
MAA Elections 2021 Resignation: కలిసి పని చేస్తాం అన్నవాళ్లు ఎందుకు రాజీనామా చేశారని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) మాజీ అధ్యక్షుడు నరేష్ ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన అనంతరం నేడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చదవండి: Maa Elections 2021: పెన్షన్ ఫైల్‌పై తొలి సంతకం చేసిన మంచు విష్ణు
'కలిసి పనిచేస్తాం అన్నవాళ్లు..రాజీనామా ఎందుకు చేశారు? ఓడినా, గెలిచినా కలసి పనిచేస్తాం అన్నారు. మరి ఇప్పుడేమైంది? బయటి నుంచి ప్రశ్నించడం ఏంటి? నరేంద్ర మోదీ గెలిచాడని కాంగ్రెస్ వాళ్లు దేశం వదిలి వెళ్లలేదు కదా. 'మా' అనేది కుటుంబం. గెస్ట్‌గా వచ్చిన వాళ్లే ఇది కుటుంబం కాదు అంటారు. ఫ్యాక్షనిజం మానేద్దాం. కలసి పనిచేద్దాం.
రిజైన్ చేసిన ఈసీ మెంబర్స్ గురించి కొత్త ప్యానల్ చూసుకుంటుంది. విష్ణుని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బాగోదు. ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. ఎమోషన్స్.. ప్రస్టేషన్ వద్దు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. కానీ గెలిచాక కూడా ఆరోపణలు చేయడం ఏంటి' అంటూ ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులపై నరేష్ అసహనం వ్యక్తం చేశారు.
చదవండి: రోజుకో ట్విస్ట్.. మంచు విష్ణు యాక్షన్ ప్లాన్ ఏంటి?
Comments
Please login to add a commentAdd a comment