మెటా(గతంలో ఫేస్‌బుక్) వర్చువల్ రియాలిటీ వల్ల ముఖ్యంగా మహిళలు, పిల్లలకు హాని కలగవచ్చు అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మెటావర్స్ వల్ల ఫేస్‌బుక్‌కు కూడా నష్టం అని ఒక మీడియా నివేదించింది. మెటా సీటీఒ ఆండ్రూ బోస్వర్త్ ఫైనాన్షియల్ టైమ్స్ లో వచ్చిన అంతర్గత మెమోను ఉటంకిస్తూ.. ఫేస్‌బుక్ తన వర్చువల్ రియాలిటీ ప్రపంచాన్ని "దాదాపు డిస్నీ స్థాయి భద్రత"తో కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇందులో వినియోగదారులు ఎలా మాట్లాడతారు, అర్థవంతమైన స్థాయిలో ఎలా ప్రవర్తిస్తారా? లేదా అనేది కనిపెట్టడం ఆచరణాత్మకంగా అసాధ్యం అని బోస్వర్త్ అంగీకరించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక తెలిపింది.
బోస్వర్త్ తర్వాత ఒక బ్లాగ్ లో ఇలా పోస్ట్ చేశాడు.. కొత్త అవకాశాలను తెరిచే సాంకేతికత వచ్చినప్పుడు హాని కలిగించడానికి కూడా ఉపయోగించవచ్చు. మేము రూపకల్పన చేసిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చినప్పుడు అలాంటివి పునరావృతం కాకుండా మేము దానిని గుర్తుంచుకోవాలి అని అన్నారు. డిజిటల్ ప్రపంచంలో వేధింపులు కొత్తేమీ కాదు, అందుకే మేము, పరిశ్రమలోని ఇతరులు సంవత్సరాలుగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. ఆ పని ఇంకా కొనసాగుతోంది, ఎప్పటికీ పూర్తి కాదు. దాని ప్రాముఖ్యత స్థిరంగా ఉన్నప్పటికీ, అది నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఇది చాలా కష్టమైన పని అని అతను పేర్కొన్నాడు.
మెటావర్స్ ఆచరణాత్మక, నైతిక సమస్యలపై పరిశోధన కోసం $50 మిలియన్లను కేటాయించిది. సోషల్ నెట్ వర్క్ ఇప్పుడు ఈ సంవత్సరం మెటావర్స్ సంబంధిత ప్రాజెక్టులపై కనీసం $10 బిలియన్లను ఖర్చు చేయాలని యోచిస్తోంది మెటావర్స్ ఒక సామాజిక, 3డీ వర్చువల్ ప్రపంచం. ఇక్కడ మీరు వ్యక్తిగతంగా కలిసి ఉండలేకపోయినప్పటికీ, ఇతర వ్యక్తులతో అద్భుతమైన అనుభవాలను పంచుకోవచ్చు. భౌతిక ప్రపంచంలో మీరు చేయలేని పనులను కలిసి చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment