
ఫేస్‌బుక్ పేజి అడ్మిన్‌కు మూడేళ్ల జైలుశిక్ష
పంజాబ్ లో అదృశ్యమైన రెండేళ్ల బాలిక గొంతు కోసి రక్తమోడుతూ, చిన్నారి పడి వున్న తీరు పలు అనుమానాలకు దారి తీసింది. ఈ కేసులో అనుమానుతుడిగా ఓ మైనర్ బాలుడు(14) అరెస్ట్ చేశారు.
కైరో: ఒక ఈజిప్టు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఫేస్‌బుక్ పేజి అడ్మిన్‌గా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్షను ఖరారు చేసింది. దేశంలోని భార్యల్ని నమ్మలేమని.. వారు భర్తలకు ద్రోహం చేస్తారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన తెమోర్ ఎల్ సోబ్కీకి కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పుచెప్పింది. గత డిసెంబర్ నెలలో టీవీ టాక్ షోలో మహిళలను కించపరుస్తూ చేసిన ఆయన వ్యాఖ్యలతో తీవ్ర వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే, ఓ ప్రముఖ టీవీ చానల్‌లో మాట్లాడుతూ సోబ్కీ .. ఈజిప్షియన్ వివాహిత మహిళలపై అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశాడు. ముప్పై శాతం ఈజిప్టు వివాహిత మహిళల్ని నమ్మలేమని వ్యాఖ్యానించాడు. వారి భర్తలు విదేశాల్లో ఉన్నప్పుడు... చాలామంది భార్యలు వారిని మోసం చేస్తారన్నాడు. వివాహేతర సంబంధాల్లో చిక్కుకోవడం చాలా సాధారణమని వాదించాడు. దీంతో దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు గత నెలలో అతగాడిని అరెస్ట్ చేశారు. సోబ్కీ ఈజిప్టు మహిళలను కించపరుస్తూ అగౌరవంగా మాట్లాడాడని న్యాయవాదులు వాదించారు. వారి వాదనలను అంగీకరించిన కోర్టు తన తీర్పును వెల్లడించింది.
కాగా ఫేస్బుక్ లో 'డైరీస్ ఆప్ సఫరింగ్ హజ్బెండ్' అనే గ్రూప్ అడ్మిన్ గా ఈజిప్టులో సోబ్కీ బాగా సుపరిచితుడు. ఆ పేజీకి దాదాపు పదిలక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.