
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు అగ్రహీరోలైన చిరంజీవి, పవన్ కల్యాణ్ , బాలకృష్ణతో పాటు నాగార్జున కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం, కొంత మంది ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్టు సమాచారం ఇవ్వడంతో.. మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో మాట్లాడిన మా ఎన్నికల అధికారి… పోలింగ్ సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగించిడు. ఈ సారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ‘మా’ఎన్నికలపై నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆదివారం ఆమె ‘మా’ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించింది. రాజకీయ లబ్ధి కోసం ఆర్టిస్టులను సతాయించడం మానుకోవాలని తెలిపింది. ఏ ప్యానల్ గెలిచినా.. రాజకీయాలను, మా అసోసియేషన్‌ను కలపకూడదని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment