‘భీమ్లా నాయక్’ సింగర్‌కి పవన్‌ కల్యాణ్‌ ఆర్థికసాయం | Pawan Kalyan Financial Help to Folk Artist Kinnera Mogulaiah Darshanam | Sakshi
Sakshi News home page

Bheemla Nayak Title Song: ‘భీమ్లా నాయక్’ సింగర్‌కి పవన్‌ సాయం

Published Sat, Sep 4 2021 4:16 PM | Last Updated on Sat, Sep 4 2021 4:24 PM

Pawan Kalyan Financial Help to Folk Artist Kinnera Mogulaiah Darshanam - Sakshi

Pawan Kalyan Financial Help To Kinnera Mogulaiah: `భీమ్లా నాయక్‌` చిత్రంలో టైటిల్‌ సాంగ్‌ పాడి ఆకట్టుకున్న కిన్నెర కళాకారుడు మొగులయ్యకి పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఆర్థిక సాయాన్ని అందించారు. `భీమ్లా నాయక్‌`ని పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మొగులయ్యకి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు పవన్‌ పేర్కొన్నారు. త్వరలోనే మొగులయ్యకు చెక్కును అందించబోతున్నట్లు పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
(చదవండి: ‘భీమ్లా నాయక్‌’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?)

`తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపనతో పవన్ కల్యాణ్ తన బీమ్లా నాయక్ చిత్రం ద్వారా తెరపైకి తీసుకువచ్చారు. మొగులయ్య కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement