RGV On MAA Elections: Ram Goapl Varma Satirical Comments On MAA Elections - Sakshi
Sakshi News home page

RGV On MAA Elections: 'మా' ఎన్నికలపై ఆర్జీవీ సెటైర్లు..

Oct 17 2021 12:47 PM | Updated on Oct 17 2021 2:20 PM

Ram Goapl Varma Satirical Comments On Maa Elections - Sakshi

RGV Satirical Comments On MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ఈసారి సినీ ఇండస్ట్రీనే కాదు..తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపాయి. ‘మేమంతా ఒకే కుటుంబం. మాది సినిమా కుటుంబం. అందరం కలిసే ఉంటాం’ అంటూనే ప్రత్యక్ష ఆరోపణలకు తెరదీశారు. ఎన్నికలు పూర్తయినా ఇంకా మాటల దాడులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. చదవండి:  వైరల్‌: షో మధ్యలో బాలయ్యకు ఫోన్‌ చేసిన రోజా

సినీ ప్రముఖులు సైతం మా ఎన్నికలు జరిగిన తీరుపై బహిరంగంగానే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మా ఎన్నికలపై తనదైన స్టైల్‌లో స్పందించారు. మా మొత్తం ఎపిసోడ్‌ సర్కస్‌లా ఉందని, సిని'మా' వాళ్లు సర్కస్‌ లాంటి వాళ్లని ప్రజలకి నిరూపించారంటూ సెటైరికల్‌ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

చదవండి: శివబాలాజీ భార్యపై మోహన్‌ బాబు సీరియస్‌
చిరు చెల్లెలి బర్త్‌డే : స్పెషల్‌ విషెస్‌ తెలిపిన 'భోళా శంకర్‌'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement