హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్‌పై మా అసోసియేషన్ స్పందించింది. మా తరఫున నటుడు కోశాధికారి శివబాలాజీ ఆమె చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఆమె నుంచి మాకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. మా కంటే ముందుగా కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు.
అంతేకాకుండా పూనమ్ కౌర్ కేవలం ట్విటర్‌లో పోస్టులు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని శివబాలాజీ వెల్లడించారు. మా అసోసియేషన్‌ను, న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తే ఆమెకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ ఎపిసోడ్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పోస్ట్‌పై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
కాగా.. అంతకుముందు పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. గతంలోనూ చాలాసార్లు తన బాధను వ్యక్తం చేసిన పూనమ్ కౌర్ మరో ట్వీట్‌తో చర్చకు దారితీసింది.
గతంలోనూ పోస్టులు..
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, సినీ నటి పూనమ్ కౌర్ వివాదం ఇప్పటిది కాదు. గతంలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.
పూనమ్ కౌర్ సినీ కెరీర్..
ఇక పూనమ్ కౌర్ సినిమాల విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment