పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాకు అవకాశమిచ్చినా తనను గుర్తుకు పెట్టుకోలేదని కొద్ది రోజుల కిత్రం దర్శకుడు హరీష్ శంకర్‌పై విమర్శలకు దిగిన నిర్మాత బండ్ల గణేష్ ఎట్టకేలకు మెత్తబడ్డారు. ఈ చిన్న జీవితంలో పోట్లాటలు, శత్రుత్వాలు అవసరం లేదని ట్విటర్‌లో పేర్కొన్నారు. హరీష్ తనకు కాల్ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తనకు కాల్ చేసి మట్లాడినందుకు ఆయనకు బండ్ల గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ఇద్దరు దర్శకనిర్మాతల కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘గబ్బర్‌సింగ్’ విడుదలై 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ఆ సినిమాకు పని చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్తూ హరీష్ శంకర్ ట్విటర్‌లో ఓ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి: గణేష్-హరీష్‌ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు)
అయితే, అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు. నిజానికి ఆయన మరిచిపోయారో లేక కావాలనే చెప్పలేదో తెలియదు కాని ఈ విషయంపై బండ్ల గణేష్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ‘అది ఆయన సంస్కారం. అంతకన్నా ఏం చెప్పను. ఆయన రీమేక్‌లు మాత్రమే చేయగలరు. స్ట్రయిట్ సినిమా తీసి హిట్ చేసి చూపించమనండి. ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. హరీష్ శంకర్ అనే వ్యక్తికి పవన్ కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించింది నేను. ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న ఓ నిర్మాత ఆ సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్ లో వుంటే పిలిచి అవకాశం వచ్చేలా చేసింది నేను. గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందులో పవన్ సలహాలు చాలా ఉన్నాయి’అని బండ్ల గణేష్ గతంలో ఏకి పారేశాడు.
(పొరపాటు జరిగింది.. క్షమించడంటూ బండ్ల ట్వీట్)
@harish2you thank you so much brother for your concern. Felt really happy after your call , this is a small life no fights no enemies.🙏
— BANDLA GANESH. (@ganeshbandla) July 26, 2020
Comments
Please login to add a commentAdd a comment