
నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఉన్నట్లుండి నిర్మాతగా మారి, ఆ వెంటనే స్టార్ హీరోలతో సినిమాలు తీసి, సూపర్ హిట్లు అందుకుని ఎంతో మందిని ఆశ్చర్యపరిచాడు. అయితే సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే బండ్లకు పాపులారిటీ ఎక్కువ. తాజాగా ఓ వ్యక్తి సహాయం కోరుతూ బండ్లను సంప్రదించడం, ఆయన వెంటనే ఆర్థకసహాయం చేయడం చకచకా జరిగిపోయాయి.
వివరాల్లోకి వెళితే.. 'నమస్కారం అన్నా. మా అన్నయ్య బండ్ల లింగయ్యకు ఆటో ప్రమాదం జరిగింది. ఆపరేషన్ చేసి 48 కుట్లు వేశారు. 6నెలల వరకు డాక్టర్లు ఇంట్లోనే ఉండమన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరూ స్పందించడం లేదు. మీరైనా కొంచెం ఆదుకోండా గణేష్ అన్నా. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు' అంటూ ఓ వ్యక్తి బండ్ల గణేష్‌ను సంప్రదించాడు. ఈ ట్వీట్‌కు వెంటనే స్పందించిన బండ్ల గణేష్.. అతనికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.
గూగుల్ పే నెంబర్ పంపించమని సదరు వ్యక్తిని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సాయం కోరిన వెంటనే బండ్ల గణేష్ ముందుకు రావడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సాయం కోరిన వ్యక్తి ఇంటిపేరు కూడా బండ్ల ఉండటం విశేషం.
Please send me BANDLA Lingaiah google pay number https://t.co/mZcRqmymkP
— BANDLA GANESH. (@ganeshbandla) July 14, 2021
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment