Andrew
-
లాంగర్ రాజీనామా.. ఆస్ట్రేలియా కొత్త కోచ్ ఎవరంటే!
Australia Cricket Team New Head Coach: జస్టిన్ లాంగర్ రాజీనామా నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా అతడి స్థానంలో తాత్కాలిక హెడ్‌కోచ్‌ను నియమించింది. ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను పురుషుల క్రికెట్ జట్టు కోచ్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని పేర్కొంది. ఇందుకు సంబంధించి ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. కాగా ఆసీస్ కోచ్‌గా కొనసాగాలని భావించిన జస్టిన్ లాంగర్ విజ్ఞప్తి పట్ల బోర్డు సానుకూలంగా స్పందించలేదు. దీంతో అతడు తన పదవి నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో ఆండ్రూకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. ఇక ఆస్ట్రేలియా తరఫున 2009లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆండ్రూ అదే ఏడాది తన చివరి మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో టీమిండియాతో 2009లో జరిగిన సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళరూకు ప్రాతినిథ్యం వహించాడు. 2013లో ఆండ్రూ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. చదవండి: Justin Langer: ఆసీస్ హెడ్‌కోచ్‌కు షాకిచ్చిన బోర్డు.. టీ20 వరల్డ్‌కప్, యాషెస్ విజయాలు.. అయినా తప్పని రాజీనామా U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! JUST IN: @CricketAus confirms Andrew McDonald has been appointed interim head coach of the Aussie men's team. More to come. — cricket.com.au (@cricketcomau) February 5, 2022 -
మెటావర్స్‌తో మహిళలు, పిల్లలకు ప్రమాదం
మెటా(గతంలో ఫేస్బుక్) వర్చువల్ రియాలిటీ వల్ల ముఖ్యంగా మహిళలు, పిల్లలకు హాని కలగవచ్చు అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మెటావర్స్ వల్ల ఫేస్‌బుక్‌కు కూడా నష్టం అని ఒక మీడియా నివేదించింది. మెటా సీటీఒ ఆండ్రూ బోస్వర్త్ ఫైనాన్షియల్ టైమ్స్ లో వచ్చిన అంతర్గత మెమోను ఉటంకిస్తూ.. ఫేస్బుక్ తన వర్చువల్ రియాలిటీ ప్రపంచాన్ని "దాదాపు డిస్నీ స్థాయి భద్రత"తో కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇందులో వినియోగదారులు ఎలా మాట్లాడతారు, అర్థవంతమైన స్థాయిలో ఎలా ప్రవర్తిస్తారా? లేదా అనేది కనిపెట్టడం ఆచరణాత్మకంగా అసాధ్యం అని బోస్వర్త్ అంగీకరించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక తెలిపింది. బోస్వర్త్ తర్వాత ఒక బ్లాగ్ లో ఇలా పోస్ట్ చేశాడు.. కొత్త అవకాశాలను తెరిచే సాంకేతికత వచ్చినప్పుడు హాని కలిగించడానికి కూడా ఉపయోగించవచ్చు. మేము రూపకల్పన చేసిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చినప్పుడు అలాంటివి పునరావృతం కాకుండా మేము దానిని గుర్తుంచుకోవాలి అని అన్నారు. డిజిటల్ ప్రపంచంలో వేధింపులు కొత్తేమీ కాదు, అందుకే మేము, పరిశ్రమలోని ఇతరులు సంవత్సరాలుగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. ఆ పని ఇంకా కొనసాగుతోంది, ఎప్పటికీ పూర్తి కాదు. దాని ప్రాముఖ్యత స్థిరంగా ఉన్నప్పటికీ, అది నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఇది చాలా కష్టమైన పని అని అతను పేర్కొన్నాడు. మెటావర్స్ ఆచరణాత్మక, నైతిక సమస్యలపై పరిశోధన కోసం $50 మిలియన్లను కేటాయించిది. సోషల్ నెట్ వర్క్ ఇప్పుడు ఈ సంవత్సరం మెటావర్స్ సంబంధిత ప్రాజెక్టులపై కనీసం $10 బిలియన్లను ఖర్చు చేయాలని యోచిస్తోంది మెటావర్స్ ఒక సామాజిక, 3డీ వర్చువల్ ప్రపంచం. ఇక్కడ మీరు వ్యక్తిగతంగా కలిసి ఉండలేకపోయినప్పటికీ, ఇతర వ్యక్తులతో అద్భుతమైన అనుభవాలను పంచుకోవచ్చు. భౌతిక ప్రపంచంలో మీరు చేయలేని పనులను కలిసి చేయవచ్చు. (చదవండి: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్!) -
హత్యలకు కారణం ఏంటి?
‘‘కొన్ని చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. కానీ ప్రస్తుతం నేను సంగీతంపై ఆసక్తిగా లేను. ఫోకస్ అంతా యాక్టింగ్ పైనే పెట్టి మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. తెలుగు బాగా నేర్చుకున్న తర్వాత టాలీవుడ్లో స్ట్రెయిట్ ఫిల్మ్ చేస్తాను’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. విజయ్ ఆంటోనీ, అర్జున్ ప్రధాన పాత్రధారులుగా ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో ప్రదీప్ నిర్మించిన తమిళ చిత్రం ‘కొలైగారన్’. ఇందులో ఆషిమా కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని ‘కిల్లర్’ అనే టైటిల్‌తో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 7న కిల్లర్ చిత్రం విడుదల కానుంది. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘ఇందులో సీరియల్ కిల్లర్ పాత్ర చేశాను. దర్శకుడు ఆండ్రూస్ నా క్లాస్మేట్. ఈ కథ విన్నప్పుడు ఎగై్జట్ అయ్యాను. సినిమాలో నేను చెడ్డవాడినా? లేక మంచి వాడినా? అసలు హత్యలకు కారణం ఏంటి? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇది పక్కా కమర్షియల్ మూవీ. వేరే బ్యానర్లో నేను చేసిన తొలి చిత్రం ఇదే. ప్రస్తుతం ‘ఖాకి’, ‘జ్వాల’ చిత్రాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. -
న్యూడ్‌గా ఇలియానా..
ముంబై : సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బాలీవుడ్లో టైం పాస్ చేస్తున్న హాట్ బ్యూటీ ఇలియానా. హిందీలో కూడా పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది ఈ గోవా సుందరి. తన ప్రియుడు ఆండ్రూతో ఫోటోషూట్లు చేయించుకుని హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య ఇల్లీబేబీ పుట్టిన రోజు సందర్భంగా టూ పీస్ బికినీలో అండర్ వాటర్‌లో తీసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో అడుగు ముందకేసిన ఈ అమ్మడు ఓ న్యూడ్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా బాత్‌టబ్‌లో ఇలియానా ఉండగా.. ఆమె ప్రియడు ఆండ్రూ క్లిక్‌మనిపించాడట. ఇలియానా పోస్ట్ చేస్తున్న పిక్చర్స్‌ను చూసి పబ్లిసిటీ పిచ్చి పీక్స్‌కు చేరిందని సినీఅభిమానులు అంటున్నారు. -
అలాంటి అమ్మాయిలెందరో!
సినిమా వ్యామోహంతో జీవితాలను కోల్పోతున్న అమ్మాయిలెందరో అని అంటోంది నటి ఇలియానా. దక్షిణాదిలో నేమ్ తెచ్చుకుని, బాలీవుడ్లో ఫేమ్ కోసం పోరాడుతున్న నటి ఈ భామ. సాధారణంగా అవకాశాలు లేనప్పుడే నటీమణులు ప్రచారం కోసం దారులు వెతుకుతుంటారని ఇలియానా మరోసారి నిరూపిస్తోంది. ఇంతకీ ఇలియానా ఏమంటుందో చూద్దాం. నాకు సినిమానే ప్రాణం అనిపిస్తుంది. అయితే అందులోనే పూర్తిగా మునిగిపోవద్దని నా మనసు చెబుతుంది. మనసు మాటే నేను వింటాను. అందుకే సినిమానే ప్రపంచం అని నేను భావించను. సినిమా వ్యామోహంతో ఎందరో అమ్మాయిలు ఇక్కడ సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని వచ్చి ఊహించిన అవకాశాలు రాక తమ జీవితాలనే కోల్పోవడం నేను చూశాను. అలాంటి వారి వల్ల నేను పరిణితి చెందాను కూడా. సినిమా రంగంలో ప్రణాళికలంటూ పెట్టుకోకూడదన్న విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. అవకాశం వస్తే నటిస్తా. లేకున్నా బాధపడను. దక్షిణాది సినిమాల్లో ఏడేళ్లు నటిగా రాణించాను. ఆ తరువాత హిందీ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించాను. దక్షిణాది చిత్రాల్లో నటించడం చాలా సులభం. ఇక్కడ మూడు, నాలుగు నెలల్లో చిత్ర నిర్మాణాలు పూర్తి చేస్తారు. హిందీలో అలా కాదు. అక్కడ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా చాలా సయమం పడుతుంది. నాకిప్పుడు 30 ఏళ్లు. వయసు దాచుకోవలసిన అవసరం నాకు లేదు. అది ఒక సంఖ్య మాత్రమే. నేనింకా 23 ఏళ్ల అమ్మాయి మాదిరిగా ఉన్నావని అభిమానులు అంటుంటే ఆనందం కలుగుతోంది. పెళ్లి ఎప్పుడని చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇకపోతే నేనూ ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ ప్రేమించుకుంటున్నామని ప్రచారం జోరుగానే జరుగుతోంది. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అయితే ఆండ్రూ చాలా ఉన్నతమైన వ్యక్తి. తను నన్నూ ఉన్నతంగా మార్చారు. ఆండ్రూ నిజాయితీ నాకు నచ్చింది. -
హద్దుమీరి ప్రవర్తిస్తే ఊరుకోను
ఎవరైనా తనతో హద్దు మీరి ప్రవర్తిస్తే ఊరుకోను అని అంటున్నారు నటి ఇలియానా. కేడీ చిత్రంతో కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత నన్బన్ చిత్రంలోనే నటించారు. అయితే తెలుగులో ప్రముఖ హీరోలందరితోనూ నటించేశారు. అలాంటి ఈ గోవా సుందరి ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై సీతకన్నేశారు. అలాగని హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారనుకుంటే పొరపాటే. అక్కడ కూడా అమ్మడికి అవకాశాలు నిల్లే. ఆ మధ్య ఒక తెలుగు చిత్రంలో సింగిల్ సాంగ్ చేయడానికి రెడీ అన్నట్లు ప్రచారం జరిగింది. కారణాలేమోగానీ ఆమె ఆ ఐటమ్ సాంగ్ చెయ్యలేదు. బహూశా బేరం కుదరలేదేమో’ఆ పాటకు ఈ భామ భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారని సమాచారం. ఇటు దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిలోనూ అవకాశాలు లేని ఇలియానా ఒక తెలుగు నటుడితో ప్రేమాయణం సాగించినట్లు గ్యాసిప్స్ హల్చల్ చేశాయి. ఆ తరువాత ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే వ్యక్తి ప్రేమలో పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా చెప్పే కహానీలు చూద్దామా’ నేను అందరితోనూ సన్నిహితంగా మాట్లాడతాను.అంతేకానీ షూటింగ్లో ఒక మూల కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. సెట్లో సహ నటీనటుల్ని వెతుక్కుటూ వెళ్లి మరీ మాట్లాడతాను. స్నేహం కోసం ప్రాణం అయినా ఇస్తాను. అందుకే చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ నేనంటే ఇష్టం. అయితే ఇలా నడుచుకోవడంలో మంచి ఎంత ఉంటుందో చెడు అంత ఉంటుంది. మంచి విషయం ఏమిటంటే అంత పెద్ద నటి అయి ఉండీ ఎలాంటి గర్వం లేకుండా అందరితో కలిసిపోతున్నారని ఇతరులు అనుకుంటారు. అభిమానం చూపుతారు. ఇక చెడు ఏమిటంటే నా సాన్నిహిత్యాన్ని కొందరు అడ్వాంటేజ్‌గా తీసుకుని హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. అలాంటి నటులతో నేను జాగ్రత్తగా ఉంటాను. వారితో సంబంధాలను ఆదిలోనే తెంచేసుకుంటాను. హద్దులు మీరే వారి చర్యల్ని మొదట్లోనే ఖండించకుంటే ఆ తరువాత మనకే నష్టం. నాతో తప్పుగా ప్రవర్తించాలనుకునే వారి బాడీలాంగ్వేజ్‌ను గ్రహించేస్తాను. రాద్దాంతం జరిగే వరకూ పరిస్థితిని రానివ్వను. -
బ్రిటన్ రాజులనూ వదలని లలిత్ మోదీ
లండన్: మనీ లాండరింగ్ సహా తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ.. బ్రిటన్ రాజకుంటుబాన్ని వదలలేదు. బ్రిటన్ రాజు చార్లెస్, ఆయన సోదరుడు ఆండ్రూ పేర్లు వాడుకుని యూకే హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి లలిత్ మోదీ ట్రావెట్ డాక్యుమెంట్లు పొందినట్టు 'ద సండే టైమ్స్' వెల్లడించింది. క్వీన్ ఎలిజబెత్ రెండో కుమారుడైన ఆండ్రూతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని లలిత్ ప్రయాణ పత్రాలు పొందారని తెలిపింది. ట్రావెల్ డాక్యుమెంట్స్ తన చేతికి రావడానికి కొన్ని రోజుల ముందే ఆండ్రూను మోదీ కలిశారని వెల్లడించింది. లలిత్ మోదీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విషయంలో వసుంధర రాజే సహకరించారన్న వార్తలు వెలుగులోకి రావడంతో భారత్ లో రాజకీయ దుమారం లేచిన విషయం తెలిసిందే. -
అంతర్జాతీయ శాంతి బహుమతికి నేహా నామినేట్
ది హేగ్: అంతర్జాతీయ చిన్నారుల శాంతి బహుమతి -2014కి భారతీయ సంతతికి చెందిన నేహా అనే టీనేజీ బాలిక యూఎస్ నుంచి నామినేట్ అయింది. ఆమెతో పాటు రష్యా నుంచి అలెక్స్, ఘనా నుంచి అండ్రూలు కూడా నామినేట్ అయ్యారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. చిన్నారులకు హక్కులను కాపాడటంలో చురుకైన పాత్ర పోషించే టీజేజీ బాలికలకు ఈ అవార్డును అందజేస్తారని తెలిపింది. 18 ఏళ్ల నేహా యూఎస్‌లో సొంతంగా ఓ ఫౌండేషన్ స్థాపించి... దీని ద్వారా చిన్నారుల హక్కులపై చైతన్యం కలిగిస్తుందని పేర్కొంది. అలాగే 17 ఏళ్ల అలెక్స్... హోమో సెక్య్సువల్, ట్రాన్స్‌జెండర్‌పై రష్యాలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. 13 ఏళ్ల అండ్రూ దేశంలో కరువుపై పోరాడుతూ... ఫుడ్ ఎయిడ్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారని వెల్లడించింది. 2005 నుంచి అంతర్జాతీయ చిన్నారుల శాంతి బహుమతి పథకాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఈ అవార్డు విజేత పేరును నవంబర్ 18న ది హేగ్‌లో ప్రకటిస్తారని మీడియా తెలిపింది. -
సహజీవనం ఎంత మధురం!
‘‘ఆత్మస్థయిర్యం, మనో నిబ్బరం, దృఢ సంకల్పం, జీవితంపై పూర్తి అవగాహన.. ఇవన్నీ మనిషిని పరిపూర్ణుణ్ణి చేస్తాయి. ఇవన్నీ నాకూ ఉన్నాయి. తల్లితండ్రులపై ఆధారపడకుండా చిన్న వయసులోనే సొంతంగా బతకడం మొదలుపెట్టాను. అందుకే, త్వరగా అవన్నీ నాకు లభించాయి. అయితే... ఒక్కటి మాత్రం నిజం. మా అమ్మ లేకపోతే కచ్చితంగా ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు’’ అన్నారు ఇలియానా. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఇలియానా మీడియాతో ముచ్చటించారు. ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమాయణం గురించి అడిగితే మాత్రం చిరునవ్వే ఆమె సమాధానమైంది. పెళ్లి గురించి మీ అభిప్రాయం? అనడిగితే -‘‘నిబద్ధత, నమ్మకం, ప్రేమ.. వీటితో కూడుకున్నదే పెళ్లి. ఈ ప్రక్రియపై నాకు గౌరవం, నమ్మకం రెండూ ఉన్నాయి. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అయితే దానికి టైముంది. నా దృష్టిలో సహజీవనం ఎంత మధురంగా ఉంటుందో, వైవాహిక జీవితం కూడా అంతే మధురంగా ఉంటుంది’’ అని బదులిచ్చారు. -
వ్యాపార సేవకులు
ఆ న లుగురు కాలేజీలో కలిశారు... వాళ్లతో పాటు అభిప్రాయాలు, ఆశలు, ఆశయాలు కూడా కలిశాయి. ఒకే బెంచ్‌లో కూర్చోసాగారు, ఒకే బ్యాచ్‌గా మారారు. చదువు అయిపోగానే నలుగురు కలిసి మొదట ఈ ప్రపంచాన్ని మొత్తం చుట్టేయాలనుకొన్నారు. ఈ ప్రయాణంలో జీవిత సత్యాన్ని న్వేషిద్దామనుకొన్నారు. అయితే దాని వల్ల తమకు ప్రపంచంతో పరిచయం ఏర్పడుతుందేమో కానీ, ప్రపంచానికి తాము పరిచయం కామన్న విషయాన్ని అర్థం చేసుకొన్నారు. ఈ ప్రపంచంలో తాము ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవాలంటే ఏదైనా సాధించాలనుకొన్నారు. అలా ఆలోచించిన ఆ మిత్రబృందం మొదలు పెట్టినదే ‘వార్బీ పార్కర్’. దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా సాగుతూ అందరి కళ్లకూ కనిపిస్తున్న కళ్ల జోడు కంపెనీ ఇది. దీని వ్యవస్థాపకులైన నలుగురు స్నేహితులే నీల్, ఆండ్రూ, జెఫ్రీ, డేవిడ్. ఒక కళ్ల జోడు సెట్‌ను అమ్మితే... మరో కళ్ల జోడు సెట్‌ను అవసరార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం అనేది ఈ కంపెనీ సిద్ధాంతం! ఇదే సిద్ధాంతంతో నాలుగేళ్లలోనే దృష్టిలోపంతో బాధపడుతున్న అవసరార్థులకు ఏకంగా 50 లక్షల కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసింది ఈ సంస్థ. మెదడు, మనసు ఉన్న నలుగురు యువకుల ఆలోచన ఫలితంగా ఆవిష్కృతమైన కంపెనీ ఇది. ఒకవైపు నాణ్యతతోనూ, నవ్యతతోనూ వినియోగదారులను ఆకట్టుకొంటూనే.. స్వచ్ఛంద సేవలోనూ ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొంది. సేవకు వ్యాపారమే ఊతం!: దృష్టి దోషం ఉన్న వాళ్లకు అవసరమయ్యే కళ్ల జోళ్లను, సన్ గ్లాసెస్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ సంస్థ. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిధిలోని వార్తన్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డేవిడ్ గిల్ బో, నీల్ మెంథ్నల్, ఆండ్రూ హంట్, జెఫ్రీ రైడర్ లు తమకు తల్లిదండ్రులు ప్యాకెట్ మనీ కింద ఇచ్చిన 2,500 డాలర్ల పెట్టుబడితో ఈ కంపెనీని ప్రారంభించారు. ఒకవైపు వ్యాపారం చేస్తూనే తద్వారా వచ్చిన లాభంతో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనేది ఆ నలుగురు యువకుల ప్రణాళిక. మరి వీళ్ల లక్ష్యం మంచిది, వీళ్ల శ్రమ చిత్తశుద్ధితో కూడుకొన్నది.. దీంతో కళ్ల జోళ్లవాడకంపై మంచి క్రేజ్ ఉన్న అమెరికా దేశంలో ఆ కంపెనీకి కూడా మంచి ఆదరణ లభించింది. పెట్టుబడి తక్కువ కావడంతో.. తాము ఉత్పత్తి చేసిన కళ్లజోళ్లను ఎలా అమ్మాలో కూడా ఈ యువకులకు మొదట అర్థం కాలేదు. ఆ సమయంలో వీళ్లకు వోగ్డాట్కామ్ సహాయకారిగా నిలిచింది. ఈ నలుగురు యువకుల ప్రణాళికను, తపనను అందరికీ తెలియజెప్పింది. వీళ్ల వెబ్సైట్ అడ్రస్‌ను ఇచ్చి అమ్మకాలకు ఊపుతెచ్చింది. మీరు ఒక కళ్ల జోడును కొంటే, మేము అవసరార్థులకు ఉచితంగా ఒక కళ్ల జోడును పంపిణీ చేస్తాం(బయ్ వన్, గివ్ వన్) అనే విధానం నచ్చి చాలా మంది వీళ్ల ద గ్గరే కళ్ల జోళ్లను కొనసాగారు. ఇండియాపైన దృష్టి...: దృష్టి లోపాలతో బాధపడుతూ కూడా కళ్లజోడును కొనుక్కోలేనంత పేదరికం ఉండేది పేద ఆఫ్రికా, ఆసియాదేశాల ప్రజల్లోనే. ఈ విషయం గ్రహించి వీళ్లు ముందుగా భారతదేశం, బంగ్లాదేశ్‌లపై దృష్టి సారించారు ఈ స్నేహితులు. విజన్ స్ప్రింగ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కళ్ల జోళ్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నాలుగేళ్లు గడిచే సరికి ఐదు మిలియన్ల కళ్ల జోళ్లను పంపిణీ చేయించి ఈ కంపెనీ బాసులుగా ఉన్న ఆ నలుగురు యువకులు తమ సత్తాను రెండు విధాలుగా చాటుకొన్నారు. సాధారణ నేపథ్యం...: వీళ్ల ఆలోచన తీరు వైవిధ్యమైనది కానీ ఈ నలుగురూ చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. స్పష్టమైన విధానంతో చిన్న పెట్టుబడితో వీళ్లు వార్బీ పార్కర్‌ను మొదలు పెట్టగా.. తర్వాత అనేకమంది వీళ్లకు తోడయ్యారు. విరాళంగా డబ్బు ఇచ్చి ఆ కంపెనీని పెద్ద సంస్థగా రూపు దిద్దుకోవడానికి సహకారం అందించారు. అయితే ఇప్పటికీ ఈ సంస్థకు ఉన్న దుకాణాల సంఖ్య తక్కువే. ప్రధానంగా వెబ్సైట్ ఆధారంగానే అమ్మకాలు కొనసాగుతున్నాయి. ‘బయ్ వన్ -గివ్ వన్’అనే నినాదాన్ని అమలు పెట్టడం అనేది మాటల్లో చెప్పినంతటి సులభమైన వ్యవహారం కాదు. దానకర్ణులుగా పేరు పొందిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా విరాళం విషయంలో ఇలాంటి విధానాన్ని అమల్లో పెట్టే సాహసం చేయలేదు. కానీ తాము అనుకొన్న విధానాన్ని అమలులో పెట్టి ఈ నలుగురు యువకులు తమ శక్తి యుక్తులు ఏ స్థాయివో నిరూపించారు. ఈ నలుగురూ చాలా సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. స్పష్టమైన విధానంతో చిన్న పెట్టుబడితో వీళ్లు వార్బీ పార్కర్‌ను మొదలు పెట్టగా.. తర్వాత అనేక మంది వీళ్లకు తోడయ్యారు. విరాళంగా డబ్బు ఇచ్చి ఆ కంపెనీని పెద్ద సంస్థగా రూపు దిద్దుకోవడానికి సహకారం అందించారు. -
పట్టుదల ఓడిపోలేదు...
స్ఫూర్తి ‘‘సాహసంలో ఉండే గొప్పదనమే అది. వర్తమానం గురించి తప్ప గతాన్ని గురించి ఆలోచించదు. ఒకవేళ నా మిత్రుడు ఫిషర్ బతికి ఉంటే... ఇప్పుడు నాతో పాటే వచ్చి ఉండేవాడు’’ అంటాడు ఆండ్రూ. కొందరు పని మొదలుపెట్టరు. కొందరు మొదలు పెడతారుగానీ...మధ్యలోనే వదిలేస్తారు. కొందరు మధ్యలో వదిలేసినా... మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటారు. జామి ఆండ్రూ కూడా అలాంటివాడే! జర్మనీలో 4,478 మీటర్ల ఎత్తయిన ‘మాటర్‌హార్న్’ అనే పర్వతశిఖరం ఉంది. రిఫెల్సి సరస్సు ఒడ్డున ఉన్న ఈ పర్వతాన్ని అధిరోహించాలని ఎందరెందరో ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో ఇప్పటి వరకు 500 మందికి పైగా చనిపోయారు. పదిహేను సంవత్సరాల క్రితం ఆండ్రూ తన స్నేహితుడు జామి ఫిషర్‌తో కలిసి ఈ పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు హఠాత్తుగా మంచుతుపాను చుట్టుముట్టింది. నాలుగు రోజుల పాటు ప్రాణాలు అరచేతితో పెట్టుకొని గడిపారు. అయిదోరోజు ఫిషర్ చనిపోయాడు. ఈ ప్రమాదంలో ఆండ్రూ హస్తాలు, కాళ్లు కోల్పోయాడు. మరొకరు అయితే ‘ఖేల్ ఖతం’ అనుకునేవారు. ఆండ్రూ మాత్రం అలా అనుకోలేదు. ‘ఎన్నిసార్లయినా ప్రయత్నిస్తాను’ అనుకున్నాడు. అనుకోవడమే కాదు ఇప్పుడు రంగంలోకి దిగాడు. ‘మాటర్‌హార్న్’ పర్వతాన్ని మరోసారి అధిరోహించే ప్రయత్నంలో ఉన్నాడు. రెండు సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. ‘‘అంగవైకల్యంతో బాధ పడేవారికి నా విజయం స్ఫూర్తినిస్తుంది అని నమ్ముతున్నాను’’ అంటున్నాడు ఆత్మవిశ్వాసంతో. ‘‘గతాన్ని తలుచుకుంటే భయమేయదా? మళ్లీ ఎందుకు ప్రయత్నిస్తున్నారు?’’ అని ఎవరైనా అడిగితే- ‘‘సాహసంలో ఉండే గొప్పదనమే అది. వర్తమానం గురించి తప్ప గతాన్ని గురించి ఆలోచించదు. ఒకవేళ నా మిత్రుడు ఫిషర్ బతికి ఉంటే... ఇప్పుడు నాతో పాటే వచ్చి ఉండేవాడు’’ అంటాడు ఆండ్రూ. చాలా విరామం తరువాత పర్వతారోహణ చేయడం నిజానికి కష్టమే. అయితే సంకల్పబలం ఉంటే అదేమీ అసాధ్యం కాదు అని ఆండ్రూ నిరూపించదలుచుకున్నాడు. పర్వతారోహణ చేసే క్రమంలో వేసే ప్రతి అడుగూ తనకో పాఠం నేర్పుతుందని, సరికొత్త విషయాలు తెలుసుకునేలా చేస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ‘‘నాకు ఏదైనా పరాజయం ఎదురైతే దాన్ని ఎలా అధిగమించాలి అనే దాని గురించి ఆలోచిస్తాను’’ అంటున్న ఆండ్రూ గెలుపు మీద నమ్మకంతో ఉన్నాడు. ‘‘ప్రసిద్ధమైన ఈ పర్వత శిఖరాన్ని అధిరోహించడానికి మించిన అదృష్టం, ఆనందం ఏముంది?’’ అని అంటున్నాడు ఆండ్రూ పట్టుదలతో. అతని ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం. -
మేం ప్రేమలో పడితే మీకేంటి?
దక్షిణాదిన ఓ వెలుగు వెలిగి ఉత్తరాదిన తన సత్తా చాటుకునే పనిలో ఉన్నారు ఇలియానా. హిందీలో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న ఇలియానా మరోవైపు తన బోయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో కలిసి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారట. ఈ వ్యవహారం గురించి బాలీవుడ్లో చిలవలు పలవలుగా చెప్పుకుంటున్నారు. మీరు ప్రేమలో పడ్డారట? అని ఇటీవల ఎవరో ఇలియానాని అడిగితే -‘‘అసలు నా విషయం మీకెందుకండి? మేం సినిమాల్లో ఏం చేసినా చూస్తారు. చివరికి ఐటమ్ సాంగ్స్ చేసినా ఆనందంగా చూసేస్తారు. హీరోయిన్ కదా.. ఐటమ్ సాంగ్ చేసిందేంటి? అని అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా మాట్లాడరు. కానీ, ఏ హీరోతోనో, స్నేహితుడితోనో మాట్లాడుతూ కనిపిస్తే చాలు.. ‘ఆ ఇద్దరి మధ్య సమ్‌థింగ్’ అనేస్తారు. అయినా మేం ప్రేమలో పడితే మీకేంటి? పడకపోతే ఏంటి? అది మా వ్యక్తిగత విషయం. ఒకవేళ ప్రేమించినా అది తప్పా? చెయ్యకూడని తప్పేదో చేసినట్లుగా ప్రచారం చేస్తారు. మేమూ మనుషులమే. మీరు ప్రేమలో పడ్డట్లే మేమూ పడతాం. దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీకెందుకు? మేం సెల బ్రిటీలం కనుక వదంతులు ఎదుర్కోవడం అలవాటైపోతుంది. మరి.. మా కుటుంబ సభ్యుల సంగతేంటి? వాళ్లు ఫీలవరా’’ అని ఘాటుగా స్పందించారట.