
గోవా బ్యూటీ ఇలియానా– రవితేజ తొలిసారి ‘ఖతర్నాక్’ సినిమాలో జోడీ కట్టారు. ఆ తర్వాత వీరిద్దరూ ‘కిక్, దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు. మూడు సార్లు జోడీ కట్టిన రవితేజ–ఇలియానా నాలుగోసారీ కలసి నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత తెలుగులో మరో సినిమా చేయని ఇలియానా బాలీవుడ్ చిత్రాలతో బిజీ అయ్యారు.
అయితే.. తనకు స్టార్ డమ్ తీసుకొచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఇలియానా ఓ సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా తెరకెక్కుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్‌ని కథానాయికగా తీసుకున్నారు. అయితే.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి అనూ తప్పుకున్నారు. దీంతో చిత్రవర్గాలు ఇలియానాని సంప్రదించాయట. కథ నచ్చడంతో పాటు రవితేజతో ఉన్న ఫ్రెండ్‌షిప్ కారణంగా నటించేందుకు ఈ గోవా బ్యూటీ ఒప్పుకున్నారట.
Comments
Please login to add a commentAdd a comment