ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌పై రీట్వీట్‌ చేసిన బండ్ల గణేష్‌, నెటిజన్లు ఫిదా | MAA Elections 2021: Bandla Ganesh Tweet To Prakash Raj Tweet Over MAA Campaign | Sakshi
Sakshi News home page

MAA Elections 2021: ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌పై రీట్వీట్‌ చేసిన బండ్ల గణేష్‌

Published Thu, Sep 30 2021 4:18 PM | Last Updated on Thu, Sep 30 2021 7:31 PM

MAA Elections 2021: Bandla Ganesh Tweet To Prakash Raj Tweet Over MAA Campaign - Sakshi

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులంతా నామినేషన్‌లు దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి పోటీ పడుత్ను ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావు తమ ప్యానల్‌ సభ్యులతో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక సినీ నటుడు బండ్ల గణేష్‌ మాత్రం జనరల్‌ సెక్రటరీ పదవికి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా నామినేషన్‌ దాఖలు చేసి ప్రచారం మొదలు పెట్టాడు. అయితే ఎన్నికల ప్రచారాన్ని బండ్ల గణేష్‌ వినూత్నం ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

చదవండి: MAA Elections 2021: ప్రచారంలో భాగంగా ట్వీట్‌ చేసిన ప్రకాశ్‌ రాజ్‌

కాగా ప్రచారంలో భాగంగా ప్రకాశ్‌ రాజ్‌ సోషల్‌ మీడియా వేదికగా తమకే ఓటు వేయాలని కోరిన సంగతి తెలిసిందే. తమ ప్యానల్‌ సభ్యులతో ఉన్న పాంప్లెట్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘#MaaElections2021.. మీ ఓటే మీ గొంతు.. ‘మా’ హితమే మా అభిమతం.. మనస్సాక్షిగా ఓటేద్దాం.. ‘మా’ ఆశయాలను గెలిపిద్దాం..’ అంటూ ట్వీట్‌ చేశాడు. ప్రకాశ్‌ రాజ్‌ చేసిన పోస్ట్‌ చూసిన బండ్ల ఆయన ట్వీట్‌కు రీట్వీట్‌ చేస్తూ ‘జనరల్ సెక్రటరీకి వేసే ఓటును మాత్రం బండ్ల గణేశ్‌కు వేయండి’ అంటూ తనదైన శైలిలో ప్రచారం చేశాడు. దీంతో బండ్ల ట్వీట్‌ వైరల్‌గా మారింది. బండ్ల ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ ‘ప్రచారంలో కూడా తన మార్క్‌ను చూపించాడంటూ’ కామెంట్స్‌ చేస్తున్నారు. 

చదవండి: పవన్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బాబూ మోహన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement