CVL Narasimha Rao
-
ఏపీ ప్రభుత్వ చర్యలకు మనసారా కృతజ్ఞతలు: సీవీఎల్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లపై తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ప్రముఖ నటుడు సీవీఎల్ నరసింహారావు అన్నారు. పది మంది ప్రొడ్యూసర్ల కోసం సినిమా రేట్లపై రచ్చ చేస్తున్నారని సీవీఎల్ అన్నారు. పెద్ద సినిమాలు తీస్తున్నామంటున్న నిర్మాతలు ఆ స్థాయి సినిమా కోసం.. కింది స్థాయిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. మామూలు సినిమా అభిమాని టికెట్ రేటు రూ.1,000 ఉంటే ఫ్యామిలీతో కలిసి సినిమా ఎలా చూడగలరని ప్రశ్నించారు. టికెట్లపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రభుత్వానికి, సినిమాటోగ్రఫీ మంత్రికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని సీవీఎల్ నరసింహారావు అన్నారు. చదవండి: ('చంద్రబాబు నీకు జీవితకాలం టైం ఇస్తున్నా.. దమ్ముంటే నా ఛాలెంజ్ తీసుకో') -
బిగ్ ట్విస్ట్: రెండు రోజుల్లో ఎన్నికలు.. ‘మా’కు సీవీఎల్ షాక్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు సీవీఎల్ నరసింహరావు షాక్ ఇచ్చారు. తాజాగా తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పరీక్ష రాయకుండానే ఫెయిల్ అయ్యాను. బురదలో ఉన్న వికసించడానికి నేను కమలాన్ని కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు ప్రయత్నం చేశానని, ఒకవేళ అది జరగకపోతే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పిన కొద్ది సేపటికే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: MAA Elections 2021: ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయను!: సీవీఎల్ ఈ మేరకు ఆయన ‘దివంగత నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, దర్శకుడు దాసరి నారాయణరావు.. అందరి ఆశీస్సులు ఉన్నాయి. కచ్చితంగా ఈ ఎన్నికలు హాయిగా ముగుస్తాయి. ఒకవేళ అలా ముగియకపోతే నేను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’కి రాజీనామా చేస్తా. ఇందులో సభ్యుడిగా ఉండను. ఇలాంటి గందరగోళ, ఇబ్బందికర పరిస్థితులకి నేను దోహదం చేశాను. కాబట్టి ఇకపై ఓటు వేయను’ అని అన్నారు. ఇలా చెప్పిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేశారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ సీవీఎల్ రాజీనామా సర్వత్రా ఆసక్తి నెలకొంది. చదవండి: నరేశ్‌పై శివాజీ రాజా సంచలన ఆరోపణలు, ‘మా’ వివాదాలకు అతడే కారణం మొదట ‘మా’ అధ్యక్ష పోటీకి బరిలో దిగిన ఆయన నేమినేషన్ కూడా దాఖలు చేశాడు. అనంతరం పోటీ నుంచి తప్పకుంటూ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధ్యక్ష పిఠానికి ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు ‘మా’ ఎన్నికలు 10న ఈ ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఎవరూ అధ్యక్ష పీఠం దక్కించుకోన్నారోనని ఉత్కంఠ నెలకొంది. -
‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తా!: సీవీఎల్ నరసింహ రావు
ప్రచారం, విమర్శలు, ఆరోపణలతో వాడివేడిగా సాగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు తాజాగా సీవీఎల్ నర్సింహ రావు వ్యాఖ్యలతో మరింత ఆసక్తిగా మారాయి ‘మా’ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఫిలించాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఎన్నికల్లో తాను ఓటు వేయానన్నారు. ‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు చాలా బాధను కలిగిస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో నిలబడితే తాను మాత్రమే ఓడిపోతాననుకున్నాను అన్నారు. చదవండి: నరేశ్‌పై శివాజీ రాజా సంచలన ఆరోపణలు, ‘మా’ వివాదాలకు అతడే కారణం కానీ తాను మౌనంగా ఉండిపోతే మా సభ్యులు అందరూ ఓడిపోతారని ఇన్ని ప్రయత్నాలు చేశానన్నారు. అయినా ప్రస్తుతం ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు చూసి అలా జరగకుండా ఉంటే బాగుండు అనిపిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ విషయంలో చివరికి తానే గెలుస్తాననే నమ్మకం ఉందని, ఎన్నికల్లో కొంత మంది గెలిచి కొంత మంది ఓడిపోతే ప్రతి వాళ్ళు ఓడిపోతారన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల ఆశిస్సులతో ‘మా’ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని ఆశభావం వ్యక్తం చేశారు. చదవండి: MAA Elections 2021: ‘మా’ ఎన్నికలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు ఒకవేళ ఎన్నికల్లో ఇలాంటి గందరగోళ పరిస్థితులే కొనసాగితే తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సీవీఎల్ నర్సంహి రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా మొదట ‘మా’ అధ్యక్ష పోటీకి బరిలో దిగిన ఆయన నేమినేషన్ కూడా దాఖలు చేశాడు. అనంతరం పోటీ నుంచి తప్పకుంటూ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఎవరూ గెలిచిన మాలో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లాలని రెండు ప్యానల్లను కోరుతూ ఫిలించాంబర్‌లో మీడియాతో ముచ్చటించిన ఆయన తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
MAA Elections 2021: ప్రకాశ్ రాజ్‌పై సీవీఎల్ షాకింగ్ కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రకాశ్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. మీడియా సమావేశాలు పెట్టి మరి ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతున్నారు. (చదవండి: అసభ్య వ్యాఖ్యలతో వీడియో.. కరాటే కల్యాణి, నరేశ్‌పై హేమ ఫిర్యాదు) తాజాగా ప్రకాశ్ రాజ్‌పై నటుడు సీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్ష పదవి పోటీ నుంచి ఆయన తప్పుకున్న విషయం తెలిసిందే. నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాక సీవీఎల్ తన మద్దతును మంచు ప్యానెల్ కు తెలిపాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ నీ గెలిపించండి. దేశం అన్నా.. దేవుడు అన్నా.. చులకన భావం వున్న ప్రకాశ్ రాజ్ ను ఒడించండి. నేను.. నేను.. నేను.. తప్పు మరొక విషయం పట్టని ప్రకాశ్ రాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా వుంటే బాగుంటుంది. బహుశా అతను విత్ డ్రా చేసుకుంటాడు అని ఆశిస్తున్నాను’ అంటూ సీవీఎల్ అన్నారు. -
‘మా’ ఎన్నికలు: సీవీఎల్ నరసింహ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్(మా) ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో మా ఎన్నికలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రచారాలు, ఆరోపణలు వరకు ఉండే ఎన్నికలు ఈ సారి ఫిర్యాదుల వరకు వెళ్లాయి. ఈ రోజు ఉదయం ప్రకాశ్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తూ.. మంచు విష్ణు ప్యానల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందంటూ ఆరోపించగా.. బ్యాలెట్ పేపర్ విధానం ద్వారానే ‘మా’ ఎన్నికలు జరిపించాలని కోరుతూ మంచు విష్ణు ఎన్నికల అధికారికి లేఖ రాశాడు. ఇలా అభ్యర్థులు ఒకరిపై ఒకరూ ఫిర్యాదు చేసుకుంటుండగా.. మరోవైపు సీవీఎల్ నరసింహ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ‘మా’ ఎన్నికల అధికారి మంచు విష్ణు లేఖ ఫిలించాంబర్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఓ సభ్యుడిగా రెండు ప్యానల్స్‌కు నాదోక విన్నపం. మురళీ మోహన్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సభ్యుల కోసం ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. వాటిని ఈ సారి కూడా అమలు చెయాలి. ఏ ప్యానల్ గెలిచిన బిల్డింగ్ కట్టడానికి రూ. 6 కోట్లు ఇవ్వడానికి ఒక అభిమాని సిద్దంగా ఉన్నారు. హెల్త్ ఇన్యూరెన్స్ పక్కాగా అమలు పరచడం.. ఏ సభ్యుడు కూడా ఆకలితో భాధ పడకుండా వాళ్లను వెంటనే ఆదుకొనే విధంగా చర్యలు తీసుకోవాలి’.. ఎవరూ గెలిచినా ఈ ప్రణాళికలు అమలు చేయాలని కోరుతున్నా’’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కాగా మొదట ‘మా’ అధ్యక్ష పదవికి సీవీఎల్ నరసింహ రావు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ వేసిన మూడో రోజుకే ఆయన అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటూ నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. చదవండి: మంచు విష్ణు ప్యానెల్‌పై ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు -
'మా'ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్: మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే...
CVL Narasimha Rao Withdraw His Nomination: మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ ఎదురైంది. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు సీవీఎల్ నరసింహారావు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీని వెనుక కారణం ఉందని, రెండు రోజుల్లో మీడియా ముందుకు వచ్చి ఆ వివరాలను వెల్లడిస్తానని సీవీఎల్పేర్కొన్నారు. తనకు అధ్యక్ష పదవి కంటే మా సభ్యుల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తను ప్రకటించిన మేనిఫెస్టో అమలు అయ్యేందుకు చూస్తానని తెలిపారు. ఇప్పుడు పోటీలో ఉన్న రెండు ప్యానెల్స్‌లో ఎవరికీ మద్ధతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. కాగా నిన్న బండ్లగణేశ్ సైతం 'మా' జనరల్ సెక్రెటరీ పదవికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. చదవండి : మా ఎన్నికలు: మేనిఫెస్టో ప్రకటించిన సీవీఎల్ నరసింహారావు -
మా ఎన్నికలు: మేనిఫెస్టో ప్రకటించిన సీవీఎల్ నరసింహారావు
CVL Narasimha Rao Announced Manifesto : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న నటుడు సీవీఎల్ నరసింహారావు మేనిఫెస్టోను ప్రకటించారు. ►2011లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్స్‌ని పర్ఫెక్ట్గా అమలు చేయడం..ఇది అమలు అయితే ఆర్టిస్టులందరికి అవకాశాలు వస్తాయి. ►ఈ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడే 50మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చెయ్యాలి అనుకున్నాము..వాళ్ల పేర్లు త్వరలో ఎనౌన్స్ చేస్తాను. ►హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి 'మా' సభ్యుడికి సంవత్సరానికి 3లక్షల రూపాయలు.దీన్ని వచ్చే జనవరి నుంచి అమలు చేస్తాం. ►ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో 'మా' మెంబర్‌కి అసోసియేట్ మెంబర్ షిప్ సంపాదించడం. ►పెన్షన్ ప్రస్తుతం 6వేలు ఇస్తున్నారు.. ఈ నవంబర్ నుంచి అది 10వేలు ఇచ్చేలా చేయడం ►ఆడవాళ్ళకు ఉపయోగపడే ఆసరాని 20 ఏళ్లు క్రితం పెట్టాము .. మళ్ళీ రివైవ్ చేయడం ►ఆసరా కమిటీలో వుండే 13 మంది పేర్లను త్వరలోనే ఎనౌన్స్ చేస్తాను. ►ఎవరైనా మా సభ్యుడు ఆకలి భాధలు పడుతుంటే అతను కాల్ చేసినా రెండు గంటలలో అతని ఇంటికి నెల రోజుల సరిపడా గ్రాసరినీ(సరుకులు) పంపిస్తాము -
అలాంటివాళ్లు పోటీకి అర్హులు కాదు
ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ వీడియో ద్వారా మేనిఫెస్టోను విడుదల చేశారు.. వాటిలోని ముఖ్యాంశాలు... ► 2011లో ‘మా’ సంక్షేమం కోసం కొన్ని రిజల్యూషన్స్ అనుకున్నాం. అప్పుడు మురళీమోహన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అదే మేనిఫెస్టోను అమలు చేయడమే నా తక్షణ కర్తవ్యం. ► ప్రత్యూష మరణించినప్పుడు ఆడపిలల్ల రక్షణ, ఆత్మ గౌరవం కాపాడటం కోసం ‘ఆసరా’ అనే ఆర్గనైజేషన్ ప్రారంభించాం. ఈ ఆర్గనైజేషన్‌ను ఇప్పుడు మా ఆధ్వర్యంలో యాక్టివ్ చేస్తాం. ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు అయింది. ► ప్రభాకర్‌రెడ్డి, కాంతారావు, పైడి జయరాజ్ వంటి తెలంగాణ నటులను ‘మా’ ద్వారా మళ్లీ మళ్లీ గుర్తు చేయాలని కర్తవ్యంగా పెట్టుకున్నాం. లేకపోతే వారిని మరచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ► ‘మా’లో లక్ష రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. అలాంటివారిని కూడా సభ్యులుగా చేర్చే ప్రయత్నం చేస్తాం. ► ప్రస్తుతం ప్యానళ్లలో ఉంటున్న వాళ్లలో 95శాతం మంది ఇప్పటికే ‘మా’ కార్యవర్గాల్లో పనిచేశారు. పదేళ్ల క్రితం తీసుకొచ్చిన రిజల్యూషన్స్‌ని ఎందుకు అమలు చేయడం లేదో వారే సమాధానం చెప్పాలి. చెప్పలేని వాళ్లు ఎన్నికల్లో మళ్లీ పోటీ పడటానికి, పోటీ చేసి గెలవడానికి, గెలిచి మళ్లీ మనల్ని మోసం చేయడానికి అర్హులు కారని నా ఉద్దేశం. -
MAA Elections 2021: సీవీఎల్ నరసింహారావుకు విజయశాంతి మద్దతు
-
మా ఎన్నికలు: సీవీఎల్ నరసింహారావుకు విజయశాంతి మద్దతు
సాక్షి, హైదరాబాద్: 'మా' అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన సీవీఎల్ నరసింహారావుకు నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి మద్దతు తెలిపారు. 'మా' సభ్యురాలిని కాకున్నా ఒక కళాకారిణిగా ఈ అంశంపై స్పందిస్తున్నానన్నారు. ఎన్నికలపై సీవీఎల్ ఆవేదన న్యాయమైనదని వ్యాఖ్యానించారు. కాగా మధ్య తరగతి, చిన్న కళాకారులు, తెలంగాణ కళాకారులకు న్యాయం జరగటం కోసం పోటీ చేస్తున్నానంటూ సీవీఎల్ నరసింహారావు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. 'మా'కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండు విభాగాలు చేసి, రెండింటికీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: ఇండస్ట్రీకి సేవ చేయడమే నా కర్తవ్యం: మంచు విష్ణు -
MAA Elections 2021: 'మా' అధ్యక్ష బరిలో మరో అభ్యర్థి
-
MAA Elections 2021: 'మా' అధ్యక్ష బరిలో మరో అభ్యర్థి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అధ్యక్ష బరితో తాము ఉన్నామంటూ రోజుకో ఆర్టిస్ట్ ముందుకొస్తున్నారు. అధ్యక్ష రేసులో ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ ఉన్నామని ప్రకటించగా, తాజాగా మరో నటుడు కూడా పోటీ చేస్తానని ప్రకటించాడు. విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించిన సీనియర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటించారు. తన ప్యానల్ తెలంగాణ వాదమని, సినిమా అవకాశాల్లో తెలుగు వారికి న్యాయం జరగాలని నరసింహారావు అన్నారు. 2009లోనే తెలంగాణ ‘మా’ ఏర్పడిందని, ఇప్పటికే ‘మా’ని రెండు విభాగాలుగా చేయాలని సినీ పెద్దలను కోరారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను అన్నివిధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1721373393.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఇండస్ట్రీకి సేవ చేయడమే నా కర్తవ్యం: మంచు విష్ణు