Movie Artists Association
-
'వాటితో ఎలాంటి ఉపయోగం లేదు'.. పూనమ్ ట్వీట్‌పై మా అసోసియేషన్ రియాక్షన్
హీరోయిన్ పూనమ్ కౌర్ ట్వీట్‌పై మా అసోసియేషన్ స్పందించింది. మా తరఫున నటుడు కోశాధికారి శివబాలాజీ ఆమె చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఆమె నుంచి మాకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. మా కంటే ముందుగా కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు.అంతేకాకుండా పూనమ్ కౌర్ కేవలం ట్విటర్లో పోస్టులు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని శివబాలాజీ వెల్లడించారు. మా అసోసియేషన్‌ను, న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తే ఆమెకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ ఎపిసోడ్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పోస్ట్‌పై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.కాగా.. అంతకుముందు పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. గతంలోనూ చాలాసార్లు తన బాధను వ్యక్తం చేసిన పూనమ్ కౌర్ మరో ట్వీట్‌తో చర్చకు దారితీసింది.గతంలోనూ పోస్టులు..టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, సినీ నటి పూనమ్ కౌర్ వివాదం ఇప్పటిది కాదు. గతంలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్ కౌర్ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు.పూనమ్ కౌర్ సినీ కెరీర్..ఇక పూనమ్ కౌర్ సినిమాల విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. -
త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి సంచలన ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, సినీ నటి పూనమ్ కౌర్(Poonam Kaur) మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. త్రివిక్రమ్ ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని,కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారనేది పూనమ్ ఆరోపణ. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు. కానీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు మాత్రం నిజంగానే పూనమ్‌కి అన్యాయం జరిగిందంటారు. మరికొంత మంది ఏమో ఫేమ్ కోసమే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారని విమర్శిస్తారు. అయితే పూనమ్ మాత్రం తన పోరాటం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. తివిక్రమ్‌పై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని డిమాండ్ చేస్తునే ఉంది. కానీ ‘మా’ మాత్రం పట్టించుకోవట్లేదని పూనమ్ ఫైర్ అవోతుంది.తాజాగా మరోసారి ‘మా’పై తన అసంతృప్తిని వెల్లడిస్తూ పూనమ్ సంచలన ట్వీట్ చేసింది.(చదవండి: డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్)‘త్రివిక్రమ్(Trivikram Srinivas)పై నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసి చాలా కాలమైంది. ఇప్పటి వరకు ‘మా’ దానిపై స్పందించలేదు. త్రివిక్రమ్‌ని ప్రశ్నించడం కానీ అతనిపై చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన అతన్ని ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్ద మనిషిగానే ప్రోత్సహిస్తుంది’ అని పూనమ్ ట్వీట్ చేసింది. గతంలో కూడా పూనమ్ ఇలాంటి ట్వీట్స్ చాలానే చేసింది. త్రివిక్రమ్‌పై ‘మా’లో ఫిర్యాదు చేస్తే సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదని, రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలని పూనమ్ డిమాండ్ చేసింది.పూనమ్ విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. No questioning or even action taken on director #Trivikramsrinivas for complaint give in maa association for very long , he rather is encouraged by the big wigs after damaging my life which has affected health and happiness .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025 -
ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది: మంచు విష్ణు
కొద్దిరోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో అనేక సంఘటనలు జరగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ చిక్కుల్లో పడితే... కుటుంబంలో విభేదాలు రావడంతో మంచు ఫ్యామిలీలో కేసుల వరకు గొడవలు వెళ్లాయి. దీంతో పలువురు చిత్ర పరిశ్రమ నుంచి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షునిగా మంచు విష్ణు అధికారిక ప్రకటన చేశారు.'మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం,సాన్నిహిత్య సంబంధాలతో కలిగి ఉంటారు. సహకారం, సృజనాత్మకత పై ఆధారపడి మన చిత్ర పరిశ్రమ నడుస్తుంది. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన ఇండస్ట్రీ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంది. ప్రత్యేకంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో స్థిరపడటానికి, అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనది. ఈ విధంగా, ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయి.ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గానీ, వివాదాస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం గానీ నివారించండి.కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి, వాటిపై చట్టం తన దారిలో తను న్యాయం చేస్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుంది. ఈ సమయంలో మనకి సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అని సంగతి గుర్తించుకుందాం. ఏ సమస్యలు వచ్చినా, మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను.' అని విష్ణు ఒక ప్రకటన చేశారు. -
దయచేసి 'మా' వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవద్దు: మంచు విష్ణు లేఖ
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సినిమా వాళ్లపై ఇలాంటి కామెంట్స్ చేయడం దురదృష్టకరమన్నారు. సినీ పరిశ్రమ పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుందని తెలిపారు. రాజకీయ లాభాల కోసం వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం నిరాశ కలిగించిందన్నారు. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటామని.. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతమని మా తరఫున మంచు విష్ణు నోట్ విడుదల చేశారు.'సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో.. వాటివల్ల కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని భావిస్తున్నా. మన పరిశ్రమ కూడా ఇతర రంగాల్లాగే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. నిజం కాని కథనాలను రాజకీయ లబ్ధి కోసం వాడటం చాలా నిరాశను కలిగించింది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం.. కానీ మా కుటుంబాలు మాత్రం వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం.. వారి వ్యక్తిగత జీవితాలపై అబద్ధపు ఆరోపణలు రావాలని ఇష్టపడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం.'నోట్లో ప్రస్తావించారు.(ఇది చదవండి: నేను షాకయ్యా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్)'రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి రాజకీయాల కోసం, ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా సినిమాకు చెందిన వారి పేర్లు, కుటుంబాల పేర్లు వాడకండి. చిత్రపరిశ్రమలో పనిచేసేవారు వినోదం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నారు. మా వ్యక్తిగత జీవితాలను ప్రజాక్షేత్రంలోకి లాగొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా.. మనుషులుగా కూడా మన కుటుంబాలపై వచ్చే అబద్ధపు కథనాల వల్ల కలిగే బాధ చాలా తీవ్రమైంది. ఇలాంటి సంఘటనల బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిద్దాం. సినీ ఇండస్ట్రీ తరపున మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. అవసరమైతే మేమంతా ఏకమై నిలబడతాం' అంటూ లేఖ విడుదల చేశారు. Official Statement from Movie Artists Association (MAA) pic.twitter.com/vc4SWsnCj6— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2024 -
ఇండస్ట్రీ పెద్దలు.. డైరెక్టర్ త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి: పూనమ్ కౌర్
స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌తో హీరోయిన్ పూనమ్ కౌర్ గొడవ ఇప్పటిది కాదు. చాన్నాళ్ల నుంచి ఉన్నదే. వీలు చిక్కినప్పుడల్లా గురూజీపై పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్.. తెలుగులో పలు సినిమాలు చేసింది. అయితే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్‌తో ఈమెకు ఏం గొడవ ఉందో తెలీదు గానీ ఎప్పటికప్పుడు వీళ్లని విమర్శిస్తూనే ఉంటుంది. తాజాగా జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో అతడిని మాస్టర్ అని పిలవొద్దు అని ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?)ఇది పెట్టిన కాసేపటికే త్రివిక్రమ్ గురించి మరో ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.మరి పూనమ్ కౌర్ చెప్పినట్లు త్రివిక్రమ్.. మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేసేంతలా ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానీయలేదు. పూనమ్ కౌర్‌ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనక ఎవరెవరున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే కేరళ ఇండస్ట్రీలోని హేమ కమిటీలా ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలేమో?(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో కొడుకులు అరెస్ట్)Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 -
ఆ యూట్యూబర్‌పై శివ బాలాజీ ఫిర్యాదు
చిత్రపరిశ్రమలోని నటీనటులతో పాటు వారి కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్నవారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో మా అధ్యక్షులు మంచు విష్ణు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నటుడు, 'మా' కోశాధికారి శివ బాలాజీ పోలీసులను ఆశ్రయించారు.సినీ నటీనటులను టార్గెట్ చేస్తూ నిత్యం నెగెటివ్ ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్ అనే వ్యక్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. చంద్రహాసన్ గత కొంత కాలంగా నటీనటులతో పాటు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థ గురించి తప్పుగా చూపుతూ.. ట్రోల్స్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రపరిశ్రమలో భాగమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషషన్కు ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా పలు వీడియోలు క్రియేట్ చేశాడని శివ బాలాజీ పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యూట్యూబర్‌కు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం సుమారు 18కి పైగా యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. యూట్యూబర్స్లో మార్పు రాకుంటే వారిపై మరింత కఠనమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
సినీ నటి హేమపై 'మా' సస్పెన్షన్ ఎత్తివేత
సినీ నటి హేమకు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) శుభవార్త చెప్పింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు మా ప్రకటించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ వివాదంలో చిక్కుకున్న హైమపై నైతికంగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు చర్యలు తీసుకున్నారు. మా నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని వారు ఆ సమయంలో తొలగించారు. అయితే, హేమకు నిర్వహించిన రక్త పరీక్షలలో నెగటివ్ వచ్చిందని అందుకు సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఆపై కోర్టు కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హేమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు తాజాగా ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ప్రకటించింది. అయితే, మీడియాతో సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడవద్దని హేమకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సూచించింది. -
‘మా’కు మంచు విష్ణు రూ. 10 లక్షల విరాళం!
మంచు విష్ణు మరోసారి మంచి గొప్ప మనసు చాటుకున్నాడు. తన కూతురు ఐరా విద్యా బర్త్‌డే సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి పది లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.గత మూడేళ్లుగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతూ.. అసోసియేషన్ మెంబర్లకు అండగా నిలుస్తున్నాడు. సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్యపు కథనాలు, ట్రోలింగ్‌ను కట్టడి చేసేందుకు నడుంబిగించారు.నటులు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారు.విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది. -
'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?
హీరో మంచు విష్ణుపై ఓ యూట్యూబర్ దారుణంగా విమర్శలు చేశాడు. సదరు హీరోకి చెందిన నిర్మాణ సంస్థ నుంచి మెయిల్ వచ్చిందని చెబుతూ ఫుల్ ఫైర్ అయిపోయాడు. దీనిపై క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ.. అలా వచ్చే మెయిల్స్‌తో తమకు సంబంధం లేవని, అవన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదం ఏంటి? అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. ఏమైందంటే?)మంచు విష్ణు ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సెలబ్రిటీలు, వాళ్ల ఫ్యామిలీపై ట్రోల్ వీడియోలు చేస్తున్న చాలా యూట్యూబ్ ఛానెల్స్‌పై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పటికే వందలాది ఛానెల్స్‌పై స్టైక్స్ వేసి, వాటిని తొలగించారు. ఈ విషయమై తాజాగా ఓ యూట్యూబర్ స్పందించాడు. తనలానే చాలామందికి చెందిన యూట్యూబ్ ఛానెల్స్‌పై స్ట్రైక్స్ వేసి, తొలగించారని.. వాటిని తీయమని చెబుతుంటే రాబోయే 'కన్నప్ప' మూవీ గురించి పాజిటివ్ వీడియో చేయాలని మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి మెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఫ్రూప్ కూడా చూపించాడు.దీనిపై ఇప్పుడు 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ స్పందించింది. పలువురు యూట్యూబర్స్‌కి మెయిల్స్‌కి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఫేక్ మెయిల్స్‌తో తమకు భంగం కలిగిస్తున్నారని, ఈ విషయమై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ ఓ నోట్ రిలీజ్ చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే మంచు విష్ణుపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ప్రాక్టీస్‌లోనూ తమన్నా రొమాంటిక్ డ్యాన్స్.. ఒరిజినల్ కంటే ఇదే..!) View this post on Instagram A post shared by 24 Frames Factory (@24framesfactory) -
డీజీపీని కలిసిన 'మా' ప్రతినిధులు.. ట్రోలర్స్‌కు చుక్కలే!
సాక్షి, హైదరాబాద్: విమర్శ మంచిదే కానీ అది హద్దు దాటకూడదు. ఈ మధ్య కాలంలో పలువురు నెటిజన్లు, యూట్యూబర్స్.. సెలబ్రిటీలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వారు చేసే పని గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం చర్చిస్తూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మా(మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్) నటీనటుల గురించి అసభ్యంగా మాట్లాడిన ఐదు యూట్యూబ్ ఛానల్స్‌ను తొలగించింది.స్పెషల్ సెల్గురువారం నాడు మా బృందం డీజీపీ జితేందర్‌ను కలిసింది. సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని వీడియోలు వదులుతున్న 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపికి సమర్పిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఆయన.. సైబర్ సెక్యూరిటీ వింగ్‌లోని ఓ స్పెషల్ సెల్ ఇకపై దీనిపైనే ఫోకస్ చేస్తుందని హామీ ఇచ్చారు. ట్రోలర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఫ్యామిలీని కూడా వదలట్లేదుఅనంతరం రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ట్రోల్స్ నవ్వుకునేలా ఉండాలి కానీ ఏడిపించేలా ఉండొద్దు. కుటుంబ సభ్యుల మీద కూడా ట్రోల్ చేయడం దారుణం. ఇకమీదట నటీనటులను ట్రోల్స్ చేస్తే సహించేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. శివ బాలాజీ మాట్లాడుతూ.. దారుణమైన ట్రోల్స్‌కు పాల్పడేవారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం. సుమారు 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును డీజీపీకి సమర్పించాం. ఆయన సానుకూలంగా స్పందించారు అని తెలిపారు.మహిళా ఆర్టిస్టులే టార్గెట్నటుడు శివకృష్ణ మాట్లాడుతూ.. మహిళా ఆర్టిస్టుల క్యారెక్టర్‌ను దారుణంగా చిత్రీకరిస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ డబ్బు కోసం ఇలా చేస్తున్నాయి. కానీ దీనివల్ల లేడీ ఆర్టిస్టులు ఎక్కువ ఇబ్బందిపడుతున్నారు అని చెప్పుకొచ్చారు.చదవండి: మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్ మూవీ.. ఎక్కడంటే? -
Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సస్పెషన్ వేటు వేసింది. హేమను ‘మా’ నుంచి సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ప్రెసిడెంట్ మంచు విష్ణు బుధవారం మా అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. అయితే సభ్యులంతా హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ రిప్లయ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హేమను సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. హేమకు క్లీన్ చిట్ వచ్చేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
మరోసారి మా అధ్యక్షునిగా మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షునిగా మంచు విష్ణునే కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే విష్ణు మా అధ్యక్షునిగా ఉన్నారు. మా అధ్యక్ష భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయననే కొనసాగించాలని 26 మంది సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. -
తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలు మలేషియాలో: మంచు విష్ణు
తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకను మలేషియాలో ఘనంగా నిర్వహిస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. సినీ పెద్దలతో చర్చించి త్వరలోనే వేడుకల తేదిని ప్రకటిస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది. తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులుగా ఉండటం చాలా గర్వంగా ఉంది.జులైలో మలేషియాలో తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలు నిర్వహిస్తాం. తెలుగు సినీ పరిశ్రమ ఘన కీర్తిని తొడ కొట్టి చెప్పాలనే ఈ వేడుకలు చేస్తున్నాం. ఇప్పటికే ఈ వేడుకల గురించి ఫిల్మ్ ఛాంబర్‌తో మాట్లాడాం. జులైలో తెలుగు పరిశ్రమకు రెండు మూడు రోజులు సెలవు ఇవ్వాలని కోరాం.అందుకు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారు. దేశంలో ఉన్న ఐదు అసోసియేషన్ లతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒప్పందం చేసుకున్నాం. భారతీయ సినిమాను ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కృషి చేస్తోంది’ అని అన్నారు. -
‘మా’తో బాలీవుడ్ ఒప్పందం
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), బాలీవుడ్ అసోసియేషన్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం తెలుగు చిత్రాలు చేసే బాలీవుడ్ కళాకారులకు ‘మా’ సభ్యత్వం అందుతుంది. అలాగే బాలీవుడ్ చిత్రాల్లో నటించే తెలుగువాళ్లకి బాలీవుడ్ అసోసియేషన్ సభ్యత్వం ఉంటుంది’’ అని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. మంచు విష్ణు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని కలిసి, రెండు అసోసియేషన్లు కలిసికట్టుగా ఉండాలనే ప్రతి΄ాదన ఉంచారు. అందుకు బాలీవుడ్ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ‘మా’, సినేటా (హిందీ చలనచిత్రం మరియు టీవీ అసోసియేషన్) ఉమ్మడి ఒప్పందంపై సంతకం చేశాయి. ‘‘త్వరలో వేరే ఇండస్ట్రీలతో కూడా ఈ ఒప్పందం జరుగుతుంది. అన్ని ఇండస్ట్రీలు ఒకే కుటుంబంగా ఉండాలి’’ అన్నారు మంచు విష్ణు. -
మా సస్పెన్షన్.. కరాటే కల్యాణ్ రియాక్షన్ ఇదే!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై నటి కరాటే కల్యాణి రియాక్ట్ అయ్యారు. సినీ పరిశ్రమ కోసం తాను పడిన కష్టానికి బాగా బుద్ధి చెప్పారని అన్నారు. మా సస్పెండ్ చేయడంతో చాలా బాధపడ్డానని తెలిపారు. మాపై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తన నిజాయితీకి ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) కాగా.. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై సీనియర్ ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మా చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ‘మా’ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) కరాటే కల్యాణి మాట్లాడుతూ..' 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడినా నేనే అడ్డుపడినా. పూసుకుని, రాసుకుని నా ఇండస్ట్రీ, నా ఇండస్ట్రీ అనుకుని వెళ్లా. అలా వెళ్లినందుకు నా నిజాయతీకి తగిన బగుమతి దక్కింది. నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టమనే అడిగాను. వ్యతిరేకించట్లేదు. కృష్ణుడి రూపంలో వద్దని చెప్పా. దీనికి నా మీద ఎందుకు కక్ష కడుతున్నారు. నా ఆరోగ్యం బాగోలేక సమాధానం ఇవ్వలేకపోయా. మూడు రోజులు మాత్రమే గడువిచ్చారు. కనీసం వారం రోజులు కావాలని నోటీసు కూడా ఇచ్చా. అందుకే నన్ను సస్పెండ్ చేశారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. మా అసోసియేషన్‌ను కించపరచలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. బహుశా ఎవరి ఒత్తిడితోనైనా ఆ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు.' అని చెప్పుకొచ్చారు. -
కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!
సినీనటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. ఆమెను మా నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కల్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ లేఖ రాశారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?) అయితే మా నోటీసులపై స్పందించిన కరాటే కళ్యాణ్ ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె సమాధానం పట్ల మా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తి చేసింది. ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో నిబంధనల ప్రకారం కరాటే కల్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు ప్రకటించారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. (ఇది చదవండి: ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్) అసలేం జరిగిందంటే.. సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల ఈ విగ్రహావిష్కరణ మే 28న జరగనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేదంటూ కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. ఎందుకు దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. -
ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్
సీనియర్ నటుడు శరత్ బాబు మరణం పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లో ఆయన పార్థివదేహం వద్ద నివాశులర్పించారు. శరత్ బాబు గొప్ప నటుడని విష్ణు కొనియాడారు. తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించి.. అందరూ గర్వించే విధంగా ఎదిగారని అన్నారు. ఈ సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) మంచు విష్ణు మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్ప నటుడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. ఆయనతో మాకు ప్రత్యేక బంధం ఉంది. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అందరం అండగా ఉందాం.' అని అన్నారు. శరత్ బాబు పార్థివదేహానికి నటులు మురళీ మోహన్, శివాజీ రాజా, శివ బాలాజీ, ప్రసన్న కుమార్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. (ఇది చదవండి: 3 వేలమందిలో ఓకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) -
కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?
సినీ నటి కరాటే కల్యాణికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీనియర్ నటుడు ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని నోటిసులిచ్చింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కల్యాణి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ ఉల్లంఘన కింద ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) ఖమ్మంలో కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమె అలా మాట్లాడటం సరి కాదని అంటున్నారు. (ఇది చదవండి: నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి'.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్) -
మాట నిలబెట్టుకున్న మంచు విష్ణు.. మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఉచితంగా హెల్త్ చెకప్ నిర్వహించారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ (Continental Hospitals) సహాయంతో మా సభ్యులందరికి పూర్తి మాస్టర్ చెకప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మా ప్రిసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ.. కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మెన్ గురునాథ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, డాక్టర్ మేఘనాథ్ రెడ్డిలకి ధన్యవాదాలు తెలిపాడు. 'జనరల్ గా మాస్టర్ హెల్త్ చెకప్ కి పదివేలు అవుతుంది, కానీ కాంటినెంటల్ హాస్పిటల్స్ మాకు ఉచితంగా సర్వీస్ చేస్తున్నందుకు చాలా సంతోషం' అని విష్ణు పేర్కొన్నారు. మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి మాట్లాడుతూ ''మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేస్తున్న మూడవ హెల్త్ చెకప్ ఇది. మా సభ్యులందరికి 3 లక్షల విలువ చేసే హెల్త్ భీమాని ఉచితంగా అందిస్తున్నాం" అని తెలిపారు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
అలా చేస్తే వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తా: మంచు విష్ణు
సాక్షి, హైదరాబాద్: మా ఎన్నికల్లో తాను చేసిన వాగ్దానాలు 90 శాతం పూర్తయ్యాయన్నాడు మా అధ్యక్షుడు మంచు విష్ణు. సంక్రాంతి తర్వాత మా కోసం యాప్ తీసుకొస్తామని, నటీనటుల అవకాశాల కోసం ప్రత్యేక బుక్లెట్ తయారుచేశామని చెప్పాడు. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తైన సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. '2021 మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. అక్టోబర్ 13న నేను మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను. నేను ఎలక్షన్స్‌లో పోటీ చేసినప్పుడు సినీపరిశ్రమలో ఎంతో అలజడి నెలకొంది. నేను మా అసోసియేషన్‌కే కాదు ప్రేక్షకులకు కూడా జవాబుదారీనే! మా అసోసియేషన్‌లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారు. మా అసోసియేషన్ సభ్యత్వం కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకున్నాం. నటీనటులు కనీసం రెండు చిత్రాల్లో నటించి, అవి విడుదలైతేనే వారికి మాలో శాశ్వత సభ్యత్వం ఉంటుంది. కనీసం ఐదు నిమిషాలైనా సినిమాలో కనిపించి డైలాగ్ చెప్పిన వాళ్లకు అసోసియేట్ సభ్యత్వం కల్పిస్తాం. అసోసియేట్ సభ్యులకు మాలో ఓటు హక్కు లేదు. మా అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఎవరైనా నటీనటులు, కార్యవర్గ సభ్యులు ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం. ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారు పోటీకి అనర్హులవుతారు. మా అసోసియేషన్ భవనానికి రెండు ప్రతిపాదనలు సూచించాను. ఫిల్మ్ నగర్‌కు అరగంట దూరంలో ఓ భవనం నిర్మిస్తున్నాం. ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం కట్టేందుకు నేను ఖర్చు భరిస్తాను. చాలా మంది సభ్యులు రెండో అంశానికే మద్దతు పలికారు' అని చెప్పాడు. చదవండి: ఆరోహి పోయిందంటే ఇనయను తగులుకున్నాడు సినిమా ఛాన్స్ అని ఇంటికి పిలిచి.. : నటి -
తెలుగు పరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు
కరోనా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ–తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) ఇటీవల నాలుగు కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్‌లు నిలిపివేసి, సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం సెస్టెంబర్ 1 నుంచి చిత్రీకరణ పునః ప్రారంభించుకోవచ్చని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో నిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. షూటింగ్‌లు కూడా ఆరంభం అయ్యాయి. తాజాగా పారితోషికం, ఓటీటీ, థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్, ఫెడరేషన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ, టీఎఫ్‌సీసీ ఓ లేఖను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబరు 10 నుంచి అమలులోకి వస్తాయన్నట్లుగా టీఎఫ్సీపీ పేర్కొంది. కాగా ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాలు జరిపాకే ఈ కొత్త మార్గదర్శకాలను నిర్ణయించినట్లుగా టీఎఫ్‌సీసీ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆ లేఖలో పేర్కొన్న మార్గదర్శకాలు ఈ విధంగా.... ప్రొడక్షన్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్ ► నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రోజువారీ వేతనాలు ఉండవు. ► నటీనటులు వారి పారితోషికంలోంచే వ్యక్తిగత సిబ్బంది వేతనాలు చెల్లించుకోవాలి. అలాగే స్థానిక రవాణా, బస, స్పెషల్ ఫుడ్ వంటివి నటీనటులే సమకూర్చుకోవాలి. ఒప్పందాల ప్రకారమే నిర్మాతలు ఆర్టిస్టులకు పారితోషికాలను చెల్లిస్తారు. నటీనటులతో పాటు ప్రధాన సాంకేతిక నిపుణులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి. ► సినిమా షూటింగ్ ప్రారంభించడా నికి ముందే పారితోషికాలకు సంబంధించిన ఒప్పందాలు పూర్తవుతాయి. వీటి ప్రకారమే చెల్లింపులు ఉంటాయి. ► కాల్షీట్స్ టైమింగ్, సెట్స్‌లో క్రమశిక్షణకు సంబంధించిన నియమాలు కఠినంగా అమలు చేయబడతాయి. నిర్మాతల సౌకర్యార్థం సినిమాకు సంబంధించిన షూటింగ్ రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఓటీటీ : ► ఓ సినిమా ఏ టీవీ చానెల్లో ప్రసారం కానుంది? ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది? అనే అంశాలను టైటిల్స్‌లో కానీ, సినిమా ప్రదర్శనల్లో కానీ, ప్రమోషన్స్‌లో కానీ బహిర్గతం చేయకూడదు. ► థియేటర్స్‌లో రిలీజైన ఓ సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి. థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్ ► వీపీఎఫ్ (వర్చ్యువల్ ప్రింట్ ఫీ)కి సంబంధించిన చార్జీల విషయమై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో నేడు జరగాల్సిన సమావేశం 6కి వాయిదా పడింది. ► తెలంగాణలో మల్టీప్లెక్స్‌లకు ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారో ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే ఇస్తారు. సినీ కార్మికుల సంఘం: ► కార్మికులకు సంబంధించిన సమస్యలపై తుది చర్చలు జరుగుతున్నాయి. రేట్ కార్డ్స్ ఫైనలైజ్ అయ్యాక వీటి వివరాలు అన్ని నిర్మాణ సంస్థలకు పంపించడం జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయాల విషయమై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణుతో చర్చలు జరిపారని భోగట్టా. కొత్త మార్గదర్శకాలను ‘మా’కి లేఖ రూపంలో పంపారని సమాచారం. నటీనటుల వ్యక్తిగత సిబ్బంది పారితోషికం, సొంత రవాణా ఖర్చులు వంటివాటిపై ‘మా’ సుముఖత వ్యక్తపరిచిందట. కొత్త మార్గదర్శకాలను నటీనటులందరికీ ‘మా’ త్వరలో అధికారికంగా పంపనుందని సమాచారం. ► కొత్త మార్గదర్శకాల్లో రోజువారీ వేతనాల గురించిన అంశం ఒకటి. మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో పెద్ద రేంజ్ ఉన్నవారు రోజువారీ వేతనాలు తీసుకుంటారు. అయితే ఇకపై వారికి కూడా సినిమాకి ఇంత అని పారితోషికం నిర్ణయించాలనుకుంటున్నారు. మరి.. రోజువారీ వేతనాలు తీసుకునేది ఎవరూ అంటే.. అట్మాస్ఫియర్ కోసం సీన్లో నిలబడేవాళ్లు, అటూ ఇటూ కదులుతూ కనిపించేవాళ్లు, డైలాగ్స్ చెప్పే జూనియర్ ఆర్టిస్టులు .. ఇలా చిన్న స్థాయి కళాకారులు రోజువారీ వేతనాల కిందకు వస్తారు. -
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుతో దిల్ రాజు భేటీ
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణుతో నిర్మాత దిల్ రాజు సమావేశమయ్యారు. గురువారం ఉదయం మా కార్యాలయానికి వెళ్లిన దిల్ రాజు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షూటింగ్స్ బంద్‌పై, మా సభ్యులకు సినిమా అవకాశాలపై వీరు ముచ్చటించారని మంచు విష్ణు తెలిపారు. ఈ మేరు ఆయన ట్వీట్ చేశారు. దిల్ రాజును కలిసిన సందర్భంగా తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. చదవండి: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్ ఈ సందర్భంగా తమ సినిమాల్లో ‘మా’ సభ్యులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని, అలాగే కొత్తవారు ‘మా’ సభ్యత్వం పొందేలా ప్రోత్సహించాలని దిల్ రాజును కోరినట్లు విష్ణు తెలిపారు. ఈ మేరకు మా సంక్షేమ కమిటి వినతి పత్రాన్ని దిల్ రాజుకు అందించారు. కాగా ‘మా’ సభ్యులకు సినిమా అవకాశాలు కల్పించాలని కోరుతూ విష్ణు ఇకపై పలువురు టాలీవుడ్ నిర్మాతలను కలవనున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన దిల్ రాజుతో భేటి అయినట్లు సమాచారం. చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు హఠాన్మరణం Started meeting our TFI producers on behalf of MAA, requesting them to hire mostly MAA members and also to encourage newcomers to become a part of the MAA family. pic.twitter.com/1AjvqU436J — Vishnu Manchu (@iVishnuManchu) August 4, 2022 -
ప్రొడ్యూసర్స్ గిల్డ్‌తో ‘మా’ కీలక భేటీ.. ‘అవసరమైతే స్ట్రయిక్ తప్పదు’
‘యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ నిర్ణయాల మేరకు తెలుగు పరిశ్రమలో షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సమస్యల పరిష్కారం దిశగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పటికే వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) సమస్యల గురించి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్లతో చర్చలు జరిపారు. బుధవారం ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)తో ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక సభ్యులు సమావేశమై పలు సమస్యల గురించి చర్చించారు. ఈ సమావేశానికి ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ‘మా’ జనరల్ సెక్రటరీ రఘుబాబు, కోశాధికారి శివబాలాజీ హాజరయ్యారు. ఇటు నిర్మాతలు ‘దిల్’ రాజు, మైత్రీ నవీన్, నాగవంశీ, శరత్ మరార్, బాపినీడు, వివేక్, నటి-దర్శకురాలు జీవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నటీనటుల పారితోషికాలు, ‘మా’ సభ్యత్వం వంటి అంశాల గురించి చర్చలు జరిగినట్లుగా తెలిసింది. నూతన నటీనటులను సినిమాల్లోకి తీసుకోవాలంటే వాళ్లు కచ్చితంగా ‘మా’లో అసోసియేట్ లేదా లైఫ్ మెంబర్షిప్ అయినా ఉండాలని, వేరే భాషల నటులను ఇక్కడి సినిమాలకు తీసుకుంటే వాళ్లకు కూడా ‘మా’లో మెంబర్షిప్ ఉండాలనే నిర్ణయాలను ‘మా’ ప్రతిపాదించిందట. ఓటీటీల్లో నటించే ఆర్టిస్టులకూ ‘మా’లో సభ్యత్వం ఉండాలనే అంశాన్ని కూడా చర్చించారట. ‘మా’లో సభ్యత్వం ఉన్నవారిలో దాదాపు వందమంది సీనియర్ నటీనటుల పేర్లు సూచించి, వారికి అవకాశాలు ఇవ్వాలని నిర్మాతలను ‘మా’ కోరినట్లు తెలిసింది. షూటింగ్ బంద్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయ్యేలోపు ‘మా’లో సభ్యత్వం ఉన్న నటీనటులనే తీసుకోవాలన్నట్లుగా నిర్మాతలు నిర్ణయించుకోవాలని కూడా ‘మా’ కోరిందని భోగట్టా. అలా కాని పక్షంలో ‘మా’నే స్ట్రైక్‌కు పిలుపునివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. -
'మా'తో ముగిసిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సమావేశం ముగిసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో దిల్ రాజు, జీవిత రాజశేఖర్, రఘుబాబు, మంచు విష్ణు, తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగుల నిలుపుదల, ఆర్టిస్టుల పారితోషికం విషయాలపై చర్చించారు. కాగా పారితోషికం తగ్గింపు విషయంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇదివరకే ప్రత్యేక కమిటీని వేసింది. మరోవైపు ఇదే విషయంపై ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 33 మందితో ఓ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే! చదవండి: అందం కోసం సర్జరీకి సిద్ధమైన ‘బేబమ్మ’.. ఆ బాడీ పార్ట్‌కు మెరుగులు ఆ హీరోయిన్‌తో డేటింగ్ వార్తలపై నోరు విప్పిన చై, ఏమన్నాడంటే.. -
యాక్సిడెంట్ అయి సింగపూర్‌కి వెళ్తే అలా అన్నారు: మంచు విష్ణు
'మా' అసోసియేషన్ సభ్యుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంచు విష్ణు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో 'మా' సభ్యుల కోసం ఉచిత హెల్త్ చెకప్ నిర్వహించారు. దీని ప్రకారం మా సభ్యులకు డాక్టర్ కన్సల్టేషన్తో పాటు పది రకాల హెల్త్ చెకప్‌లు ఉచితంగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ.. 'మా సభ్యులకు ఏఐజీ వారు ఉచితంగా చెకప్స్ చేశారు. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్‌తో మాకు సేవలందించారు. డా.నాగేశ్వర రెడ్డికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది.గతంలో మలేసియాలో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మాస్టర్ చెకప్‌కి సింగపూర్‌కి వెళ్తే ఇండియాలో ఏఐజీ పెట్టుకొని ఇక్కడిదాకా ఎందుకు వచ్చారు అని అడిగారు. అలాంటి హాస్పిటల్లో ఇకపై మా సభ్యలకు ఉచితంగా హెల్త్ చెకప్ అందిస్తుండం సంతోషం. ఈ క్యాంప్ వల్ల మా సభ్యులందరూ బెనిఫిట్ పొందుతున్నారు' అని పేర్కొన్నారు. ఇక మంచు విష్ణు అధ్యక్షుడు అయ్యాక ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందని నటుడు నరేష్ అన్నారు. కరోనా సమయంలో ఆర్టిస్టులు కష్టాలు చూసి విష్ణు ఇప్పుడు మెడికల్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈరోజు జరిగిన క్యాంప్‌లో సుమారు 300కి పైగా మా సభ్యులు చెకప్‌లు చేసుకున్నారని తెలిపారు. ఏఐజీ ఇంటర్నేషనల్ లెవల్లో ఉందన్నారు. ఇక ఈ సందర్బంగా ఏఐజీ డైరక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో చాలా మంది ఆర్టిస్టులు వ్యాక్సిన్లు వేసుకొని షూటింగ్ చేయొచ్చా అని అడిగేవారు. వాళ్లు చాలా కష్టపడుతున్నారు. అయితే ఆర్టిస్టులలో లైఫ్‌స్టైల్ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. లంగ్స్ వ్యాధి, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అని పేర్కొన్నారు.