మా ఎన్నికలు: మేనిఫెస్టో ప్రకటించిన సీవీఎల్‌ నరసింహారావు | MAA Elections 2021: CVL Narasimha Rao Announced Manifesto For Maa Elections | Sakshi
Sakshi News home page

MAA Elections 2021: 'ప్రతి మా సభ్యుడికి ఏడాదికి 3లక్షల రూపాయలు జమ'

Published Sat, Oct 2 2021 12:54 PM | Last Updated on Sat, Oct 2 2021 2:19 PM

MAA Elections 2021: CVL Narasimha Rao Announced Manifesto In Maa Elections - Sakshi

CVL Narasimha Rao Announced Manifesto : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న నటుడు సీవీఎల్‌ నరసింహారావు మేనిఫెస్టోను ప్రకటించారు. 

2011లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్స్‌ని పర్ఫెక్ట్గా అమలు చేయడం..ఇది అమలు అయితే ఆర్టిస్టులందరికి అవకాశాలు వస్తాయి.

ఈ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడే 50మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చెయ్యాలి అనుకున్నాము..వాళ్ల పేర్లు త్వరలో ఎనౌన్స్ చేస్తాను.

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి 'మా' సభ్యుడికి  సంవత్సరానికి 3లక్షల రూపాయలు.దీన్ని వచ్చే జనవరి నుంచి అమలు చేస్తాం.

ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో 'మా' మెంబర్‌కి అసోసియేట్ మెంబర్ షిప్ సంపాదించడం.

పెన్షన్ ప్రస్తుతం 6వేలు ఇస్తున్నారు.. ఈ నవంబర్ నుంచి అది 10వేలు ఇచ్చేలా చేయడం

ఆడవాళ్ళకు ఉపయోగపడే ఆసరాని 20 ఏళ్లు క్రితం పెట్టాము .. మళ్ళీ రివైవ్ చేయడం

ఆసరా కమిటీలో వుండే 13 మంది పేర్లను త్వరలోనే ఎనౌన్స్ చేస్తాను.

ఎవరైనా మా సభ్యుడు  ఆకలి భాధలు పడుతుంటే అతను కాల్ చేసినా రెండు గంటలలో అతని ఇంటికి నెల రోజుల సరిపడా గ్రాసరినీ(సరుకులు) పంపిస్తాము

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement