టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మధ్య వివాదం కొన్నేళ్లుగా నడుస్తోంది. తాజాగా ఆమె మా అసోసియేషన్‌ను తప్పు పడుతూ ఒక ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసి చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు గురించి ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. అందుకు కౌంటర్‌గా మా అసోసియేషన్ తరఫున నటుడు, కోశాధికారి శివ బాలాజీ (Siva Balaji) రియాక్ట్ అయ్యారు. ఆమె నుంచి తముకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. గతంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు. ఇందుకు సమాధానంగా పూనమ్ మరోసారి రియాక్ట్ అయింది.
మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీకి పూనమ్ కౌర్ కౌంటర్‌గా ఇచ్చింది. గతంలో త్రివిక్రమ్‌పై (Trivikram Srinivas) తాను చేసిన ఫిర్యాదుకు మా అసోసియేషన్ నుంచి గతంలో వచ్చిన మెసేజ్‌ని పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. తనను కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన మా అసోసియేషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదంటూ ఆమె పేర్కొంది. మా అసోసియేషన్ నుంచి పూనమ్‌కు వచ్చిన మెసేజ్‌లో ఇలా ఉంది.
(ఇదీ చదవండి: రజనీకాంత్‌ను మెప్పించిన అభిమాని.. ఇంటికి పిలిచి గిఫ్ట్‌తో సత్కారం)
'త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిర్యాదుకు సంబంధించి మీ మెయిల్ మాకు అందింది. మీ అభ్యర్థన మేరకు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో అంగీకరించిన తేదీ, సమయానికి ఇద్దరు పరిశ్రమకు చెందిన మహిళా సభ్యులతో పాటు మరోఇద్దరు మహిళా పరిశ్రమేతర సభ్యులతో ఇక్కడి ప్యానెల్‌లో మిమ్మల్ని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సమావేశం మొత్తం మహిళా ప్యానెల్‌గా ఉండాలని మీరు అభ్యర్థించారు. ఈ విషయంలో మేము ఎలా కొనసాగించాలో మీ కేసును స్పష్టమైన పద్ధతిలో చెప్పగలరని ఆశిస్తున్నాము.'
త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పూనమ్ కౌర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చింది. సోషల్‌మీడియా వేదికగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆమె విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.అయితే, పూనమ్ బయటపెట్టిన ఆధారంతో ఇప్పుడు మా అసోసియేషన్ ఇరకాటంలో పడినట్లు అయింది. ఇదే క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌కు కూడా కాస్త ఇబ్బందులు తప్పవనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
No proceeds after this - thank you 🙏 pic.twitter.com/cW8TiWax0Q
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025
Comments
Please login to add a commentAdd a comment