
Bandla Ganesh Clarity On Audio Leak : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన సినిమా ఫంక్షన్లకి బండ్ల గణేష్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే రీసెంట్‌గా పవన్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తనను రాకుండా త్రివిక్రమ్ అడ్డకుంటున్నారంటూ బండ్ల గణేష్ మాట్లాడిన ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో త్రివిక్రమ్‌ని దూషిస్తూ బండ్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి.
అయితే తాజాగా ఈ ఆడియో క్లిప్‌పై స్పందించిన బండ్ల గణేష్.. అది తన గొంతు కాదని, ఎవరో కావాలనే ఇలా క్రియేట్ చేశారంటూ కొట్టి పారేశారు. అయితే దీనిపై అఫీషియల్‌గా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు మాత్రం ఆయన ఇష్టపడకపోవడం గమనార్హం. కాగా పవన్ కల్యాణ్, రానా మల్టీస్టారర్లుగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఈనెల 25న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment