MAA elections
-
మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!
-
మళ్లీ వార్తల్లో నిలిచిన మా ఎన్నికలు.. మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ కామెంట్లు
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఇండస్ట్రీలో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మా అధ్యక్షుడిగా మంచు విష్ణుపై ప్రకాశ్ రాజ్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు పదవీ కాలం రెండేళ్లు పూర్తి కావస్తోంది. కొన్ని నెలల్లో మళ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు పని తీరుపై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.సుమారు రెండేళ్ల క్రితం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి కోసం మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ మధ్య హోరా హోరీగా పోటీ కొనసాగింది. ఈ బిగ్‌ఫైట్‌లో మంచు విష్ణు భారీ విజయంతో మా అధ్యక్షుడి పీఠాన్ని అదరోహించారు. ఆ తర్వాత ఆయన సినీ కార్మికులతో పాటు సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తున్న వారికి మా సభ్యత్వంతో పాటు పలు సహాయసహకారాలు అందించారు. కానీ ఆ ఎన్నికల్లో అందరి ఎజెండాలో మా బిల్డింగ్ నిర్మాణం ప్రధానంగా ఉంది. త్వరలో దానిని నిర్మాస్తామని మంచు విష్ణు గతంలో ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికి కూడా మా బిల్డింగ్ నిర్మాణం జరగలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు గురించి ప్రకాశ్ రాజ్ ఇలా చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్‌పై పాక్ క్రికెటర్ బలుపు మాటలు.. రజాక్,అఫ్రిది,అక్తర్ క్షమాపణలు) 'మా అధ్యక్షుడిగా మంచు విష్ణు పదవీ కాలం రెండేళ్లు పూర్తి కావస్తోంది. కనీసం ఒక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేదు. అలాగే మా కి సొంత భవనం కూడా లేదు. మంచు విష్ణు ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదు సున్నా.' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. మా అధ్యుక్షుడిగా మంచు విష్ణుని ఎన్నుకున్న సభ్యులు అందరూ ఇప్పుడు ఆలోచించాలంటూ ప్రకాశ్ రాజ్ చెప్పారు. అతను ఈ రెండేళ్లలో ఏమి చేశాడో చెప్పాలని కోరాడు. బోగస్ ఓట్లతో పాటు బయట నుంచి విమానాల్లో పిలిపించుకోవడం, వంటి కార్యక్రమాలు చేయడంతో విష్ణు గెలిచాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో..? చెయ్యనో..? తెలియదని చెప్పిన ప్రకాశ్ రాజ్.. ఇక నుంచి తన దృష్టి జాతీయ అంశాలపై ఉందని పేర్కొన్నారు. కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల తాను మా అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. -
మాపై ట్రోల్స్ చేస్తుంది ఆ 'స్నేక్' బ్యాచ్‌నే: మంచు విష్ణు
సినిమా రంగానికి చెందిన కొందరిని టార్గెట్ చేస్తూ పలువురు ట్రోల్స్ చేస్తుంటారు. అవి ఆరోగ్యకరమైనవి అయితే పర్వాలేదు.. కానీ ఒక్కోసారి అవి శ్రుతిమించి వారిని బాధకు గురిచేస్తాయి కూడా.. ఈ ట్రోల్స్ వల్ల సినిమా రంగంలోని చాలామంది ప్రముఖులు ఇబ్బందులకు గురైనవారే ఉన్నారు. 'మా' ఎన్నికల నేపథ్యంలో మంచు మోహన్‌బాబు కుటుంబంపై కొందరు పనికట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారని వారి అభిమానులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. అప్పటికి అవి ఏ మాత్రం తగ్గకపోవడంతో మంచు విష్ణు కలుగచేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగ ఈ విషయంపై ఆయన స్పందించారు. (ఇదీ చదవండి: మామయ్య కోసం పొలిటికల్ వేడుకకు వెళ్తున్న అల్లు అర్జున్) తమపై ట్రోలింగ్ చేయిస్తున్నది.. చేస్తున్నది ఎవరో ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలుసని ఆయన అన్నారు. అదొక 'స్నేక్' బ్యాచ్ చేస్తున్న పనే అని విష్ణు అన్నారు. కానీ అలాంటి ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోనని ఆయన తెలిపారు. ప్రస్తుత రోజుల్లో అందరికీ ట్రోల్స్ నుంచి ఇబ్బందులు ఎదరవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. కానీ అవి కొన్నిసార్లు మితిమీరిపోతున్నాయని అలాంటి సమయంలో మాత్రం సహించేదిలేదని విష్ణు పేర్కొన్నారు. కొంతమంది తమ మీద వేసే సెటైర్లు చాలా బాగుంటాయి.. వాటిని చూసినప్పుడు తాము కూడా ఎంజాయ్ చేస్తామని ఆయన అన్నారు. (ఇదీ చదవండి: చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో) కొంతమంది పనికట్టుకుని డబ్బులిచ్చిమరీ ట్రోల్ చేయిస్తున్నారు. అది మాత్రం చాలా తప్పని విష్ణు ఇలా తెలిపారు. 'మా ఎలక్షన్స్ ముందు వరకూ నాపై ట్రోలింగ్ ఉండేది కాదు.. ఎప్పుడైతే ఎలక్షన్స్ ప్రారంభం అయ్యాయో అప్పుడే నాపై ట్రోల్ చేయడం ప్రారంభించారు. అది ఎవరు చేయించారో అందరికీ తెలుసు. ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడెందుకులే’ అని ఆ ఇంటర్వ్యూలో మంచు విష్ణు అన్నారు. కానీ ఆ స్నేక్ బ్యాచ్ ఎవరు..? దాని వెనుక ఎవరున్నారనేది ఆయన తెలియచేయలేదు. 'కన్నప్ప'కు శ్రీకారం చుట్టిన మంచు విష్ణు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తాజాగ వెల్లడించారు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు.. శ్రీ కాళహస్తిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాస్థాయిలో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో విష్ణు. ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. మహా భారతం సిరీస్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఆదిపురుష్ భామ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్గా కనిపించనుంది. -
హీరో మంచు విష్ణు షాకింగ్ నిర్ణయం?
తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఆదివారం జరిగాయి. ప్యానల్‌ని గెలిపించిన దిల్ రాజు.. అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్నారు. దీంతో అందరి చూపు మా(మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్) ఎన్నికలపై పడింది. 2021 అక్టోబరులో జరిగిన పోటీలో ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. 'మా' ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న విష్ణు.. తాజాగా జరిగిన సర్వసభ్య సమావేశంలో ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. (ఇదీ చదవండి: సెట్లో అవమానాలు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!) రెండేళ్ల కాలానికి 'మా' ఎన్నికలు జరుగుతుంటాయి. 2021 అక్టోబరులో జరిగాయి కాబట్టి ఈ ఏడాది సెప్టెంబరులో ఎలక్షన్స్ జరగాలి. అయితే వాటిని వచ్చే ఏడాది మేలో నిర్వహించాలని తీర్మానించినట్లు పలువురు సభ్యుల ద్వారా తెలిసింది. అసోసియేషన్ ఆడిట్ సమస్యలే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు.. మరోసారి 'మా' ఎన్నికల్లో పోటీ చేయకూడదాని అనుకుంటున్నారట. తన నిర్ణయాన్ని సభ్యులకు కూడా చెప్పారట. దీంతో ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశముంటుంది. ఈ క్రమంలోనే ఎన్నికల గడువు పూర్తయ్యేలోగా సభ్యులకు ఇచ్చిన హామీలని పూర్తి చేయాలనే ఆలోచనతో మంచు విష్ణు ఉన్నట్లు సమాచారం. గతేడాది 'జిన్నా' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన విష్ణు.. ప్రేక్షకుల్ని అలరించడంలో ఫెయిలయ్యాడు. ప్రస్తుతానికి అయితే కొత్త ప్రాజెక్టులు ఏం చేయట్లేదు. విష్ణు ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడని కొన్నాళ్లు ముందు మోహన్ బాబు చెప్పారు గానీ అది ఎప్పుడనేది ఇంకా క్లారిటీ లేదు. (ఇదీ చదవండి: 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్.. తెలిసే ఈ తప్పు చేశారా?) -
MAA: రాజీనామాలపై మంచు విష్ణు కీలక నిర్ణయం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ‘మా’ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలుపొందిన 11 మంది రాజీనామాలను ఆమోదించారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదించామని మంచువిష్ణు క్లారిటీ ఇచ్చారు. అయితే ‘మా’సభ్యత్వానికి నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించలేదని తెలిపారు. ‘మా’ బిల్డింగ్‌పై చర్చలు జరుగుతున్నాయని.. వారం, పదిరోజుల్లో నిర్ణయం తీసుకుని మంచు విష్ణు అనఆనరు. కాగా, ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు…ప్రకాశ్ రాజ్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మా ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్‌లోనూ అక్రమాలు జరిగాయని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొంది, రాజీనామా చేసిన సభ్యులు వీరే జాయింట్ సెక్రటరీ: ఉత్తేజ్ వైస్ ప్రెసిడెంట్: బెనర్జీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్ ఈసీ మెంబర్స్ బ్రహ్మాజీ శివారెడ్డి సుడిగాలి సుధీర్ ప్రభాకర్ తనీష్ కౌశిక్ సురేశ్ కొండేటి సమీర్ -
యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు తన తొలి నిర్ణయంగా ‘మా’ మహిళల భద్రతకు ముందడుగా వేశారు. వారి భద్రత కోసం ప్రత్యేకంగా విమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్(WEGC)ను ఏర్పాటు చేస్తున్నామని, మహిళల సాధికారిత కోసం ఈ కమిటీ పనిచేస్తుందని విష్ణు తన ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: ట్విటర్లో మంచు మనోజ్, ఆర్జీవీల మధ్య ఆసక్తికర సంభాషణ ఇక ఈ విషయం సోషల్ మీడియాలో ప్రకటించిన అనంతరం మంచు విష్ణు పలు యూట్యూబ్ ఛానళ్లుపై మండిపడ్డారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నటీమణులు, హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపెక్షించేది లేదని హెచ్చిరించారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని, అసభ్యకర రీతిలో వారిపై రూమర్లు క్రియేట్ చేస్తు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయన్నారు. అలాంటి ఛానళ్లపై చర్యలు తప్పవన్నారు. చదవండి: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయం ఇక యూట్యూబ్ ఛానళ్లలో థంబ్‌నైల్స్ హద్దులు మీరుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నటీమణులు మన ఆడపడుచులని, వారిని గౌరవించాలని విష్ణు విజ్ఞప్తి చేశారు. అలాగే హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించబోమన్నారు. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు విష్ణు తెలిపారు. పరిధి దాటే ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లని నియంత్రించడం తన ఎజెండాలో ఓ అంశమని ఆయన పేర్కొన్నారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని, తన కుటుంబానికి, చిత్ర పరిశ్రమకి సహకారం అందిస్తూనే ఉందని మంచు విష్ణు పేర్కొన్నారు. #MAA growing stronger and more accountable! More Power to Women 💪🏽 pic.twitter.com/OSkAQSEUJF — Vishnu Manchu (@iVishnuManchu) October 22, 2021 -
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయం
Manchu Vishnu Announced Women Empowerment and Grievance Cell: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మాలో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. విమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్(WEGC)ను ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని, మహిళల సాధికారిత కోసం ఈ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని, త్వరలోనే కమిటీ మెంబర్లను ప్రకటిస్తామని వెల్లడించారు. #MAA growing stronger and more accountable! More Power to Women 💪🏽 pic.twitter.com/OSkAQSEUJF — Vishnu Manchu (@iVishnuManchu) October 22, 2021 -
నాగబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు
Kota Srinivasa Rao Comments On Mega Brother Nagababu: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ మధ్య పలువురు నటీనటులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ యుట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ యాంకర్ అనసూయ డ్రెస్పింగ్పై కోట చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతకుముందు ‘మా’ ఎన్నికల నేపథ్యంలో విష్ణుకు మద్దతు ప్రకటించిన కోట అదే సమయంలో ప్రకాశ్ రాజ్‌పై చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబును ఆయన టార్గెట్ చేశారు. గతంలో తనపై చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ ఈ ఇంటర్య్వూలో మెగా బ్రదర్‌కు కౌంటర్ ఇచ్చారు. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత ఈ సందర్భంగా కోట మాట్లాడుతూ.. ‘చిరంజీవి ఒక పక్క, పవన్ కల్యాణ్ మరో పక్క వీరిద్దరు లేకపోతే ఈ నాగబాబు ఎవరు?. వారే లేకపోతే నాగబాబు అనే వ్యక్తి మామూలు నటుడు మాత్రమే. అతనేం ఉత్తమ నటుడు కాదు, గొప్ప నటుడు కాదు. ఆయనకేందుకు అసలు. గతంలో నాగబాబు ప్రకాశ్ రాజ్‌ను తిట్టారు. అది అందరికి తెలుసు. నేను ప్రకాశ్ రాజ్‌ను అన్నానని ఇప్పుడు ఆయన నన్ను విమర్శించారు. అపుడు ఆయనను ఏమైనా అన్నానా? నాగబాబు నాపై చేసిన కామెంట్స్‌కు అప్పుడే నేను స్పందించి ఉంటే టీవీల్లో, చానల్లో డిబెట్లు అంటూ రచ్చ జరిగేది’ అంటూ కోట మండిపడ్డారు. అనంతరం ఇప్పటికి తాను అదే చెబుతానని, చిరంజీవి, పవన్ కల్యాణ్ లేకపోతే నాగబాబుకు గుర్తింపు లేదన్నారు. ఒక్క మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్పా అంటూ కోట సంచలన కామెంట్స్ చేశారు. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! కాగా ‘మా’ ఎన్నికల నేపథ్యంలో కోట శ్రీనివాసరావు మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ప్రకాశ్ రాజ్ గురించి మాట్లాడుతూ.. తాను ప్రకాశ్ రాజ్ కలిసి 15 సినిమాలకు పైగా నటించానని.. ఒక్కసారి కూడా ఆయన షూటింగ్‌కు సమయానికి రాలేదన్నారు. అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా గెలిపిస్తే ఏం చేస్తాడు అంటూ కోట సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోట వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబుశాడు కోట శ్రీనివాసరావు. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు.. రేపోమాపో పోయే కోట ఇంకా ఎప్పుడు మారతాడు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఇండస్ట్రీలో ఉన్న పలువురు పెద్దలు కూడా నాగబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రకాశ్‌రాజ్‌పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాస రావు -
ఆర్జీవీ ట్వీట్‌కి మంచు మనోజ్ దిమ్మతిరిగే పంచ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి పది రోజులు గడుస్తున్నా.. వివాదం మాత్రం తగ్గడం లేదు. మాకు అన్యాయం జరిగింది, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్ ఆరోపించడమే కాకుండా సోమవారం ‘మా’ఎన్నికల పోలింగ్ సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసుల సమక్షంలో పరిశీలించారు. మరోవైపు తాము ప్రజాస్వామ్య పద్దతిలోనే గెలిచామని, ప్రకాశ్ రాజ్ ఆరోపణలు అన్ని అర్థరహితమని ‘మా’అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు అంటున్నాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇలా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంపై సినీ పెద్దలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ‘మా’వివాదంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్.. వాళ్లంతా జోకర్లేనట!) ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే.. సోషల్ మీడియా వేదికగా తన అసంతృతప్తిని తనదైన స్టైల్లో వ్యక్తం చేశాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మంచు మనోజ్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. మా ఒక సర్కస్ అయితే… మీరు రింగ్ మాస్టర్ సర్ అంటూ ట్వీట్ చేశాడు. మరి మనోజ్ ట్వీట్ కి వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. And you are the Ring Master sir 🙌🏽 https://t.co/gW8VaFhwdb — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 19, 2021 -
‘మా’వివాదంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్.. వాళ్లంతా జోకర్లేనట!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం అయన అలవాటు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటాడు ఆర్జీవీ. (చదవండి: చాలా విషయాల్లో బైలాస్ మార్చాలనుకుంటున్నా: మంచు విష్ణు) తాజాగా ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వివాదంపై తనదైన స్టైల్లో స్పందించాడు. మా అసోసియేషన్ లో సర్కస్ అని.. రెండు రోజుల కింద ట్వీట్ చేసిన ఆర్జీవీ.. తాజాగా మరోసారి మా వివాదంపై కాంట్రవర్శియల్ కామెంట్ చేశాడు. సిని‘మా’ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఆర్జీవీ ట్వీట్‌కి మంచు మనోజ్ దిమ్మతిరిగే పంచ్) Cine”MAA” is a CIRCUS full of JOKERS — Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2021 -
'మా' ఎన్నికల్లో మరో వివాదం.. పోలీసుల ఎంట్రీ
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. పోలింగ్ రోజున జరిగిన పరిణామాలపై ఇప్పటికే సీసీ టీవీ ఫుటేజ్ కోరిన ప్రకాశ్‌రాజ్ తాజాగా ఆయన ప్యానల్ సభ్యులతో కలిసిజూబ్లీహిల్స్ స్కూల్‌కు చేరుకున్నారు. సీసీ ఫుటేజీ తమకు అందించాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ను డిమాండ్ చేశారు.అయితే మంచు విష్ణు లేనందున ఇరువురి సమక్షంలో మాత్రమే సీసీ ఫుటేజీ ఇస్తామని ఎన్నికల అధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్‌కు సీసీటీవీ ఫుటేజీని ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీంతో వివాదం నెలకొంది. మరోవైపు సీసీటీవీ ఫుటేజీని సీజ్ చేసే క్రమంలో జూబ్లీహిల్స్ స్కూల్‌కు పోలీసులు సైతం చేరుకున్నారు. ఈ సందర్భంగా సీసీ ఫుటేజీని ప్రిజర్వ్ చేస్తామని ఈ సందర్భంగా పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వివాదం నెలకొంది. మరోవైపు సీసీటీవీ ఫుటేజీని సీజ్ చేసే క్రమంలో జూబ్లీహిల్స్ స్కూల్‌కు పోలీసులు సైతం చేరుకున్నారు. కాగా, అలాగే ప్రుకాశ్ రాజ్ ఆరోపణలపై స్పందించిన మంచు విష్ణు.. ‘ప్రకాశ్ రాజ్ సంతోషంగా సీసీ పుటేజ్‌ను చూడొచ్చు. మేము ప్రజాస్వామ్య బద్ధంగానే గెలిచాం. ఎన్నికల సమయంలో మా మధ్య చిన్న చిన్న గొడవలు ఇరువైపుల జరిగి ఉండోచ్చు. దీంతో మా మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మాత్రమే వచ్చాయి తప్ప అక్కడ ఏం జరగలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానల్లో గెలిచిన వారి రాజీనామాలు మేము మీడియా ద్వారానే విన్నాం. ఇప్పటి వరకు నాకు ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది. మిగతా ఆయన ప్యానల్ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదు’ అని విష్ణు స్పష్టం చేశారు. అలాగే ప్రకాశ్ రాజ్, నాగబాబుల రాజీనామాలు తాను ఆమోదించలేదని విష్ణు తెలిపారు. కాగా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఈనెల 10న జరిగిన ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది: మంచు విష్ణు పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర ట్వీట్ చేసిన మంచు విష్ణు -
ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది: మంచు విష్ణు
గేమ్ ఆడిన వారికంటే చూసిన వారికే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉందని అర్థం అవుతుందని ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. శనివారం ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలో తన ప్యానల్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి తమ గెలుపును సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బాబూ మోహన్‌తో పాటు మొత్తం తమ ప్యానల్ సభ్యుల కలిసి ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తమ గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి పేరుపేరున మంచు విష్ణు ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ గెలుపు నా ప్యానల్‌ది.. మా అందరిది. మా ప్యానల్లో ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే నాకు ఓట్లు పడ్డయి. వారందరికి నా కృతజ్ఞతలు. ప్రతి పోటీలో గెలుపు-ఓటములు సహజం. ఈ సారి మేము గెలిచాం. ఇది మా అందరి కష్టం. ఈ సారి వాళ్లు గెలవలేదు. ఐ విష్ బెటర్ లక్ నెక్ట్‌టైం’ అని వ్యాఖ్యానించారు. అలాగే ప్రుకాశ్ రాజ్ ఆరోపణలపై స్పందించిన మంచు విష్ణు.. ‘ప్రకాశ్ రాజ్ సంతోషంగా సీసీ పుటేజ్‌ను చూడొచ్చు. మేము ప్రజాస్వామ్య బద్ధంగానే గెలిచాం. ఎన్నికల సమయంలో మా మధ్య చిన్న చిన్న గొడవలు ఇరువైపుల జరిగి ఉండోచ్చు. దీంతో మా మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మాత్రమే వచ్చాయి తప్ప అక్కడ ఏం జరగలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానల్లో గెలిచిన వారి రాజీనామాలు మేము మీడియా ద్వారానే విన్నాం. ఇప్పటి వరకు నాకు ప్రకాశ్ రాజ్ రాజీనామానే అందింది. మిగతా ఆయన ప్యానల్ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదు’ అని విష్ణు స్పష్టం చేశారు. అలాగే ప్రకాశ్ రాజ్, నాగబాబుల రాజీనామాలు తాను ఆమోదించలేదని విష్ణు తెలిపారు. -
పవన్ కల్యాణ్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్: మంచు విష్ణు
Manchu Vishnu About Pawan Kalyan: అలయ్-బలయ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, తాను మాట్లాడుకోకపోవడంపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం మాట్లాడుకున్నాం అని, అయితే ఉప రాష్రపతి ఉండట వల్ల స్టేజ్‌పై మాత్రమే మాట్లాడుకోలేదని పేర్కొన్నారు. ఇక కార్యక్రమం అనంతరం పోస్ట్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ..పవన్ ఫ్యాన్స్ కోసమే ఆ వీడియోను షేర్ చేసినట్లు తెలిపారు. తమ మధ్య విభేదాలు లేవని, పవన్‌కల్యాణ్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. అంతేకాకుండా నిన్న తండ్రి మోహన్‌బాబు-చిరంజీవి ఫోన్లో మాట్లాడుకున్నట్లు వివరణ ఇచ్చారు. కాగా బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్-బలయ్ కార్యక్రమంలో మంచు విష్ణు- పవన్ కల్యాణ్ ఎదురుపడినా ఇద్దరి మధ్యా మాటల్లేవ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్ Can you guess whose at the end of the video? 💪🏽 pic.twitter.com/FJyMiWRA2T — Vishnu Manchu (@iVishnuManchu) October 17, 2021 చదవండి: ‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్‌పై మండిపడ్డ మంచు లక్ష్మి శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అండ్ టీం -
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం ఫోటోలు
-
‘మా’లో వివాదంలో మరో ట్విస్ట్.. రంగంలోకి పోలీసులు
MAA Elections 2021: ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసి వారం రోజులు గడుస్తున్నా... వివాదం మాత్రం తగ్గడం లేదు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానల్ మధ్య హోరా హోరిగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు చేశారు ప్రకాశ్ రాజ్. అంతేకాదు ఎన్నికల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామాలు కూడా చేశారు. ఓట్ల కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని, ఎలక్షన్ రోజున మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. ఎలక్షన్ టైం సీసీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. కానీ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని వెల్లడించారు. తాజాగా ఈ వివాదం కొత్త కోణం చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తూందో చూడాలి. -
'మా' ఎన్నికలపై ఆర్జీవీ సెటైర్లు.. ట్వీట్ వైరల్
RGV Satirical Comments On MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈసారి సినీ ఇండస్ట్రీనే కాదు..తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపాయి. ‘మేమంతా ఒకే కుటుంబం. మాది సినిమా కుటుంబం. అందరం కలిసే ఉంటాం’ అంటూనే ప్రత్యక్ష ఆరోపణలకు తెరదీశారు. ఎన్నికలు పూర్తయినా ఇంకా మాటల దాడులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. చదవండి: వైరల్: షో మధ్యలో బాలయ్యకు ఫోన్ చేసిన రోజా సినీ ప్రముఖులు సైతం మా ఎన్నికలు జరిగిన తీరుపై బహిరంగంగానే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మా ఎన్నికలపై తనదైన స్టైల్లో స్పందించారు. మా మొత్తం ఎపిసోడ్ సర్కస్‌లా ఉందని, సిని'మా' వాళ్లు సర్కస్ లాంటి వాళ్లని ప్రజలకి నిరూపించారంటూ సెటైరికల్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Cine”MAA”people proved to the audience, that they are actually a CIRCUS 😳😳😳😳 — Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2021 చదవండి: శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్ చిరు చెల్లెలి బర్త్‌డే : స్పెషల్ విషెస్ తెలిపిన 'భోళా శంకర్' -
శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్
Mohan Babu Serious On Shiva Balaji Wife Madhumitha : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మోహన్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడు శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్ అయ్యారు. స్పీచ్ మధ్యలో వెనుక నుంచి మాట్లాడవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: MAA Elections 2021: చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్ 'నా జీవితం తెరిచిన పుస్తకం. నా పుస్తకంలో విలన్‌గా చెయ్యాలని అనుకున్నాను. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా చేశాను. మనమంతా ఒకే తల్లి బిడ్డలం. మనుషుల్లో టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. కేవలం టాలెంట్‌తోనే ఇక్కడ కొనసాగుతారు. ఇది రాజకీయ వేదిక కాదు. పాలిటిక్స్‌లో కంటే ఇక్కడే ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటివి కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోయాను' అని మోహన్ బాబు పేర్కొన్నారు. అయితే స్పీచ్ మధ్యలో శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్ అయ్యారు. పెద్దలు స్పీచ్ ఇస్తుంటే వెనుక నుంచి గుసగుసలు, సైగలు చేయడం తనకు నచ్చదని కోప్పడ్డారు. ఇలా చేస్తే మాట్లాడాలనుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలకు బ్రేకులు పడతాయంటూ సున్నితంగా హెచ్చరించారు. చదవండి: ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను: మోహన్‌బాబు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలపై స్పందించిన మంచు విష్ణు -
చల్లారని ‘మా’ రగడ.. ఎన్నికల అధికారికి లేఖ రాసిన ప్రకాశ్ రాజ్
MAA Elections 2021 Results: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పర్వం ముగిసినప్పటికీ ఎన్నికల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలింగ్ జరిగిన తీరుపై అనుమానం వ్యక్తం చేశారు ప్రకాశ్‌రాజ్. పోలింగ్ జరిగిన రోజు సీసీటీవీ దృశ్యాలు ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు గురువారం లేఖ రాశారు. పోలింగ్‌రోజు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మోహన్‌బాబు, నరేశ్ మా సభ్యులను బెదిరించడమే కాకుండా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. మీరే వారిని, వారి అనుచరులను పోలింగ్ ప్రదేశాల్లోకి అనుమతించారని భావిస్తున్నామన్నారు. మా ఎన్నికలు జరిగిన తీరు జనంలో మనల్ని చులకన చేసిందన్నారు. అసలేం జరిగిందన్నది మా సభ్యులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారని, ఇందుకోసం పోలింగ్ సమయంలో రికార్డైన సీసీ టీవీ దృశ్యాలు తమకు ఇవ్వాల్సిందిగా కోరారు. త్వరగా స్పందించకపోతే సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించడం లేదా మార్చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 3 నెలల వరకు దృశ్యాలు భద్రపరచడం మీ బాధ్యత అంటూనే వాటిని కోరే హక్కు తమకు ఉందని నొక్కి చెప్పారు. ప్రకాశ్‌రాజ్ లేఖపై మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజ్ మా ఆఫీసులో భద్రంగానే ఉందని, నిబంధనల ప్రకారం ఎవరడిగినా ఇవ్వడానికి రెడీ అని తెలిపారు. -
అనసూయ ఆరోపణలపై స్పందించిన కృష్ణమోహన్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. వివాదాలు, విమర్శలకు మాత్రం పుల్‌స్టాప్ పడడం లేదు. ముఖ్యంగా ఎన్నికలు జరిగిన తీరుపై ప్రకాశ్ రాజ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు.. తన ప్యానల్ తరపున గెలిచిన 11 మందితో రాజీనామాలు చేయించాడు. ఇదే సమయంలో కౌంటింగ్ సందర్భంగా అవకతవకలు జరిగాయని ప్రకాశ్ రాజ్ ప్రెస్మీట్లో ఆరోపించారు. ఆయన ప్యానల్ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయిన యాంకర్ అనసూయ సైతం పోలింగ్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆమె విజయం సాధించినట్లుగా మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మరుసటి రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో అనసూయ ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో అనసూయతో పాటు ప్రకాశ్ రాజ్ ప్యానల్ షాక్‌కు గురైంది. దీనిపై ‘‘రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా’ అంటూ ఆమె సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. ఇక మంగళవారం ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి బ్యాలట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించారు. తాజాగా ఈ ఆరోపణలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడిన కృష్ణమోహన్.. అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారికంగా అనౌన్స్ చేయడానికి ముందే ఆమె గెలిచినట్టు మీడియాలో ప్రచారం జరిగిందని కృష్ణమోహన్ చెప్పారు. తాను బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లానని చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బ్యాలెట్ పేపర్లను ఉంచిన బాక్స్‌ల తాళాలను మాత్రమే తాను ఇంటికి తీసుకెళ్లానని కృష్ణమోహన్ స్పష్టం చేశారు. -
చిరంజీవిపై నరేశ్ సంచలన వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన నాగబాబు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిశాయి. ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. అయిన ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. రాజీనామాలు, ఆరోపణలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో మీడియా సమావేశంలో పాల్గొన్న సీనియర్ నటుడు నరేశ్ మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో రాజీనామా అనంతరం తొలిసారి మీడియాతో ముచ్చటించిన మెగా బ్రదర్ నాగబాబు, నరేశ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని తన అన్నయ్య(చిరంజీవి) ఎప్పుడు అనుకోలేదన్నాడు. పరిశ్రమకు చెందిన నటీనటులు, అభిమానులు ఎవరైనా కష్టమంటు ఇంటికి వస్తే ఆయన వారికి చేతనైనంత సాయం చేశారని పేర్కొన్నాడు. చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు అంతే తప్ప పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడు ఆయన అనలేదని, అన్నయ్యకు అంత అహంకారం లేదని నాగబాబు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అనంతరం తన రాజీనామాపై మాట్లాడుతూ.. ‘‘మా’ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో గర్వపడ్డాను. తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదని, విశాల హృదయంతో వ్యవహరిస్తారనుకున్న. కానీ ఫలితాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలనిపించలేదు. మనస్థాపంతో బయటకు వచ్చేశాను. సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇకపై ఈ అసోసియేషన్‌తో నాకు సంబంధం ఉండదు’ అని ఆయన స్పష్టం చేశారు. -
ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌పై ఫైర్ అయిన నరేష్
MAA Elections 2021 Resignation: కలిసి పని చేస్తాం అన్నవాళ్లు ఎందుకు రాజీనామా చేశారని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) మాజీ అధ్యక్షుడు నరేష్ ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన అనంతరం నేడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: Maa Elections 2021: పెన్షన్ ఫైల్‌పై తొలి సంతకం చేసిన మంచు విష్ణు 'కలిసి పనిచేస్తాం అన్నవాళ్లు..రాజీనామా ఎందుకు చేశారు? ఓడినా, గెలిచినా కలసి పనిచేస్తాం అన్నారు. మరి ఇప్పుడేమైంది? బయటి నుంచి ప్రశ్నించడం ఏంటి? నరేంద్ర మోదీ గెలిచాడని కాంగ్రెస్ వాళ్లు దేశం వదిలి వెళ్లలేదు కదా. 'మా' అనేది కుటుంబం. గెస్ట్‌గా వచ్చిన వాళ్లే ఇది కుటుంబం కాదు అంటారు. ఫ్యాక్షనిజం మానేద్దాం. కలసి పనిచేద్దాం. రిజైన్ చేసిన ఈసీ మెంబర్స్ గురించి కొత్త ప్యానల్ చూసుకుంటుంది. విష్ణుని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బాగోదు. ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. ఎమోషన్స్.. ప్రస్టేషన్ వద్దు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. కానీ గెలిచాక కూడా ఆరోపణలు చేయడం ఏంటి' అంటూ ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులపై నరేష్ అసహనం వ్యక్తం చేశారు. చదవండి: రోజుకో ట్విస్ట్.. మంచు విష్ణు యాక్షన్ ప్లాన్ ఏంటి? -
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం
Manchu Vishnu Takes Charge As MAA President : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పెన్షన్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. నరేష్ నుంచి నూతన బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు నేటి నుంచి మా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.అయితే ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే 'మా' అధ్యక్షుడిగా తాను బాధ్యతలు తీసుకున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 'మీ సమస్యలు నాకు తెలియజేయండి. మీ మద్ధతు నాకు కావాలి' అంటూ మంచు విష్ణు ట్వీట్లో పేర్కొన్నారు. చదవండి: MAA Resignations: రాజీనామాలపై మంచు విష్ణు ఏం చేయబోతున్నారు? కాగా 'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విష్ణు..ప్రకాశ్‌రాజ్ ప్యానల్ మూకుమ్మడి రాజీనామాలపై ఎలా స్పందింస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల అధికారి I have today assumed the office of the President of MAA! Need all your wishes and send me positivity as much as you can. #MAA pic.twitter.com/cYUiuxmwQ9 — Vishnu Manchu (@iVishnuManchu) October 13, 2021 -
రోజుకో ట్విస్ట్.. మంచు విష్ణు యాక్షన్ ప్లాన్ ఏంటి?
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిసినా రోజుకో ట్విస్ట్ తెరమీదకి వస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు చాలా ఉత్కంఠను రేపాయి. అదే స్థాయిలో ఎన్నికల తర్వాత కూడా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్, నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేయడం, అనంతరం ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలను ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: ఆ విషయం గురించి నేను చెప్పకూడదు: 'మా' ఎన్నికల అధికారి మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన ముందు అనేక సవాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో మా అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు ఈ మూకుమ్మడి రాజీనామాలను ఆమోదిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా మా అసోసియేషన్‌లో ఏదైనా ఒక పదవి ఖాళీ ఏర్పడితే, దాన్ని భర్తీ చేసే అధికారి మా అధ్యక్షుడికే ఉంటుంది. ‘మా’ బైలాస్ నిబంధన ప్రకారం.. మా సభ్యుడి పోస్ట్‌కు ఖాళీ ఏర్పడితే.. ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకొని దాన్ని భర్తీ చేస్తారు. దీనికి జనరల్ బాడీ సభ్యులందరి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి మూకుమ్మడి రాజీనామాలను సైతం ఆమోదించి ఆ స్థానంలో కొత్తవారిని నామినేట్ చేస్తారా? లేక బుజ్జగింపులు చేసి రాజీనామాలను వెనక్కి తీసుకునేలా ఒప్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది. చదవండి: కొత్త కుంపటిపై ప్రకాశ్‌రాజ్ క్లారిటీ -
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల అధికారి
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. ఎన్నికలు ముగిసినా కాంట్రవర్సరీలు, ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ప్రకాశ్‌రాజ్ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారు? అనే ప్రశ్నను లేవనెత్తారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.చదవండి: ప్రకాశ్‌రాజ్ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే!... బ్యాలెట్ పేపర్స్‌ను ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయంపై మా ఎన్నికల అధికారి కృష్ణమోషన్ స్పందించారు. యాంకర్ అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందన్న వ్యాఖ్యల్లో నిజం లేదని, అధికారికంగా ప్రకటించక ముందే వార్తలు ఎలా బయటకు వెళ్లాయో తెలియడం లేదన్నారు. ఇక తాను బ్యాలెట్ పేపర్లను తీసుకెళ్లినట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నారు. తాను బ్యాలెట్ పేపర్ల తాళాలు మాత్రమే ఇంటికి తీసుకెళ్లానని, బ్యాలెట్ పేపర్లు కాదని స్పష్టం చేశారు.ఇక ప్రకాశ్‌రాజ్ రాజీనామాపై స్పందిస్తూ..అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం అని, ఇది కరెక్టా కాదా అన్నది ఎలక్షన్ కమిషనర్‌గా తాను చెప్పకూడదు, చెప్పలేనని పేర్కొన్నారు. దీనిపై మా ప్రెసిడెంట్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.చదవండి: మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారు: బెనర్జీ -
అనసూయ సీరియస్.. కోర్టుకు వెళ్తానంటూ వార్నింగ్
Maa Elections 2021: నిజాలు తెలుసుకోకుండా తన పేరు వాడితే కోర్టుకు వెళ్తానంటూ యాంకర్ అనసూయ సీరియస్ అయ్యింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు చెందిన 11మంది రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో యాంకర్ అనసూయ సైతం పాల్గొన్నారు.చదవండి: అనసూయకు బిగ్ షాకిచ్చిన 'మా' కార్యక్రమం అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో మా ఎన్నికలపై స్పందించిన అనసూయ తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలకు తన పేరును ఆపాదిస్తే కోర్టుకు వెళ్తానని హెచ్చరించింది. చదవండి: మోహన్ బాబు తిడుతుంటే విష్ణు ఆపాడు: తనీష్ -
నా భార్య చనిపోతే నరేష్ ఒక్క ఫోన్ కూడా చేయలేదు: ఉత్తేజ్
MAA Elections 2021: Actor Uttej About Naresh: భిన్నాభిప్రాయాలకు అవకాశం లేకుండా తాము తప్పుకుంటున్నామని నటుడు ఉత్తేజ్ అన్నారు. పోలింగ్ రోజున నరేష్ యుద్ధవాతావరణం సృష్టించారని, తనని తన కుటుంబ సభ్యులను బండబూతులు తిట్టారని పేర్కొన్నారు. 'నా భార్య పద్మ చనిపోతే చిరంజీవి, జీవితా రాజశేఖర్, ప్రకాశ్‌రాజ్ సహా పలువురు హస్పిటల్ వద్దనే ఉండి తన ఓదార్చారు. కానీ నరేష్ నుంచి మాత్రం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. నా 25 ఏళ్ల కెరీర్లో బెనర్జీ అన్న ఏడవటం చూడలేదు. నరేష్ వల్లే "మా" శ్రేయస్సు కుంటుపడుతూ వచ్చింది. విష్ణు బాగా పనిచేయాలని ఆశిస్తున్నాం' అని ఉత్తేజ్ పేర్కొన్నారు. చదవండి: మోహన్ బాబు కించపరిచే బూతులు తిట్టారు: తనీష్ -
మోహన్ బాబు తిడుతుంటే విష్ణు ఆపాడు: తనీష్
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన 11మంది రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో తనీష్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలింగ్ రోజు తనను మోహన్ బాబు బూతులు తిట్టారని ఎమోషనల్ అయ్యాడు. 'నేను ఏరోజూ మీడియా ముందుకు రాలేదు. వివాదాలకు మొదట్నుంచి నేను దూరంగా ఉన్నాను. నాకు ఓటేసిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. పోలింగ్ రోజు మోహన్ బాబు నన్ను బూతులు తిట్టారు. ఆపేందుకు ప్రయత్నించిన బెనర్జీని సైతం మోహన్ బాబు తిట్టిపోశారు. మంచు విష్ణు మధ్యలో జోక్యం చేసుకుని మమ్మల్ని ఆపారు. మా అమ్మను కించపరిచే బూతులు మోహన్‌బాబు తిట్టారు. నాకు నా తల్లే సర్వస్వం. అలాంటిది ఆమెను తిడుతుంటే చాలా బాధేసింది. గతంలో వివిధ సందర్భాల్లో నరేష్ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది' అంటూ తనీష్ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారు: బెనర్జీ -
కొత్త కుంపటిపై ప్రకాశ్‌రాజ్ క్లారిటీ
Prakash Raj Clarity On New Association : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన ప్యానల్ నుంచి గెలిచిన 11మంది కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం' అని ప్రకాశ్‌రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్‌కు పోటీగా మరో అసోసియేషన్ పెడుతున్నారంటూ ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. చదవండి: మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ 'ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(ATMAA)'పేరుతో కొత్త అసోసియేషన్ ప్రకటించనున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ రూమర్స్‌పై ప్రకాశ్ రాజ్ స్పందించారు. కొత్త కుంపటి పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన స్పష్టం చేశారు. చదవండి: ప్రకాశ్‌రాజ్ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే!... -
మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారు: బెనర్జీ
Maa elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల రోజు తనను మోహన్ బాబు అరగంట పాటు బూతులు తిట్టారని నటుడు బెనర్జీ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నానని, అలాంటిది అందరి ముందు మోహన్ బాబు బూతులు తిడుతూ అవమానించారని చెబుతూ బెనర్జీ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'ఎలక్షన్స్‌లో గెలిచానని అందరూ కంగ్రాట్స్ చెప్పినా అది నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే పోలింగ్ రోజు ఉదయమే వందల మందిలో మోహన్ బాబు నన్ను పచ్చి బూతులు తిట్టారు.తనీష్‌ను తిడుతుంటే ఆపినందుకు నన్ను మోహన్‌బాబు కొట్టబోయారు. చదవండి: మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్ విష్ణు నన్ను బలవంతంగా ఆపారు: బెనర్జీ పోలింగ్ జరిగే చోట మోహన్‌బాబు అలా ప్రవర్తిస్తున్నా ఎవరూ ఆపలేదు. తనీష్, నాకు చాలా బాధకలిగి కంటతడి పెట్టుకున్నామ. మూడు రోజుల నుంచి చాలా బాధపడుతున్నా. మోహన్‌బాబు తిడుతుంటే విష్ణు నన్ను బలవంతంగా ఆపారు. మోహన్‌బాబు సతీమణి కూడా ఫోన్ చేసి నన్ను ఓదార్చారు. పోలింగ్ రోజు జరిగిన పరిణామాలను నుంచి ఇంకా తేరుకోలేదు చాలా చాలా బాధ కలిగింది. ఇలా ఎందుకు బతకాలి మనం?ఇలాంటి అసోసియేషన్‌లో ఎందుకు ఉండాలి' అంటూ బెనర్జీ కంటతడి పెట్టారు. చదవండి: నేను అసమర్థుడిని కాను.. మౌనంగా ఉన్నా అంతే : మోహన్ బాబు -
MAA Elections 2021: అందుకే రాజీనామా చేశాం : శ్రీకాంత్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు తెచ్చిన సంక్షోభంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరుపున గెలిచిన11 మంది రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా గెలుపొందిన శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతాన్ని దృష్టిలో పెట్టుకొనే రాజీనామా చేస్తున్నామని తెలిపారు. రెండు ప్యానళ్లకు చెందిన సభ్యులు ఉంటే.. ‘మా’అభివృద్ది ఆటంకం ఏర్పడుతుందని, సమస్యలు ఎత్తి చూపితే తమ వళ్లే జరగలేదని చెప్పే అవకాశాలు ఉన్నాయని.. అందుకే ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలిచిన వారంతా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో ‘మా’అధ్యక్షుడిగా చేసిన నరేశ్ ఆధ్వర్యంలోనే మంచు విష్ణు పనిచేస్తాడని శ్రీకాంత్ ఆరోపించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని విష్ణు నెరవేర్చాలని, లేదంటే కచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పారు. ‘మా’సంక్షేమం కోసమే తాము రాజీనామా చేశామని, తమకు ఓట్లేసిన వారు ఈ ఒక్కసారి క్షమించాలని శ్రీకాంత్ కోరారు. -
మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్
Maa elections 2021: ప్రకాశ్‌రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: నేను అసమర్థుడిని కాను.. మౌనంగా ఉన్నా అంతే : మోహన్ బాబు బెనర్జీపై చేయి చేసుకున్నారు 'రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. మోహన్ బాబు ఎన్నికల ప్రక్రియలోనే కూర్చున్నారు ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారు. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్ నటుడిపై చేయి చేసుకున్నారు. ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన మా సభ్యులు అన్నారు. అందుకే మా ప్యానల్ నుంచి గెలిచిన 11మంది కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం' అని ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. రాజీనామా చేసినా ప్రశ్నిస్తాం.. ఇక తన రాజీనామా గురించి మాట్లాడుతూ..మాలోనే కొనసాగుతానని, రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని, అయితే దానికి ఓ కండీషన్ ఉందని ప్రకాశ్‌రాజ్ అన్నారు. బైలాస్‌లో బయటవాళ్లు పోటీ చేయకుండా మార్పు చేయవద్దు. ఎవరైనా పోటీ చేయవచ్చు అన్నదానికి విష్ణు ఒప్పుకుంటే రాజీనామాను వెనక్కి తీసుకుంటా అని పేర్కొన్నారు. ఇక రాజీనామా చేసినా మా సభ్యల సంక్షేమం కోసం ప్రశ్నిస్తామని, ఓడిపోయాం అని మేం వదిలేయబోమని స్పష్టం చేశారు. చదవండి: అనసూయకు బిగ్ షాకిచ్చిన 'మా' -
కొత్త కుంపటి పెట్టేందుకు సిద్ధమైన ప్రకాశ్‌రాజ్!
Maa elections 2021: మోహన్ బాబు సమక్షంలో మా ఎన్నికలు జరిగాయని ప్రకాశ్ రాజ్ అన్నారు. తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరూ కలిసి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిశాయి. దీంతో ఇక కథ ముగిసింది అనుకుంటే మరో కొత్త కథ తెరమీదకు వచ్చింది. మా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్ కొత్త కుంపటి పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరికాసేపట్లో ప్రకాశ్‌రాజ్ ప్రెస్‌మీట్ ద్వారా క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే మా సభ్యత్వానికి ప్రకాశ్‌రాజ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ఆలోచనలపై రకరకాల ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి. ప్రకాశ్‌రాజ్ ప్రెస్‌మీట్‌పై టాలీవుడ్లో ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏం చెప్పబోతున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.మరోవైపు ఓటమికి జీర్ణించుకోలేక ఇలా కొత్త అసోసియేషన్ వైపు అడుగులు వేయడం ఎంత వరకు సమంజసం అంటూ ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ఒకవేళ ప్రకాశ్‌రాజ్ కొత్త అసోసియేషన్ ప్రకటిస్తే టాలీవుడ్ రెండు వర్గాలుగా చీలిపోనుందనే టాక్ కూడా ఫిల్మీ దునియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: MAA Elections 2021: ఈ కారణాల వల్లే ప్రకాశ్‌రాజ్ ఓడిపోయాడా? -
ప్రకాశ్‌రాజ్ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే!...
గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఉత్కంఠను రేపిన మా ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన పోరులో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌పై 107ఓట్ల తేడాతో విష్ణు మా అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. మా ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. అందరి కంటే ముందుగా చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రత్యక్షంగా మెగా బ్రదర్ నాగబాబే ప్రకాశ్‌రాజ్‌కు క్యాంపెయిన్ చేశారు. అయినప్పటికీ ప్రకాశ్‌రాజ్ ఓడిపోవడానికి గత కారణాలు ఏంటి అని ఓసారి పరిశీలిస్తే.. ► ప్రకాశ్‌రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష బరిలో ఉన్నానని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చింది. మొదట్లో ఈ విషయంపై ఆర్జీవీ వంటి సినీ ప్రముఖులు ప్రకాశ్‌రాజ్‌కు సపోర్ట్‌గా నిలబడినా.. ఆ తర్వాత మా అసోసియేషన్‌కు తెలుగు వాళ్లు కాకుండా, వేరే పరిశ్రమకు చెందిన వాళ్లు ఎలా పాలిస్తారు అంటూ వచ్చిన విమర్శలు వచ్చాయి. వీటిని తిప్పికొట్టకపోవడం ప్రకాశ్‌రాజ్‌కు మైనస్‌కు మారింది. ►. కెరీర్ పరంగా ప్రకాశ్‌రాజ్ చాలా బిజీ ఆర్టిస్ట్. సంవత్సరానికి ఇతర భాషలతో కలిపి సుమారు 7-8 సినిమాల్లో నటిస్తారు. అలాంటి బిజీ ఆర్టిస్ట్ మా అసోసియేషన్‌కు ఎలా సేవ చేస్తారనే వాదన తెరపైకి వచ్చింది. ఎక్కడో తమిళనాడులో ఉండి ఇక్కడి ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించేంత సమయం ఎలా కేటాయిస్తారనే కామెంట్స్ కూడా ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించాయి. ► మంచు విష్ణుకు మోహన్ బాబు చేసిన క్యాంపెయిన్ ప్రకాశ్‌రాజ్‌కు మైనస్ అయిందని చెప్పొచ్చు. సినీ పరిశ్రమలో ఆయనతో చాలామందికి ప్రత్యేక అనుబంధం ఉంది. మోహన్ బాబు చెబితే కాదనలేం అనే సినీ ప్రముఖులు కూడా ఉండటంతో ప్రకాశ్‌రాజ్‌కు ఓట్లు తగ్గాయన్నది మరో కారణంగా చెప్పుకుంటున్నారు. ►చాన్నాళ్లుగా ఉన్న మా బిల్డింగ్ సమస్యపై దృష్టి పెట్టకపోవడం. అటు మంచు విష్ణు మా బిల్డింగ్ కోసం తన సొంత డబ్బులు ఖర్చుపెడతానని నమ్మకం కలిగించడం కూడా ప్రకాశ్‌రాజ్‌కు మైనస్‌గా మారింది. ► మా అధ్యక్షుడిగా ఎన్నికైతే చేసే కార్యక్రమాలు, సంక్షేమం వంటి వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టకపోవడం.. మంచు విష్ణు తర్వాత కూడా ఎలాంటి మ్యానిఫెస్టో ప్రకటించకపోవడం అతి పెద్ద మైనస్ అని టాక్ వినిపిస్తుంది. ► నాగబాబు మినహా మెగా ఫ్యామిలీ నుంచి ప్రత్యక్షంగా ఎవరూ మద్ధుతు ప్రకటించకపోవడం ► ఎన్నికలకు రెండు రోజులు ముందు నాకు పెద్దల మద్దతు అవసరం లేదు అంటూ ప్రకాశ్‌రాజ్ చేసిన కామెంట్స్ నెగిటివిటిని పెంచేశాయి. ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదం అవసరం లేదంటూ ప్రకాశ్‌రాజ్ తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు ఆయనకే బెడిసి కొట్టిందనే చెప్పాలి. ►ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను మా ఎన్నికల్లో ఓటేసేందుకు సిద్ధం చేయకపోవడం. ఎలక్షన్స్ రోజు ముంబై, బెంగుళూరు, ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరీ కొందరు వేసిన ఓట్లు మంచు విష్ణుకు అనుకూలంగా మారాయి. చదవండి: 'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే.. నాగబాబు, ప్రకాశ్‌రాజ్ రాజీనామాలను ఆమోదించను: మంచు విష్ణు -
అనసూయకు బిగ్ షాకిచ్చిన 'మా'
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితాలపై యాంకర్ అనసూయ స్పందించింది. నిన్న రాత్ర గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు? రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ ట్వీట్ చేసింది. ఎలక్షన్స్ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ వరుస ట్వీట్లు చేసింది. చదవండి: ప్రెగ్నెన్సీని దాచిపెట్టిన హీరోయిన్ శ్రియ కాగా నిన్న జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందంటూ గతరాత్రి వార్తలు వైరల్ అయ్యాయి.అయితే ఎన్నికల అధికారి రిలీజ్ చేసిన మా విజేతల జాబితాలో అనసూయ పేరు లేకపోవడంతో ఆమె షాక్‌కి గురయ్యింది. చదవండి: సమంత..జీవితం చాలా విలువైంది: వనితా విజయ్‌కుమార్ 😂 Kshaminchali.. okka vishayam gurtochi tega navvochestundi.. meeto panchukuntunna emanukovoddey..! Ninna “athadhika majority” “bhaari majority” to gelupu ani.. eeroju “lost” “otami” antunnaru.. raathriki raathri enjaruguntundabba🧐 🤔 — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021 Ok. Lesson learnt. 😊 pic.twitter.com/2PSFh2AlMW — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021 Ante mari ninna yevaro election rules ki bhinnanga ballot papers ni intiki kuda teeskellarani .. aha ante bayata talku.. 🙊 nenatledu https://t.co/tAM8MVVhxV — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021 చదవండి: 'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే.. -
'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే..
MAA Elections 2021 Winners List : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. నిన్న జరిగిన పోలింగ్‌లో మా అధ్యక్షుడు మినహా మిగతా ఈసీ మెంబర్ల తుది ఫలితాలు వెల్లడి కాలేదు. తాజాగా 18మంది ఈసీ సభ్యుల తుది ఫలితాలను ఎన్నికల అధికారి వెల్లడించారు. ‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన విజేతలు వీళ్లే.. ►మా అధ్యక్షుడు - మంచు విష్ణు (383 ఓట్లు) ప్రకాశ్‌రాజ్ (274 ఓట్లు)109 ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందారు. ► జనరల్ సెక్రటరీ - రఘుబాబు (341 ఓట్లు) ►ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - శ్రీకాంత్ (375 ఓట్లు) ► జాయింట్ సెక్రటరీలు - ఉత్తేజ్ (333 ఓట్లు) , గౌతంరాజు (322 ఓట్లు) ►వైస్ ప్రెసిడెంట్స్ - మాదాల రవి (376 ఓట్లు), బెనర్జీ (298 ఓట్లు) ► ట్రెజరర్ - శివబాలాజీ (360 ఓట్లు) గెలుపొందిన ఈసీ మెంబర్లు వీళ్లు.. 18 మంది ఈసీ సభ్యుల కోసం జరిగిన పోటీలో 10 మంది మంచు విష్ణు ప్యానల్‌కు చెందినవారు, ఎనిమిది మంది ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు చెందినవారు గెలుపొందారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్లో గెలుపొందిన ఈసీ మెంబర్స్ ♦ శివారెడ్డి (362 ఓట్లు) ♦ బ్రహ్మాజీ (334 ఓట్లు) ♦ ప్రభాకర్ (319 ఓట్లు) ♦ తనీష్ (306 ఓట్లు) ♦ సురేశ్ కొండేటి (294 ఓట్లు) ♦ కౌశిక్ (269 ఓట్లు) ♦ సుడిగాలి సుధీర్ (279 ఓట్లు) ♦ సమీర్ (282 ఓట్లు) మంచు విష్ణు ప్యానల్లో గెలుపొందిన ఈసీ మెంబర్స్ ♦ గీతా సింగ్ (342 ఓట్లు) ♦ అశోక్ కుమార్ (336 ఓట్లు) ♦ శ్రీలక్ష్మీ (330 ఓట్లు) ♦ సి.మాణిక్ (326 ఓట్లు) ♦ శ్రీనివాసులు (296 ఓట్లు) ♦ హరనాథ్‌బాబు (296 ఓట్లు) ♦ ఎన్.శివన్నారాయణ (290 ఓట్లు) ♦ సంపూర్ణేశ్‌బాబు (285 ఓట్లు) ♦ శశాంక్ (284 ఓట్లు) ♦ బొప్పన విష్ణు (271 ఓట్లు) -
నేను అసమర్థుడిని కాను.. మౌనంగా ఉన్నా అంతే : మోహన్ బాబు
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితం అనంతరం మోహన్ బాబు పలు కీలక కామెంట్స్ చేశారు. 'నన్ను రెచ్చగొట్టాలని చాలా మంది చూశారు. సింహం నాలుగడుగులు వెనక్కి వేసిందంటే విజృంభిస్తుంది. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. కొందరు పలు వేదికలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను అసమర్థుడిని కాను..మౌనంగా ఉన్నా అంతే. నవ్వుతూ స్వీకరించాలి. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రుల సహకారం లేకుండా ఏమీ చేయలేం' అని అన్నారు. -
నాగబాబు, ప్రకాశ్‌రాజ్ రాజీనామాలను ఆమోదించను: మంచు విష్ణు
MAA Elections 2021 Manchu Vishnu Press Meet: నాగబాబు, ప్రకాశ్‌రాజ్ రాజీనామాలను తాను ఆమోదించనని మంచు విష్ణు అన్నారు. జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ప్రెస్మీట్లో మంచు విష్ణు మాట్లాడుతూ..మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల్లో తనను విత్ డ్రా చేసుకోమని చిరంజీవి చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం చెప్పకూడదనుకున్నానని, అయితే ఎన్నికలు ముగిశాయి కాబట్టి చెబుతున్ననని పేర్కొన్నారు. చదవండి: 'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే.. ఇక రామ్‌చరణ్ తనకు మంచి స్నేహితుడు అయినప్పటికీ తండ్రి మాటకు కట్టుబడి ప్రకాశ్‌రాజ్‌కే ఓటేసి ఉండేవచ్చన్నారు. రామ్‌చరణ్ స్థానంలో ఉంటే తాను కూడా ఇదే చేసి ఉండేవాడినన్నారు. ఇక తన గెలుపుకు వంద శాతం కారణం తన తండ్రి మోహన్ బాబు అని చెప్పారు. అనంతరం నరేష్ తన గెలుపుకు ఎంతో కష్టపడినట్లు తెలిపారు. చదవండి: చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్ 'మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతఙ్ఞతలు. నాపై నమ్మకం ఉంచి గెలిపించిన సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉన్న నటులు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారు. గెలుపొందేందుకు మా ప్యానల్ అందరం కష్టపడ్డాం. కానీ మా ప్యానల్లో కొందరు సభ్యులు గెలవకపోవడం బాధాకరం. ప్రకాశ్‌రాజ్ ప్యానల్లో గెలిచిన వారిని కలుపుకొని పోతాం. మేమంతా ఒక్కటే. ఇక ఎన్నికల్లో గెలుపోటములు సహజం. నాగబాబు మా కుటుంబంలో సభ్యుడిలాగే. తొందరపడి, అవేశంతో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించను. మా అధ్యక్ష స్థానంలో ఉన్న నేను నాగబాబు రాజీనామాను ఆమోదించను. త్వరలోనే ఈ విషయం గురించి స్వయంగా ఆయనతోనే వెళ్లి మాట్లాడతా. అలాగే ప్రకాశ్ రాజ్ రాజీనామాను కూడా ఆమోదించను. ఆయన సలహాలను కూడా స్వీకరిస్తా' అని పేర్కొన్నారు. చదవండి: ప్రెగ్నెన్సీని దాచిపెట్టిన హీరోయిన్ శ్రియ -
కాసేపట్లో ఈసీ మెంబర్లను ప్రకటించనున్న మంచు విష్ణు
►జూబ్లీ పబ్లిక్ స్కూల్‌కి చేరుకున్న శివ బాలాజీ ► మరికాసేపట్లో 'మా' ఎన్నికల్లో గెలుపొందిన ఈసీ మెంబర్లు, ఆఫీస్ బేరర్లు ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక జాయింట్ సెక్రటరీ ఫలితంపై ప్రకటన ►నిన్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కేవలం ప్రెసిడెంట్ స్థానంవి మాత్రమే కౌంట్ చేశారు మంచు విష్ణు- ప్రకాశ్ రాజ్ ప్యానల్స్‌కు చెందిన మెంబర్స్ ఆత్మీయంగా కలుసుకున్నారు. మంచు విష్ణు శ్రీకాంత్ ఖయ్యుం సీరియల్ నటుడు ప్రభాకర్ సుడిగాలి సుధీర్ మాదాల రవి పసుమూర్తి శ్రీనివాసులు అరునాద బాబులు సరదాగా ముచ్చటించారు. MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై 107 ఓట్ల తేడాతో మంచు విష్ణు విజయం సాధించారు. ఆయన ప్యానల్ నుంచి గెలిచిన ఈసీ మెంబర్లను కాసేపట్లో ఆయన ప్రకటించనున్నారు. ఇప్పటికే మంచు విష్ణు జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌కి చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన ప్యానల్ నుంచి గెలిచిన ఈసీ మెంబర్లు సైతం ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. -
చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్
MAA Elections 2021 : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద శివ బాలాజీ చేయిని సినీ నటి హేమ కొరకడం చర్చకు దారి తీసింది. పోలింగ్ కేంద్రం వద్ద తాను వెళ్తున్న సమయంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ ఘటనపై శివబాలాజీ భార్య మధుమిత స్పందించింది. చదవండి: టీటీ ఇంజెక్షన్ వేయించుకున్న శివబాలాజీ ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి పనులు మనుషులు మాత్రం చేయరు. ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేను అని ఘాటుగా బదుల్చిచ్చింది. ఇక తన భర్త శివబాలాజీ గెలవడంపై హర్షం వ్యక్తం చేసింది. నిస్వార్థంగా సేవ చేసినప్పుడు దానికి ప్రతిఫలం దక్కుతుందని తాను నమ్ముతానని బదులిచ్చింది. చదవండి: MAA Elections 2021 Results: 'మంచు'కే మా అధ్యక్ష పదవి -
అలాంటి అసోసియేషన్‌లో సభ్యుడిగా కొనసాగలేను: ప్రకాశ్ రాజ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్ రాజ్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించగా, ఇక ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి కొందరు గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తొలిసారిగా ప్రకాశ్ రాజ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: ‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా ఈ మేరకు ఆయన ‘గెలిచిన మంచు విష్ణు, అతడి ప్యానల్ సభ్యులకు శుభాకాంక్షలు. ఒక ప్రణాళిక ప్రకారం వచ్చారని వాటన్నింటిన నెరవేర్చండి. ఇక ఈ ఎన్నికల్లో ఎలా ఓడిపోయాం, గెలిచాం అన్నది ముఖ్యం కాదు. ‘మా’ ఎన్నికలు రాజకీయ వేదిక కాదు. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి. పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు కానీ ఎవరెవరు నాకు ఓటు వేశారో తెలియదు. రాజకీయం, సినిమా రెండు వేరు అనుకుంటున్నా. నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు. అది నా తప్పా. నేను తెలుగు వాడిని కాకపోవడం నా దురదృష్టం. అందుకే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇది ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఓటమిని జీర్ణించుకున్నాకే రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: MAA Elections 2021: ఇక సెలవంటూ నాగబాబు సంచలన నిర్ణయం ‘అసోసియేషన్‌కు ఒక నాయకత్వం వహించిన మీకు, తెలుగువాడు మాత్రమే ఉండాలన్నారు. దాన్ని మెంబర్స్ ఆమోదించారు. తెలుగుబిడ్డ, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నా. అలాగే ఒక కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. ప్రేక్షకులకు నాకూ ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో నేను అతిథిగా ఉండాలంటే అసోసియేషన్ మెంబర్‌గా ఉండకూడదు. పెద్ద నటులు కోట శ్రీనివాస రావు, రవిబాబు వ్యాఖ్యలను గౌరవిస్తాను. వారి చెప్పినట్టుగానే అతిథిగా ఉంటా. మీరు అనుకున్నది జరిగింది. ‘మా’ ఎన్నికల్లో జాతీయవాదం గెలిచిందంటూ బీజేపీ నేత బండి సంజయ్ కూడా ట్వీట్ చేశారు’ అంటూ ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్ రాజ్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించగా, ఇక ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి కొందరు గెలుపొందారు. ఈ నేపథ్యంలో సోమవారం(అక్టోబర్ 11) హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. చదవండి: MAA Elections 2021: ఇక సెలవంటూ నాగబాబు సంచలన నిర్ణయం ‘మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు చాలా చైతన్య వంతంగా జరిగాయి. గెలిచిన మా సభ్యులకు శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ మీకు, నాకు తెలుసు. హామీలు అన్నింటినీ పూర్తి చేయడం ముఖ్యం. నా ప్రాంతం, జాతీయ వాదం తెర మీదకు తీసుకు వచ్చారు. నేను తెలుగు బిడ్డనే, నేను ఒక కళాకారుణ్ణి’ అంటూ చెప్పిన అనంతరం ఆయన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
MAA Elections 2021: ఇక సెలవంటూ నాగబాబు సంచలన నిర్ణయం
MAA Elections 2021 Results: మా ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 'ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్‌లో "నా" ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు' అంటూ ట్వీట్ చేశారు. 48 గంటల్లో తన రాజీనామా లేఖను మా కార్యాలయానికి పంపిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా మా ఎన్నికల్లో నాగబాబు మొదటి నుంచీ ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఆయనను విజయతీరాలకు చేర్చేందుకు మెగా బ్రదర్ ఎంతగానో కష్టపడ్డారు. కానీ అంతిమంగా ఈ పోరులో మంచు విష్ణు విజయాన్ని ముద్దాడారు. ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్‌లో "నా" ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు. - నాగబాబు, pic.twitter.com/wLqwOKsNtq — Naga Babu Konidela (@NagaBabuOffl) October 10, 2021 -
‘మా’ విజయం: ప్రకాశ్‌రాజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన విష్ణు
MAA Elections 2021 Results: గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో హీరో మంచు విష్ణు విజయం సాధించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సమయంలో విష్ణు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రకాశ్‌రాజ్‌ను పట్టుకుని ఏడ్చేశాడు. గెలుపు ప్రకటన అనంతరం విష్ణు తన తండ్రి మోహన్‌బాబు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయాన్ని తండ్రి మోహన్‌బాబుకు అంకితమిచ్చారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టండి మోహన్‌బాబు మాట్లాడుతూ.. 'బాబా ఆశీస్సులు, మా సభ్యుల ఆదరణతో విష్ణు గెలిచాడు. చిరంజీవి, నాగార్జున, పవన్ కల్యాణ్ సహా అందరి ఆశీస్సులు నా బిడ్డకు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల ఆశీస్సులు విష్ణుకు ఉంటాయి. నా బిడ్డ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాడు. మా అభివృద్ధికి విష్ణు కట్టుబడి ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది.. మనమంతా ఒకే తల్లి బిడ్డలం. వివాదాలకు ఇక్కడితో ఫుల్స్టాప్ పెట్టండి. ఎవరూ ఎవరి గురించి ఆరోపణలు చేయొద్దు' అని సూచించారు. -
అలాంటి వ్యక్తులను దూరం పెట్టాలి: చిరంజీవి
MAA Elections 2021 Results: చివరి వరకు ఉత్కంఠగా సాగిన 'మా' పోరులో మంచు విష్ణుదే పైచేయి అయింది. భారీ మెజారిటీతో ప్రకాశ్ రాజ్‌ను ఓడించి మా అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నాడు హీరో విష్ణు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'పెళ్లిసందD' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన మా ఎన్నికలను ఉద్దేశిస్తూ.. పదవులు తాత్కాలికమని, అల్లర్లతో 'మా' పరువు తీయొద్దని కోరారు. మన ప్రభావాన్ని చూపించడానికి వేరేవారిని కించపరచవద్దని విజ్ఞప్తి చేశారు. వివాదాలు సృష్టించిన వ్యక్తులను ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలన్నారు. చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు వద్దని, వివాదాలతో చులకన కావద్దని సూచించారు. మనమంతా వసుధైక కుటుంబం అని చెప్పిన చిరు, ఇలాంటి ఘటనల వల్ల బయట వాళ్లకు లోకువ అవుతామని నొక్కి చెప్పారు. -
MAA Elections 2021 Results: 'మంచు'కే మా అధ్యక్ష పదవి
Manchu Vishnu Won MAA President: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ప్రకాష్‌రాజ్ ఓటమి చెందారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై విజయం సాధించారు.కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మంచు విష్ణు ప్యానల్ జోష్‌లో ఉంది. కౌంటింగ్ కేంద్రం బయట అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. Na thammuda mazaa kaaaa…. Here’s to his stupendous win my hero!!!!!! @iVishnuManchu — Lakshmi Manchu (@LakshmiManchu) October 10, 2021 "మా" అధ్యక్షుడిగా గెలిచిన @iVishnuManchu గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికి శుభాకాంక్షలు.జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన "మా" ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది.#MaaElections2021— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2021 "మా" ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. "మా" ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికి అభినందనలు.భారత్ మాతాకి జై !#MaaElections2021— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2021 -
టీటీ ఇంజెక్షన్ వేయించుకున్న శివబాలాజీ
MAA Elections 2021: నటుడు శివ బాలాజీ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నటి హేమ శివబాలాజీ చేయిని కొరికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్స్ హాస్పిటల్లో శివ బాలాజీ టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నారు. ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్ తీసుకున్నట్లు తెలిపారు. చదవండి: MAA Elections 2021: శివబాలాజీని కొరికిన హేమ! అయితే హేమ ఎందుకు కొరికిందో తనకు అర్థం కావడం లేదని, ఈ విషయం చెప్పుకోవడానికి తనకే చాలా ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. టీటీ ఇంజెక్షన్ చేయించుకున్న అనంతరం నరేశ్‌తో కలిసి శివబాలాజీ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. చదవండి: అందుకే శివబాలాజీ చేయి కొరికా: హేమ -
ప్రకాశ్‌రాజ్‌తో సెల్ఫీ ఫోటో షేర్ చేసిన మంచు విష్ణు
MAA Elections 2021: Manchu Vishnu Selfie With Prakash Raj: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ చేసిన ప్రకాశ్‌రాజ్,మంచు విష్ణు కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. పోలింగ్ కేంద్రంలో ఎదురుపడిన వీళ్లిద్దరూ మోహన్ బాబు సమక్షంలో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను మంచు విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. అనంతరం మంచు మనోజ్ సైతం వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను షేర్చేస్తూ..'వాటమ్మా ..వాట్ ఈజ్ దిస్ అమ్మా' అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. పోలింగ్‌కి ముందు వరకు కూడా ఫ్యానెల్ సభ్యులు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. ఇలాంటి తరుణంలో ఇద్దరూ కలిసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడంతో 'పిక్ ఆఫ్ ది డే' అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న మా ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్రాజ్లలో ఎవరు గెలుస్తారన్నది మరికాసేపట్లో తేలనుంది. D Day! pic.twitter.com/Wabrp6KheJ — Vishnu Manchu (@iVishnuManchu) October 10, 2021 What ammaaaa what is this ammmaaaa ?!:) 😜 pic.twitter.com/41gAotPHJD — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 10, 2021 -
మంచు విష్ణు 100 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు : నరేశ్
Maa elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రకియ కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు 80-100 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తాడని నటుడు, మాజీ మా అధ్యక్షుడు నరేశ్ అన్నారు. భారీ ఓటింగ్ విష్ణు ప్యానెల్‌కే అనుకూలం అని అన్నారు. ఈసారి ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ జరిగిందని ఇతర రాష్ట్రాల నుంచి నుంచి వచ్చిన 30-40మంది ఓట్లు విష్ణు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి అని నరేశ్ పేర్కొన్నారు. -
వార్ వన్‌సైడ్ అవుతుంది: రవిబాబు
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల చరిత్రలోనే ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో 83శాతానికి పైగా పోలింగ్ (మధ్యాహ్నం 3గంటల వరకు) నమోదయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటేయడం ఇదే తొలిసారి. వీరిలో ఎక్కువ మంది ఓటింగ్ మంచు విష్ణుకు ప్లస్ అవుతుందని సమాచారం. తొలిసారి ఇంత భారీ పోలింగ్ నమోదవడం మంచి పరిణామమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అవుతుందని నటుడు, దర్శకుడు రవిబాబు అన్నారు. మంచు విష్ణు ప్యానలే గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం
MAA Elections 2021 Counting Live Updates : మంచు విష్ణు విజయం మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై విజయం సాధించారు. భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మంచు విష్ణు ప్యానల్ జోష్‌లో ఉంది. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందింన ఆఫీస్ బేరర్లు వీళ్లే.. జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ విజయం వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ విజయం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ విజయం మంచు విష్ణు ప్యానల్ నుంచి గెలుపొందింన ఆఫీస్ బేరర్లు వీళ్లే.. వైస్ ప్రెసిడెంట్‌గా మాదల రవి విజయం జనరల్ సెక్రటరీగా రఘుబాబు విజయం ట్రెజరర్‌గా శివబాలాజీ విజయం జాయింట్ సెక్రటరీగా గౌతమ్‌రాజు విజయం బాబూ మోహన్‌పై శ్రీకాంత్ గెలుపు జాయింట్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్ రాజు విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ గెలుపొందారు. బాబూ మోహన్‌పై శ్రీకాంత్ విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్యానల్ నుంచి పృథ్వీ రాజ్ ఆధిక్యంలో ఉన్నారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు ఆధిక్యం మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ముందంజలో ఉన్నారు. ప్రకాశ్‌రాజ్‌పై విష్ణు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ ముందంజలో ఉన్నారు. 7ఓట్ల తేడాతో జీవితపై రఘుబాబు గెలుపు మా జనరల్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్ నుంచి రఘుబాబు గెలుపొందారు. జీవితా రాజశేఖర్‌పై 7ఓట్ల తేడాతో రఘుబాబు విజయం సాధించారు. ట్రెజరర్‌గా మంచు విష్ణు ప్యానెల్ నుంచి శివ బాలాజీ 32 ఓట్ల తేడాతో గెలుపొందారు. శివబాలాజీకి 316 ఓట్లు, ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు చెందిన నాగినీడుకు 284 ఓట్లు వచ్చాయి. ఆఫీస్ బేరర్ల ఓట్లు కౌంటింగ్ ఆఫీస్ బేరర్ల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ల ఓట్లను లెక్కిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా మంచు విష్ణు ప్యానల్ నుంచి బాబూమోహన్,ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ పోటీ చేశారు. ట్రెజరర్లుగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి నాగినీడు, మంచు విష్ణు ప్యానల్ నుంచి శివ బాలాజీ పోటీ చేశారు. మరికాసేపట్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మంచు విష్ణు ప్యానల్లో 9 మంది విజయం మంచు విష్ణు ప్యానల్ నుంచి 9 మంది ఈసీ సభ్యులు విజయం సాధించారు. మాణిక్, హరినాథ్, బొప్పన,శివ, జయవాణి, శశాంక్, పూజిత, పసునూరి, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ గెలుపొందారు. అటు ప్రకాశ్ రాజ్ ప్యానల్లో 9మంది గెలుపొందారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ఈసీ మెంబర్ల కౌంటింగ్ ముగిసింది. మంచు విష్ణు ప్యానల్లో 10మంది ఈసీ సభ్యులు లీడ్‌లో ఉండగా, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి 8మంది సభ్యులు లీడ్‌లో ఉన్నారు. క్షణక్షణానికి లీడ్స్ మారుతున్న నేపథ్యంలో మా ఎన్నికల ఫలితాలు మరింత ఉత్కంఠగా మారాయి. ప్రకాశ్‌రాజ్ ప్యానల్లో నలుగురు ఈసీ సభ్యులు గెలుపొందారు. కౌశిక్, శివారెడ్డి, సురేష్ కొండేటి.. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందారు. అటు విష్ణు ప్యానెల్ నుంచి మాణిక్, హరినాథ్, బొప్పన,శివ, జయవాణి, శశాంక్, పూజిత, పసునూరి, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ ముందంజలో ఉన్నారు. తొలి ఫలితం తొలి ఫలితం ప్రకాశ్ రాజ్ ప్యానలే బోణీ కొట్టింది. ఈసీ మెంబర్లు కౌశిక్, శివారెడ్డి ప్రకాశ్‌రాజ్ ఫ్యానల్ నుంచి గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్లలో మంచు విష్ణు ముందంజ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంది. అధ్యక్షుడిగా మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ ఆధిక్యంలో ఉంది. మంచు విష్ణు ప్యానెల్లో 10మంది ఈసీ సభ్యులు ముందంజలో ఉన్నారు. భారీగా క్రాస్ ఓటింగ్ పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 50 చెల్లనివిగా గుర్తించారు. మోహన్ బాబు, మురళీ మోహన్ సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఈసీ మెంబర్లలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కౌంటింగ్ కోసం ఆరు టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై ఇద్దరికి అనుమతి ఇచ్చారు. మొత్తం 665 ఓట్లు పోలవగా ఇందులో పోస్టల్ బ్యాలెట్ నుంచి 60 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందుగా పోస్ట్‌లో బ్యెలెట్ ఓట్లను లెక్కించనున్నారు. అత్యంత ఉత్కంఠను రేకెత్తించిన మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది మరికాసేపట్లో తేలనుంది. -
'మా' ఎన్నికల్లో ఓటు వేయని టాప్ హీరోహీరోయిన్లు..
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ ముగిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. పోలింగ్ ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో 83శాతానికి పైగా పోలింగ్ (మధ్యాహ్నం 3గంటల వరకు) నమోదయ్యింది. గతేడాది కేవలం కేవలం 474 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా, ఈసారి మాత్రం 666 మందికి పైగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చదవండి: MAA Elections 2021 Live Updates: ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ,బాలకృష్ణతో పాటు నాగార్జున వంటి ప్రముఖులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరి కొందరు నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేశ్,అల్లు అర్జున్,మహేశ్‌బాబు, నితిన్, రానా, రవితేజ, నాగ చైతన్య వంటి అగ్ర హీరోలు మాత్రం ఓటు వేయడానికి రాలేదు. ఇక హీరోయిన్స్‌లలో అనుష్క, సమంత, రకుల్, ఇలియానా, త్రిష, హన్సిక సైతం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. షూటింగ్స్‌లో బిజీగా ఉండటంతో ఓటు వేసేందుకు రాలేదని తెలుస్తుంది. చదవండి: MAA Elections 2021: శివబాలాజీ, సమీర్ మధ్య తీవ్ర ఘర్షణ -
MAA Elections2021: పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు అగ్రహీరోలైన చిరంజీవి, పవన్ కల్యాణ్ , బాలకృష్ణతో పాటు నాగార్జున కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం, కొంత మంది ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్టు సమాచారం ఇవ్వడంతో.. మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో మాట్లాడిన మా ఎన్నికల అధికారి… పోలింగ్ సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగించిడు. ఈ సారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ‘మా’ఎన్నికలపై నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆదివారం ఆమె ‘మా’ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్లో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించింది. రాజకీయ లబ్ధి కోసం ఆర్టిస్టులను సతాయించడం మానుకోవాలని తెలిపింది. ఏ ప్యానల్ గెలిచినా.. రాజకీయాలను, మా అసోసియేషన్‌ను కలపకూడదని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. -
‘మా’ పోలింగ్‌కు తరలివచ్చిన సినీ తారలు
-
పోలింగ్ కేంద్రం వద్ద గొడవలపై బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న గొడవలపై విలేకరులు ప్రశ్నించగా దీనిపై బండ్ల ఆసక్తికర రీతిలో స్పందించారు. ఈ మేరకు బండ్ల గణేశ్ సమాధానం ఇస్తూ.. గొడవలే కదా హత్యలు, అత్యాచారాలు ఏమి జరగడం లేదు కదా అని సమాధానం ఇచ్చాడు. అనంతరం తాను ఓటు వేసిన సభ్యులే గెలుస్తారని, తప్పకుండా ఎవరో ఒకరూ గెలుస్తారంటూ చమత్కరించాడు. -
MAA Elections 2021: శివబాలాజీ, సమీర్ మధ్య తీవ్ర ఘర్షణ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నిక పోలింగ్ లో ఊహించిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ ప్రారంభమైన ఒక గంట మాత్రమే ప్రశాంతంగా సాగిన ఎన్నికలు.. ఆ తర్వాత పూర్తిగా గందరగోళంగా మారిపోయాయి. ఇరు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రం లోపల ప్రకాశ్ రాజ్ ప్యానల్ ప్రచారం చేస్తున్నారంటూ.. మంచు మోహన్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శివబాలాజీ చేయిని హేమ కొరకడం గమనార్హం. ఇదిలా ఉంటే.. పోలింగ్ కేంద్రం వద్ద సమీర్, శివబాలాజీ సైతం ఘర్షణకు దిగారు. సమీర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నాడు అంటూ శివబాలాజీ ఆరోపించాడు. సమీర్ సైతం అతనిపై విరుచుకుపడ్డాడు. ఇద్దరికీ ఇరు వర్గాల సభ్యులు సర్ది చెప్పారు. ప్రస్తుతం ‘మా’ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్నాహ్నం 12 గంటల వరకు 380 ఓట్లు పోలైయ్యాయి. ఆగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రామ్ చరణ్ తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 925 మంది ‘మా’ సభ్యులుగా ఉండగా.. అందులో 883 మందికి ఓటు హక్కు ఉంది. -
అందుకే శివబాలాజీ చేయి కొరికా: హేమ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద శివబాలాజీ చేయి కొరకడంపై నటి హేమ క్లారిటీ ఇచ్చింది. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ చెప్పుకొచ్చారు. దాని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ప్రస్తుతం పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు శివబాలాజీ కూడా హేమ చేయి కొరకడాన్ని తెలిగ్గా తీసుకున్నాడు. అనుకోకుండా అలా జరిగిపోయిందన్నారు. తనకు బెనర్జీకి ఎలాంటి గొడవ జరగలేదని, పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న వ్యక్తిని పట్టుకోబోతున్న క్రమంలో వాగ్వాదం జరిగిన మాట వాస్తవమనేనని శివబాలాజీ చెప్పారు. -
‘మా’ ఎన్నికలు: వారికే నా మద్దతు ఉంటుంది: చిరంజీవి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు నేటితో తెరపడుతుంది. ఈ రోజు (అక్టోబర్ 10) ‘మా’ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విన్నర్లు ఎవరనేది ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. ఓటర్లు ఎవరూ గెలిస్తే వారికే తన మద్దతు ఉంటుందన్నారు. ఎవరూ గెలిచిన ఓడినా అందరం కలిసి కట్టుగా ఉంటామని, ‘మా’ను ఒక లెవల్‌కు తీసుకెళ్తాం అన్నారు. ఏకగ్రీవంపై వస్తున్న వార్తలకు ఆయన స్పందిస్తూ.. ప్రజాస్వామ్య పద్దతి ప్రకారం ఎన్నికలు జరగడం అనివార్యమని, దానిని ప్రతి ఒక్కరు ఆనందంగా స్వాగతించాలన్నారు. అలాగే సభ్యుల మధ్య నెలకొన్న విమర్శలు, దూషణలపై కూడా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఇవన్ని సహజమని, ఆ తర్వాత అందరం కలిసి కట్టుగా ‘మా’ సమస్యలను పరిష్కరించుకుంటామని చిరంజీవి పేర్కొన్నారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ఇద్దరూ అన్నదమ్ముల్లాంటివారే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, విష్ణు అన్నదమ్ముల్లాంటి వారని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఇండస్ట్రీకి మేలు చేస్తారో వారికే ఓటేశాను. ఇద్దరూ ఇండస్ట్రీకి బాగా చేసేలా కనిపిస్తున్నారు. దీంతో రెండు ప్యానెల్లో ఉన్న వారికి ఓటు వేశాను. ప్రకాశ్ రాజ్, తమ్ముడు విష్ణు ఇండస్ట్రీకి అన్నదమ్ముళ్ల లాంటి వారే. మాటల్లో చెప్పడమే కాకుండా చేతుల్లో చేసి చూపించేవారు. రేపు షూటింగ్లలో మళ్లీ కలిసి పని చేసుకునే వాళ్లమేనని తెలిపారు. -
‘మా’ ఎన్నికలు: ‘సభ్యులు వ్యక్తిగత దూషణలు చేసుకోవడం బాధాకరం’
ఏపీ ఎమ్మెల్యే, నటి ఆర్కే రోజా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయని, సాధారణ ఎన్నికలను తలిపిస్తున్నాయన్నారు. ‘మా’ సభ్యులు వ్యక్తిగత దూషణలు చేసకోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ‘ఈ సారి ఎన్నకల్లో ఎన్నో వివాదాలు తెరపై వచ్చాయి. ఇందులో ఉంది 900 మంది మాత్రమే. అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్లం. రెండు ప్యానళ్లో నాతో పని చేసిన వారు, తెలిసిన వారు ఉన్నారు. ఎవరు గెలిచిన ఓడినా కలిసి కట్టుగా ఉండాలి. సమస్యలను ఇరు రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకెళ్లాలి. చివరికి అందరం కలిసి కట్టుగా ఉండి మన సమస్యలను పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. కళాకారులకు, ఆర్టిస్ట్లుకు పూర్వ వైభవం రావాలి. ఇకనైనా వెంచర్స్ పాలిటిక్స్ ఆపెయండి. గతంలోని పాలకవర్గంలో పెద్దవారిని, గోప్ప నటులను ఆదర్శంగా తీసుకోని పరిశ్రమను అభివృద్ది వైపు నడిపించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. -
MAA Elections 2021: శివబాలాజీని కొరికిన హేమ!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్‌రాజ్ ఫ్యానల్ మెంబర్స్‌పై మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాగా, పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవపై నటుడు నరేశ్ స్పందించారు. ‘పెద్ద గొడవలేవి జరగలేదు. ఎవరో ఒకరు ప్రకాశ్ రాజ్ బ్యాడ్జ్ వేసుకొని రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. నేను, ప్రకాశ్ రాజ్ కౌగిలించుకున్నాం. ‘నో ఫైటింగ్.. ఓన్లీ ఓటింగ్’అని చెప్పుకున్నాం. శివబాలాజీని నటి హేమ కొరికిందని నరేశ్ ఆ గాయాన్ని మీడియాకు చూపించారు. -
‘మా’ ఎన్నికల్లో ఉద్రిక్తత, ప్రకాశ్ రాజ్, నరేశ్ మధ్య వాగ్వాదం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల పోలింగ్ ముందు ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్ రాజ్, ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేశ్ మధ్య వివాదం చోటుచేసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరువరు వాగ్వాదానికి దిగారు. అలాగే ప్రకాశ్ రాజ్ ప్యానల్‌పై మంచు విష్ణు ప్యానల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయడంపై విష్ణు ప్యానల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి పోలింగ్‌లో రిగ్గింగ్ పాల్పిడినట్లు విష్ణు ప్యానల్ ఆరోపించారు. సభ్యుడు కానీ వ్యక్తులు కూడా పోలింగ్ బూత్‌కు వచ్చినట్లు పేరొన్నాడు. అంతేగాక పోలింగ్ కేంద్రం ముందు ఇరు ప్యానల్ సభ్యుల మధ్య గొడవలు తలెత్తడంతో కేంద్రం బయటక ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో విష్ణు ప్యానల్ సభ్యుడు, నటుడు శివ బాలజీ చేతిని గుర్తు తెలియని వ్యక్తి కొరికినట్లు నరేశ్ ఆరోపణలు చేశాడు. -
‘మా’చరిత్రలోనే రికార్డు స్థాయిలో..ముగిసిన ఎన్నికల పోలింగ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 665 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘మా’చరిత్రలోనే రికార్డు స్థాయిలో 83 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.‘మా’లో మొత్తం 925 మంది సభ్యులుగా ఉండగా.. అందులో 883 మందికి ఓటు హక్కు ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2:20 PM మా చరిత్రలో రికార్డ్ స్థాయి పోలింగ్ ‘మా’ఎన్నికల్లో ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. గతేడాది కేవలం 474 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా, ఈ సారి మాత్రం ఇప్పటికే 545 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించడంతో మరింతమంది తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మా ఎన్నికల ఫలితాలు ఆలస్యం కానుంది. అర్థరాత్రి దాటిన తర్వాతే ఫలితాలు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 2:05 PM ఓటేసిన అఖిల్ ‘మా’ఎన్నికల్లో యంగ్ హీరో అఖిల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఆయనతో పాటు హీరో సుధీర్ బాబు, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకేసారి యంగ్ హీరోలంతా రావడంతో వారితో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. 1:55 PM ‘మా’పోలింగ్ మరో గంట పొడిగింపు ‘మా’ఎన్నికల పోలింగ్ని మరో గంట పొడిగించారు. వాస్తవానికి మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగియాలి. కానీ ఓటు వేసే వాళ్లు చాలా మంది ఉండండంతో పోలింగ్ని మరో గంట పొడిగించినట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. ఇరు ప్యానళ్లతో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో ‘మా’ ఎన్నికల పోలింగ్ మధ్నాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. 1:40 PM విష్ణు గెలుపు ఖాయం : నరేశ్ ‘మా’ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధిస్తాడని నటుడు నరేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఓటు రెండేళ్ల పాలనకు పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు కుక్కల్లా అరిచారని, ఇవి వారి నోళ్లు మూయించే ఎన్నికలని తెలిపిన నరేశ్.. కచ్చితంగా మంచు విష్ణుదే విజయమని తేల్చి చెప్పారు. 1:15 PM మధ్నాహ్నం ఒంటి గంట వరకు 450 ఓట్లు పోలైయ్యాయి. హీరో నాని సైతం తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. 1:05 PM తెలుగు కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వండి: ఆర్ నారాయణ మూర్తి సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి వాళ్లు జాతీయ స్థాయి సినిమాలు తీయడం సంతోషించాల్సిన విషయమని, సినిమాల్లో తెలుగు కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 12:40 PM ఓటేసిన నాగార్జున అక్కినేని నాగార్జున తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. నాగ్‌తో పాటు కమెడియన్ పృథ్విరాజ్ కూడా మధ్యాహ్నం 12:40 గంటలకు పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు వేశారు. కాగా, చిరంజీవి, బాలకృష్ణ, మురళీ మోహన్ తదితర సీనియర్ హీరోలు ఉదయమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు మహేశ్ బాబు, అల్లు అర్జున్, వెంకటేశ్, నాని, నాగచైతన్య లాంటి అగ్రహీరోలు ఇప్పటి వరకు తమ ఓటు వేయడానికి రాకపోవడం గమనార్హం. 12:26 PM ‘మా’ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు 380 ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 925 మంది ‘మా’ సభ్యులుగా ఉండగా.. అందులో 883 మందికి ఓటు హక్కు ఉంది. 12:10 PM అందుకే శివబాలాజీ చేయి కొరికా : హేమ శివబాలజీ చేయిని కోరకడంపై హేమ క్లారిటీ ఇచ్చింది. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ చెప్పుకొచ్చారు. దాని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. 11:45 AM ‘మా’లో పోటీ నాతోనే మొదలైంది: రాజేంద్రప్రసాద్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మా’లో పోటీ తనతోనే మొదలైందన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. వాళ్లు తమలో ఒకరేనన్నారు. ‘మా’కు ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. 11:25 AM 11 గంటల వరకు ఎంతమంది ఓటు వేశారంటే.. మా ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతుంది. చిన్న చిన్న వివాదాలు మినహా.. పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 287 ఓట్లు పోలైయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ కొనసాగుతంది. మొత్తం 925 మంది ‘మా’ సభ్యులుగా ఉండగా.. అందులో 883 మందికి ఓటు హక్కు ఉంది. 11:10 AM టాలీవుడ్ నా సొంతిల్లు: జెనీలియా ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో నటి జెనీలియా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై నుంచి వచ్చి మరీ ఓటు వేశారు. అనంతరం ఆమెమాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ నాకు సొంతిల్లు అని తెలిపారు. ఈ ఎన్నికల్లో మంచి వ్యక్తే గెలుస్తారని తెలిపారు. త్వరలోనే సూపర్ ప్రెసిడెంట్‌ను చూస్తామన్నారు. 10:35 AM అందరం ఒకే కుటుంబానికి చెందినవాళ్లం: ఆర్కే రోజా ఎమ్మెల్యే, నటి ఆర్కే రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయని, సాధారణ ఎన్నికలను తలిపిస్తున్నాయన్నారు. ఈ సారి ఎన్నకల్లో ఎన్నో వివాదాలు తెరపై వచ్చాయి. ఇందులో ఉంది 900 మంది మాత్రమే. అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్లం. ఎవరు గెలిచిన ఓడినా కలిసి కట్టుగా ఉండాలని, సమస్యలను ఇరూ రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లాలి. రెండు ప్యానల్లో నాతో పని చేసిన వారె ఉన్నారు. చివరికి అందరం కలిసి కట్టుగా ఉంటాం’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ►మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కేంద్రానికి నటి జెనిలీయా చేరకున్నారు. ఈ సందర్భంగా విష్ణు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి జెనిలీయాను లోపలికి తీసుకెళ్లాడు. 10:20 AM మా ఎన్నికల్లో మరోసారి రసాభాస మొదలైంది. ఎన్నికల కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ ప్యానెళ్ల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు కోపంతో ఊగిపోయారు. పోలింగ్ సెంటర్లో ప్రచారం చేయడానికి ఎలా అనుమతించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10:00 AM మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ఇద్దరూ అన్నదమ్ముల్లాంటివారే ‘మా’అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, విష్ణు అన్నదమ్ముల్లాంటి వారని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఇండస్ట్రీకి మేలు చేస్తారో వారికే ఓటేశాను. ఇద్దరూ ఇండస్ట్రీకి బాగా చేసేలా కనిపిస్తున్నారు. దీంతో రెండు ప్యానెల్లో ఉన్న వారికి ఓటు వేశాను. ప్రకాశ్ రాజ్, తమ్ముడు విష్ణు ఇండస్ట్రీకి అన్నదమ్ముళ్ల లాంటి వారే. మాటల్లో చెప్పడమే కాకుండా చేతుల్లో చేసి చూపించేవారు. రేపు షూటింగ్లలో మళ్లీ కలిసి పని చేసుకునే వాళ్లమేనని తెలిపారు. 9:30AM ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి ‘మా’ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సినీ పెద్దలు క్యూ కడుతున్నారు. ‘మా’ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ఓటు హక్కును వినియోగించున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విన్నర్లు ఎవరనేది ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. మెగా ఫ్యామిలీ అంతా ప్రకాశ్ రాజ్‌కే మద్దతు ఇస్తున్నారు కదా విలేకర్లు ప్రశ్నించగా, అలాంటిదేమి లేదని చిరంజీవి అన్నారు. ఓటర్లు ఎవరిని గెలిపిస్తే వారికే తన మద్దతు ఉంటుందన్నారు. 9:10 AM నేను కూడా పోటీ చేయాలనున్నా: సాయి కుమార్ మా అధ్యక్ష పదవి కోసం కొనసాగుతోన్న ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు సాయి కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తాను కూడా పోటీ చేయాలనుకున్నానని, కానీ షూటింగ్లో బిజీ ఉండడంతో పోటీలో లేనని చెప్పుకొచ్చాడు.తాను లోకల్, నాన్ లోకల్ కాదని నేషనలిస్ట్ అని తెలిపాడు. 9:05AM ఓటు హక్కు వినియోగించుకున్న రామ్ చరణ్ మా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. ఆయనతో పాటు మంచు లక్ష్మీ, శ్రీకాంత్, సుమ, సుడిగాలి సుధీర్, ఉత్తేజ్, సాయి వెంకట్, వేణు, ఈటీవీ ప్రభాకర్, మురళీమోహన్ తదితరులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 9:00AM మా ప్యానల్‌దే గెలుపు : మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో మా ప్యానల్‌దే గెలుపు అన్నారు మంచు విష్ణు. సినీ పెద్దల ఆశీర్వాదాలు తమకే ఉన్నాయన్నాని చెప్పారు. ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఆయన పెద్దరికాన్ని గౌరవించి తానేమి అనలేదని, తన విజ్ఞతకే వాటిని వదిలేస్తున్నానని చెప్పారు. 8:50 AM ‘మా’ పోలింగ్ వద్ద ఉద్రిక్తత ‘మా’పోలింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్‌రాజ్ ఫ్యానల్ మెంబర్స్‌పై మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురిని అక్కడ నుంచి పంపించేశారు. 8:25 AM ►మా ఎన్నికలు కొనసాగుతున్నాయి. తనికెళ్ల తనికెళ్ళ భరణి, రఘుబాబు, ఆకాశ్ పూరి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 8.20 AM వ్యక్తిగత దూషణలు అవసరమా?: పవన్ ►‘మా’పోలింగ్ ప్రారంభమైంది. పొసాని కృష్ణ మురళి, పవన్ కల్యాణ్ వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. గతంలో ఇంతపోటీ నేను చూడలేదు. తిప్పికొడితే 900 ఓట్లు ఉండవు. దీనికోసం వ్యక్తిగత దూషణలు అవసరమా’ అని ప్రశ్నించారు. సినిమాలు చేసే వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలాంటి వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయన్నారు. ఇక మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అన్న ప్రచారం జరుగుతుందన్నదానిపై పవన్ స్పందిస్తూ.. ‘వారిద్దరు మంచి ఫ్రెండ్స్’ అని తెలిపారు. 7.50 AM మంచు విష్ణును ఆలింగనం చేసుకున్న ప్రకాశ్‌రాజ్ ►మా ఎన్నికలు జరుగుతోన్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు సినీ తారలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉన్న మంచు విష్ణు ఉదయాన్నే చేరుకోగా. కాసేపటి క్రితమే ప్రకాశ్ రాజ్ కూడా వచ్చారు. వచ్చి రాగానే మంచు విష్ణును ఆలింగనం చేసుకున్నారు. ఇక అక్కడే ఉన్న మోహన్ బాబును చూడగానే కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు అయితే మోహన్ బాబు దానికి నిరాకరించి ప్రకాశ్ రాజ్‌ను భుజం తట్టాడు. ఈ సన్నివేశం ఆసక్తిని రేకెత్తించింది. 7.45 AM MAA Elections Voting Live Updates: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రం వద్ద మోహరించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో జరగనున్న ఎన్నికల కోసం మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత ఆరువారాల నుంచి హోరాహోరీగా ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలు వాడీవేడిగా కొనసాగాయి. హీరో మంచు విష్ణు, నటుడు ప్రకాశ్ రాజ్ ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. మా ఎన్నికలో ఓటు వేసే సభ్యులు తప్పని సరిగా గుర్తింపు కార్డు తీసుకురావాలని ఎన్నికల అధికారులు సూచించారు. జూబ్లీహిల్స్ స్కూల్ ప్రధాన గేటు వద్ద పోలీసులు, ఆయా ప్యానెళ్ల ఏజెంట్లు గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కేంద్రంలోకి అనుమతిస్తారు. కేంద్రంలోకి వెళ్లిన తర్వాత జాబితాలో మరోసారి సభ్యుల పేర్లను తనిఖీ చేస్తారు. అక్కడ ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాతనే ఓటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. -
నేడే 'మా' ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రం వద్ద మోహరించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో జరగనున్న ఎన్నికల కోసం మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత ఆరువారాల నుంచి హోరాహోరీగా ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలు వాడీవేడిగా కొనసాగాయి. హీరో మంచు విష్ణు, నటుడు ప్రకాశ్ రాజ్ ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. మా ఎన్నికలో ఓటు వేసే సభ్యులు తప్పని సరిగా గుర్తింపు కార్డు తీసుకురావాలని ఎన్నికల అధికారులు సూచించారు. జూబ్లీహిల్స్ స్కూల్ ప్రధాన గేటు వద్ద పోలీసులు, ఆయా ప్యానెళ్ల ఏజెంట్లు గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కేంద్రంలోకి అనుమతిస్తారు. కేంద్రంలోకి వెళ్లిన తర్వాత జాబితాలో మరోసారి సభ్యుల పేర్లను తనిఖీ చేస్తారు. అక్కడ ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాతనే ఓటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. -
‘మా’ ఎన్నికలు: నాగబాబు కామెంట్స్‌పై స్పందించిన మంచు విష్ణు
మెగా బ్రదర్ నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా బదులిస్తానంటూ మంచు విష్ణు మండిపడ్డారు. తాజాగా మంచు విష్ణు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షులు నరేశ్ సాక్షితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో తామే తప్పకుండా గెలుస్తామని థీమా వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి తన బంధువా? కాదా? అనే దానిపై విష్ణు స్పందిస్తూ.. దీనిని ఆయననే రుజువు చేయమని, తన ఫ్యామిలీ గురించి తనకంటే ఎక్కువగా ఆయన తెలుసు అనుకుంటా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాగే ప్రతి పక్షంలో ఉన్న వ్యక్తి తనని, తనని ఫ్యామిలీపై కూడా విమర్శలు చేస్తున్నారని, ఆయనకు తానేంటో త్వరలోనే చూపిస్తా అంటూ సవాలు విసిరారు. తాను చేసేది తప్పు అయితే తనని, ఎన్నికల అధికారిన సస్పెన్స్ చెయొచ్చని విష్ణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆశుక్రవారం నిర్వహించిన మేనిఫెస్టో డిన్నర్ పార్టీకి 250 నుంచి 300మంది వస్తారనుకున్నామని, కానీ 560మంది వచ్చారన్నారు. అందరూ ‘మా’ సభ్యులే అని వారంతా తనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యులను పిలిచి తనకెందుకు ఓటు వేయాలో చెప్పానని, వాళ్లకు నచ్చితే వేస్తారన్నారు. ఈసారి ఇతర ప్రాంతాల్లో ఉన్న ‘మా’ సభ్యులు విమానంలో వచ్చి మరీ ఓటు వేస్తున్నారని, తన హామిలన్ని అమలు కావాలంటే తన ప్యానల్ మొత్తం గెలవాలంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. అలాగే నరేశ్ కూడా మాట్లాడుతూ.. ‘రెండు రోజుల నుంచి ఎన్నికల ఏర్పాట్లను చూస్తున్నామన్నారుఉఉ. ఇరు ప్యానెల్ వర్గాలు కూడా వచ్చాయని, ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు. రేపు ఉదయం 8గంటలకు పోలింగ్ మొదలవుతుందని, మధ్యాహ్నం 2గంటలకు ముగుస్తుందని చెప్పారు. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని, నాలుగైదు గంటల పాటు ఓట్లను లెక్కిస్తారని తెలిపారు. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టాలని మొదట అనుకున్నామని, కానీ వర్షాల కారణంగా అందరి ఆమోదంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పారు. ఎవరి ప్రచారాన్ని వాళ్లు ముగించుకుని నేడు ఏర్పాట్లలోనే ఉన్నామన్నారు. -
‘మా’ ఎన్నికల అధికారిపై అనుమానాలు ఉన్నాయి: నాగబాబు సంచలన వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరూ విమర్శలు గుప్పించుకుంటూ, వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంతో ఈసారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలనను తలపిస్తున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు సాక్షి టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాగబాబు విష్ణు ప్యానల్, మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నాగాబాబు మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌పై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని, అతడి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నిర్వహణపై తనకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఆయన మోహన్ బాబుకు దూరపు బంధువు అవుతారనే సమాచారం తమకు వచ్చిందని, అందుకే అతడు విష్ణుకు ఫేవర్‌గా ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక తమకు కొత్త ఎన్నికల అధికారి కావాలని పేర్కొన్నారు. అంతేగాక మాలో పొస్టల్ బ్యాలెట్ లేదని, మొదట పోస్టల్ బ్యాలెట్ పెట్టాలని విష్ణు ప్యానల్ ప్రతిపాదనను చేసినప్పుడు తమకు కూడా సహెతుకంగా అనిపించి ఒకే అన్నామన్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్‌ను స్కాంలా ఉపయోగించి దాని ద్వారా సభ్యులను ప్రభావితం చేస్తారని ప్రకాశ్ రాజ్ పసిగట్టి ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే మొదటి నుంచి ప్రకాశ్ ప్యానల్‌కు మద్దతు ఇస్తున్న నాగబాబు విష్ణు, విష్ణు ప్యానల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంకా ఏయే విషయాలు వెల్లడించారో తెలియాలండే ఆయన సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్య్వూ కోసం ఇక్కడ ఓ లుక్కేయండి. -
‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్నా, కానీ!: రాజశేఖర్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఈ సారి సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష బరిలో అభ్యర్థులు ఒకరిపై ఒకరూ విమర్శలు, ఫిర్యాదులతో పాటు వ్యక్తిగత దూషణలు కూడా చేసుకుంటున్నారు. ఇక ఈ సారి లోకల్-నాన్ లోకల్ అనే అంశం కూడా ఎన్నికల్లో వినిపిస్తోంది. దీంతో చివరికి మా అధ్యక్షు పీఠం ఎవరికి దగ్గనుందనేది ఆసక్తిగా మారింది. ఇక మా ఎన్నికలకు కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నటుడు జీవిత రాజశేఖర్ తొలిసారిగా మా ఎన్నికలపై స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాగా ఆయన భార్య జీవిత, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: అందుకే ప్రకాశ్ రాజ్ మేనిఫెస్టో విడుదల చేయలేదు: జీవిత ఈ క్రమంలో ప్రకాశ్ ప్యానల్ నిర్వహించి ప్రెస్మీట్లో రాజశేఖర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట తాను ఏ ప్యానల్‌కు సపోర్టు చేయకూడదని, ‘మా’ ఎన్నికల విషయంలో న్యూట్రల్‌గా ఉండాలనుకున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అనంతరం ‘తెలుగు సినీ ఇండస్ట్రీ మరింత కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకోవాలంటే మా అసోసియేషన్‌కు తగిన అధ్యక్షుడు కావాలి. అసోసియేషన్ అధ్యక్ష పీఠం పెత్తనం కోసం కాదు.. అదొక బాధ్యత. సభ్యుల సంక్షేమం, మా అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడే పదవి. అందుకే నేను కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని అనుకున్నాను. కానీ అదే సమయంలోనే ప్రకాశ్ రాజ్ మా ఇంటికి వచ్చారు. చదవండి: ‘మా’ సభ్యులకు మోహన్ బాబు వాయిస్ మెసెజ్, ఏం అన్నారంటే ‘మా’ అసోసియేషన్ సంక్షేమం కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారో వివరించారు. ప్రకాశ్ రాజ్ ఆలోచనలు విన్న తర్వాత నా మనసు మార్చుకున్న. ‘మా’ అధ్యక్ష పదవికి ఆయనే తగిన వాడని అనిపించింది. అందుకే ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నాను. ‘మా’ అసోసియేషన్ అభివృద్ధికి చాలా డబ్బులు అవసరం. అందుకోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రకాశ్ రాజ్‌కు వివిధ సినిమా ఇండస్ట్రీలతో సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఫండ్ రైజింగ్ కోసం ఆయన చాలా కార్యక్రమాలు నిర్వహించగలరు. అందుకే ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ప్రకటిస్తున్నాను. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ప్యానెల్ జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ పోటీ చేస్తోంది’ అంటూ చెప్పుకొచ్చాడు. -
అందుకే ప్రకాశ్ రాజ్ మేనిఫెస్టో విడుదల చేయలేదు: జీవిత
మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్(మా) ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి. అయిన ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ తమ మేనిఫేస్టోని ప్రకటించకపోవడం గమనార్హం. గతంలో తమ మేనిఫెస్టో చూస్తే మోహన్ బాబు నేరుగా వచ్చి ఓటు వేస్తారని చెప్పిన ఆయన ఇంతవరకు తమ మేనిఫెస్టోను విడుదల చేయకపోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఎన్నికలు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రుకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రెటరీ పదవి పోటీ చేస్తున్న జీవిత రాజశేఖర్ తాజాగా సాక్షితో టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ మ్యానిఫెస్టో విడుదల చేయకపోవడంపై ఆమె వివరణ ఇచ్చారు. చదవండి: ‘మా’ సభ్యులకు మోహన్ బాబు వాయిస్ మెసెజ్, ఏం అన్నారంటే ఈ మేరకు జీవిత.. మేనిఫేస్టో విడుదల చేయడంపై ప్రకాశ్ రాజ్ గారితో తాను మాట్లాడానని చెప్పారు. దీనికి ఆయన ఇప్పటికే మనం టీవీ ఇంటర్వ్యూ, యూట్యూబ్ చానల్లో, ‘మా’ సభ్యులతో తరచూ కలిసి మన మ్యానిఫెస్టో గురించి మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎజెండా ఎంటన్నది క్రిస్టల్ క్లియర్‌గా వివరించామని, ఇక దీనినే మనం పేపర్లో పెట్టి ఇదే మా మేనిఫెస్టో అని చెప్పడం అంతా సెన్సిబుల్ అనిపించడం లేదని అన్నట్లు ఆమె తెలిపారు. ఇక విష్ణు రూ. 10 వేలు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నాడని మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్, ఓట్లు కొనుగోలు అంశంపై జీవిత స్పందిస్తూ.. ఈ విషయం తనకు తెలియదన్నారు. చదవండి: MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ మేనిఫెస్టో ఇదే నాగబాబు గారు మాట్లాడరనేది నిజమే కానీ ఆయనకు ఏం ఫీలర్ వచ్చిందో తనకు తెలియదన్నారు. ఇలాంటి వార్తలు ఎన్నో పుట్టుకోస్తున్నాయి, పోస్టల్ బ్యాలెట్‌పై కూడా పలు రూమర్స్ వచ్చాయన్నారు. దీనిపైనే ఆయన మాట్లాడి ఉంటారని, ఏం జరుగుతుందన్నది సభ్యులు తెలుసుకుంటారని, అలాంటిది ఏమైన జరుగుతుంటేర్స్ సరైనదో కాదో మెంబర్స్ తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని జీవిత అన్నారు. అయితే ఒక ఎవిడెన్స్, ఫ్రూఫ్ లేకుండా మాత్రం సభ్యులు డబ్బులు తీసుకుంటున్నారనేది చెప్పలేమని ఆమె పేర్కొన్నారు. అనంతరం ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. -
రేపే 'మా' ఎన్నికలు..ఫలితాలు తేలేది ఎప్పుడంటే..
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో రేపు(ఆదివారం)జరగునున్న మా ఎన్నికల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ తమ సభ్యులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రేపు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. షూటింగ్ స్పాట్లో బాలయ్య కాలికి గాయం! సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదేరోజు రాత్రి 8 గంటలలోపు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. దీంతో మా అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. చదవండి: MAA Elections 2021: ‘‘మా’ ఎన్నికల పరిస్థితి చూస్తుంటే మనసుకు కష్టంగా ఉంది’’ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది..ఇక బయటపెడుతున్నా: సుమ -
‘మా’ సభ్యులకు మోహన్ బాబు వాయిస్ మెసెజ్, ఏం అన్నారంటే
అందరు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయం దగ్గర పడింది. ఇంకా ‘మా’ ఎన్నికలు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో ఇటూ ప్రకాశ్ రాజ్ ప్యానల్, అటూ మంచు విష్ణు ప్యానల్ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ పోటీలో గెలిచేందుకు ఇరు ప్యానల్ సభ్యులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ‘మా’ సభ్యులను ఆకట్టుకునేందుకు ఏ అవకాశాన్ని ఒదులుకోవడం లేదు. మరోవైపు తన కుమారుడిని గెలిపించేందుకు మోహన్ బాబు కూడా తనవంతు కృషి చేస్తున్నారు. చదవండి: MAA Elections 2021: ‘మా’ గొడవ మాదే విష్ణుకే ఓటు వేయాలంటూ ఇప్పటికే ఆయన బహిరంగ లేఖ రాయగా.. తాజాగా ‘మా’ సభ్యులకు ఓ వాయిస్ మెసెజ్ పంపారు. ‘తెలుగు వాళ్లు ఒకటిగా ఉండాలనే ‘మా’ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల పరిస్థితి చూస్తుంటే మనసుకు కష్టంగా ఉంది. అసలు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పెద్దలు అనేవారు. అయితే కొంతమంది సభ్యులు రోడ్డనపడి నవ్వుపాలవుతున్నారు. ఎవరు ఏం చేసినా ‘మా’ అనేది ఒక కుటుంబం. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తాం. సినీ పరిశ్రమ కష్టాలను వారికి చెప్పుకుందాం. మేనిఫెస్టోలోని హామీలను విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. విష్ణు మీ కుటుంబ సభ్యుడు. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. చదవండి: విష్ణు ప్యానల్‌కే ఓటు వేయాలంటూ మోహన్ బాబు లేఖ -
‘బోగస్ ఓట్లున్నాయి... ‘మా’ ఎన్నికలు ఆపండి’
బంజారాహిల్స్: ఓటరు జాబితాలో ఉన్న బోగస్ ఓటర్లను తొలగించిన తర్వాతే ‘మా’ ఎన్నికలు నిర్వహించాలని జూనియర్ ఆర్టిస్ట్ సంఘం నేతలు డిమాండ్ చేశారు. అక్టోబర్ 10న (ఆదివారం) జరిగే ఎన్నికల్లో 3,609 మంది జూనియర్ ఆర్టిస్టులు ఓటు హక్కు కలిగి ఉన్నారని, అయితే ఓటరు జాబితాలోని పేర్లున్న వారికి ఫోన్లు చేస్తే చాలా మంది తాము యూనియన్ సభ్యులం కాదని చెబుతున్నారని, ఇంకొందరు సమాధానం చెప్పడానికి నిరాకరిస్తున్నారని జూనియర్ ఆర్టిస్ట్ సంఘం నేతలు రవీందర్ సంకూరి, రమావేణి, అశోక్ బెజవాడ తదితరులు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బైలాస్కు విరుద్ధంగా పని చేస్తున్న వల్లభనేని అనిల్‌కుమార్, స్వామిగౌడ్, సినీ పరిశ్రమకు సంబంధం లేని శేషగిరిరావు నామినేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓటరు లిస్ట్‌ను సరి చేసి ఎన్నికలు నిర్వహించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత సెప్టెంబర్ నెలలో జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగిందని అక్టోబర్ 10న ఎన్నికలు జరుపుతున్నట్లు ఆరోజు ప్రకటించలేదని ఎజెండా లేకుండానే కేవలం నాలుగు రోజుల ముందు నోటీస్ బోర్డుపై వివరాలు ఉంచారని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్కే.మల్లిక అనే జూనియర్ ఆరిస్ట్, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనియన్‌లో రికార్డులు అడిగితే ఇవ్వడం లేదని వాటిని ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి 1,600 కార్డులలో 720 కార్డుల సభ్యుల నుంచి ఒక్కొక్కరికి రూ. 25 వేలు కార్డు రెన్యువల్ పేరుతో సుమారు రూ.1.80 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారని బైలాస్కు విరుద్ధంగా ఎలా వసూలు చేశారని ఫిర్యాదులో ప్రశ్నించారు. ఓటరు జాబితా, లెడ్జర్లు, రిసిప్ట్ బుక్‌లు, మినిట్స్ బుక్‌లు, నెలవారీ ఆదాయ వ్యవహారాలు, అసోసియేట్ కార్డు మెంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆడిటింగ్ వివరాలు ఇవన్నీ తనిఖీ చేసుకునే అవకాశం జూనియర్ ఆర్టిస్ట్‌లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘మా’ ఎన్నికలకు భారీ బందోబస్తు
బంజారాహిల్స్: ఈ నెల 10వ తేదీన జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం.71లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఈ ఎన్నికలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి. ఇందుకోసం జూబ్లీహిల్స్ పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మూడు గదుల్లో 12 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఒకేసారి ఒక గదిలో నలుగురు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. (చదవండి: బిగ్ ట్విస్ట్.. ‘మా’కు సీవీఎల్ షాక్) పోలీస్ బందోబస్తు కోసం మూడు ప్లటూన్లు వినియోగిస్తున్నారు. ఇందులో ఒక ఉమెన్ ప్లటూన్ కూడా ఉంది. ఈ ఎన్నికల్లో మొత్తం 883 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా మా ఎన్నికలకు సంబంధించి ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ ప్రతినిధులు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులతో ఓటింగ్ జరగనున్న ప్రాంతంలో సమావేశం అయ్యారు. వీరితో పా టు నటుడు మురళీ మోహన్, శ్రీకాంత్, నరేశ్, జీవితా రాజశేఖర్ తదితరులు కూడా ఉన్నారు. -
MAA Elections 2021: ‘మా’ గొడవ మాదే
దాదాపు నాలుగైదు నెలలుగా ఎక్కడ చూసినా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల గురించి జరుగుతున్న చర్చల్లో ప్రధాన అంశాలివి. ‘మా గొడవ మాదే.. మేమంతా ఒక్కటే’ అంటూనే రాజకీయ ఎన్నికలను తలపించే రీతిలో ‘మా’ ఎన్నికల తీరు కనిపిస్తోంది. గత 28 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వివాదాలు, విమర్శలకు తోడు ఒకదశలో అభ్యంతరకర పదజాలంతో దూషణలూ వినిపించాయి. ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అంశంపై ఓ రౌండప్.. లోకల్.. నాన్‌లోకల్.. ‘సినిమా బిడ్డలం’ ప్యానల్ అంటూ ప్రకాశ్‌రాజ్, ‘మాకోసం మనమందరం’ అంటూ మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా రెండు పక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఘాటుగా సాగుతున్నాయి. మొదట్లో ‘‘ప్రకాష్‌రాజ్ నాన్‌లోకల్. షూటింగ్లకే సరిగా రాడు. ఇక ‘మా’ సమస్యలు పట్టించుకునే తీరిక ఎక్కడుంటుంది?’’ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే.. ‘‘మూడు దశాబ్దాలుగా ఇక్కడ సినిమాలు చేస్తున్నాను. తెలంగాణలో గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఎవరూ నన్ను నాన్ లోకల్ అనలేదు. ఇప్పుడు ఎందుకు నాన్ లోకల్ అవుతాను’’ అని ప్రకాశ్‌రాజ్ తన వాదన వినిపించుకున్నారు. ఆయనకు మద్దతుగా నాగబాబు మూడు రోజుల కింద ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకాశ్‌రాజ్‌కే. ఆయన ఉంటే ‘మా’ అసోసియేషన్ బాగుపడుతుంది. మన తెలుగువాళ్లు వేరే భాషల్లో నటించడం లేదా?’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ‘మీకు ఏ సమస్య వచ్చినా నేనిక్కడే ఉంటా.. ఈ ఊళ్లోనే ఉంటా’ అని మంచు విష్ణు ప్రకటించారు. ఆయన తండ్రి మోహన్‌బాబు కూడా.. ‘‘ఈ ఊళ్లోనే ఉండే నా కుమారుడు ఏ సమస్య వచ్చినా మీ పక్కన నిలబడి ఉంటాడని నేను మాట ఇస్తున్నాను. మీ ఓటును మంచు విష్ణుకు, అతడి పూర్తి ప్యానల్‌కు వేసి సమర్థవంతమైన పాలనకు సహకరించాలని కోరుకుంటున్నాను’’ అని శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మెగా వర్సెస్ మంచు! మోహన్‌బాబు ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును నిలబెట్టాలనుకున్నప్పుడు చిరంజీవిని మద్దతు అడిగారని.. కానీ అప్పటికే ప్రకాశ్‌రాజ్‌కు సపోర్టు చేస్తానని మాటిచ్చానని చిరంజీవి చెప్పారనే వార్తలు వెలువడ్డాయి. దానిపై స్పందించిన మోహన్‌బాబు.. మెగాస్టార్ కుటుంబానికి చెందిన రామ్‌చరణ్, నాగబాబు వంటి వారు ఎన్నికల్లో నిలబడితే తాను మరో ఆలోచన లేకుండా మద్దతు తెలిపేవాడినని పేర్కొన్నారు. ఇలా ‘మా’ ఎన్నికలు ‘మెగా వర్సెస్ మంచు’లా మారాయి. పోస్టల్ బ్యాలెట్ వర్సెస్ ఈవీఎం తాము గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వచ్చే అవకాశముందని, పేపర్ బ్యాలెట్ పెట్టాలని మంచు విష్ణు కోరగా.. ఎన్నికల అధికారి పేపర్ బ్యాలెట్‌ను ఆమోదించారు. అయితే విష్ణు 60 మంది సీనియర్ నటులతో తనకు అనుకూలంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయించుకున్నారని ప్రకాశ్‌రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ‘మా’ ఎప్పుడు మొదలైంది? తెలుగు సినిమా నటీనటుల సంక్షేమం కోసం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ని 1993లో ఏర్పాటు చేశారు. చిరంజీవి వ్యవస్థాపక అ«ధ్యక్షుడిగా, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి వారు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. అసోసియేషన్ ప్రారంభంలో 150 మంది సభ్యులు ఉండేవారు. ఇప్పుడు దాదాపు 900 మందికిపైగా ఉన్నారు. పెద్దదిక్కు ఎవరు? ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరువర్గాల సభ్యులు పరుషంగానే మాటల తూటాలు విసురుకున్నారు. ఈ సందర్భంలో చాలామంది ‘దాసరి నారాయణరావు’ను గుర్తు చేసుకున్నారు. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాసరి సామరస్యంగా పరిష్కరించేవారని.. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకపోవడం వల్లే ఇంత రచ్చ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కాగా.. సినిమా అంటే వినోదం అని.. ఇప్పుడు నటీనటులు ‘మా’ ఎన్నికల రూపంలో బయట వినోదం పంచుతున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇంతా చేసి ‘మా’ ఎన్నిక కాగానే మేమంతా ఒక్కటే అన్నట్టు కలసిపోతారని ఇండస్ట్రీ అంటున్న మాట. చదవండి: MAA Elections 2021: రెండు రోజుల్లో ఎన్నికలు.. ‘మా’కు సీవీఎల్ షాక్ -
బిగ్ ట్విస్ట్: రెండు రోజుల్లో ఎన్నికలు.. ‘మా’కు సీవీఎల్ షాక్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు సీవీఎల్ నరసింహరావు షాక్ ఇచ్చారు. తాజాగా తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పరీక్ష రాయకుండానే ఫెయిల్ అయ్యాను. బురదలో ఉన్న వికసించడానికి నేను కమలాన్ని కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు ప్రయత్నం చేశానని, ఒకవేళ అది జరగకపోతే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పిన కొద్ది సేపటికే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: MAA Elections 2021: ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయను!: సీవీఎల్ ఈ మేరకు ఆయన ‘దివంగత నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, దర్శకుడు దాసరి నారాయణరావు.. అందరి ఆశీస్సులు ఉన్నాయి. కచ్చితంగా ఈ ఎన్నికలు హాయిగా ముగుస్తాయి. ఒకవేళ అలా ముగియకపోతే నేను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’కి రాజీనామా చేస్తా. ఇందులో సభ్యుడిగా ఉండను. ఇలాంటి గందరగోళ, ఇబ్బందికర పరిస్థితులకి నేను దోహదం చేశాను. కాబట్టి ఇకపై ఓటు వేయను’ అని అన్నారు. ఇలా చెప్పిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేశారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ సీవీఎల్ రాజీనామా సర్వత్రా ఆసక్తి నెలకొంది. చదవండి: నరేశ్‌పై శివాజీ రాజా సంచలన ఆరోపణలు, ‘మా’ వివాదాలకు అతడే కారణం మొదట ‘మా’ అధ్యక్ష పోటీకి బరిలో దిగిన ఆయన నేమినేషన్ కూడా దాఖలు చేశాడు. అనంతరం పోటీ నుంచి తప్పకుంటూ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధ్యక్ష పిఠానికి ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు ‘మా’ ఎన్నికలు 10న ఈ ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఎవరూ అధ్యక్ష పీఠం దక్కించుకోన్నారోనని ఉత్కంఠ నెలకొంది. -
‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తా!: సీవీఎల్ నరసింహ రావు
ప్రచారం, విమర్శలు, ఆరోపణలతో వాడివేడిగా సాగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు తాజాగా సీవీఎల్ నర్సింహ రావు వ్యాఖ్యలతో మరింత ఆసక్తిగా మారాయి ‘మా’ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఫిలించాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఎన్నికల్లో తాను ఓటు వేయానన్నారు. ‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు చాలా బాధను కలిగిస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో నిలబడితే తాను మాత్రమే ఓడిపోతాననుకున్నాను అన్నారు. చదవండి: నరేశ్‌పై శివాజీ రాజా సంచలన ఆరోపణలు, ‘మా’ వివాదాలకు అతడే కారణం కానీ తాను మౌనంగా ఉండిపోతే మా సభ్యులు అందరూ ఓడిపోతారని ఇన్ని ప్రయత్నాలు చేశానన్నారు. అయినా ప్రస్తుతం ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు చూసి అలా జరగకుండా ఉంటే బాగుండు అనిపిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ విషయంలో చివరికి తానే గెలుస్తాననే నమ్మకం ఉందని, ఎన్నికల్లో కొంత మంది గెలిచి కొంత మంది ఓడిపోతే ప్రతి వాళ్ళు ఓడిపోతారన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల ఆశిస్సులతో ‘మా’ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని ఆశభావం వ్యక్తం చేశారు. చదవండి: MAA Elections 2021: ‘మా’ ఎన్నికలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు ఒకవేళ ఎన్నికల్లో ఇలాంటి గందరగోళ పరిస్థితులే కొనసాగితే తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సీవీఎల్ నర్సంహి రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా మొదట ‘మా’ అధ్యక్ష పోటీకి బరిలో దిగిన ఆయన నేమినేషన్ కూడా దాఖలు చేశాడు. అనంతరం పోటీ నుంచి తప్పకుంటూ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఎవరూ గెలిచిన మాలో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లాలని రెండు ప్యానల్లను కోరుతూ ఫిలించాంబర్‌లో మీడియాతో ముచ్చటించిన ఆయన తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
నరేశ్‌పై శివాజీ రాజా సంచలన ఆరోపణలు, ‘మా’ వివాదాలకు అతడే కారణం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఒకవైపు దగ్గర పడుతుంటే, మరోవైపు అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలిపస్తున్నాయి. ఇక లోకల్-నాన్ లోకల్ అనే అంశంగా కూడా ఈ ఎన్నికల్లో వినిపిస్తోంది. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం ఎన్నికల వివాదం మరింత ముదురుతోంది. ఈ క్రమంలో ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా నటుడు నరేశ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ‘మా’ ఎన్నికల్లో జరుగుతున్న వివాదాలకు నరేశ్ కారణమంటూ ఆరోపించాడు. ఆదివారం(అక్టోబర్ 10) ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సారి జరిగే ‘మా’ ఎన్నికలపై తాను స్పందించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. అనంతరం నరేశ్ గురించి మాట్లాడుతూ.. ఇక గతేడాది నాగబాబు మద్దతు లేకపోయి ఉంటే నరేశ్ విజయం సాధించేవాడు కాదన్నాడు. అప్పుడు నాగాబాబు, నరేశ్‌కు ఎందుకు మద్దతు ఇచ్చాడో ఇప్పటికి తనకు అర్థం కావడం లేదన్నాడు. చదవండి: విష్ణు ప్యానల్‌కే ఓటు వేయాలంటూ మోహన్ బాబు లేఖ ఇక నరేశ్ ఆడే పాచికలాటలో ప్రాణ మిత్రులు కూడా విడిపోవాల్సి వచ్చిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ మేరకు శివాజీ రాజా ‘‘మా’ నరేశ్ చిన్నపిల్లాడు. ఎప్పుడు అబద్దాలే చెబుతాడు. అతడి నోటివెంట నిజాలు వచ్చిన రోజున నేను ఆశ్చపోతాను. గతంలో నాపై నరేశ్ ఎన్ని అసత్య ప్రచారం చేశాడు. నరేశ్ రాకతోనే ఆసోసియేషన్‌లో రాజకీయాలు మొదలయ్యాయి. నేను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్పుడు అమెరికాలో ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించాము. అప్పుడు చిరంజీవితో పాటు పలువురు హీరోహీరోయిన్లతో కలిసి ఈ కార్యక్రమానికి హజరయ్యాము. కానీ అదే సమయంలో ‘మా’కు జనరల్ సెక్రటరీగా ఉన్న నరేశ్ మాత్రం రాలేదు. అమెరికా రాకుండా ఇక్కడ సమావేశాలు పెట్టి నా గరించి తప్పుడు ప్రచారం చేశాడు’ అని ఆయన ఆరోపించారు. అలాగే ఈ అమెరికా పర్యటనకు విమాన టికెట్ట వ్యవహరంలో నేను, శ్రీకాంత్ డబ్బులు వాడుకున్నామని ఆరోపణలు చేశాడు. అయితే దీనిపై చిరంజీవి.. సినీ పెద్దలతో ఓ కమిటీ వేసి విచారణ జరిపి.. ఇందులో నిజం లేదని, నరేశ్ ఆరోపణలు అవాస్తవాలే అని తేల్చారన్నారు. శ్రీకాంత్, నేను డబ్బులు వాడుకోలేదని కూడా ఆ కమిటీ వెల్లడించిందని ఆయన చెప్పాడు. అయినా కూడా నరేశ్ ఇప్పటివరకూ మాకు క్షేమాపణలు చెప్పలేదన్నాడు. ఇక తన హాయాంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌ల ద్వారా వచ్చిన ఫండ్‌ని ఇప్పుడు ‘మా’ సంక్షేమం కోసం నరేశ్ వినియోగిస్తున్నాడని, అతని రాకతోనే అసోసియేషన్‌లో రాజకీయాలు ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పుడు ‘మా’ ఎన్నికలు రచ్చకెక్కడానికి కూడా అతడే కారణమని, చిన్న విషయాలకు కూడా అబద్ధాలు ఆడతాడని పేర్కొన్నాడు. శ్రీకాంత్‌కు తనకు నరేశ్ క్షమాపణలు చెప్పేవరకు తనని ఇలాగే తిడుతూ ఉంటానని, అతడి వల్లే మా స్నేహ్నాలు కూడా చెడిపోయాయని ఆయన తెలిపారు. చదవండి: ‘మా’ ఎన్నికలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు ‘‘మా’ సభ్యుల కోసం ఓ వృద్ధాశ్రమం నిర్మించాలని నేను అనుకున్నాను. దానికి ఫండ్ రైజ్ చేయడం కోసం యూఎస్‌లో మరోసారి ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నాను. దీనిపై పలువురు స్టార్ హీరోలతో చర్చించాను వారు కూడా ఒకే అన్నారు. అలాగే హీరో ప్రభాస్‌ను కూడా సంప్రదించాను. ప్రభాస్ షూటింగ్లో భాగంగా ఈ ప్రోగ్రామ్‌కు రాలేనని, దీనిపై మీరంతగా శ్రమించకండన్నారు. తన వాటాగా ‘మా’ కోసం 2 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పాడు. ఆ మాట నాకెంతో తృప్తినిచ్చింది. ఇలా స్టార్‌హీరోహీరోయిన్స్ ప్రోగ్రామ్‌కి ఓకే అన్నాక.. నరేశ్ ప్రెస్‌మీట్ పెట్టి నాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత వెంటనే ‘మా’ ఎన్నికలు జరిగాయి. మా ప్యానల్ ఓడిపోయింది. దాంతో ఆ ప్రోగ్రామ్ ఆగిపోయింది. నా కల అలాగే నిలిచిపోయింది’’ అంటూ ఆయన చెప్పకొచ్చాడు. -
విష్ణు ప్యానల్‌కే ఓటు వేయాలంటూ మోహన్ బాబు లేఖ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష పదవి పోటీ చేస్తున్న తన కుమారుడు, హీరో మంచు విష్ణు ప్యానల్‌కే ఓటు వేసి గెలిపించాలని నటుడు మోహన్ బాబు కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ‘మా’ అధ్యక్ష పదవి అంటే కీరిట కాదని, అదోక బాధ్యత అన్నారు. ‘నేను మీ అందరిలో ఒకడిని. ఇండస్ట్రీలో కష్టం వచ్చిన ప్రతి సారి నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన దివంగత దర్శకుడు దాసరి నారాయణ గారి అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన బిడ్డను. మీలో ఒకడిని. నిర్మాతలతో పాటు నిర్మాతని, నటులతో పాటు నటుడిని, దర్శక శాఖ పని చేసిన వాడిని.. చేసిన సాయం, ఇచ్చిన దానం ఎప్పటికీ చెప్పొద్దంటారు. కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చదవండి: MAA Elections 2021: ‘మా’ ఎన్నికలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థని స్థాపించిన రోజు నుంచి నేటి వరకు ఎన్నో చిత్రాలను నిర్మించి.. ఎందరో టెక్నిషియన్లను, కళాకారులను ఇండస్ట్రికీ పరిచయం చేశాను. 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న ఎంతోమంది పిల్లలకి మరణించిన సినీ కళాకారుల పిల్లలకి మన విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించి వాళ్లు గొప్ప స్థాయికి చేరేలా చేశాను. భవిష్యత్తులో కూడా దాన్ని కొనసాగిస్తాను కూడా. ఇక ‘మా’ అధ్యక్ష పదవిలో నేను ఉన్నప్పుడే వృద్ధాప్య పింఛన్లని ప్రవేశపెట్టాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి’ అంటూ మోహన్ బాబు తన లేఖలో రాసుకొచ్చారు. చదవండి: ప్రకాశ్‌రాజ్‌పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాస రావు ‘‘మా’ అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు, అదొక బాధ్యత. ఈసారి ఎన్నికల్లో నా కుమారుడు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. నా బిడ్డ నా క్రమశిక్షణకి, నా కమిట్మెంట్కి వారసుడు. తను ఇక్కడే ఉంటాడు. ఈ ఊళ్లోనే ఉంటాడు. ఏ సమస్య వచ్చినా మీ పక్కనే ఉంటాడని నేను మాటిస్తున్నా. మీరు మీ ఓటుని విష్ణుతో పాటు పూర్తి ప్యానల్‌కు వేసి సమర్థవంతమైన పాలనకి సహరించాలని మనవి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్టోబరు 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, ప్రకాశ్‌రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘మా’ ఎన్నికలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు ఇంకా రెండు రోజులే మిగిలున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ‘మా’ ఎలక్షన్స్ రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. అధ్యక్ష బరిలో దిగుతున్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌లు నువ్వా-నేనా? అన్నట్లుగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక సినీ పెద్దలు కొందరూ ప్రకాశ్ రాజ్, విష్ణు ప్యానల్లకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ‘మా’ ఎన్నికలపై స్పందించారు. చిత్తూరులోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. చదవండి: ప్రకాశ్‌రాజ్‌పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాస రావు ఈ మేరకు రోజా.. ‘మూవీ ఆర్టిస్ట్‌గా తప్పకుండా ‘మా’ ఎన్నికల్లో పాల్గొంటాను. రెండు ప్యానల్లు తమ మ్యానిఫేస్టోను విడుదల చేశారు. ఎవరి మ్యానివేస్టో ‘మా’ అసోసియేషన్ సభ్యులకు ఉపయోగకరంగా ఉంటుందో ఆ ప్యానల్‌కే ఓటు వేస్తాను’ అని స్పష్టం చేశారు. అలాగే లోకల్, నాన్ లోకల్లో ఎవరికి ఓటు వేస్తారని రిపోర్టర్ ప్రశ్నించగా.. వివాదస్పద ప్రశ్నలు తనని అడగొద్దని తెలిపారు. ఎందుకంటే ఈ సారి ‘మా’ ఎన్నికలుసాధారణ ఎన్నికల కంటే వాడివేడిగా సాగుతున్నాయని, అందుకే దీనిపై తాను ఏం మాట్లాడాలనుకోవడం లేదన్నారు. కానీ ఓ ఆర్టిస్ట్‌గా తాను ఖచ్చితంగా ‘మా’ ఓటును సద్వీనియోగం చేసుకుంటానని, ఎవరి మేనిఫెస్టో ‘మా’ అభివృద్దికి ఉపయోగపడేలా ఉంటుందో ఆ ప్యానల్‌కే ఓటు వేస్తానని రోజా పేర్కొన్నారు. -
ప్రకాశ్‌రాజ్‌పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాస రావు
Kota Srinivasa Rao Comments On Prakash Raj: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రకాశ్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. అదే క్రమంలో పలువురు తమకు నచ్చినవారికి మద్ధతు ప్రకటిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మంచు విష్ణుకు మద్ధతు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్‌కు క్రమశిక్షణ లేదంటూ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. చదవండి: MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ మేనిఫెస్టో ఇదే -
MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ మేనిఫెస్టో ఇదే
Manchu Vishnu Panel Manifesto: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తమ ప్యానల్‌ని గెలిపిస్తే.. ఒక యాప్ క్రియేట్ చెసి దాని సహకారంతో నటులందరికి అవకాశాలు ఇప్పించడంతో పాటు రెండు తెలుగు ప్రభుత్వాలతో మాట్లాడిన అర్హులైన ఆర్టిస్ట్‌లకు సొంత ఇల్లు కట్టిస్తామని ‘ మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు ప్రకటించారు. ఈ మేరకు గురువారం తన ఫ్యానల్‌కు సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేశారు. మంచు విష్ణు ప్యానెల్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఒక యాప్ క్రియేట్ చెసి దాని సహకారంతో అందరికి అవకాశాలు ఇప్పిస్తాం అర్హులైన సభ్యులకు సొంత ఇళ్లు మా సభ్యుల పిల్లల విద్యకు ఆర్థిక చేయూత సొంత డబ్బులతో ‘మా’భవనం ప్రతీ ఒక్కరికి ఫ్రీ హెల్త్ మహిళల రక్షణకి హై పవర్ కమిటీ ‘మా’సభ్యుల పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ కల్యాణలక్ష్మీ తరహాలో రూ.1.16 లక్షలు అర్హులైన సభ్యులకు పెన్షన్లు ‘మా’సభ్యత్వ ఫీజు రూ.75 వేలకు తగ్గింపు ‘మా’సభ్యుల కోసం జాబ్ కమిటీ ఏర్పాటు -
ఆ ప్యానల్‌కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తాడట..అజయ్ భూపతి ట్వీట్ వైరల్
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో రోజుకో వివాదం చోటు చేసుకుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు ప్యానళ్ల సభ్యులు పరస్పరం మాటల దాడి చేసుకుంటున్నారు. మొదట్లో కేవలం సంస్థాగతంగా విమర్శించుకున్న నటులు.. ప్రస్తుతం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ప్రచారం ముమ్మరం చేశారు. విమర్శలు, వాదనలు, ఆరోపణలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ట్వీట్ సెన్సేషన్‌గా మారింది.‘నాకు నచ్చిన ప్యానల్‌కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా..' అని అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడని పేర్కొంటూ ట్విటర్లో పోస్ట్ పెట్టాడు అజయ్. దానికి 'మా' ఎలక్షన్స్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా... (అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)#MAAElections — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 6, 2021 మరో ట్వీట్లో ‘ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి 'మా' లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది.ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత 14th న మన "మహాసముద్రం’ రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి’ అని కామెంట్ చేశాడు. దీంతో ఈ రెండు ట్వీట్లు క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయితే అజయ్ భూపతితో అలాంటి కామెంట్ చేసిన సదరు డైరెక్టర్ ఎవరి వర్గం అనేది స్పష్టత లేదు. ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి 'మా' లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది. ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత 14th న మన "మహాసముద్రం" రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి!!#MahaSamudramonOct14th #MAAElections pic.twitter.com/yJD3GWIZwR — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 6, 2021 -
MAA Elections 2021: ప్రకాశ్ రాజ్‌పై సీవీఎల్ షాకింగ్ కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రకాశ్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. మీడియా సమావేశాలు పెట్టి మరి ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతున్నారు. (చదవండి: అసభ్య వ్యాఖ్యలతో వీడియో.. కరాటే కల్యాణి, నరేశ్‌పై హేమ ఫిర్యాదు) తాజాగా ప్రకాశ్ రాజ్‌పై నటుడు సీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్ష పదవి పోటీ నుంచి ఆయన తప్పుకున్న విషయం తెలిసిందే. నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాక సీవీఎల్ తన మద్దతును మంచు ప్యానెల్ కు తెలిపాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ నీ గెలిపించండి. దేశం అన్నా.. దేవుడు అన్నా.. చులకన భావం వున్న ప్రకాశ్ రాజ్ ను ఒడించండి. నేను.. నేను.. నేను.. తప్పు మరొక విషయం పట్టని ప్రకాశ్ రాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా వుంటే బాగుంటుంది. బహుశా అతను విత్ డ్రా చేసుకుంటాడు అని ఆశిస్తున్నాను’ అంటూ సీవీఎల్ అన్నారు.