Bheemla Nayak Movie
-
చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన
'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు.. చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీటి వల్ల తనకు అన్యాయం జరిగిందని పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశాడు. షూటింగ్ జరిగిన తర్వాత కూడా తన సీన్స్ ఎందుకు తీసేశారో అర్థం కాలేదని అన్నాడు. ఈ విషయంలో చాలా బాధపడ్డానని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిపోయాయి.(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)వైజాగ్‌కి చెందిన కిశోర్ కుమార్.. 'కేరాఫ్ కంచరపాలెం'తో నటుడిగా మారాడు. ఈ సినిమాలో వినాయకుడి బొమ్మలు చేసే మూగవాడిగా నటించింది ఇతడే. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే చిరు 'ఆచార్య', పవన్ 'భీమ్లా నాయక్' చిత్రాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'ఆచార్య సినిమా కోసం 20 రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. బాగా చేశానని చిరంజీవి కూడా మెచ్చుకున్నారు. భుజంపై చేయివేసి మరీ మాట్లాడేవారు. తీరా మూవీ విడుదలయ్యాక నా సీన్స్ కనిపించలేదు. ఎడిటింగ్‌లో తీసేశారు. 'భీమ్లా నాయక్' కోసం ఓ రోజు షూటింగ్‌కి వెళ్లాను. మధ్య గ్యాప్ వచ్చింది. తర్వాత నా బదులు వేరే నటుడిని ఆ పాత్ర కోసం తీసుకున్నారు. ఎందుకలా చేశారో అర్థం కాలేదు. ఈ విషయాల్లో చాలా బాధపడ్డాను' అని నటుడు కిశోర్ కుమార్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పవన్ విద్యార్హతపై పూటకో మాట.. పిఠాపురం నామినేషన్లో తేటతెల్లం) -
కారులో అనుమానాస్పదంగా ప్రముఖ నటుడి మృతదేహాం
మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు వినోద్ థామస్ (47) మరణించారు. ఆయన అనుమానాస్పదంగా మరణించినట్లు తెలుస్తోంది. మలయాళంలో పాపులర్ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్'లో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించాడు. ఇదే సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ పేరుతో రీమేక్ చేశాడు. గత రాత్రి (నవంబర్ 18) కేరళలోని కొట్టాయం జిల్లా బంబడి ప్రాంతంలోని ఓ హోటల్ పార్కింగ్ వద్ద చాలా సమయం నుంచి అనుమానాస్పదంగా ఒక కారు ఆగి ఉంది. దానిని గమనించిన హోటల్ సిబ్బంది. కారు వద్దకు వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అందులో మృత దేహం కనిపించింది. వెంటనే డోర్ క్లోజ్ చేసి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వారు కారును పరిశీలించి ఆ మృతదేహాన్ని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అతడు మలయాళ నటుడు వినోద్ థామస్ అని తేలింది. ‘అయ్యప్పనుమ్ కోషి’, ‘నాతోలి ఏరు ఒకిత మీనాళ్ల’ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించడం గమనార్హం. ఈ సంఘటనతో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.వినోద్ థామస్‌ను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అలాగే వినోద్ థామస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుటుంబసభ్యులకు అప్పగించారు.ఈ కేసులో వినోద్ థామస్ మృతిపై పోలీసులు పలు కోణాల్లో ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. -
'భీమ్లా నాయక్' నటి విడాకులు? పెళ్లయి ఏడాది తిరగకుండానే!
ఒకప్పుడు ఏమో ఇప్పుడు పెళ్లి-విడాకుల వ్యవహారం మరీ సాధారణమైపోయింది. సామాన్యుల సంగత కాస్త పక్కనబెడితే నటీనటులు చాలామంది గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. చప్పుడు చేయకుండా విడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో మెగాడాటర్ నిహారిక విషయంలో అలానే జరిగింది. ఇప్పుడు మరో తెలుగు నటి కూడా విడాకులు తీసుకోనుందా అనే సందేహాం వస్తోంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: ఊహించని సర్ప్రైజ్.. హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు!) షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనిక రెడ్డి. 'సూర్య' వెబ్ సిరీస్‌తో బాగా పాపులర్ అయింది. 'భీమ్లా నాయక్'తోపాటు పలు సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేసింది. అలానే కొన్నాళ్లుగా సందీప్ అనే వ్యక్తితో ఈమె రిలేషన్లో ఉంది. అలా మనసులు కలిసిన తర్వాత గతేడాది డిసెంబరులో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే తన పెళ్లి టైంలో మౌనిక చాలా ఎగ్జైట్ అవుతున్న వీడియో అప్పట్లో చాలా పాపులర్ అయింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో తాజాగా ఈమె.. పెళ్లి ఫొటోలు అన్నింటినీ ఇన్ స్టాలో డిలీట్ చేసింది. అలానే భర్త సందీప్ ని కూడా అన్ ఫాలో చేసింది. దీంతో వీళ్లిద్దరి బంధం బ్రేక్ అయిందా అనే రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి దీని గురించి ఎలా ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 షోలోకి ప్రభాస్ హీరోయిన్!) View this post on Instagram A post shared by Mounika Reddy (@monie_kaaa) -
స్టార్ హీరోతో నిత్యామీనన్ పెళ్లి.!
బాలనటిగానే సినీ రంగప్రవేశం చేసిన నిత్యామీనన్ హీరోయిన్గా మాత్రం 2006లో కథానాయకిగా కన్నడ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా నిత్యామీనన్‌కు మంచి గుర్తింపు ఉంది. చిత్రపరిశ్రమలో హీరోయిన్గా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. కానీ ఇప్పుడు ఆమెకు అంతగా సినిమా అవకాశాలు లేవనే చెప్పవచ్చు. దీంతో ఇక పెళ్లి చేసుకోమని తన కుటుంబ సభ్యులు తెలుపుతున్నారట. (ఇదీ చదవండి; బిగ్ బాస్‌లోకి ఆ స్టార్ హీరో, హీరోయిన్.. ఆఖరి క్షణంలో అదిరిపోయే ట్విస్ట్) అంతేకాకుండా తనకు 35 ఏళ్లు వచ్చాయని ఇక పెళ్లి చేసుకోవడం మంచిదని వారు సలహా ఇచ్చారట. దీంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఓ మలయాళ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుందని శాండిల్‌వుడ్‌లో ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా నిత్యామీనన్ పెళ్లి విషయంపై చాలా వార్తలే వచ్చాయి. కానీ వాటిని ఆమె వెంటనే కొట్టిపారేసేది కూడా. కానీ ఈసారి మలయాళీ ఇండస్ట్రీలో మాత్రం నిత్యామీనన్ పెళ్లి వార్త బాగానే వైరల్ అవుతుంది. అంతే కాకుండా అక్కడి సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఇది నిజమేనని తెలుపుతున్నారట. (ఇదీ చదవండి: అనుష్కతో హగ్స్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్) ఆమె పెళ్లి మాత్రం ప్రముఖ హీరోతోనే జరుగుతుందంటూనే పేరు మాత్రం వారు రివీల్ చేయడం లేదట. గతంలో తన పెళ్లి విషయంపై ఎక్కడైనా చిన్న కామెంట్ వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యే నిత్యా ఈసారి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో తన పెళ్లి వార్త నిజమేనని, త్వరలో ఆమె అధికారికంగా ప్రకటిస్తారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా నిత్యామీనన్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో మరోసారి భారీగా ట్రెండ్ అవుతుంది. -
‘భీమ్లా నాయక్’ఫేం మౌనికా రెడ్డి గుర్తుందా? ఇప్పుడేం చేస్తుంది?
వెండితెరపై నటించాలని చాలా మందికి ఉండొచ్చు. కానీ, ఆ అవకాశం అందరికీ రాదు. కొంత మందికి అనుకోకుండానే రావచ్చు. కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్నవాళ్లని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో వెండితెర చాన్స్‌లూ కొట్టేస్తున్నారు. అలా వచ్చిన నటే మౌనికా రెడ్డి.. ► మౌనికారెడ్డి వైజాగ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా పని చేస్తూనే నటనపై ఉన్న మక్కువతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. ► ఓవైపు సిల్వర్ స్క్రీన్ చాన్స్ కోసం వేచి చూస్తూనే ఇంకోవైపు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించడం మొదలు పెట్టింది . ‘అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు’ అనే సిరీస్‌తో అప్పుగారిలా అలరించి, మంచి క్రేజ్ సంపాదించుకుంది. ► బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్‌తో కలసి నటించిన ‘సూర్య’ అనే వెబ్ సిరీస్ సక్సెస్‌తో సినిమా ఆఫర్లూ రావడం ప్రారంభమయ్యాయి. ► పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రంలో లేడీ కానిస్టేబుల్‌గా నటించింది. ‘ఓరి దేవుడా!’ సినిమాలోనూ ఓ పాత్ర పోషించింది. ► ఇప్పుడు.. ఇటు సినిమాలు.. అటు షార్ట్ ఫిల్మ్స్ , వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది మౌనిక రెడ్డి. ► ఈ మధ్యనే పెళ్లి చేసుకొని కాస్త గ్యాప్ తీసుకుంది. ► మిగతా ప్రొఫెషన్స్లాగే యాక్టింగ్ కూడా ఒక ప్రొఫెషనే. అందుకే సక్సెస్‌ని పెద్దగా తల తలకెక్కించుకోను అంటుంది మౌనికా రెడ్డి. -
Mounika Reddy Marriage Pics: బీమ్లా నాయక్ ఫేమ్ మౌనిక పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్
-
ఆ రెండు సినిమాలతో క్రేజ్.. కేరళ భామకు వరుస ఆఫర్లు..!
భీమ్లా నాయక్, బింబిసార చిత్రాలతో క్రేజ్ సంపాందించుకున్న బ్యూటీ సంయుక్త మీనన్. ఈ భామ కోసం టాలీవుడ్లో వరుస ఆపర్లు క్యూ కడుతున్నాయి. ఈ కేరళ కుట్టి మలయాళం, తమిళం, కన్నడలోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో సక్సెస్ అందుకుంది. సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన బింబిసార బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్‌లో రానాకు జోడిగా నటించింది ఈ అమ్మడు. (చదవండి: ‘భీమ్లా నాయక్’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్ క్లారిటీ) ‘బింబిసార’ నందమూరి కల్యాణ్‌రామ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. ఈ భామకు హిట్ టాక్ సెంటిమెంట్ కలిసి రావడంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. తెలుగులో మొదట కల్యాణ్ రామ్ బింబిసారలో ఛాన్స్ రాగా.. ఆ సినిమా ఆలస్యం కావడంతో ‘భీమ్లా నాయక్’తో ఎంట్రీ ఇచ్చింది. 2016లో మలయాళం మూవీ ‘పాప్ కార్న్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో అంజనా పాత్రకు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘కలరి’ మూవీతో అభిమానులను పలకరించింది. ఈ సినిమా తర్వాత మలయాళంలో ‘లిల్లీ’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. -
జీపుపై పవన్ కల్యాణ్ కూర్చున్న కటౌట్.. భీమ్లానాయక్ ఎలివేషన్ !
Pawan Kalyan Bheemla Nayak Movie Elevation: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా ముఖ్య పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదలై విజయం సాధించింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించిన భీమ్లా నాయక్.. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషీయమ్కు రీమేక్‌గా వచ్చింది. ఇప్పుడు భీమ్లా నాయక్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న భీమ్లానాయక్ మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఈ సందర్భంగా డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి పవర్‌స్టార్ అభిమానులు ఓ వినూత్నమైన ఎలివేషన్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటుచేశారు. మార్చి 25 సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ‘భీమ్లానాయక్’ సినిమాలో ఏ విధంగా అయితే పవన్ కల్యాణ్ జీపుపై కూర్చుంటాడో అదే తరహాలో జీపుపై పవన్ కటౌట్‌ను ఆవిష్కరించారు. ఓ క్రేన్‌కు వేలాడదీసిన ఈ జీపు నెక్లెస్ రోడ్లో అన్ని వైపులా కనిపించేలా చేయడంతో పాటుగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాటలతో వీక్షకులలో ఆసక్తిని రేకిత్తించారు. -
ఓటీటీ: ఒక్కరోజు ముందుగానే స్ట్రీమింగ్ కానున్న ‘భీమ్లా నాయక్’
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గత నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ సరిగ్గా నెల రోజులకు ఓటీటీ సందడి చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. మార్చి 25న ఈ మూవీ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. చదవండి: షాకింగ్: నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్‌పై కేసు Surprise! Surprise! Bheemla Nayak kasta jaldi ostunnadu... 24 hours early on 24th! Get ready?#BheemlaNayakOnHotstar@PawanKalyan @RanaDaggubati @DisneyPlusHS #Trivikram @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @MusicThaman @NavinNooli @dop007 @vamsi84 pic.twitter.com/mUeXTxfhKl — DisneyPlus Hotstar (@DisneyPlusHSTel) March 22, 2022 ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై తాజా అప్డేట్ వచ్చింది. ఇప్పుడు భీమ్లా నాయక్‌ను ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్ చేయనున్నట్టు ఆహా అధికారిక ప్రకటన ఇచ్చింది. మార్చి 25న ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతోన్న నేపథ్యంలో మార్చి 24న భీమ్లా నాయక్‌ను స్ట్రీమింగ్ చేయనున్నామంటూ ఆహా వెల్లడించింది. అలాగే హాట్‌స్టార్ కూడా మార్చి 24న స్ట్రీమింగ్ చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జోడీగా సంయుక్తా మీనన్ నటించిన సంగతి తెలిసిందే. చదవండి: భార్యతో స్టార్ హీరో రొమాంటిక్ డేట్, ఫస్ట్‌టైం పబ్లిక్‌గా.. All Power Star @PawanKalyan fans, your wish is our command!🤗 #BheemlaNayak will stream in 4K with Dolby 5.1 on aha!💥💥💥 #ahaLaBheemla from tomorrow midnight. @Ranadaggubati #Trivikram @saagar_chandrak @MusicThaman @MenenNithya @iamsamyuktha_ @dop007 @vamsi84 @sitharaents pic.twitter.com/VEK1tSNScB — ahavideoin (@ahavideoIN) March 22, 2022 -
ఈ వారం సందడి చేసే పెద్ద సినిమాలు ఇవే..
పుష్ప, శ్యామ్ సింగరాయ్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ చిత్రాలతో సినీ లవర్స్ పండుగ చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆ పండుగను కొనసాగించే సమయం వచ్చేసింది. థియేటర్లలో ఒకే ఒక్క భారీ చిత్రం విడుదల కానుండగా.. ఓటీటీల్లో బడా చిత్రాలు సందడి చేయనున్నాయి. వారంలో ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటేనే ఆ సందడి మాములుగా ఉండదు. అలాంటిది థియేటర్లో, ఓటీటీల్లో నలుగురు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఆ ఉత్సాహం అంతకుమించి అన్నట్టుగానే ఉంటుంది. అయితే ఒక మల్టీ స్టారర్ చిత్రం థియేటర్లలో దుమ్ము లేపడానికి సిద్ధంగా ఉంటే రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఓటీటీల్లో అదరగొట్టనున్నాయి. 1. రౌద్రం.. రణం.. రుధిరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు అగ్ర హీరోలతో ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిస్టారికల్ ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీ బీజీఎం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగనుంది. 2. భీమ్లా నాయక్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో ఫిబ్రవరి 25న విడుదలైన చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ మూవీకి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా స్క్రీన్ ప్లే, సంభాషణలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాశారు. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో మార్చి 25 నుంచి 'భీమ్లా నాయక్' స్ట్రీమింగ్ కానుంది. 3. వలిమై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా ఫిబ్రవరి 24న రిలీజైన మూవీ 'వలిమై'. హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించి మెప్పించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా హిట్ కొట్టన 'వలిమై' కూడా మార్చి 25 నుంచి ప్రముఖ ఓటీటీ వేదికా 'జీ5'లో ప్రదర్శితం కానుంది. థియేటర్లో ఆర్ఆర్ఆర్, ఓటీటీల్లో భీమ్లా నాయక్, వలిమై సినిమాలతో మూవీ లవర్స్‌కు బంపర్ ట్రీట్ అందనుంది. ఓటీటీల్లో రిలీజయ్యే మరికొన్ని సినిమాలు: నెట్‌ఫ్లిక్స్ 1. బ్రిడ్జిటన్ (వెబ్ సిరీస్), మార్చి 25 అమెజాన్ ప్రైమ్ 2. డ్యూన్, మార్చి 25 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 3. పారలెల్స్, మార్చి 23 -
ఓటీటీలో 'భీమ్లా నాయక్'.. ఎప్పుడు, ఎక్కడంటే
Bheemla Nayak OTT Release Date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జోడీగా సంయుక్తా మీనన్ నటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా అభిమానులకు చిత్ర బృందం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. గత నెల 25న విడుదలైన భీమ్లా నాయక్ సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. మార్చి25న ఈ సినిమాను ఒకేసారి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించారు. కాగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు భీమ్లా నాయక్ సైతం ఓటీటీలో విడుదల కానుంది. Vastunnadu #BheemlaNayakOnHotstar. Get ready for the ultimate battle of duty and power from 25th March. https://t.co/WpAm1tEKJc@PawanKalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @MusicThaman @NavinNooli @dop007 @vamsi84 @DisneyPlusHSTel pic.twitter.com/8XDb7f27Ir — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 17, 2022 Next friday ee time ki, power storm mee intiki vachesthundhi. dates mark cheskondi, calendar kaaliga unchukondi. #ahaLaBheemla from March25 nundi 🔥🔥#ahaLaBheemlaFromMarch25@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @SitharaEnts @MenenNithya @MusicThaman pic.twitter.com/eO0lEuKnZm — aha on Duty (@ahavideoIN) March 17, 2022 -
త్రివిక్రమ్‌పై నెటిజన్ ట్వీట్.. డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్
Sai Rajesh Strong Counter To Netizen Tweet On Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ గురించి ఏ తెలుగు ప్రేక్షకుడికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఆయన రాసిన డైలాగ్‌లు ఆడియెన్స్ చెవుల్లో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అనేకమందిని ఆలోచింపజేస్తాయి. తెలుగు మాటలు, తెలుగు పదాలు, తెలుగు భాష అంటే అమితమైన గౌరవం, ఇష్టం. స్టేజీపైనా కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఆయన చెప్పే మాటలు ఆచరించేలా ఉంటాయి. హీరోలకు, హీరోయిన్లకు అభిమానులు ఉండటం కామన్. కానీ డైరెక్టర్లకు, వారి డైలాగ్‌లకు సైతం ఫ్యాన్స్ ఉంటారని చెప్పిన అతి కొద్దిమంది దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ఇక ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి హిట్ కొట్టారు త్రివిక్రమ్. ఈ సినిమా గురించి ఆపాదిస్తూ త్రివిక్రమ్‌పై తాజాగా ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ''అల వైకుంఠపురంలో మూవీ తర్వాత త్రివిక్రమ్ ఏ చిత్రానికి దర్శకత్వం చేయలేదు.. కానీ రెండేళ్లలో డైలాగ్స్ రాసి రూ. 50 కోట్లు సంపాదించాడు'' అంటూ ఒక వెబ్సైట్ వార్త రాసింది. ఈ న్యూస్‌కు ఒక నెటిజన్ తనదైన శైలీలో రిప్లై ఇస్తూ 'ఇదిరా లైఫ్ అంటే..' అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు డైరెక్టర్ సాయి రాజేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'రూ. 1500లతో రూమ్ షేర్ చేసుకుని, 50కిపైగా మూవీస్‌కి ఘోస్ట్ రైటర్‌గా పనిచేసి, మొదటి బ్రేక్ కోసం పదేళ్లు ఎదురుచూసిన అతనికి ఇది ఊరికే రాదు' అని సమాధానమిచ్చాడు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. -
భీమ్లా నాయక్ బ్యూటీ ‘మౌనికా రెడ్డి’ (ఫొటోలు)
-
‘భీమ్లా నాయక్’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్ క్లారిటీ
Samyuktha Menon Disappointed With Bheemla Nayak: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్ మంచి హిట్‌టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ హీరోయిన్లు అయిన నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు భీమ్లా నాయక్‌పై మూతి ముడుచుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణంగా సినిమా నిడివి తగ్గించేందుకు పాటలతో పాటు హీరోయిన్ల సన్నిశాల్లో కోతలు విధించడం. చదవండి: బాలీవుడ్‌పై నటి భాగ్యశ్రీ షాకింగ్ కామెంట్స్.. ఎంతో మంది సంగీత ప్రియుల ఆదరణ పొందిన ‘అంత ఇష్టం ఏందయ్యా..’ సాంగ్‌తో పాటు పలు సన్నివేశాలను చిత్ర బృందం తొలగించిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో ఎంతోమందిని ఆకట్టుకున్న తన పాటను తొలగించడంపై నిత్యా మీనన్ హర్ట్ అయ్యిందని, అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాలేదని వార్తలు వినిపించగా.. రిలీజ్ అనంతరం తన సీన్లను తొలగించడంపై సంయుక్త మీనన్ సైతం చిత్రం బృందంపై కోపంతో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై స్పందించింది సంయుక్త మీనన్. చదవండి: సమంతపై జిమ్ ట్రైనర్ జునైద్ ఆసక్తికర వ్యాఖ్యలు ‘అవును నేను చాలా హర్ట్ అయ్యాననే మాట నిజమే. అయితే నా పాత్ర గురించి కాదు .. దాని నిడివి గురించి కాదు. ఈ సినిమాను రెండోసారి థియేటర్లో చూద్దామనుకుంటే ఇంతవరకూ టిక్కెట్ దొరకలేదు .. అందుకు’ అంటూ చమత్కరించింది. తన కామెంట్స్ విన్న నెటిజన్లు సీన్స్ తొలగిస్తే ఎవరూ బాధపడకుండా ఉంటారని, కానీ ఆమె నిజం ఒప్పుకోవడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిత్యా మీనన్ మాత్రం తన పాట, సన్నివేశాలను తొలగించడం పట్ల మూవీ యూనిట్‌పై తీవ్ర అసహనంతో ఉందని, అందుకే ఆమె భీమ్లా నాయక్ సంబంధించిన ఏ ఈవెంట్లోను పాల్గొనడం లేదంటూ సినీ వర్గాలు నుంచి సమాచారం. ఈ మూవీ పవన్ కల్యాన్ భార్య నిత్యా మీనన్ నటించగా.. రానా భార్య సంయుక్తి మీనన్ కనిపించింది. -
అలాంటి చిత్రాలు చేయాలని ఇప్పుడే తెలిసింది: రానా దగ్గుబాటి
‘సినిమా వాతావరణంలో పుట్టిన నాకు ఏం చేసినా కొత్తగా ఉండాలనుకుంటాను. అందరిలా ఉండకూడదు అనేది నా తత్వం. తెర మీద కొత్తదనం చూడటానికే నేను థియేటరకి వెళ్తాను. థియేటర్లో కొత్తగా చూసింది... అంతకంటే కొత్తగా నేను చేయాలనుకుంటా. ఇప్పటి వరకూ అదే దారిలో వెళ్తున్నా. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలనే యాక్టర్ అయ్యాను’అన్నారు రానా దగ్గుబాటి. పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న విడుదలైంది. ఈ సందర్భంగా రానా బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘అసలు హీరో అంటే ఏంటి? అనేది ఈ సినిమాతో నేర్చుకున్నా. సినిమాలో మధ్యలో పాటలు, ఫైటులు ఎందుకు అనుకుంటాను. పాటలొస్తే కథ నుంచి బయటకు వచ్చేస్తాను. ఎందుకో వాటికి సింక్ అవ్వలేను. మాస్ సినిమా చేయాలని అందరూ చెబుతుంటే ఎందుకా అనుకునేవాడిని. అవి సినిమాకు ఎంత అవసరమో భీమ్లా నాయక్ చూశాక తెలిసింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ కల్ట్ సినిమా. దానిని ఈ తరహాకు మార్పులు చేయాలంటే నటించే హీరోను బట్టే ఉంటుంది. ఈ సినిమాలో నేను చేసిన డ్యాని పాత్ర చూసి నాన్న చాలా సంతృప్తి చెందారు. ఆయన అలా చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారు. ఏదో ఒక రోజు పాటలు, ఫైటులు లేకుండా టాకీతోనే సినిమా తీసి హిట్ కొడతా అని మా నాన్నతో చెబుతుంటా. అలాంటి ప్రయత్నం చేస్తా. ఇకపై అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు చేస్తాను. సోషల్ మీడియాలో దాని గురించే చర్చ నడుస్తోంది. అలాంటి చిత్రాలు చేయాలని నాకూ ఇప్పుడే తెలిసింది’అన్నారు. -
Bheemla Nayak: ఆ సీన్ తొలగించి, పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి
పవన్ కల్యాణ్-రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్ వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీలోని పలు సన్నివేశాలపై కుమ్మర శాలివాహన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షకులు డాక్టర్ మానేపల్లి వీవీఎస్ఎన్ మూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ సన్నివేశాలని తొలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. వివరాల్లొకి వెళితే.. భీమ్లా నాయక్ మూవీలో రానా-పవన్ కల్యాణ్‌ల మధ్య చిత్రీకరించిన ఫైటింగ్ సీన్లో ఓ చోట కుమ్మరులు పవిత్రంగా భావించే సారెను రానా కాలితో తన్నారు. ఇది తమ వర్గాన్ని అవమానించేలా ఉందని మానేపల్లి వీవీఎస్ఎన్ మూర్తి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఫైటింగ్ సన్నివేశంలో రానా కుమ్మరి చక్రాన్ని(సారె) కాలితో తన్ని దానితో పవన్‌పై దాడి చేసినట్లు చూపించారు. మేము కుమ్మరి చక్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. అలాంటి సారెను కాలితో తన్నినట్లు చూపించడం మమ్మల్ని కించపరచడమే కాదు.. కుమ్మరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది’ అని ఆయన అన్నారు. అంతేకాదు ఈ సన్నివేశాన్ని వెంటనే మూవీ నుంచి తొలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సినిమా హీరోలు పవన్ కల్యాణ్, రానా, దర్శక-నిర్మాలు సాగర్ కే చంద్ర, సూర్య దేవర నాగవంశీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు కుమ్మర శాలివాహనులను అవమానపరిచిన పవన్ కల్యాణ్ కుమ్మర శాలివాహనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఆ మూడు సినిమాలు నాకు మంచే చేశాయి: దర్శకుడు
‘‘అయ్యారే’కి డైరెక్షన్ చేస్తున్నప్పుడు సినిమా తీయాలనే తపన తప్ప నాకు ఇంకేం తెలీదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’కి పరిచయాలు పెరిగాయి, కొంత అవగాహన వచ్చింది. ఆ సినిమా ఒక అడుగు ముందుకెళ్లేలా చేసింది. ‘భీమ్లా నాయక్’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ మూడు సినిమాలు నాకు మంచే చేశాయి’’ అని సాగర్ కె. చంద్ర అన్నారు. పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న విడుదలైంది. ఈ సందర్భంగా సాగర్ కె.చంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్‌లాక్ డౌన్ సమయంలో నిర్మాత నాగవంశీగారు ఫోన్ చేసి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చూడమనడంతో చూశా. ఈ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్నాం.. నీకు ఆసక్తి ఉందా? అనగానే ఓకే చెప్పాను. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారితో జర్నీ మొదలైంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్, రానాగార్లు రావడంతో మరింత ఎగై్జటింగ్‌గా ముందుకెళ్లాం. ఈ సినిమా వల్ల వచ్చిన పేరు, గుర్తింపుతో హ్యాపీ. ‘భీమ్లానాయక్’ని త్వరలో హిందీలోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నా తర్వాతి సినిమా రీమేక్ కాకుండా స్ట్రైట్ మూవీ చేస్తా.‘భీమ్లానాయక్’ కి ముందు వరుణ్ తేజ్‌తో 14రీల్స్ ప్లస్ బ్యానర్లో ఓ సినిమా ప్రక టించారు. బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువ అవడంతో ఆగింది.. ఆ కథతోనే సినిమా చేస్తానా? కొత్త కథతోనా? చూడాలి’’ అన్నారు. -
ఎవరి సినిమాకైనా ఒకే విధానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎవరి సినిమాకైనా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకే విధానాన్ని అమలు చేస్తారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) స్పష్టం చేశారు. సీఎం జగ న్ మిత్రుడు నాగార్జున నటించిన బంగార్రాజు, పుష్ప, అఖండ సినిమాలకు వర్తింపజేసిన నిబంధనలనే భీమ్లా నాయక్‌కు అమలు చేస్తున్నామన్నారు. చంద్రబాబు, రామోజీరావు, లింగమనేని రమేష్ లాంటి తోడేళ్ల ఉచ్చులో ఇరుక్కుని చిరంజీవిని త క్కువ చేసేలా వ్యవహరించవద్దని పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 50 శాతానికిపైగా ఓ ట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను సా ధించారని, 2024లోనూ ఒంటరిగానే బరిలోకి దిగి రికార్డు విజయాన్ని సాధిస్తారని స్పష్టం చేశారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మాట్లాడారు. జనం జేబులు గుల్ల సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచి విక్రయిస్తుంటే చంద్రబాబు హయాంలో కమిటీని నియమించకుండా కళ్లు మూసుకుని కూర్చున్నారు. ఫిబ్రవరి 23న జీవో ఇస్తామని, పవన్ సినిమా విడుదల చేసుకోవాలని మేం చెప్పలేదు. సీఎం జగన్ సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకుంటారు. భీమ్లా నాయక్ సినిమాను తొక్కేస్తున్నారంటూ చంద్రబాబు, ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. వివాదాలకు తావు లేకుండా జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో కొంత ఆలస్యమవుతోంది. పవన్ కళ్యాణ్‌కు ఇప్పటికే రెమ్యూనరేషన్ అందింది. సినిమా వల్ల నష్టపోతే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లే నష్టపోతారు. బ్లాక్‌లో టికెట్ల విక్రయాలు, ప్రజలను లూటీ చేయడాన్ని ఒప్పుకోం. నమ్మితే మళ్లీ మోసగిస్తారు... చంద్రబాబు సీఎం కావాలని ఆరాటపడే కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులుగా నటిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. వారిని నమ్ముకుని ముందుకు పోతే 2024లో కూడా చంద్రబాబు మోసం చేస్తారు. మీరు ఓడిపోయే 25 లేదంటే 30 సీట్లు ఇస్తారు. చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే. ఎన్టీఆర్ వారసులను తొక్కేశారు. స్వార్థ రాజకీయాల కోసం వాడుకుని వదిలేశారు. చిరంజీవిని సీఎం జగన్ గౌరవించారు.. చిరంజీవి తన ఇంట్లో పనివాళ్లు మొదలుకుని పరిశ్రమలో అందరినీ గౌరవిస్తారు. చివరకు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చినా లేచి రిసీవ్ చేసుకుంటారు. ఆయన్ను సీఎం జగన్ అవమానించినట్లు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోంది. సీఎం జగన్‌కు తన అన్న చిరంజీవి వంగి వంగి నమస్కారం పెట్టారని పవన్ కళ్యాణ్ అనడం హేయం. సీఎం జగన్ ఇంటి గుమ్మం వద్ద నిలుచుని చిరంజీవిని సాదరంగా ఆహ్వానించారు. చిరంజీవితో కలసి భోజనం చేశారు. భారతమ్మ స్వయంగా వడ్డించారని చిరంజీవే చెప్పారు. చంద్రబాబు లాంటి తోడేళ్ల మాయలో పడి చిరంజీవిని తక్కువ చేయొద్దు. చిక్కుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలా? చంద్రబాబు ఓ 420.. సీపీఐ నారాయణ ఓ వింత జంతువు. వైఎస్ వివేకా హత్యలో సీఎం జగన్ కుటుంబం ప్రమేయముందని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుని అవస్థలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పడం ఆయన మతిస్థిమితం కోల్పోయారనేందుకు నిదర్శనం. భారతి సిమెంట్.. హెరిటేజ్‌పై చర్చకు సిద్ధమా? సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్లు, నాడు–నేడు ద్వారా పాఠశాలలు, ఆసుపత్రుల ఆధునికీకరణ తదితరాలకు రూ.235కే బ్యాగ్ చొప్పున కొన్ని లక్షల టన్నులను భారతి సిమెంట్ సంస్థ సరఫరా చేసింది. చంద్రబాబు ఏ రోజైనా హెరిటేజ్ ద్వారా ఒక్క రూపాయైనా తక్కువకు సరఫరా చేశారా? చంద్రన్న కానుక పేరుతో నాసిరకం నెయ్యిని అంటగట్టి కమీషన్లు వసూలు చేసుకున్న ఘనత ఆయనదే. ఈ అంశంపై చర్చకు సిద్ధమా? రాష్ట్రంలో బీజేపీ నేతలు టీడీపీ బీ–టీమ్‌లా వ్యవహరిస్తున్నారు. -
‘ఫ్లాప్ సినిమాకు చంద్రబాబు మార్కెటింగ్’
సాక్షి, విజయవాడ: భీమ్లా నాయక్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. వైఫల్యాన్ని ప్రభుత్వంపై రుద్దేందుకే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ డ్రామాలాడుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బ్లాక్ టికెట్లు అమ్ముకుని కొంతైనా బయటపడాలని చూస్తున్నారన్నారు. అఖండ సినిమా టైంలో ఉన్న జీవోనే ఇప్పటికీ అమల్లో ఉందన్నారు. ఫ్లాప్ సినిమాకు చంద్రబాబు మార్కెటింగ్ చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. చదవండి: అలాంటి వ్యక్తిని సొంత తమ్ముడే అవమానిస్తాడా?’ -
‘అలాంటి వ్యక్తిని సొంత తమ్ముడే అవమానిస్తాడా?’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భీమ్లా నాయక్ సినిమాను తొక్కేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో 151 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నారన్నారు. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి: నేను రాను.. మీరు వెళ్లండి ‘‘భీమ్లా నాయక్ సినిమాకు కొత్తగా ఏమీ షరతులు పెట్టలేదు. పుష్ప, అఖండ సినిమాలకు కూడా ఇవే నిబంధనలు ఉన్నాయి. ఎవరి సినిమా అయినా ప్రభుత్వానికి ఒక్కటే. బ్లాక్‌టిక్కెట్ల పేరుతో దోచుకుందాము అనుకుంటే కుదరదు. సినిమాకో నిబంధనలు విధించే ప్రభుత్వం మాది కాదు. సీఎం జగన్ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని’’ కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కోసం ఎల్లో మీడియా.. సీఎం వైఎస్ జగన్‌పై విష ప్రచారం చేస్తోంది. టిక్కెట్ ధరలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొడాలి నాని అన్నారు. ‘‘చిరంజీవిని సీఎం జగన్ ఎంతో గౌరవిస్తారు. చిరంజీవిని కుటుంబ సమేతంగా ఆహ్వానించింది గుర్తులేదా. పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సీఎం.. చిరంజీవిని ఆహ్వానించారు. సీఎం జగన్ దగ్గర చిరంజీవి విన్నపాన్ని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు సరికావు. పిల్లల్లో పిల్లాడిగా, పెద్దల్లో పెద్దవాడి ఉంటారు చిరంజీవి. అలాంటి వ్యక్తిని చంద్రబాబు కోసం సొంత తమ్ముడే అవమానిస్తాడా?. చంద్రబాబు ఉచ్చులో పడొద్దని పవన్‌కల్యాణ్‌ను కోరుతున్నా. సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం. ప్రజల ఆశీస్సులతో 2024లోనూ జగన్ సీఎం అవుతారు. వ్యక్తులను వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట. బాబు ఉచ్చులో పడి చిరంజీవిని అవమానించొద్దని పవన్‌కు చెబుతున్నా. సీపీఐ నారాయణ పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని’’ మంత్రి మండిపడ్డారు. ‘‘ఎన్టీఆర్ వారసులను తొక్కేయాలని చూసింది చంద్రబాబే. మళ్లీ ఎన్నికల కోసం ఎన్టీఆర్ వారసులనే వాడుకున్నారు. భారతీ సిమెంట్‌పై చంద్రబాబుతో చర్చకు సిద్ధం. మీ హెరిటేజ్ గురించి చర్చించేందుకు మీరు సిద్ధమా’’ అంటూ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. -
‘భీమ్లా నాయక్’ రీమేక్ విషయంలో మా తొలి సవాల్ ఇదే: త్రివిక్రమ్
Bheemla Nayak Success meet: ‘‘మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లో కథ కోషి (తెలుగులో రానా చేసిన పాత్ర) వైపు నుంచి చెప్పబడింది. ఈ కథను తెలుగులో భీమ్లా నాయక్ వైపు తీసుకురావడానికి ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది ఈ సినిమా రీమేక్ అనుకున్నప్పుడు మాకు ఎదురైన తొలి సవాల్. కథను ఎలా మార్చాలనే విషయంపై చాలా చర్చించాం’’ అని త్రివిక్రమ్ అన్నారు. పవన్ కల్యాణ్–రానా కాంబినేషన్లో సాగర్.కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో పవర్ఫుల్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సమయంలో పవన్, రానా భయం లేకుండా జనాల మధ్య రిస్క్ చేసి పనిచేశారు. 600 మందితో సాంగ్ షూట్ చేయడం సాధారణ విషయం కాదు. మూడు రోజుల్లో గణేశ్ మాస్టర్ ఈ పాటను పూర్తి చేశాడు’’ అన్నారు. ‘‘భీమ్లా నాయక్’ సక్సెస్ రీసౌండ్‌కి కారణం త్రివిక్రమ్‌గారి ఆలోచనే’’ అన్నారు సాగర్ కె. చంద్ర. పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్లశ్యామ్ తదితరులు మాట్లాడారు. -
హీరోయిన్ సంయుక్త మీనన్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
‘భీమ్లా నాయక్’మూవీ రివ్యూ
టైటిల్ : భీమ్లా నాయక్ నటీనటులు : పవన్ కల్యాణ్, రానా, నిత్యా మీనన్,సంయుక్త మీనన్, మురళీ శర్మ తదితరులు నిర్మాణ సంస్థ : సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ దర్శకత్వం :సాగర్ కె చంద్ర సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : రవి కె. చంద్రన్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది : ఫిబ్రవరి 25, 2022 ‘వకీల్ సాబ్’ మూవీ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. మరో కీలక పాత్రలో యంగ్ హీరో రానా నటించారు. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కొషియుమ్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ శుక్రవారం(ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? రివ్యూలో చూద్దాం. భీమ్లా నాయక్ కథేంటంటే..? భీమ్లా నాయక్(పవన్ కల్యాణ్).. కర్నూలు జిలా హఠకేశ్వర్ మండలం పోలీస్టేషన్లో నిజాయితిపరుడైన ఎస్సై. డేనియల్ శేఖర్ ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అతని తండ్రి(సముద్ర ఖని) వరంగల్ మాజీ ఎంపీ. రాజకీయ పలుకుబడి ఉన్న డేనియల్ శేఖర్ ఓ రోజు రాత్రి పీకల దాకా తాగి, అడవి గుండా వెళ్తూ మద్యం బాటిళ్లతో పోలీసులకు చిక్కుతాడు. ఈ సందర్భంగా డేనియల్‌కు, పోలీసుకు వాగ్వాదం జరుగుంది. పోలీసులపై దాడి చేసిన డేనియల్ను అక్కడే విధులు నిర్వహిస్తున్న భీమ్లా నాయక్ అరెస్ట్ చేస్తాడు. దీంతో డేనియల్ అహం దెబ్బతింటుంది. తనను అరెస్ట్ చేసిన భీమ్లా నాయక్‌ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని భావిస్తాడు. ఆయన చేసిన కుట్రలో భాగంగా భీమ్లా నాయక్ ఉద్యోగం పోతుంది. అంతేకాదు అతని భార్య సుగుణ(నిత్యా మీనన్) కూడా అరెస్ట్ కావాల్సి వస్తోంది. అసలు భీమ్లా నాయక్ ఉద్యోగం ఎందుకు పోయింది? తన ప్రతీకారం తీర్చుకునే క్రమంలో డేనియల్ శేఖర్ ఎలాంటి తప్పులు చేశాడు? సస్పెండ్ అయిన తర్వాత భీమ్లా నాయక్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అహంకారి అయిన మాజీ సైనికాధికారికి, ఆత్మ గౌరవం ఉన్న పోలీసు అధికారికి మధ్య జరిగిన పోరులో ఎవరు విజయం సాధించారు? భీమ్లా నాయక్ నుంచి డేనియల్ శేఖర్ని ఆయన భార్య (సంయుక్త మీనన్)ఎలా రక్షించుకుంది? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? నిజాయితీపరుడైన ఎస్సై భీమ్లా నాయక్ పాత్రలో పవన్ ఒదిగిపోయాడు. ఇక బాగా పొగరు ఉన్న రాజకీయ నేత, రిటైర్డ్ ఆర్మీ అధికారి డేనియల్ శేఖర్‌గా రానా అద్భుత నటనను కనబరిచాడు. రాజకీయ అండదండలు ఉన్న వ్యక్తి ఏవిధంగా అయితే యాటిట్యూడ్ చూపిస్తాడో.. అచ్చం అలానే రానా తెరపై కనిపించాడు. ఈగో దెబ్బతింటే.. ఎంతకైనా తెగించే పాత్ర తనది. ప్రతి సీన్లో పవన్ కల్యాణ్‌తో పోటాపోటీగా నటించాడు. ఇక భీమ్లా నాయక్ భార్య సుగుణ పాత్రలో నిత్యా మీనన్ పరకాయ ప్రవేశం చేసింది. మాతృకతో పోలిస్తే.. ఇందులో సుగుణ పాత్రకు స్క్రీన్ స్పెస్ ఎక్కువ. అంతేకాదు కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఆమె పాత్రకు అతికించారు. డేనియల్ శేకర్ భార్యగా సంయుక్త మీనన్ పర్వాలేదనిపించింది. సీఐ కోదండరాంగా మురళీ శర్మ, బార్ ఓనర్ నాగరాజుగా రావు రమేశ్, డేనియల్ శేఖర్ తండ్రి, మాజీ ఎంపీగా సముద్ర ఖని తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రీమేక్ మూవీయే ‘భీమ్లా నాయక్’. ఇద్దరు బలమైన వ్యక్తుల అహం దెబ్బ తింటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేదే ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’మూవీ స్టోరీ. ఇదే కథను తీసుకొని, కొన్ని మార్పులు చేసి ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే వాటిలో కొన్ని సినిమాకు అనుకూలంగా మారగా, కొన్ని ప్రతికూలంగా మారాయి. ముఖ్యంగా కొన్ని యాక్షన్స్ సీన్స్ అయితే అతిగా అనిపిస్తాయి. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ప్లాష్ బ్యాక్ స్టోరీ అతికించినట్లుగా అనిపిస్తుంది. మాతృకలో మాదిరే పవన్, రానా పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు.. వారి నేపథ్యాన్ని మాత్రం మరింత బలంగా చూపించారు. తండాకు సంబంధించిన సీన్స్, హీరో ప్లాష్‌బ్యాక్ సీన్స్..మాతృకలో ఉండవు. రావు రమేశ్ కామెడీ పంచులు, నిత్యామీనన్ సరదా సన్నివేశాలతో ఫస్టాఫ్ అంతా ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. భీమ్లా నాయక్ సస్పెండ్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో ఓరిజినల్ కథలో చాలా మార్పులు చేశారు. పవన్, రానాల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఇరువురి మధ్య వచ్చే డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. అదేసమయంలో కొన్ని యాక్షన్ సీన్స్‌లో డోస్ ఎక్కువైందనే ఫీలింగ్ కలుగుతోంది. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్ అయితే కాస్త సిల్లీగా అనిపించినా.. ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫి బాగుంది. అడవి అందాలను తెరపై చక్కగా చూపించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘భీమ్లా నాయక్’ ట్విటర్ రివ్యూ
Bheemla Nayak Movie Twitter Review: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గబాటి హీరోలుగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీమ్లా నాయక్’.మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, బిజూ మీనన్ చేసిన పాత్రలను తెలుగులో పవన్ కళ్యాన్, రానా చేశారు. మాతృకతో పోలిస్తే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఇమేజ్‌కి తగినట్లుగా చాలా మార్పులు చేశారు. అహంకారి అయిన సైనికాధికారికి, ఆత్మ గౌరవం ఉన్న పోలీసు అధికారికి మధ్య జరిగిన స్టోరీనే ‘భీమ్లా నాయక్’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు,పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఫిబ్రవరి 25)‘భీమ్లా నాయక్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.‘భీమ్లా నాయక్ ’కథేంటి? పవన్, రానా నటన ఎలా ఉంది? ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది...తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూద్దాం. One word Review of #BheemlaNayak Trivikram + Teddy 🔥🔥🔥 Ah Dialogues uu ah BGM uuu ..... !! Mana Powerstar ki HIT vachindhi royi — SVP🔔 (@Uuudhay1882) February 25, 2022 ‘భీమ్లా నాయక్’గా పవన్ నటన బాగుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే బాగుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుందని కామెంట్ చేస్తున్నారు. క్లైమాక్స్ అంతగా బాలేదని కొంతమంది కామెంట్ చేస్తుండగా, చివరి 30 నిమిషాలు అదిరిపోయిందని చెబుతున్నారు. First half over ,Mark my words guys, No one can such high like Pawan. So far the best of Pawan . #BheemlaNaayak #BheemlaNayakMania Fan in you never allow you to sit. Every scene is excellent. @MusicThaman Thanks for the music . 🔥 — krishna chandaka (@kmnaidu) February 25, 2022 #OneWordReview#BheemlaNayak “ఎంటర్టైనర్” ఇది పూర్తి ఎంటర్టైనర్ ప్యాకేజీ, లేదా మీరు చెప్పగలరు, పూర్తి #PawanKalyan షో. వెళ్లి ఆనందించండి 3.5 ⭐ /5 — MB or AA CULTS🔔 (@SVP61633780) February 25, 2022 Blockbuster report from all over world wide ilanti talk vini enni years ayindo 💥💥💥#BheemlaNayakMania — Thirupal (@ThalariThirupal) February 24, 2022 #BheemlaNayak 1st half was ok but 2 awaited songs were spoiled 2nd half a changed flashback works in favor to movie but climax twist spoils Essense of egotistical characteristics in PK missing. But Rana brought it out good Screenplay is good by Trivi. Bgm is ok @MusicThaman — Anna Yaaru 🐯🌊 (@EV9999_Tarak) February 25, 2022 Completed 1st half Good 1st half. Bgm 🥵🔥 Songs🔥 Dailogues🔥🥵🥵🥵#BheemlaNayakEuphoria #BheemlaNayak pic.twitter.com/s07pwvVUwW — Yash SP (@SPYaswanth) February 25, 2022 #BheemlaNayakReview 🔥 pure mass stuff 🤟 bomma blockbuster roii💯 Final verdict - PANDAGA mundhe ochesindi🙌 #BheemlaNayakOn25thFeb #BheemlaNayakMania #BheemlaNayakOnFeb25th pic.twitter.com/xEoalKEtwg — Nani Naanna (@naanna_nani) February 25, 2022 #BheemlaNayak Good first half Lala song and BGM @MusicThaman 👌👌👌 @RanaDaggubati attitude Alladinchav bro PK fans ki feast title song Picturization bale — KiRRRan Sai NTRRR (@kiransai413) February 25, 2022 Hard core fans eee cinema ni digest chesukoleka potunaru ….below average 🎥but Rana did well #BheemlaNayak pic.twitter.com/LTOF88XAlA — Vinay-Balayya -Tarak 🥁 (@VinayKu54989477) February 25, 2022 -
'భీమ్లా నాయక్' ఈవెంట్లో త్రివిక్రమ్ అందుకే మాట్లాడలేదా?
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం 'భీమ్లా నాయక్'. రేపు(ఫిబ్రవరి 25)న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం అయ్యింది. అయితే ఈవెంట్ మొత్తంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ లేకపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఆయన ఫంక్షన్‌కి వచ్చారా లేదా అన్న సందేహం కూడా ఫ్యాన్స్‌లో మిగిలిపోయింది. పవన్ సినిమా ఫంక్షన్‌కు అన్నీ తానై ముందుండి నడిపించే త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో మాత్రం బ్యాక్ స్టేజ్‌కే ఎందుకు పరిమితం అయ్యారన్నది ఇప్పడు చర్చనీయాంశమైంది. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో లీక్ అయిన బండ్ల గణేష్ ఆడియో కాల్‌తో త్రివిక్రమ్ అప్సెట్ అయ్యారని, దీనివల్లే త్రివిక్రమ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడలేదని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి త్రివిక్రమ్ పేరే హైలైట్ అవుతూ వచ్చింది. నిజానికి యంగ్ ఫిల్మ్ మేకర్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ సోషల్ మీడియాలోనూ త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తుండటంతో ఈవెంట్లో ఎలాంటి హడావిడి లేకుండా కావాలనే బ్యాక్ స్టేజ్‌కి పరిమితం అయ్యారని టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. చదవండి: త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఆడియో లీక్‌పై స్పందించిన బండ్లగణేష్ -
ఒకే ఫ్రేంలో ‘గాడ్ ఫాదర్’, ‘భీమ్లా నాయక్’, వీడియో వైరల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్ రేపు (ఫిబ్రవరి 25) విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ చిరు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు చిరు సర్ప్రైజ్ ఇచ్చారు. ఒకే సెట్లో గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్‌లు ఉన్న సినిమాటిక్ వీడియోను చిరంజీవి షేర్ చేశారు. ప్రస్తుతం చిరు నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. చదవండి: భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై కేటీఆర్ ట్వీట్ ఇటీవల భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ సినిమాల షూటింగ్ ఒకే చోట జరగడంతో చిరంజీవి ఖైదీ డ్రెస్‌లోనే భీమ్లా నాయక్ మూవీ సెట్‌కి వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా రానా, పవన్ కల్యాణ్, సాగర్ కే చంద్ర, త్రివిక్రమ్‌లతో ఫొటోలు కూడా దిగారు. అలాగే భీమ్లా నాయక్ టీం కూడా రీసెంట్గా గాడ్ ఫాదర్ సెట్లో సందడి చేసింది. రానా, త్రివిక్రమ్, పనన్ కల్యాణ్, సాగర్ కే చంద్ర, గాడ్ ఫాదర్ మూవీ సెట్‌కు వచ్చి కాసేపు చిరుతో ముచ్చటించారు. చదవండి: 2 ఎకరాల్లో బన్నీ కొత్త ఇల్లు.. దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా! ఈ రెండు సందర్భాలకు సంబంధించిన సన్నివేశాలు, ఫొటోలను సినిమాటిక్‌గా వీడియోగా క్రియేట్ చేసిన వీడియోను రామ్ చరణ్ ఇదివరకే షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిరు ఈ వీడియోను తన ట్విటర్లో షేర్ చేస్తూ.. రేపు విడుదల కానున్న భీమ్లా నాయక్ టీంకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇద్దరు మెగా హీరోలను ఒకే ఫ్రేంలో చూసి మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. All The Best Team #BheemlaNayak @PawanKalyan @SitharaEnts https://t.co/KCTL0b5Eoj — Chiranjeevi Konidela (@KChiruTweets) February 24, 2022 -
భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై కేటీఆర్ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మంత్రి కేటీఆర్ హజరు కావడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హజరుకావడంపై నేడు(గురువారం) ఉదయం కేటీఆర్ ట్వీట్ చేశారు. చదవండి: 2 ఎకరాల్లో బన్నీ కొత్త ఇల్లు.. దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా! ఈ సందర్భంగా ఆయన ‘భీమ్లా నాయక్ మూవీ విడుదల సందర్భంగా మై బ్రదర్స్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, తమన్, సాగర్ కే చంద్రలకు శుభాకాంక్షలు తెలిపేందుకు నా రోటిన్ లైఫ్ నుంచి కాస్తా విరామం తీసుకున్నాను’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ‘పద్మశ్రీ మొగిలయ్యగారు, శివమణి వంటి అద్భుతమైన సంగీత విద్వాంసులను ఈ సందర్భంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. Took a break from my routine to greet my brothers @PawanKalyan garu @RanaDaggubati & @MusicThaman & director Sagar Chandra for their upcoming movie #BheemlaNayak Lovely to meet some brilliant musicians such as Padmasri Mogilaiah Garu & Sivamani Garu pic.twitter.com/FEkym6karK — KTR (@KTRTRS) February 24, 2022 -
'భీమ్లా నాయక్' సినిమాలో పాట కోసం దుర్గవ్వకు ఎంతిచ్చారంటే?
భీమ్లా నాయక్ సినిమా ఇద్దరు జానపద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మొగిలయ్య పాడిన టైటిల్ సాంగ్, సాహితి చాగంటితో కలిసి కుమ్మరి దుర్గవ్వ పాడిన అడవితల్లి మాట ఎంతగా మార్మోగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కూలీ పనులు చేసుకుంటూ ఫోక్ సాంగ్స్ పాడే దుర్గవ్వ అడవితల్లి సాంగ్‌లో అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెగొంతును వినిపించింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గవ్వ తనకు పాట పాడే అవకాశం ఎలా వచ్చింది? పాడినందుకు ఎంత పారితోషికం ఇచ్చారనే విషయాలను వెల్లడించింది. 'సిరిసిల్ల సిన్నది, ఉంగురము పాటలు పాడాను. అవి హిట్ అయ్యాయి. అది విని భీమ్లానాయక్లో పాట పాడమని ఆఫర్ వచ్చింది. ఐదారు నిమిషాల్లో పాడేశాను. ఈ పాట పాడినందుకు రూ.10 వేలు ఇచ్చారు. తర్వాత మిగిలిన డబ్బును నా కూతురుకు ఇచ్చి పంపించారు' అని చెప్పుకొచ్చింది దుర్గవ్వ. -
అంతే బాధ్యతగా ‘భీమ్లా నాయక్’ను చేశాం: పవన్ కల్యాణ్
Pawan Kalyan Bheemla Nayak Pree Release Event: ‘‘భారతీయ చలన చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ని హబ్‌గా చేయాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు. కేసీఆర్‌గారు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అతి ముఖ్యమైన మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్‌ను ఈరోజే (బుధవారం) ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గోదారమ్మకు భూదారి చూపించారు కేసీఆర్‌గారు. గోదావరి జలాలను 82 మీటర్ల నుంచి 612 మీటర్లకు పెంచి, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మూడేళ్లలోనే పూర్తి చేశారు. గోదావరితో పాటు తెలంగాణాలో ఉన్న మల్లన్న, కొండపోచమ్మ సాగర్‌లలో కూడా సినిమా షూటింగ్‌లు చేసుకోవాలని పవన్ కల్యాణ్, సినిమా పరిశ్రమను కోరుకుంటున్నాను’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. పవన్ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీమ్లా నాయక్’. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం రేపు(ఫిబ్రవరి 25) విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ‘భీమ్లా నాయక్’ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకలో ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ – ‘‘నాలుగేళ్ల క్రితం ఇదే గ్రౌండ్‌కి చరణ్ చిత్రం కోసం వచ్చినప్పుడు ‘తండ్రేమో మెగాస్టార్.. బాబాయ్ పవర్‌స్టార్’ అని మీ (పవన్ కల్యాణ్) పేరు చెప్పినపుడు నన్ను అభిమానులు మట్లాడనివ్వలేదు. మంచి మనిషి, విలక్షణమైనౖ శైలితో పాటు కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సూపర్‌స్టార్ పవన్ కల్యాణ్. మేమందరం కాలేజీ రోజుల్లో మీ ‘తొలిప్రేమ’ చూసినవాళ్లమే. అప్పటినుండి ఇప్పటివరకూ 25 ఏళ్ల పాటు ఒకే రకమైన స్టార్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం అసాధరణమైన విషయం. నల్గొండ నుండి వచ్చి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సాగర్ కే చంద్ర మరిన్ని విజయాలు సాధించాలి. ఈ చిత్రం ద్వారా చాలా మంది అజ్ఞాతసూరీడులను అందించిన చిత్రబృందానికి అభినందనలు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ – ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌గార్లు హైదరాబాద్ సినిమా హబ్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. సినిమాలకు సంబంధించిన సింగిల్ విండో, ఐదో షో, టికెట్స్ రేట్స్ తదితర సమస్యలను త్వరితగతిన ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ‘భీమ్లా నాయక్’ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘సోదరులు కల్వకుంట్ల తారాక రామారావుగారిని నేను ఆప్యాయంగా రాంభాయ్ అని పిలుస్తాను. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నా తరఫున, నిర్మాతలు, చిత్రయూనిట్ తరఫున కేటీఆర్‌గారికి ధన్యవాదాలు. నేను జనజీవితంలో ఉన్నా కానీ, సినిమా అనేది నాకు అన్నం పెట్టింది. సినిమా లేకపోతే నేను ఈ రోజు ప్రజాసేవలో ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఏదో అయిపోదామని కాదు కానీ.. మన దేశానికి, ప్రాంతానికి, మన రాష్ట్రాలకు, మనవాళ్లకీ ఎంతో కొంత చేయాలని... నాకు వేరే వృత్తి తెలియదు. సినిమానే నాకు డబ్బు సంపాదించుకునే వృత్తి. రాజకీయాల్లో ఉన్నా సినిమాల పట్ల బాధ్యతగానే ఉన్నాను. ‘తొలిప్రేమ, ఖుషీ’ సినిమాలను ఎంత బాధ్యతగా చేశామో ‘భీమ్లా నాయక్’ను అంతే బాధ్యతగా చేశాం. చిత్రపరిశ్రమకి రాజకీయాలు ఇమడవు. కళాకారులు కలిసే ప్రాంతం ఇది. నిజమైన కళాకారుడికి ప్రాంతం, కులం, మతం అనేవి పట్టవు. అలా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఎక్కడో చెన్నైలో ఉండిపోయిన తెలుగు చలనచిత్ర పరిశ్రమను.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేలా కృషి చేశారు అనేకమంది పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డిగారు వంటి రాజకీయ ప్రముఖులు. ప్రస్తుతం సీఎం చంద్రశేఖర్‌గారు మరింత ముందుకు తీసుకుని వెళ్లేలా ప్రోత్సాహం అందిస్తూ, తెలుగు చిత్రపరిశ్రమకు అందిస్తున్న తోడ్పాటుకి నా ధన్యవాదాలు. ఎప్పుడైనా సరే చిన్నపాటి అవసరం ఉందంటే... ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే తలసానిగారికి ధన్యవాదాలు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఒక మడమ తిప్పని యుద్ధమే ‘భీమ్లా నాయక్ చిత్రం’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే ఇకపై మరోలా ఉంటాయి. కల్యాణ్‌గారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను’’ అన్నారు రానా. ‘‘పంజా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పాస్ ఉన్నా కూడా లోపలికి వెళ్లి కల్యాణ్‌గారిని చూడలేకపోయాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు సాగర్ కె. చంద్ర. సంగీతదర్శకుడు తమన్, రచయిత కాసర్ల శ్యామ్, కెమెరామేన్ రవి కె. చంద్రన్, హీరోయిన్ సంయుక్తా మీనన్, గాయకుడు మొగిలయ్య, గాయని దుర్గవ్వ తదితరులు పాల్గొన్నారు. -
భీమ్లానాయక్ తాజా ట్రైలర్‌తో ఆ విమర్శలకు చెక్!
Pawan Kalyan Bheemla Nayak Movie: పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగింది. కాగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపినాద్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇక తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేపథ్యంలో మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఈ రిలీజ్ ట్రైలర్లో భీమ్లా నాయక్, డేనియర్ శేఖర్ పాత్రల్లో పవన్ కల్యాణ్, రానాలు ఇద్దరూ ఢీ అంటే ఢీ అనేలా ఉన్నారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో ఉంది. చివర్లో పవన్ కల్యాణ్, రానాలు తలపడుతూ అదరగొట్టారు. ఇక ఈ ట్రైలర్లో తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచింది. అయితే మునుపటి ట్రైలర్‌కు కొంత మిశ్రమ స్పందన వచ్చిందనే చెప్పాలి. దానికి సంబందించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ట్రైలర్ కట్కు సోషల్‌మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ తాజా రిలీజ్ ట్రైలర్‌తో ఆ విమర్శలకు చెక్ పెట్టింది చిత్ర యూనిట్. మొత్తంగా మునుపటి ట్రైలర్‌తో పోలిస్తే ఈ తాజా ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇక దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయనుంది. -
ప్రతీ డైలాగ్ పవర్ ఫుల్.. బాబాయ్ ట్రైలర్‌పై అబ్బాయి రివ్యూ
Ram Charan Response On Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల భారీ మల్టిస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'. ఫిబ్రవరి 25న ఈ మూవీ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీంతో ఇటూ మెగా ఫ్యాన్స్, అటూ దగ్గుబాటి ఫ్యాన్స్ ఉంత్కంఠగా మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేశారు. ఈ చిత్రం ట్రైలర్ చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా బాబాయ్ మూవీ ట్రైలర్‌పై అబ్బాయి రామ్ చరణ్ రివ్యూ ఇచ్చాడు. 'భీమ్లా నాయక్ ట్రైలర్ ఎలక్ట్రిఫైయింగ్గా ఉంది. పవన్ కల్యాణ్ గారి ప్రతీ డైలాగ్, యాక్షన్ పవర్‌ఫుల్‌గా ఉంది. నా మిత్రుడు రానా నటన, కనిపించిన తీరు సూపర్బ్‌గా ఉంది. త్రివిక్రమ్, సాగర్ కె చంద్ర, నిత్య మీనన్, సితార ఎంటర్టైన్మెంట్స్, తమన్‌కు ఆల్ ది బెస్ట్' అంటూ ట్విటర్ వేదికగా తెలిపాడు రామ్ చరణ్. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 21న జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫిబ్రవరి 23 (బుధవారం) సాయంత్రం భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. The trailer of #BheemlaNayak is electrifying!! Every dialogue & action of @PawanKalyan Garu was“POWERFUL” My buddy @RanaDaggubati’s performance & presence was top notch 👌#BheemlaNayakonFeb25 #Trivikram @saagar_chandrak @MenenNithya @SitharaEnts @MusicThaman ALL THE BEST!!👍 — Ram Charan (@AlwaysRamCharan) February 22, 2022 -
భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సాగర్ కె చంద్ర డైరెక్షన్లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి లీడ్ రోల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23న(బుధవారం) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఇందుకోసం యూసఫ్ గూడ పోలిస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. సాయంత్రం జరగబోయే ఈ ఈవెంట్ నేపథ్యంలో ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది నగర పోలీస్ శాఖ. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 2గం నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ చెక్‌పోస్ట్ వైపు వాహనాలకు అనుమతి నిరాకరిస్తారు. సవేరా ఫంక్షన్ హాల్, క్రిష్ణ కాంత్ పార్క్, కళ్యాణ్ నగర్, సత్యసాయి నిగమాగమం, కృష్టానగర్ మీదుగా వాహనాల మళ్లింపు ఉంటుంది. #HYDTPinfo Commuters, please make note of traffic restrictions/diversions in view of the Pre-Release Event of the Telugu movie "Bheemla Nayak" at 1st TSSP Bn. Grounds, Yousufguda on 23.02.2022.@JtCPTrfHyd pic.twitter.com/lUn348As8R — Hyderabad Traffic Police (@HYDTP) February 22, 2022 pic.twitter.com/xihE3KATJj — Hyderabad Traffic Police (@HYDTP) February 22, 2022 అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం వైపు మళ్లిస్తారు. సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, ప్రభుత్వ పాఠశాలల్ని పార్కింగ్ ప్రదేశాలుగా గుర్తించారు. వాహనదారులు ఈ రూట్లలో ప్రయాణించి.. అసౌకర్యానికి గురికాకూడదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్లు చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 21వ తేదీనే ఈ ఈవెంట్ జరగాల్సిన ఉండగా.. ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఈవెంట్‌ను వాయిదా వేశారు. దీంతో 21వ తేదీతో ఇచ్చిన పాసులకు అనుమతి ఉండదని, కేవలం 23వ తేదీతో ఉన్న పాసులకు మాత్రమే అనుమతి ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు సమాచారం. -
త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఆడియో లీక్‌పై స్పందించిన బండ్లగణేష్
Bandla Ganesh Clarity On Audio Leak : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన సినిమా ఫంక్షన్లకి బండ్ల గణేష్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే రీసెంట్గా పవన్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తనను రాకుండా త్రివిక్రమ్ అడ్డకుంటున్నారంటూ బండ్ల గణేష్ మాట్లాడిన ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో త్రివిక్రమ్‌ని దూషిస్తూ బండ్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. అయితే తాజాగా ఈ ఆడియో క్లిప్‌పై స్పందించిన బండ్ల గణేష్.. అది తన గొంతు కాదని, ఎవరో కావాలనే ఇలా క్రియేట్ చేశారంటూ కొట్టి పారేశారు. అయితే దీనిపై అఫీషియల్‌గా ఓ స్టేట్మెంట్ ఇచ్చేందుకు మాత్రం ఆయన ఇష్టపడకపోవడం గమనార్హం. కాగా పవన్ కల్యాణ్, రానా మల్టీస్టారర్లుగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఈనెల 25న రిలీజ్ కానుంది. -
భీమ్లా నాయక్ ట్రైలర్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్, పవన్‌పై వరస సటైరికల్ ట్వీట్స్
RGV Comments On Bheemla Nayak Trailer: రామ్ గోపాల వర్మ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనదైన సైటిరికల్ కామెంట్స్‌తో నిత్యం సినీ, రాజకీయ సెలబ్రెటీలను కవ్విస్తుంటాడు వర్మ. అందుకే ఆయన పెట్టే ప్రతి పోస్ట్, ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఈ మధ్య వర్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి ఆర్జీవీ ఆయనపై కౌంటర్‌గా వరస ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు. చదవండి: ఘనంగా అనిల్ అంబానీ కుమారుడి వివాహం, బచ్చన్ ఫ్యామిలీ సందడి ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ అతడిపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న(ఫిబ్రవరి 21) విడుదలైన భీమ్లా నాయక్ ట్రైలర్ వర్మ వ్యంగ్యంగా స్పందించాడు. ఈ మేరకు భీమ్లా నాయక్ ట్రైలర్‌పై వర్మ కామెంట్ చేస్తూ.. ‘నిజాయితిగా చెప్పాలంటే ట్రైలర్ చూసిన తర్వాత భీమ్లా నాయక్‌కు బదులుగా డేనియల్ శేఖర్ అని పిలవాలని ఉందన అన్నాడు. ‘ఎందుకంటే బాహుబలి తర్వాత రానాకు ఉత్తరాదినా(బాలీవుడ్) పవన్ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉంది. చదవండి: దర్శకుడిగా మారిన ఎడిటర్.. తుపాకీతో నిఖిల్ యాక్షన్ బాహుబలి తర్వాత రానాకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో రానా విలన్‌గా కంటే కూడా హీరోగా మారే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది’ అంటూ రాసుకొచ్చాడు. అంతేగాక ‘భీమ్లా నాయక్ ట్రైలర్ చూస్తుంటే మూవీ యూనిట్ రానా పాపులారిటీ పెంచడానికే పవన్ కళ్యాణ్‌ను తగ్గించినట్లు కనిపిస్తోంది. పవన్ అభిమానిగా నేను చాలా హర్ట్ అయ్యాను’ అంటూ మరో ట్వీట్లో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్రైలర్‌పై వర్మ చేసిన కామెంట్స్ చూసిన పవన్ ఫ్యాన్స్ ఆయనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్జీవీకి తమదైన శైలిలో కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. -
'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్ న్యూ డేట్.. ఎప్పుడంటే!
పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం(ఫిబ్రవరి 21న) జరగాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో ఆయన గౌరవార్థంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్‌తో పాటు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలు ఈవెంట్‌ను నిర్వహిస్తారా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఫిబ్రవరి 23 (బుధవారం) నాడు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లోనే నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ట్రైలర్
Pawan Kalyan Bheemla Nayak Official Trailer Out Now: పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా భీమ్లా నాయక్. తెలుగు ప్రేక్షకుల మోస్ట్ అవేయిటేడ్ అయిన ఈ మూవీ ఫిబ్రవరి 25న థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే సోమవారం నాడు 8.10 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పలు అనివార్య కారణాల వల్ల ఒక గంట పోస్ట్ చేసి 9.10 గంటలకు భీమ్లా నాయక్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్లో తివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్‌లు అదిరిపోయాయి. తమన్ మ్యూజిక్‌తోపాటు పవన్ కల్యాణ్, రానా యాక్టింగ్ సూపర్బ్ అనిపించాయి. సోమవారం ఫిబ్రవరి 21 జరగాల్సిన ఈ సినిమా ప్రిరిలీజ్ వేడుక వాయిదా పడింది. పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా తివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. అయితే ఫిబ్రవరి 21న జరగాల్సిన ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. -
భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా
పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. సోమవారం(ఫిబ్రవరి 21న) జరగాల్సిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి గౌరవార్థంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించాడు. ఈమేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన జారీ చేశాడు. 'మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం వల్ల నెలకొన్న విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. దీని వివరాలను చిత్రనిర్మాణ సంస్థ తెలియజేస్తుంది' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి 8.10 గంటలకు భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజవుతుండగా ఫిబ్రవరి 25న సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు. -
ఫిబ్రవరి చివరి వారంలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే!
కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో సినిమాలు ఆడక సినీప్రియులు తీవ్ర నిరాశ చెందారు. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతుండటంతో చిన్నాపెద్ద సినిమాలన్నీ వరుసపెట్టి రిలీజవుతున్నాయి. సినీప్రియుల దాహాన్ని తీర్చేందుకు సిద్ధమంటున్నాయి. కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమా కూడా హిట్ అవుతుండగా పస లేకుంటే పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇదిలా ఉంటే థియేటర్‌కు వెళ్లడం కష్టం అనుకునేవాళ్లకోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉండనే ఉంది. మరి ఫిబ్రవరి నాలుగో వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజవుతున్నాయో చూసేయండి.. థియేటర్లో విడుదలవుతున్న చిత్రాలు ► వలిమై - ఫిబ్రవరి 24 ► భీమ్లా నాయక్ - ఫిబ్రవరి 25 ► గంగూబాయి కథియావాడి - ఫిబ్రవరి 25 ఓటీటీలో వస్తున్న మూవీస్.. ఆహా ► సెహరి - ఫిబ్రవరి 25 అమెజాన్ ప్రైమ్ వీడియో ► ద ప్రోటేష్ - ఫిబ్రవరి 25 జీ 5 ► లవ్ హాస్టల్- ఫిబ్రవరి 25 నెట్‌ఫ్లిక్స్ ► సోషల్ మ్యాన్ - ఫిబ్రవరి 24 ► ద ఫేమ్ గేమ్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 25 ► జువైనల్ జస్టిస్ (కొరియన్ వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 25 ► ఎ మాడియా హోమ్ కమింగ్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 25 ► వైకింగ్స్: వాల్హాల (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 25 ► బ్యాక్ టు 15 - ఫిబ్రవరి 25 హాట్‌స్టార్ ► స్టార్స్ వార్స్ ఒబీ- వాన్ కెనోబి (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 25 సోని లివ్ ► అజగజాంతరం - ఫిబ్రవరి 25 ► ఎ డిస్కవరీ ఆఫ్ విచెస్ - ఫిబ్రవరి 25 ఆల్ట్ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ ► లాకప్ షో- ఫిబ్రవరి 27 వూట్ ► సూపర్ పంప్డ్ - ఫిబ్రవరి 28 -
భీమ్లా నాయక్‌కు ఓటీటీల పోటీ, భారీ డీల్‌కు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థలు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల మల్టిస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25న ఈ మూవీ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీంతో ఇటూ మెగా ఫ్యాన్స్, అటూ దగ్గుబాటి ఫ్యాన్స్ ఉంత్కంఠగా మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంతో భీమ్లా నాయక్‌కు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే థియేట్రికల్ రిలీజ్ అనంతరం ప్రతి కొత్త సినిమా నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ చిత్రాలు పోస్ట్ రిలీజ్‌కు కళ్లు చెదిరే డీల్‌కు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో పుష్ప, అఖండ తదితర చిత్రాలు ఉన్నాయి. అయితే రిలీజ్‌కు ముందే భీమ్లా నాయక్ డిజిటల్ రిలీజ్‌కు పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. మేకర్స్ కళ్లు చెదిరే డీల్‌కు భీమ్లా నాయక్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చాయట. ఫైనల్‌గా ఈ సినిమాను ఆహాతో కలిసి డిస్నీప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుందని చెబుతున్నారు. రెండు దిగ్గజ ఓటీటీ సంస్థలు భీమ్లా నాయక్ ఓటీటీ రిలీజ్ రైట్స్‌ను దక్కించుకున్నాయనే వార్త ఆసక్తిని సంతరించుకుంది. దీంతో ఈ మూవీ మేకర్స్‌తో భారీగా ఓప్పందం కుదుర్చుకున్నాయని, కళ్లు చేదిరే డీల్‌కు భీమ్లా నాయక్ ఓటీటీ రైట్స అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈ మూవీ థియేటర్లో విడుదలైన 50 లేదా 30 రోజుల తర్వాత ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానుందని చెబుతున్నారు. కాగా మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్ ఇది. ఇందులో నిత్యా మీనన్, సంయుక్తి మీనన్లుఏ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాని సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. -
గెట్ రెడీ.. 'భీమ్లా నాయక్' ట్రైలర్ వచ్చేది అప్పుడే
Bheemla Nayak Trailer Date Confirmed: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్ల వస్తున్న మల్టిస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తుంది. మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌పై ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యింది. నిజానికి నిన్న(ఫిబ్రవరి19)న ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజాగా ట్రైలర్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈనెల21న జరగనున్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ ఈవెంట్‌కు మంత్రి కేసీఆర్‌తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చీఫ్ గెస్టులుగా రానున్నట్లు సమాచారం. A peek into the Ultimate face-off of DUTY and POWER 🌟💪#BheemlaNayakTrailerStorm from 21st Feb 🌪️#BheemlaNayakTrailerOnTheWay 🔥 #BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 pic.twitter.com/04RDWylmav — Sithara Entertainments (@SitharaEnts) February 19, 2022 -
‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్, ముఖ్య అతిథిగా..
Bheemla Nayak Pre Release Event: టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో తెరకెక్కిన మల్టిస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టిన చిత్ర బృందం త్వరలో మూవీ ట్రైలర్ విడుదలకు, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీ-రిలీజ్ వేడుకకు డేట్ ఫిక్స్ చేశారని, దీనికి ముఖ్య అధితిగా తెలంగాణకు చెందిన ప్రముఖ మంత్రి రానున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు సోమవారం(ఫిబ్రవరి 21) పోలీసు గ్రౌండ్స్‌లో భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ కార్యక్రమం జరగనుందని, దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామరావు(కేటీఆర్) ముఖ్య అతిథిగా హజరకానున్నారని సీతార ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే కాగా ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించిన ఈ మూవీకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు. View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) -
భీమ్లా నాయక్ నిర్మాత నోటి దురద.. ఆపై సారీ!
ప్రేక్షకులకు ప్రముఖ నిర్మాత, భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్షమాపణలు తెలిపాడు. ఇటీవల టీజే టిల్లు సక్సెస్ మీట్లో మాట్లాడిన ఆయన కాస్తా నోటి దురుసు చూపించాడు. ప్రేక్షకులను ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడాడు. దీంతో అతడి మాటలకు ఆడియన్స్ నొచ్చుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. ఇటీవల విశాఖపట్నంలో జరిగి డీజే టిల్లు సక్సెస్ మీట్‌తో నాగవంశీ ప్రేక్షకులను ‘వాడు, వీడు’ అంటూ మాట్లాడాడు. దీంతో ఆయన తీరు మాటలు ప్రేక్షకులను ఇబ్బంది కలిగించాయి. చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు ఈ విషయం తెలిసి నాగవంశీ ట్విటర్ వేదిక క్షమాపణలు కోరాడు. ‘ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థకైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో డీజే టిల్లు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రక్షకులకు ఇబ్బంది కలిగించాయనే వార్తలు తెలిసి బాధపడ్డాను’ అంటూ ఆయన నోట్ విడుదల చేశాడు. అలాగే సోదర భావంతోనే వారిని అలా ఏకవచనంతో సంభోదిస్తూ మాట్లాడానని, అయినా వారి మనసునొచ్చుకోవడం పట్ల క్షంతవ్యుడినయ్యానన్నాడు. ‘ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం, వారే మా బలం’ అంటూ నిర్మాత నాగవంశీ పేర్కొన్నాడు. చదవండి: ఓటీటీలో ‘96’ తెలుగు వెర్షన్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. 🙏 pic.twitter.com/WzjueNtDOw — Naga Vamsi (@vamsi84) February 18, 2022 -
మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, ‘ఆచార్య, భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్స్ కూడా వచ్చేశాయి
ఈ ఏడాది సంక్రాంతి బరిలో రావాల్సిన పాన్ ఇండియా చిత్రాలు, భారీ బడ్జెట్, పెద్ద సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ప్రేక్షకులు ఈ సంక్రాంతికి చిన్న సినిమాలతో సరిపెట్టుకున్నారు. ఇక కరోనా కేసులు తగ్గుముఖం పడ్డనుండటంతో వాయిదా పడ్డ పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలను వరసగా ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్‌ను జక్కన ప్రకటించగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించింది ఆ చిత్ర బృందం. 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న వస్తుండగా.. చిరు, చరణ్‌ల 'ఆచార్య' మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుందని తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. తొలుత ఫిబ్రవరి 4న రిలీజ్ డేట్‌ను ఖరారు చేసిన ఆచార్య దర్శక-నిర్మాతలు కరోనా కారణంగా ఏప్రిల్ 1 అని నిర్మాతలు లోగడ ఎనౌన్స్ చేశారు. ఇక పలు చర్చల అనంతరం చివరకు విడుదల తేదీని ఏప్రిల్ 29కి నిర్ణయించి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరిగిన పిమ్మట, పరస్పర అవగాహన, అంగీకారంతో ఓ నిర్ణయానికి వచ్చినట్టు చిత్ర నిర్మాణ సంస్థ వివరించింది. #Acharya on 29th April In Theatres pic.twitter.com/ptYGJnzPoQ — Aakashavaani (@TheAakashavaani) January 31, 2022 చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించిన 'ఆచార్య' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కించారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్‌పై కూడా తాజాగా మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు. అంతా బాగుంటే ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని, లేదా ఏప్రిల్ 1వ తేదీకి విడుదల చేస్తామంటూ కొద్ది సేపటి క్రితం భీమ్లా నాయక్ మేకర్స్ ట్వీట్ చేశారు. As we have always promised, #BheemlaNayak will be a massive theatrical experience. So, we have to wait for the pandemic to subside for presenting it in the theatres for you all. We intend to release the movie on 25th February or 1st April, whenever the situation improves! pic.twitter.com/7DfEFTF9gp — Sithara Entertainments (@SitharaEnts) January 31, 2022 -
పవన్‌కల్యాణ్‌ను మళ్లీ టార్గెట్ చేసిన ఆర్జీవీ.. ట్వీట్స్ వైరల్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్ టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఆయన్ని పాన్ ఇండియా స్టార్‌గా చూడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పవన్-రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లానాయక్‌ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని కోరారు. ఇటీవలె విడుదల పుష్ప హిందీలో భారీ వసూళ్లు రాబట్టి మంచి సక్సెస్ సాధించిందని, మరి భీమ్లానియక్ ఇంకెంత కలెక్ట్ చేయాలి అంటూ ప్రశ్నించారు. ఇటీవలె అల్లు అర్జున్ గురించి పెట్టిన ట్వీట్స్ అన్నీ వోడ్కా టైంలో పెట్టాను. కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైంలో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ని అర్థం చేసుకోండి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు పాన్ ఇండి స్టార్లుగా అయిపోతుంటే, మీరు ఇంకా తెలుగులోనే సినిమాలు చేయడం మాకు బాధగా ఉంది. దయచేసి భీమ్లానాయక్‌ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయండి అని వర్మ వరుస ట్వీట్లతో హీటెక్కించారు. ప్రస్తుతం పవన్‌పై వర్మ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు @tarak9999 , @AlwaysRamCharan కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి — Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022 … @allu_arjun గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి @PawanKalyan — Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022 పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ @PawanKalyan అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము — Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022 . @pawankalyan గారూ ,ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్‌ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు...ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి. — Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022 -
‘పద్మ శ్రీ’మొగులయ్య.. 12 మెట్ల కిన్నెర.. తెలంగాణలో ఒక్కరే!
‘ఆడా లేడు మియాసావ్.. ఈడా లేడు మియాసావ్.. పానిగంటి గుట్టలమీద పావురాల గుండున్నదీ.. రాత్రి గాదు.. ఎలుగు గాదు.. వేగుచుక్క పొడువంగానే పుట్టిండాడు పులిబిడ్డ..’ అంటూ తన 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే.. అటుగా వెళ్తున్న వారి కాళ్లు అక్కడే ఆగిపోతాయి. మధురమైన సంగీతం, లయబద్ధమైన పాటకు కిన్నెరపై నాట్యమాడే చిలుకను చూస్తూ చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా మైమరచిపోవాల్సిందే. ఊయలలో పసిపాప నిదురపోయేటప్పుడు.. ఊడలమర్రి కింద ఊర్లో జనం సేద తీరేటప్పుడు.. వెన్నెల వాకిట్లో కురిసిన పల్లెగానం.. ఇప్పుడు నల్లమల నుంచి ఢిల్లీకి తాకింది. ప్రాచీన సంగీత వాయిద్యం ‘కిన్నెర’ కళాకారుడు దర్శనం మొగులయ్యను పద్మశ్రీ అవార్డు వరించింది. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. జులపాల జుట్టు, పంచెకట్టు, కోరమీసం.. భుజం మీద 12 మెట్ల వాయిద్యంతో ఆకట్టుకునే ఆహార్యంలో ఉండే దర్శనం మొగులయ్యది నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట. ఆయన పలికించే కిన్నెర సంగీతంతో పాటు ఆలపించే వీరగాథల్లో పౌరుషం ఉప్పొంగుతుంది. పురాతన కిన్నెర వాయిద్యం నుంచి వచ్చే సంగీతం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తుంది. జానపద గాథలైన పండుగ సాయన్న కథ, సీతమ్మ పర్ణశాల, దాదిమా ధర్మశాల, పానుగంటి మియాసాబ్, పిల్లా జాతర బోదం పిల్ల.. అంటూ పా టలు పాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. పానుగంటి మీరాసాబ్ కథ, ఎండమెట్ల ఫకీరయ్య, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ, పాలమూరు జానపద వీరుడు మియాసాబ్ గాథను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తాడు. పెద్దలను కొట్టి పేదలకు పంచే పండుగ సాయన్న వీరగాథ చిన్నా పెద్దా ఆసక్తిగా వింటారు. బలిసినోళ్లను దోచి పేదవారికి పంచి పెట్టి, పేదల పెళ్లిళ్లు చేసిన పండుగ సాయన్న కథను మొగులయ్య ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆ పాటతో మరింత ఫేమస్ కిన్నెర కళ అంతరించిపోతుండటంతో మొగులయ్య దానికి మళ్లీ ప్రాణం పోయాలనుకున్నారు. ఈయన కళను గుర్తించి ఎంతోమంది ఆయనకు బాసటగా నిలిచారు. తెలుగు యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్ దాసరి రంగ మొగులయ్యను ప్రోత్సహించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. కాలక్రమంలో ఎందరో ఆప్తులుగా మారి అండగా నిలిచారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో టైటిల్ సాంగ్ పాడి మొగులయ్య మరింత ఫేమస్ అయ్యారు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా ‘భీమ్లా నాయక్’ సినిమా పాటతో బాగా పాపులర్ అయ్యారు. కష్టాల్లోనూ కిన్నెరను వదలలేదు మొగులయ్య పూర్వీకులు తాతలు, ముత్తాతల కాలం నుంచి కిన్నెర వాయిస్తూనే జీవనోపాధి పొందారు. తర్వాత ఆ కుటుంబంలో ఎవరూ ఈ కళను నేర్చుకునేందుకు ఆసక్తి చూపలేదు. సుమారు 500 ఏళ్ల కిందటి నుంచి ఉపయోగిస్తున్న కిన్నెర మొదట ఏడు మెట్లు మాత్రమే ఉండేది. మొగులయ్య ప్రత్యేక శ్రద్ధతో తర్వాత 12 మెట్ల కిన్నెరగా తీర్చిదిద్ది.. ఆ వాయిద్యంతో మరిన్ని రాగాలను పలికిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మొగులయ్యకు సెంటు భూమి లేదు. కిన్నెరనే ఆయన జీవనాధారం. అనారోగ్యంతో భార్య, కుమారులు, కుమార్తెలు ఒక్కొక్కరిగా మరణించారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఏనాడూ కిన్నెరను విడిచిపెట్టలేదు. పొట్టకూటి కోసం వరంగల్, మహారాష్ట్రలో మట్టిపని చేస్తూ కాలం ఎల్లదీశాడు. పన్నెండేళ్ల ప్రాయంలో కిన్నెర పట్టుకున్న మొగులయ్య వృద్ధాప్యం వచ్చినా.. తన కళను బతికించేందుకు తపిస్తూనే ఉన్నారు. శతాబ్దాల నాటి సంప్రదాయ పురాతన వాయిద్యం కిన్నెరను మొగులయ్య జీవనోపాధిగా చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కళను నేర్చుకునేవారు కరువయ్యారు. కిన్నెర తయారీ సైతం ఎవరూ చేయడం లేదు. అంతరించిపోతున్న దశలో ఉన్న అరుదైన కిన్నెరను 12 మెట్లుగా అభివృద్ధి చేసిన ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శనలిచ్చారు. ఈయన జీవిత చరిత్ర ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న కళాకారుడు మొగులయ్య ఒక్కరే. -
శెభాష్ దర్శనం మొగిలయ్య.. కిన్నెర కళాకారుడికి 'పద్మశ్రీ'
సాక్షి, హైదరాబాద్: 2022 సంవత్సరానికిగాను భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఎప్పటిలానే వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను కొంతమందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని పద్మ అవార్డులు వరించాయి. అందులో మొగిలయ్య ఒకరు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం.. తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డ్‌ని ప్రకటించింది. మొగిలయ్య 12 మెట్ల కిన్నెర వాయిస్తూ అంతరించిపోతున్న కళను బ్రతికిస్తూ.. కథలు చెప్పుకుంటూ తన జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రంలో మొగిలయ్య టైటిల్ సాంగ్ మొదట్లో కొంత బాగాన్ని పాడిన సంగతి తెలిసిందే. ఆ పాటతో ఆయన మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యారు. -
సంక్రాంతి స్పెషల్: పోస్టర్లు, పాటలతో సందడే సందడి
సంక్రాంతి పండగ సందర్భంగా పండగే పండగ అంటే కనువిందైన పోస్టర్లు, వీనుల విందైన పాటలు, టైటిల్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి... సినిమా ప్రియులకు పండగ తెచ్చాయి. కుటుంబసమేతంగా రామారావు వచ్చాడు. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మార్చి 25న థియేటర్లకి వస్తామని పేర్కొంటూ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. రవితేజ ఫ్యామిలీతో వస్తే... హాట్ హాట్‌గా దూసుకొచ్చారు తమన్నా. వరుణ్ తేజ్‌తో కలసి ‘గని’ చిత్రంలో ఈ బ్యూటీ స్టెప్పులేసిన ప్రత్యేక పాట ‘కొడితే..’ విడుదలైంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 18న విడుదల కానుంది. ఇక పందెం కోళ్లలా బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నట్లు ‘భీమ్లా నాయక్’ నుంచి పవన్ కల్యాణ్, రానా మాస్ లుక్ పోస్టర్ విడుదలైంది. పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జంటగా సంయుక్తా మీనన్ నటించిన ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే ఫిబ్రవరి 25కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరోవైపు రోట్లో ఏదో నూరుతూ చిరునవ్వులు చిందిస్తూ సందడి చేసింది జయమ్మ. సుమ కనకాల టైటిల్ రోల్లో నటిస్తున్న ‘జయమ్మ పంచాయతీ’ టైటిల్ సాంగ్‌ని పండగ సందర్భంగా వినిపించారు. ఈ పాటను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించారు. ఎం.ఎం. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శ్రీకృష్ణ పాడారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకోవైపు యువహీరో నవీన్ పోలిశెట్టి నటించనున్న తాజా చిత్రానికి ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ ఖరారైంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ఆరంభం కానుంది. ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ, ఓ వీడియోను విడుదల చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న మరో చిత్రం ‘స్వాతిముత్యం’ ప్రచార చిత్రం విడుదలైంది. ఈ చిత్రం ద్వారా గణేష్ బెల్లంకొండ హీరోగా పరిచయం అవుతున్నారు. లక్ష్మణ్.కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తున్నారు. త్వరలో పూర్తి కానున్న ఈ చిత్రం వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇంకా కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘సమ్మతమే’ పోస్టర్ విడుదలైంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్. అలాగే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘మన్మథలీల’ పోస్టర్ విడుదలైంది. అశోక్ సెల్వన్, సంయుక్తా హెగ్డే, స్మృతీ వెంకట్, రియా సుమన్ హీరో హీరోయిన్లుగా టి.మురుగానందం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పండగ సందర్భంగా ఇంకా పలు చిత్రాల లుక్స్, పాటలు తదితర అప్డేట్స్ వచ్చాయి. -
పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుకగా
Pawan Kalyan Bheemla Nayak New Poster On The Sankranti Eve: టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ల వస్తున్న మల్టిస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్. అయితే జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే అభిమానులను నిరాశ పరచకుండా ఉండేందుకు పోస్టర్స్, సాంగ్స్ వంటివి విడుదల చేస్తున్నారు. ఇదీవరకు న్యూ ఇయర్ సందర్భంగా భీమ్లా నాయక్ సాంగ్ డీజే వెర్షన్‌ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. తాజాగా సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఆడియెన్స్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టర్లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. నోట్లో సిగరెట్ పెట్టకుని రానా దర్జాగా నిలబడితే.. ఉగ్ర రూపంలో పౌరుషంగా పవన్ కల్యాణ్ నిలుచుని ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సంక్రాంతికి సినిమా విడుదల కాకపోయినా ఈ పోస్టర్ రిలీజ్ చేశారని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఇక భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జంటగా సంయుక్తా మీనన్ అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు! ✨ - Team #BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @sitharaents @adityamusic pic.twitter.com/K09KfOKi3S — Naga Vamsi (@vamsi84) January 15, 2022 ఇదీ చదవండి: లాలా భీమ్లా డీజే వెర్షన్ వచ్చేసింది, మామూలుగా లేదుగా.. -
ధనుష్ మూవీ నుంచి ‘భీమ్లా నాయక్’ హీరోయిన్ను తప్పించారా?, ఏం జరిగింది..
Dhanush Sir Movie Heroine Samyuktha Menon Suddenly Walked Out: కోలివుడ్ స్టార్ హీరో, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ నేరుగా ఓ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ ద్విభాష చిత్రానికి తెలుగులో ‘సార్’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. తమిళంలో ‘వాతి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లో నిర్మించనున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తోందని చిత్ర బృందం ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ తప్పకుందంటూ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. కాగా సంయుక్త మీనన్ భీమ్లా నాయక్‌లో రానాకు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే భీమ్లా నాయక్ మూవీ నిర్మాత నాగవంశీనే ధనుష్ సార్ మూవీకి నిర్మాత కావడంతో పాటు, త్రివిక్రమ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ భీమ్లా నాయక్‌కు స్రీన్‌ప్లే అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సార్ మూవీకి సంయుక్త మీనన్ హీరోయిన్గా తీసుకోవడంతో ఫిల్మ్ సర్కిల్లో ఈ అప్డేట్ ఆసక్తిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సార్ మూవీ నుంచి సంయుక్త మీనన్ తప్పించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. చదవండి: డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుండగా.. సంయుక్త షూటింగ్‌కు దూరంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. దీనిపై మేకర్స్ నుండి కానీ.. సంయుక్త నుండి కానీ ఇంకా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె సార్ నుంచి తప్పుకున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే సంయుక్త సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం సార్ మూవీకి సంబంధించిన అప్డేట్స్, పోస్టులు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఇది నిజమా కదా అన్నది చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. -
లాలా భీమ్లా డీజే వెర్షన్ వచ్చేసింది, మామూలుగా లేదుగా..
టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ల వస్తున్న మల్టిస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్. అయితే జనవరి 12న విడుదల రావాల్సిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని అభిమానులందరూ ఆశించారు. కానీ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాల కోసం భీమ్లానాయక్ విడుదల తేదీని వాయిదా వేయాలని నిర్మాత కోరడంతో పవన్ కల్యాణ్ ఒప్పుకోగా పోస్ట్‌పోన్ అయింది. అయితే ఈ న్యూ ఇయర్‌కు పవన్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చేందుకు ఇందులోని హిట్ సాంగ్ లాలా భీమ్లా నాయక్ పాటను డీజే వెర్షన్ అందిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈ రోజు(డిసెంబర్ 31)న లాలా భీమ్లానాయర్ డీజే వెర్షన్ మేకర్స్ రిలీజ్చేశారు. కాగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ తన మ్యూజిక్‌తో ప్రేక్షకులనందరిని ఉర్రూతలూగిస్తున్నాడు. ఈ సినిమాకు కూడా పవన్ కల్యాణ్ స్టార్డమ్కు తగ్గట్లుగా మ్యూజిక్ ఇరగదీస్తున్నాడు. లాలా భీమ్లా నాయక్ పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండింగ్‌లో నిలిచింది. ఇదే పాటను తమన్ డీజే వెర్షన్‌గా మలిచాడు. -
భీమ్లా నాయక్‌కు డీజే మిక్స్.. న్యూ ఇయిర్కు న్యూ వెర్షన్
Bheemla Nayak Song DJ Version Released On New Year: టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ల వస్తున్న మల్టిస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో అనేది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందనేది ఈ మూవీ కథ. అయితే ఇటీవలే ఈ సినిమాను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జనవరి 12న విడుదల రావాల్సిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని అభిమానులందరూ ఆశించారు. కానీ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాల కోసం విడుదల తేదిని వాయిదా వేసేందుకు పవన్ కల్యాణ్ ఒప్పుకోగా పోస్ట్‌పోన్ అయింది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా పాటలు, గ్లింప్స్ సినిమా స్థాయిని మరింత పెంచేశాయి. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ తన మ్యూజిక్‌తో ప్రేక్షకులనందరిని ఉర్రూతలూగిస్తున్నాడు. ఈ సినిమాకు కూడా పవన్ కల్యాణ్ స్టార్డమ్కు తగ్గట్లుగా మ్యూజిక్ ఇరగదీస్తున్నాడు. సినిమాలోని లాలా భీమ్లా నాయక్ పాట ఎంత హిట్ అయిందో చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో కూడా ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ పాటకు తమన్ కొత్త వెర్షన్‌ను తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే అలరిస్తోన్న ఈ పాటకు డీజే సాంగ్‌గా మలిచాడు. అయితే ఇటీవల కాలంలో వస్తున్న డీజే సాంగ్స్ సంగీత ప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఈ డీజే సాంగ్స్ నెట్టింట కూడా రకరకాల రీల్స్, స్పూఫ్స్తో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ డీజే మిక్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించవచ్చు. ఈ లాలా భీమ్లా నాయక్ సాంగ్ డీజే మిక్స్‌ను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31న రాత్రి 7 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ డిసెంబర్ 31కు స్పీకర్స్‌ను సిద్దం చేసుకోండి అని తమన్ ట్వీట్ చేశాడు. అంటే ఈ డీజే మిక్స్డ్ సాంగ్‌తో న్యూ ఇయర్ మోత మోగిపోనుందని తెలుస్తోంది. అయితే ఈ డీజే మిక్స్ పాట సినిమాలో ఉండకపోవచ్చు. #LalabheemlaDJ !! Get Ready Speakers 🎵 Time to get them kept serviced !! Let’s get #Lalafied ON 31st NIGHT !! #LalabheemlaDjVersion 🎹🥁 pic.twitter.com/nf34xhoYoT — thaman S (@MusicThaman) December 29, 2021 -
వెనక్కి తగ్గిన భీమ్లానాయక్, విడుదల తేదీ వాయిదా
Pawan Kalyan And Rana Daggubati Bheemla Nayak Movie Release Date Postponed: పవన్ కల్యాణ్-రానాల మల్టిస్టారర్ చిత్రం భీమ్లానాయక్ పోస్ట్‌పోన్ అయ్యింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న విడుదల కావాల్సిన ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ వాయిదా వేశారు. సంక్రాంతి బరిలో పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కారణంగానే భీమ్లానాయక్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ సంక్రాంతి తమ సినిమాను రిలీజ్ చేస్తామని, ఈ విషయంలో తగ్గేదే లే అంటూ పట్టుబట్టిన నిర్మాత నాగ వంశీ దిల్ రాజు కోరిక మేరకు తగ్గినట్టు సమాచారం. కాగా ‘రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్’ మూవీలు రిలీజ్ కానుండటంతో నిర్మాత దిల్ రాజు.. థియేటర్ల ఇబ్బందులు, ఇతర సమస్యలను వివరించి నిర్మాతలను ఒప్పించారు. చదవండి: ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌పై ట్రోల్స్, ఎట్టకేలకు స్పందించిన సమంత దీంతో భీమ్లా నాయక్‌ను శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్’ పాన్ ఇండియా చిత్రాలు మాత్రమే విడుదల కాబోతున్నాయి. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి విడుదలై ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్లకు విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. దీంతో విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు భీమ్లానాయ్ రిలీజ్ వాయిదా పడటం నిరాశ పరిచిందనే చెప్పాలి. -
Bheemla Nayak: పవన్ కల్యాణ్ బైక్ రైడ్.. వీడియో వైరల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా వస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ ఇటీవల వికారాబాద్ అడవుల్లో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. అయితే షూటింగ్ మధ్యలో రోడ్ పై ‘భీమ్లా నాయక్’ బైక్ రైడ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాకీ యూనిఫాంలో పవన్ బుల్లెట్ నడుపుతున్న వీడియోను పవర్ స్టార్ అభిమానులు షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంటే.. రానా ఇందులో రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇద్దరు వ్యక్తుల ఇగోలు హర్ట్ అయినప్పుడు వారెలా రియాక్ట్ అయ్యారనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. 👊⭐️🔥💕pic.twitter.com/tbNduyERPu — 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 17, 2021 -
అక్కడ భీమ్లా నాయక్ షూటింగ్.. ఎగబడ్డ పవన్ అభిమానులు
Bheemla Nayak Shooting Location: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో మల్లీస్టారర్‌గా వస్తోన్న చిత్రం భీమ్లా నాయక్. ఫాస్ట్ ఫాస్ట్‌గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ శుక్రవారం (డిసెంబర్ 17) ఉదయం వికారాబాద్‌లోని మదన్‌పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రారంభమైంది. ఈ చోటులో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. తాజాగా ఈ సెట్లోకి పవన్ కల్యాణ్ అడుగుపెట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పవన్ కల్యాణ్‌ను చూసేందుకు ఎగబడ్డారు. భారీగా లొకేషన్ వద్దకు చేరుకుని 'పవన్ కల్యాణ్.. పవన్ కల్యాణ్' అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన కారు నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో సెట్లో సందడి వాతావరణం నెలకొంది. సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రానా డానియల్ పాత్రలో చేస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు డైలాగ్స్ అందిస్తున్నారు. భీమ్లా నాయక్ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషీయమ్' సినిమాకు రీమెక్‌గా వస్తోంది 'భీమ్లా నాయక్'. -
రానా బర్త్‌డే: భీమ్లానాయక్ నుంచి డేనియల్ స్పెషల్ వీడియో
Rana Daggubati Special Video Release From Bheemla Nayak Movie: టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ల వస్తున్న మల్టిస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి రీమేక్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో అనేది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందనేది ఈ మూవీ కథ. ఈ రోజు(డిసెంబర్ 14) రానా బర్త్‌డే సందర్భంగా చిత్రం బృందం ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను వదిలింది. రానాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. చదవండి: నాని శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ వచ్చేసింది ‘వాడు అరిస్తే భయపడతావా.. ఆడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్ఐ.. సస్పెండెడ్’ అంటూ రానా ఆవేశంతో చెప్పే డైలాగ్‌తో ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూస్తుంటే ఇందులో రానా పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందనేది అర్థమైపోతుంది. ఇందులో రానా డేనియల్ శేఖర్ నెగిటివ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో పవన్ సరసన హీరోయిన్గా నిత్యామీనన్ నటిస్తుండగా.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. -
భీమ్లా నాయక్‌లో బ్రహ్మానందం.. పోస్టర్ విడుదల
Brahmanandam Look Poster Out From Bheemla Nayak Movie: బ్రహ్మానందం అంటే ఓ చక్కిలిగింతలు. కడుపుబ్బ నవ్వించే కమెడియన్. అనేక చిత్రాల్లో నటించిన ఆయన యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను నవ్వులు పూయించారు. తెలుగు తెరపై చెరగని చిరునవ్వును శాశ్వతంగా ఉంచిన కామెడి కింగ్‌లలో బ్రహ్మానందం ఒకరు. ఆయన నటించిన చిత్రాల్లోని సీన్లు, హావభావాలను ఇప్పటికీ మీమ్స్ రూపంలో వాడుతున్నారంటే ఆయన ఎంతలా నవ్వించారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అరకొర చిత్రాల్లో నటిస్తున్న బ్రహ్మానందం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'లో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని బ్రహ్మానందం లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో బ్రహ్మీ పోలీసు పాత్రలో నటిస్తున్నారు. బీమ్లా నాయక్‌లో బ్రహ్మానందం నటిస్తున్నారంటే యాక్షన్, డైలాగ్స్‌తోపాటు కామెడీ కూడా అదిరిపోద్దనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం నటించడం విశేషంగా మారింది. అయితే బ్రహ్మీ కామెడీ ఏమేరకు పండుద్దో సినిమా విడుదలయ్యేవరకూ ఆగాల్సిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం జనవరి 12, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు డైలాగ్స్ రాస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషీయమ్' చిత్రానికి ఇది రీమేక్. -
భీమ్లానాయక్: దూసుకుపోతున్న దుర్గవ్వ.. ట్రెండింగ్‌లో ‘అడవి తల్లి’
సాక్షి, కోటపల్లి(ఆదిలాబాద్): టాలీవుడ్లో జానపదాల హోరు వినిపిస్తోంది. చిన్న సినిమాలకే కాకుండా.. పెద్ద సినిమాలు సైతం జానపద జపం చేస్తున్నాయి. కూలీనాలి చేసుకుంటూ అలసట తెలియకుండా జీవనశైలిని వర్ణిస్తూ.. ప్రకృతిని ఆరాధిస్తూ.. దేవతలను కొలుస్తూ పాడేదే జానపదం. జనం నుంచి పుట్టిన పాటకు సమాజంలో ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం పల్లె పాటలకు మళ్లీ ఆదరణ లభిస్తుండటంతో జానపద కళాకారులు సినిమా రంగంలో రాణిస్తున్నారు. ఈ కోవలోనే పల్లె పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచిర్యాల జిల్లాకు చెందిన కుమ్మరి దుర్గవ్వ అనూహ్యంగా ఓ స్టార్ హీరో సినిమాలో పాటపాడే అవకాశం దక్కించుకుంది. ఆమె పాడిన ‘అడవి తల్లి’ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పల్లె పాటను ప్రాణం పెట్టి పాడిన సింగర్ కోసం నెటిజన్లు తీవ్రంగా వెతుకుతున్నారు. దుర్గవ్వ పాటకు ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు. గతంలోనూ ఈమె తెలుగుతోపాటు మరాఠీలోనూ అనేక పాటలు పాడింది. కళాకారులతో కుమ్మరి దుర్గవ్వ మారుమూల గ్రామం నుంచి.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ భర్త రాజయ్య చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. దుర్గవ్వకు కుమార్తె శైలజ, కుమారుడు ప్రభాకర్ ఉన్నారు. నిరుపేద కావడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. వరినాట్లు, పొలం పనులకు వెళ్లినప్పుడు దుర్గవ్వ తనకు వచ్చిన జానపద పాటలు పాడేది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న ఆమె కుమార్తె శైలజ తల్లితో పాటలు పాడిస్తూ యూట్యూబ్ అప్లోడ్ చేసేది. ఇలా దుర్గవ్వ పాడిన పాటలు హిట్ కావడంతో మంచిర్యాలకు చెందిన పలువురు జానపద కళాకారులు తమ ఆల్బమ్‌లలో పాటలు పాడించారు. ఆ పాటలు కూడా పాపులర్ కావడంతో మల్లిక్‌తేజ, మామిడి మౌనిక వంటి జానపద కళాకారులు దుర్గవ్వ కళను గుర్తించి అవకాశం ఇచ్చారు. సిరిసిల్ల చిన్నది.. నాయితల్లే.. అనే పాటతోపాటు ‘ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది. మామిడి మౌనిక, సింగర్ మల్లిక్‌తేజ సహకారంతో టాలీవుడ్ స్టార్హీరో సినిమాలో పాడే అవకాశం వచ్చిందని దుర్గవ్వ కుమార్తె శైలజ తెలిపారు. ‘అమ్మకు సినిమాలో పాడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని’ శైలజ ‘సాక్షి’కి ప్రత్యేకంగా తెలిపారు. ప్రస్తుతం దుర్గవ్వ హైదరాబాద్‌లో షూటింగ్లో బిజీగా ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. -
Bheemla Nayak: ‘అడవి తల్లి’ పాట పాడిన దుర్గవ్వ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి?
Adavi Thalli Mata Singer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీసారర్‌గా వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి నాలుగో సాంగ్ విడుదలైంది. ‘అడవి తల్లి’అనే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్ట్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ‘కిందున్న మడుసులకా పోపాలు తెమలవు.. పైనున్న సామేమో కిమ్మని పలకడు... దూకేటి కత్తులా కనికరమెరగవు.. అంటుకున్న అగ్గిలోన ఆనవాళ్లు మిగలవు..’అంటూ సాగా ఈ ‘అడవి తల్లి మాట’పాటకు రామజోగయ్యశాస్త్రీ లిరిక్స్ అందించగా, కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఈ పాట పాడిన సింగర్ గురించి వెతకడం ప్రారంభించారు నెటిజన్స్. కుమ్మరి దుర్గవ్వ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. దుర్గవ్వ మంచిర్యాల జిల్లాకు చెందినది. ఆమె చదువుకోలేదు. పొలం పనులకు వెళ్లినప్పుడు జానపదాలను పాడుతూ ఉంటుంది. తెలుగుతో పాటు మరాఠీలోనూ ఎన్నో పాటలు పాడారు. ఆమె పాడిన జానపదాల్లో.. 'ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే', 'సిరిసిల్లా చిన్నది' వంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయి. దీంతో ఆమెకు 'భీమ్లా నాయక్'లో ‘అడవి తల్లి’పాట పాడే అవకాశం వచ్చింది. ఈ పాటతో దుర్గవ్వ మరింత హైలైట్ అయింది. -
భీమ్లా నాయక్ నుంచి నాలుగో పాట.. 'అడవి తల్లి మాట'
Bheemla Nayak Movie 4th Song "Adavi Thalli Mata" Released: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి మల్టీసారర్‌గా వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, పాటలు, గ్లింప్స్ అదరగొడుతున్నాయి. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు డైలాగ్స్ రాస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు దర్శకనిర్మాతలు. అందులో భాగంగా తాజాగా 'భీమ్లా నాయక్' ఫోర్త్ సింగిల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. అయితే ఫోర్త్ సింగిల్ అయిన 'అడవి తల్లి మాట' పాటను డిసెంబర్ 1న విడుదల చేయాల్సింది. అక్షరయోధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతికి సంతాపంగా ఆ పాట రిలీజ్‌ను ఆపేసారు. చివరికీ ఇవాళ (డిసెంబర్ 4, శనివారం) ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చెప్పినట్టే ఇవాళ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ 'అడవి తల్లి మాట' పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. దుర్గవ్వ, సాహితి చాగంటి తమదైన గాత్రంతో పాడి ఆకట్టుకున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు తెలుగు రీమేక్‌గా 'భీమ్లా నాయక్' తెరకెక్కుతోంది. -
Bheemla Nayak : లాలా భీమ్లా ఫుల్ సాంగ్ వచ్చేసింది..
Pawan Kalyan Bheemla Nayak Song Lala Bheemla: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్, ఫస్ట్సింగిల్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి లాలా భీమ్లా సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. పవన్ పాత్రను హైలైట్ చేస్తూ సాగిన ఈ పాటను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశారు. ఆదివారం(నవంబర్7న) త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేశారు. పవన్.సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
దీపావళి ముందే వచ్చింది.. లాలా భీమ్లా అదరగొట్టిందంతే..
మలయాళ సూపర్ డూపర్ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం' తెలుగులో 'భీమ్లా నాయక్'గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే! పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి లాలా భీమ్లా సాంగ్ వీడియో ప్రోమోను వదిలారు. ఇందులో మందు బాటిల్‌తో పాటు మందుగుండ్లను ఎదుట పెట్టుకుని కూర్చుకున్నాడు పవన్. 'హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి.. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది.. హ్యాపీ దీపావళి' అని పవన్ చెప్పే డైలాగ్ యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
Bheemla Nayak: భీమ్లా నాయక్ క్రేజీ అప్డేట్.. పవన్ లుక్ అదుర్స్
Bheemla Nayak Update: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. (చదవండి: చీర కట్టులో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న అనసూయ.. ఫోటోలు వైరల్) పవన్ కల్యాణ్ హీరోయిజాన్ని తెలియజేస్తూ విడుదలైన టీజర్లో లాలా భీమ్లా.. అనే బ్యాగ్రౌండ్ సాంగ్ వినే ఉంటారు. ఆ సాంగ్‌కు సంబంధించిన వీడియో ప్రోమోను దీపావళి సందర్భంగా బుధవారం సాయంత్రం 07:02 గంటలకు విడుదలవుతుందని ప్రకటిస్తూ..‘ఈ దీపావళిని #TheSoundOfBheemlaతో జరుపుకుందాం. అంటూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ నుదుటిపై తిలకం దిద్దుకుని, ముందర మందు బాటిల్ పెట్టుకుని కన్పించారు. #LalaBheemla 🔥🥁 pic.twitter.com/YRg10onzzR — Sithara Entertainments (@SitharaEnts) November 3, 2021 సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
ఒక వైపు సూపర్ స్టార్ మరోవైపు పవర్ స్టార్..విజయమెవరిది?
టాలీవుడ్ కు కాసులు కురిపించే సీజన్ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండగ మాత్రమే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కరోనా సమయంలోనూ సంక్రాంతి సీజన్ కు విడుదలైన సినిమాలు కనీవినీ ఎరుగని రీతిలో బాక్సాఫీస్ ను షేక్ చేసాయి. అందుకే ఈసారి మ్యాగ్జిమమ్ స్టార్స్ సంక్రాంతి సీజన్ కు సై అంటున్నారు. ఈసారి సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కనీవినీ ఎరుగని పోటీ కనిపించనుంది. ఎందుకంటే ఒక వైపు సూపర్ స్టార్ మరో వైపు పవర్ స్టార్ ఇంకో వైపు రాధే శ్యామ్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే కన్ ఫామ్ చేసారు. జనవరి 7న ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతున్నప్పటికీ సంక్రాంతికే వస్తున్నామని మాటిమాటికి రిలీజ్ డేట్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. జనవరి 12న పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న భీమ్లానాయక్ విడుదల కానుంది. ఇక జనవరి 13న మహేశ్ బాబు సర్కారువారి పాటతో రానున్నాడు. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే.ఆ రోజున స్పెషల్ టీజర్ రిలీజ్ చేయనుంది రాధే శ్యామ్ యూనిట్. అందుకు సంబంధించిన పోస్టర్ పై కూడా జనవరి 14న ఈ మూవీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఈ మూడు భారీ చిత్రాలతో పాటు మరో రెండు ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్స్ కూడా పోటపడబోతున్నాయంట. ఈ మూడు చిత్రాలతో పాటు ఎఫ్ 3 కూడా రిలీజ్ కానుందని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లే మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజు కూడా ఈ సంక్రాంతి సీజన్ కు రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అప్పుడు సంక్రాంతి సమరం మరింత ఆసక్తికరంగా మారుతుంది. 2016లో సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సంచలన విజయం సాధించింది. కింగ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అందుకే మరోసారి సంక్రాంతి సీజన్ లోనే ఈ సినిమా సీక్వెల్ ను విడుదల చేయాలనుకుంటున్నారట.నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి కనువిందు చేయనుంది. నాగ చైతన్య, కృతి శెట్టి తొలిసారి కలసి నటిస్తున్నారు. మనం తర్వాత నాగార్జున, నాగ చైతన్య కలసి స్టెప్పులేయనున్నారు. -
భీమ్లా నాయక్: కొత్త స్టిల్ అదిరిందిగా!
సాక్షి, హైదరాబాద్: మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘భీమ్లా నాయక్’ కు సంబంధించి ఒక ఫోటో వైరలవుతోంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్ తరువాత పవన్, రానా ఫోటోను ‘అన్‌వైండింగ్ ఆఫ్ ది కెమెరా’ అంటూ చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కోసం విడుదల చేసింది. ఛాతీ మీద గాయంతో నులకమంచం మీద పవన్ పడుకుని ఉంటే.. రఫ్ లుక్‌లో రానా ఎడ్లబండి మీద వయ్యారంగా పడుకున్న స్టిల్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. పవర్ వెర్సెస్ బీస్ట్ అని కమెంట్ చేస్తున్నారు. అలసిపోయి, షూటింగ్ దుస్తుల్లోనే అలా సేద తీరుతున్న దృశ్యాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో భాగంగా ఈ ఫోటోను క్లిక్ చేస్తున్నట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న 'భీమ్లా నాయక్' సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దు కుంటోంది. పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా టైటిల్ సాంగ్,టీజర్‌కు భారీ క్రేజ్ రాగా, ఇక నిత్యమీనన్ 'అంత ఇష్టం ఏందయ్యా' అంటూ సాగే సెకండ్ సాంగ్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశి. పవన్ జోడీగా నిత్యా, రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనున్నారు. Unwinding off the camera #BheemlaNayak & #DanielShekar ♥️💥@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/JfPeOq21ai — Sithara Entertainments (@SitharaEnts) October 21, 2021 -
భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్, ఫుల్ సాంగ్ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, ప్రచారా చిత్రాలు, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్‌కు జోడిగా నిత్యామీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ఓ పాటను దసరా కానుకగా పవన్ ఫ్యాన్ కోసం విడుదల చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగా చిత్రం బృందం నిన్న సాంగ్ ప్రోమో వదిలి శుక్రవారం(అక్టోబర్ 15)న పూర్తి సాంగ్‌ను విడుదల చేశారు. ‘అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే పాట సీని ప్రియులకు బాగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రీ రాసిన ఈ పాటను సింగర్ చిత్ర ఆలపించారు. ఇందులో పవన్ కల్యాణ్ పోలీసు ఆఫీసర్‌గా టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
భీమ్లా నాయక్: ‘అంత ఇష్టం ఏందయ్యా’ సాంగ్ ప్రోమో రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, ప్రచారా చిత్రాలు, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్‌కు జోడిగా నిత్యామీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ఓ పాటను ఈ నెల 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. God bless…. Here's the glimpse into the other side of #BheemlaNayak♥️#AnthaIshtamPromo ➡️ https://t.co/kCXPWlckMk Full Song out tomorrow at 10:19am✨ 🎹 @MusicThaman 🎤 @KSChithra @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @dop007 @vamsi84 — RamajogaiahSastry (@ramjowrites) October 14, 2021 చెప్పినట్టుగానే రేపు సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ రోజు(అక్టోబర్ 14) ఈ పాటకు సంబంధించిన ప్రోమో వదిలారు. ఈ సందర్భంగా రేపు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ‘అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే పాటను ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రీ రాయగా.. సింగర్ చిత్ర ఆలపించారు. ఇందులో పవన్ కల్యాణ్ పోలీసు ఆఫీసర్‌గా టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
‘భీమ్లా నాయక్’ బిగ్ అప్డేట్.. నిత్యామీనన్ ఎలా ఉందో చూశారా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, ప్రచారా చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి‘అంతా ఇష్టం’అనే పాట అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేస్తూ..పవన్ కల్యాణ్, నిత్యామీనన్‌లకు సంబంధించిన కొత్త పోస్టర్ని విడుదల చేసింది. Get ready for the other side of our #BheemlaNayak ♥️ The alluring 2nd Single ~ #AnthaIshtam... out on 15th Oct ✨ A @MusicThaman Musical!🎹@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @ramjowrites @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/MD0pQ2wyQQ — Sithara Entertainments (@SitharaEnts) October 5, 2021 -
25 రోజులకు 4 కోట్లా.. రానా రేంజ్ మామూలుగా పెరగలేదుగా!
టాలీవుడ్లోకి నిర్మాత దగ్గుబాటి సురేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపు పొందాడు రానా దగ్గుబాటి. హీరోగానే కాకుండా బావుంటే ఇతర పాత్రల్లోనూ నటించడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. బాహుబలి సినిమాలో చేసిన భళ్లాల దేవుడి పాత్రతో ఈయన స్థాయి ఒక్కసారిగా పెరిగింది. ఈ నటుడు ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీకి రీమెక్‌గా రూపొందుతున్న ఈ మూవీకి రానా దాదాపు 4 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. అది కేవలం 25 రోజుల కాల్షీట్స్‌కి మాత్రమే. ఇది విని ఆయన క్రేజ్ ఇలా పెరిగిందా అని ఆశ్చర్యపోతున్నారు సినీ జనాలు. అయినా బాహుబలితో రేంజ్ పెరిగిన తరుణంలో ఆ మాత్రం తీసుకునే స్థాయి రానాకు ఉందని ఫిల్మీ దునియాలో చర్చలు జరుగుతున్నాయి. కాగా, పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సాగర్ కే చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో నిత్యా మీనన్ లీడ్ రోల్లో నటిస్తోంది. అయితే ఇప్పటికే విడుదలైన పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’, రానా ‘డేనియల్ శేఖర్’ పాత్రల ఫస్ట్‌లుక్స్‌కి, టీజర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా జనవరి 12, 2022న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. చదవండి: రానా భార్యగా తెరపైకి మరో నటి పేరు, ఆమె ఎవరంటే.. -
భీమ్లా నాయక్: పవర్ ఫుల్ డైలాగ్‌తో బెదిరించిన రానా
Rana Daggubati As Daniel Shekar From Bheemla Nayak : పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ అయప్పనుమ్ కోషియుమ్ చిత్రం రీమక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చేసింది. రానా పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో రానా డేనియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్నారు. పంచెకట్టులో కనపించిన రానా లుక్ అదిరిపోయింది. 'నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. స్టేషన్లో టాక్ నడుస్తోంది.. నేనేవరో తెలుసా.. ధర్మేంద్ర..హీరో' అంటూ రానా పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పవన్ కల్యాణ్ లుక్ విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమావచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. -
రానా భార్యగా తెరపైకి మరో నటి పేరు, ఆమె ఎవరంటే..
Rana Daggubati: తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడాని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్‌కు విశేష స్పందన వస్తోంది. తమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ట్రాక్ సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటూ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నిత్యమీనన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. చదవండి: సమంతే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవర్.. రీట్వీట్ చేసిన సామ్ అయితే రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మత్రం రాలేదు. ఇదిలా ఉండగా రానాకు భార్య పాత్రలో మరో నటి పేరు తెరపైకి వచ్చింది. ఈ తాజా బజ్ ప్రకారం.. మలయాళం నటి సంయుక్తా మీనన్ రానాకు భార్యగా కనిపించనుందట. ఇటీవల ఆమెను చిత్ర బృందం సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. భీమ్లా నాయక్‌లో పవన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రానా డానియల్ శేఖర్‌గా అలరించనున్నాడు. -
క్రేజీ ఆప్డేట్: ఇక వరుస సర్ప్రైజ్లతో రానా సందడి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, ప్రచారా చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పవన్ టీజర్, ఇంట్రో సాంగ్ ప్రకంపనాలు సృష్టించాయి. అయితే రానాకి సంబంధించి ఒక్క పోస్టర్, వీడియో కూడా విడుదల చేయకపోవడంతో దగ్గుబాటి ఫ్యాన్స్ విమర్శలు గుప్పించడంతో చిత్ర బృందం క్లారిటీ ఇస్తూ.. . రానా పాత్రకు సంబంధించిన టీజర్‌ను త్వరలో విడుదల చేస్తాం.. కాస్త ఓపిక పట్టండి అని ప్రకటించింది. చదవండి: సాయి తేజ్ ఐసీయూ వీడియో బయటకు రావడంపై హీరో నిఖిల్ ఫైర్ ఇదిలా ఉండగా ఈ మూవీలోని రానా సంబంధించిన వరసు అప్డేట్స్తో మేకర్స్ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ తాజా బజ్ ప్రకారం రానా పాత్రకు సంబంధించిన ఓ వీడియో సెప్టెంబర్ 17 తర్వాత బయటకు రానుందట. ఈ టీజర్ సినిమాపై రెట్టింపు అంచనాలు పెంచేలా ఉంటుందట. ఇక ఆ తర్వాత నుంచి రానాకు సంబంధించిన లుక్, ఫొటోలు, వీడియోలు వరుసగా సందడి చేయబోతున్నట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. దీంతో రానా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేగాక వీటిపై మూవీ యూనిట్ ఒక్కొక్కటిగా అధికారిక ప్రకటన ఇవ్వనుందని సమాచారం. ఈగోయిస్టిక్ పెద్దమనిషికి, సిన్సియర్ పోలీసాఫీసర్‌కు మధ్య జరిగే టిట్ ఫర్ ట్యాట్ గేమ్‌ని భీమ్లా నాయక్ చిత్రంలో చూపించనున్నారు. బిజు పాత్రలో పవన్ .. పృథ్వీ పాత్రను రానా పోషిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే -మాటలు రాశారు. తమన్ సంగీతం అందించాడు. చదవండి: తలైవి: ‘మొదట్లో కేసు పెట్టారు.. ఇప్పుడు ప్రశంసిస్తున్నారు’ -
రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న భీమ్లా నాయక్ సెంటిమెంట్ బ్రేక్ చెయ్యగలడా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న టాలీవుడ్ బిగ్గీస్ చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో రాబోతుంది. ఈ సినిమా నుండి ఏ వీడియో రిలీజ్ చేసినా కూడా రికార్డ్స్ బ్రేక్ చేస్తూ... ట్రెండింగ్‌లో నిలుస్తుంది. భీమ్లా నాయక్‌కు ఇంత క్రేజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. పవన్ గత సినిమా ‘వకీల్ సాబ్’ హిట్, ఇది మలయాళీ సూపర్ హిట్ ‘అయ్యుప్పున్ కోషియమ్’కి రీమేక్‌గా తెరకెక్కడం. రానా కూడా ఈ సినిమాలో నటిస్తుండడం. థమన్ మొదలుకుని అనేకమంది టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి వర్క్ చెయ్యడం. చదవండి: PSPK28: 'భవదీయుడు భగత్ సింగ్'గా పవన్ కల్యాణ్ అయితే వీటన్నిటితో పాటు మరొక ముఖ్యమైన ఫ్యాక్టర్ త్రివిక్రమ్ భీమ్లా నాయక్‌కు సపోర్ట్ గా నిలబడడం. ముందు త్రివిక్రమ్ ఈ సినిమాకి కేవలం స్క్రిప్ట్ మాత్రమే అందిస్తాడు అని చెప్పారు. పవన్ కూడా ఆ కండిషన్ మీదే ఈ సినిమా రీమేక్‌కు ఒప్పుకున్నాడు. అయితే ఎన్టీఆర్‌తో మొదలవ్వాల్సిన ఈ సినిమా అనుకోకుండా పోస్ట్‌పోన్ అవ్వడంతో భీమ్లా నాయక్‌కు క్రియేటివ్‌గా కూడా సపోర్ట్ ఇస్తున్నాడు. అందుకే ఈ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా పాజిటివ్ ఒపీనియన్‌తో ఉన్నారు. కాకపోతే త్రివిక్రమ్ రైటర్‌గా, పవన్ కల్యాణ్ హీరోగా గతంలో ఒక సినిమా తెరకెక్కింది. చదవండి: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా? అదే ‘తీన్మార్’... బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘లవ్ ఆజ్ కల్’ కి రీమేక్ గా ఆ సినిమా తీశారు. దానికి కూడా త్రివిక్రమ్ రైటింగ్ బాధ్యతలు తీసుకున్నాడు... అలాగే కోటి రూపాయలు తీసుకున్న ఫస్ట్ టాలీవుడ్ రైటర్‌గా కూడా ఫేమస్ అయ్యాడు. ‘తీన్మార్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమయిన ఫ్లాప్‌గా నిలిచింది. ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో, అదే కాంబోతో భీమ్లా నాయక్ కూడా తెరకెక్కుతుండడంతో ఈ జంట ఈ సారి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి హిట్ అందుకుంటారా అనే డౌట్ వ్యక్తం అవుతుంది. దీనికి ఆన్సర్ తెలియాలంటే మాత్రం భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. -
‘భీమ్లా నాయక్’ సింగర్‌కి పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
Pawan Kalyan Financial Help To Kinnera Mogulaiah: `భీమ్లా నాయక్` చిత్రంలో టైటిల్ సాంగ్ పాడి ఆకట్టుకున్న కిన్నెర కళాకారుడు మొగులయ్యకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఆర్థిక సాయాన్ని అందించారు. `భీమ్లా నాయక్`ని పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మొగులయ్యకి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. త్వరలోనే మొగులయ్యకు చెక్కును అందించబోతున్నట్లు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. (చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?) `తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపనతో పవన్ కల్యాణ్ తన బీమ్లా నాయక్ చిత్రం ద్వారా తెరపైకి తీసుకువచ్చారు. మొగులయ్య కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారు. -
భీమ్లా నాయక్ పాటపై వివాదం: ఐపీఎస్ అధికారి అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’లోని పాటను విడుదల చేశారు. విడుదలైన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో పోలీస్‌గా నటిస్తున్న పవన్ కల్యాణ్ పాత్ర ఎలా ఉంటుందో పాటతో అర్ధమవుతోంది. అయితే ఆ పాటపై ఓ ఐపీఎస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని సాహిత్యాన్ని తప్పుబట్టారు. ‘మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం’ అని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానం పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన నిన్న ఓ ట్వీట్ చేశారు. చదవండి: ‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా? హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎం.రమేశ్ భీమ్లా నాయక్ పాట విన్న అనంతరం ఓ ట్వీట్ చేశారు. ప్రజల రక్షణార్థం జీతాలు పొందుతున్న మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం అని స్పష్టం చేశారు. అనంతరం ప్రముఖ రచయిత రామజోగయ్యశాస్త్రి రాసిన సాహిత్యంపై స్పందిస్తూ ‘పోలీస్ పాత్రను వర్ణించేందుకు తెలుగులో ఇంతకన్నా గొప్ప పదాలు దొరకలేదంటే ఆశ్చర్యమేస్తోంది’ అని ఐపీఎస్ అధికారి రమేశ్ తెలిపారు. ‘పోలీసుల సేవలను పాటలో ఎక్కడా ప్రస్తావించలేదు’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ పాట సాహిత్యంపై కూడా కొందరు నెటిజన్లు సాధారణంగా ఉన్నాయని.. అంత గొప్పగా లేవని చెబుతున్నారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యానికి తగ్గట్టు పాటలేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు నేరుగా రామజోగయ్యను ట్యాగ్ చేస్తూ చెప్పారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు రామజోగయ్య స్పందించారు. ‘మీ రేంజ్ లిరిక్స్ అయితే కాదు’ అని ఓ అభిమాని ట్వీట్ చేయగా ‘నెక్ట్స్ టైం బాగా రాస్తా తమ్ముడూ.. ప్లీజ్’ అని శాస్త్రి రిప్లయ్ ఇచ్చారు. మరి ఓ ఐపీఎస్ అధికారి చేసిన ట్వీట్‌కు రామజోగయ్యశాస్త్రి స్పందిస్తారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం భీమ్లా నాయక్ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆ పాటను తెలంగాణ జానపద కళాకారుడు, అరుదైన కిన్నెరను వాయించే దర్శనం మొగులయ్య పాడడం ప్రత్యేకంగా ఉంది. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ వ్యాఖ్యాతగా పాలమూరువాసి Thankfully, @TelanganaCOPs are #PeopleFriendlyPolice . We don’t break the bones of those whom we are paid to protect ! Surprisingly, @ramjowrites couldn’t find enough words in Telugu to describe the valour of a cop. No mention of service in the song. https://t.co/EsQVaW5p2s — M. Ramesh IPS (@DCPEASTZONE) September 2, 2021 -
‘భీమ్లా నాయక్’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?
తెలంగాణ కిన్నెరనాదాన్ని గుర్తింపు లభించింది. అరుదైన.. అంతరించిపోయే కళకు జీవమొచ్చినట్టు అయ్యింది. బతుకుదెరువు కోసం పాటలు పాడుకుంటూ ఊరూరూ తిరిగిన కళాకారుడిని చిత్రసీమ గుర్తించింది. అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం అతడిని కళను గుర్తించి ప్రోత్సహించి సత్కరించింది. ఆ చర్యలు ఫలించి అంతరించిపోయే కళకు సజీవ సాక్షిగా ఉన్న దర్శనం మొగులయ్య గురించి తెలుసుకుందాం. లింగాల: జానపద పాటలనే జీవనోపాధిగా మార్చుకున్న దర్శనం మొగులయ్య, 12 మెట్ల కిన్నెర మొగులయ్యగా అందరికీ సుపరిచితుడు. పాన్‌గల్ మియాసాబ్, పండుగ సాయన్న వీరగాథ వంటివి కిన్నెర వాయిస్తూ పాడేవాడు. అనుకోకుండా వెండి తెరపై పాటలు పాడేందుకు అవకాశం రావడంతో దానిని సద్వినియోగం చేసుకున్నాడు. సినీ కథానాయకుడు పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘భీమ్లా నాయక్’లో ఇంట్రడక్షన్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో ఆయన ప్రయాణం వెండితెరపై వెలుగనుంది. ఆయన పాడిన పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట ప్రాంతానికి చెందిన మొగులయ్య గురించి స్థానికులకు తెలియడంతో మొగులయ్య వెండి తెరపై పాటలు పాడుతాడని అసలు ఊహించలేదని అంటున్నారు. గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి అతడికి పింఛన్ సౌకర్యం కల్పించింది. తమిళనాడు ప్రాంతంలో షూటింగ్.. భీమ్లానాయక్ చిత్రానికి అవసరమైన టైటిల్ సాంగ్ షూటింగ్ తమిళనాడులోని ఓ అటవీ ప్రాంతంలో జరిగింది. దీనికి మొగులయ్యకు అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి పాట పాడారు. అది నచ్చడంతో చిత్రంలో పెట్టినట్లు తెలుస్తోంది. జానపద కళలంటే ప్రాణం తాత, ముత్తాల వారసత్వంగా వచ్చిన జానపద పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం. సొంతంగా కిన్నెరను తయారు చేసుకొని గ్రామాల్లో కిన్నెరతో పాటలు పాడుతుంటా. ఇలా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నా కళను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించింది. నా కళ నచ్చి, మెచ్చిన వారి సాయంతో వెండి తెరపై పాట పాడే అవకాశం వచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు. - దర్శనం మొగులయ్య, కిన్నెర కళాకారుడు, అవుసలికుంట -
‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేసింది
Bheemla Nayak Song Lyrics: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు బర్త్‌డే సర్ప్రైజ్ వచ్చేసింది. ఆయన హీరోగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేసింది చిత్రబృందం. పవన్ కల్యాణ్, రానా కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. కాగా ఈరోజు ఈ మూవీ నుంచి బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను ఉదయం 11:16 గంటలకు విడుదల చేశారు.సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే జానపద గీతంతో మొదలయ్యే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది భీమ్లా నాయక్.. ఇరగదీసే ఈడీ ఫైరు సల్లగుండ.. ఖాకీ డ్రెస్సు పక్కనపెడితే వీడే పెద్ద గుండా..నిమ్మళంగా కనపడే నిప్పుకొండ.. ముట్టుకుంటే తాటలేసిపోద్ది తప్పకుండా.. అంటూ సాగే ఈ పాట.. భీమ్లా నాయక్ పుట్టుక, అతని క్యారెక్టర్ ఏంటో తెలియజేస్తుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
పవన్ బర్త్‌డేకు సిద్దమవుతోన్న భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్
మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే సందడి ముదలైంది. సెప్టెంబర్ 2 ఆయన పుట్టిన రోజు సందర్భంగా పవన్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వరుసగా రానున్నాయి. దీంతో తమ అభిమాను హీరో పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఉండబోతుంది. ఇదిలా ఉండగా పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, బిమ్లా నాయక్‌తో పాటు పలు ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆయన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ రాబోతుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పేరుతో టైటిల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ప్రకటించారు. చదవండి: ఆకట్టుకుంటున్న ‘అనబెల్..సేతుపతి’ ట్రైలర్ సెప్టెంబర్ 2వ తేదీన ఈ పాటను రిలీజ్ చేయబోతున్నట్లుగా స్పష్టం చేస్తూ పోస్టర్ వదిలారు. ‘పవన్ పుట్టిన రోజున ఉదయం 11:16 గంటలకు ఫస్ట్ సింగిల్‌గా టైటిల్ సాంగ్ విడుదల చేయబోతున్నాం’ అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. కాగా మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ పోలీసు ఆఫీసర్‌గా మరోసారి అలరించనున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చదవండి: ‘బాహుబలి’తో రాని గుర్తింపు, సార్పట్టకు వచ్చింది: నటుడు The Blazing Rifles are ready to reverberate! 🔊#BheemlaNayak Title Song on 2nd Sept at 11:16AM💥🥁 Let's Celebrate the POWER DAY with a RESOUNDING POWER ANTHEM! 🔥@pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/nC9O5SHfOY — Saagar K Chandra (@saagar_chandrak) August 30, 2021 -
తుపాకితో బుల్లెట్ల వర్షం కురిపించిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్
తుపాకి చేతపట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు పవన్ కల్యాణ్. టార్గెట్‌ని ఎయిమ్ చేస్తూ శత్రువులపై దాడికి సిద్ధమవుతున్నాడు. ఇదంతా పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న `భీమ్లా నాయక్` చిత్రంలోని చిన్న బ్రేక్ టైమ్ వీడియో క్లిప్. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల టైటిల్ ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ ని విడుదల చేయగా, అది రికార్డులు సృష్టించింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీ ఉన్న పవన్‌కు చిన్న విరామం దొరకడంతో గన్ చేతపట్టాడు. దీనికి సంబంధించిన వీడియోని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ‘భీమ్లా నాయక్ ఇన్ బ్రేక్ టైమ్’ అని పేర్కొంది. అందులో పవన్ తెల్ల దుస్తులు ధరించి కారు పక్కన తుపాకి పట్టి శత్రువుల గుండెల్లో బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత ఆయన అడవిలోకి తుపాకీ పట్టుకుని ఒంటరిగా వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’తెలుగు రీమేకే ‘భీమ్లా నాయక్’.సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.