bandla ganesh
-
బండ్ల గణేశ్ సినిమాకు ఓకే చెప్పా.. కానీ మోసం చేశాడు: టాలీవుడ్ కమెడియన్
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తిరుపతి ప్రకాశ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్ స్టార్ హీరోలైనా నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్, బాలయ్య, మోహన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్స్ అందరితో కలిసి పనిచేశారు. సీనియర్ ఎన్టీఆర్‌తో తప్ప దాదాపు అందరితో సినిమాలు చేశానని వెల్లడించారు. ప్రస్తుతం సీరియల్స్‌లో చేస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ కెరీర్లో తనకెదురైన అనుభవాలను పంచుకున్నారు.తాను సినిమాల్లో నటించే రోజుల్లో బండ్ల గణేశ్, తాను ప్రాణ స్నేహితులమని ప్రకాశ్ తెలిపారు. ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించామని పేర్కొన్నారు. అయితే బండ్ల గణేశ్ నిర్మాత అయ్యాక ఆయన సినిమాల్లో నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓ సినిమాకు డేట్స్ తీసుకుని నాకు అబద్ధం చెప్పారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.తిరుపతి ప్రకాశ్ మాట్లాడుతూ..'బండ్లగణేశ్ చేసిన ఒక్క సినిమాలో కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఒక సినిమాకు డేట్స్ తీసుకున్నాడు. దాదాపు 60 రోజులు షూట్ ఉంటుందని చెప్పాడు. రోజుకు 15 వేల పారితోషికం ఖరారు చేసుకున్నా. దీంతో వేరే సినిమాలకు నో చెప్పా. వినాయకచవితి పండగ మరుసటి రోజే కేరళలోని పొల్లాచ్చికి వెళ్లాలి. కానీ షూట్‌కు బయలుదేరాల్సిన ముందురోజే నాకు ఫోన్ కాల్ వచ్చింది. భారీ వర్షాలతో షూట్ క్యాన్సిల్ చేశామని ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాడు. దీంతో షాక్ తిన్నా. మూడు సినిమాలు వదిలేశా. మూడు నెలలు ఖాళీగా ఎలా ఉండాలని ఆలోచించా. సరిగ్గా పది రోజుల తర్వాత శ్రీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. వెంటనే రాజమండ్రికి వెళ్లా. అక్కడ రోలర్ రవి నన్ను కలిశాడు. ఏం ప్రకాశ్ అన్న మంచి సినిమా వదిలేశావ్ అన్నాడు. ఏ సినిమా అని అడిగా. కల్యాణ్ బాబు మూవీ అన్నాడు. వర్షం వల్ల షూట్ క్యాన్సిల్ అయిందని చెప్పారని చెప్పా. కానీ నాకంటే తక్కువకే ఎవరో దొరికారని నన్ను తీసేసినట్లు తెలిసింది. అప్పుడు నాకు బండ్ల గణేశ్‌పై కోపం వచ్చింది. ఆ తర్వాత మా నాన్న చనిపోయారని ఫోన్ చేశాడు. అవును అని చెప్పి వెంటనే పెట్టేశా' అని అన్నారు. -
సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ ప్రముఖుల్లో బండ్ల గణేశ్ ఒకరు. వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరుగుతున్న ఘటనలపై తనదైన శైలీలో స్పందిస్తుంటాడు. ముఖ్యంగా రాజకీయాలపై ఆయన చేసే ట్వీట్స్ వైరల్ అవుతుంటాయి. 2018 తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ టికెట్ దక్కలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.(చదవండి: యానిమేటెడ్ సిరీస్ ‘డిస్పెకబుల్ మి 4’ రివ్యూ)2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ పొలిటికల్ ట్వీట్స్ చేయడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగుడుతూ చాలా ట్వీట్స్ చేశాడు. ఇక నిన్న (నవంబర్ 8) సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే టాలీవుడ్‌కి చెందిన ప్రముఖుల్లో చిరంజీవితో పాటు ఒకరిద్దరు మాత్రమే రేవంత్‌కి విష్ చేస్తూ ట్వీట్స్ పెట్టారు. పలువురు స్టార్ హీరోలతో పాటు బడా నిర్మాతలు సైతం శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఈ విషయంపై బండ్ల గణేశ్ స్పందిస్తూ సెటైరికల్ ట్వీట్ చేశాడు.‘గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను’ అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బండ్ల గణేశ్ ట్వీట్‌పై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను”.🙏 @revanth_anumula anna @TelanganaCMO— BANDLA GANESH. (@ganeshbandla) November 9, 2024 -
మా జీవితాలను మార్చింది: హరీష్ శంకర్
‘‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ రోజుల్లో ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. అప్పుడు మిస్ అయిన డిజిటల్ హంగామాని మళ్లీ క్రియేట్ చేసి ఇస్తున్న మా అన్న గణేశ్‌కి, సత్యనారాయణకి థ్యాంక్స్. ‘గబ్బర్ సింగ్’ మా జీవితాలను మార్చేసిన సినిమా’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ చిత్రం 2012 మే 11న విడుదలైంది. ఈ నెల 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శనివారం ప్రెస్ మీట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ – ‘‘గబ్బర్ సింగ్’ డబ్బింగ్ సమయంలోనే ఈ మూవీ పక్కా బ్లాక్‌బస్టర్ అన్నారు పవన్ కల్యాణ్‌గారు. నా అభిమానులు కోరుకునేది ఇవ్వబోతున్నావ్’’ అన్నారు. ‘‘నన్ను నేను నమ్మలేని పరిస్థితిలో పవన్ కల్యాణ్‌గారు నమ్మి, నన్ను నిర్మాతగా నిలబెట్టారు. నేను, హరీష్, దేవిశ్రీ ప్రసాద్... అందరూ ప్రేమించి ఈ సినిమా చేశాం. ఏడేళ్లుగా నేను సినిమా తీయకపోవడం బాధగా ఉంది... మళ్లీ సినిమాలు తీస్తా’’ అన్నారు బండ్ల గణేశ్. డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, నటుడు రమేశ్‌రెడ్డి మాట్లాడారు. -
ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్..!
టాలీవుడ్ నిర్మాత బండ్లగణేశ్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Tollywood producer Bandla Ganesh has been admitted to Apollo Hospital and is currently undergoing treatment for chest pain! pic.twitter.com/dFH5wBTMcs— Madhu (@offlinemadhu) June 3, 2024 -
నిర్మాత బండ్ల గణేష్‌పై కేసు నమోదు
ఫిలింనగర్: తన ఇంట్లో అద్దెకు ఉంటున్న సినీ నిర్మాత బండ్ల గణేష్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ ఇచ్చిన పిర్యాదు మేరకు సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలివీ... నౌహిరా షేక్ ఫిలింనగర్‌లోని తన ఇంటిని నిర్మాత బండ్ల గణేష్‌కు నెలకు రూ. లక్ష అద్దె చొప్పున కిరాయికి ఇచ్చింది.అయితే గత కొంతకాలంగా గణేష్ అద్దె ఇవ్వకపోగా గుండాలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి అనుమతించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. అతను ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తనకు సమాచారం అందిందని, గుండాల సహాయంతో, రాజకీయ నాయకుల అండతో ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. నౌహీరా ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు బండ్ల గణేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బండ్ల గణేష్ కొడుకు కొత్త వివాదం..
-
గుడ్లు అమ్ముకునే బండ్లపై గుదిబండ..
-
చెక్ బౌన్స్ కేసులో గణేశ్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష
-
బండ్లగణేశ్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో జైలు శిక్ష!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు బండ్లగణేశ్‌కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది. అంతే కాకుండా శిక్షతో పాటు బండ్లగణేశ్‌కు రూ.95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలో ఆరునెలల జైలు శిక్ష గతంలో 2017లో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. కాగా.. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. -
కల్వకుంట్ల కవితపై బండ్ల గణేష్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?.. పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశావంటూ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మండిపడ్డారు. ఎప్పుడైనా బీసీల గురించి మీరు మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్.. ఆపార్టీని విమర్శించొద్దు. సీఎం ప్రజల్లోకి వెళితే మీకు ఇష్టం ఉండదు. గేటు బయటే ఆపేసి బతికున్న గద్దర్‌ను చంపేశారు. ఆయన పేరుమీద కాంగ్రెస్ అవార్డులు ఇస్తుంది. జానారెడ్డి తప్పుకుని కుమారుడికి అవకాశం ఇచ్చారు. మంత్రులను డమ్మీలను చేసింది మీరు కాదా ?. లిక్కర్ స్కాంలో అక్రమ సంపాదన చేయలేదా ?’’ అని బండ్ల గణేష్ ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాంతో రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసింది మీరు కాదా ?. బీసీల కోసం మీ త్యాగం అవసరం లేదు. ఎంపీగా ఓడిపోతే ఏడ్చి ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. మీ పార్టీ ఆఫీసుకు స్థలం ఇస్తే కొండా లక్ష్మణ్ బాపూజీని మీరు పట్టించుకున్నారా ? సీఎం కావాలని మీరు.. కేటీఆర్ ఆశపడ్డారు. అది సాధ్యం కాలేదని.. ఇప్పుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ముందు లిక్కర్ స్కాం నుంచి బయటపడండి. రెస్ట్ తీసుకోండి...ఏం తప్పు చేశారో తెలుసుకోండి. ప్రెస్ మీట్లు బంద్ చేయండి.. అసహ్యించుకుంటున్నారు’’ అంటూ బండ్ల గణేష్ విమర్శించారు. జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?... పదేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశావు కవితమ్మ..? -- కాంగ్రెస్ నేత సినీనిర్మాత, బండ్ల గణేష్ Did you remember now to put up a statue of Jyoti Rao Phule? Kavitha, what did you do after being in the government for ten years?… pic.twitter.com/tMaGTOeYbi — Congress for Telangana (@Congress4TS) February 3, 2024 -
బర్రె కరిసిందా ?
-
ఒక్కరోజే వంద దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మేరకు పార్టీకి శుక్రవారం ఒక్కరోజే వంద దరఖాస్తులు అందాయి. శుక్రవారం గాం«దీభవన్‌కు వచ్చిన పలువురు నేతలు తమ దరఖాస్తులను అందజేశారు. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ దర ఖాస్తులు రాగా, హైదరాబాద్‌లో తక్కువగా వచ్చా యి. దరఖాస్తు చేసుకున్న వారిలో సినీ నిర్మాత బండ్ల గణేశ్ (మల్కాజిగిరి), మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ (నాగర్‌కర్నూల్), ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, విద్యా స్రవంతి (సికింద్రాబాద్) పెరిక శ్యామ్ (పెద్దపల్లి) తదితరులున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌తో పాటు జనరల్ స్థానమైన మల్కాజిగిరి కోసం 4 దరఖాస్తులు అందజేశారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఇప్పటివరకు 141 దరఖాస్తులు రాగా, శనివారం సాయంత్రంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. ఖమ్మం బరిలో గడల, వంకాయలపాటి హాట్‌సీట్‌గా మారిన ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టికెట్ కోసం శుక్రవారం ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్‌లు దరఖాస్తు చేసు కున్నారు. గడల సికింద్రాబాద్ స్థానానికి కూడా దర ఖాస్తు చేశారు. ప్రభుత్వ అధికారిగా ఉండి, అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లోకెక్కిన గడల.. అప్పట్లో కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఇటీవలే రేవంత్ ప్రభుత్వం గడలను ఆ పోస్టు నుంచి బదిలీ చేసింది. ప్రస్తుతం లాంగ్‌లీవ్‌లో ఉన్న ఆయన ఉన్నట్టుండి గాం«దీభవన్‌లో దరఖాస్తులివ్వడం గమనార్హం. మెజార్టీ స్థానాలు గెలుస్తాం: బండ్ల గణేశ్ మల్కాజిగిరి స్థానం నుంచి పోటీకి అవకాశం కల్పించాలని కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావుకు దరఖాస్తు ఇచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేశ్ ..విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్నారు. -
ఎంపీ టికెట్ల కోసం బండ్ల, గడల దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తుల్లో ఇవాళ ఆసక్తికరమైన పరిణామాలు కనిపించాయి. నటుడు కమ్ సినీ నిర్మాత, కాంగ్రెస్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఎంపీ సీటు కోసం దరఖాస్తు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. రేవంత్ రెడ్డి ఖాళీ చేసిన స్థానం కోసమే ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం కోసం సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక.. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ ఏకంగా నాలుగు సీట్లకు నాలుగు దరఖాస్తులు సమర్పించారు. మరోవైపు నాగర్‌కర్నూల్ టికెట్ కోసం మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమార్తె చంద్రప్రియ కూడా అప్లికేషన్ సమర్పించారు. కేసీఆర్ కాళ్లు మొక్కి.. ఇదిలా ఉంటే.. గాంధీభవన్‌లో ఇవాళ సమర్పించిన దరఖాస్తుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసిన అంశం.. గడల శ్రీనివాసరావు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే రాజకీయాంశాలతో చర్చనీయాంశంగా మారారాయన. సీఎంగా ఉన్న కేసీఆర్ కాళ్లు కూడా మొక్కుతూ వార్తల్లోకి ఎక్కారు కూడా. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డారాయన. ఇప్పుడు.. ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకుని మరోసారి ఆయన హాట్ టాపిక్‌గా మారారు. తన సన్నిహితుల ద్వారా గాంధీ భవన్ లో దరఖాస్తు చేయించినట్లు తెలుస్తోంది. తద్వారా ఎన్నికల్లో పోటీ చేయకుండానే.. జంప్ జిలానీగా గడల మారినట్లు చర్చ నడుస్తోంది. -
బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..
హైదరాబాద్: తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భర్తకు ఫోన్ చేసిన అర నిమిషంలోనే ఓ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... భద్రాద్రి జిల్లాకు చెందిన బానోతు చందన (25)రమణ దంపతులు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా చందన భీమా జ్యువెలర్స్‌లో సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తుంది. సోమవారం ఉదయం ఇద్దరి మధ్య స్వల్ప గొడవ జరిగింది. రమణ డ్యూటీకి వెళ్లిగా మధ్యాహ్నం చందన ఇంటి నుంచే ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ కట్ చేసింది. రమణ వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇచ్చి డ్యూటీ నుంచి బయలుదేరాడు. యజమాని పైకి వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తెరుచుకోకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లిచూడగా అప్పటికే ఆమె విగతజీవిగా కనిపించింది. మృతురాలి తండ్రి కోటేశ్వరరావు ఇచి్చన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
TS: బండ్ల గణేష్‌కు కీలక బాధ్యతలు!
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన సచివాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ పూలమొక్కను బహుమతిగా అందించారు. ఈ ఫొటోలు ఎక్స్‌లో వైరల్ అవుతుండగా.. ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. బండ్ల గణేష్ మొదటి నుంచి కాంగ్రెస్ హార్డ్‌కోర్ అభిమాని. ఎన్నికల్లో ప్రత్యక్షంగా మద్ధతు ఇస్తూ వస్తున్నారు కూడా. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పి మరీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈసారి ఎన్నికలకు ముందు.. రెండు రోజుల ముందే ఎల్బీ స్టేడియంకు వెళ్లి పడుకుంటానంటూ ప్రకటించడంతో.. మరోసారి ట్రోలింగ్ మెటీరియల్ అవుతారేమోనని కొందరు భావించారు. కానీ, ఈసారి బండ్ల గణేష్ జోస్యం తప్పలేదు. తెలంగాణలో బీఆర్ఎస్కు చెక్ పెట్టి.. కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌తో పదవులేం ఆశించకుండా చిత్తశుద్ధితో ఒక కార్యకర్తగా పని చేస్తానని బండ్ల గణేష్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విధేయతకు మెచ్చి త్వరలో కీలక బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం ఊపందుకుంది. అదేంటంటే.. సంక్రాంతిలోపు తెలంగాణలో ఖాళీలుగా ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. బండ్ల గణేష్‌కు ఏదైనా కార్పొరేషన్ అప్పజెప్పొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కార్పొరేషన్లలో వీలు కాకుంటే.. సినీ రంగానికి-తెలంగాణ ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా బండ్ల గణేష్‌కు సరికొత్త బాధ్యతలు అప్పగించవచ్చనే చర్చా నడుస్తోంది. ఇవేవీ కాకుంటే.. పార్టీ తరఫున అయినా ఆయనకు కీలక పదవి కచ్చితంగా దక్కవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే బండ్ల గణేష్ మాత్రం పదవులక్కర్లేదనని.. పార్టీ కోసం పని చేస్తానంటున్నారు. మరి బండ్ల గణేష్‌కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందా?.. లేదా.. స్పష్టత రావాలంటే.. ఇంకా కొన్నిరోజులు ఆగాల్సిందే. -
బండ్ల గణేష్ డబ్బులు ఎగ్గొట్టాడు.. ఒక మనిషి చెప్పడంతో..: డైరెక్టర్
టాలీవుడ్ హీరో నితిన్ 32వ సినిమా 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' తాజాగా విడుదలైంది. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. బండ్ల గణేష్‌తో ఆయనకు ఉన్న ఆర్థిక లావాదేవిల గొడవను తెరపైకి తెచ్చాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 2015లో 'టెంపర్' చిత్రం విడుదలైంది. జూ ఎన్టీఆర్, కాజల్ జోడీగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ చిత్రానికి కథను డైరెక్టర్ వక్కంతం వంశీ అందిస్తే.. బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కించాడు. కానీ ఆ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని వక్కంతం వంశీ అప్పట్లో కోర్టుకెక్కాడు. ఆ సమయంలో ఇదొక సెన్సేషన్ వార్తగా నిలిచింది. తాజాగా ఇదే విషయంపై వంశీ ఇలా మాట్లాడాడు. 'టెంపర్ సినిమా విడుదల సమయంలో ఒక తేది వేసి చెక్కు ఇచ్చాడు. తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేస్తే అది కాస్త బౌన్స్ అయింది. అప్పటికే సినిమా కూడా విడుదల కావడంతో నేను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నేను ఎవర్ని కలవాలి..? ఏం చేయాలో కూడా అర్ధం కాలేదు. నాకు డబ్బు ఇవ్వకూడదనే అతనలా చేశాడని మాత్రం అర్థం అయింది. ఆ సమయంలో వాడికి (బండ్ల గణేష్) ఏ ఇబ్బంది ఉందో నాకు తెలియదు... వాడిని కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఆ సమయంలో నేను కోర్టుక వెళ్లక తప్పలేదు. ఈ విషయంలో పలుమార్లు కోర్టు చుట్టూ బాగా తిరిగాను. కొన్ని రోజుల తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్దమనిషి వద్దకు నేను వెళ్లాను. ఆయన చెప్పడం వల్లనే వాడు డబ్బులు సెటిల్ చేశాడు. ఆ తర్వాత నుంచి నాతో వాడు బాగానే ఉన్నాడు. వాడిపై నాకు కోపం ఏం లేదు. మోసం చేశాడనే బాధ ఉంది. కొన్ని రోజుల తర్వాత టెంపర్ హిందీ రైట్స్ అమ్మేందుకు వాడు,నేను ఇద్దరం ఒకే ఫైట్‌లో వెళ్లాం. ఇలా బండ్ల గణేష్ మాదిరి డబ్బు విషయంలో చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. కొందరు ఇప్పటికి కూడా ఇవ్వలేదు.' అని అన్నాడు. గతంలో కోర్టు ఏం చెప్పింది బండ్ల గణేష్‌పై వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఒక తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా బండ్ల గణేష్‌కు విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను అప్పట్లో న్యాయస్థానం మంజూరు చేసింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి కూర్చోని ఈ డబ్బులు విషయాన్ని సెటిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. -
అప్పుడు బ్లేడు..ఇప్పుడు దుప్పటి..‘భజన’ గణేష్
బండ్ల గణేశ్ గురించి తెలుగు ప్రజలకు తెలిసిందే. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి.. తక్కువ సమయంలోనే అగ్ర నిర్మాతగా ఎదిగాడు. కానీ తన నోటి దురుసుతో తన కెరీర్‌ని తానే నాశనం చేసుకున్నాడు. ప్రస్తుతం అతనితో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు. దీంతో చిత్ర పరిశ్రమను పక్కన పెటి.. రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు. అయితే అక్కడ కూడా రోజుకో పార్టీ.. పూటకో మాట మారుస్తూ.. బండ్ల గణేశ్ కమెడియన్‌గానే మిగిలిపోయాడు. మొన్నటికి మొన్న టీడీపీకి జై కొడుతూ.. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన బండ్లన్న.. ఇప్పుడు కాంగ్రెస్ భజన చేస్తున్నాడు. తన బ్లడ్‌లోనే కాంగ్రెస్ పార్టీ ఉందని.. గాంధీభవన్ తన పుట్టిల్లు అంటున్నాడు. భనజ గణేశ్.. భజన చేయడంలో గణేశ్‌ని మించిన వాడు లేడు. స్టేజ్‌పై మైక్ దొరికితే చాలు.. ఊగిపోతుంటాడు. అయితే ఆ భజన అనేది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో చేస్తే బాగుండేది. కానీ బండ్లన్న మాత్రం పూటకో పార్టీని, రోజుకో నాయకుడిని పొగిడేస్తుంటాడు. ఒకసారి పవన్ కల్యాణ్ కోసం ప్రాణాలు ఇస్తా అంటాడు.. మరోసారి చంద్రబాబు కోసం జైలుకు వెళ్తా అంటాడు. ఇప్పుడేమో తుదిశ్వాస వరకు కాంగ్రెస్‌తోనే ఉంటానంటున్నాడు. అంతేకాదు తెలంగాణలో కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని జోస్యం చెబుతున్నాడు. అప్పుడు బ్లేడు..ఇప్పుడు దుప్పటి బండ్ల గణేశ్ రాజకీయ ఎంట్రీ గత అంసెబ్లీ ఎన్నికల్లోనే జరిగింది. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. పార్టీ కండువా కప్పుకోవడమే ఆలస్యం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, లేకపోతే తాను 7 O’clock బ్లేడుతో గొంతు కోసుకుంటానని చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. చివరకు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురవ్వడంతో సైలెంట్ అయ్యాడు. అంతేకాదు తనకు రాజకీయాలు పడవని.. ఇక నుంచి పాలిటిక్స్‌కు దూరంగా ఉంటానని ప్రకటించాడు. కానీ మన బండ్లన్నకు మాటలు మార్చడం ఎంతసేపు? ఎన్నికల ప్రకటన రాగానే.. మళ్లీ రాజకీయల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. తను పక్కా కాంగ్రెస్‌వాదినని.. గాంధీ భవన్ తన పుట్టినిల్లు అంటున్నాడు. అంతేకాదు ఈ సారి తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెబుతున్నాడు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని.. 7వ తేదినే తాను ఎల్బీ స్టేడియంకి వెళ్లి దుప్పటి కప్పుకొని పడుకుంటానని అంటున్నాడు. మరి మీ దేవుడు పవన్ కల్యాణ్ పార్టీ కూడా పోటీ చేస్తుంది కదా? మద్దతు ఇవ్వరా అంటే.. అస్సలు ఇవ్వనని చెబుతున్నాడు. పవన్ అభిమానినే అయినా.. ఆయన పార్టీకి మాత్రం తాను మద్దతు ఇచ్చేదే లేదు అని తెగేసి చెబుతున్నాడు. బండ్ల గణేశ్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి చూసి.. బండ్ల.. ఓ పొలిటికల్ కమెడియన్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
స్టేజీపై బాగా నటించావ్.. శభాష్ బండ్ల గణేష్!
తెలుగు ఇండస్ట్రీలో నవ్వు పుట్టించగల ఎక్స్ట్రీమ్ కేరక్టర్లు బోలెడు మంది ఉన్నారు.. కానీ వారందరిలో బండ్ల గణేష్ చాలా స్పెషల్. సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. రంగం ఏదైనా సరే వివాదాల్ని ఇలా రేపడం, అలా వాటిని వదిలేయడం బండ్ల గణేశ్‌కు బట్టర్‌తో పెట్టిన విద్య. ఒక్కోసారి బండ్ల వ్యాఖ్యలు విన్నవారు చిన్నప్పుడే చిప్ కొట్టేసిందా, లేక చిప్ లేనేలేదా అంటూ కామెంట్లు చేస్తుంటారు. డేగల బాబ్జీకి ఇవన్నీ చాలా కామన్ ఎప్పుడైనా వేదిక ఎక్కినప్పుడు ఆయన చేసే ప్రసంగాలు చూస్తే, వింటే ఇండస్ట్రీ మీదే జాలేస్తుంది. ఎందుకంటే.. ఎలా భరించారో ఇలాంటి కమెడియన్ని అని. అంతెందుకు..? తను ఎంత సీరియస్‌గా మాట్లాడినా కూడా మీడియా ఓ జోకర్‌గానే పరిగణిస్తుంది. ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు తనంతట తను నెత్తిమాశిన ట్వీట్లు వేసి, నెటిజన్లతో తిట్లు తింటుంటాడు. పాఫం, కొన్నాళ్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కూడా ఉద్దరించినట్టున్నాడు. పార్టీ కండువా కప్పుకోవడమే ఆలస్యం.. తమ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, లేకపోతే తాను 7 O’clock బ్లేడుతో గొంతు కోసుకుంటానని చెప్పి టాక్ ఆఫ్ ది టౌన్‌గా అప్పుడు నిలిచాడు. తీరా ఎన్నికల్లో ఓడిపోయాక, ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు బండ్ల. అప్పట్నుంచే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నానని బండ్ల గణేష్ ట్విటర్(ఎక్స్) మాధ్యమంగా అప్పట్లో ప్రకటించాడు. తర్వాత తనకు కేవలం సినిమాల మాత్రమే తెలుసని వాటి మీదనే ఇకనుంచి దృష్టి పెడుతానని చెప్పాడు. కానీ మనోడి గురించి తెలిసిందే కదా పెద్ద కమెడియన్ పీస్ అని.. కనీసం ఏ కుర్ర హీరో కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో చేసేది ఏమీ లేక స్వీయ నటనతో 'డేగల బాబ్జీ' అనే ఒక తలమాశిన సినిమా తీసి ప్రేక్షకులపైన పగతీర్చుకున్నాడు. అలా సినిమాతో పాటు రాజకీయం కూడా ఫుల్స్టాప్ పడింది. భజనకు కేరాఫ్ బండ్ల భజన చేయడంలో బండ్లను మించినవాడు లేడు. స్టైజ్‌పై మైకు దొరికితే చాలు.. ఊగిపోతుంటాడు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలో టీడీపీ ఏర్పాటు చేసిన ఒక సభలో 7 O’clock బ్లేడు లాంటి డైలాగ్‌లతో పాటు ఆస్కార్‌ను మించేలా నటించాడు. లేదు.. లేదు.. చంద్రబాబు కోసం గుక్కపెట్టి ఏడ్చాడు. అసలే బండ్ల పెద్ద కమెడియన్ అని తెలిసిందే.. ఆయనకు ఏడుపు ఎలా కనెక్ట్ అవుతుంది. అందుకే బండ్ల ఏడుస్తున్నా అక్కడ కూర్చొని ఉన్న వారందరీ ఫేసుల్లో నవ్వులు కనిపించాయి. తాజాగా ఆయన చంద్రబాబు కోసం చచ్చిపోతా.. ఆయనకు కమీషన్‌గా రక్తాన్ని ఇస్తా అంటూ తన కేరక్టర్‌కు ఏ మాత్రం సెట్ కాని వ్యాఖ్యలు చేశాడు.. గతంలో 7 O’clock బ్లేడుతో కోసుకుంటా అన్నాడు. ఒక్కోసారి పవన్ కల్యాణ్ కోసం ప్రాణాలు ఇస్తా అంటాడు. జూ ఎన్టీఆర్ కోసం ప్రాణాలకు తెగిస్తా అంటాడు. ఇన్నన్నీ సార్లు ఈ వ్యాఖ్యలు ఆయన ఎందుకు చేస్తాడంటే వీరందరి నుంచి ఏదో ఒక లబ్ధి పొందేందుకే అని తెలిసిందే. ఈ భజన కేరక్టర్ గురించి తెలిసే జూ. ఎన్టీఆర్ ఎప్పుడో పక్కన పెట్టేశాడు. ఇక తనకు మిగిలింది పవన్,బాబు అండ్ కో బ్యాచ్ మాత్రమే.. వారిని ఇలా ప్రసన్నం చేసుకునేందుకే ఇలా దొంగ జపం చేస్తున్నాడు. బండ్లన్న కోళ్ల వ్యాపారం కోసం గతంలో చంద్రన్న అండగా నిలబడ్డాడట. ఆ రెస్పాన్సిబిలిటీతోనే బండ్ల ఇప్పుడు ప్రాణాలైనా ఇస్తానంటూ చంద్రబాబు గ్రాట్యుటీ చూపిస్తున్నాడని టాక్. రేపు ఎవరన్నా ఒక మంచి ఆఫర్ ఇస్తే ' నవ్వుతానే ఊరుకోండి సార్ స్టేజీపైన పూనకంతో ఎన్నో అంటుంటాం ఛీ.. ఛీ చంద్రబాబు కోసం నేను ప్రాణాలు ఇవ్వడం ఏంటి అనేస్తాడు.. అలాంటి కల్లర్స్ ఉన్న వూసరవెల్లి అని తెలిసిందే. తారక్, రవితేజ, పూరి ఆ లిస్ట్‌లో ఎందరో తన జీవితంలో ఎప్పుడూ రెండు నాల్కల ధోరణి చూపించే బండ్ల గణేశ్.. గతంలో తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నాయకులను తిట్టినతిట్టూ లేకుండా వాగాడు.. ఎప్పుడైతే తన రాజకీయం బెడిసికొట్టిందో వెంటనే వారందరినీ ఎడాపెడా పొగిడేశాడు. సినిమా ఇండస్ట్రీలో రవితేజ, పూరి జగన్నాథ్‌ను మోసం చేశానని చెప్పుకొచ్చాడు. టెంపర్ సినిమా సమయంలో తారక్‌తో రెమ్యునరేషన్ గొడవ కూడా అప్పట్లో వైరల్ అయింది. తర్వాత అన్నదమ్ముల మధ్య ఇలాంటివి సహజం అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తారక్ 'దేవర' సినిమా ప్రకటించిన తర్వాత ఆ టైటిల్ తనదని ఒక ట్వీట్ పడేశాడు. దీంతో తారక్ ఫ్యాన్స్ బండ్లపై పెద్ద వార్‌కు దిగారు. ఆ దెబ్బకు తారక్ నాకు కూడా దేవరే అంటూ వారిని బతిమాలి ఆ గొడవ నుంచి బయటపడ్డాడు. ఇలా ఆయన జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బండ్ల గణేశ్ గ్యారేజీలోకి చంద్రబాబు వచ్చి ఆగాడు అంతే తేడా..! -
బండ్ల బాజాతో మూడు గుళికలు.. ఎంత ఊదినా అంతే!
తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ను ఏదో చేసి 25 సంవత్సరాలైందని గచ్చిబౌలి స్టేడియంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో మామూలు సభలకే జనాలు రావడం లేదు. అలాంటిది ఈ సభకు జనాలను తరలించడంలో మ్యూజికల్ నైట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి మొత్తానికి కాస్త జనాలను రప్పించారు నిర్వాహకులు. ఇదే సభలో ఏతా వాతా లేని టాలీవుడ్ నిర్మాత అయిన బండ్ల గణేష్ చంద్రబాబు గురించి బాకా ఊదుతూ ఓ రెండు, మూడు బ్రాండింగ్ గుళికలను వదిలారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. వాటిలో మొదట ప్రముఖంగా చెప్పుకోదగినది బండ్లగణేష్ చేసిన విచిత్ర ప్రతిపాదన.. అదే ఖైదీ మార్పిడి... అదేంటని విస్తుపోయారా? మీరే కాదు సభలో ఉన్న వారితో పాటు ఈ విషయం విన్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబుకు బదులు తనను జైల్లో పెట్టమని అభ్యర్ధించాడు. చంద్రబాబు వీరాభిమానిగా చెప్పుకుని బాకాలూదే బండ్ల గణేశుడు. జైల్లో పెట్టడం సరే అభిమానంతో అన్నాడని అనుకోవచ్చు. కానీ ఆ తరువాత అన్న మాటే విన్న వారందరూ విస్తుపోయారు. తనను జైల్లో పెట్టినా నా భార్య ఏమీ అనుకోదు అని గొప్ప గుళిక వదిలారు బండ్ల గణేశ్. ఇక బండ్ల గణేష్ వదిలిన రెండో గుళిక ఏంటంటే.. ఊర్లలో ఉన్న వాళ్లందరూ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబులకు వెళ్తూ ఉంటే మన బండ్లకు కడుపు తరుక్కుపోయిందట. ఎందుకంటే చంద్రబాబు అనే వాడు లేకపోతే సాఫ్ట్వేర్ అనేది లేకుండా లక్షలాది మందికి ఇప్పటికీ ఉద్యోగాలు వచ్చేవి కాదట. అసలు హైదరాబాదే ఉండేది కాదంట. అంతేకాదు వీరందరికీ చంద్రబాబు ఆదర్శప్రాయుడని బాగా బజాయించాడు బాకాలూదే బండ్లగణేశుడు. చిట్టచివరి బండ్ల గుళిక ఏంటంటే... మహానటి సినిమా మీకందరికీ గుర్తు ఉండే వుంటుంది. ఆ సినిమా మొదట్లో దర్శకుడు సావిత్రి వేషధారికి ఓ సన్నివేశం వివరిస్తూ ఈ సీన్లో ఓ కంట మాత్రం కన్నీరు రావాలి అని చెబితే మహానటి సావిత్రి ఆ సన్నివేశంలో ఓ కంట మాత్రం కన్నీరు కార్చి యూనిట్ సభ్యులనందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే విధంగా చంద్రబాబు సభలో బండ్ల గణేష్ ఆవేదనతో గొంతు వణుకుతూ తన ఏడుపును వినిపించాడు కాని కనిపించలేదు. అదేమిటి ఏడుపు కనిపించలేదు అనుకుంటున్నారా? మీరే చెప్పండి ఎదుటి వ్యక్తి ఏడుస్తున్నాడు అని మనం ఎప్పుడు అనుకుంటాం? వచ్చే కన్నీళ్లని బట్టి అని కచ్చితంగా ఎవరైనా చెప్తారు. కాని మన నటనిర్మాత అయిన బండ్ల గణేష్ తన ఏడుపును గొంతుతోనే వినిపించి కంట చుక్క కన్నీరు కూడా కనిపించకుండా చేసిన ఆయన నిజంగా మహానటుడు. ఆఖరుగా ఒక్క మాట బండ్ల బాకా ఊదినా.. గచ్చిబౌలిలో గోల రేగినా.. అవినీతి కేసులో ఇరుక్కున్న చంద్రబాబు మీద జనాలకి వచ్చేది సింపతీకాదు, సీ(చి)రాకు మాత్రమే. -
కాంగ్రెస్ కీలక నిర్ణయం!.. అక్కడి నుంచి బరిలో బండ్ల గణేష్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పార్టీలో భారీ చేరికలు నెలకొన్ని నేపథ్యంలో పార్టీ గెలుపుపై హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని బరిలో దింపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు కీలక స్థానం ఇచ్చే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. సినీ నిర్మాత బండ్ల గణేశ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా, కూకట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ కోసం సినీ నిర్మాత బండ్ల గణేశ్ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక టికెట్‌ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆయన పేరును కూకట్‌పల్లికి పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు అధిష్ఠానం ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో, కూకట్‌పల్లిలో ఆయన బరిలో నిలుస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం విషయంలో పొంగులేటి, తుమ్మల మధ్య చర్యలు కొనసాగుతున్నట్టు సమాచారం. నిన్న రాత్రి జానారెడ్డి ఇంట్లో భేటీ అయిన ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, తుమ్మల నాగేశ్వరరావు, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదురి. ఇదిలా ఉండగా.. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో నేడు 60 నుంచి 70 స్థానాలకు కమిటీ సీట్లు ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: అసమ్మతిపై హస్తం ముందుచూపు -
తానా సభల్లో తన్నులాట.. బండ్ల గణేష్ సీరియస్ రియాక్షన్
అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం Telugu Association of North america (TANA, తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడి గుద్దులు గుద్దుకున్నారు. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరిగింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ ఘటనపై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ఈ క్రమంలో టీడీపీ లీడర్లపై ఫుల్ సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన బండ్ల గణేష్.. ‘తానా పరువు తీస్తున్నారు కదా దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు నీచుల్లారా.. సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానా పరువు తీస్తున్నారు కదా దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పట్టా కష్టాన్ని గంగలో కలిపారు నిచుల్లారా 😡 https://t.co/R06P8Gq7bK — BANDLA GANESH. (@ganeshbandla) July 9, 2023 సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ 😡😡 https://t.co/R06P8Gq7bK — BANDLA GANESH. (@ganeshbandla) July 9, 2023 చదవండి: US : ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం? తానా సభల్లో తన్నుకున్న 'తెలుగు' తమ్ముళ్లు అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. -
బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి పొలిటికల్ కామెంట్స్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే, తాను రాజకీయాల్లో లేనంటూనే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, భట్టి పాదయాత్ర ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రలో పాల్గొననున్నట్లు బండ్ల గణేశ్ తెలిపారు. భట్టిని కలిసేందుకు సూర్యాపేట వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లో ‘అన్నా.. వస్తున్నా. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. అని బండ్ల గణేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అన్నా వస్తున్నా అడుగులో అడిగేస్తా చేతిలో చెయ్యేస్తా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్… https://t.co/ZTmWiMcCaL — BANDLA GANESH. (@ganeshbandla) June 25, 2023 ఇది కూడా చదవండి: పొంగులేటికి షాక్.. ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ -
త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్ సంచలన ట్వీట్!
కమెడియన్‌గా, నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేశ్. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. ఆయన పెట్టే పోస్టులు ప్రతిసారి నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఒక వ్యక్తిని పొగడాలన్నా లేదా విమర్శించాలన్నా.. ట్వీటర్‌ని ఆయుధంగా వాడతారాయన. ఆ మధ్య డైరెక్టర్ హరీశ్ శంకర్, బండ్ల గణేశ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇక తన ట్విటర్ అస్త్రాన్ని త్రివిక్రమ్‌పై ప్రయోగించాడు బండ్లన్న. అయితే అక్కడ త్రివిక్రమ్ పేరుని ప్రస్తావించకపోయినా.. ‘గురుజీ’ అంటూ పరోక్షంగా ఆయన్ను విమర్శించారు. (చదవండి: అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా!) అసలు విషయంలోకి వెళ్తే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేశ్ తాజాగా ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘బండ్లన్న నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది’ అని ట్వీట్ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్‌గా మారింది. ‘గురూజీని కలవండి. ఖరీదైన బహుమతులు ఇవ్వండి. అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక మరో నెటిజన్ ‘గురూజీకి కథ చెబితే దానికి తగిన విధంగా స్క్రీన్‌ప్లే రాసి అసలు కథను షెడ్‌కు పంపిస్తాడని టాక్ ఉంది. నిజమేనా? అని ప్రశ్నించగా.. దీనికి కూడా బండ్ల తనదైన శైలీలో స్పందించాడు. . ‘‘అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తారు’ అంటూ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సంచలనంగా మారింది. ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌ను చాలామంది గురూజీ అని పిలుచుకుంటారు. దీంతో బండ్ల ట్వీట్ త్రివిక్రమ్‌ను ఉద్దేశించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదే కాదు భార్యాభర్తల్ని. తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ 😝 https://t.co/P6J844y0fa — BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2023 -
దేవర టైటిల్ నాదే.. కొట్టేశారు: బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
యంగ్ టైగర్ జూనియర్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్ 30'. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇప్పటికే ‘దేవర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారనే టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. దీంతో దీనిపై నిర్మాత బండ్ల గణేశ్ చేసిన నెట్టింట్లో వైరలవుతోంది. ఆ టైటిల్‌ను కొట్టేశారంటూ ఆరోపిస్తూ ఆయన ట్వీట్ చేశారు. (ఇది చదవండి: బాలీవుడ్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం..!) అయితే ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను మూవీ యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ పేరునే ఖరారు చేస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో తారక్ అభిమానులు సైతం ఈ పేరుతో ఇమేజ్‌లు తయారు చేసి షేర్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. బండ్ల గణేశ్ ట్వీట్లో రాస్తూ..'దేవర అనే టైటిల్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నేను మర్చిపోవడం వల్ల.. నా టైటిల్‌ను కొట్టేశారు' అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ‘నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్. ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే’ అని మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు టైటిల్ ఏదో తెలియాలంటే మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. (ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ?) దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34 — BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023 -
రాజకీయాల్లోకి రీఎంట్రీ? కన్ఫర్మ్ చేసిన బండ్ల గణేశ్
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఊహించడం చాలా కష్టం. గతంలో రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించిన బండ్ల గతేడాది అక్టోబర్‌లో పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించాడు. కుటుంబ బాధ్యతల వల్ల రాజకీయాలకు దూరమవుతున్నట్లు వెల్లడించాడు. పలు ఇంటర్వ్యూలలోనూ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటానని కుండ బద్ధలు కొట్టిన ఆయన తాజాగా ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు బండ్ల గణేశ్ వరుస ట్వీట్లు చేశాడు. మొదటగా 'రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం..' అంటూ అభిమానుల్లో ఆసక్తిని రేపాడు. తర్వాత కాసేపటికే 'నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా రాజకీయాలు చేస్తా' అంటూ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు. మరో ట్వీట్లో 'బానిసత్వానికి బైబై, నిజాయితీతో కూడిన రాజకీయాలకు జైజై.. రాజకీయాలంటే నిజాయితీ.. రాజకీయాలంటే నీతి.. రాజకీయాలంటే కష్టం.. నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం 🔥🔥🔥🔥 — BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023 నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా 🔥 — BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023 రాజకీయాలంటే పౌరుషం.. రాజకీయాలంటే శ్రమ.. రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి, రావాలి. అందుకే వస్తా!' అని రాసుకొచ్చాడు. దీంతో బుర్ర గోక్కుంటున్న నెటిజన్లు 'ఇలా యూటర్న్ తీసుకున్నావేంటన్నా?', 'ఇంతకీ ఏ పార్టీలో చేరాలనుకుంటున్నావో.. ముందు అది చెప్పు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి బండ్ల గణేశ్ ట్వీట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా🔥🔥🔥🔥🔥 — BANDLA GANESH. (@ganeshbandla) May 12, 2023 ఆంజనేయులు, తీన్మార్, గబ్బర్‌సింగ్, టెంపర్, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలతో హిట్ చిత్రాల నిర్మాతగా పేరు సంపాదించాడు బండ్ల గణేశ్. నటుడిగానూ పలు సినిమాలతో సత్తా చాటిన ఆయన చివరగా డేగల బాబ్జీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. చదవండి: లైగర్ నష్టాలతో నిరవధిక దీక్ష.. స్పందించిన చార్మీ -
వదినగా మీరున్నందుకు చాలా సంతోషం: బండ్ల గణేశ్
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. మెగా ఫ్యామిలీ పట్ల ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది. తాజాగా ఇవాళ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బండ్ల గణేశ్. ఈ మేరకు తన ట్విటర్లో చిరంజీవి దంపతుల ఫోటోను షేర్ చేశారు. బండ్ల గణేశ్ తన ట్విటర్లో రాస్తూ..'సీతాదేవి అంత ఓర్పు. భూదేవంత గొప్పతనం. లక్ష్మీదేవి లాంటి నవ్వు. రాముడి లాంటి భర్తకు అర్ధాంగిగా.. వజ్రం లాంటి బిడ్డకు తల్లిగా.. ఎందరో లక్ష్మణులకు వదినగా మీరుండటం మాకెంతో సంతోషం. ఇలాంటి జన్మదినాలు మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరున్ని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు' అంటూ సురేఖ , చిరంజీవి దంపతులు ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. సీతాదేవి అంత ఓర్పు భూదేవంత గొప్పతనం లక్ష్మీదేవి లాంటి నవ్వు రాముడి లాంటి భర్తకు అర్ధాంగిగా, వజ్రంలాంటి బిడ్డకు తల్లిగా, ఎందరో లక్ష్మణులకు వదినగా మీరుండటం మాకెంతో సంతోషం.. ఇలాంటి జన్మదినాలు మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరున్ని మనసారా కోరుకుంటూ.. @KChiruTweets pic.twitter.com/OWf6Gw69KY — BANDLA GANESH. (@ganeshbandla) February 18, 2023 -
బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్.. ఆ స్టార్ డైరెక్టర్‌ను ఉద్దేశించేనా?
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. కమెడియన్‌గా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుసుకున్న బండ్ల గణేష్ తన స్పీచులతోనే సపరేట్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఏ అంశంపైన అయినా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా బయటపెడుతుంటాడు. అలా తరచూ తన ట్వీట్స్‌తో ఆటం బాంబ్స్ పేలుతుంటాడు. ఈ క్రమంలో తాజాగా బండ్ల చేసిన ఓ ట్వీట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆయన చేసిన ఈ ట్వీట్ ఓ స్టార్ డైరెక్టర్ ఉద్దేశించేనా? అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ బండ్ల చేసిన ట్వీట్ ఏంటంటే.. ‘మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడుగానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా’ అంటూ ఫైర్ ఎమోజీని జత చేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే బండ్ల ఎవరి మీదో ఫుల్ ఫైర్‌లో ఉన్నాడని అర్థమవుతుందో. ఇక ఆయన ట్వీట్‌పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు కదా? అన్న అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ మధ్య నటుడు పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ ఈవెంట్‌కు బండ్ల గణేష్‌ను పిలవలేదని, దీనికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తనని మూవీ ఫంక్షన్‌కు రాకుండా అడ్డుకున్నారంటూ బండ్ల గణేష్ మాట్లాడినట్టుగా ఓ ఆడియో లీక్ కాగా.. అది తనది కాదని బండ్ల అప్పుడే క్లారిటీ ఇచ్చేశాడు. మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడు గానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా..🔥 — BANDLA GANESH. (@ganeshbandla) February 16, 2023 -
ప్రొద్దుటూరు కోర్టుకు బండ్ల గణేష్
ప్రొద్దుటూరు క్రైం : చెక్‌బౌన్స్ కేసుకు సంబంధించి సినీ నిర్మాత బండ్లగణేష్ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వర్గాలు తెలిపిన మేరకు బండ్లగణేష్‌పై ప్రొద్దుటూరు కోర్టులో చెక్‌బౌన్స్ కేసులు ఉన్నాయి. వీటిలో ఒక కేసుకు సంబంధించి బుధవారం ఆయన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. తిరిగి ఈ కేసు విచారణ ఈ నెల 22కు వాయిదా పడినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి. -
సూసైడ్ చేసుకునేవాడినంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: 2018లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సేవనో క్లాక్ బ్లేడ్‌తో గొంతు కుసుకుంటానని చెప్పి వార్తల్లో నిలిచిన సినీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.. తాజాగా తాను సూసైడ్ చేసుకునే వాడినని కామెంట్ చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి లేకపోతే తాను చనిపోయే వాడినని అన్నారు. ఎన్నో విధాలుగా తనకు అండగా నిలిచిన ‘నా అన్న, నా దేవుడి వెంట ఎప్పుడూ ఉంటా’.. రాజకీయాలు పక్కనపెట్టి రంజిత్ రెడ్డి కోసం పనిచేస్తానని బండ్ల గణేష్ అన్నారు. చదవండి: కాల్ గర్ల్ కోసం వెతికి వెతికి.. అడ్డంగా బుక్కయ్యాడు కాగా, కాంగ్రెస్ తరఫున 2018లో ప్రచారం చేసిన బండ్ల గణేష్.. ‘‘2018, డిసెంబర్ 11 ఉదయం 11 గంటల తర్వాత నా ఇంటికి రండి. వచ్చేటప్పుడు సేవనో క్లాక్ బ్లేడ్ తీసుకురండి. ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోతే.. బ్లేడ్‌తో నా పీక కోసుకుంటా. ఇదే నా ఛాలెంజ్. హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్ గా వేసుకుంటారో" అంటూ బండ్ల గణేష్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మహా కూటమి ఓటమి పాలైంది. సినీ నిర్మాతగా గుర్తింపు పొందిన ఆయన.. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పాలిటిక్స్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఇక తాను ఏ పార్టీలోనూ చేరబోనని ప్రకటించారు. -
అలా చేస్తే ధమాకా ఒక్కరోజే ఆడేది: బండ్ల గణేశ్ కామెంట్స్ వైరల్
మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘ధమాకా. ఈనెల 23న విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రవితేజ ఎనర్జీ, యాక్షన్ ఎలిమెంట్స్.. శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా ఈ చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత బండ్ల గణేశ్ రవితేజపై ప్రశంసల వర్షం కురిపించాడు. రవితేజను పొగుడుతూ సక్సెస్ మీట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. టాలీవుడ్లో 12 మంది దర్శకులను పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ అని కొనియాడారు. నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. 'ధమాకా వేడుకకు నేను వస్తానని ముందే ఫోన్ చేసి చెప్పి మరీ వచ్చా. ఇప్పటివరకు ఆస్తమించిన రవిని చూశాం. ఎప్పటికీ అస్తమించని రవితేజ గురించి నేను మాట్లాడుదామని వచ్చా. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. నేను రవితేజ ఫ్యాన్ అని చెప్పుకోవాలంటే గర్వం ఉండాలి. 12 మంది దర్శకులను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ. అదృష్టం కలిసొచ్చిన వాళ్లు సూపర్స్టార్లు, మెగాస్టార్లు అవుతారు. పదేళ్లయినా రవితేజ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. కొంతమంది రవితేజ పని అయిపోయిందనుకుంటారు. ఆయన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. ఆయన ఒక అరాచకం. రవితేజను చూస్తే నల్లమల అడవుల్లో నిగనిగలాడే నల్లతాచులా ఉన్నాడు. ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ, క్రికెట్లో విరాట్ కోహ్లీలా రవితేజ వన్‌మ్యాన్ షో చూపించాడు. దటీజ్ రవితేజ. ఎప్పుడేం చేయాలో, ఎవరిని ఎప్పుడు పైకి తేవాలో తెలిసిన వ్యక్తి రవితేజ. ధమాకాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన అద్భుతంగా కనిపించాడు.' అని ఉద్వేగభరితంగా ప్రసంగింంచారు. -
CM Jagan Birthday: సీఎం వైఎస్ జగన్‌కు నాగార్జున, విశాల్ బర్త్‌డే విషెస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు నేడు(డిసెంబర్ 21). ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అంటూ సీఎం జగన్‌కు టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Wishing dear @ysjagan garu a very happy birthday!!May you be blessed with health and happiness always!!💐 #HBDYSJagan — Nagarjuna Akkineni (@iamnagarjuna) December 21, 2022 కోలీవుడ్ హీరో విశాల్, టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. భగవంతుని ఆశిస్సులు వైఎస్ జగన్ గారికి ఉండాలని విశాల్, బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. Wishing AP CM Mr Jagan Mohan Reddy a Very Happy Birthday, God Bless #HBDYSJagan pic.twitter.com/2gym8Mr2EH — Vishal (@VishalKOfficial) December 21, 2022 Andhra Pradesh chief minister @ysjagan garu a very happy birthday!!May you be blessed with health and happiness always!!💐 #HBDYSJagan pic.twitter.com/q88XIbOZtN — BANDLA GANESH. (@ganeshbandla) December 21, 2022 సీఎం జగన్‌కు మోహన్ బాబు శుభాకాంక్షలు ఏపీ సీఎం జగన్‌కు ప్రముఖ నటుడు మోహన్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘షిర్డీ సాయి బాబా ఆశీర్వాదం తో జగన్ కు మంచి ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. Wishing Sri. @ysjagan many returns of the day May Shirdi Sai Baba’s blessing give him good health and happiness. — Mohan Babu M (@themohanbabu) December 21, 2022 -
తండ్రి మాట వినకపోతే అల్లుఅర్జున్ లా అవుతారు : బండ్ల గణేష్
-
తండ్రి మాట వినకపోతే బన్నీలా అవుతారు, బండ్ల వీడియో వైరల్
వివాదాలతో సావాసం చేసే సినీ నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. తాజాగా అల్లు ఫ్యామిలీ మీద ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొన్న బండ్ల గణేశ్ అల్లు బాబీతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ సందర్భంగా బండ్ల మాట్లాడుతూ.. 'అందరికీ చెప్తున్నా, తండ్రి మాట వినొద్దు. తండ్రిని గౌరవించి ఆయన మాట వింటే మా బాబీగారిలా అవుతారు. తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తే బన్నీగారిలా అవుతారు. బాబీగారిలా అవ్వాలా? బన్నీగారిలా అవ్వాలా? అనేది మీరే నిర్ణయించుకోండి' అన్నాడు. 'బాబీ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుని మామూలుగా ఇలా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు చేసుకుంటూ పోయిన బన్నీ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. దయచేసి తండ్రి మాట వినొద్దు, సొంత నిర్ణయాలు తీసుకోండి. తండ్రి మాట విన్న బాబీని చూడండి, వినని బన్నీని చూడండి' అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బాబీ పాజిటివ్‌గా తీసుకుని సరదాగా నవ్వాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతుంగా నెటిజన్లు బండ్ల గణేశ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. పబ్లిక్‌లో ఏది పడితే అది వాగేయడమేనా? కాస్తైనా కామన్సెన్స్ ఉండక్కర్లా, దీన్నే నోటిదురుసు అంటారు, ఒకరిని కించపరిచేలా మాట్లాడటం నీకు సరదాగా ఉందా? ఏది పడితే అది వాగడం తగ్గించుకుంటే మంచిది అని కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే.. తండ్రి మాట వినలేదని బన్నీ నీకొచ్చి చెప్పాడా? నోటికొచ్చినట్లు వాగుతున్నావ్ అంటూ బండ్ల గణేశ్‌ను ఏకిపారేస్తున్నారు. చదవండి: క్రికెటర్‌తో లవ్, ఇప్పుడు మాటల్లేవన్న నటి పాత ఇల్లు కొని సొంతింటి కల సాకారం చేసుకున్న కమెడియన్ -
రాజకీయాల వల్ల జీవితంలో చాలా నష్టపోయాను : బండ్ల గణేష్
నిర్మాత,నటుడు బండ్ల గణేష్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. కమెడియన్‌గా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుసుకున్న బండ్ల గణేష్ మాట్లాడే స్పీచుకలే సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇక ఆయన చేసే ట్వీట్స్ కూడా ఆటం బాంబ్స్లా పేలుతుంటాయి. తాజాగా బండ్లగణేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవలె రాజకీయాలకు గుడ్‌డై చెప్పిన బండ్ల.. తాజాగా పాలిటిక్స్ వల్ల జీవితంలో చాలా నష్టపోయానని తెలిపారు. తనకు రాజకీయాలతో, ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, అందరూ ఆత్మీయులే అంటూ ట్వీట్ చేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీలో బండ్ల గణేష్.. కొంతకాలం తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు తనకు సంబంధం లేదంటూ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. -
బండ్ల గణేష్ సంచలన నిర్ణయం.. ఇక రాజకీయాలకు గుడ్ బై
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. కాగా, బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా.. ‘నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, 2018లో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు….2 — BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022 …..అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్..🙏 — BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022 -
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో ఆదిశేషగిరిరావు ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ క్లబ్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు మరోసారి ఎఫ్ఎన్సీసీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌పై తుమ్మల రంగారావు విజయం సాధించారు. ప్రతీ రెండేళ్లకోసారి ఫిల్మ్ నగర్ క్లబ్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. మొత్తం 4 వేల 600మంది సభ్యులున్న ఈ సెంటర్లో 1900 మందికి ఓటు హక్కు ఉంది. వారిలో మెజార్టీ సభ్యులైన నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లుఅరవింద్ , సురేష్ బాబు, కేఎల్ నారాయణ ప్యానెల్‌లోని సభ్యులే గెలుపొందారు. చదవండి: (డాటర్స్ డే స్పెషల్.. కూతురికి మహేశ్ స్పెషల్ విషెష్) -
తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు: రౌడీ హీరోకు బండ్ల కౌంటర్?!
విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటించిన చిత్రం లైగర్. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. రౌడీ హీరో భారీ కటౌట్ పెట్టి దానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నానా రచ్చ చేశారు. అటు సోషల్ మీడియానూ లైగర్ హ్యాష్‌ట్యాగ్‌తో ఓ ఊపు ఊపారు. అభిమానుల హడావుడి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన విజయ్ మెంటల్ మాస్ స్పీచ్ ఇచ్చాడు. 'మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది. రిలీజ్ అయిన సినిమా కూడా పెద్దగా చెప్పుకునే మూవీ కాదు. అయినా ట్రైలర్‌కు ఈ రచ్చ ఏందిరా నాయన..' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే విజయ్ టాలీవుడ్లో మెగా హీరోలను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా బండ్ల గణేశ్ దీనికి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేశ్‌బాబులా, రామ్‌చరణ్‌లా, ప్రభాస్‌లా.. గుర్తుపెట్టుకో బ్రదర్' అని ట్వీట్ చేశాడు. అయితే కొందరు ఇది రౌడీ హీరోకు కౌంటర్ ఇచ్చినట్లు ఉందని అంటుంటే మరికొందరు మాత్రం ప్రభాస్, రామ్‌చరణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌లను విమర్శించినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ 🔥🔥🔥🔥 @AlwaysRamCharan @tarak9999 @urstrulyMahesh 🐅🐅🐅🐅 — BANDLA GANESH. (@ganeshbandla) July 22, 2022 చదవండి: తెలుగు సినిమాలకు అవార్డుల పంట ఆడపిల్లకు జన్మనిచ్చిన నటి -
చీప్‌గా వాగొద్దు.. బండ్ల గణేశ్‌కు పూరీ జగన్నాథ్ కౌంటర్!
ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు, హీరో ఆకాశ్ పూరీ నటించిన తాజా చిత్రం చోర్ బజార్. జూన్ 24న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పూరీ జగన్నాథ్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే! దీంతో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ వేదికపైనే పూరీపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దేశం మొత్తం కల్లాపు చల్లాడు. కానీ, ఇంటి ముందు కల్లాపు చల్లడానికి టైం లేదు, కన్న కొడుకు ఫంక్షన్‌కు వచ్చేంత టైం లేదా? అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా దీనిపై పూరీ జగన్నాథ్ పరోక్షంగా స్పందించాడు. 'గుర్తుపెట్టుకోండి.. మన నాలుక కదులుతున్నంతసేపు మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే లైఫ్‌లో ఎక్కువ టైం లిసనర్స్(వింటూ ఉంటే)గా ఉంటే చాలు. మీ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ జనాలు, ఆఖరికి కట్టుకున్న పెళ్లాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు, చీప్‌గా ప్రవర్తించొద్దు. మన వాగుడు మన కెరీర్‌ను, మన క్రెడిబులిటీని డిసైడ్ చేస్తుంది. సుమతీ శతకం మీకు గుర్తుండే ఉంటుంది. నొప్పింపక తానొవ్వక.. తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ! తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది. ఫైనల్‌గా ఓ మాట.. నీ బతుకు, నీ చావు నాలుక మీదే ఆధారపడి ఉంటుంది' అంటూ యూట్యూబ్‌లో ఓ ఆడియో వదిలాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. బండ్లన్నకు అదిరిపోయే పంచ్ ఇచ్చావంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: మావాడికి నేను ఎక్స్పోజింగ్ చేస్తే నచ్చట్లే, అందుకే ఇలా.. ఇంట్లో వ్రతం.. భార్యకు ఏడువారాల నగలు కొనిచ్చిన కార్తీకదీపం నటుడు -
కొడుకు ఫంక్షన్‌కు వచ్చే టైం లేదా.. పూరీపై బండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతో మందిని స్టార్ హీరోలుగా చేసిన పూరి జగన్నాథ్.. కన్నకొడుకు(ఆకాశ్ పూరీ) సినిమా ఫంక్షన్‌కి రాకపోవడం బాధగా ఉందన్నారు. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన బండ్ల గణేశ్ పూరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఓ సామెత ఉంటుంది.. దేశం మొత్తం కల్లాపు చల్లాడు కానీ.. ఇంటి ముందు కల్లాపు చల్లడానికి టైం లేదనే పూరీని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది.ఎంతో మందిని స్టార్స్‌గా తయారు చేశాడు. డైలాగ్‌లు చెప్పడం రాని వాళ్లకి డైలాగ్‌లు నేర్పాడు. డాన్స్‌లు రాని వాళ్లకి డాన్స్‌లు నేర్పాడు. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కి మాత్రం రాలేదు. అదే నేనైతే నేను లండన్‌లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడిని. ఎందుకంటే నేను ఉన్నదే నా కొడుకు కోసం.. నా భార్య కోసం.. నా పిల్లల కోసం.. మా అన్న(పూరి జగన్నాథ్) ఎక్కడ ఉన్నాడో.. ఏం బిజీగా ఉన్నాడో.. ఈసారికి అయిపోయింది కానీ ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయమాకు. ఎందుకంటే మనం ఏం చేసినా వాళ్ల కోసమే. మనం చస్తే తలకొరివి పెట్టాల్సింది వాళ్లే. మనం సంపాదిస్తే ఆస్తులు వాళ్లకే.. అప్పులు చేస్తే తీర్చేదీ వాళ్లే. ఆకాశ్ అంటే సన్నాఫ్ పూరీ జగన్నాథ్.. . ఎవర్నెవర్నో స్టార్లని చేశావ్.. నీ కొడుకు వచ్చేసరికి వెళ్లి ముంబాయిలో ఉన్నావ్.. ఇదెక్కడి న్యాయం అన్నా?.నువ్ నీ కొడుకుని స్టార్‌ని చేసినా చేయకపోయినా నీ కొడుకు స్టార్ అవుతాడు.. చోర్ బజార్ పెద్ద హిట్ అవుతుంది. నువ్ కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. నేను ఈరోజు చెప్తున్నా రాస్కో.. నువ్ బ్యాంకాక్ పోయి కథ రాసుకుని.. ఆకాష్ కథ చెప్తా వినరా అని ఎదురుచూసే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. అలా జరక్కపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు. ఆరోజు వచ్చినరోజు.. ఆకాశ్ నువ్ డేట్లు ఇవ్వొద్దని చెప్తా’ అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు. -
మీరు లేకుండా నేను లేను నాన్నా..మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్
నేడు ఫాదర్స్ డే (జూన్ 19). ఈ సందర్భంగా టాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఒక గొప్ప కొడుకుగా, గర్వించదగ్గ తండ్రిగా మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి అనారు. ఈ మేరకు ఆదివారం ఉదయం తండ్రి వెంకట్రావ్‌తో దిగిన ఫోటోని ట్విటర్లో షేర్ చేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. It is a great feeling to be a grateful son and a proud father! #HappyFathersDay to all!💐😍 pic.twitter.com/3n7OFwQ8Ka — Chiranjeevi Konidela (@KChiruTweets) June 19, 2022 మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా నాన్న కృష్ణకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ..‘నాన్న అనే పదానికి నాకు సరైన నిర్వచనం తెలియజేశారు. మీరు లేకుండా నేను లేను. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్న’అని మహేశ్ ట్వీట్ చేశాడు. You led by example and showed me what it means to be a father.. I wouldn't be who I am without you.. Happy Father's Day Nanna! ❤️ pic.twitter.com/UYADkoKeOm — Mahesh Babu (@urstrulyMahesh) June 19, 2022 ‘నాన్న నువ్వు నాకోసం తీసుకున్నా ప్రతి నిర్ణయం ప్రతి కష్టం ప్రతి శ్రమ ప్రతి అడుగు నా మదిలో వెంటాడుతూనే ఉంటాయి ఐ లవ్ యు నాన్న’అని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ట్వీట్ చేశాడు. నాన్న నువ్వు నాకోసం తీసుకున్నా ప్రతి నిర్ణయం ప్రతి కష్టం ప్రతి శ్రమ ప్రతి అడుగు నా మదిలో వెంటాడుతూనే ఉంటాయి ఐ లవ్ యు నాన్న ❤️ pic.twitter.com/j4eAgUct5S — BANDLA GANESH. (@ganeshbandla) June 19, 2022 View this post on Instagram A post shared by Nihaa Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) Nanna, You had not only given me life but also all the qualities required to live it happily and successfully: The courage to face difficulty, The cheerfulness to savour every moment.. This is the first father's day without you and miss you badly nannaa.. Love you Forever ❤️ pic.twitter.com/ZNZNewlZke — Sreenu Vaitla (@SreenuVaitla) June 19, 2022 Thank you for guiding me in my best and worst. No one like you! #HappyFathersDay love u daddy❤️❤️ pic.twitter.com/krXxGZwh45 — nithiin (@actor_nithiin) June 19, 2022 View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
ప్రతి రిలేషన్లో గొడవలు, మనస్పర్థలు కామన్: బండ్ల గణేశ్
Bandla Ganesh About Clash With Director: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌కు ఖరీదైన వాచ్ బాహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాగా గతంలో బండ్ల గణేశ్, హరీశ్ శంకర్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా బండ్ల గణేశ్, హరీశ్ శంకర్‌ను కలవడం, బాహుమతులు ఇచ్చుకోవడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీంతో గతంలో బండ్ల చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చదవండి: ఆస్తులన్ని పోయాయి, ఒక్క పూట భోజనమే చేసేదాన్ని: ‘షావుకారు’ జానకి హరీశ్ శంకర్‌తో గొడవపై ఓ ఇంటర్య్వూలో స్పందించిన బండ్ల గణేశ్ ఇలా వ్యాఖ్యానించాడు. ‘ప్రతి రిలేషన్లో గొడవలు, మనస్పర్థాలు సాధారణమే. ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. మళ్లీ సర్థుకుంటాయి. ఇలాంటి వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దు’ అన్నాడు. అనంతరం ‘గబ్బర్ సింగ్ మూవీ నా జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీతో నాకు అంత పెద్ద హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్‌కు నేను ఎప్పటికీ కృతజ్ఞతుడినే. నా జీవింతాంతం ఆయన నాకు మంచి స్నేహితుడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హరీశ్ శంకర్ కూడా మనసులో ఏం పెట్టుకోలేదని, ఆయన అంత వదిలేసి తనతో చాలా ఫ్రెండ్లిగా ఉంటున్నారని చెప్పాడు. అంతేగాక పవన్ కల్యాణ్ చాన్స్ ఇస్తే తనతో సినిమా చేసేందుకు ఆయన రెడీగా ఉన్నారని చెప్పాడు. చదవండి: ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్ అవుతుందా? కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాకు బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్పట్లో బ్లాకబస్టర్గా నిలిచింది. దీంతో మే 12తో ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బండ్ల డైరెక్టర్ హరీశ్ శంకర్ కాస్ట్లీ వాచ్‌ను కానుకగా ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇదే మూవీ 8వ వార్షికోత్సవం సమయంలోనే హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ మధ్య వాగ్వాదం నెలకొంది. 'గబ్బర్ సింగ్' 8వ వార్షికోత్సవం సందర్భంగా హరీశ్ శంకర్ అందరికీ థ్యాంక్స్ చెపుతూ ఒక లేఖను విడుదల చేశారు. అయితే, ఆ సినిమా నిర్మాత అయిన బండ్ల గణేశ్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో, రచ్చ మొదలైంది. హరీశ్ శంకర్ ఓ రీమేక్ డైరెక్టర్ అని, అతనితో మళ్లీ సినిమా చేసే ప్రసక్తే లేదంటూ బండ్ల అప్పట్లో ఫైర్ అయిన విషయం విధితమే. -
హరీష్ శంకర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బండ్ల గణేష్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో 'గబ్బర్ సింగ్' ఒకటి. ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్‌కు నిర్మాత బండ్ల గణేష్ ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మీరు లేకపోతే ఈ సినిమా అంత వేగంగా పూర్తయ్యేది కాదంటూ ట్వీట్ చేశారు. కాగా హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన దబాంగ్ రీమేక్ చిత్రమే గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటించింది. ఈ సినిమా విడుదలై నిన్నటికి పదేళ్లు అయిన సందర్భంగా హరీష్ శంకర్‌కు సుమారు రూ. 5లక్షలు విలువచేసే వాచ్‌ను బండ్ల కానుకగా ఇచ్చారు. Successful Producer Bandla Ganesh gifted an expensive watch to Blockbuster Director Harish Shankar on the occasion of #DecadeForGabbarSingh #10YearsForGabbarSingh @harish2you @ganeshbandla pic.twitter.com/brxVrCRB6f — Vamsi Kaka (@vamsikaka) May 11, 2022 -
విజయ్‌పై బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Bandla Ganesh Wishes On Vijay Devarakonda Birthday: స్టార్ హీరో విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్బంగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సోమవారం(మే 9) విజయ్ పుట్టిన రోజున సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అతడి విషస్ తెలిపారు. అలాగే బండ్ల గణేశ్ కూడా విజయ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు బండ్లగణేష్ ట్వీట్ చేస్తూ విజయ్ స్టార్ అవుతాడని అతడు పుట్టినప్పుడే వాళ్ల నాన్నతో అన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: బాలీవుడ్ నన్ను భరించలేదు: మహేశ్ బాబు షాకింగ్ కామెంట్స్ ‘నాకు ఇంకా గుర్తుంది. మే 9న మీ నాన్నగారు వచ్చి నాకు కొడుకు పుట్టాడు అని చెప్పారు. వెంటనే ఆ బాబు స్టార్స్‌తో ఆశీర్వదింపబడ్డాడు అని అన్నాను. డియర్ విజయ్ అన్ని స్టార్స్ కలిసి నిన్ను ఇండియన్ సినిమా సూపర్ స్టార్‌గా నిలబెట్టాయి. హ్యాపీ బర్త్‌డే విజయ్ దేవరకొండ’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ చూసిన విజయ్ ఫ్యాన్స్ బండ్ల గణేశ్‌కు ధన్యవాదాలు తెలుపుతుండగా.. మరికొందరు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలో విజయ్ తండ్రి టీవీ, సినిమా రంగంలో పనిచేశాడు. రచయితగా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈ క్రమంలో విజయ్ తండ్రికి బండ్ల గణేశ్‌తో పరిచయం ఏర్పడి ఉంటుందని నెటిజన్లను అభిప్రాయ పడుతున్నారు. I still remember that may9th when your dad told me that he’s blessed with a son and immediately replied he’s blessed with a star. Dear Vijay, all the stars are aligned to make you the superstar of indian cinema. 🤗❤️@TheDeverakonda pic.twitter.com/uCKHMlLcBt — BANDLA GANESH. (@ganeshbandla) May 9, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4451453475.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ రోజు నవరసాలు చూపిస్తానంటున్న బండ్ల గణేష్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం డేగల బాబ్జీ. వెంకట్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా నుంచి రంజాన్ సందర్భంగా ఓ అప్డేట్ వచ్చింది. మే 20న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు బండ్ల గణేష్.. 'నవరసాలతో మీ డేగల బాబ్జీ' అంటూ రిలీజ్ డేట్‌తో కూడిన ఓ పోస్టర్‌ను ట్విటర్లో షేర్ చేశాడు. ఇందులో బండ్ల నిజంగానే నవరసాలు ఒలికిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మించిన ఈ చిత్రంలో గణేష్ పలు విభిన్న పాత్రల్లో అలరించనున్నాడు. EAD MUBARAK 👏 pic.twitter.com/qjn2ZcSvmh— BANDLA GANESH. (@ganeshbandla) May 3, 2022 చదవండి: రాకింగ్ రాకేశ్‌కు కాస్ట్లీ ఫోన్ గిఫ్టిచ్చిన సుజాత 'మిర్చి' సినిమాకి చాలా కష్టపడ్డాం -
'భీమ్లా నాయక్' ఈవెంట్లో త్రివిక్రమ్ అందుకే మాట్లాడలేదా?
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'భీమ్లా నాయక్'. రేపు(ఫిబ్రవరి 25)న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం అయ్యింది. అయితే ఈవెంట్ మొత్తంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ లేకపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఆయన ఫంక్షన్‌కి వచ్చారా లేదా అన్న సందేహం కూడా ఫ్యాన్స్‌లో మిగిలిపోయింది. పవన్ సినిమా ఫంక్షన్‌కు అన్నీ తానై ముందుండి నడిపించే త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో మాత్రం బ్యాక్ స్టేజ్‌కే ఎందుకు పరిమితం అయ్యారన్నది ఇప్పడు చర్చనీయాంశమైంది. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో లీక్ అయిన బండ్ల గణేష్ ఆడియో కాల్‌తో త్రివిక్రమ్ అప్సెట్ అయ్యారని, దీనివల్లే త్రివిక్రమ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడలేదని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి త్రివిక్రమ్ పేరే హైలైట్ అవుతూ వచ్చింది. నిజానికి యంగ్ ఫిల్మ్ మేకర్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ సోషల్ మీడియాలోనూ త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తుండటంతో ఈవెంట్లో ఎలాంటి హడావిడి లేకుండా కావాలనే బ్యాక్ స్టేజ్‌కి పరిమితం అయ్యారని టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. చదవండి: త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఆడియో లీక్‌పై స్పందించిన బండ్లగణేష్ -
త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఆడియో లీక్‌పై స్పందించిన బండ్లగణేష్
Bandla Ganesh Clarity On Audio Leak : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన సినిమా ఫంక్షన్లకి బండ్ల గణేష్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే రీసెంట్గా పవన్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తనను రాకుండా త్రివిక్రమ్ అడ్డకుంటున్నారంటూ బండ్ల గణేష్ మాట్లాడిన ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో త్రివిక్రమ్‌ని దూషిస్తూ బండ్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. అయితే తాజాగా ఈ ఆడియో క్లిప్‌పై స్పందించిన బండ్ల గణేష్.. అది తన గొంతు కాదని, ఎవరో కావాలనే ఇలా క్రియేట్ చేశారంటూ కొట్టి పారేశారు. అయితే దీనిపై అఫీషియల్‌గా ఓ స్టేట్మెంట్ ఇచ్చేందుకు మాత్రం ఆయన ఇష్టపడకపోవడం గమనార్హం. కాగా పవన్ కల్యాణ్, రానా మల్టీస్టారర్లుగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఈనెల 25న రిలీజ్ కానుంది. -
Bandla Ganesh: మూడోసారి కోవిడ్ బారిన పడ్డ బండ్ల గణేష్
Bandla Ganesh Tested Corona Positive: టాలీవుడ్లో కరోనా కలకం రేపుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత మూడు రోజులు నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు(ఆదివారం) స్వల్ప లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నా కుటుంబ సభ్యులకు నెగిటివ్ వచ్చింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేముందు ఒక్కసారి ఆలోచించుకోండి. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు. కాగా ఇప్పటికే గతంలో రెండుసార్లు బండ్ల గణేష్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ సమయంలో కరోనా బారిన పడిన ఆయన ఆ సమయంలో ఐసీయూలో చికిత్స అనంతరం కోలుకున్నారు. తాజాగా మూడోసారి కోవిడ్ బారిన పడ్డారు. Last three days I was at delhi and I tested positive today evening . I have mild symptoms, and my family is tested negative . Please be careful and think before you travel I’m in isolation . Thank you #Besafe pic.twitter.com/9i4CIRI5XC — BANDLA GANESH. (@ganeshbandla) January 9, 2022 -
చిరు వ్యాఖ్యలపై బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్.. అవి రిపీట్ చేస్తూ
Bandla Ganesh Interesting Reaction On Chiranjeevi Comments: తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్వవహరించాలనుకోవడం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ తెలుగు సినీ కార్మికులకు హెల్త్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరంజీవి. ఈ సందర్భంగా 'నేను ప్రతి దాంట్లో పెద్దరికంగా ఉండాలనుకోవట్లేదు. ఆ హోదా నాకు అస్సలు వద్దు. ఇద్దరు గొడవపడుతుంటే పరిష్కరించడానికి నేను ముందుకు రాను. కానీ ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటా' అని తెలిపారు చిరంజీవి. ఈ వ్యాఖ్యలపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆసక్తికరంగా స్పందించారు. చిరు వ్యాఖ్యలను బండ్ల గణేష్ సమర్థించారు. 'సూపర్ సర్' అంటూ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఆయన మాటలను రిపీట్ చేస్తూ ఈ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. అయితే 'మా' ఎన్నికల తర్వాత సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీకి సమస్య వున్నా, కార్మికులకు ఏ సమస్యా వున్నా ఎప్పుడు ఆదుకోవడానికి సిద్ధం గా వుంటాను ఇద్దరు కొట్టుకొని పంచాయితీ చెయ్యమంటే చెయ్యను @KChiruTweets Sir 👌 — BANDLA GANESH. (@ganeshbandla) January 2, 2022 మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ ఇండస్ట్రీ పెద్దరికం పదవి లో నేను వుండను ఆ స్థానం నాకు వద్దు అవసరం వస్తె తప్పకుండా అక్కడ వుంటాను ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నాకు వద్దు @KChiruTweets sir — BANDLA GANESH. (@ganeshbandla) January 2, 2022 ఇదీ చదవండి: సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉండే ప్రసక్తే లేదు.. చిరంజీవి కీలక వ్యాఖ్యలు -
బండ్ల గణేష్‌కు అరెస్ట్ వారెంట్ జారీ.. కోర్టుకు హాజరు ?
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదాల్లో చిక్కుక్నునారు. ఈ సారి ఆయన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నారు. బండ్ల గణేష్‌పై ఏపీ ప్రకాశం జిల్లా ఒంగోలు రెండో మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జిల్లాలోని ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి గణేష్ రూ.1.25 కోట్ల చెక్కును అందించినట్లు సమాచారం. అయితే ఆ చెక్కు బౌన్స్ కావడంతో చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు వెంకటేశ్వర్లు. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుమార్లు ఆదేశించినా బండ్ల గణేష్ స్పందించలేదు. దీంతో అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. బండ్ల గణేష్ సోమవారం కోర్టుకు హాజరైనట్లు తెలుస్తోంది. గతంలో బండ్ల గణేష్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కేసు నమోదైంది. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి తనకు రూ.13 కోట్లు ఇచ్చాడని, దానిని నటుడు తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది. చివరికి కడపలో డబ్బులు చెల్లించకపోవడంతో బండ్ల గణేష్‌పై మహేష్ ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అదే తరహాలో బండ్ల గణేష్ విచారణకు కోర్టుకు హాజరుకాకపోవడంతో కడప మెజిస్ట్రేట్ ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో పోలీసులు బండ్ల గణేష్‌ను అరెస్టు చేసి కడప జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. -
నేపాలీ అమ్మాయిని దత్తత తీసుకున్న బండ్ల గణేష్
Bandla Ganesh Adopted Nepali Girl: కమెడియన్, నిర్మాతగా సత్తా చాటిన బండ్ల గణేష్..ఇటీవలె హీరోగానూ మారాడు. ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడే బండ్లగణేష్‌కు ప్రత్యేకమైన అభిమానులు సైతం ఉన్నారు. కరోనా సమయంలో సోషల్ మీడియాలో సాయం అడిగిన కొందరికి తనవంతు సాయం అందించిన మంచి మనసు చాటుకున్నాడు బండ్ల గణేష్. తాజాగా ఓ చిన్నారిని దత్తత తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇటీవలె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఓ నేపాలీ పాపని పెంచుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అందరూ కుక్కలు, పిల్లులను పెంచుకొని వాటికి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారని, తాను మాత్రం ఈ పాపను పెంచుకొని, గొప్పగా చదివించాలనుకంటున్నట్లు తెలిపాడు. ఇప్పుడు ఆ పాట తమ ఇంట్లో మెంబర్ అయిపోయిందని, ఇప్పుడు తామందరినీ బెదిరించే స్థాయికి వచ్చిందని ఫన్నీగా పేర్కొన్నాడు. @ganeshbandla అన్న నిన్ను నిందించి అగౌరవ పారిచే అంతా స్థాయి, స్థానం ఈ ఆంధ్రాలో ఏ ఒక్కడికి సరిపోదు అన్న.....🙏💯 pic.twitter.com/w0FDBDDH68 — Rock ⭐ Rockey🔥👑 (@RavitejanaiduS2) November 27, 2021 -
చిరంజీవి సార్ మీరు సూపర్.. నోట మాట రావడం లేదు: బండ్ల గణేశ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీపై బండ్ల గణేశ్‌కు ఎంత ప్రేమ ఉంటుందో అందరికి తెలిసిందే. మెగా హీరోలపై ఎవరైన వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే.. బహిరంగంగానే ఇచ్చి పడేస్తాడు. అంతేకాదు సమయం దొరికితే చాలు మెగా హీరోలను, ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచేస్తాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మీరు సూపర్ సార్ అంటూ కామెంట్ చేశాడు బండ్ల. వివరాల్లోకి వెళితే.. బుధవారం అమీర్‌పేటలో యోదా డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న కళాకారులకు ఏదైనా సహాయం చేయాల్సిందిగా యోదా డయాగ్నస్టిక్ సెంటర్ అధినేతకు విజ్ఞప్తి చేశాడు. మెగాస్టార్ చిరంజీవి వినయంగా అడగడంతో చలించిపోయిన యోదా డయాగ్నస్టిక్ సెంటర్ అధినేత.. 'మా' మెంబర్స్ తో పాటు 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసే వారందరికి తాము అందించే వైద్యంలో 50 శాతం డిస్కౌంట్ ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోని బండ్ల గణేశ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘మీరు సూపర్ సార్.. మీ గురించి మాటల్లో చెప్పలేకపోతోన్నా.. నోట మాట రావడం లేదు’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. @KChiruTweets sir Meeru super ………No words about you sir 👌👌👌👌👌🙏🙏🙏🙏 pic.twitter.com/VNF5qa07XX — BANDLA GANESH. (@ganeshbandla) November 18, 2021 -
డేగల బాబ్జీ: ట్రైలర్ మొత్తం బండ్ల గణేష్ ఒక్కడే
Bandla Ganeshs Degala Babji Trailer Out: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా నటించిన సినిమా 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే... మర్డర్ కేసులో అనుమానితుడిగా బండ్ల గణేష్‌ను పరిచయం చేశారు. సినిమాలో బండ్ల గణేష్ పేరు డేగల బాబ్జీ. ట్రైలర్ అంతా ఆయన ఒక్కరే ఉండటం గమనార్హం.'యాభై దెయ్యాలు సార్... అవి నన్ను బెదిరిస్తున్నాయి. భయపెడుతున్నాయి', 'కోపం... కోపం... భరించలేనంత కోపం', 'పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ, వాడు పుట్టిన అప్పటన్నుంచి నేను ఏడుస్తున్నాను' అంటూ బండ్ల చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
పోలింగ్ కేంద్రం వద్ద గొడవలపై బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న గొడవలపై విలేకరులు ప్రశ్నించగా దీనిపై బండ్ల ఆసక్తికర రీతిలో స్పందించారు. ఈ మేరకు బండ్ల గణేశ్ సమాధానం ఇస్తూ.. గొడవలే కదా హత్యలు, అత్యాచారాలు ఏమి జరగడం లేదు కదా అని సమాధానం ఇచ్చాడు. అనంతరం తాను ఓటు వేసిన సభ్యులే గెలుస్తారని, తప్పకుండా ఎవరో ఒకరూ గెలుస్తారంటూ చమత్కరించాడు. -
‘మా’ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్
-
‘మా’ ఎన్నికలు: పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. అభ్యర్థులంతా ప్రచారంలో బిజీగా ఉంటున్న నేపథ్యంలో బండ్ల గణేశ్ ఊహించిన షాక్ ఇచ్చాడు. తాజాగా తాను వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్‌లతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘నా దైవ సమానులు.. నా ఆత్మీయులు.. నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను 'మా' జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను’ అంటూ ట్వీట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ‘మా’ జనరల్ సెక్రటరీ పదవికి ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతూ బండ్ల గణేశ్ నామినేషన్ దాఖలు చేయగా, దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం మరోసారి చర్చకు దారి తీసింది. చదవండి: ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై రీట్వీట్ చేసిన బండ్ల గణేష్, నెటిజన్లు ఫిదా నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను. @actorsrikanth @prakashraaj 👍 pic.twitter.com/s6zx2MqCFL — BANDLA GANESH. (@ganeshbandla) October 1, 2021 -
ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై రీట్వీట్ చేసిన బండ్ల గణేష్, నెటిజన్లు ఫిదా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి పోటీ పడుత్ను ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు తమ ప్యానల్ సభ్యులతో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక సినీ నటుడు బండ్ల గణేష్ మాత్రం జనరల్ సెక్రటరీ పదవికి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా నామినేషన్ దాఖలు చేసి ప్రచారం మొదలు పెట్టాడు. అయితే ఎన్నికల ప్రచారాన్ని బండ్ల గణేష్ వినూత్నం ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించాడు. చదవండి: MAA Elections 2021: ప్రచారంలో భాగంగా ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్ కాగా ప్రచారంలో భాగంగా ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తమకే ఓటు వేయాలని కోరిన సంగతి తెలిసిందే. తమ ప్యానల్ సభ్యులతో ఉన్న పాంప్లెట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘#MaaElections2021.. మీ ఓటే మీ గొంతు.. ‘మా’ హితమే మా అభిమతం.. మనస్సాక్షిగా ఓటేద్దాం.. ‘మా’ ఆశయాలను గెలిపిద్దాం..’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రకాశ్ రాజ్ చేసిన పోస్ట్ చూసిన బండ్ల ఆయన ట్వీట్‌కు రీట్వీట్ చేస్తూ ‘జనరల్ సెక్రటరీకి వేసే ఓటును మాత్రం బండ్ల గణేశ్‌కు వేయండి’ అంటూ తనదైన శైలిలో ప్రచారం చేశాడు. దీంతో బండ్ల ట్వీట్ వైరల్‌గా మారింది. బండ్ల ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ ‘ప్రచారంలో కూడా తన మార్క్‌ను చూపించాడంటూ’ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బాబూ మోహన్ Only one vote for @ganeshbandla for General secretary 🙏 https://t.co/UDmRIJ9ai6 — BANDLA GANESH. (@ganeshbandla) September 29, 2021 -
‘డేగల బాజ్జీ’గా బండ్ల గణేశ్, టైటిల్ ఖారారు
బండ్ల గణేశ్ హీరోగా ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఈ మూవీకి ‘డేగల బాజ్జీ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. దర్శకుడు హరీశ్ శంకర్ చేతుల మీదుగా ఈ ఫస్టులుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కను బొమ్మపై గాయం, ఒక్క కన్నుతో సీరియస్‌గా చూస్తున్న బండ్ల గణేశ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ ఫస్టులుక్ విడుదల చేసిన హరీశ్ శంకర్, బండ్ల గణేశ్‌తో పాటు, మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. Thank you so much my dear blockbuster @harish2you 🤝 https://t.co/xg4RkctMgN — BANDLA GANESH. (@ganeshbandla) September 17, 2021 -
పోరు మారుతోంది
-
అందరిని కలుపుకోవడానికే ఈ సమావేశం :ప్రకాష్ రాజ్
-
MAA Elections: బండ్ల గణేశ్ మాటలు విని షాకయ్యాను: ప్రకాశ్ రాజ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. రోజుకో ట్విస్ట్‌తో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారం ముమ్మరం చేశారు. అధ్యక్ష బరిలో అభ్యర్థులంతా ఎవరికివారు గెలుపు కోసం విందులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు(ఆదివారం) ప్రకాశ్ రాజ్ ‘మా’ కళాకారలను విందుకు ఆహ్వానించాడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే దీనిని నిర్మాత బండ్ల గణేష్ తీవ్రంగా ఖండించాడు. (చదవండి: ‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ విందు ఆహ్వానంపై బండ్ల గణేశ్ కౌంటర్) ‘దయచేసి ‘మా’ కళాకారులను విందులు, సన్మానాల పేర్లతో వారందరిని ఒక దగ్గరకు చేర్చొద్దు. ఎందుకంటే గత రెండేళ్లలో అందరు కరోనా భయంతో బ్రతుకుతున్నారు. చాలా మంది చావు దాకా వెళ్లొచ్చారు. అందులో నేను ఒకడిని. ఓటు కావాలంటే ఫోన్ చేసి, మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి. అంతేకానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి కళాకారుల ప్రాణాలతో చెలగాటమడోద్దని నా మనవి’ అని పరోక్షంగా ప్రకాశ్ రాజ్ విందును విమర్శించారు. ఇక బండ్ల గణేశ్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చాడు. అసోసియేషన్ ఎన్నికలు అన్నాక అందరితో చర్చలు, క్యాంపెయిన్ చేయడం జరుగుతుందని కామన్ అన్నారు. అందులో భాగంగానే ఈ రోజు కొంతమంది ఆర్టిస్టులను లంచ్‌కు పిలిచానని, వారితో సమస్యల గురించి చర్చించామని తెలిపారు. ఇప్పటి వరకు ‘మా’లో జరిగిన పనులు, మున్ముందు జరగాల్సిన పనుల గురించి దాదాపు 3 గంటల పాటు అందరితో మాట్లాడడం జరిగిందన్నారు. బండ్ల గణేశ్ వ్యాఖ్యలను తాను నిజంగానే షాకయ్యానని తెలిపాడు. గుజరాత్‌తో పాటు మరికొన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడికి అందరు వెళ్తున్నారు.. మరి దాని గురించి బండ్ల గణేశ్ ఏం మాట్లాడుతారు? అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు. ‘మా’ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 19న వస్తుందని, ఆ తర్వాత అన్ని విషయాలు తెలియజేస్తానని తెలిపారు. కరోనా రూల్స్ పాటిస్తూ ఈ సమావేశం జరిగింది: జీవితా రాజశేకర్ కరోనా నియమాలను పాటిస్తూనే ప్రకాశ్ రాజ్ సమావేశం జరగిందన్నారు నటి, దర్శకురాలు జీవితా రాజశేకర్. కరోనా భయంలో ఎన్ని రోజులు ఇంట్లో కూర్చొని ఉంటామని ఆమె ప్రశ్నించారు. కోవిడ్ నియమాలను పాటిస్తూ పెళ్లిళ్లు, సభలు, సమావేశాలు జరుగుతున్నాయని, తాము కూడా అవే నియమాలను పాటిస్తూ విందు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. బండ్ల గణేశ్ ప్రతిసారి తన గురించే మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ విందు ఆహ్వానంపై బండ్ల గణేశ్ కౌంటర్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుంచి రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ఇస్తూ.. ఆయన ప్యానల్లో సభ్యుడుగా ఉన్న నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో బరిలో ఉన్న సభ్యులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. చదవండి: MAA Elections 2021 : మసకబారుతున్న 'మా' ప్రతిష్ట.. ఇందులో భాగంగా తమ ప్యానల్ సభ్యులతో ప్రకాశ్ రాజ్ శనివారం సమావేశయ్యారు. ఇక ఆదివారం ‘మా’ సభ్యులందరిని విందుకు ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ పంపారు. దీంతో బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ ట్వీటర్లో ఓ వీడియో వదిలాడు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ‘మా’ సభ్యులను విందుకు ఆహ్వానించడంపై బండ్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘దయచేసి ‘మా’ కళాకారులనువిందులు, సన్మానాల పేర్లతో వారందరిని ఒక దగ్గరకు చేర్చొద్దు.. ఎందుకంటే గత రెండేళ్లలో అందరు కరోనా భయంతో బ్రతుకుతున్నారు.. చాటా మంది చావు దాకా వెళ్లొచ్చారు. చదవండి: సాయి తేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్, హెల్త్ బులెటిన్ విడుదల అందులో నేను ఒకడిని. ఓటు కావాలంటే ఫోన్ చేసి, మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండి. అంతేకానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి కళాకారుల ప్రాణాలతో చెలగాటమడోద్దని నా మనవి’ అని పేర్కొన్నాడు. ఇక ముందుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవిఎల్ నరసింహారావు ‘మా’ ఎలక్షన్స్‌లో నిలబడుతున్నట్టు ప్రకటించారు. అనూహ్యంగా జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీకి దిగడంతో బండ్ల రంగంలోకి దిగి.. జీవితపై తను పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తా అంటూ బయటకు వచ్చిన సంగతి విదితమే. అయితే ఈ సారి మా ఎన్నికల బరిలో దిగబోతున్న మంచు విష్ణు ఇప్పటికీ తన ప్యానల్ సభ్యులను ప్రకటించకలేదు. It’s my humble request 🙏 pic.twitter.com/fFaXAiEK4g — BANDLA GANESH. (@ganeshbandla) September 12, 2021 -
"మా " సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు పై బండ్ల గణేష్ కౌంటర్
-
నరేశ్ కామెంట్స్ నాకు ఇబ్బందిగా అనిపించాయి: శ్రీకాంత్
Srikanth Comments On Sai Dharam Tej Accident: మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై పలువురు సినీనటీనటులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు నరేశ్ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ తన కొడుకు నవీన్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరగడానికి ముందు సాయి, నవీన్ తమ ఇంటి నుంచే ఇద్దరూ కలిసి బయలుదేరారని, బైక్‌పై వద్దని చెబుదామనుకున్నా కానీ ఆలోపే వెళ్లిపోయారన్నాడు. అంతేగాక తన కుమారుడు, సాయి తరచూ బైక్ రేసులో పాల్గొంటారని చెప్పాడు. దీంతో నరేశ్ వ్యాఖ్యలను తప్పు బడుతూ పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. విషయం పూర్తిగా తెలుసుకోకుండానే ఎందుకు మాట్లాడతారని అంటున్నారు. ఇప్పటికే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఈ సమయంలో రాజకీయాలు చేయొద్దంటూ సోషల్ మీడియాలో వీడియో వదలగా.. తాజా హీరో శ్రీకాంత్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశాడు. చదవండి: నరేశ్ వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ అభ్యంతరం నరేశ్ వ్యాఖ్యలపై శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘సాయి ధరమ్ తేజ్‌కు జరిగిన యాక్సిడెంట్ చాలా చిన్నది. రోడ్డుపై ఇసుక ఉండటం వల్లే అతడి బైక్ స్కిడ్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ రాష్‌గా వెళ్లే వ్యక్తి కాదు. నరేశ్ పెట్టిన వీడియో బైట్ నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది. కుటుంబ సభ్యులంతా టెన్షన్ పడుతుంటారు. ఈ సమయంలో ఆయన చనిపోయిన వాళ్ల గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుండేది. దయ చేసి ఎవరూ ఇలాంటి బైట్స్ పెట్టొద్దని కోరుకుంటున్నా’అని అన్నాడు. కాగా నరేశ్ వేగం విషయంలో యువత కంట్రోల్లో ఉండాలని, కోటా శ్రీనివాస రావు, బాబు మోహన్, కోమటి రెడ్డిల కుమారులు ఇలాగే ప్రమాదాల్లో మరణించి వారి కటుంబాలను శోక సంద్రంలో ముంచారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: Sai Dharam Tej's Accident : సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించిన నరేశ్ -
నరేశ్ వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ అభ్యంతరం
యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నిన్న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెగా మేనల్లుడి ప్రమాద విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు అతని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కాగా, సాయిధరమ్ తేజ్‌ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి ముందు సాయి తమ ఇంటి నుంచే బయలు దేరారని, సాయి ధరమ్ తేజ్ ఆయన అబ్బాయి నవీన్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. చదవండి: మరో విషాదం: ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య అంతేగాక వారు క్రమంగా బైక్ రేసుల్లో పాల్గొంటున్నారంటూ నరేశ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ నరేశ్ వ్యాఖ్యలపై స్పందించారు. ‘ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదు’ అనే క్యాప్షన్‌తో ఆయన తన ట్విటర్లో ఓ వీడియో వదిలారు. అంతేగాక వీడియోలో ‘సాయి ధరమ్ తేజ్ మంచి వ్యక్తి. చక్కగా షూటింగ్‌లు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఆయన గురించి ఏవేవో మాట్లాడటం సరైనది కాదు. ఆయన కోలుకుని పూర్తి ఆరోగ్యం తిరిగి రావాలని దేవుడిని కోరుకోవాలి. అంతేకాని ఏవోవే వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. చదవండి: Sai Dharam Tej's Accident : సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించిన నరేశ్ నరేశ్ గారు మీరు ఇలాంటి సమయంలో ఆయన కోలుకోవాలని పరమేశ్వరుని పార్థించండి. అంతేగాని బైక్ రేసులు చేశాడు అవి ఇవి అని ఎందుకు మాట్లాడటం సర్. ఈ సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు’ అంటూ బండ్ల వ్యాఖ్యానించారు. కాగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ రోజు ఉదయం వైద్యులు వెల్లడించగా ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నారంటూ ఓ వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయనను డాక్టర్ తట్టిలేపుతుండగా సాయి చేయి కదిల్చిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. It’s True .please don’t do politics In this time it’s not correct it’s my humble request🙏 pic.twitter.com/ckFXWwKEE7 — BANDLA GANESH. (@ganeshbandla) September 11, 2021 -
ఇండిపెండెంట్‌గా బరిలోకి బండ్ల.. స్పందించిన జీవిత, ప్రకాశ్‌రాజ్
-
MAA Elections 2021: బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై స్పందించిన జీవిత
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇన్నాళ్లు ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ఇస్తూ.. ఆయన ప్యానల్లో సభ్యుడుగా ఉన్న బండ్ల గణేశ్ యూటర్న్ తీసుకుసున్నాడు. తాను ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నానని, ప్యానల్ అధికార ప్రతినిధిగా కొనసాగలేనని స్పష్టం చేశాడు. అంతేకాదు ప్రకాశ్‌రాజ్ ప్యానల్లోకి జీవితా రాజశేఖర్ ఎంట్రీ ఇవ్వడం తనకి నచ్చలేదని.. అందుకే ఆమెకు వ్యతిరేకంగా జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నానంటూ వెల్లడించాడు. (చదవండి: జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తా..నేనెంటో చూపిస్తా: బండ్ల గణేష్) బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలపై జీవిత స్పందించారు. తాజాగా ఆమె ఓ చానల్‌తో మాట్లాడుతూ..బండ్ల గణేశ్‌తో తనకెలాంటి విభేదాలు లేవని అన్నారు. . ‘మా’లో సభ్యులుగా ఉన్న వారు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆమె మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను గెలిచినా లేదా ఓడినా ‘మా’ అభివృద్దికి పనిచేసి తీరతానన్నారు. బండ్ల గణేశ్ కూడా ‘మా’అభివృద్ది కోసం పోటీ చేస్తున్నట్టు భావిస్తున్నానని, అంతేకాని తనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదన్నారు. కాగా, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవికి జీవిత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తా..నేనెంటో చూపిస్తా: బండ్ల గణేష్
-
MAA Elections 2021: ప్రకాష్‌రాజ్‌కు షాకిచ్చిన బండ్ల గణేష్
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నానని, ప్యానల్ అధికార ప్రతినిధిగా కొనసాగలేనని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్లోకి జీవిత రావడాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు. త్వరలో జరిగే 'మా' ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని బండ్ల గణేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా 'మా' ఎన్నికలకు సంబంధించి ఆయన చేసిన వరుస ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మాట తప్పను ... మడమ తిప్పను నాది ఒకటే మాట -ఒకటే బాట నమ్మడం -నమ్మినవారికోసం బతకడం నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను - నేను ఎవరిమాట వినను త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను - పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను……. — BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021 మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు-నన్ను పోటీ చెయ్ అంటోంది -అందుకే ఈ పోటీ అందరికీ అవకాశం ఇచ్చారు ఒకేఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా ... — BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021 నా పరిపాలన ఎంటో తెలియచేస్త వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం దానికోసం పోరాడతా... వారి సొంత ఇంటి కల నిజం చేస్తా ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు... ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు… — BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021 గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు.. ఇక అలా జరగొద్దు అందరి ఆశీస్సులు కావాలి -మా ను బలో పేతం చేద్దాం ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ళ కల నిజం చేద్దాం అదే మా నిజమైన అభివృద్ది... చిహ్నం - ఇట్లు మీ బండ్ల గణేష్ — BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021 -
అమ్మతోడు నాకు ఆ కేసుతో సంబంధం లేదు : బండ్ల గణేశ్
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వేగవంతం చేశారు. మంగళవారం ఉదయం దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణకు హాజరయ్యాడు. దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు ఆయన ఈడీ కార్యాలయంలోనే ఉన్నాడు. అయితే కేవలం మూడు గంటలు మాత్రమే అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. బ్యాంక్ లావాదేవీల పైనే దృష్టి సారించిన ఈడీ.. విదేశీ లావాదేవీలపై ఆరా తీశారు. పూరీకి సంబంధించిన మూడు బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్స్ను పరిశీలించారు. ఇవన్నీ వాంగ్మూలం రూపంలో నమోదు చేసుకున్న ఈడీ అధికారులు.. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని పూరీకి చెప్పి పంపారు. (చదవండి: టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఆమూడు ఖాతాలపై ఈడీ ఆరా) ఇదిలా ఉంటే.. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయానికి వెళ్లడంతో ఆయనపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. పూరీ విచారణలో వెలుగులోకి వచి్చన వివరాల ఆధారంగా ఈడీ అధికారులు బండ్ల గణేశ్‌కు సమన్లు జారీ చేశారని వార్తలు వినిపించాయి. అయితే ‘అమ్మతోడు.. నాకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. కనీసం వక్కపొడి కూడా వేసుకోని నన్ను ఈడీ వాళ్లు ఎందుకు పిలుస్తారు. పూరీగారు ఇక్కడికి ఉదయం వచ్చారు. ఇంతసేపు కావడంతో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి నా అంతట నేనే వచ్చా..’ అని గణేష్ వివరణ ఇచ్చారు. -
'ఎన్టీఆర్‌తో గొడవలు'..స్పందించిన బండ్ల గణేష్
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారాడు. బ్లాక్ బస్టర్ సినిమాలతో సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి 'బాద్ షా', 'టెంపర్' వంటి చిత్రాలను నిర్మించాడు. అయితే టెంపర్ మూవీ అనంతరం రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్‌కి, బండ్ల గణేష్‌తో గొడవ జరిగినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్యా దూరం పెరిగిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అన్నదమ్ముల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. మిస్ కమ్యునికేషన్ వల్ల అలా జరిగింది. దాన్ని గొడవ అనలేం. ఎన్టీఆర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు అని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. కాగా టెంపర్ మూవీ అనంతరం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన బండ్ల గణేష్ మళ్లీ నిర్మాతగా ట్రాక్‌లోకి వచ్చాడు. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన పూరి జగన్నాథ్ Varudu Kaavalenu Teaser: అమ్మా.. వీళ్లెవరు నాకు కనెక్ట్ అవ్వట్లేదే -
పవన్ ఫ్యాన్స్‌కు బండ్ల గణేశ్ గుడ్ న్యూస్.. థియేటర్లలో మళ్లీ ‘గబ్బర్ సింగ్’
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2011 మే 11న విడుదలైన ఈ చిత్రం.. టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. దబాంగ్ సినిమాకు రిమేక్ అయినా.. కానీ పవన్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేశ్‌కు కూడా గుర్తింపు అందుకున్నాడు. (చదవండి: హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూతురు!) కాగా, ఇప్పుడు ఆ సినిమాను మళ్ళీ విడుదల చేయనున్నారట. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా థియేటర్లలో మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా విడుదల చేయనున్నారట. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించిన బండ్ల గణేశ్.. ‘సెప్టెంబర్ 2న బాస్ బర్త్ డే స్పెషల్ గా గబ్బర్ సింగ్ సినిమా చూడండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100 షోలు వేస్తున్నాను, మనం మన బాస్ పుట్టినరోజు థియేటర్లో జరుపుకుందాం, జై పవర్ స్టార్, జై దేవర ’అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. -
ఒక్క రోజు లేట్ అయితే చచ్చిపోయేవాడ్ని.. చిరంజీవి కాపాడాడు : బండ్ల గణేశ్
బండ్ల గణేశ్ మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అని అందరికి తెలిసిందే. ఏ చిన్న సందర్భం దొరికినా చాలు మెగా హీరోలను ఓ రేంజ్లో పొగిడేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటాడు ఈ కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్. ఇక పవన్ కల్యాణ్ విషయంలో అది కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తనకు చిరంజీవి చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తాను రెండోసారి కరోనా బారిన పడిన సమయంలో ఆరోగ్యం బాగా క్షీణించిందని, ఒక్క రోజు ఆలస్యమైనా ప్రాణాలు పోయేవని, అలాంటి సమయంలో చిరంజీవి తనకు అండగా నిలిచారని బండ్ల గణేశ్ అన్నారు. (చదవండి: చిరు సాయం లేకుంటే హేమ చనిపోయేది.. రాజా రవీంద్ర షాకింగ్ కామెంట్) ‘రెండోసారి కరోనా బారిన పడినప్పుడు నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఒక్క రోజు లేట్ అయితే చనిపోయేవాడిని. ఆ సమయంలో ఆస్పత్రిలో బెడ్ కూడా దొరకని పరిస్థితి. నాతో పాటు మా కుటుంబం అంతా కరోనా బారిన పడింది. మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేద్దామనుకున్నా. కానీ అప్పటికే ఆయన కూడా కరోనాతో ఇబ్బంది పడుతున్నాడని తెలిసి చేయలేకపోయాను. ఎవరికి చేయాలో తెలియక చివరకు చిరంజీవికి ఫోన్ చేశా. ఫస్ట్ రింగ్‌కే ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు గణేశ్ అన్నాడు. నోట మాట కూడా రాని ఆ పరిస్థితుల్లో చిరంజీవి సాయపడ్డారు. చిరంజీవి సాయంతోనే నేను ఈ రోజు బతికి ఉన్నా. లేదంటే ఎప్పుడో నేను చనిపోయేవాడ్ని. పవన్ కల్యాణ్ నాకు జీవితాన్ని ఇస్తే.. చిరంజీవి నాకు ప్రాణం పోశారు. ఆయన రుణం తీర్చుకోలేను. అందరికి ముందు ఆయనకు పాదాభివందనం చేస్తున్నాను. జీవితాంతం ఆయనకు నేను రుణపడి ఉంటాను’ అంటూ బండ్ల గణేశ్ ఎమోషన్ అయ్యాడు. (చదవండి: బుల్లెట్ బండి పాట: ఎవరీ మోహన భోగరాజు?) -
అవార్డు విన్నింగ్ రీమేక్‌లో బండ్ల గణేశ్ హీరో!
Bandla Ganesh: క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా వెండితెరపై నవ్వులు పూయించిన బండ్ల గణేశ్ తర్వాత పలు సినిమాలు నిర్మించి నిర్మాతగా సెటిలైపోయాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తూ ప్రేక్షకులకు దర్శనమిస్తున్న ఆయన ఇటీవల మళ్లీ నటుడుగా తన కెరీర్ ప్రారంభించాడు. ఈ క్రమంలో తాజాగా బండ్ల హీరోగా మారబోతున్నాడు. తమిళంలో ఆర్.పార్తిబన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి, నటించిన ‘ఒత్త సెరప్పు సైజ్ 7’ మూవీ రీమేక్‌లో బండ్ల గణేశ్ హీరోగా నటిస్తున్నాడు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో స్వాతీ చంద్ర నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. హీరో పాత్ర కోసం బండ్ల గణేష్ ప్రత్యకంగా మేకోవర్ అవుతున్నాడు. తమిళ హిట్, జాతీయ అవార్డులు సాధించిన ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’కు ఇది తెలుగు రీమేక్. చదవండి: నాకు చేతబడి చేశారు, 13 ఏళ్లు నరకం చూశా: నటుడు -
‘మా’ కు బిల్డింగ్ అవసరం లేదు.. బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడు లేనంతగా ఈ సారి అధ్యక్ష పదవీకి పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. వీరిలో ప్రకాశ్ రాజ్ అయితే ఒక అడుగు ముందుకేసి ‘సినిమా బిడ్డలు’పేరుతో తన ప్యానల్‌ను కూడా ప్రకటించాడు. (చదవండి: మనసు మార్చుకున్న బండ్ల గణేష్..ఆనందంలో ఫ్యాన్స్) ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ముందు నుంచి మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా’ఎన్నికలు, భవనం నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ‘మా’కు శాశ్వత భవనం అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిఒక్కరూ ‘మా’కు శాశ్వత భవనం నిర్మించడమే ప్రధాన అజెండాగా బరిలోకి దిగుతున్నారు. నిజం చెప్పాలంటే నేను ‘మా’ బిల్డింగ్‌కు వ్యతిరేకిని. దానికంటే ముందు చేయాల్సిన పనులో ఎన్నో ఉన్నాయి. ‘మా’లో ఉన్న 900 మందిలో చాలా వరకు దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్నారు. సరైన ఆర్థిక స్థోమతలేక ప్రతి నెలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం.. బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి, ఉచితంగా ఇస్తే బాగుంటుంది. ఇలాంటి పని కోసం మన హీరోలు కూడా ముందుకు వస్తారు. ప్రస్తుతం ‘మా’కి బిల్డింగ్ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు. సినిమా షూటింగ్స్ నిలిచిపోవు. సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోరు’అని బండ్ల గణేశ్ అన్నారు. (చదవండి : ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ) -
మనసు మార్చుకున్న బండ్ల గణేష్..ఆనందంలో ఫ్యాన్స్
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్‌గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ఒక సెన్సేషన్. ఆయన పెట్టే పోస్టులు ఎప్పుడూ కాంట్రవర్సరీలు అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నానంటూ బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నా’అని బండ్ల చేసిన ట్వీట్ ఆయన అభిమానులకు, ఫాలోవర్లకు షాకిచ్చింది. అయితే తాజాగా బండ్ల గణేష్ మనసు మార్చుకున్నారు. ఓ జర్నలిస్టు సూచన మేరకు ట్విటర్లో తిరిగి కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బండ్ల నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్న ఆయన అభిమానులు వెల్కం బండ్లన్నా అంటూ రీట్వీట్లు చేస్తున్నారు. పెద్దలు జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు గారు ఈరోజు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని నాకు సలహా ఇవ్వటం వారు ఇచ్చిన సలహాను గౌరవంగా భావించి మీ అందరి ముందు కి మళ్ళీ వస్తున్నాను 🙏 — BANDLA GANESH. (@ganeshbandla) August 17, 2021 Welcome anna 🥁🥁🤩🤩 pic.twitter.com/8SRpyfVU42 — Shaik Irfan (@ShaikIr79901454) August 17, 2021 చదవండి : కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను: లేడీ కమెడియన్ ముంబైకి పయనమైన ప్రభాస్ -
త్వరలోనే గుడ్‌బై చెప్పేస్తా.. బండ్ల గణేశ్ సంచలన నిర్ణయం
బండ్ల గణేశ్.. ఎప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా మాట్లాడతాడో అంచనా వేయడం కూడా కష్టమే. ఆయన మాటలతో పాటు ఎదుగుదల కూడా అందరికి ఆశ్చర్య కలిగించింది. కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల.. ఉన్నట్లుండి నిర్మాత అయ్యాడు. అంతేకాదు ప్రొడ్యూసర్‌గా స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. ఇక ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి.. అక్కడా సెన్సేషనల్ కామెంట్స్ చేసి, తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. ఇక ఈ కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్తుంటాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. చాలా సార్లు ఆయన చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. అయితే హఠాత్తుగా బండ్ల గణేశ్ ట్వీటర్కు గుడ్‌బై చెప్పబోతున్నానని ప్రకటించి షాకిచ్చాడు. . త్వరలోనే ట్విటర్ గుడ్ బై చెప్పేస్తా. నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నా’అని బండ్ల ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అతని అభిమానులు, ఫాలోవర్స్ షాక్‌కు గురయ్యారు. ఎందుకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏమైందో చెప్పండి’అంటూప్రశ్నలు వేస్తున్నారు. మరి బండ్ల గణేశ్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడానకి బలమైన కారణం ఏంటో తెలియాలంటే.. ఆయన చెప్పేవరకు వేచి చూడాల్సిందే. త్వరలో కి ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పేస్తా No controversies. I don’t want any controversies in my life 🙏 — BANDLA GANESH. (@ganeshbandla) August 14, 2021 -
చిరంజీవిపై బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు, ట్వీట్ వైరల్!
నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మెగాస్టార్ చిరంజీవిపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా బండ్ల మెగా అభిమాని అని అందరికి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అంటే బండ్లకు బాగా ఇష్టం. ఇటీవల పవన్‌కు దేవర అనే పేరును కూడా పెట్టుకున్నాడు. అలా ఏ వేడుక అయినా స్టేజ్ ఎక్కాడంటే చాలు సమయం సందర్భంగా లేకుండా దేవర, దేవర అంటూ పవన్ భజన చేస్తుంటాడు. కానీ ఈ సారి మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానాన్ని కురిపించాడు. చిరు ఫొటోను షేర్ చేస్తూ.. ‘మా దేవరకి అన్న.. అందరికి నేను అనే నమ్మకం. మనిషి అంటే ఇలా ఉండాలి.. అని ప్రజలకు చెప్పిన మహోన్నత వ్యక్తి మా పెద్దన్న మెగాస్టార్’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశాడు. అయితే ఈ ట్వీట్‌ను బండ్ల ఏ సందర్భంగా చేశాడన్నది మాత్రం స్పష్టం చేయలేదు. అయితే బండ్ల గణేశ్ ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా సామాజిక మాధ్యామాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా.. పేద ప్రజలకు సాయం అందించేందుకు వాడుతున్నాడు. ట్విటర్ ద్వారా తనను అభ్యర్థిస్తే చాలు... వెంటనే స్పందించి, తోచిన సాయం అందిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్ తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుందని, వైద్యానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేస్తూ, వీలైన సాయం చేయాల్సిందిగా ట్వీటర్ ద్వారా అందరినీ అభ్యర్థించాడు. దీనిపై బండ్ల స్పందిస్తూ.. `మీ గూగుల్ పే నంబర్ ఇవ్వండి. మనం ఆ దేవుడు ఆశీస్సులతో మీ అమ్మ గారిని కాపాడేందుకు ప్రయత్నిద్దామ`ని ట్వీట్ చేశాడు. మా దేవర కి అన్న అందరికీ నేను అనే నమ్మకం మనిషి అంటే ఇలా ఉండాలి అని ప్రజలకు చెప్పిన మహోన్నత వ్యక్తి మా పెద్దన్న 🙏మెగాస్టార్ @KChiruTweets pic.twitter.com/sGhU18D0zQ — BANDLA GANESH. (@ganeshbandla) August 10, 2021 -
అరెరె అచ్చం బండ్లన్నలాగే ఉన్నాడే.. జూనియర్ బండ్ల ఫోటో వైరల్
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్‌గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. ఆయన పెట్టే పోస్టులు ప్రతిసారి నెట్టింట వైరల్ అవుతుంటాయి. అందుకు కారణం యూత్‌లో బండ్లన్న ఉన్న క్రేజీయే. తాజాగా బండ్ల గణేశ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటో మరెవరిదో కాదు.. మన బండ్లన్న పెద్ద కుమారుడు హితేష్ నాగన్ బండ్లది. అచ్చ అచ్చుగుద్దినట్లు బండ్ల గణేశ్‌లా ఉన్న ఈ ఫోటోని ఆయన షేర్ చేస్తూ.. ‘ఇతను నా పెద్ద కొడుకు హితేష్ నాగన్ బండ్ల’.. అంటూ నెటిజన్స్‌కి పరిచయం చేశాడు. దీంతో ఈ ఫొటో వైరల్ అవుతోంది. బండ్ల గణేశ్ కుర్రాడిగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలాగే ఇది ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు.‘అచ్చు మీ జిరాక్స్‌లా ఉన్నాడు. డిట్టో దిగిపోయాడు. హీరోని చేస్తారా..?’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారా’ అనే ప్రశ్నకి ‘అంతా దేవుడి దయ’ అంటూ రిప్లై ఇచ్చారు బండ్ల గణేశ్. My elder son Hitesh Nagan bandla 🙌🏻 pic.twitter.com/RV3CvznC4F — BANDLA GANESH. (@ganeshbandla) August 2, 2021 -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న బండ్ల గణేశ్
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్‌గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. అయితే సోషల్ మీడియాని ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా... పేద ప్రజలకు సాయం అందించేందుకు వాడుతుంటాడు. ట్విటర్ ద్వారా తనను అభ్యర్థిస్తే చాలు... వెంటనే స్పందించి, తోచిన సాయం అందిస్తుంటాడు. అలా ఇప్పటికే చాలా మందికి సాయం అందించిన బండ్లన్న.. తాజాగా మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ నెటిజన్ అభ్యర్థన గమనించిన ఆయన స్వచ్ఛందంగా సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఓ నెటిజన్ తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుందని, వైద్యానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేస్తూ, వీలైన సాయం చేయాల్సిందిగా ట్వీటర్ ద్వారా అందరినీ అభ్యర్థించాడు. దీనిపై బండ్ల గణేశ్ స్పందిస్తూ.. `మీ గూగుల్ పే నంబర్ ఇవ్వండి. మనం ఆ దేవుడు ఆశీస్సులతో మీ అమ్మ గారిని కాపాడేందుకు ప్రయత్నిద్దామ`ని తెలిపారు. దీంతో బండ్ల గణేశ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
బండ్ల గణేష్ ఔదార్యం..గూగుల్ పే నెంబర్ అడిగి
నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఉన్నట్లుండి నిర్మాతగా మారి, ఆ వెంటనే స్టార్ హీరోలతో సినిమాలు తీసి, సూపర్ హిట్లు అందుకుని ఎంతో మందిని ఆశ్చర్యపరిచాడు. అయితే సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే బండ్లకు పాపులారిటీ ఎక్కువ. తాజాగా ఓ వ్యక్తి సహాయం కోరుతూ బండ్లను సంప్రదించడం, ఆయన వెంటనే ఆర్థకసహాయం చేయడం చకచకా జరిగిపోయాయి. వివరాల్లోకి వెళితే.. 'నమస్కారం అన్నా. మా అన్నయ్య బండ్ల లింగయ్యకు ఆటో ప్రమాదం జరిగింది. ఆపరేషన్ చేసి 48 కుట్లు వేశారు. 6నెలల వరకు డాక్టర్లు ఇంట్లోనే ఉండమన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరూ స్పందించడం లేదు. మీరైనా కొంచెం ఆదుకోండా గణేష్ అన్నా. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు' అంటూ ఓ వ్యక్తి బండ్ల గణేష్‌ను సంప్రదించాడు. ఈ ట్వీట్‌కు వెంటనే స్పందించిన బండ్ల గణేష్.. అతనికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. గూగుల్ పే నెంబర్ పంపించమని సదరు వ్యక్తిని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సాయం కోరిన వెంటనే బండ్ల గణేష్ ముందుకు రావడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సాయం కోరిన వ్యక్తి ఇంటిపేరు కూడా బండ్ల ఉండటం విశేషం. Please send me BANDLA Lingaiah google pay number https://t.co/mZcRqmymkP — BANDLA GANESH. (@ganeshbandla) July 14, 2021