సహజీవనం ఎంత మధురం! | How Sweet Symbiosis! | Sakshi
Sakshi News home page

సహజీవనం ఎంత మధురం!

Published Sat, Jul 19 2014 1:51 AM | Last Updated on Wed, Aug 29 2018 8:24 PM

సహజీవనం ఎంత మధురం! - Sakshi

సహజీవనం ఎంత మధురం!

‘‘ఆత్మస్థయిర్యం, మనో నిబ్బరం, దృఢ సంకల్పం, జీవితంపై పూర్తి అవగాహన.. ఇవన్నీ మనిషిని పరిపూర్ణుణ్ణి చేస్తాయి. ఇవన్నీ నాకూ ఉన్నాయి. తల్లితండ్రులపై ఆధారపడకుండా చిన్న వయసులోనే సొంతంగా బతకడం మొదలుపెట్టాను. అందుకే, త్వరగా అవన్నీ నాకు లభించాయి. అయితే... ఒక్కటి మాత్రం నిజం. మా అమ్మ లేకపోతే కచ్చితంగా ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు’’ అన్నారు ఇలియానా. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఇలియానా మీడియాతో ముచ్చటించారు.

ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమాయణం గురించి అడిగితే మాత్రం చిరునవ్వే ఆమె సమాధానమైంది. పెళ్లి గురించి మీ అభిప్రాయం? అనడిగితే -‘‘నిబద్ధత, నమ్మకం, ప్రేమ.. వీటితో కూడుకున్నదే పెళ్లి. ఈ ప్రక్రియపై నాకు గౌరవం, నమ్మకం రెండూ ఉన్నాయి. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అయితే దానికి టైముంది. నా దృష్టిలో సహజీవనం ఎంత మధురంగా ఉంటుందో, వైవాహిక జీవితం కూడా అంతే మధురంగా ఉంటుంది’’ అని బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement