేలా స్ట్రాంగ్ అవ్వాలి. కానీ కక్ష పెంచుకుని ఏదో క్రిమినల్ మాదిరి స్పాట్ పెట్టి చంపేంత స్థాయికి దిగజారి కటకటలా పాలవ్వతున్నారు. దీనివల్ల ఇరువురు జీవితాలు కోల్పోవడమే గానీ ఏం యూజ్ ఉండుదు. అలాంటి దారుణ ఘటనే స్వీడిష్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అల్జరీయన్ వలసదారు 26 ఏళ్ల మహమ్మద్ అమనా, స్వీడిష్ గర్లఫ్రెండ్‌తో ఉండేవాడు. ఏమయ్యింది ఏమో కొన్నాళ్లుగా ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. దీన్ని అంగీకరించని మహమ్మద్ అమనా కక్షతో రగిలిపోయాడు. ఆమెను హతమార్చేందుకు ప్లాన్ చేసి మరీ మాజీ ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ఓ నిచ్చెన సాయంతో ఆమె అపార్ట్మెంట్లోకి నేరుగా వచ్చేశాడు. అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఆ అపార్ట్మెంట్లో ఓ స్నేహితుడితో కలిసి ఉంటోంది. అక్కడ ఉన్న ఆమె స్నేహితుడి అమనాని రావద్దని అడ్డుకునే యత్నం చేశాడు. దీంతో అమనా కోపంతో అతడిపైకి రాయితోటి, కత్తితో దాడి చేసే యత్నం చేశాడు. ఈ మొత్తాన్ని అమనా మాజీ ప్రియురాలే రికార్డు చేసింది. ఈ దుశ్చర్య కారణంగా మహ్మద్ అమనాకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. పైగా స్వీడన్‌కి తిరిగి రాకుండా పదేళ్ల నిషేధంతో బహిష్కరించింది. అమనాకి ఈ శిక్ష మొదటిసారేం కాదు. ఐతే ఆ బహిష్కరణ అమనా విషయంలో అమలు కాకపోగా అతడు మళ్లీ ఇలాంటి అనేక కొత్త నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఇటీవలే కోర్టు మళ్లీ అతనికి ఇదే తరహా శిక్ష విధించింది. మరీ ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది..రెస్టారెంట్లన్నీ..) -
పుతిన్ బద్ధశత్రువు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల జైలు శిక్ష
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించారు. ఈ మేరకు విచారణకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. వీడియోలో నవాల్నీ నల్లని దుస్తులు ధరించి ఉన్నారు. చేతులు జోడించుకుని నిలబడి తీర్పును వింటున్నట్లు కనిపించారు. వీడియోలో న్యాయమూర్తి వెలువరించిన తీర్పుకు సంబంధించిన ఆడియో అస్పష్టంగా ఉందని నవాల్నీ అనుచరలు అన్నారు. తీర్పును విని నిర్దారించడం కష్టంగా ఉందని చెప్పారు. రష్యాలో పుతిన్‌కు ఏకైక ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నవాల్నీపై ఉగ్రవాదం సహా పలు కేసులు నమోదు చేశారు. ఇందులో ఆయన ఇప్పటికే 11 ఏళ్లకు పైగా శిక్ష పడగా.. తాజాగా మరికొన్ని అభియోగాల్లో మరో 19 ఏళ్లు కారాగార శిక్ష ఖరారైంది. పుతిన్ తన ప్రత్యర్థిని బయటకు వెళ్లకుండా జైళ్లోనే మగ్గే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని నవాల్నీ అనుచరులు ఆరోపిస్తున్నారు. నవాల్నీ ప్రస్తుతం 47 ఏళ్ల వయసులో ఉన్నారు. కాగా తాజా తీర్పుతో అతని అనుచరుల్లో అసంతృప్తి నెలకొంది. ఇదీ చదవండి: Putin Critic Alexei Navalny: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బద్ధశత్రువుపై మరిన్ని కేసులు -
జోకర్ వేషంలో కల్లోలం సృష్టించాడు..చివరికీ అదే..
ఓ వ్యక్తి ఎలాంటి కారణం లేకుండా మనుషులను చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎందుకు? ఏమిటీ అనే కారణాలతో సంబంధం లేకుండా దారుణాలకు ఒడిగట్టాడు. దొరకననే ధైర్యమా లేక టైం పాస్‌కి అలా చేశాడో తెలియదు. చివరికీ ప్రజలంతా అతడ్ని చంపేయాలని తీర్మానించారు. అప్పుడైనా మార్పు వచ్చిందో లేదో గానీ అకారణంగా అమాయకులు ప్రాణాలు బలిగ్నొ దుర్మార్గుడిగా నిలిచిపోయాడు. వివరాల్లోకెళ్తే..ఓ వ్యక్తి కామిక్ బుక్‌లో ఉండే జోకర్లా వేషం ధరించి టోక్యలోని ఓ రైలులో మారణకాండకు తెగబడ్డాడు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 70 ఏళ్ల వృద్ధిడితో సహా దాదాపు 12 మంది వ్యక్తులను నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. ఆ దారుణం 2021లో జరిగింది. ఐతే ఆ టైంలో ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవ్వరో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. ఎందువల్ల ఇలా చేశాడని ఎంతలా ఆరా తీసినా? ఎవరా వ్యక్తి? అనేది ఓ మిస్టరీలా మిగిలిపోయింది. ఐతే చేసిన పాపం వదిలిపెట్టదు కదా. ఎట్టకేలకు పోలీసులు శతవిధాల చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యి ఆగంతకుడిని పట్టించేలా చేసింది. పోలీసులు ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని క్యోటా హట్టోరి(26)గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి..కోర్టు ముందు హాజరుపర్చారు. విచారణలో తాను ప్రజలు చంపాలనుకున్నట్లు ఒప్పుకున్నాడు కూడా. దీంతో కోర్టు అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దొరక్కూడదని చేసిన ఏ చిన్న నేరమైన ఏదో రూపంలో దోషిగా నిలబెట్టేస్తుంది. ఇక ఆ సమయంలో నువ్వు బాధపడినా ప్రయోజనం ఉండదు. (చదవండి: ఓ వ్యక్తి 'మానవశునకం'గా రూపాంతరం.. కుక్కలా వీధుల్లో సంచరిస్తూ..) -
ఒక్కరి మరణం తెచ్చిన కార్చిచ్చు..ఏకంగా 700 మందికి జైలు శిక్ష!
ఫ్రాన్స్‌లో గత నెలలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడన్న ఆరోపణలపై ఒక యువకుడిపై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఫ్రాన్స్‌ను ఒక్క కుదుపు కదుపేసింది. ఒక్కరాత్రిలో ఫ్రాన్స్ రణరంగంలా మారిపోయింది. మైనార్టిలపై పోలీసులు అకృత్యాలు కొత్తేమి కాదంటూ ప్రజాగ్రహం ఒక్కసారిగా కట్టలు తెచ్చుకుంది. ఆ యువకుడిని చంపడాన్ని నిరశిస్తూ పౌరులు పెను విధ్వంసమే సృష్టించారు. పోలీసులు కావలనే ఇలా చేశారంటూ ప్రజలు మండిపడ్డారు. ఒక్కసారిగా ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాలు ఉద్రిక్తంగా మారిపోయాయి. దీంతో వేలాది మంది యువతీయువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు. దీంతో దేశం ఒక్కసారిగా అగ్ని గుండలా మారిపోయింది. నాటి ఘటనలో పరిస్థితిని అదుపు చేసేందకు పోలీసులు వేలాదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు ఆరోపణలు మోపి అరెస్టు చేశారు. ఈ మేరకు ఫ్రాన్స్ కోర్టుల వారిపై మోపిన అభియోగాలను విచారించి నాటి ఘటనలో అల్లర్లకు పాల్పడిని సుమారు 700 మందికి జైలు శిక్ష విధించింది. వారంతా పోలీసు అధికారులపై దాడిచేయడం, ప్రభుత్వా ఆస్తులను పాడుచేయడం తదిత వాటిల్లో దోషులుగా నిర్థారించి ఈ శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి మాట్లాడుతూ..న్యాయస్థానం నాటి ఘటనపై సీరియస్‌గానే స్పందించింది. దేశ శాంతి భద్రతలకే కోర్టు ప్రాముఖ్యతనిస్తుంది. ఇలాంటి విషయంలో కోర్టు కఠినంగానే వ్యవహరిస్తుందని అన్నారు. కాగా, ఫ్రాన్స్‌లో ఇలాంటి ఘటనలు కొత్తేమి గాదు గతంలో కూడా ఇలాంటి పలు ఉదంతాలు చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: అమ్మా! తల్లి ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్లో..) -
యాపిల్ కంపెనీలో వందల కోట్ల మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష!
17 మిలియన్లను స్వాహా చేసినందుకు గాను ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థలో పనిచేసిన మాజీ భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్షపడింది. అలాగే 19 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రూ.138 కోట్ల కుంబకోణం కేసులో ఈ శిక్షను ఖరారు చేసినట్లు యూనిటైడ్ స్టేట్స్ అటార్నీ ఆఫీస్ (United States’ attorney's office) కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. భారత్‌కు చెందిన ధీరేంద్ర ప్రసాద్ అమెరికాలోని యాపిల్ గ్లోబల్ సర్వీస్ సప్లై చైన్ విభాగంలో 2008 నుంచి 2018 వరకు విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అతనిపై మార్చి 2022లో అభియోగాలు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో సైతం ట్యాక్స్ సంబంధిత నేరాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారు. ధీరేంద్ర ప్రసాద్ (Dhirendra Prasad) ఏం చేశాడు వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. ప్రసాద్ యాపిల్ సంస్థకు కావాల్సిన ఆయా ప్రొడక్ట్‌ల విడి భాగాల్ని ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసే అధికారం ఉంది. ఈ సమయంలో ధీరేంద్ర ప్రసాద్ తన దుర్బుద్ధిని చూపించారు. తన పదవిని అడ్డం పెట్టుకొని సంస్థకు కావాల్సిన విడిభాగాలను ఆర్డర్ పెట్టడం.. కంపెనీకి తెలియకుండా వాటిని ఇతర సంస్థలకు అమ్మడం, ఇక అక్రమ లావాదేవీల్లో పాలుపంచుకున్నందుకు గాను సదరు సంస్థలకు చెల్లింపులు, ప్రొడక్ట్‌లను దొంగిలించడం, తప్పుడు ఇన్వాయిస్లను తయారు చేయడం, ఇందుకు గాను రెండు వెండర్ కంపెనీల యజమానులతో కలిసి కుట్ర పన్నినట్లు, వచ్చిన ఆదాయంపై పన్ను ఎగవేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నమ్మకంగా పనిచేస్తారనుకుంటే ఎంతో నమ్మకంతో పనిచేస్తారని పేరు సంపాదించిన ప్రసాద్‌పై యాపిల్ యాజమాన్యం లెక్కలు, ప్రొడక్ట్‌లు ఇతర విషయాల్లో జోక్యం చేసుకునేది. కంపెనీ తనపైన పెట్టుకున్న నమ్మకాన్నివమ్ము చేశారు. చేసిన పాపం బయటపడింది. యాపిల్ కంపెనీలో ప్రసాద్ చేసిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యాపిల్ కోసం విడి భాగాలు కొనుగోలు చేసే అంశంలో సుమారు 17 మిలియన్లకు పైగా మోసం చేశారు. పన్నుకూడా చెల్లించలేదు. కోర్టు ఏం చెప్పిందంటే కోర్టు వివరాల మేరకు.. యాపిల్‌లో తన పదవిని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారు. సంస్థలో ప్రొడక్ట్‌ల కొనుగోళ్ల విషయంలో స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉండడం, దాన్ని దుర్వినియోగం చేస్తూ జీతం, బోనస్‌లను యాపిల్ నుంచి అక్రమంగా సంపాదించి కోటీశ్వరుడయ్యాడు. అంతేకాదు సంస్థలో నేరాలకు పాల్పడే ఉద్యోగుల్ని యాపిల్ సంస్థ ఎలా కనిపెడుతుందో తెలుసుకొని జాగ్రత్త పడ్డారు. తన అధికారాన్ని ఉపయోగించి వాటి నుంచి బయటపడ్డారు. 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఆయా నేరాలకు పాల్పడినందుకు ప్రసాద్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. నేరం ఒప్పుకున్న నిందితుడు..మోసం చేసి సంపాదించిన డబ్బుల్ని, ఆస్తుల్ని తిరిగి చెల్లించాలి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో 3 ఏళ్ల పాటు నిశితంగా గమనించిన మరో సారి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్ కుక్కు ఇంతకన్నా ఏం కావాలి! -
కొడుకునే దోచుకునేందుకు మెడపై కతిపెట్టాడు..కానీ ట్విస్ట్ ఏంటంటే..
కన్న కొడుకునే దోచుకునేందుకు యత్నించాడు ఓ తండ్రి. విచిత్రమేటంటే తాను దొంగతనం చేస్తుంది తన కొడుకు వద్దనే అని ఆ దొంగకు తెలియదు. దీంతో సదరు తండ్రికి కోర్టు 26 నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే..స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నివశిస్తున్న17 ఏళ్ల టీనేజర్ ఓ రోజు తన ఇంటి సమీపంలోని ఏటీఎం మిషన్ వద్దకు వెళ్లాడు. అతను డబ్బులు కలెక్ట్ చేసుకుని కార్డుని జేబులో పెట్లకుంటుండగా.. ఎరో వ్యక్తి వెనుక నుంచి వచ్చి గోడకు బలంగా నెట్టేశారు. పైగా ఆ యువకుడిని గోడకు నొక్కెస్తూ వెనక్కు తిరగనివ్వకుండా మెడపై కత్తిపెట్టి బెదిరించాడు ఓ ఆగంతకుడు. దీంతో సదరు యువకుడు భయంతో ఏం కావాలని అడగగా.. ముసుగు ధరించిన వ్యక్తి ఆ యువకుడి వద్ద ఉన్న డబ్బులన్నీ ఇచ్చేయమని డిమాండ్ చేస్తాడు. ఐతే ఆ ఆగంతకుడి గొంతు విని తన తండ్రి అని గుర్తించి ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత నిదానించుకుని నేనెవరో తెలుసా అని గట్టిగా అడుగుతాడు యువకుడు. నిజంగానే నన్ను డబ్బులు అడుగుతున్నావా అని కూడా ప్రశ్నిస్తాడు ఆ వ్యక్తిని. ఐతే ఆగంతకుడు అదేమి పట్టనంటూ ఔను! అంటూ డబ్బలిస్తావా లేదా అని డిమాండ్ చేస్తూనే ఉంటాడు. దీంతో ఆ యువకుడు వెంటనే వెనక్కు తిరిగి అతని ముసుగు ఒక్కసారిగా లాగేసి..ఏంటిదా నాన్న! అని ఆగంతకుడి రూపంలో ఉన్న తండ్రిని గట్టిగా నిలదీశాడు. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయి చూస్తాడు ఆ తండ్రి. వెంటనే ఆ యువకుడు ఆ ఏటీఎం మెషన్ వద్ద నుంచి వేగంగా బయటకొచ్చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఆగంతకుడిని అరెస్టు చేయగా..నేరాన్ని అంగీకరిస్తాడు. ఈ మేరకు కోర్టులో సదరు నిందితుడు తన నేరాన్ని అంగీకరించటమే గాక తన కొడుకే ఏటీఎం వద్ద ఉన్నాడిని తనకు తెలియదని చెప్పాడు. దొంగతనం చేసేందుకే ఏటీఎంలోకి వచ్చానని అంగీకరించాడు కూడా. దీంతో కోర్టు దీన్ని ఊహించని అసాధారణమైన కేసుగా పేర్కొంటూ నిందితుడికి 26 నెలల జైలు శిక్ష విధించింది. -
నటిపై అత్యాచారం.. హలీవుడ్ మొఘల్కు 16 ఏళ్ల జైలు శిక్ష
హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్(70) లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలపాటు హాలీవుడ్లో నిర్మాతగా వెలిగిన హార్వేకు మరో 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. పదేళ్ల కిత్రం యూరోయపిన్ నటిపై బెవర్లీ హిల్స్ హోటల్ గదిలో అఘాయిత్యానికి పాల్పడినందుకు లాస్ ఏంజెల్స్ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. ఇప్పటికే లైంగిక వేధింపుల తరహా కేసుల్లో న్యూయార్క్‌లో 23 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న వేన్‌స్టీన్ తాజా తీర్పుతో మరో 16 ఏళ్లపాటు అంటే తన జీవితకాలం జైల్లో ఊచలు లెక్కిస్తూ గడపాల్సిందే. వీల్‌చైర్‌లో కోర్టుకు హాజరైన 70 ఏళ్ల ఆస్కార్ అవార్డు గ్రహీత.. దయచేసి తనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించవద్దని వేడుకున్నాడు. దానికి తాను అర్హుడిని కాదని.. ఈ కేసులో చాలా లోసుగులు ఉన్నాయని కోర్టుకు విన్నపించాడు. అయితే అతన్ని వాదనలు పట్టించుకొని న్యాయమూర్తి లిసా లెంచ్.. అత్యాచారానిక పాల్పడినందుకు మొత్తం 16 సంవత్సరాల పాటు మరో మూడు శిక్షలు విధించారు. కాగా 2013లో నటి, మోడల్‌పై హార్వే వేన్‌స్టీన్ అత్యాచారానికి పాల్పడినట్లు గత డిసెంబర్లోనే లాస్ ఏంజెల్స్ కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. బాధితురాలైన నటి వైన్‌స్టీన్‌ను వీలైనంత గరిష్ట శిక్ష విధించాలని కన్నీళ్లతో జడ్జి ముందు వేడుకుంది. అతని స్వార్థపూరితమైన, అసహ్యకరమైన చర్యలు కారణంగా తన జీవితం నాశనం అయ్యిందని తెలిపింది. తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు అతను జీవితాంతం జైల్లోనే ఉన్నా సరిపోదని అన్నారు. ఇదిలా ఉండగా హాలీవుడ్లో అగ్రనిర్మాతగా గుర్తింపు పొందిన హార్వే వేన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది హాలీవుడ్ నటీమణులు, మహిళలు అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏంజెలీనా జోలీ, సల్మా హయక్, జెన్నిఫర్ ఐన్‌స్టన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2017లో ఆయనపై ఈ ఆరోపణలే మీటూ ఉద్యమానికి దారితీశాయి. -
అత్తతో అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల శిక్ష
ఒంగోలు: అత్త పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ రెండో అదనపు జిల్లా జడ్జి ఎంఏ సోమశేఖర్ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..చీరాలకు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి చెప్పుల దుకాణం నిర్వహించేది. ఆమె కుమార్తెను చిత్తూరు జిల్లాకు చెందిన కోలా జాన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అదనపు కట్నం కావాలంటూ భార్యను నిత్యం జాన్ వేధించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో జాన్..భార్య తల్లికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధించేవాడు. చివరకు ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో చీరాలకు వచ్చి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించబోగా ఆమె కేకలు వేస్తూ బయటకు వచ్చింది. అనంతరం భర్తతో కలిసి చీరాల పోలీసులకు ఫిర్యాదుచేయగా అప్పటి సీఐ వి.సూర్యనారాయణ దర్యాప్తుచేసి కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. నేరం నిరూపణ అయినట్లుగా న్యాయమూర్తి పేర్కొంటూ నిందితుడు జాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కేసును అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యత్తపు కొండారెడ్డి వాదించగా, కోర్టు లయన్ ఆఫీసర్‌గా లక్ష్మీనారాయణ వ్యవహరించారు. చదవండి: (తప్పుడు ఆరోపణలు చేస్తే.. మీరే ఫూల్స్ అవుతారు: ఆర్కే రోజా) -
విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష
-
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ల శిక్ష
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)కు జైలు శిక్ష ఖరారైంది. దొరండా దాణా స్కామ్ కేసులో లాలూ యాదవ్ ను దోషిగా నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court).. సోమవారం ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. సంచలనాత్మక దాణా కుంభకోణానికి(fodder scam) సంబంధించిన ఐదో కేసులోనూ ఆయన దోషిగా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దొరండా దాణా స్కామ్ కేసులో లాలూ యాదవ్ ను దోషిగా నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు గత మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇవాళ జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది సీబీఐ కోర్టు. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మొత్తం 950 కోట్ల రూ. దాణా స్కామ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు రాగా.. దొరండా ట్రెజరీ కేసులో 139.35 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం 99 మందిలో 24 మందిని నిర్ధోషులుగా విడుదల చేయగా.. 46 మందికి గతవారం సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష ఖారు చేసింది. 73 ఏళ్ల లాలూ.. దుమ్కా, దియోగర్, చాయ్‌బస ట్రెజరీల కేసులకు సంబంధించి.. 14 జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దొరండా ట్రెజరీ కేసు తీర్పు వెలువడేంత వరకు ఆయన బెయిల్‌పై బయటే ఉన్నారు.ఆపై అరోగ్య సమస్యలతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక ఆరో కేసు బంకా ట్రెజరీకి సంబంధించింది ఇంకా విచారణ దశలోనే ఉంది. చదవండి: ఆర్జేడీ చీఫ్‌గా చిన్నకొడుకు తేజస్వి యాదవ్? లాలూ తీవ్ర వ్యాఖ్యలు -
ఐసిస్ కుట్ర కేసు..15 మంది దోషులకు శిక్ష
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నించిన ఐసిస్ (ఐఎస్ఐఎస్) కుట్ర కేసులో దోషులుగా తేలిన 15 మందికి శిక్ష ఖరారుచేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ పర్వీన్‌సింగ్ తీర్పు వెలువరించారు. నిందితులపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలు మోపుతూ వివిధ సెక్షన్ల కింద ఎన్ఐఏ 2015 డిసెంబరులో కేసు నమోదు చేసింది. వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ముస్లిం యువకులను రిక్రూట్ చేసుకోవడం ద్వారా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ కుట్రపన్నింది. దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తనిఖీలు చేసి 19 మంది నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఐసిస్ కోసం పని చేయడానికి, ఉగ్రవాద చర్యలకు పాల్పడటానికి కొందరు యువతను వీరంతా జునూద్–ఉల్–ఖిలాఫా–ఫిల్–హింద్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. సిరియాలో ఉన్న ఐసిస్ మీడియా చీఫ్ యూసుఫ్–అల్–హిందీ అలియాస్ షఫీ అర్మర్ అలియాస్ అంజన్భాయ్ ఆదేశాలతో భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణ కోసం వీరు పనిచేశారు. ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్టుచేసిన తరువాత, వారి కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. వారి ఇతర సహచరులను గుర్తించి, తదుపరి ప్రణాళికలను కనిపెట్టి.. ఇప్పటికే ఐసిస్‌లో చేరడానికి వెళ్లిన పలువురు సానుభూతిపరులను మధ్యప్రాచ్యంలోని వివిధ ప్రదేశాలలో అడ్డగించి తిరిగి భారత్‌కు రప్పించారు. ఎన్ఐఏ నిర్వహించిన దర్యాప్తుతో భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఐసిస్ సభ్యులకు ఆశ్రయం దొరకడం ఆగిపోయింది. దర్యాప్తు పూర్తయిన తరువాత, 2016–2017లో 16 మంది నిందితులపై ఎన్ఐఏ చార్జిషీట్లు దాఖలు చేసింది. 16.10.2020న 15 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి కఠినమైన జైలు శిక్ష, జరిమానా విధించారు. ఇందులో నఫీజ్ ఖాన్‌కు పదేళ్ల శిక్షతో పాటుగా రూ.1,03,000 జరిమానా విధించారు. ముదబ్బీర్ ముష్తాక్ షేక్‌కు ఏడేళ్ల జైలు, రూ.65,000 జరిమానా విధించారు. అబూ అనాస్‌కు ఏడేళ్ల జైలు, రూ.48 వేల జరిమానా, ముఫ్తీ అబ్దుస్ సమీకి ఏడేళ్ల జైలు, రూ.50,000 జరిమానా, అజార్ ఖాన్‌కు ఆరేళ్ల జైలు, రూ.58,000 జరిమానా విధించారు. అమ్జాద్ ఖాన్‌కు ఆరేళ్ల జైలు రూ.78,000 జరిమానా విధించారు. షరీఫ్ మొయినుద్దీన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ హుస్సేన్, సయ్యద్ ముజాహిద్, నజ్ముల్ హుడా, మహ్మద్ ఒబేదుల్లా, ఎండీ అలీమ్, ఎండీ అఫ్జల్, సోహైల్ అహ్మద్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.38 వేల జరిమానా చొప్పున విధించారు. దోషుల్లో నలుగురు హైదరాబాదీలు.. ఈ కేసులోని 15 మందిలో నలుగురు హైదరాబాదీలు ఉన్నారు. టోలిచౌకికి చెందిన ఒబేదుల్లాఖాన్ (కంప్యూటర్ స్పేర్‌పార్ట్స్ దు కాణం), షరీఫ్ మొయినుద్దీన్‌ఖాన్ (ఎలక్ట్రిక ల్ కాంట్రాక్టర్), మాదాపూర్‌కు చెందిన అబూ అనాస్ (సాఫ్ట్వేర్ ఉద్యోగి), నఫీజ్‌ఖాన్ 2016 జనవరిలో అరెస్టయ్యారు. అప్ప ట్లో వీరి నుంచి పేలుడు పదార్థాలు, తుపాకీలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. -
గండభేరుండం
ఒక ఊళ్ళో ఒక పేదరైతుకు ముగ్గురు కొడుకులు ఉండేవాళ్ళు. తల్లి, తండ్రి, ఇద్దరన్నలు రెక్కలు ముక్కలు చేసుకుని పొలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి చేరి ఆరోజు దొరికిన దానితో వండిపెడితే హాయిగా తిని, ఏ చీకూ చింతా లేకుండా ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకుంటూ గడిపేవాడు మూడవవాడు. ఒకరోజు రెండవ వాడికి కోపం వచ్చి ‘‘మనం ముగ్గురం కష్టపడుతుంటే చిన్న సాయం కూడా చేయకుండా తింటున్నాడు. ఇన్నాళ్ళూ చిన్నవాడని వెనకేసుకొచ్చారు. ఇప్పుడు పద్దెనిమిదేళ్ళ పడుచువాడయ్యాడు కదా? వాడ్ని కూడా పనిలో పెట్టండి నాన్నా’’ అని అన్నాడు తండ్రితో. తండ్రి అందుకు సమ్మతించి మూడవ వాడిని ఆ వూరి జమిందారు గారి ఆవులు కాసే పాలేరు దగ్గర పనికి కుదిర్చాడు దినభత్యం కింద. రోజూ పొద్దుటే పెరుగన్నం తిని ఆవుల్ని గుట్టల మీదికి తోలుకెళ్ళేవాడు అతను. ఒకరోజు పేద్ద కొండలాంటి గండభేరుండ పక్షి ఒకటి అతని మందలోని దూడను కాళ్ళతో పట్టుకుని పైకెగిరింది. అది గమనించిన ఆ కుర్రవాడు పాలేరు శిక్షిస్తాడన్న భయంతో దూడను గట్టిగా పట్టుకోవడంతో అతనుకూడా దూడతోసహా గాల్లో వేలాడసాగాడు. గండభేరుండం దూడను అమాంతం నోట్లోకి వేసుకునే సమయానికి అంతవరకూ ఆవుల్ని కాయటానికి తెచ్చుకున్న ముల్లుకర్రను దూడకన్నా ముందుగా చటుక్కున ముక్కుకు అందించేసరికి దానిముక్కు ముళ్ళు గుచ్చుకుని రక్తమోడి భీకరంగా అరిచింది. దూడ ఎత్తయిన గడ్డివాములోకి జారి బ్రతికిపోయింది. పక్షి కొండకొమ్మున ఆగటంతో అతను ఆ కొండమీదే దిగి దానికంటపడకుండా కనిపించిన ఓ గుహలోకెళ్ళి నక్కాడు. ఆ గుహలో ఎవరిదో ఏడుపు వినిపించి చూడగా ఒక యువతి తాళ్ళతో బంధింపబడి కనిపించింది. వెంటనే ఆమెను బంధ విముక్తురాలిని చేసి వెలుపలికి తీసుకొచ్చాడు. వారి కదలికలకు ఆమెను బంధించి తెచ్చిన కొందరు బందిపోట్లు వెంటపడగా ఆ అలికిడికి బెదిరిన గండభేరుండం ఎగరటానికి సిద్ధమైంది. వెంటనే ఆమెను హెచ్చరించి ఇద్దరూ గండభేరుండం కాళ్ళను పట్టుకుని గాల్లోకి ఎగిరారు. కొంతసేపటికి ముక్కుబాధతో పక్షి రెక్కలు విదల్చగా ఇద్దరూ వెళ్ళి అడవిలోని ఓ కొలనులో పడ్డారు. ఎలాగో ఇద్దరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు చెప్పింది ఆమె తాను ఆ నగరంలోని పేద్ద జమిందారుగారి ఏకైక పుత్రికనని. ఆమెను జాగ్రత్తగా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాడు అతను. గుడికి వెళ్ళిన తమ గారాల పట్టిని బందిపోట్లు ఎత్తుకెళ్ళారని తెలిసి కంటికిమింటికి ఏకధాటిగా దుఃఖిస్తున్న ఆ దంపతులు సంతోషించి తమ కుమార్తె అభీష్టం మేరకు అతనికే ఇచ్చి వివాహం చేశారు. అంతేకాకుండా అతని కోరిక ప్రకారం అతని ఇద్దరన్నలకూ దివాణంలో ఉద్యోగాలిచ్చి, అతని తల్లిదండ్రులను అతని వద్దే వుంచుకోవడానికి ఆనందంగా అంగీకరించారు. పేదరికం వల్ల తమ్ముడిమీద వంతులువేసి పనిచేయించమని చెప్పినా మనసులో పెట్టుకోకుండా ఆదరించినందుకు అన్నలిద్దరూ తమ్ముడి ఔదార్యానికి ఆనందించారు. ఏమైనా కష్టం వచ్చిందని చేతులు ముడుచుకోకుండా సాహసం చేసినందుకు తగిన ఫలితం దక్కిందని నగర ప్రజలు అతన్ని కొనియాడారు. డేగల అనితాసూరి -
బలిష్ట
కోర్టు హాలు నిశ్శబ్దంగా లేదు. బెంచీలలో మనుషులు కూర్చునే చోట నిండా మనుషులు ఉండడం కోర్టు హాలు నిశ్శబ్దంగా లేకపోవడానికి కారణం కాదు. అక్కడెవ్వరూ లేరు. జడ్జీకి, నిందితుడికి మధ్య వాదన లాంటిది జరుగుతోంది. అందుకే కోర్టు హాలు నిశ్శబ్దంగా లేదు. ముందే జడ్జి నుంచి అనుమతి తీసుకుని మాట్లాడుతున్నాడు బలిష్ట. ‘‘మీరు ప్రశ్నలు అడిగితే నేను సమాధానం ఇవ్వడంలో నాకు ఆసక్తి లేదు. మీరే ప్రశ్నలు వేసుకుని, మీరే సమాధానాలు చెప్పుకుని, మీరే నాకు శిక్ష వేసుకోండి. నాకేం అభ్యంతరం లేదు. పోయే చోటకే పోతాను’’ అన్నాడు బలిష్ట. అతడు ఆ మాట అన్నప్పుడు జడ్జి వింతగా చూశాడు. ‘‘బాబూ, భారతీయ శిక్షాస్మృతి అని ఒకటి ఉంటుంది. అన్నీ ఆ స్మృతి ప్రకారమే ఇక్కడ జరుగుతాయి. నువ్వు శిక్షను అంగీకరించకుండా, నీ నేరం రుజువు కాకుండా నిన్ను చట్టం శిక్షించడానికి లేదు’’ అన్నాడు. ‘‘ఎలాంటి విచారణ లేకుండానే నేను నా నేరాన్ని అంగీకరించడానికి సిద్ధమై వచ్చాను జడ్జిగారూ. అయితే మీ కోర్టులు నిందితుడు నేరం చేశాడా లేదా అన్నంత వరకే చూసి, లంచ్‌కి వెళ్లిపోతాయి.లేదా, హాలిడేస్కి వెళ్లిపోతాయి. ఆ తర్వాత బలిష్ట అనేవాడు ఏమైపోయాడన్నది ఈ న్యాయస్థానానికి అవసరం లేని విషయం. నా అభ్యర్థన ఏంటంటే.. ఈ నేరాలన్నీ నువ్వే చేశావా అని కాకుండా, ఈ నేరాలన్నీ నువ్వెందుకు చేశావు? అని మీరు నన్ను అడగాలని నా ఆశ. అందుకు నేను సమాధానం చెప్పాలని నా ఆకాంక్ష. ఇవన్నీ కుదరవు అనుకుంటే.. శిక్ష విధించి జైలుకో, ఉరికంబానికో పంపించేయండి. నాకేం భయాలు, భీతులు, చింతనలు లేవు’’ అన్నాడు బలిష్ట చేతులు కట్టుకునే నిలబడి. జడ్జి బలిష్ట వైపు పరిశీలనగా చూశాడు. పేరుకు తగ్గట్టు లేడు బలిష్ట. పీలగా ఉన్నాడు. పీలగా ఉన్నవాడొకడు ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడేంత బలంగా ఉన్నాడంటే.. వ్యవస్థ ఎక్కడో బలహీనంగా ఉందని వాడు కనిపెట్టగలిగాడని! జడ్జి నవ్వాడు. కోర్టు హాల్లో గానీ, కోర్టు బయట గానీ జడ్జిలు నవ్వినట్లు న్యాయ చరిత్రలో ఎక్కడా లేదు. కానీ ఈ జడ్జి నవ్వాడు. ‘‘ఈ నేరాలన్నీ నువ్వెందుకు చేశావో తెలుసుకుని నీలో పరివర్తన తెచ్చేందుకు కోర్టుకు తగిన సమయం ఉండదు. తర్వాతి కేసు రెడీగా ఉంటుంది. ఒకవేళ సమాజంలో అందరూ ధర్మబద్ధంగా నడుస్తూ, ‘ఇవాళైనా ఒక కేసు వస్తే బాగుండు’ అని జడ్జీలు కేసుల కోసం ఎదురు చూసే ఒక కాలం ఓ వెయ్యేళ్ల తర్వాత వచ్చినా.. అప్పుడు కూడా దోషిని నిలబెట్టో, కూర్చోబెట్టో కౌన్సెలింగ్ ఇచ్చే బాధ్యత కోర్టులది కాదు. అందుకు వేరే విభాగాలు ఉంటాయి. సరే, నువ్వు కోరుకున్నట్లుగా ఇప్పుడు నేను నిన్నేం ప్రశ్నలు వేయలేను గానీ, నువ్వు నన్ను ఈ కోర్టు హాలులో ప్రశ్నించే అవకాశం ఇవ్వగలను. నిన్ను అడగందే సమాధానం తెలియనంత ప్రశ్నలు నిన్ను అడగడానికి నా దగ్గర ఏముంటాయి చెప్పు? అయితే నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మాత్రం ఇవాళ నేను కోర్టు సమయాన్ని వినియోగమో, దుర్వినియోగమో చేయదలచుకున్నాను’’ అన్నాడు నవ్వుతూ జడ్జి. బలిష్ట రెండు చేతులు ఎత్తి జడ్జికి నమస్కరించాడు. ‘‘మిమ్మల్ని ప్రశ్నించేంతటి వాడిని కాదు. నన్ను మాట్లాడ్డానికి అనుమతించినట్లే.. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి చాలు’’ అన్నాడు బలిష్ట. అలా.. వాళ్లిద్దరి మధ్యా మాటలు మొదలవడంతో కోర్టు హాలు నిశ్శబ్దంగా లేదు. ‘‘జడ్జిగారూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నానని నాపై అభియోగం. అంటే చట్టం చేయవలసిన పనిని నేను చేశానని. చట్ట ప్రకారం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమే. అయితే నేను చేసిన పనికి నన్ను ప్రేరేపించిన పని చట్టంలో నేరంగా పరిగణన పొందడం లేదు కనుక, నేను చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకున్నట్లు కాదు. చట్టమే నేరాన్ని తన చేతుల్లోకి తీసుకోలేదని నేను అభిప్రాయపడ్డాను. అందుకే ఒక్కొక్కరి మోకాళ్లూ విరగ్గొడుతూ వచ్చాను.’’ అన్నాడు బలిష్ట. జడ్జి వింటున్నాడు. ‘‘జడ్జి గారూ.. మన సమాజంలో హత్య నేరం. ఆత్మహత్య నేరం. అత్యాచారం నేరం. దొంగతనం నేరం. అవినీతి నేరం. అక్రమం నేరం.దాడి జరపడం నేరం. నేను మోకాళ్లు విరగ్గొట్టిన ఆ ఆరుగురో, ఏడుగురో ఈ నేరాలేవీ చేయలేదు కనుక, ఇంకా చట్టం లిస్టులో ఉన్న నేరాలేవీ వాళ్లు చేయలేదు కనుక.. పోలీసులు గానీ, న్యాయస్థానం గానీ.. వాళ్లను నేరస్థులుగా కాకుండా, వాళ్ల మోకాళ్లను విరగ్గొట్టిన నన్ను నేరస్థుడిగా పరిగణించడం అంటే.. చట్టం నాకు ప్రసాదించిన ‘జీవించే హక్కు’ను నా పక్కన ఉన్నవాడు హరిస్తూ ఉన్నప్పుడు కూడా మౌనంగా భరిస్తూ ఉండమని చట్టం చెప్పినట్లే కదా. నా జీవించే హక్కును నేను కాపాడుకునే ప్రయత్నంలో.. నాలాగే ఇంకెందరికో చట్టం ఇచ్చిన జీవించే హక్కును కాపాడే ప్రయత్నంలో నాకు తెలియకుండానే, పట్టలేని కోపంలో.. మోకాళ్లు విరగ్గొట్టానని చట్టం అర్థం చేసుకోలేదా’’ అని అడిగాడు బలిష్ట. కోర్టు హాల్లో బలిష్ట మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. అతడివైపే రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు జడ్జి. ‘‘కానీ అబ్బాయ్.. సినిమా థియేటర్లో నీ వరుసలో కూర్చొని ఉన్నవాడు కాళ్లూపుతూ కూర్చున్నాడని, ఏదో ఆఫీస్‌లో ఎవరో నీకు కాళ్లూపుతూ సమాధానం చెప్పాడని, హోటల్లో ఎవరో కాళ్లూపుకుంటూ తింటున్నాడని, అసలు నీకు సంబంధమే లేని వారెవరెవరో, ఎక్కడెక్కడో నీకు దగ్గరగానో, నీకు దూరంగానో కాళ్లూపుకుంటూ నీకు కనిపించారని కోపం తెచ్చుకుని వెళ్లి.. వాళ్ల కాళ్లు, మోకాళ్లు విరగ్గొట్టడం నేరమే కదా! జీవించే హక్కు నీకెలాగైతే ఉందో, వాళ్లకూ.. వాళ్లకు ఇష్టమైన విధంగా జీవించే హక్కు ఉండదని ఎలా అనగలం?’’ అన్నాడుజడ్జి. ‘‘కానీ జడ్జిగారూ.. ఒకరి జీవించే హక్కు.. ఇంకొకరి జీవించే హక్కుకు భంగం కలిగించకూడదు కదా! నా దృష్టిలో హంతకుడి కన్నా, అత్యాచారం చేసినవాడి కన్నా, దొంగ కన్నా, అవినీతి పరుడికన్నా.. నీచమైన వాడు, హీనమైనవాడు.. ఈ కాళ్లూపుతూ కూర్చునేవాడు! కాళ్లూపుతూ కూర్చున్నాడంటే వాడికి మంచీ మర్యాద లేదని. సంస్కారం లేదని. వాడికొక ధ్యేయం లేదని. ఒక లక్ష్యం లేదని. ఒక బాధ్యత లేదని. ముఖ్యంగా మనుషులంటే గౌరవం లేదని. వాడసలు సరిగా పెరగలేదని. అలాంటి వాడిని శిక్షించే సెక్షన్ మన చట్టంలో లేదని. పబ్లిక్‌లోనే కాదు, పెళ్లాం పిల్లల ముందు కూడా కాళ్లూపడం నేరమే అని ఒక చట్టం తెండి. ఈ కాళ్లూపే దరిద్రులంతా దారికొస్తారు’’ అన్నాడు బలిష్ట. ‘‘ద్రవ్యోల్బణం మన దరిద్రం కాదు జడ్జిగారూ. కాళ్లూపడం మన దరిద్రం’’ అని కూడా అన్నాడు. జడ్జి అతడి వైపు చూశాడు. అతడు జడ్జివైపు చూశాడు. ‘‘ఆగావేం చెప్పూ’’ అన్నట్లు చూశాడు జడ్జి. ‘‘చెప్పడానికేం లేదు’’ అన్నట్లు చూశాడు బలిష్ట. ‘‘అలా చూస్తున్నావేం’’ అని అడిగాడు జడ్జి.బలిష్ట మాట్లాడలేదు. కేసు తర్వాతి రోజుకు వాయిదా పడింది. బలిష్ట వెళ్లిపోయాడు.అయితే ఆ తర్వాతి రోజు జడ్జిగారు కోర్టుకు రాలేదు. ముందురోజు రాత్రి ఎ.. వ.. రో.. ఆయన కాళ్లు విరగ్గొట్టారు!ఆ తర్వాతెప్పుడూ బలిష్ట ఏ వాయిదాకూ రాలేదు. ఏమైపోయాడో ఎవరికీ తెలీదు! కోర్టు హాల్లో ఎవరైనా కాళ్లూపుతున్నప్పుడు మాత్రం.. జడ్జిగారు భయంతో ‘‘ఆర్డర్.. ఆర్డర్’’ అంటుండేవారు. ఆయన అలా ఎందుకు అంటుండేవారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. - మాధవ్ శింగరాజు -
దూరం నుంచి ఒక రాయి
ఒకసారి యేసువద్దకు ఒక స్త్రీని కొందరు తీసుకొచ్చి ‘ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది కదా.. మరి నీవేమంటావు’ అని అడిగారు. ప్రభువు ఏం చెబుతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడు యేసు ‘‘అవును... ఆమెను రాళ్లతో కొట్టి చంపవలసిందే... కానీ ఎవరిలోనైతే పాపం లేదో ఆ వ్యక్తి మాత్రమే ఆ శిక్షను అమలు చేయాలి’’ అని చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్న వారంతా రాళ్లు అక్కడ పడవేసి ఒక్కొక్కరుగా చల్లగా జారుకున్నారు. ఇక్కడ మనమంతా ఒక విషయాన్ని గమనించాలి. ఎవరైనా తప్పో, పాపమో చేస్తే మనమంతా ఆ పని చేసిన వారిని శిక్షించాలని. దూరం నుంచైనా ఒక రాయి వారిమీద వేయాలని ప్రయత్నిస్తాం. ఒకవేళ ఆ శిక్షను అమలు చేసే అవకాశం వస్తే మనమే అమలు చేస్తాం. అది అమలు చేసేటప్పుడు మనం తప్పు చేసే వాళ్లం కాదని, అసలు పాపమే చేయలేదనే భావనతో ఆ పని చేస్తాం. కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే మనమందరమూ కూడా తప్పో, పాపమో చేస్తూనే ఉంటాం. అది బయటకు కనిపించక పోవచ్చు. హృదయంలో మనం కూడా అదే తప్పు ఆలోచనలు కలిగి ఉండి ఆ పనిని బయటకు చేసిన వానిని మాత్రం శిక్షించడానికి ముందుంటాం. ఒక్కసారి ఆలోచించాలి. యేసు తలయెత్తి చూసినప్పుడు ఆ స్త్రీ మీద నేరారోపణ చేసిన వారెవరూ కనిపించలేదు. అపుడు యేసు ఆ స్త్రీని చూసి ‘‘అమ్మా..!. నీవు కూడా వెళ్లు, అయితే మళ్లీ పాపం చేయకు’’ అని చెప్పాడు. అంటే శిక్షతో కాకుండా క్షమించడం ద్వారా ఆ స్త్రీని మార్చాలనుకున్నాడు. భావోద్వేగాలను తమ నియంత్రణలో ఉంచుకున్నవారు మాత్రమే ఇలా మాట్లాడగలరు. ఆ స్త్రీని వాళ్లు తీసుకొస్తున్నప్పుడు గానీ ఆమెను శిక్షించాలనే తలంపుతో రాళ్లు చేత పడుతున్నపుడు గానీ వారిలో ఏ విధమైన ఆలోచనా లేదు, ఈమె పాపం చేసింది, మేము చేయలేదు కనుక ఈమెను శిక్షించాలి ఆనే ఆలోచన తప్ప! కానీ యేసు మాట్లాడిన ఆ ఒక్క మాట వారిని ఆలోచింప జేసింది. ఒక్కసారి మనం ఎదుటి వ్యక్తిని క్షమించడం అలవాటు చేసుకుంటే అది ఎంత సంతోషాన్నిస్తుందో అర్ధమౌతుంది. అయినా శిక్షించడానికి ఆయుధం ఉంటే చాలు. అదే క్షమించాలంటే హృదయంలో చాలా ధైర్యం కావాలి, అనేక సందర్భాలలో శిక్షలకన్నా కూడా ప్రేమ, క్షమాపణ తప్పు చేసిన వ్యక్తులలో మార్పులు తీసుకొస్తాయి. తప్పు చేసిన వ్యక్తి మారాలని కోరుకోవాలి కానీ మరణించాలని కోరుకోకూడదు. – రవికాంత్ బెల్లంకొండ -
పూలపాన్పు
పాదుషా గారికి పూలపాన్పులో తప్ప నిద్రపట్టదు. అందుకోసం తన శయన మందిరంలోని మంచాన్ని రోజూ పలు రకాల పూలతో అలంకరించేందుకు ఓ సేవకురాలిని నియమించుకున్నారు. అలా చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు పాదుషా గారు వేటకు వెళ్లి రావడం ఆలస్యమయ్యింది. సేవకురాలు రోజూ లాగే రాజుగారి మంచాన్ని పూలతో అలంకరించింది. ‘ఇన్నేళ్లుగా పాదుషా గారి మంచాన్ని పూలతో ముస్తాబు చేస్తున్నాను కదా, ఒక్కసారి ఈ పూలపాన్పుపై కాసేపు సేదతీరితే’ అనే తలంపు ఆమెకు కలిగింది. వెంటనే పూలపాన్పుపై కాసేపు మేను వాల్చింది. క్షణాల్లోనే గాఢనిద్రలోకి జారుకుంది. అంతలోనే పాదుషా గారు వేటనుంచి తన శయన మందిరానికి వచ్చారు. తన పూలపాన్పుపై పడుకుని ఉన్న సేవకురాలిని చూసి ‘నా పూల పాన్పుపైనే పడుకుంటావా! ఎంత ధైర్యం’ అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తలారిని పిలిపించి ‘పాదుషా గారి మందిరం విలువేంటో ఇతర సేవకులకు తెలిసొచ్చేలా ఈమెను తల్లకిందులుగా వేలాడదీసి ప్రాణాలొదిలే వరకూ కొరడా దెబ్బలు కొట్టాలని’ ఆజ్ఞాపించారు. ఆజ్ఞ మేరకు కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు. కొరడా దెబ్బలకు ఆ సేవకురాలు పెడబొబ్బలు పెట్టసాగింది. అంతలోనే పకపకా నవ్వడం మొదలెట్టింది! దీన్ని గమనించిన పాదుషాగారు నీ ఏడుపుకు, అంతలోనే నీ నవ్వుకు కారణమేమిటని అడిగారు. దానికా సేవకురాలు ‘కొరడా దెబ్బల నొప్పి భరించలేక ఏడ్చాను. కాని, కేవలం కొన్ని నిమిషాలపాటు మీ పూలపాన్పుపై నిద్రపోయినందుకే నన్నింతగా హింసిస్తున్నారే, మరి జీవితాంతం పూలపాన్పుపై నిద్రపోయేవారి పరిస్థితి పైలోకంలో ఎలా ఉంటుందో ఊహించుకొని నవ్వుకుంటున్నాను’ అని జవాబిచ్చింది. పాదుషాగారి కళ్లు తెరుచుకున్నాయి. ఆ సేవకురాలిని క్షమించి వదిలి వేశారు. పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. తాను అనుభవిస్తున్న అనుగ్రహాలపట్ల అల్లాహ్ లెక్క తీసుకుంటాడన్న గుణపాఠం తెలియజేసిన ఆ సేవకురాలిని బహుమతులతో సత్కరించారు. – నాఫియా -
చొక్కా పట్టుకు లాగారు
సమాజం పీలికలు పీలికలైపోయిందివ్యవస్థ చివికిపోయిన వస్త్రంలా అయ్యింది.అనుబంధాలు ఛిద్రమైపోతున్నాయి.మానవత్వం ముళ్లకంచెకు ఓ చిరుగులా వేలాడుతుంది. చొక్కా పట్టుకు లాగారుడొంక కదిలింది.కాలం ప్రయాణంలో కొన్ని ఘాతుకాలు మరుగున పడిపోవచ్చు. కానీ, ఆ కాలమే కొన్ని ఘాతుకాలను పైకి తీసుకురాగలదు. నిజాల నిగ్గు తేల్చగలదు. 1995 సంవత్సరం.తెనాలి దగ్గరి చేబ్రోలు.‘కొడుకా.. నన్నొదిలి ఏడికి పోయినవ్రా..! నిన్ను ఎక్కడని వెదికేదిరా’ ఏడుస్తోంది సుగుణమ్మ.అప్పటికి సంవత్సరం దాటిపోయింది.ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది. లేదంటే సుగుణమ్మ ఏడుపుతో నిండి ఉంటుంది. కొడుకు కనపడని దుఃఖం ఒకరు ఆర్చితే ఆరుతుందా, తీర్చితే తీరుతుందా? ‘ఏంటి సుగుణక్కా! కొడుకు కోసం ఎన్నాళ్లని ఏడుస్తా్తవ్. ఎక్కడో ఉండే ఉంటాడులే. నీమీద కోపంతో ఏ పట్నం పోయాడో, లేకపోతే దుబాయే పోయాడో..’ అంది పక్కింటి అలివేలు. ‘ఒక్కగానొక్క కొడుకు. వాళ్ల అయ్య సచ్చి నన్ను దిక్కులేనిదాన్ని చేశాడు. వీడు ఇలా నన్నొదిలిపోతాడు అనుకోలేదు. మోటారు బండి కొంట పైసలు కావాలని ఒకటే గోల చేస్తుంటే తిట్టిన డబ్బులు ఏడున్నాయ్ అని. కాదన్నానని అలిగిపోయాడు. ఇప్పటిదాకా రాలేదు. ఆ పొలం పాడుగాను.దాన్ని అమ్మినా నా కొడుకు నా కళ్ల ముందు ఉండేవాడు..’ కొడుకును తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న సుగుణమ్మ వైపు జాలిగా చూశారు చుట్టూ చేరిన జనం. ‘ఇలా కాదు. పోయి పోలీసులకు చెప్పుపో.. నీ కొడుకు ఏడున్నా వాళ్లే పట్టుకొస్తరు.. ’ అన్నడు అప్పుడే పొలం నుంచి ఇంటికి వస్తున్న రాజయ్య. ‘అదే మంచిది సుగుణక్కా, రాజయ్య చెప్పినట్టు చేయి! పోలీసులకు జెప్తే వాళ్లే తీసుకొస్తారు’ అంది వరసకు చెల్లెలైన వెంకటి. చుట్టూ చేరిన జనం కూడా అదే మంచిదన్నారు. సుగుణమ్మ కళ్ల నీళ్లు తుడుచుకుని, జుట్టు ముడేసుకొని, తలుపులు మూసి తాళం వేసింది.టౌన్లో ఉన్న పోలీసుస్టేషన్‌కి చేరింది. ‘ఏంటీ నీ కొడుకు కనిపించక ఏడాదిన్నర అవుతుందా?! ఇన్నాళ్లూ ఏం చేశావు?!’ ఆశ్చర్యంగా అడిగారు పోలీసులు.‘వాడే వస్తాడులే అనుకున్నా. ఏడాదిన్నర అవుతున్నా జాడ దొరకలేదు. కొంచెం మీరే సూడాలయ్యా’ రెండు చేతులెత్తి దణ్ణం పెట్టింది సుగుణమ్మ.చేతికి అందివచ్చిన కొడుకు దూరమై ఆ తల్లి పడుతున్న బాధను చూస్తుంటే పోలీసుల మనసు చలించిపోయింది. ‘సరే సరే, చివరిసారి నీతో ఏమైనా మాట్లాడాడా .. ఆ వివరాలు చెప్పు’ అన్నాడు ఎస్.ఐ. మిస్సింగ్ కేస్‌గా వివరాలు రాసుకోవడం మొదలుపెట్టారు పోలీసులు.తప్పిపోయినవాడి పేరు వీరేశం. వయసు 20 ఏళ్లు. ‘అయ్యా, నా కొడుకు చివరిసారిగా మా తమ్ముడువీరభద్రంతో కలిసి టౌన్‌కి వెళ్లినట్టు ఎవరో చెప్పారు’ చెప్పింది సుగుణమ్మ. వీరభద్రాన్ని పిలిపించారు పోలీసులు. ‘అయ్యా! మేం ఆ రోజు సినిమాకని వెళ్లాం. కానీ, రాత్రికి తిరిగొచ్చాక ఎవరిళ్లకు వాళ్లం వెళ్లిపోయాం. మరుసటి రోజు మా చుట్టాలింట్లో పని ఉండి ఊరెళ్లాను. తిరిగొచ్చాక తెలిసింది వీరేశం కనపడతలేడని’ అన్నాడు వీరభద్రం. ‘చివరిసారి నీతో ఏమైనా మాట్లాడాడా!’ అడిగాడు ఎస్.ఐ.‘ఎందుకు మాట్లాడలేదు సారూ.. వాడికేమో మోటారు సైకిలు కొనుక్కోవాలని ఉండేది. వాళ్లమ్మ భూమి అమ్మనంది. పట్నంలోనే ఏదైనా పని చూసుకొని బండి కొనుక్కున్నాకే ఊరొస్తానంటే.. నేనే నచ్చజెప్పి తీసుకొచ్చా. అయినా వాడు మళ్లీ వెళ్లిపోయాడంటే మా అక్క తిట్టిన తిట్ల వల్లనే సార్!’ అన్నాడు వీరభద్రం. ‘వీరభద్రం.. ఆ రాత్రి కూడా వాడు ఇంటికి రాలేదురా’ అంది సుగుణమ్మ కళ్లు నీళ్లు తుడుచుకుంటూ. ‘అవునా, ఊరికైతే వచ్చాం సారూ. తర్వాత వాడ్ని ఇంటికి పొమ్మని నేను మా ఇంటికి పోయాను’ అన్నాడు వీరభద్రం.‘సరే, మీరేళ్లండి!’ అని వాళ్లను పంపించారు పోలీసులు. ఆ రోజు వీరభద్రం వెళ్లిన చుట్టాలెవరో వాకబు చేశారు. అతను చెప్పింది నిజమే అని తేలింది. ‘వీరేశం మిస్సింగ్ కేసు అనుమానాస్పదంగా ఉంది. కానీ, రుజువులు కావాలి.. ’ ఆలోచనలో పడ్డాడు ఎస్.ఐ.సిబ్బందిని పిలిచి ‘ముందు వీరేశం ఊరెళ్దాం. ఏమైనా క్లూ దొరుకుద్దేమో’ అన్నాడు. పోలీసులు ఊరు బయల్దేరారు. ఊళ్లో చుట్టుపక్కల వారిని కలిసి, మరికొన్ని వివరాలు రాసుకున్నారు. కానీ, ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. ‘మనం పొరపాటుగా ఆలోచిస్తున్నామేమో! నిజంగానే తల్లి మీద అలిగి వీరేశం పట్నం వెళ్లిపోయుంటాడు. పట్నంలోని అన్నిపోలీసు స్టేషన్లకి వీరేశం ఫొటోలు, వివరాలు పంపి చూద్దాం’ అన్నాడు ఎస్.ఐ. ‘అవున్సార్.. అదే అయ్యుంటుంది. అలాగే చేద్దాం’ అన్నారు సిబ్బంది. తిరుగు ప్రయాణానికి జీప్ స్టార్ట్ అయ్యింది. వీరేశం ఊరికీ టౌన్కీ మధ్య మూడు కిలోమీటర్ల మట్టిదారి. ఆ దారంతా కంపచెట్లు ఉన్నాయి. అప్పటికే ఒకసారి పరిశీలించిన ప్రాంతం. ఎస్.ఐ యధాలాపంగా కంపచెట్లవైపు చూస్తూ ఒక చోట ఆగాడు. ‘కానిస్టేబుల్స్ ఆ కంపచెట్లకు కొన్ని పాత గుడ్డలు చుట్టుకొని ఉన్నాయి చూడండి. వాటిని జాగ్రత్తగా విప్పి ఇలా తీసుకరండి’ అని పురమాయించాడు. సిబ్బంది కొంత ప్రయత్నం చేస్తే ముళ్ల చెట్టుకు పట్టుకు వేళాడుతున్న పీలికల గుడ్డలు వచ్చాయి. ఆ చిరిగిపోయిన, పాత గుడ్డ పీలికలను తీసుకొని స్టేషన్‌కి వెళ్లిపోయారు పోలీసులు.మరుసటి రోజు సుగుణమ్మను పిలిపించారు పోలీసులు. ‘చూడమ్మా! పట్నంలోని అన్ని పోలీసు స్టేషన్లకి నీ కొడుకు ఫొటోలు పంపించాం. ఎక్కడున్నా త్వరలోనే పట్టుకుంటాం..’ అన్నాడు ఎస్.ఐ.అలాగేనని తలూపిన సుగుణమ్మ టేబుల్ మీద పీలికలైన గుడ్డ పీలికలను చూసింది. అందులో పీలికలైన ఒక చొక్కాను చూస్తూ ‘ఇది మావాడిదే! చారల చొక్కా. ఆ రోజు ఇదే వేసుకున్నాడు సారూ’ అంది ఏడుస్తూ! పోలీసులు ఉలిక్కిపడ్డారు.ఒకరిమొహాలు ఒకరు చూసుకున్నారు. పోలీసుల ఊహకు సుగుణమ్మ చెప్పిన వాస్తవం తొడయ్యింది. పీలికలైన చొక్కా ‘క్లూ’ అయ్యింది. ఆ చొక్కా దొరికిన ప్రాంతానికి వెంటనే చేరుకున్నారు పోలీసులు. ఆ ప్రాంతమంతా మళ్ళీ మళ్ళీ పరిశీలించారు. మరే ఆధారమూ దొరకలేదు.ఆ చుట్టుపక్కల ఐదు వ్యవసాయ బావులు మాత్రం కనిపించాయి. బావులకు సంబంధించిన వారిని పిలిపించి, మోటర్లను ఆన్ చేశారు. ఉదయం మొదలైన నీటి ప్రవాహం సాయంత్రం దాకా బయటకు వస్తూనే ఉంది. గంటలు గంటలు గడుస్తున్నాయి. అక్కడున్న అన్ని బావుల నీళ్లూ బయటకు వచ్చేశాయి. సాయంకాలం వేళ ఆ బావులు నీళ్లు మింగేసిన రాకాసి గొంతుల్లా ఉన్నాయి. పోలీసు సిబ్బంది ఒక్కో బావిలోకి దిగి గాలించారు. చెట్లు, గుబురు పొదలతో కప్పబడినట్టుగా ఉన్న ఐదవ బావి వద్దకు వచ్చారు. అడుగున ఇంకా కొన్ని నీళ్లు మిగిలే ఉన్నాయి, ఆ మిగిలిన నీళ్లలోనే గాలించారు. పుర్రె, ఎముకలు చేతికి తగిలాయి. వాటిని బయటకు తీసి, పేరిస్తే మనిషి ఎముకలని తేలింది. వీరభద్రాన్ని తీసుకొచ్చి కూచోబెట్టారు. చాలా వేడిగా ఉన్న టీ తెచ్చారు. అది తాగమని చెప్పేటందుకు కాదనీ, తేడా వస్తే బొబ్బలెక్కేలా ముఖాన కొడతారని వీరభద్రానికి అర్థమైంది.‘ఎందుకు చేశావీపని’ అన్నాడు ఎస్.ఐ. ‘నేనే మా మేనల్లుడిని హత్య చేశాను. తప్పయిపోయింది సార్. ఆ రోజు నుంచి నా మనసు మనసులో లేదు. చేసిన తప్పుకు కుళ్లి కుళ్లి చస్తున్నాను సార్’ అంటూ రెండు చేతులు జోడించాడు వీరభద్రం. ‘అక్క కొడుకునే చంపేటంత కక్ష నీకేంటి?’ గద్దించారు పోలీసులు.‘మా బావ చనిపోయి మూడేళ్లయ్యింది. అక్క పేరు మీద నాలుగెకరాల పొలం ఉంది. దాని విలువ ఇప్పుడు కోట్లకు పెరిగింది. మేనల్లుడిని అడ్డు తొలగిస్తే వారసులు లేకుండా పోయి.. అక్క తర్వాత ఆస్తి అంతా నాకే వస్తుందని ఈ పని చేశాను. ఆ రోజు సినిమాకు వెళ్లింది నిజమే. తిరుగు ప్రయాణంలో బాగా చీకటి పడింది. దారిలో ఇంకెవరూ లేరు. ముందు వాడు నడుస్తుంటే నేను వెనకగా నడుస్తూ రాయితో తలమీద మోదాను. పెనుగులాటలో వాడి చొక్కా నా చేతికొచ్చింది. వాడ్ని చంపి, నీళ్లలో తేలకుండా ఉండేందుకు. నడుముకు రాయి కట్టి అక్కడే వ్యవసాయబావిలో పడేశాను. చొక్కాను గొయ్యి తీసి పాతిపెట్టి, ఇంటికొచ్చేశాను’ వివరించాడు వీరభద్రం. నేరం ఎప్పటికీ దాగదు. బయట పడాల్సిందే.వీరభద్రం కంగారులో పైపైన గొయ్యి తీసి, మట్టిలో చొక్కాను కప్పెట్టాడు. కానీ, అది కొన్నాళ్లకి బయటపడి, గాలి వాటానికి కొట్టుకపోయి కంపచెట్టుకు చిక్కుకుని ఉండిపోయింది. పీలికలైన ఆ పాత చొక్కాతోనే కేసును ఛేదించారు పోలీసులు. కొడుకు ఇక రాడని, లేడని తెలిసిన సుగుణమ్మ గుండె పగిలేలా ఏడ్చింది. ‘సారూ, నా కొడుకు ఇక తిరిగి రాడు. కానీ అలా తిరిగి రాకుండా చేసినవాడిని మాత్రం జైలు నుంచి తిరిగి రానంత కాలం ఉంచే బాధ్యత మీదేనయ్యా’ అంటూ పోలీసులకు దణ్ణం పెట్టింది. వీరభద్రం ప్రస్తుతం శిక్ష అనుభశిస్తున్నారు. (పస్తుత వరంగల్ పోలీస కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ తెనాలిలో పని చేసినప్పుడు చేధించిన కేసు డిటైల్స్ ఆధారంగా) ‘ఏంటీ నీ కొడుకు కనిపించక ఏడాదిన్నర అవుతుందా?! ఇన్నాళ్లూ ఏం చేశావు?!’ ఆశ్చర్యంగా అడిగారు పోలీసులు.‘వాడే వస్తాడులే అనుకున్నా. ఏడాదిన్నర అవుతున్నా జాడ దొరకలేదు. కొంచెం మీరే సూడాలయ్యా’ రెండు చేతులెత్తి దణ్ణం పెట్టింది సుగుణమ్మ. – కృష్ణగోవింద్, సాక్షి బ్యూరో ఇన్చార్జ్, వరంగల్ -
గాడీ నెం.6768
‘మృత్యువు నుంచి తప్పించు కోలేం’ అని అంటారు. కానీ, మృత్యువుకు కారణమైనవాడిని కూడా తప్పించుకోనివ్వదు క్లూ! తప్పు జరగవచ్చు... చిన్నవి, పెద్దవి ఎలాంటి తప్పులైనా జరగవచ్చు. ఆ తప్పును ఒప్పుకోవడంలో ధైర్యం ఉంది. తప్పు నుంచి పారిపోవడంలో ఉన్నది శిక్ష. 2016 డిసెంబర్ 10. హైదరాబాద్.తెల్లవారుజాము 6 గంటలు. మనసు కీడు శంకిస్తూ ఉంది. సాధారణంగా ఉదయాలు ప్రశాంతంగా అనిపిస్తాయి ఆమెకు. కాని ఆరోజు తెల్లవారుజాము ఏదో దుశ్శకునంగా ఉంది. అసలే రాత్రి పడ్డ పీడకల తాలుకు కలత వదల్లేదు. ఇప్పుడు ఈ గుబులు. అవునూ... ఈయన ఇంకా రాలేదేమిటి?వాకిలిలోకి వచ్చింది. గేటువైపు చూసింది. మరో అరగంట గడిచింది. గుబులు పెరిగిపోతోంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. రోజూ ఐదింటికి వాకింగ్‌కు వెళ్లడం మామూలే. ఆరు లోపే వచ్చేస్తాడు. కొంచెం ఆలస్యం అయితే ఫోన్ చేస్తాడు. ఇవాళ రాలేదు. ఫోనూ చేయలేదు.సెల్ తీసుకొని కాల్ చేసింది. నో రెస్పాన్స్.. ఏమై ఉంటుంది?! స్నేహితులు ఎవరైనా కలిసి ఉంటారులే అని మనసుకు సర్దిచెప్పుకుంది. కాని గుబులు. పేపర్ తిరిగేసింది. గమ్మం గుండా గేటు వరకు కళ్లను అప్పగించింది. కిచెన్‌లోకి వెళ్లింది. అప్పటికే ఒకసారి కలిపి ఉంచిన డికాషన్ చల్లారిపోతే మళ్లీ వేడి చేసింది. ఆయన వస్తే రోజూ కలిసి కాఫీ తాగడం అలవాటు.ఇంకా రాలేదేమిటి?గుబులు పెరిగిపోతూ ఉంది.ఫోన్ రింగ్ అయ్యింది. ఈ టైమ్‌లో ఫోన్ చేసేదెవరు? ఈయనే అయి ఉంటుంది. సెల్ చేతిలోకి తీసుకుంది. కొత్త నెంబర్. ఇది కీడే... మనసు చెబుతూ ఉంది. వణుకుతన్న చేతిని కంట్రోల్ చేసుకుంటూ గ్రీన్ బటన్ ప్రెస్ చేసింది. అవతలి నుంచి విషయం వింటూనే ఫోన్ జారి నేలన పడింది.. రాయదుర్గం గచ్చిబౌలీ రోడ్.రోడ్డు మీద ఆయన పడి పోయి ఉన్నాడు. కళ్లద్దాలు ఒకవైపు పడి ఉన్నాయి. చెప్పులు జారిపోయాయి. పేరు దేవదానం అని పోలీసులకు అర్థమయ్యాక ఇంటికి ఫోన్ చేశారు. ‘ఎలా జరిగింది?’ ఆమె అతి కష్టం మీద అడిగింది.‘హిట్ అండ్ రన్ కావచ్చు’ అని జవాబు వచ్చింది. ఆ గుర్తు తెలియని వాహనం ఎవరిది? ప్రత్యక్షసాక్షులు ఎవరూ లేరు. ఓ చిన్న గోడ అడ్డు రావడంతో ఆ స్పాట్లో ఉన్న సీసీ కెమెరాలో యాక్సిడెంట్ రికార్డు కాలేదు. రోడ్లు ఊడ్చే వాళ్ళు, పాలు పోసే వాళ్ళు, పాల ప్యాకెట్లు వేసే వాళ్ళు ఎవరిని ప్రశ్నించినా ఫలితం లేదు. ‘మాకు తెలియదు... మేం చూళ్లేదు’ అన్నారు.కేసు మిగిలిన ‘హిట్ అండ్ రన్’ కేసుల మాదిరిగా మిస్టరీగా మారింది. ఎవరైనా కావాలనే దేవదానంను హత్య చేసి ఉంటారా? అంత అవసరం ఎవరికి ఉంటుంది? కుటుంబసభ్యులకు ఎడతెరిపిలేని సందేహాలు.వాటిని పోలీసుల ముందుంచారు. ‘సార్... ఈ కేసులో అనఫీషియల్‌గా ఇన్వాల్వ్ కావడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి’ అన్నారు సీసీఎస్ స్పెషల్ టీమ్ ఇన్స్పెక్టర్ వి.శ్యాంబాబు.‘ఏం అవసరం శ్యాంబాబు... లోకల్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారుగా’ అన్నాడు పై అధికారి.‘చనిపోయింది మా నాన్న సార్. నేనొక పోలీసై ఉండి అతణ్ణి పట్టుకోలేకపోతే మనసుకు కష్టంగా ఉంది. మా నాన్న కోసమే కాదు... ఇలా హిట్ అండ్ రన్ చేసితప్పించుకోవచ్చు అనుకునేవారందరికీ ఈ కేసొక గుణపాఠం కావాలి’ పట్టుదలగా అన్నారు శ్యాంబాబు.‘ఓకే... గో అహెడ్’ పర్మిషన్ దొరికింది.శ్యాంబాబు ఘటనాస్థలికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు.దేవదానం మృతదేహం దొరికిన ప్రాంతంలో ఓ చిన్న ప్లాస్టిక్ ముక్క కనిపించింది. అది తప్ప ఇంకేమీ దొరకలేదు. ఈ కేసుకు ఇదే ముఖ్యమైన క్లూ అని శ్యాంబాబుకు అనిపించింది. దానిని పరీక్షగా చూశారు. ‘ఫోర్డ్’ అనే అక్షరాలు ఉండటం వల్ల అది ఫోర్డ్ కారుకు చెందిన మడ్‌గార్డ్ కుడివైపు లైనర్దిగా గుర్తించారు. దీన్ని తీసుకుని షోరూమ్‌కు వెళ్ళిన ఆయన దాన్ని అక్కడి మెకానిక్స్‌కు చూపించారు. ‘ఇది 2012 మోడల్‌కు చెందిన ఫోర్డ్ ఫిగో కారుది సార్’అని తేల్చారు వాళ్లు. తండ్రి మరణానికి ఈ ఫోర్డ్ ఫిగోకి లంకె ఉందని శ్యాంబాబుకు అర్థమైంది. వెంటనే గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం మార్గంలో ఉన్న సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. యాక్సిడెంట్ అయిన రోజు అనేక కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను సేకరించి పరిశీలించారు. ముఖ్యంగా ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి ఏడు గంటల మధ్య వెళ్ళిన ఫోర్డ్ ఫిగో మోడల్స్‌పై దృష్టిపెట్టారు. ఓ సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫీడ్ మరికొంత క్లూ ఇచ్చింది.‘నెంబర్ జూమ్ చేయండి’ ఆదేశించారు శ్యాంబాబు.జూమ్ అయ్యింది.ఏపీ 10 బీసీ 6768.ఎస్. ఈ కారే అయి ఉండాలి. వెంటనే ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న అడ్రస్ దొరికింది. 2017 జనవరి 2.తన తండ్రిని చంపింది ఎంటెక్ విద్యార్థి గుత్తికొండ ప్రశాంత్కుమార్గా శ్యాంబాబు తేల్చారు. ఆ రోజు ఏమైందంటే... ప్రశాంత్ ముందురోజు రాత్రి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నాడు. తెల్లవారుజామున ఇంటికి బయల్దేరాడు. నిద్ర, మద్యం మత్తు.... ఎక్స్‌లేటర్ మీద అదుపులేని కాలు.. దారిలో వాకింగ్ చేస్తున్న దేవదానాన్ని ప్రశాంత్ గుర్తించలేదు. దారుణంగా యాక్సిడెంట్ చేసి ఆయన మృతికి కారకుడయ్యాడు. అయితే ఆ యాక్సిడెంట్‌ని ఎవరూ చూడలేదని గ్రహించి నేరుగా సికింద్రాబాద్‌లోని బాపుబాగ్కాలనీలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. ప్రశాంత్ తండ్రి గుత్తికొండ రమేష్ ఎలక్ట్రికల్ గూడ్స్ దుకాణం నిర్వహించడంతో పాటు ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు చేస్తుంటారు. ఇంటికి వెళ్ళిన ప్రశాంత్ తాను కూకట్పల్లి నుంచి వస్తుండగా కారు గుంతలో పడి మడ్‌గార్డ్ దెబ్బతిందని తల్లిదండ్రుల్ని నమ్మించాడు. కొన్ని రోజులపాటు బండిని బయటకు తీయలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రశాంత్ బోయిన్‌పల్లిలోని ఓ గ్యారేజ్‌లో కార్ రిపేర్ చేయించాడు. రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించుకోవడానికి కారు నెంబర్ ప్లేట్‌తో పాటు మడ్‌గార్డ్ తదితరాలను మార్చేందుకు పూనుకున్నాడు. ఈ క్రమంలోనే బోయిన్‌పల్లిలోని గ్యారేజ్‌లో ఉన్న కారును స్వాధీనం చేసుకున్న శ్యాంబాబు ఘటనాస్థలిలో దొరికిన లైనర్ ముక్కను దానికి అమర్చి చూడగా సరిగ్గా సరిపోయింది. ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో నిందితుడు మద్యం తాగి ఉన్నాడనేది నిరూపించడం కోసం పోలీసులు ఆ రోజు అతడు వెళ్ళిన పబ్స్‌లో నమోదైన సీసీ కెమెరా ఫుటేజ్‌తో పాటు అతడు తన డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించిన బిల్లుల్నీ సేకరించారు. సాక్ష్యాల తారుమారుకు యత్నించిన ప్రశాంత్‌పై నమోదైన కేసులో ఆ సెక్షన్లనూ జోడించి అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది. ఎవరీ దేవదానం? నాయబ్ సుబేదార్ హోదాలో దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తించిన దేవదానం ఇండో–పాక్, ఇండో–బంగ్లాదేశ్ యుద్ధాల్లో పాల్గొన్నారు. సంగ్రామ్ మెడల్, వార్ మెడల్, ‘25 ఇయర్స్ ఇండిపెండెన్స్ మెడల్’ పొందారు. పదవీ విరమణ తర్వాత రాయదుర్గంలో తన భార్యతో కలిసి నివసిస్తూ 72 ఏళ్ళ వయస్సులోనూ ఫస్ట్‌మ్యాన్ సెక్యూరిటీ సర్వీసెస్‌లో సెక్యూరిటీ సూపర్వైజర్గా పని చేసేవారు.. ముగ్గురు కుమారులూ ఉన్నత స్థితిలోనే ఉన్నప్పటికీ తాను మాత్రం ఖాళీగా కూర్చోనంటూ ఉద్యోగం కొనసాగించారు. హైదరాబాద్ దర్గా ప్రాంతంలో అందరికీ సుపరిచితుడైన దేవదానం ఎప్పటిలాగే 2016 డిసెంబర్ 10 తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్ళారు. వాకింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న ఆయన్ను 5.30 గంటల ప్రాంతంలో మాతా మందిర్ వద్ద ఓ కారు ఢీ కొట్టి వెళ్ళిపోయింది. తీవ్రగాయాల పాలైన ఆయన అక్కడే రక్తపు మడుగులో మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలారు. క్లూ కథనాలు పంపండి రెండు రాష్ట్రాలలో ఎందరో గొప్ప పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎన్నో గొప్ప కేసులను క్లూల ద్వారా సాల్వ్ చేసి ఉంటారు. అలాంటి ఆఫీసర్లకు ఇదే మా ఆహ్వానం. మీరు సాల్వ్ చేసిన కేసులను సాక్షి పాఠకులతో పంచుకోండి. నేరస్తుడు తప్పించుకోలేడన్న భావన నేరాన్ని సగం నిరోధిస్తుంది. నేరం లేని సమాజం కోసం సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ సహకారాన్ని ఆశిస్తూ... మీరు సాల్వ్ చేసిన కేసు వివరాలు పంపాల్సిన ఈ మెయిల్: sakshiclue@gmail.com ఇన్పుట్స్: కామేశ్, సాక్షి ప్రతినిధి -
శిక్షలపై నిర్దిష్ట విధివిధానాల్లేవు
సాక్షి, హైదరాబాద్: పాశ్చాత్య దేశాల్లో లాగే శిక్షల విషయంలో మన దేశంలో నిర్దిష్టమైన విధివిధానాల్లేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. దీంతో ఒకే రకమైన నేరం చేసిన వ్యక్తులకు వేర్వేరు శిక్షలు పడుతున్నాయని పేర్కొన్నారు. శిక్షల విషయంలో నిర్దిష్టత, ఏకరూపత ఉంటే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందని, న్యాయవ్యవస్థ ప్రతిష్ట కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. ‘న్యాయ విచక్షణ’అంశంపై తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ నాగేశ్వరరావు ప్రసంగించారు. ఈ రోజుల్లో నేరస్తులను శిక్షించడం న్యాయమూర్తులకు చాలా సులభమైన పని అని, అయితే ఎంతమేర శిక్ష విధించాలో నిర్ణయించడం చాలా కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుత చట్టాలు, న్యాయ సంప్రదాయాలు, తీర్పులకు లోబడే న్యాయమూర్తుల విచక్షణ ఉంటుందన్నారు. ఏ న్యాయమూర్తికీ కూడా అపరిమితమైన విచక్షణాధికారం ఉండదని చెప్పారు. న్యాయమూర్తుల విచక్షణాధికారాల గురించి న్యాయవాదులు తమ తమ కక్షిదారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.