Nitya Menon, Samyuktha Menon Disappointed With Pawan Kalyan Bheemla Nayak Movie - Sakshi
Sakshi News home page

Samyukta Menon: అవును నిజంగానే చాలా బాధపడ్డాను..

Published Fri, Mar 4 2022 9:00 AM | Last Updated on Fri, Mar 4 2022 10:53 AM

Nitya Menon, Samyuktha Menon Disappointed With Bheemla Nayak Movie - Sakshi

Samyuktha Menon Disappointed With Bheemla Nayak: పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటిల మల్టీస్టారర్‌ చిత్రం భీమ్లా నాయక్‌ మంచి హిట్‌టాక్‌ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ హీరోయిన్లు అయిన నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌లు భీమ్లా నాయక్‌పై మూతి ముడుచుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణంగా సినిమా నిడివి తగ్గించేందుకు పాటలతో పాటు హీరోయిన్ల సన్నిశాల్లో కోతలు విధించడం.

చదవండి: బాలీవుడ్‌పై నటి భాగ్యశ్రీ షాకింగ్‌ కామెంట్స్‌..

ఎంతో మంది సంగీత ప్రియుల ఆదరణ పొందిన ‘అంత ఇష్టం ఏందయ్యా..’ సాంగ్‌తో పాటు పలు సన్నివేశాలను చిత్ర బృందం తొలగించిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో ఎంతోమందిని ఆకట్టుకున్న తన పాటను తొలగించడంపై నిత్యా మీనన్‌ హర్ట్‌ అయ్యిందని, అందుకే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు రాలేదని వార్తలు వినిపించగా.. రిలీజ్‌ అనంతరం తన సీన్లను తొలగించడంపై సంయుక్త మీనన్ సైతం చిత్రం బృందంపై కోపంతో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై స్పందించింది సంయుక్త మీనన్‌.

చదవండి: సమంతపై జిమ్‌ ట్రైనర్‌ జునైద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘అవును నేను చాలా హర్ట్ అయ్యాననే మాట నిజమే. అయితే నా పాత్ర గురించి కాదు .. దాని నిడివి గురించి కాదు. ఈ సినిమాను రెండోసారి థియేటర్లో చూద్దామనుకుంటే ఇంతవరకూ టిక్కెట్ దొరకలేదు .. అందుకు’ అంటూ చమత్కరించింది. తన కామెంట్స్‌ విన్న నెటిజన్లు సీన్స్‌ తొలగిస్తే ఎవరూ బాధపడకుండా ఉంటారని, కానీ ఆమె నిజం ఒప్పుకోవడం లేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక నిత్యా మీనన్‌ మాత్రం తన పాట, సన్నివేశాలను తొలగించడం పట్ల మూవీ యూనిట్‌పై తీవ్ర అసహనంతో ఉందని, అందుకే ఆమె భీమ్లా నాయక్‌ సంబంధించిన ఏ ఈవెంట్‌లోను పాల్గొనడం లేదంటూ సినీ వర్గాలు నుంచి సమాచారం. ఈ మూవీ పవన్‌ కల్యాన్‌ భార్య నిత్యా మీనన్‌ నటించగా.. రానా భార్య సంయుక్తి మీనన్‌ కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement