మహేష్కు ప్రమాదం.. 'ఆగడు' షూటింగ్కు బ్రేక్
వరుస విజయాలతో దూకుడుగా దూసుకెళ్లిపోతున్న మహేష్ బాబు 'ఆగడు' సినిమా షూటింగ్లో గాయపడ్డారని తెలుస్తోంది. దీంతో శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆగినట్లు సమాచారం. ప్రతి సినిమాకు వేరియేషన్లు చూపిస్తూ, డిఫరెంట్గా ప్రయత్నించడం మహేష్ బాబు నైజం. అందుకే తాను 1.. నేనొక్కడినే కథ వినగానే అంగీకరించినట్లు కూడా ఆయన చెప్పారు. ఆ సినిమా తర్వాత, మహేశ్ బాబు - శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న ఆగడు మూవీ బళ్లారిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంటోంది . ఇటీవల ఈ చిత్రం టైటిల్ సాంగ్ చిత్రీకరణ కూడా చేసుకుంది.
ఈ నేపథ్యంలో షూటింగ్ జరుగుతుండగా మహేష్ ప్రమాదానికి గురైనట్టు తెలిసింది . ఆయన చేతికి గాయం కావడంతో షూటింగ్కు తాత్కిలికంగా బ్రేక్ చెప్పారు. మహేష్ను పరీక్షించిన వైద్యులు ఆయనకు కనీసం వారం రోజులు విశ్రాంతి ఇవ్వాలని చెప్పడంతో ఈ చిత్రం షెడ్యూల్ ను వారం రోజులు బ్రేక్ చేశారు. ఇంతకుముందు మహేష్ బాబు - శ్రీను వైట్ల కాబింనేషన్ లో వచ్చిన దూకుడు బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన విషయం తెలిసిందే. దాంతో అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ చేస్తూ ఆగడు రూపొందుతోంది. వారం రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ ఆగకుండా దూసుకెళ్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.