Bandla Ganesh Is Back To Twitter Again - Sakshi
Sakshi News home page

Bandla Ganesh : 'ఆయన చెప్పినందుకే మళ్లీ వస్తున్నా'

Published Wed, Aug 18 2021 11:54 AM | Last Updated on Wed, Aug 18 2021 3:39 PM

Bandla Ganesh Is Back To Twitter Again - Sakshi

బండ్ల గణేశ్‌.. టాలీవుడ్‌ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్‌గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.  సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బం‍డ్ల గణేష్‌ ఒక సెన్సేషన్‌. ఆయన పెట్టే పోస్టులు ఎప్పుడూ కాంట్రవర్సరీలు అవుతూనే ఉంటాయి.

ఈ నేపథ్యంలో త్వరలోనే ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నానంటూ బండ్ల గణేష్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నా’అని బండ్ల చేసిన ట్వీట్‌ ఆయన అభిమానులకు, ఫాలోవర్లకు షాకిచ్చింది. అయితే తాజాగా బండ్ల గణేష్‌ మనసు మార్చుకున్నారు. ఓ జర్నలిస్టు సూచన మేరకు ట్విటర్‌లో తిరిగి కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. బండ్ల నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్న ఆయన అభిమానులు  వెల్‌కం బండ్లన్నా అంటూ రీట్వీట్లు చేస్తున్నారు.


చదవండి : కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను: లేడీ కమెడియన్‌
ముంబైకి పయనమైన ప్రభాస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement