
హృదయం ఎక్కడున్నది...
‘‘హీరోగా నాకిది తొలి సినిమా. త్రివిక్రమ్, శ్రీను వైట్ల దగ్గర నేను దర్శకత్వ శాఖలో పనిచేశాను. వారిద్దరూ ఈ సినిమా ప్రోమోస్, సాంగ్స్,పిక్చరైజేషన్ చూసి చాలా బావుందని మెచ్చుకున్నారు’’ అని కృష్ణమాధవ్ చెప్పారు. వి.ఆనంద్ దర్శకత్వంలో కృష్ణమాధవ్, అనూష, సంస్కృతి హీరో హీరోయిన్లుగా పవన్ మంత్రిప్రగడ, సంజయ్ ముప్పనేని నిర్మించిన ‘హృదయం ఎక్కడున్నది’ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో సక్సెస్‌మీట్‌లో నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మురుగదాస్ శిష్యుడైన ఆనంద్ ఈ చిత్రాన్ని అద్భుతంగా డెరైక్ట్ చేశాడు’’ అని చెప్పారు. విశాల్ చంద్రశేఖర్ చక్కటి సంగీతం అందించారని దర్శకుడు పేర్కొన్నారు.