MAA Elections 2021: 'మా' అధ్యక్ష బరిలో మరో అభ్యర్థి | MAA Elections 2021: Actor CVL Narasimha Rao Announces His Contesting | Sakshi
Sakshi News home page

MAA Elections 2021: 'మా' అధ్యక్ష బరిలో మరో అభ్యర్థి

Published Sun, Jun 27 2021 3:08 PM | Last Updated on Sun, Jun 27 2021 4:40 PM

MAA Elections 2021: Actor CVL Narasimha Rao Announces His Contesting - Sakshi

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అధ్యక్ష బరితో తాము ఉన్నామంటూ  రోజుకో ఆర్టిస్ట్ ముందుకొస్తున్నారు. అధ్యక్ష రేసులో ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్‌, హేమ ఉన్నామని ప్రకటించగా, తాజాగా మరో నటుడు కూడా పోటీ చేస్తానని ప్రకటించాడు.  విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించిన సీనియర్‌ ఆర్టిస్ట్‌ సీవీఎల్‌ నరసింహారావు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటించారు.

తన ప్యానల్‌ తెలంగాణ వాదమని, సినిమా అవకాశాల్లో తెలుగు వారికి న్యాయం జరగాలని నరసింహారావు అన్నారు. 2009లోనే తెలంగాణ ‘మా’ ఏర్పడిందని, ఇప్పటికే ‘మా’ని రెండు విభాగాలుగా చేయాలని సినీ పెద్దలను కోరారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను అన్నివిధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 
 


చదవండి:
ఇండస్ట్రీకి సేవ చేయడమే నా కర్తవ్యం: మంచు విష్ణు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement