Sreenu Vaitla
-
ఓటీటీలో 'విశ్వం'.. అప్పుడే స్ట్రీమింగ్కు రానుందా..?
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం 'విశ్వం'. బాక్సాఫీస్ వద్ద కాస్త పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న చాలా సినిమాలు థియేటర్స్‌లో సందడి చేయనున్నాయి. దీంతో విశ్వం చిత్రాన్ని దాదాపు అన్ని స్క్రీన్స్ నుంచి తొలగించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారట. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.దసరా సందర్భంగా అక్టోబర్ 11న విడుదలైన 'విశ్వం' పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు నష్టాలు తప్పలేదని సమాచారం. ఇప్పుడు కాస్త త్వరగా ఓటీటీలో అయినా విడుదల చేస్తే కొంతైనా సేఫ్ కావచ్చని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా నవంబర్ 1న 'విశ్వం' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయునున్నట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉండే అవకాశం ఉంది. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా కథ పెద్దగా ఆకట్టుకోకపోయినా కామెడీతో ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని చెప్పవచ్చు. -
గోపీచంద్ 'విశ్వం'మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'విశ్వం' నుంచి మాస్ సాంగ్ రిలీజ్
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి మాస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి ఆదరణ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. -
గోపీచంద్ యాక్షన్‌కు శ్రీను వైట్ల మార్క్ డైరెక్షన్‌తో 'విశ్వం' ట్రైలర్
గోపీచంద్ హీరోగా రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి భారీ యాక్షన్ ట్రైలర్ విడుదలైంది. గోపీచంద్ మార్క్ యాక్షన్ సీన్స్‌తో పాటు మంచి కామెడీ కూడా ట్రైలర్లో చూపించారు. ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి ఈ మూవీని నిర్మించారు. 'హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘విశ్వం’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది.ట్రైలర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశారని చెప్పవచ్చు. శ్రీను వైట్ల మార్క్ హ్యుమర్‌కు గోపీచంద్ యాక్షన్, కామెడీతో ఈ సినిమా ఉండనుంది. గోపీచంద్‌ని ఒక విభిన్నమైన పాత్రలో దర్శకుడు చూపించారు. ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో నటించారు. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోయేలా ఉంది. -
బ్లాక్‌బస్టర్ వెంకీ సినిమా మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే?
మాస్ మహారాజ.. రవితేజకు ఇప్పుడంటే సరైన హిట్లు రావట్లేదు కానీ ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్లతో చించేశాడు. చంటి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, ఖడ్గం, వెంకీ.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలానే ఉంది. ముఖ్యంగా వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ అయితే ఎవర్గ్రీన్.. సినిమా అంతా ఒక ఎత్తయితే ఆ రైల్లో నడిచే కామెడీ సన్నివేశం మరో ఎత్తు. ఇప్పటికీ మీమ్స్‌లో దీన్ని వాడుతుంటారు. వెంకీ సినిమాతోనే మొదలు ఈ సినిమా రిలీజై రేపటికి (మార్చి 26 నాటికి) 20 ఏళ్లు కావస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. 'నేను ప్రతి సినిమాకు నాగార్జునసాగర్ వెళ్లి అక్కడే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటూ ఉంటాను. అది వెంకీ సినిమాతోనే మొదలైంది. అయితే ఈ చిత్రానికి మొదట అసిన్‌ను హీరోయిన్గా అనుకున్నాను. కానీ కుదరకపోవడంతో స్నేహను సెలక్ట్ చేశాం. రైలు కామెడీ సీన్లో ఎమ్మెస్ నారాయణ కూడా ఉండాలి.. కానీ మిస్సయ్యారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్ చాలామంది ఈ రైలు సీన్ వర్కవుట్ అవుతుందా? అని కూడా అన్నారు. రిలీజయ్యాక మాత్రం మేము ఊహించినదానికంటే రెట్టింపు రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నచ్చిందని చిరంజీవి ఫోన్ చేసి చెప్పడటమే నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్' అని గుర్తు చేసుకున్నాడు. వెంకీ సినిమాకు శ్రీనువైట్లతో పాటు కోన వెంకట్, గోపిమోహన్ రచయితలుగా పని చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా అట్లూరి పూర్ణచంద్ర రావు నిర్మించారు. చదవండి: మొన్నేమో పెళ్లిచప్పుడే లేదంది.. ఇప్పుడేకంగా రహస్య వివాహం! -
మీరు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను: శ్రీను వైట్ల
నీకోసం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఆనందం, సొంతం, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా చిత్రాలతో వరుస సక్సెస్‌లు అందుకున్నాడు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడీ డైరెక్టర్. అటు వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులకు లోనవుతున్నాడు. ఆయన భార్య రూప శ్రీనువైట్లతో విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే! ఈ వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాప్తించింది. ఈ క్రమంలో శ్రీనువైట్ల రీసెంట్గా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. 'జీవితం చాలా అందమైంది. నచ్చిన వాళ్లతో ఉంటే అది మరింత అందంగా ఉంటుంది. ఈ ముగ్గురు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం అసాధ్యం' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. ఇంతకీ ఆ ముగ్గురు మరెవరో కాదు.. తన ముగ్గురు కూతుళ్లు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఏం బాధపడకండి సర్, తప్పకుండా మీరు కోల్పోయినవి తిరిగి మీకు దక్కుతాయి. ఒక్క హిట్ పడితే మిమ్మల్ని కాదని వెళ్లినవాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్రీను వైట్ల ప్రస్తుతం ఢీకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. Life is beautiful but with your loved ones it’s more than beautiful. Can’t imagine life without my three musketeers!! pic.twitter.com/kqbNAu79CU — Sreenu Vaitla (@SreenuVaitla) July 21, 2022 చదవండి: నేను మారిపోయా, నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నా.. నటుడు అర్జున్ ఇంట తీవ్ర విషాదం -
NTR Jayanthi: ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి’అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశాడు. (చదవండి: పదే పదే తలచు తెలుగుజాతి) ఇక రామరావు జయంతి సందర్భంగా తాతను స్మరించుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా’ అంటూ ఎన్టీఆర్ ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టాడు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ పోస్టులు పెట్టారు. తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి! #100YearsOfNTR — Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2022 సదా మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/svo2SUQSlP — Jr NTR (@tarak9999) May 28, 2022 కారణ జననానికి వందేళ్ళు !! నటుడిగా అలరించి, అబ్బుర పరచి.. అఖండ ఖ్యాతినార్జించారు! నాయకుడిగా అండనిచ్చి, అభివృద్ధినందించి.. ఆదర్శప్రాయుడయ్యారు!! వ్యక్తిగా ఆత్మగౌరవానికి నిలువెత్తురూపంగా నిలిచారు!! తెలుగువారి గుండెల్లో మీ స్థానం.. సుస్థిరం.. సమున్నతం.. శాశ్వతం!!#100YearsOfNTR pic.twitter.com/f5ErLiNpJE — Sreenu Vaitla (@SreenuVaitla) May 28, 2022 Some saw him as an ordinary man..Some saw him as a God..but,in the end everybody realised that he was a Man sent by God! The Pride of every Telugu soul! 🙏❤️ #100YearsOfNTR Love..#RAPO pic.twitter.com/tl0WzA8Qsp — RAm POthineni (@ramsayz) May 28, 2022 The man of the people and for the people. #NTR garu's good deeds and service will never be forgotten on and off the screen. We are forever grateful to this legend! Let us come together and celebrate his achievements and greatness!https://t.co/GdiBeUh89M pic.twitter.com/eBgLuTyvex — Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 26, 2022 Johar NTR. #100YearsOfNTR pic.twitter.com/uRRpsRbHzV — Raghavendra Rao K (@Ragavendraraoba) May 28, 2022 -
కథతో పాటే కామెడీ
రవితేజ, ఇలియానా జంటగా నటించిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్రంలోని హాస్యనటులతో పాటు చిత్రదర్శకుడు శ్రీను వైట్ల పాల్గొన్నారు. ‘వెన్నెల’ కిశోర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు చంటి మిరియాల. దర్శకుడు శ్రీనుగారు తన ప్రతి సినిమాలోనూ మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహిస్తారు. ఫస్ట్ టైమ్ నా కెరీర్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేశాను. ఓ కమెడియన్ రోల్‌ని స్టార్టింగ్ టు ఎండింగ్ డిజైన్ చేసే డైరెక్టర్స్‌లో శ్రీనుగారు ఒకరు’’ అన్నారు. నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ‘వాటా’ (హోల్ ఆంధ్రా, తెలంగాణ ఆర్టిస్ట్ యూనియన్) లో మేమందరం చేసే అల్లరి మామూలుగా ఉండదు. ప్రతి సీన్ చాలా ఎంజాయ్ చేస్తూ చే శాం. రఘుబాబుగారిని విపరీతంగా టీజ్ చేసే క్యారెక్టర్ నాది. శ్రీను వైట్లగారు ప్రతి సినిమాలో మమ్మల్ని పెట్టుకుని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్’’ అన్నారు. నటుడు గిరిధర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని చేతన్ శర్మ పాత్ర ద్వారా నా కెరీర్ మరో లేయర్లోకి వెళ్లే పాత్ర ఇది. ‘వెన్నెల’ కిశోర్‌గారి అసిస్టెంట్ పాత్ర నాది. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘ఈ కామెడీ గ్యాంగ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో సునీల్ జాయినవుతాడు. అతని పేరు బేబీ సిట్టర్ బాబి. ఆ పాత్ర ద్వారా ఆయన ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తారు. ఈ కామెడీ పాత్రలన్నీ కథలో కలిసి ఉంటాయి. సెపరేట్ ట్రాక్‌లు కాదు. మొదటినుంచి చివరివరకు ఈ పాత్రలన్నీ సినిమాలో ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఇంత బాగా కామెడీ సెట్ అయినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. -
‘అఅఆ’లో డాన్‌బాస్కో కాస్తా.. డాన్‌బ్రాస్కోగా మారింది!
సినిమాలోని పాటల్లో, మాటల్లో కొన్ని పదాలు వాడటంతో కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. గతంలో ఇలా ఎన్నో పాటలు, మాటలు సినిమాల్లోంచి తీసేయడమో లేదా వాటిని మార్చడమో జరగుతూ వచ్చాయి. అదుర్స్, రంగస్థలం పాటలే ఇందుకు ఉదాహరణ. ఆ సినిమాలోని పాటలు కొందరి మనోభావాలు దెబ్బతినడంతో వాటి లిరిక్స్‌ను మార్చేశారు. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న ‘అమర్‌అక్బర్‌ఆంటోని’లోని డాన్‌బాస్కో పాటలోని పదాన్నికూడా మార్చబోతున్నట్లు ప్రకటించారు. డాన్‌బాస్కో అనే మత గురువు పేరిట ఉన్న డాన్‌బాస్కో సేవా సంస్థ విజ్ఞప్తి మేరకు.. ఆ పదాన్ని మార్చుతూ.. డాన్‌బ్రాస్కోగా కొత్త లిరిక్‌తో సాంగ్ వస్తుందంటూ మేకర్స్ తెలిపారు. ఇలియాన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 16న విడుదల కానుంది. #DonBosco becomes #DonBrasco Respecting the sentiments of Don Bosco Seva Kendra, the producers have changed the lyrics of the song@RaviTeja_offl @SreenuVaitla @Ileana_Official @MusicThaman @MythriOfficial @Mee_Sunil @vennelakishore #AAAOnNov16 — BARaju (@baraju_SuperHit) November 12, 2018 -
చెప్పాలనుకుంటే చెబుతా
‘‘ఇన్ని సంవత్సరాలు తెలుగులో కావాలని గ్యాప్ తీసుకోలేదు. బాలీవుడ్‌కి వెళ్లాక వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా కంటిన్యూ అయిపోయాను. ఈలోపు నేను కావాలనే తెలుగుకి దూరంగా ఉంటున్నానని మిస్అండర్స్టాడింగ్ చేసుకున్నారు. ఏదేదో అనుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌ని బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నాను. కానీ బ్యాలెన్స్ మిస్ అయింది (నవ్వుతూ)’’ అని ఇలియానా అన్నారు. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను ౖÐð ట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇలియానా మళ్లీ తెలుగులో కనిపించనున్న చిత్రం ఇది. ఈ సందర్భంగా మీడియాతో ఇలియానా పలు విశేషాలు పంచుకున్నారు. ► ఈ సినిమా ఒప్పుకోవడానికి మొదటి కారణం కథ. వినగానే చాలా ఎగై్జట్ అయ్యాను. అలాగే రవితేజ కూడా ఉన్నారు. రవి నా ఫేవరెట్ కో–స్టార్. ఇద్దరం కలసి ఆల్రెడీ మూడు సినిమాలు చేశాం. ఇది నాలుగో సినిమా. ఈ సినిమాలో నా పాత్ర గురించి ఎక్కువ చెప్పకూడదు. నా పాత్ర పేరు చెప్పినా కూడా సినిమాలో క్లూ చెప్పేసినట్టే అవుతుంది. ► ఈ మధ్యలో కూడా కొన్ని సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేయమని ఆఫర్స్ వచ్చాయి. స్క్రిప్ట్స్ కుదరక మిస్ అయ్యాయి. సాంగ్స్ చేయాలంటే అది ఆ సినిమాకు ఉపయోగపడుతుందా? లేదా? అని ఆలోచించాను. అంత స్పెషల్‌గా ఉండదనిపించి వదిలేశాను. ఇటీవల ఓ పెద్ద సినిమా కూడా వదిలేశా. మంచి స్క్రిప్ట్, మంచి టీమ్ ఉన్నా నా పాత్ర చాలా చిన్నదిగా ఉండడంతో చేయలేదు. ► ‘దేవదాసు’తో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా వయసు 17,18. ఏ సినిమా వచ్చినా చేసేశాను. వయసు పెరిగే కొద్దీ మన ఆలోచన తీరు కూడా పెరుగుతుంది. మనం చేస్తున్న వృత్తి పట్ల ఇంకా గౌరవంగా ఉంటాం. మంచి సినిమాలు చేయాలనుకుంటాం. ప్రస్తుతానికి మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నాను. డ్రీమ్‌రోల్స్ లాంటివి పెద్దగా ఏం లేవు. యువరాణిలా చేయాలి, యోధురాలిగా కత్తి విద్యలు చేయాలి అని పెద్దగా అనుకోను. నా దర్శకులు అలాంటి పాత్ర చేయిస్తే చేస్తానేమో. ► నా కెరీర్ పట్ల సంతృప్తికరంగా ఉన్నాను. తప్పులు, ఒప్పులు అన్నీ ఉంటాయి. వాటి నుంచి నేర్చుకోవడమే. ‘పోకిరి’ సినిమా సమయంలో అనుకుంటా... ఆ సినిమా చేయాలా వద్దా అనుకున్నాను. మహేశ్ సోదరి మంజుల చేయమని చెప్పారు. ఆవిడ చెప్పకపోతే నా కెరీర్లో నిజంగా ఓ స్పెషల్ ఫిల్మ్ మిస్ అయ్యుండేదాన్ని. ► ‘అమర్ అక్బర్..’ సినిమాలో నా పాత్రకు స్వయంగా నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగు డబ్బింగ్ చెప్పుకుంటానని అనుకోలేదు. శ్రీనుగారు బావుంటుందని చెప్పించారు. డబ్బింగ్ స్టూడియోకి వెళ్లి చెప్పేవరకూ నమ్మకం కుదర్లేదు. నేను డబ్బింగ్ చెప్పడం ఏంటీ? అని. ఎందుకంటే తెలుగు భాష స్పష్టంగా పలకకపోతే పాత్ర దెబ్బ తింటుంది. నా వాయిస్ నాకు నచ్చలేదు. (నవ్వుతూ). ► నేను నటిని. సెట్లో నటిస్తాను. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే అందరిలాగానే నార్మల్‌గా ఉంటా. వండుకోవడం, ఇళ్లు శుభ్రం చేసుకోవడం అన్నీ నేనే చేసుకుంటాను. కానీ పర్సనల్ లైఫ్ పర్సనల్‌గా ఉంటేనే బావుంటుంది అని అనుకుంటున్నాను. అది కూడా నా వ్యక్తిగత విషయాలు చెప్పాలనుకుంటే చెబుతాను.. అలాగే మొత్తం చెప్పను (నవ్వుతూ). ► ప్రస్తుతం మానసిక ఆరోగ్యం గురించి మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అర్థం చేసుకోగలగాలి. నేనే అర్థం చేసుకోలేకపోయాను. కానీ కొన్ని రోజులు మానసికంగా ఇబ్బంది పడ్డాను. యాంగై్జటీ, డిప్రెషన్లోకి వెళ్లడం ఇవన్నీ నార్మల్ బిహేవియర్ కాదు. సో.. అందరూ ఈ మానసిక ఆరోగ్యం మీద అవగాహన పెంచుకోవాలి. ► ‘మీటూ’ గురించి మాట్లాడుతూ – ‘‘చాలా మంది స్త్రీలు బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలు చెబుతున్నారు. అలా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. ‘మీటూ’ ఉద్యమం కచ్చితంగా ఓ మార్పు తీసుకు రావాలని కోరుకుంటున్నాను’’ అంటున్న ఇలియానాతో మీకు ఇటువంటి సంఘటనలు ఎదురయ్యాయా? అని అడగ్గా – ‘‘ఆ విషయాల గురించి నేను మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడతాను’’ అన్నారు. పోనీ మీ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్షిప్ స్టేటస్ ఏంటీ? అని అడిగితే – ‘‘ ప్రస్తుతానికి మా రిలేషన్షిప్ స్టేటస్ హ్యాపీ’’ అని చెప్పారు. -
శ్రీను వైట్ల గొప్ప నటుడు
‘‘శ్రీను వైట్ల సినిమాలంటేనే ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ చేస్తాం. ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. మా కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా. ఫస్ట్ చిత్రం ‘నీకోసం’ కొంచెం ఎమోషనల్ లవ్‌స్టోరీ. ‘వెంకీ, దుబాయ్ శీను’ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్. ఈ రెండింటి కలయిక ‘అమర్ అక్బర్ ఆంటొని’. మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నా’’ అని రవితేజ అన్నారు. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘అమర్ అక్బర్ ఆంటొని’కి డబ్బింగ్ చెప్పేటప్పుడు విపరీతంగా నవ్వాను.. అంత ఎంజాయ్ చేశాను. తమన్‌తో ఇది 9వ సినిమా. నెక్ట్స్ పదో సినిమా. హిట్‌కి, ఫ్లాప్‌కి సంబంధం లేకుండా నాకు ఎప్పుడూ సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తాడు. తమన్.. మనం ఇలాగే కంటిన్యూ అవ్వాలి. నవీన్, రవి, మోహన్గార్లు సైలెంట్‌గా ఉన్నా వెటకారం ఎక్కువ. వీరితో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను రెడీ. అంతమంచి ప్రొడక్షన్ హౌస్ ఇది. ఇలియానా.. ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నా.. షీ ఈజ్ డార్లింగ్. మనం మళ్లీ పని చేస్తాం. శ్రీను వైట్ల కామెడీ, సెన్సాఫ్ హ్యూమర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎప్పుడూ సూపర్‌గానే ఉంటుంది. తను గొప్ప నటుడు. అతను చేసి చూపించినదాంట్లో మనం 50 శాతం చేస్తే చాలు విపరీతమైన పేరొస్తుంది. ఈ సినిమాలోని అందరి పాత్రల్లో శ్రీను కనిపిస్తారు.. ఇలియానాలో కూడా (నవ్వుతూ)’’ అన్నారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘అమర్ అక్బర్ ఆంటొని’ కథని నేను, వంశీ రెండు నెలలు వర్కవుట్ చేసి, ఓ షేప్‌కి తీసుకొచ్చాం. ఆ తర్వాత ప్రవీణ్, మరో అబ్బాయి ప్రవీణ్ జాయిన్ అయ్యి రచనా సహకారం అందించారు. మేం నలుగురం 8 నెలలు కష్టపడి స్క్రిప్ట్ పూర్తి చేశాం. ఈ సినిమా స్క్రిప్ట్ మేకింగ్‌ని చాలా ఎంజాయ్ చేశాం. ఈ ప్రయాణం బాగుంది. ప్రయాణం బాగున్నప్పుడు ఫలితం కూడా అద్భుతంగా ఉంటుందని నేను నమ్ముతాను. ఈ సినిమాని మీరు ఆశీర్వదిస్తారు, పెద్ద హిట్ చేస్తారని 100 శాతం నాకు నమ్మకం ఉంది. రవితేజ నా ట్రబుల్ షూటర్. నేనెప్పుడైనా డల్‌గా ఉన్నప్పుడు ఎనర్జీ ఇచ్చి మళ్లీ పైకి తీసుకొస్తుంటాడు. అలా ‘వెంకీ’ అప్పుడు, ‘దుబాయ్ శీను’ అప్పుడు చేశాడు.. ఇప్పుడు ‘అమర్ అక్బర్ ఆంటొని’కి చేశాడు. తనకి నామీద ఉన్న నమ్మకానికి నేనెప్పుడూ థ్యాంక్ఫుల్గానే ఉంటాను. థ్యాంక్యూ రవి. తను ఇచ్చిన ఎనర్జీయే ఈ సినిమా. మేం రాసుకున్న కథని అలాగే తీయగలిగాం. దానికి కారణం నిర్మాతలు. నేను చేసిన సినిమాల్లో చాలా లగ్జరీగా చేసిన సినిమా ఇది. రెండు షెడ్యూల్స్ అమెరికాలో చేసినా నిర్మాతలు నాకు బాగా సహకరించినందుకు చాలా థ్యాంక్స్. వెంకట్ సి.దిలీప్ మంచి విజువల్స్ ఇచ్చాడు. తమన్ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. ఇలియానాతో ఎప్పటి నుంచో పని చేయాలనుకుంటున్నా.. ఇప్పటికి కుదిరింది. నేను ఫోన్ చేయగానే నటించేందుకు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. తన డెడికేషన్ ప్రత్యక్షంగా చూశాను. మంచి నటి. తనతో నేను కూడా మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలి. కష్టపడి డబ్బింగ్ చెప్పినందుకు థ్యాంక్స్’’ అన్నారు. ఇలియానా మాట్లాడుతూ– ‘‘మిమ్మల్ని (ప్రేక్షకులు) చాలా మిస్ అయ్యాను.. మళ్లీ వెనక్కి వచ్చాను.. చాలా సంతోషంగా ఉంది.. లవ్ యూ. ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రంలో తొలిసారి డబ్బింగ్ చెప్పాను. మీకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. నన్ను నమ్మినందుకు శ్రీనుగారికి థ్యాంక్స్. రవిగారితో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. తను రియల్లీ గుడ్ ఫ్రెండ్. తనతో చాలా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా. తమన్ చక్కని పాటలు ఇచ్చారు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘రవితేజగారి అభిమానులకు హాయ్. మీరిచ్చే కిక్కే వేరు. 100 సినిమాలు ఎలా చేశానని నాకే తెలీదు. ఇదంతా రవితేజగారు ఇచ్చిన కిక్కే. ఆయన ఇచ్చే ఎనర్జీ నా బండికి పెట్రోల్‌లాగా నడిపిస్తూ ఉంటుంది. ‘పవర్’ సినిమా ఆడియోలో చెప్పాను. ఆయనకు ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ అయితే.. నాకు అమ్మా నాన్న రవితేజ. అందులో నిజం ఉంది. మ్యూజిక్ చేయడానికి నాకు ధైర్యం రాలేదు. ‘నువ్వు చేయగలవు.. చేస్తావు’ అంటూ ఆయన ఇచ్చిన కిక్, ధైర్యం, నమ్మకం, బలంవల్లే 100 సినిమాలు చేయగలిగాను. రవితేజగారితో 9 సినిమాలు చేశాను.. ఏ హీరోతోనూ చేయలేదు. శ్రీను వైట్లగారితోనూ 5 సినిమాలు చేశాను. ఈ రోజుకి కూడా ‘దూకుడు’ పాటలు వింటుంటే నేనేనా కంపోజ్ చేసింది అనిపిస్తుంది. అంత ఈజీగా ఆయన నా వద్ద నుంచి ట్యూన్స్ రాబట్టుకున్నారు. మనకు నచ్చిన హీరో, డైరెక్టర్‌తో ఎక్కువ సినిమాలు చేసే అవకాశం రావడంకంటే అదృష్టం ఏం ఉంటుంది. రవితేజని మాస్ మహారాజా అని పిలవను. ఆయన మనసే మహారాజ’’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో ఈ సినిమా చేసినందుకు రవితేజ, శ్రీను వైట్లగార్లకు థ్యాంక్స్. తమన్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మళ్లీ ఆయనతో పని చేయాలనుకుంటున్నాం. శ్రీను వైట్లగారి గత సినిమాల్లో ఉన్నట్లు చాలామంది కమెడియన్స్ ఇందులో ఉన్నారు. టోటల్ ఎంటర్టైనర్ ఇది. శ్రీను వైట్లగారు దర్శకునిగానే కాదు.. మా నిర్మాతల రోల్ కూడా తీసుకున్నారు. ఓ మూవీ బడ్జెట్ కంట్రోల్ డైరెక్టర్ చేతిలో ఉంటుందని వంద శాతం నిరూపించారు’’ అన్నారు. చిత్రనిర్మాతలు వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి, నిర్మాతలు అనీల్ సుంకర, కిరణ్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్, నటులు గౌతంరాజు, గిరి, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, విశ్వ, పారిశ్రామికవేత్త రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. -
ముగింపు రాసుకున్న తరువాతే.. టీజర్ అదుర్స్!
వరుసగా ఫెయిల్యూర్స్‌లో ఉన్న హీరో, డైరెక్టర్ కలిసి సినిమా చేస్తున్నారంటే అది వారిద్దరికీ పరీక్షే. టాలీవుడ్లో వరుసగా పరాజయాలను చవిచూస్తున్న రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కలిసి ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్‌ను చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో మంచి హిట్లు వచ్చాయి. అయితే మళ్లీ ‘అమర్ అక్బర్ ఆంటొని’ తో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్స్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ముగింపు రాసుకున్న తరువాతే కథ మొదలుపెట్టాలి అని విలన్ చెప్పే మాటలు.. మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉండే బలం.. అంటూ రవితేజ చెప్పిన డైలాగ్‌లు టీజర్‌కు హైలెట్. ఇలియానా అందాలు కూడా మరో ఆకర్షణ అయ్యేలా ఉన్నాయి. ఈ టీజర్ అంచనాలను పెంచేలా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 16న విడుదల కానుంది. Here it is! #AAATeaser @SreenuVaitla @MythriOfficial @MusicThaman @Ileana_Officialhttps://t.co/W04MEvfJVz — Ravi Teja (@RaviTeja_offl) October 29, 2018 -
అమర్ అక్బర్ ఆంటోని పైవోట్
-
అమర్ అక్బర్ ఆంటోని కాన్సెప్ట్ టీజర్
శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రోజు దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు ఓ గిఫ్ట్ ఇచ్చారు. పివోట్ టీజర్ పేరిట ‘అమర్ అక్బర్ ఆంటోని’కి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో రవితేజ ఈ చిత్రంలో చేస్తున్న మూడు క్యారెక్టర్లను పరిచయం చేశారు. అమర్ కాషాయ రంగు దుస్తుల్లో దిగాలుగా ఓ మూలకు కూర్చుని చూస్తుంటే, అక్బర్ భవనంలో నుంచి బైనాక్యులర్‌తో చూస్తూ కన్పించారు. ఆంటోనీ స్టైల్‌గా జీన్స్ టీషర్ట్ వేసుకుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా చూపించారు. టైటిల్‌ని బట్టి చూస్తే ఈ చిత్రంలో రవితేజ హిందువు, ముస్లిం, క్రిస్టియన్‌గా మూడు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. -
మూడు ముక్కలాట?
అమర్.. అక్బర్.. ఆంటొని.. ఒక్కరా? ముగ్గురా? అన్నదానిపై చిన్న క్లారిటీ ఇచ్చింది ‘అఅఆ’ చిత్ర బృందం. అమర్ అక్బర్ ఆంటొని ముగ్గురు అంటూ క్లారిటీ ఇచ్చారు. మూడు పేక ముక్కల మీద ముగ్గురి స్టిల్స్‌తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సో.. ముగ్గురు హీరోలు కాబట్టి మూడు ముక్కలాటలా ఉంటుందా? థియేటర్స్‌లోనే తెలుస్తుంది. ‘వెంకీ, దుబాయ్ శీను’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఇలియానా కథానాయిక. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఎగై్జటెడ్ ఉన్నాను’’ అని రవితేజ పేర్కొన్నారు. ‘‘రవితేజ కెరీర్లో భిన్నంగా కనిపించడంతో పాటు నటిస్తున్న చిత్రం ఇది. మూడు భిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌తో ఆల్మోస్ట్ టాకీ పార్ట్ పూర్తవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
అఅఆ ఎప్పుడు వస్తారు?
అమెరికాలో నెల రోజులపాటు ఫుల్ స్పీడ్‌లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ షూటింగ్లో రవితేజ బిజీగా ఉన్నారని తెలుసు. మరి అక్కడ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసి ఇండియా తిరిగెప్పుడొస్తారు? సరిగ్గా తెలియదు కదా. మేం చెప్తాం. దాదాపు పదేళ్ల తర్వాత శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతుంది. నెలరోజుల పాటు జరగనున్న ఈ చిత్రీకరణ సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో కంప్లీట్ కానుంది. సెప్టెంబర్ 5న ఇండియా తిరిగిరానున్నారు చిత్రబృందం. ఈ అమెరికా షెడ్యూల్‌తో ఒక్క పాట మినహా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ మిగిలిన ఒక్క సాంగ్‌ను హైదరాబాద్‌లో షూట్ చేయనున్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్ -
అఅఆ... ఆగస్ట్‌లో అమెరికా
మాస్‌తో పెట్టుకుంటే మడతడిపోద్ది... అమర్ ఇక్కడ.. ఊహూ.. అక్బర్ ఇక్కడ. కాదు.. కాదు.. ఆంటోని ఇక్కడ. ఇంతకీ ఈ ముగ్గురూ ముగ్గురా? లేక ఒకే వ్యక్తిలో ఉండే మూడు క్యారెక్టర్లా? రవితేజ ఇక్కడ. ఆన్సర్ సెప్టెంబర్‌లో చెబుతారట. ‘వెంకీ, దుబాయ్ శీను’ వంటి హిట్స్ ఇచ్చిన రవితేజ–శ్రీను వైట్ల మరో మమ్మాస్ మూవీ ఇచ్చే పనిలో ఉన్నారు. టైటిల్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. దాదాపు పదేళ్ల తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ ఆమెరికాలో నెలరోజుల పాటు సాగనుందని సమాచారం. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి సెప్టెంబర్ మొదటివారం వరకు చిత్రబృందం అక్కడే ఉండనున్నారు. ఆల్రెడీ మార్చిలో ఓ 40 రోజుల పాటు అమెరికా షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి జరిపే అమెరికా షెడ్యూల్‌తో ఒక్క సాంగ్ షూటింగ్ మినహా సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సునీల్, శ్రీనివాస రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్ వంటి యాక్టర్స్‌తో రవితేజ చేసే హిలేరియస్ కామెడీని దర్శకుడు శ్రీనువైట్ల ఆడియన్స్‌కు అందించనున్నారని టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
చిందేస్తే.. మస్తే మస్తే
డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే.. అదిరిపోద్ది థియేటర్ రవితేజ వేస్తే స్టెప్పులే. మరి.. ఇలాంటి స్టెప్పులకు ఇలియానా కూడా కాలు కదిపితే సాంగ్ అదుర్స్ కదూ. ప్రజెంట్ ఇలాంటి దుమ్ము రేపే సాంగ్‌నే షూట్ చేస్తున్నారు. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై వై. రవిశంకర్, చెరుకూరి మోహన్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇలియానా కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేక సెట్లో రవితేజ, ఇలియానాలపై చిత్రీకరిస్తున్న పాట షూటింగ్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఫుల్ ఎనర్జీతో రవితేజ వేసిన ఈ స్టెప్పులకు ఫ్యాన్స్ మస్తే మస్తే అన్నమాట. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను యూఎస్‌లో ప్లాన్ చేస్తున్నారు. పదేళ్ల తర్వాత రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇలియానా ఈ సినిమాతోనే సౌత్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. సునీల్, లయ, అభిమన్యు సింగ్, తరుణ్ అరోరా, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాసరెడ్డి నటిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. -
తలచినదే జరిగినదా...
‘రవితేజతో కలిసి మళ్లీ ఓ సినిమా చేయాలని ఉంది’ అని తాము నటించిన ‘కిక్’ సినిమా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ఇలియానా పేర్కొన్నారు. సరదాగా అన్నారో.. ఆమె సంకల్ప బలానికి ఉన్న పవరో చెప్పలేం కానీ ఇలియానా తలచినదే జరిగింది. రవితేజ, ఇలియానా కలిసి నాలుగోసారి యాక్ట్ చేయబోతున్నారు. సోమవారం ‘సాక్షి’లో ‘‘రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ ప్లేస్‌లో ఇలియానాను తీసుకోనున్నారని సమాచారం’’ అని ప్రచురించిన వార్త నిజమైంది. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాలో హీరోయిన్గా అనూ ఇమ్మాన్యుయేల్‌ని అనుకున్నారు. డేట్స్ క్లాష్ రావడంతో ఆ ప్లేస్‌లోకి ఇలియానా వచ్చారు. విశేషం ఏంటంటే 2012లో రవితేజతో కలసి చేసిన ‘దేవుడు చేసిన మనుషులు’ తెలుగులో ఇలియానా లాస్ట్ సినిమా. ఆరేళ్ల తర్వాత మళ్లీ రవితేజ సినిమాతోనే రీ–ఎంట్రీ ఇవ్వనున్నారీ గోవా బ్యూటీ. -
ఖతర్నాక్ జోడీ
గోవా బ్యూటీ ఇలియానా– రవితేజ తొలిసారి ‘ఖతర్నాక్’ సినిమాలో జోడీ కట్టారు. ఆ తర్వాత వీరిద్దరూ ‘కిక్, దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు. మూడు సార్లు జోడీ కట్టిన రవితేజ–ఇలియానా నాలుగోసారీ కలసి నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత తెలుగులో మరో సినిమా చేయని ఇలియానా బాలీవుడ్ చిత్రాలతో బిజీ అయ్యారు. అయితే.. తనకు స్టార్ డమ్ తీసుకొచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఇలియానా ఓ సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా తెరకెక్కుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్‌ని కథానాయికగా తీసుకున్నారు. అయితే.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి అనూ తప్పుకున్నారు. దీంతో చిత్రవర్గాలు ఇలియానాని సంప్రదించాయట. కథ నచ్చడంతో పాటు రవితేజతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా నటించేందుకు ఈ గోవా బ్యూటీ ఒప్పుకున్నారట. -
బిజీ అవుతున్న మాస్ మహారాజ్
మాస్ మహారాజ రవితేజ తిరిగి తన పాత బిజీ షెడ్యూల్లోకి వెళుతున్నాడు. బెంగాల్ టైగర్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రవితేజ రాజా ది గ్రేట్‌తో సత్తా చాటాడు. కానీ మరోసారి టచ్ చేసి చూడు సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే టచ్ చేసి చూడు ప్రభావం రవితేజ కెరీర్ మీద పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం రవితేజ వరుస ప్రాజెక్టులతో జిజీగా ఉన్నాడు. ఇప్పటికే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేల టిక్కెట్టు షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. త్వరలో అమర్ అక్బర్ ఆంటోని షూటింగ్లో పాల్గొననున్నాడు. ఈ సినిమా ఎటువంటి బ్రేక్ లేకుండా ఒకే షెడ్యూల్లో పూర్తి చేసుకోబోతోంది. ఈ సినిమా తరువాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన తేరికి రీమేక్. కథనం పరంగా కొన్ని మార్పు చేర్పులు చేయబోతున్నారు. శ్రీను వైట్ల సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా తన రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే అవకాశం ఉంది. ఇలా వరుస సినిమాలు కమిట్ అవుతున్న రవితేజ వచ్చే ఏడాదిలో కూడా వరుస సినిమాలతో సందడి చేయనున్నాడు. -
జెన్నిఫర్ లోపెజ్ ఇంట్లో...
సాంగ్స్, ఫైట్స్, రొమాన్స్, లొకేషన్స్ అదిరిపోవద్దూ... పదేళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్లో మూవీ సెట్ అయితే. అలాగే అదరగొడుతున్నారు దర్శకుడు శ్రీనువైట్ల. ‘నీకోసం, వెంకీ, దుబాయ్ శీను’ తర్వాత రవితేజ హీరోగా తాను తెరకెక్కిస్తోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా కోసం హాలీవుడ్ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఇంటిని ఒక లొకేషన్‌గా సెలక్ట్ చేశారాయన. అమెరికాలో ఉన్న లోపెజ్ మ్యాన్షన్ పరిసర ప్రాంతాల్లో మంచు బాగా కురుస్తోందట. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 1న స్టారై్టంది. ఎక్కువ శాతం అమెరికాలోనే షూటింగ్ జరుపనున్నారు. ‘‘జెన్నిఫర్ లోపెజ్ మ్యాన్షన్‌లో సినిమా షూటింగ్ జరుపుతుండటం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఆమెకు వీరాభిమానిని. ఈ ప్లేస్‌లో షూటింగ్ చేయడానికి సహకరించిన మిత్రులకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు శ్రీను వైట్ల. ప్రస్తుతం ఈ మ్యాన్షన్‌లో జెన్నిఫర్ లోపెజ్ ఉండటం లేదు. ఆ సంగతలా ఉంచితే... మంచు కురిసే వేళలో రీల్‌పై నాయకా నాయికలు రవితేజ, అనూ ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్‌పై ఎలా ఉంటుందో చూడాలంటే వెయిట్ అండ్ సీ. రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, రవితేజ తనయుడు మహాధన్, అలనాటి హీరోయిన్ లయ, ఆమె తనయ శ్లోక ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
పాప్ స్టార్ నివాసంలో రవితేజ, శ్రీనువైట్ల
-
పాప్ స్టార్ నివాసంలో రవితేజ, శ్రీనువైట్ల
కొంతకాలంగా సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల ప్రస్తుతం రవితేజ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు అమర్ అక్బర్ ఆంటోని అనే పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ అమెరికాలోని పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్‌కు చెందిన నివాసంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీనువైట్ల చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘ఆమెకు వీరాభిమానిని. లక్షల మంది అభిమాన పాప్ గాయని. పాప్ రాణి. ప్రస్తుతం ఆమె నివాసంలో షూటింగ్ చేస్తున్నాం. కల నిజమైంది’ అంటూ ట్వీట్ చేశారు శ్రీనువైట్ల. గతంలో రవితేజ హీరోగా శ్రీనువైట్ల తెరకెక్కిన వెంకీ, దుబాయ్ శీను సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో అమర్ అక్బర్ ఆంటోనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేవలం జెన్నీపర్ లోపేజ్ విల్లాలో జరిగే చిత్రీకరణ కోసం భారీ మొత్తాన్ని కేటాయించారన్న ప్రచారం జరుగుతోంది. రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ కథానాయికగా నటిస్తోంది. Been her craziest fan throughout my life..the heartthrob of millions ..the evergreen queen of pop ..and here I am Shooting right in her palatial mansion in Long Island .Dreams do come true ! My biggest fan moment @jlo #AAA pic.twitter.com/PyGrnyVwR4 — Sreenu Vaitla (@SreenuVaitla) 2 April 2018 -
రూటు మార్చిన భీమవరం బుల్లోడు
తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది హాస్య నటులు వచ్చారు. నవ్వుల పువ్వులు పూయించారు. కమెడియన్‌గా వచ్చి హీరోలుగా మారారు కొందరు. కమెడియన్స్ అంటే హీరోలకి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు మరికొందరు. ఈ ప్రవాహంలో ఎంతో మంది తట్టుకుని నిలబడ్డారు. కొంతమందికి కలసిరాలేదు. బ్రహ్మానందం లాంటి హాస్యనటుడికి ప్రత్యామ్నాయాన్ని ఎవరైనా చూపగలరా? అన్న ప్రశ్నకు నటుడు సునీల్ ఒక జవాబులా కనిపించాడు. అతి కొద్ది కాలంలోనే విలక్షణ నటనతో, టైమింగ్‌తో, హావభావాలతో ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టించాడు. కొన్ని పాత్రలు సునీల్ మాత్రమే చేయగలడు అనే స్థాయి నుంచి కేవలం సునీల్ కోసమే కొన్ని పాత్రలు ప్రాణం పోసుకున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తనకు ఎంతో పేరు తెచ్చిన హాస్యాన్ని వదిలి హీరోగా ట్రై చేశాడు. మొదట్లో రెండు హిట్లు పడినా, తరువాత సరైన విజయాలు లేక, సమయం కలిసిరాక రేసులో వెనకబడ్డాడు. తిరిగి మళ్లీ ఎలాగైనా ఫాంలోకి రావాలనే ఉద్దేశంతో తనకు జీవితాన్నిచ్చిన హాస్యప్రధానమైన (కమెడియన్) పాత్రల్లో నటించాలని అనుకుంటున్నట్లు సమాచారం. తన ప్రాణ స్నేహితుడైన త్రివిక్రమ్- ఎన్టీఆర్, శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రాల్లో సునీల్ కమెడియన్‌గా కనిపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రాలతో మళ్లీ తన దశను మార్చుకోవాలనుకుంటున్న సునీల్‌కు ఎలాంటి ప్రతిఫలం వస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం అల్లరి నరేశ్ సుడిగాడు2 సినిమాలో సునీల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. -
నిర్మాణ రంగంలోకి స్టార్ డైరెక్టర్..?
స్టార్ హీరోలతో వరుస సక్సెస్‌లు సాధించిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల. ప్రస్తుతం కెరీర్లో బ్యాడ్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్న ఈ కామెడీ స్పెషలిస్ట్ తన లేటెస్ట్ మూవీ మిస్టర్‌తో మరో సారి సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న మిస్టర్, దర్శకుడు శ్రీనువైట్లతో పాటు హీరో వరుణ్ తేజ్ కెరీర్‌కు కూడా కీలకం కానుంది. అయితే ఇటీవల కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీనువైట్ల భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే దర్శకత్వంతో పాటు సొంతంగా బిజినెస్ ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నాడు. వెండితెర మీద స్టార్ ఇమేజ్ ఉన్న శ్రీనువైట్ల తన తొలి వ్యాపార ప్రయత్నం మాత్రం బుల్లితెర మీద చేస్తున్నాడు. యూట్యూడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న వైవా హర్షతో ఓ కామెడీ షోను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షోకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడిగా తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిన కామెడీ జానర్నే నిర్మాతగానూ నమ్ముకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. -
మిస్టర్ ప్రేమకథ
-
మిస్టర్ ప్రేమకథ
‘‘మనం ప్రేమను వెతుక్కుంటూ వెళ్తే, ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’’ అంటున్నారు వరుణ్‌తేజ్. ఈ ‘మిస్టర్’ను ఎవరి ప్రేమ వెతుక్కుంటూ వచ్చిందో చెప్పమంటే ఏప్రిల్ వరకూ ఎదురు చూడమంటున్నారు. వరుణ్‌తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధులు నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్’. లావణ్యా త్రిపాఠీ, హెబ్బా పటేల్ హీరోయిన్లు. కొత్త ఏడాది కానుకగా వరుణ్‌తేజ్ ఫస్ట్ లుక్, సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘‘వరుణ్‌తేజ్ స్థాయి పెంచే చిత్రమిది. 80 శాతం సినిమా పూర్తయింది. రెండు పాటలు, క్లైమాక్స్ చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్ 14న చిత్రాన్ని రిలీజ్ చేయాలనేది ప్లాన్’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ ఇది. ఎమోషన్స్, విజువల్స్, మ్యూజిక్‌లకు స్కోప్ ఉన్న కథ. స్పెయిన్, స్విట్జర్లాండ్, ఇండియా లోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్ చేశాం’’ అని శ్రీను వైట్ల అన్నారు. ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమేరా: కేవీ గుహన్, సై్టలింగ్: రూపా వైట్ల. -
శ్రీను వైట్లకు హీరో దొరికాడు..!
ఆగడు, బ్రూస్ లీ సినిమాల ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డ శ్రీను వైట్ల ప్రస్తుతం తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. స్టార్ హీరోలతో సినిమా చేయడానికి ప్రయత్నించినా ఇప్పట్లో ఎవరూ డేట్స్ ఇచ్చే ఛాన్స్ కనిపించకపోవటంతో ఇక యంగ్ హీరోల మీద దృష్టి పెట్టాడు. తన మార్క్ కామెడీ సబ్జెక్ట్‌తో తిరిగి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇన్నాళ్లు రామ్‌తో సినిమా చేయడానికి వెయిట్ చేసిన శ్రీను వైట్ల, రామ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో మరో హీరో కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. లోఫర్ సినిమా తరువాత ఇంత వరకు సినిమా స్టార్ట్ చేయని వరుణ్ తేజ్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శ్రీను వైట్ల చెప్పిన కథ నాగబాబు, వరుణ్‌లకు నచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. మరి వరుణ్‌తో అయినా శ్రీను వైట్ల సినిమా పట్టాలెక్కుతుందేమో చూడాలి. -
బ్రూస్లీ చెప్పిందే నాకు స్ఫూర్తి!
‘‘ ‘బ్రూస్లీ’ అవుట్‌పుట్ విషయంలో నేను ఫుల్ హ్యాపీ’’ అంటున్నారు శ్రీను వైట్ల. ఓ కసితో, ఓ దీక్షతో చాలా తక్కువ టైమ్‌లో ఇంత క్వాలిటీ ప్రొడక్ట్ తీసుకురావడమంటే మాటలు కాదు. ‘‘చిరంజీవి గారు, రామ్‌చరణ్ ఇచ్చిన సపోర్ట్‌తోనే ఎలాంటి ప్రెజర్ లేకుండా పనిచేయగలిగా’’ అన్నారు శ్రీను వైట్ల. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘బ్రూస్లీ’ గురించి, తన కెరీర్ గురించి శ్రీను వైట్ల చాలా విషయాలు చెప్పారు. రామ్‌చరణ్‌ని ఫైటర్‌గా చూపించాలని ఎందుకనిపించింది? హీరోకి ఏదో ఒక ప్రొఫెషన్ పెట్టాలి. చరణ్ ఫిజిక్‌కి తగ్గట్టు ఫైటర్ అయితే కొత్తగా ఉంటుందనిపించింది. అందరూ అదే ఫీలయ్యారు. ‘బ్రూస్లీ’ టైటిల్ ఎందుకు పెట్టినట్టు? ఇందులో చరణ్ పాత్ర పేరు కార్తీక్. బ్రూస్లీకి వీరభక్తుడు. అందరూ బ్రూస్లీ అనే నిక్‌నేమ్‌తో పిలుస్తారు. అందుకే టైటిల్ అదే పెట్టేశాం. ఇందులో చిరంజీవి పాత్రకు తొలుత పవన్‌కల్యాణ్‌ని అనుకున్నారట? ఆ సీన్ అనుకోగానే మొదట మేం అనుకున్నది చిరంజీవి గారినే. అదృష్టవశాత్తూ మేం అడగ్గానే ఆయన కూడా ఓకే అన్నారు. చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత షూటింగ్లో పాల్గొన్నారు. ఆయనను ఎలా చూపించాలనే విషయంలో ఒత్తిడి ఫీలయ్యారా? చిరంజీవి గారితో ముందే బాగా డిస్కస్ చేసి మరీ వెళ్లాం కాబట్టి నో ప్రెజర్. ఆయన కనబడే అయిదు నిమిషాలూ అద్భుతంగా ఉండాలని మేం బోలెడన్ని కసరత్తులు చేశాం. నిజంగానే ఆయన ఆ ఐదు నిమిషాల ఎపిసోడ్‌తో సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. చిరంజీవిగారు కేవలం ఓ యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే చేశారా? స్పెషల్ సాంగ్ కూడానా? లేదండీ. ఒక డైలాగ్, యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే ఉన్నాయి. పాట పెడదామని అత్యాశతో ప్రయత్నించాను గానీ కుదర్లేదు(నవ్వుతూ).ఈ సినిమాలో ఆరో పాటకు బదులు చిరంజీవిగారి ఎంట్రీ ఉంటుంది. అంతకు మించి నేనేం చెప్పలేను. చిరంజీవిగారి 150వ చిత్రాన్ని డెరైక్ట్ చేసే అవకాశం వస్తే చేస్తారా? తప్పకుండా. అది చాలా గొప్ప విషయం. ఆయనను మళ్లీ డెరైక్ట్ చేయాలని ఉంది. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాను. చిరంజీవిగారితో ‘అందరివాడు’, రామ్‌చరణ్‌తో ‘బ్రూస్లీ’ చేశారు. వీళ్లిద్దరి మధ్య మీరు గమనించిన సిమిలారిటీస్? చిరంజీవిగారిలో కనిపించే బ్యాలెన్సెడ్ నేచర్, వర్క్ అంటే డెడికేషన్, కమిట్మెంట్ రామ్‌చరణ్ పుణికి పుచ్చుకున్నాడు. చిరంజీవిగారిది సెపరేట్ కామెడీ టైమింగ్. మరి చరణ్ కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? ఎవరి దగ్గరైతే సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుందో వాళ్లందరూ నాకు బాగా కనెక్ట్ అవుతారు. రామ్‌చరణ్‌లో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. అందుకే చాలా ఈజీగా మా ఇద్దరి మధ్య మంచి ర్యాపో కుదిరింది. అది ఇప్పటి వరకూ ఆయన నటించిన సినిమాల్లో సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదని నా ఫీలింగ్. మీరు-కోన వెంకట్-గోపీమోహన్ మంచి టీమ్. ‘బాద్షా’ తర్వాత కోన వెంకట్‌తో ఇక పని చేయరని వార్తలొచ్చాయి. ‘బ్రూస్లీ’ కోసం చరణ్ మిమ్మల్ని కలిపారని టాక్. నిజమేనా? 2003 నుంచి మేం ట్రావెల్ అవుతున్నాం. క్లాషెస్ అనేవి కామన్. అలాగని శత్రుత్వం పెంచుకుని పనిచేయడం మానేయలేం కదా... నాకూ కోనతో పనిచేయాలని ఉంది. వాళ్లకూ అదే ఫీలింగ్. రామ్‌చరణ్ ఓ స్టెప్ ముందుకేసి మా కాంబినేషన్ మళ్లీ సెట్ చేశాడు. అయినా గతం గతః. ఇప్పుడు మా మధ్య ఎలాంటిస్పర్థలూ లేవు. అందరం ఫుల్ హ్యాపీ. మీకంటూ ఓ సెపరేట్ కామెడీ ట్రెండ్ సృష్టించారు. ‘బ్రూస్లీ’ కూడా ఆ తరహాలోనే ఉంటుందా? కథ చెప్పడంలో రెండు పద్ధతులు ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ కోసం కథ రాసుకోవడం ఓ పద్ధతి. కథను ఎంటర్టైనింగ్గా చెప్పడం ఓ స్టయిల్. నేను ఆ రె ండు పద్ధతుల్లో సినిమా తీసి విజయం సాధించాను. కానీ కథను ఎంటర్టైనింగ్గా చెప్పడంలో కిక్ ఉంది. ఎంటర్టైనింగ్గా కథను చెప్పడానికి చేసిన మరో ప్రయత్నమే బ్రూస్లీ.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందించాం. మీ గత సినిమాల్లోలాగా ఎవరి మీదైనా పేరడీ ఉంటుందా? అసలు అలాంటి సన్నివేశాలేవీ ఇందులో ఉండవు. అందరికీ నచ్చేలా ఈ సినిమా రూపొందించాం. సెపరేట్ కామెడీ ట్రాక్ ఉండదు. కథతో పాటు హాస్యం మిళితమై ఉంటుంది. ‘ఢీ’ సినిమా నుంచి ఓ ఫార్మాట్ క్రియేట్ చేశాను. కానీ ఆ ఫార్మాట్ అందరికీ బోర్ కొట్టేసింది. నాతో పాటు చాలా మంది అదే ఫార్మాట్ ఫాలో అయ్యారు. నా మీద చాలా మందికి కోపం కూడా వచ్చింది. అందుకే ఈసారి నా పంథా మార్చాను. కానీ నా మార్క్ కామెడీ మాత్రం మిస్ కాదు. ఓ మంచి హిట్ సాధించి తీరాలన్న కసితో ఇంత పెద్ద సినిమాను అయిదు నెలల్లో కంప్లీట్ చేసినట్టున్నారు? ఒకటైతే నిజం. కొంత కాలం డిస్టర్బ్ అయ్యాను. నా మీద విమర్శలను కూడా ప్రేమగా తీసుకుని మళ్లీ వర్క్ చేయడం మొదలు పెట్టాను. ఇంత షార్ట్ స్పాన్‌లో ఇంత క ంటెంట్ ఉన్న సినిమా తీయడానికి నా టెక్నీషియన్స్, నటీనటుల సపోర్ట్ ఎంతో ఉంది. నా అదృష్టం ఏమిటంటే నాపై ఎలాంటి ప్రెజర్ లేదు. చాలా క్లారిటీతో ప్లానింగ్ చేసుకుంటూ ఈ షూటింగ్ చేశాం. ముఖ్యంగా కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస సహకారం లేకపోతే రిలీజ్ డేట్ కచ్చితంగా మార్చాల్సి వచ్చేది. ‘ఆగడు’ టైమ్‌లో మీకూ ప్రకాశ్‌రాజ్‌కీ మధ్య మాటల యుద్ధం జరిగింది కదా. మళ్లీ కలిసి పని చేస్తారా? ఎందుకు చేయను? సినిమా అనేది క్రియేటివ్ జాబ్. కథకు ఏం కావాలో ఒక దర్శకునికి ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతో మనం చెప్పింది ఒక్కోసారి కొంత మంది ఆర్టిస్ట్‌లకు నచ్చకపోవచ్చు. ఆ సమయంలో క్లాషెస్ సహజం. ప్రకాశ్ బ్రిలియంట్ యాక్టర్. ఆయనతో తప్పకుండా పని చేస్తాను. ‘ఆగడు’ సినిమా పరాజయాన్ని ఎప్పుడైనా విశ్లేషించుకున్నారా? కచ్చితంగా. గెలిచినప్పుడు కంటే ఓడినప్పుడే ఎక్కువ అనుభవాలు ఎదురవుతాయి. ఆ టైమ్‌లో మూడు రోజులు ఇంట్లోనే ఉండిపోయాను. నాలుగో రోజు నుంచి మళ్లీ మామూలైపోయి ‘బ్రూస్లీ’ కథ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. కెరీర్లో ఇబ్బందుల్ని ఎలా ఫేస్ చేయగలిగారు? ‘‘సాఫీగా సాగిపోయే జీవితం గురించి ప్రార్థించకు. ఎలాంటి కష్టాన్నయినా ఎదుర్కొనే బలం కోసం ప్రార్థించు’’ అని ‘బ్రూస్లీ’ చెప్పిన క్యాప్షన్‌ను ఈ సినిమాలో ఉపయోగించాం. దాన్నే నేనూ స్ఫూర్తిగా తీసుకున్నా. కష్టాలకు ఎదురెళ్లి పోరాడటమే కదా జీవితం. మీ సినిమాల్లో హీరోయిన్లకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి కారణం? ఇది హీరో సెంట్రిక్ ఫీల్డ్ కాబట్టి హీరోయిన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేం. లవ్‌స్టోరీ అయితే హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. మహేశ్‌బాబుతో మీ రిలేషన్ ఎలా ఉంది? మహేశ్ చాలా మంచి వ్యక్తి. తన గురించి మీకో ఎగ్జాంపుల్ చెబుతా. ‘ఆగడు’ విడుదలైన 5 రోజులకు నా పుట్టినరోజు వచ్చింది. మహేశ్‌బాబు మాత్రం నా పుట్టినరోజును చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇప్పటికీ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. వీలు చిక్కితే కలుస్తాం. మా బంధం జయాపజయాలకు అతీతం. ఇంతకు మించి నేనేం చెప్పలేను. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్? ప్రస్తుతం కథలు తయారు చేసే పనిలో ఉన్నాను. ఇంకా ఎవరితో అనేది అనుకోలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రకటిస్తా. ఈ మధ్య కాలంలో చాలామంది దర్శకులు సోషియో ఫ్యాంటసీ, హిస్టారికల్ మూవీస్ తీస్తున్నారు. మీక్కూడా అలాంటి ఆలోచనేమైనా ఉందా? ఆ ఆలోచనైతే ఉంది. ఎప్పుడు అనేది చెప్పలేను. దాని కోసం కొంత టైమ్ తీసుకుని రీసెర్చ్ చేయాలి. కచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు చేస్తాను. అలాగే బాలీవుడ్లో మసాన్, పీకూ, పీకే... లాంటి డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలొస్తున్నాయి. నాక్కూడా హ్యూమన్ ఎమోషన్స్‌కు అద్దం పట్టే అలాంటి సినిమాలు తీయాలని ఉంది. కచ్చితంగా తీస్తా. అన్నీ కుదిరితే త్వరలో మంచి ప్రేమ కథ చేస్తా. -
జస్ట్ ఝలక్!
రెడీ... స్టార్ట్... కెమెరా...రోలింగ్... యాక్షన్... ఈ మాటలు హీరో చిరంజీవికి కొత్త కాదు. ఇప్పటివరకూ 149 సినిమాలకు ఈ మాటలు విన్నారు. ఒక్కసారి కెమెరా ఆన్ అయ్యిందా... పరిసరాలను మర్చిపోయి పాత్రలో మమేకమవడం ఈ మెగాస్టార్ స్టైల్. అయితే, ‘మగధీర’ తరువాత ఆయన ఈ మాటలకు దూరమయ్యారు. ఆరేళ్ళ పైచిలుకు తరువాత సోమవారం చిరంజీవి తనకిష్టమైన, అలవాటైన బరిలో మరోసారి జూలు విదిలించారు. అతిథి పాత్రతో ప్రేక్షకులకు ఝలక్ ఇవ్వడానికి సోమవారం నుంచి వరుసగా మూడు రోజులు ఈ మెగాస్టార్ సెట్స్‌లో ‘మెగా’ సందడి చేస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రూస్లీ... ది ఫైటర్’లో చిరంజీవి చేస్తున్న అతిథి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొదలైంది. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి అతిథి పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ, తండ్రినీ, తనయుణ్ణీ ఒకే ఫ్రేమ్‌లో చూడడం అభిమానులకు కనులపండుగనీ నిర్మాత పేర్కొన్నారు. చిరంజీవి ఈ సినిమాలో ఒక పాటతో పాటు ఫైట్ సీక్వెన్స్‌లో కనిపిస్తారని గతంలో విస్తృతంగా ప్రచారమైంది. అయితే, ఈ చిత్రంలో కీలకమైన ఒక ఫైట్‌లో మాత్రమే చిరంజీవి తెరపై కనిపించనున్నారు. అదీ కేవలం... మూడంటే మూడు నిమిషాల వ్యవధి ఉండే పాత్ర. అయితే, చిరంజీవి హీరోగా రానున్న పూర్తిస్థాయి సినిమాకు ఇది జస్ట్ ఒక చిన్న ఝలక్. రామ్ చరణ్ సైతం, ‘‘నాన్న షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆయన మా ‘బ్రూస్లీ’లో భాగం కావడం సంతోషంగా ఉంది. హీరోగా ఆయన కమ్‌బ్యాక్ సినిమాకు ఇది జస్ట్ ఓ టీజర్’’ అని తన ఆనందాన్ని పంచుకున్నారు. రామ్‌చరణ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని, ఫైటర్ పాత్ర చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. అక్టోబర్ 2న ‘బ్రూస్లీ’ పాటల్నీ, 16న చిత్రాన్నీ విడుదల చేయాలనుకుంటున్నారు. మూడు నిమిషాల అతిథి పాత్ర అయితేనేం, అభిమానులతో పాటు ఇప్పుడు ఫిల్మ్ నగర్ అంతా చిరంజీవి గురించే మాట్లాడుకుంటున్నారు. స్లిమ్‌గా తయారై, అందరినీ ఆకట్టుకొనేలా మారిన చిరు అసలుసిసలు కమ్‌బ్యాక్ ఫిల్మ్ కోసమే ఇప్పుడు అంతా వెయింటింగ్. -
చెర్రీ డాన్సులు అదరహో!
ఐదే ఐదు నెలల్లో సినిమాని పూర్తి చేసేయాలన్నది డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ చిత్రబృందం టార్గెట్. ఎలాంటి బ్రేకూ లేకుండా షూటింగ్ చేసేయాలని ఫిక్సయ్యారు. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అక్టోబర్ 15న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో రామ్‌చరణ్ లుక్ చాలా వెరైటీగా ఉంటుందని టాక్. ఇక, చరణ్ డ్యాన్సుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పటివరకూ ఎన్నో విభిన్నమైన స్టెప్పులేశారు. ఈ చిత్రంలో చరణ్ డ్యాన్సులు అదరహో అనే స్థాయిలో ఉంటాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.. సో.. అభిమానులకు పండగే పండగ. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ, సమర్పణ: డి. పార్వతి. -
రకుల్‌తో ప్రేమ పాట!
రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ యూరప్‌లో ప్రేమ పక్షుల్లా ఆడిపాడనున్నారు. కంగారు పడకండి...! సినిమా కోసమే ఇదంతా! శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం కోసం గురువారం నుంచి వీరిద్దరిపై యూరప్‌లో పాటలు చిత్రీకరించనున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని శ్రీనుై వెట్ల అభివర్ణించారు. యూరప్‌లో పాటలు తీశాక జూన్‌లో హైదరాబాద్ షెడ్యూల్ చేస్తామని దానయ్య తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: డి. పార్వతి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై. ప్రవీణ్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ. -
పవర్ఫుల్ స్టోరీతో...
రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులు ఫలించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ షురూ అయ్యింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రం నిర్మించనున్నారు. ‘లౌక్యం’, ‘కరెంటు తీగ’.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో కథానాయికగా నటించనున్నారు. మార్చి 5న పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అదే నెల 16న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ- ‘‘ కుటుంబ కథకు యాక్ష న్ అంశాలు జోడించి ఓ పవర్ఫుల్ స్టోరీ తయారు చేశాం. అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ తారాగణంతో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. డీవీవీ దానయ్య మాట్లాడుతూ- ‘‘ఎన్నో భారీ హిట్ చిత్రాలను అందించిన శ్రీనువైట్ల- కోనవెంకట్- గోపీమోహన్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ ఈ చిత్రం రూపొందనుంది. ‘వై దిస్ కొలవరి...’ పాటతో ఎంతో పాపులార్టీ తెచ్చుకున్న అనిరుధ్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం ’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: ఎ.ఆర్.వర్మ, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఫెట్స్: అనల్ అర్స్, సమర్పణ: డి. పార్వతి, మూలకథ- స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల. -
మహేశ్ అంటే.. దర్శకులకు పండగే!
నేడు మహేశ్‌బాబు పుట్టినరోజు తెలుగుతెరపై తిరుగులేని విజయాలు అందించిన హీరో మహేశ్‌బాబు అయితే, ఎంటర్టైనింగ్ సినిమాలతో అందరినీ ఆకట్టుకొని పైసా వసూల్ సినిమాలకు చిరునామాగా మారిన దర్శకుడు శ్రీను వైట్ల. వారిద్దరి కాంబినేషన్‌కు సహజంగానే క్రేజ్. సినిమాల పరంగానే కాదు... వ్యక్తిగతంగా కూడా వారిద్దరూ అత్యంత సన్నిహితులు. ఇవాళ హీరో మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా, ఆయన కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ హిట్లలో ఒకటైన ‘దూకుడు’ దర్శకుడు శ్రీను వైట్లను ‘సాక్షి’ పలకరించింది. ప్రస్తుతం మహేశ్‌బాబును పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా ‘ఆగడు’లో చూపేందుకు సిద్ధమవుతూ, ఆ చిత్ర షూటింగ్లో యమ బిజీగా ఉన్న శ్రీను ఈ తరం సూపర్‌స్టార్ గురించి పంచుకున్న ముచ్చట్లు... ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం. మహేశ్‌బాబు నటనను నేను చాలా కాలంగా గమనిస్తూ ఉన్నా, అతనితో వ్యక్తిగతంగా నాకు పరిచయమైంది మాత్రం 2010లో ‘దూకుడు’ తీస్తున్నప్పుడే! అంతకు ముందు కొన్ని సందర్భాల్లో కలిసినా, మా మధ్య పరిచయం ఏర్పడింది ఆ సినిమా కథ చెబుతున్నప్పుడు. ఆ కథను తెరకెక్కించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మా పరిచయం అలా అలా రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. నా లక్షణాలు ఆయనకూ, ఆయన లక్షణాలూ నాకూ బాగా నచ్చడంతో మా ప్రయాణం ఎంతో స్నేహపూర్వకంగా సాగుతోంది. ఇప్పుడు ‘ఆగడు’ చేస్తున్నప్పుడు కూడా నా మీద అతను పెట్టుకొన్న నమ్మకం నేను మర్చిపోలేను. గడచిన నాలుగేళ్ళుగా, అతనితో నాది అద్భుతమైన జర్నీ. నా కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘దూకుడు’. అలాగే, మహేశ్ కెరీర్లో కూడా అది ఓ పెద్ద హిట్. మహేశ్‌లో నాకు నచ్చే అద్భుతమైన గుణం ఏమిటంటే, అతను ఏ రోజుకు ఆ రోజు మనిషిగా, నటుడిగా ఎదుగుతూనే ఉంటాడు. తనను తాను మెరుగుపరుచుకుంటూనే ఉంటాడు నేను ‘దూకుడు’ చేసిన రోజులతో పోలిస్తే ఇప్పుడు ‘ఆగడు’ చేస్తున్న నాటికి ఈ నాలుగేళ్ళలో అతను నటుడిగా మరింత పదునెక్కాడు. ఒక వ్యక్తిగా కూడా అతను సూపర్బ్ హ్యూమన్ బీయింగ్. అతను పిల్లలతో గడిపే తీరు ముచ్చటేస్తుంది. పైగా, చాలా మంది నటీనటులు మూడ్‌ను బట్టి సెట్లో వ్యవహరిస్తుంటారు, నటిస్తుంటారు. కానీ, నేను చేసిన ఈ రెండు చిత్రాల సమయంలో మహేశ్ తనకు మూడ్ బాగోలేదని అనడం నేనెప్పుడూ వినలేదు, చూడలేదు. సెట్స్ మీద ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉంటాడు. అది ఒక అద్భుతమైన వరం. నన్నడిగితే, అందుకే అతను అంత అందంగా కనిపిస్తాడు. అందమంతా ఆ నవ్వులోనే ఉంది. అసలే అందగాడు. దానికి ఈ నవ్వు తోడై, మరింత అందంగా కనిపిస్తుంటాడు. గమ్మత్తేమిటంటే, కామెడీని కూడా మహేశ్ అద్భుతంగా పలికించగలడు. ‘దూకుడు’లో అతను చాలా చక్కటి కామెడీ పలికించాడు. అయితే,‘దూకుడు’లో మహేశ్‌ను నేను కొంత వరకే చూపించగలిగాననుకుంటా. రాబోయే ‘ఆగడు’లో అతను పూర్తిగా ఓపెన్ అప్ అవడం చూస్తారు. ఇటు ఎంటర్టైన్మెంట్లో, అటు యాక్షన్ పార్ట్‌లో, ఒకటని కాదు - అన్నిట్లో అతని విశ్వరూపం చూస్తారు. మహేశ్ అభినయం మరింత బాగుండనుంది. మహేశ్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, నటుడిగా అతను ‘డెరైక్టర్స్ డిలైట్’ అని చెప్పాలి. అలాంటి నటుడితో పని చేయడం ఏ దర్శకుడికైనా పండగే! నటుడిగా దర్శకుడికి పూర్తిగా లొంగిపోతాడు. డెరైక్టర్‌ను ఎంతో గౌరవంగా చూస్తాడు. పాత్రకు తగినట్లు ఏది కావాలో అది ఇస్తాడు. చిన్న డెరైక్టరా, పెద్ద డెరైక్టరా అని చూడడు. అందరితోనూ ఒకేలా ప్రవర్తిస్తాడు. అందరినీ ఒకేలా సంబోధిస్తాడు. ఆఖరుకు తను అవకాశమిచ్చిన దర్శకుడినైనా సరే ‘సార్... సార్’ అనే పిలుస్తాడు. అలాంటి అరుదైన మనస్తత్త్వం ఉన్న హీరో అతను. దర్శకుడిగా కాక, ఒక ప్రేక్షకుడిగా చెప్పాలంటే, మహేశ్‌లో ఎమోషన్ అద్భుతంగా పలుకుతుంది. యాక్షన్ సీన్లు బాగా చేస్తాడు. కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, అతను ఒక సమగ్రమైన నటుడు. దర్శకుడిగానే కాక, వ్యక్తిగతంగా కూడా నేనివాళ మహేశ్‌కూ, అతని కుటుంబానికి ఎంతో సన్నిహితుణ్ణి కావడం నా అదృష్టంగా భావిస్తుంటాను. మా ఇద్దరి మధ్య ఇంత స్నేహం, సాన్నిహిత్యం రావడానికి కారణం - మా ఇద్దరికీ ఉన్న నిర్మొహమాటం. ఏదైనా సరే అతను చాలా ఓపెన్‌గా మాట్లాడతాడు. నేను కూడా అంతే. ఏదన్నా అనిపిస్తే చెప్పేస్తాను. దాచను. ఆ లక్షణమే మా ఇద్దరినీ దగ్గర చేసిందని అనుకుంటాను. అలాగే, మా ఇద్దరికీ ఉమ్మడిగా ఉన్న లక్షణం - సెన్సాఫ్ హ్యూమర్. నేను బాగా నవ్వుతాను, నవ్విస్తాను. అది నాకు బాగా ఇష్టం. అతను కూడా అద్భుతంగా నవ్విస్తాడు. నేను తెర మీద నవ్విస్తుంటే, అతను బయట కూడా నవ్విస్తాడు. ఎలాంటి సందర్భంలోనైనా సరే అతను నవ్వు ముఖంతోనే ఉంటాడు. సెట్లో మహేశ్ ఉంటే చాలు.. ఆ ఉత్సాహమే వేరు. సెట్లో అతను లేని వర్క్ ఏదైనా జరుగుతూ ఉంటే, ‘అరే... మహేశ్ ఉంటే బాగుండేదే’ అనిపిస్తుంటుంది. మహేశ్ మంచి చదువరి. పుస్తకాలు బాగా చదువుతుంటాడు. ప్రస్తుతం ‘ఆగడు’ చిత్రీకరణ దాదాపు చివరకు వచ్చేసింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పుడు తీరిక లేకుండా పతాక సన్నివేశాలు చేస్తున్నాం. దీని తరువాత విదేశాల్లో మరో రెండు పాటలు చిత్రీకరించనున్నాం. ఈ నెలాఖరులో పాటలు విడుదల చేస్తాం. సెప్టెంబర్‌లో సినిమా రిలీజ్. చివరిగా ఒక్క మాట! నేను మహేశ్‌బాబును ఎలా చూడాలనుకుంటున్నానో, అలా ‘ఆగడు’లో చూపించాను. సెప్టెంబర్‌లో సినిమా చూశాక, ఆ సంగతి మీరూ ఒప్పుకుంటారు. మా చిత్ర హీరో మహేశ్‌బాబుకు అభిమానులు, ‘సాక్షి’ పాఠకులందరి పక్షాన నా జన్మదిన శుభాకాంక్షలు. -
మహేష్‌కు ప్రమాదం.. 'ఆగడు' షూటింగ్‌కు బ్రేక్
వరుస విజయాలతో దూకుడుగా దూసుకెళ్లిపోతున్న మహేష్ బాబు 'ఆగడు' సినిమా షూటింగ్లో గాయపడ్డారని తెలుస్తోంది. దీంతో శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆగినట్లు సమాచారం. ప్రతి సినిమాకు వేరియేషన్లు చూపిస్తూ, డిఫరెంట్‌గా ప్రయత్నించడం మహేష్ బాబు నైజం. అందుకే తాను 1.. నేనొక్కడినే కథ వినగానే అంగీకరించినట్లు కూడా ఆయన చెప్పారు. ఆ సినిమా తర్వాత, మహేశ్ బాబు - శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న ఆగడు మూవీ బళ్లారిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంటోంది . ఇటీవల ఈ చిత్రం టైటిల్ సాంగ్ చిత్రీకరణ కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో షూటింగ్ జరుగుతుండగా మహేష్ ప్రమాదానికి గురైనట్టు తెలిసింది . ఆయన చేతికి గాయం కావడంతో షూటింగ్‌కు తాత్కిలికంగా బ్రేక్ చెప్పారు. మహేష్‌ను పరీక్షించిన వైద్యులు ఆయనకు కనీసం వారం రోజులు విశ్రాంతి ఇవ్వాలని చెప్పడంతో ఈ చిత్రం షెడ్యూల్ ను వారం రోజులు బ్రేక్ చేశారు. ఇంతకుముందు మహేష్ బాబు - శ్రీను వైట్ల కాబింనేషన్ లో వచ్చిన దూకుడు బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన విషయం తెలిసిందే. దాంతో అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ చేస్తూ ఆగడు రూపొందుతోంది. వారం రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ ఆగకుండా దూసుకెళ్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. -
హృదయం ఎక్కడున్నది...
‘‘హీరోగా నాకిది తొలి సినిమా. త్రివిక్రమ్, శ్రీను వైట్ల దగ్గర నేను దర్శకత్వ శాఖలో పనిచేశాను. వారిద్దరూ ఈ సినిమా ప్రోమోస్, సాంగ్స్,పిక్చరైజేషన్ చూసి చాలా బావుందని మెచ్చుకున్నారు’’ అని కృష్ణమాధవ్ చెప్పారు. వి.ఆనంద్ దర్శకత్వంలో కృష్ణమాధవ్, అనూష, సంస్కృతి హీరో హీరోయిన్లుగా పవన్ మంత్రిప్రగడ, సంజయ్ ముప్పనేని నిర్మించిన ‘హృదయం ఎక్కడున్నది’ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో సక్సెస్‌మీట్‌లో నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మురుగదాస్ శిష్యుడైన ఆనంద్ ఈ చిత్రాన్ని అద్భుతంగా డెరైక్ట్ చేశాడు’’ అని చెప్పారు. విశాల్ చంద్రశేఖర్ చక్కటి సంగీతం అందించారని దర్శకుడు పేర్కొన్నారు. -
ముగ్గురు స్నేహితుల సరదా
‘‘నిజానికి ‘ఆనందం’ చిత్రానికి సీక్వెల్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. అయితే శ్రీను వైట్లగారికి కుదరకపోవడంతో, నేనే దర్శకత్వం చేస్తున్నాను’’ అని జై ఆకాష్ చెప్పారు. దేవి మూవీస్, సిరి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై గణేష్ దొండి సమర్పణలో ఎస్.జె. రత్నావత్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆనందం మళ్లీ మొదలైంది’. జైఆకాష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుమన్ జూపూడి స్వరాలందించారు. ఆడియో సీడీని వేణుస్వామి ఆవిష్కరించి, బసిరెడ్డికి ఇచ్చారు. ఈ వేడుకలో ప్రసన్నకుమార్, ఖాదర్‌వల్లి, దినేష్, ఆకాష్ సతీమణి నిషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ -‘‘ముగ్గురు స్నేహితుల మధ్య సరదా సరదాగా సాగే సినిమా ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తుండటంపట్ల ఏంజిల్, అలేఖ్య, జియా, సందీప్తి, అలీషా ఆనందం వ్యక్తం చేశారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా?
రెండేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద ‘దూకుడు’ చేసిన హల్చల్ అంతా ఇంతాకాదు. ఆ సినిమా దెబ్బకు పాత రికార్డులన్నీ చెల్లా చెదురైపోయూయయి. మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్‌కి ఎక్కడలేని క్రేజ్‌ని తీసుకొచ్చిందా చిత్రం. ఇప్పుడు మళ్లీ వారిద్దరి కలయికలో సినిమా అనగానే... ‘ఆగడు’పై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. తమన్నా తొలిసారి మహేష్‌తో జతకడుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని ఇటీవల లాంచనంగా జరిపారు. అయితే... ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలుకాలేదు. దానికి కారణం మహేష్ ‘1’ సినిమా. ఆ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండటంతో ‘ఆగడు’ షూటింగ్ కాస్త ఆగాల్సి వచ్చింది. ‘1’ షూటింగ్ త్వరలో పూర్తి కానుండటంతో ఈ నెల 28న ‘ఆగడు’ పట్టాలెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు ముందు శ్రీహరిని అనుకున్నారు. ఆయన హఠాన్మరణం కారణంగా ఇప్పుడు ఆ పాత్రకు సాయికుమార్ని తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో మహేష్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్‌గా కనిపిస్తారని ఫిలిమ్‌నగర్ సమాచారం. ‘దూకుడు’లో తెలంగాణ శ్లాంగ్‌తో అలరించిన ప్రిన్స్.. ‘ఆగడు’లో రాయలసీమ యాసలో మెప్పిస్తారని వినికిడి. సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర భావిస్తున్నారు. డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ,సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయా గ్రహణం: కె.వి.గుహన్. -
వారం తర్వాత ‘ఆగడు’
మహేష్‌బాబుతో చేయబోయే ‘ఆగడు’ చిత్రంలో రియల్‌స్టార్ శ్రీహరి కోసం ఓ అద్భుతమైన పాత్రను దర్శకుడు శ్రీను వైట్ల డిజైన్ చేశారట. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఢీ, కింగ్ చిత్రాల్లో శ్రీహరి పాత్రలు ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించాయో తెలిసిందే. వాటిని తలదన్నే పాత్రను శ్రీహరికోసం శ్రీను వైట్ల సిద్ధం చేశారట. కానీ దేవుడు మరోలా తలచాడు. శ్రీహరి హఠాన్మరణం చెందకపోతే... మహేష్, శ్రీహరి కలిసి నటించే తొలి సినిమా ‘ఆగడు’ అయ్యేది. ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసేది. నిజానికి ‘ఆగడు’ ప్రారంభోత్సవం ఈ నెల 11న గానీ, 14న గానీ నిర్వహించాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర భావించారు. అయితే... శ్రీహరి కన్ను మూయ డంతో ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఓ వారానికి పోస్ట్‌పోన్ చేశారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం శ్రీహరి స్థానంలో నటించే నటుడి అన్వేషణలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు తెలిసింది. కచ్చితంగా శ్రీహరి స్థాయి నటుణ్ణే ఎంపిక చేయాలనే కృతనిశ్చయంతో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో తమన్నాను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలిసింది. అదే నిజమైతే... మహేష్, తమన్నా కలిసి నటించే తొలి సినిమా ఇదే అవుతుంది.