
కమెడియన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన బండ్ల గణేష్.. ఆ తర్వాత నిర్మాతగా మారాడు. బ్లాక్ బస్టర్ సినిమాలు సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు. అయితే టెంపర్ మూవీ అనంతరం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన బండ్ల గణేష్ మళ్లీ నిర్మాతగా ట్రాక్‌లోకి వచ్చాడు. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఇక పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేశ్ ఎంతటి వీరాభిమానో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఏ కార్యక్రమంలో అయినా ఆయన మాట్లాడేటప్పుడు తప్పనిసరి పవన్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయన తన దేవుడంటూ కొనియాడుతుంటాడు.
ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫ్యాన్స్‌లోనూ అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇది వరకే పవన్ నటించిన గబ్బర్‌సింగ్, తీన్మార్ సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో మరోసారి వస్తున్న నేపథ్యంలో.. బండ్ల గణేష్‌కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు హిట్ ఇవ్వకపోతే బండ్ల గణేష్‌పై పవన్ కత్తి పెట్టినట్లు కాటమరాయుడులోని ఓ ఫోటోను ఎడిట్ చేశారు.
హిట్ ఇవ్వకపోతే రిజల్ట్ ఇలానే ఉంటుందంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనికి బండ్ల గణేశ్.. ఓకే అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
— BANDLA GANESH. (@ganeshbandla) July 11, 2021