samyukthaMenon
-
విరూపాక్ష 100 కోట్ల కలెక్షన్ల సునామీ.. దెబ్బకి మెగాస్టార్ రేంజ్‌కి సాయి ధరమ్ తేజ్
-
విరూపాక్ష భారీ డిజాస్టర్
-
100 కోట్లు కాకపోతే 1000 కోట్లు తెస్తుంది..
-
అమ్మకు క్యాన్సర్.. అనాధాశ్రమంలో వదిలేశా!: నటుడు
పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సుబ్బరాయ శర్మ. మొదట నాటకరంగంలో పని చేసిన ఆయన మయూరి చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఒంటెద్దు బండి, శ్రీవారికి ప్రేమలేఖ, యమలీల, శుభలగ్నం, మాయలోడు, గంగోత్రి, మనసంతా నువ్వే, బాహుబలి: ది బిగినింగ్, రుద్రమదేవి వంటి చిత్రాలతో ఆయన మరింత పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. '1977 నుంచి టీవీలో పని చేస్తున్నాను. 1985లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ మూవీ మయూరి. దీనికి వెయ్యి లేదా పదిహేను వందల రూపాయలు పారితోషికం ఇచ్చి ఉంటారు. ఒకానొక సమయంలో అమ్మకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అప్పటివరకు నా దగ్గర ఎలా ఉంటుందని అనాధాశ్రమంలో జాయిన్ చేశా. ఎందుకంటే అప్పుడు నా భార్య అమెరికాలో ఉంది. నేను తనను చూసుకోలేనని అనాధాశ్రమంలో పెట్టాను. ఆ తర్వాత అక్కడి నుంచి అమ్మను హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయ్యాక మళ్లీ అక్కడ దింపి షూటింగ్‌కు వెళ్లేవాడిని. ఆ డబ్బుతో ఆస్పత్రి బిల్లు కట్టాను. నా పరిస్థితి తెలుసుకుని గుణశేఖర్ నాకు పదివేలు అడ్వాన్స్ ఇచ్చారు. అలా రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టినవాళ్లే కాకుండా ముందుగా డబ్బులిచ్చి సాయం చేసినవాళ్లు కూడా ఉన్నారు' అని తెలిపాడు సుబ్బరాయ శర్మ. చదవండి: భర్త చనిపోయాక మొదటిసారి అలా కనిపించిన మీనా, వీడియో -
ఆ హీరోయిన్ కు 'ఐ లవ్ యు' చెప్పిన త్రివిక్రమ్.. వీడియో వైరల్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచులకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా మరోసారి త్రివిక్రమ్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోలీవుడ్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న సినిమా సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ధనుష్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక తన స్పీచ్‌లో మూవీటీంపై ప్రశంసలు కురిపించిన త్రివిక్రమ్.. హీరోయిన్ సంయుక్త గురించి మాట్లాడుతూ.. అందరి ముందే ఆమెకు 'ఐ లవ్ యు' చెప్పేశారు. దీంతో ఈవెంట్‌కు వచ్చిన అభిమానులు ఈలలు, కేకలతో వేదికను హోరెత్తించారు. దాంతో ‘లేదండి బాబూ.. పూర్తిగా చెప్పేది వినండి.. కంగారు పడకండి అంటూ కాస్త కవర్ చేశారు త్రివిక్రమ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈవెంట్లో త్రివిక్రమ్ స్పీచ్ హైలైట్‌గా నిలిచింది. -
కళ్లు తిప్పుకోలేని అందం..అప్సరసలా మెరిసిపోయిన సంయక్త మీనన్ (ఫొటోలు)
-
టాలీవుడ్తోనే నా కెరీర్ మలుపు తిరిగింది: సంయుక్త
‘భీమ్లానాయక్’, ‘బింబిసార’ సినిమాలతో తెలుగు తెరపై మెరిసిన నటి సంయుక్త మీనన్. ఇటీవల ధనుష్‌కి జోడీగా ‘సార్’లో నటించింది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 17న చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. టాలీవుడ్ అడుగు పెట్టాకే తన దశ తిరిగిందని అన్నారు. అందుకే ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది అమ్మడు. సంయుక్తా మీనన్ మాట్లాడుతూ – 'బింబిసార, విరూపాక్ష సినిమాలకి సంతకం చేశాకే భీమ్లానాయక్లో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కోసం హైదరాబాద్‌కి వచ్చా. అప్పుడు నాకు తెలుగు అంతగా రాదు. కానీ ఓ రోజు సెట్లో నా గురించి ఏదో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది. ఈ విషయంపై నిర్మాత నాగవంశీని అడిగితే... భీమ్లానాయక్ తర్వాత ధనుష్ మూవీ సార్లో కథానాయిక మీరేనని చెప్పారు. అదే రోజు దర్శకుడు వెంకీ అట్లూరిని కలిశా. అలా మొదలైన ప్రయాణం ఇక్కడిదాకా వచ్చింది. కల్యాణ్ రామ్ బింబిసార తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఒప్పుకున్నా. ఆ భీమ్లా నాయక్, ధనుష్ ‘సర్’ చిత్రాలు ఒకే రోజులోనే అంగీకరించా.' అని చెప్పుకొచ్చారు మలయాళ భామ. సినిమాల్లోకి ఎంట్రీపై సంయుక్త మాట్లాడుతూ.. 'సినిమాల్లోకి రావాలని ఏనాడూ అనుకోలేదు. అనుకోకుండా 2016లో నా జర్నీ స్టార్ట్ చేశా. చదువుకుంటున్న సమయంలోనే అనుకోకుండా వచ్చిన అవకాశంలో తొలి సినిమా చేశా. ఆ తర్వాత ఒక మంచి సినిమా చేసి ఆ తర్వాత మానేద్దామని మళ్లీ వచ్చా. కానీ ఆ తర్వాత నటనపై మక్కువ పెరిగింది. అయితే టాలీవుడ్లోకి వచ్చాకే నా దశ తిరిగింది. మొదట్లో ఇంగ్లిష్ మాట్లాడేదాన్ని. అందరూ ఇంగ్లిష్ అమ్మాయిలానే చూసేవాళ్లు. ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నందుకు తెలుగమ్మాయి అంటున్నారు. తెలుగు నేర్చుకునేందుకు ట్యూటర్ సాయం తీసుకున్నా.అలా తెలుగు వేగంగా నేర్చుకుంటున్నా.' అని అన్నారు. -
కులం పేరు చెప్పుకోవడం ఇష్టం లేదు: హీరోయిన్
తమిళసినిమా: మలయాళం, తమిళం, తెలుగులో నటిస్తున్న నటి సంయుక్త మీనన్. ప్రస్తుతం ధనుష్‌తో చేసిన వాత్తీ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17వ తేదీ విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనను అందరూ సంయుక్త మీనన్ అని పిలుస్తున్నారని.. అయితే తనకు కులం పేరు చెప్పుకోవడం ఇష్టం లేదని, సంయుక్త అని పిలవడమే తనకు ఇష్టమని పేర్కొంది. తాను నటిగా మలయాళంలో పరిచయమైనా తమిళ చిత్రాలు అంటే చాలా ఇష్టమని పేర్కొంది. తమిళ భాష, తమిళ సినిమా పాటలు అంటే ఇంకా ఇష్టమని చెప్పింది. చిన్న తనంలోనే ముస్తఫా అనే పాటను పలుమార్లు ఇష్టంగా వినేదాన్నని తెలిపింది. తాను ఇంతకు ముందు తమిళంలో కొన్ని చిత్రాలను అనుభవరాహిత్యంతో అంగీకరించి నటించానని చెప్పుకొచ్చింది. అయితే ఇకపై చిత్రాల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నానని చెప్పింది. అలా ఒప్పుకుని నటించిన చిత్రమే వాత్తీ అని చెప్పింది. ఇందులో ధనుష్ వంటి అనుభవమైన నటుడి సరసన నటించడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నానని, ధనుష్ సింగిల్ టేక్ ఆరి్టస్ట్ అని, అందు వల్ల తాను ఎక్కువగా తీసుకోరాదని ముందుగానే డైలాగ్స్ చెప్పడం నుంచి నటించడం వరకు ప్రిపేర్ అయ్యేదాన్ని అని తెలిపింది. అయినా టేక్‌లు తీసుకునేదాన్ని, అందుకు ధనుష్ ఎంతగానో సహకరించారని పేర్కొంది. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా సంయుక్త పేర్కొంది. -
అమ్మానాన్న విడాకులు.. అందుకే ఇంటిపేరు తీసేశా: హీరోయిన్
'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సంయుక్త మీనన్. తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమె సార్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో హీరో ధనుష్ సరసన కథానాయికగా నటించనుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన పేరెంట్స్ గురించి మాట్లాడింది. నేను స్కూలులో జాయిన్ అయ్యేటప్పుడు ఇంటిపేరు రాయమన్నారు. అప్పటిదాకా మన పేరు పక్కన ఈ తోక ఏంటా? అనుకునేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక నటిగా నాకు బాధ్యత తెలిసివచ్చింది. మీనన్ అనే పదం నా పేరు పక్కన ఉండటం సబబు కాదనిపించింది. సమానత్వం, మానవత్వం, ప్రేమ అన్నింటినీ నేను కోరుకున్నప్పుడు ఇంటి పేరు అడ్డొస్తుందనిపించింది. పైగా నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అమ్మ.. నాన్న ఇంటిపేరును కొనసాగించకూడదని కోరుకుంది. తన అభిప్రాయాన్ని నేను గౌరవించాలనుకున్నాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే సంయుక్త మీనన్ సాయిధరమ్ తేజ్ విరూపాక్షలోనూ నటించనుంది. చదవండి: తమాషాగా ఉందా? రెండో భర్తకు కూడా విడాకులా? -
మాస్టారు... నా మనసును గెలిచారు
‘‘శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. సీతకు మల్లే నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంత విన్నాలే.. ’ అని ప్రేమగీతం పాడుకున్నారు సంయుక్తా మీనన్. ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘సార్’ (తమిళంలో ‘వాతి’). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి ‘మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు.. అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను గురువారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మాస్టారు ధనుష్‌ని ఉద్దేశించి సంయుక్త పాడే ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, శ్వేతా మోహన్ ఆలపించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. కాగా, ఈ పాట తమిళ వెర్షన్‌కు ధనుష్ సాహిత్యం అందించడం విశేషం. -
ఆ రెండు సినిమాలతో క్రేజ్.. కేరళ భామకు వరుస ఆఫర్లు..!
భీమ్లా నాయక్, బింబిసార చిత్రాలతో క్రేజ్ సంపాందించుకున్న బ్యూటీ సంయుక్త మీనన్. ఈ భామ కోసం టాలీవుడ్లో వరుస ఆపర్లు క్యూ కడుతున్నాయి. ఈ కేరళ కుట్టి మలయాళం, తమిళం, కన్నడలోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో సక్సెస్ అందుకుంది. సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన బింబిసార బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్‌లో రానాకు జోడిగా నటించింది ఈ అమ్మడు. (చదవండి: ‘భీమ్లా నాయక్’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్ క్లారిటీ) ‘బింబిసార’ నందమూరి కల్యాణ్‌రామ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. ఈ భామకు హిట్ టాక్ సెంటిమెంట్ కలిసి రావడంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. తెలుగులో మొదట కల్యాణ్ రామ్ బింబిసారలో ఛాన్స్ రాగా.. ఆ సినిమా ఆలస్యం కావడంతో ‘భీమ్లా నాయక్’తో ఎంట్రీ ఇచ్చింది. 2016లో మలయాళం మూవీ ‘పాప్ కార్న్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో అంజనా పాత్రకు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘కలరి’ మూవీతో అభిమానులను పలకరించింది. ఈ సినిమా తర్వాత మలయాళంలో ‘లిల్లీ’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. -
'బింబిసార' మూవీ రివ్యూ
టైటిల్: బింబిసార నటీనటులు: కల్యాణ్ రామ్, కేథరీన్ థ్రేసా, సంయుక్త మీనన్, ప్రకాశ్ రాజ్, వివాన్ భటేనా, అయ్యప్ప పి శర్మ తదితరులు నిర్మాత : హరికృష్ణ. కె కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: వశిష్ఠ సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు విజువల్ ఎఫెక్ట్స్: అనిల్ పాడురి విడుదల తేది: ఆగస్టు 5, 2022 'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'బింబిసార'గా వచ్చాడు కల్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. టైమ్ ట్రావెల్ మూవీగా వచ్చిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 5) విడుదలైంది. మరి ఈ సినిమాతో కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథ: త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్ రామ్). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్ ట్రావెల్ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిని నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే 'బింబిసార' సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. విశ్లేషణ: క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో 'బింబిసార'ను తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ఠ. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే ఒక్క క్యాప్షన్‌తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు. అంతేకాకుండా తనకు ఎదురు వస్తే, తన మాటను ధిక్కరిస్తే చిన్న పిల్లలను కూడా అంతమొందించే రాక్షస రాజుగా బింబిసార పాత్రలో కల్యాణ్ రామ్‌ను చూపించారు. అహంతో మదమెక్కి అరాచకాలు, ఆకృత్యాలు చేసే చక్రవర్తిగా బింబిసారుడిని చూపించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. తర్వాత ఒక నిజమైన రాజుగా, మంచి మనిషిగా బింబిసారుడు మారే క్రమాన్ని కూడా అంతే బాగా తెరకెక్కించారని చెప్పవచ్చు. త్రిగర్తల సామ్రాజ్యం, అక్కడి భాషా, వేషం అన్ని చక్కగా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఒకటి, రెండు సీన్లలో త్రిగర్తల సామ్రాజ్యపు కోట ఆర్టిఫిషియల్‌గా కనిపించిన మిగతా సీన్లలో మాత్రం కళ్లకు విజువల్ ఫీస్ట్. ఫ్యామిలీ డ్రామాతో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కొంచె రొటీన్‌గా అనిపించిన ఆకట్టుకునేలా ఉన్నాయి. అక్కడక్కడ వచ్చిన కామెడీ కూడా బాగానే పండింది. కొన్ని సీన్లు, విజువల్స్ ఇతర సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్స్ చాలా స్టైలిష్‌గా అదిరిపోయాయి. బింబిసారుడిని ఎలివేట్ చేసే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే? ఈ సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ చిత్రంలోని కల్యాణ్ రామ్ యాక్టింగ్ అతని కెరీర్లోనే ది బెస్ట్. క్రూరమైన రాక్షస చక్రవర్తి బింబిసారుడిగా పూర్తి నెగెటివ్ పాత్రలో కల్యాణ్ రామ్ అదరగొట్టాడు. అహంతో విర్రవీగే రాజుగా, ఎదురు తిరిగిన, సలహా ఇచ్చిన ప్రతి ఒక్కరినీ నిర్దాక్షణ్యంగా చంపే కర్కోటకపు రాజుగా కల్యాణ్ రామ్ చూపించిన అభినయం అబ్బురపరుస్తుంది. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్లలో స్టైలిష్‌గా, ఒక రాజులోని హుందాతనాన్ని నటనతో చాలా చక్కగా చూపించాడు. తర్వాత మనిషిగా మారిన చక్రవర్తిగా, ఎమోషనల్ సీన్లలో సైతం ఆకట్టుకున్నాడు. బింబిసారుడి తమ్ముడు దేవ దత్త పాత్రలో కూడా చక్కగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తాను ఒక్కడై నడిపించినట్లుగా ఉంటుంది. యువరాణి ఐరాగా కేథరీన్ థ్రేసా, ఎస్సై వైజయంతిగా సంయుక్త మీనన్ నటన పాత్రకు తగినట్లుగా పర్వాలేదు. కానీ వారి రోల్స్‌కు అంతా ప్రాముఖ్యత లేదు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర కామెడీతో అలరించారు. వివాన్ భటేనా, ప్రకాశ్ రాజు, రాజీవ్ కనకాల, అయ్యప్ప పి శర్మ తదితరులు పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. అలాగే కథకు అనుగుణంగా వచ్చిన ఒక్కో పాట కూడా అలరిస్తుంది. ఈ ఒక్కో సాంగ్‌ను చిరంతన్ భట్, వరి కుప్పల యాదగిరి, ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక రాక్షస రాజుగా నటనతో మెస్మరైజ్ చేసిన కల్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా కచ్చితంగా చూడాల్సిందే. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
Bimbisara Movie: ‘బింబిసార’ ట్విటర్ రివ్యూ
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. (చదవండి: ‘సీతారామం’ ట్విటర్ రివ్యూ) ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బింబిసార’ కథేంటి? త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్ రామ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నార.అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #BimbisaraOnAug5th #BIMBISARA #BimbisaraReview 1-Excellent movie 👍 2-this movie will bring back telugu audience to teatres 3-1st half is bit slow, but 2nd half is rampage 🔥 4-Kalyan ram as bimbisara is super 5- overall rating is 🌟 🌟 🌟 1/2 ( 3.5/5) — VINOD KUMAR E 2691 Batch,PES University (@VinodPes) August 5, 2022 తెలుగు ప్రేక్షకులను తిరిగి థియేటర్స్‌కి రప్పించే చిత్రమిదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉందని, సెకండాఫ్ అదిరిపోయిందని చెబుతున్నారు. బింబిసారగా కల్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా బాగుందని చెబుతున్నారు. వన్ మ్యాన్ షోగా సినిమాను తన భుజానా వేసుకొని నడిపించాడట. ఎంఎం కీరవాణి మ్యూజిక్, విజువల్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. Showtime: Kalyan Ram in #Bimbisara. A Vasishta directorial and MM keeravani musical. — Day Dreamer!!! (@bunnywrites) August 5, 2022 Bimbisara first half..👌🔥🔥This is going to be Kalyan ram's career biggest movie..Time travel content..🪐New World..🙏What a story..#Bimbisara @tarak9999 @NANDAMURIKALYAN #BimbisaraReview — SAIKUMAR MANNURU (@im_saichowdary) August 4, 2022 #Bimbisara Movie theater response#BimbisaraOnAug5th Movie good reviews every where 👍👍👍👍 video link 👇👇👇 3/5 👍https://t.co/AaHUH2YDQm — Masthan-Tweets (@sm4582579) August 5, 2022 Good First Half 👌 Interval 🔥🔥@NANDAMURIKALYAN 👌👌 Bgm Excellent 🤙🤙#Bimbisara . https://t.co/TWJFMJKn7J pic.twitter.com/pt3uc0Vhdm — #DADA 🙏 #NTR 💗 (@Dada_NTR) August 5, 2022 మరోవైపు బింబిసార టీమ్‌కు సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ తమన్, సాయి తేజ్, సత్యదేవ్ తదితరులు ట్వీట్స్ చేశారు. Wishing this whole team of #Bimbisara @NANDAMURIKALYAN anna #Hari gaaru @NTRArtsOfficial #Vasista and Team of #SitaRamam brother @hanurpudi @dulQuer @mrunal0801 @VyjayanthiFilms Dear @SwapnaDuttCh All the Very Best at the #BoxOffice TOMORROW 🏆🥁🥁🥁🥁🥁🥁 pic.twitter.com/xrD6IQTkMz — thaman S (@MusicThaman) August 4, 2022 \ #Bimbisara Looks Promising to bits. All the best @NANDAMURIKALYAN anna.@DirVassishta I know how much you have waited for this day. Wish your hardwork paysoff ra All the best to the entire team@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani garu @ChirantannBhatt @NTRArtsOfficial pic.twitter.com/UIepiaLrX5 — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 4, 2022 Promising right from it's Teaser and a Grandeur of this scale from @DirVassishta is so impressive. Your hardwork and transformation for this @NANDAMURIKALYAN anna 🤗👏 All the best Team #Bimbisara@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial pic.twitter.com/YOfhhUJUqt — Satya Dev (@ActorSatyaDev) August 4, 2022 Wishing @NANDAMURIKALYAN garu and the entire team of #Bimbisara the best for tomorrow. May cinema win and the industry rise! @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial — Hanu Raghavapudi (@hanurpudi) August 4, 2022 -
తమ్ముడితో పాన్ ఇండియా సినిమా పక్కా.. కథ కుదిరితే బాబాయ్తోనూ..
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు’ అనే మాటలను నేను నమ్మను. ఇతర భాషలతో పోలిస్తే మన తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పవాళ్లు.. సినిమాలను ప్రేమిస్తారు. కథ బాగుంటే తెలుగు చిత్రాలనే కాదు.. పరభాషా సినిమాలను కూడా ఆదరిస్తారు’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌పై హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ పంచుకున్న విశేషాలు. ► వశిష్ఠ్ చెప్పిన ‘బింబిసార’ కథ వినగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. పైగా సరికొత్త పాయింట్ కావడంతో ఓకే చెప్పేశాను. కథ బాగుండటం, చక్కని టీమ్ కుదరడంతో తను అనుకున్నది అనుకున్నట్లు తీశాడు వశిష్ఠ్. ► మా తాతగారు (ఎన్టీఆర్), బాబాయ్ (బాలకృష్ణ)లు రాజులుగా చేసి, మెప్పించారు. ఈ చిత్రంలో బింబిసారుడు అనే రాజు పాత్ర అనగానే నేను సెట్ అవుతానా? అనిపించింది. రాజు అంటే ఇలాగే ఉంటాడు అనేలా ఈ తరం నటుల్లో ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో ఓ మార్క్ క్రియేట్ చేశారు. నా లుక్ విషయంలో ముందు కొన్ని అనుకున్నా ఫైనల్‌గా మూవీలోని లుక్ ఫిక్స్ చేశాం. ఈ లుక్ కోసం రెండు నెలలు కష్టపడ్డాను. ► ‘ఏ కథలో ఏ హీరో నటించాలో రాసిపెట్టి ఉంటుంది. ఏ కథ అయినా ఆ హీరోని వెతుక్కుంటుంది’ అని మా నాన్న (హరికృష్ణ) చెప్పేవారు. ‘అతనొక్కడే’ చిత్రకథ కూడా ఎందరో విన్నా ఫైనల్‌గా నేను చేశా. అలా ‘బింబిసారుడు’ కథ నా కోసం పుట్టింది. ప్రేక్షకుల అంచనాలను వందశాతం రీచ్ అవుతాం. ► కోవిడ్‌కి ముందు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాం. అప్పుడు ఇతర భాషల్లో చేద్దామనుకోలేదు. ఇప్పటికిప్పుడు ఇతర భాషల్లో విడుదల చేయాలంటే మార్కెటింగ్, ప్రమోషన్స్ కోసం సమయం పడుతుంది. అంత టైమ్ మాకు లేదు.. అందుకే తెలుగులో రిలీజ్ చేస్తున్నాం.. ఇక్కడ హిట్ అయిన తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం. ► తెలుగువాళ్లకి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే. కుటుంబంతో కలిసి థియేటర్‌కి వెళ్లి సినిమా చూడటాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా అని ప్రేక్షకులు నిర్ణయించుకుంటున్నారు. మనం మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే తప్పకుండా చూస్తారు. ఓ సినిమా బాగుందంటే వచ్చే మౌత్ పబ్లిసిటీకి చాలా పెద్ద స్పాన్ ఉంది. నా ‘అతనొక్కడే’ చిత్రం కూడా తొలి ఆట నుంచే మౌత్ పబ్లిసిటీతో సూపర్ హిట్ అయింది. ఈ మధ్య రిలీజ్ అయిన ‘మేజర్, విక్రమ్’ సినిమాల్లో మంచి కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ► ఓ నిర్మాతగా నేను ఎలాంటి ఒత్తిడి తీసుకోను.. నా దృష్టంతా నటనపైనే ఉంటుంది. ప్రస్తుతం ‘బింబిసార’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉండటంతో తెలుగులో షూటింగ్‌ల బంద్ విషయాన్ని నేను పట్టించుకోవడం లేదు. ఈ సినిమా విడుదల తర్వాత స్పందిస్తాను. రొమాంటిక్ సినిమాలు నాకు సెట్ అవ్వవు.. అందుకే చేయను (నవ్వుతూ). ‘బింబిసార 2’కి కథ రెడీగా ఉంది. నేను నిర్మాతగా తమ్ముడితో(ఎన్టీఆర్) ఓ పాన్ ఇండియా సినిమా ఉంటుంది. మంచి కథ కుదిరితే బాబాయ్ (బాలకృష్ణ)తోనూ ఓ సినిమా నిర్మిస్తాను. -
‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఫాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత : ఎన్టీఆర్
‘‘ఇండస్ట్రీకి గడ్డు కాలం అని, థియేటర్లకి జనాలు రావడం లేదని అంటున్నారు.. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి, ఆశీర్వదించే గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరందరూ. ఆగస్టు 5న విడుదలవుతున్న ‘బింబిసార’, ‘సీతా రామం’ చిత్రాలను ఆదరించి తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోయాలి. ఇండస్ట్రీ పదికాలాల పాటు చల్లగా ఉండి మీ అందర్నీ అలరించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘బింబి సార’. వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘‘బింబిసార’ కథని వేణు (వశిష్ఠ్) ఒక ఐడియాగా చెప్పినప్పుడు ఇంత పెద్ద కథని హ్యాండిల్ చేయగలడా? లేదా? అని భయం మొదలైంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత.. తను కథని ఎంత కసితో చెప్పాడో అంతే కసిగా తీశాడనిపించింది. ఈ చిత్ర కథ నాకు తెలిసినా సినిమా చూసేటప్పుడు చాలా ఎగై్జట్‌మెంట్ కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అదే ఎగ్జైట్మెంట్కి గురవుతారు. ‘బింబిసార’ టీజర్లోనే వేణు సత్తా తెలుస్తోంది.. హ్యాట్సాఫ్ వేణు. ఈ సినిమాకి ఛోటా కె.నాయుడు అన్న ప్రాణం పోశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతమైన సినిమాలు చూస్తే తప్ప ప్రేక్షకులు సంతృప్తి చెందడం లేదు. ‘బింబిసార’ ఇంత అద్భుతంగా వచ్చిందంటే కారణం నటీనటులు, సాంకేతిక నిపుణులే.. వారందరికీ థ్యాంక్స్. ఈ మూవీకి నేపథ్య సంగీతం, కొత్త రకమైన పాటలు అందించి వెన్నెముకగా నిలిచి, మా నమ్మకాన్ని మరింత పెంచినందుకు కీరవాణిగారికి థ్యాంక్స్. మా తాతగారు(ఎన్టీఆర్), మా నాన్నగారు(హరికృష్ణ) మాకు వదిలి వెళ్లిన అభిమానులు మీరు.. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం.. మీకు నచ్చే వరకూ చిత్రాలు చేస్తూనే ఉంటాం.. మీరు కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత. కల్యాణ్ అన్న కెరియర్ ‘బింబిసార’ కి ముందు, తర్వాత అని కచ్చితంగా అనుకోవాల్సిందే. ఈ చిత్రానికి కల్యాణ్ రామ్ తప్ప న్యాయం చేయగలిగే నటుడు ఇంకొకరు లేడు.. ఉండడు కూడా’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ–‘‘ఓ మంచి జానపద, సోషియో ఫ్యాంటసీ సినిమా మీ ముందుకు తీసుకు రావాలనే మా ప్రయత్నమే ఈ ‘బింబిసార’. ఈ సారి మాత్రం మిమ్మల్ని(అభిమానుల్ని) నిరుత్సాహ పరచను.. 100కి 200శాతం మీరు సంతృప్తి చెందుతారు.. గర్వంగా ఫీలవుతారు. ఈ సినిమాకి ప్రాణం పోసిన ఒకే ఒక వ్యక్తి కీరవాణిగారు. ‘బింబిసార’ ని నాకు ఇచ్చిన కె.హరికృష్ణకి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్ ఛోటా కె.నాయుడు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ 'కడువా'!
మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కడువా. మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో జూన్ 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అదే సమయంలో దీనిపై వివాదాలు సైతం రాజుకున్నాయి. మూవీలో కొన్ని సన్నివేశాలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమవడంతో చిత్రయూనిట్ క్షమాపణలు చెప్పి ఆ సన్నివేశాలను తొలగించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 4 నుంచి ప్రసారం కానుంది. అయితే ఓటీటీ రిలీజ్‌ను అడ్డుకోవాలంటూ జోస్ కురువినక్కునీల్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. కడువాలోని ప్రధాన పాత్ర పేరు సహా తన జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారని మండిపడ్డాడు. ఇక గతంలోనూ అతడు కడువా విడుదల ఆపేయాలంటూ ఫిర్యాదు చేశాడు. తన జీవితకథ ఆధారంగా సినిమా తీశారని, కానీ కొన్ని సన్నివేశాలు తనను, తన కుటుంబ గౌరవాన్ని మంట గలిపేలా ఉన్నాయని మండిపడ్డాడు. దీంతో సెన్సార్ బోర్డ్ సినిమాలోని లీడ్ క్యారెక్టర్ పేరును కురువచన్ అని కాకుండా కురియచన్ అని మార్చాలని సూచించింది. ఇన్ని వివాదాల నడుమ విడుదలైన ఈ మూవీ మరికొద్ది రోజుల్లో ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, సంయుక్త మీనన్, కలాభవన్ షాజన్ ముఖ్య పాత్రలు పోషించారు. షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మ్యాజిక్ ఫ్రేమ్స్– పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌పై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. చదవండి: విజయ్, రష్మిక డేటింగ్‌పై ప్రశ్న.. హింట్ ఇచ్చిన అనన్య పాండే రవితేజకు ఊహించని షాక్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సీన్స్ లీక్! -
టీజర్: గట్టిగా క్లాసులు పీకిన ధనుష్ 'సార్'
స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళంలో వాత్తి పేరిట రిలీజ్ కానుంది. ఈరోజు ధనుష్ బర్త్‌డే కావడంతో సార్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. జీరో ఫీజు.. జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజు.. మోర్ ఎడ్యుకేషన్.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్.. అన్న డైలాగ్‌తో టీజర్ మొదలువుతుంది. ఆ తర్వాత యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. ఇక టీజర్లో ధనుష్ పాత్రను రివీల్ చేశారు. అతడి పేరు బాలగంగాధర్ తిలక్ అని, జూనియర్ లెక్చరర్‌గా నటించాడని హీరోనే స్వయంగా వెల్లడించాడు. 'విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సర్.. పంచండి, ఫైవ్‌స్టార్ హోటల్లో డిష్‌లాగా అమ్మకండి' అని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. టీజర్ చూస్తుంటే విద్యావ్యవస్థలో ఉన్న లోపాను ఎత్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌లతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ధనుష్‌కు ఇది తొలి తెలుగు స్ట్రయిట్ ఫిలిం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. చదవండి: విక్రాంత్ రోణ సినిమా రివ్యూ 'ఇంద్ర' సినిమాలో అందుకే నటించలేదు: పరుచూరి గోపాలకృష్ణ -
ధనుష్‌తో గొడవలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
‘భీమ్లా నాయక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. ఈ చిత్రంలో రానా సరసన నటించిన ఆమెకు నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. తన అందం , అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు తెలుగు ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. త్వరలోనే బింబిసార చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఆగష్టు 5న ఈ మూవీ థియేటర్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. చదవండి: మరి మహిళల నగ్న చిత్రాల సంగతేంటి?: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ ఈ సందర్భంగా సంయుక్తి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో హీరో ధనుష్‌తో గొడవలంటూ వచ్చిన పుకార్లపై స్పందించింది. కాగా సంయుక్త, ధనుష్ సరసన సార్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ధనుష్ స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. ఈ మూవీ షూటింగ్ సమయంలో తనకు, ధనుష్‌కు గొడవ జరిగిందని, దీంతో మధ్యలోనే ఆమె మూవీ సెట్ నుంచి వెళ్లిపోయినట్లు గతంలో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆమెను దీనిపై ఓ విలేకరి ప్రశ్నించగా.. సంయుక్త ఆసక్తిగా స్పందించింది. చదవండి: బొద్దుగా ఉండే అంజలి.. ఇలా అయిపోయిందేంటి? ‘ధనుష్‌తో నాకు గొడవలా! నిజంగానే అలాంటి వార్తలు వచ్చాయా? నాకు తెలియదు. అలాంటి వార్తలు రాయాలంటే క్రియేటివిటీ ఉండాలి’ అంటూ ధనుష్‌తో గొడవలపై క్లారిటీ ఇచ్చింది. అంతేగాక మహేశ్-త్రివిక్రమ్‌లో చిత్రంలో తను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. కాగా ధనుష్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైనమెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీ కోసం తను 21 రోజుల కాల్షీట్ను కెటాయించానని, ఓ పాట మీనహా తనకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని ఈ సందర్భంగా సంయుక్త మీనన్ తెలిపింది. త్వరలోనే ఈ పాట షూటింగ్లో పాల్గొననున్నట్లు ఆమె వెల్లడించింది. -
గ్లామర్‌ని డ్రెస్‌తో కనెక్ట్ చేయకూడదు: సంయుక్తా మీనన్
‘‘భాష తెలియకుండా నటిస్తే చేసే పాత్రతో సగం కనెక్షన్ మిస్ అయిపోతాం. నా పాత్రకు వేరే వారు డబ్బింగ్ చెప్పడం నాకిష్టం ఉండదు. అందుకే లాక్డౌన్లో ట్యూటర్ని పెట్టుకుని తెలుగు నేర్చుకున్నాను’’ అన్నారు సంయుక్తా మీనన్. కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బింబిసార’. సంయుక్తా మీనన్, కేథరీన్ హీరోయిన్లుగా నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సంయుక్తా మీనన్ మాట్లాడుతూ – ‘‘నటిని అవుతానని అనుకోలేదు. అనుకోకుండా నటిగా అవకాశం రావడంతో సినిమాలు చేశాను. మలయాళంలో నేను చేసిన సినిమాలు నాకు మంచి గుర్తింపును తీసుకుని వచ్చాయి. దీంతో తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఫస్ట్ ‘బింబిసార’, ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం సైన్ చేశాను. ఆ నెక్ట్స్ పవన్ కల్యాణ్‌గారి ‘భీమ్లా నాయక్’, ధనుష్‌గారి ‘సర్’ చిత్రాలు అంగీకరించాను. ‘భీమ్లా నాయక్’, ‘సర్’ చిత్రాల ఆఫర్స్ ఒకేరోజు వచ్చాయి. ఇక ‘బింబిసార’ టైమ్ ట్రావెల్ మూవీ. ఫ్లాష్‌బ్యాక్, ప్రెజెంట్ సిట్యువేషన్స్‌లో స్క్రీన్ ప్లే సాగుతుంది. ప్రెజెంట్ సాగే కథలో నేను కాస్త మోడ్రన్ పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఓ పెద్ద సినిమా చేస్తున్నాను. ఏ భాషలో సినిమా చేసినా ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రలు చేయాలను కుంటున్నాను. నా వస్త్రధారణ కాస్త నిండుగా ఉంటుంది. నా తరహాలో నేను గ్లామర్‌గానే ఉన్నాను. గ్లామర్‌ను డ్రెస్‌తో కనెక్ట్ చేసి చూడటం అనేది తప్పని నా ఫీలింగ్’’ అని అన్నారు. -
ఇక రీమేక్ సినిమాలు ఉండవు..ఆ మోడల్ని ఫాలో అవ్వాల్సిందే: హీరో
‘‘మలయాళ చిత్రాలు వాస్తవానికి దగ్గరగా, ఆలోచన రేకెత్తించేలా ఉంటాయని ప్రేక్షకులు భావించడం సంతోషం. అయితే కొన్నాళ్లుగా థియేటర్లో హాయిగా కూర్చుని పాప్ కార్న్ తింటూ విజల్స్ వేస్తూ ఎంజాయ్ చేసే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు రాలేదు. మా ‘కడువా’ ఆ లోటుని తీరుస్తుంది. ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. షాజీ కైలాస్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్తా మీనన్ జంటగా వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కడువా’. మ్యాజిక్ ఫ్రేమ్స్– పృథ్వీరాజ్ ప్రొడక్ష¯Œ ్సపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించిన ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ హైదరాబాద్‌లో విలేకరులతో పంచుకున్న విశేషాలు... ► ‘సింహాసనం’ (2012) తర్వాత మళ్లీ షాజీ కైలాస్ దర్శకత్వంలో సినిమా చేయడం ఎలా అనిపించింది? పృథ్వీరాజ్: మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లకు షాజీ కైలాస్గారు పెట్టింది పేరు. ఆయన సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను. నేను దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’లో కొన్ని చోట్ల ఆయన మార్క్ కనిపిస్తుంది. ‘కడువా’ కథ వినగానే ‘మీరు డైరెక్ట్ చేస్తే ఈ సినిమాను నేనే నిర్మిస్తాను’ అన్నాను. ‘కడువా’ ఆయన మార్క్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ► కడువా అంటే ఏంటి? కడువా అంటే పులి. ఇందులో హీరో పేరు కడువకున్నేల్ కురువచన్. షార్ట్ కట్లో కడువా. అందుకే ప్రతి భాషలో అదే టైటిల్ పెట్టాం. కడువ కున్నేల్ ధనికుడు. ఒక వ్యక్తితో చిన్న అహం సమస్య మొదలై పెద్ద హింసకు దారితీస్తుంది. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ ఈ చిత్రకథపై రచయితకి మరో వ్యక్తికి మధ్య వివాదం వచ్చింది. కోర్టు రచయితకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ లోనూ అహం పాయింట్ ఉంది కదా.. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (తెలుగులో ‘భీమ్లా నాయక్)లో అహం అనే పాయింట్ ఉన్నా, సినిమాటిక్‌గా రియల్ స్టోరీ. కానీ ‘కడువా’ మాత్రం కమర్షియల్, లార్జర్ దెన్ లైఫ్ సినిమా. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’తో పోలికలుండవు. ► మీకు ఎలాంటి జోనర్ సినిమాలంటే ఇష్టం? నా దృష్టిలో గుడ్ మూవీ, బ్యాడ్ మూవీ.. అంతే. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా, వైవిధ్యమైన సినిమా అయినా.. ఏదైనా సరే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తే అదే గుడ్ మూవీ. సినిమా చూస్తూ ఫోన్లో మెసేజ్‌లు చెక్ చేసుకుంటూ దిక్కులు చూస్తుంటే అది బ్యాడ్ మూవీ. నేనెప్పుడూ మంచి సినిమాలు చేయాలని తాపత్రయపడుతుంటాను. ► నటన, దర్శకత్వం, నిర్మాణం, పాటలు పాడటం... ఇన్ని పనులు కష్టం అనిపించవా? అవన్నీ సినిమాలో భాగమే. అయితే నిర్మాణానికి ఎంతో ప్రతిభ కావాలి. ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఈ విషయంలో నా భార్య (సుప్రియా మీనన్) సపోర్ట్‌గా ఉంటారు. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే వంటివి నేను చూసుకుంటాను. జీఎస్టీ, ఫైల్స్ వంటి బోరింగ్ పనుల్ని నా భార్య చూస్తుంది(నవ్వుతూ). ► మీ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. ‘కడువా’ని థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి కారణం? పాన్ ఇండియా స్థాయిలో నా సినిమా విడుదల అవ్వాలనుకున్నాను. ‘కడువా’తో అది మొదలు పెట్టాను. భవిష్యత్‌లో రీమేక్ సినిమాల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి పరిశ్రమ నుండి మల్టీ లాంగ్వేజ్ సినిమాలని రూపొందించడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. రాజమౌళిగారి ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మెయిన్ స్ట్రీమ్‌గా రిలీజ్ అయ్యాయి. ఆయన చూపించిన ఆ మోడల్ని మనం ఫాలో అవ్వాలి. ‘కేజీఎఫ్ 2’ కూడా ఇదే మోడల్లో రిలీజ్ అయింది. పెద్ద బడ్జెట్ సిని మాలు భవిష్యత్‌లో అన్ని భాషల్లో థియేటర్ రిలీజ్ కావాలి. థియేటర్లో సినిమాని ఎంజాయ్ చేయడం గొప్ప అనుభూతి. ఈ అనుభూతి ఓటీటీ ఇవ్వలేదు. మీ సినిమాలు తెలుగులో రీమేక్ కావడం గురించి... హ్యాపీ. ‘లూసిఫర్’ రీమేక్ చిరంజీవిగారు చేస్తున్నారు. ఆ చిత్రాన్ని నేను తెలుగులో దర్శకత్వం చేసి ఉన్నా ఆయనే నా ఫస్ట్ ఆప్షన్. తెలుగు రీమేక్ కథలో మార్పులు గురించి నాకు తెలీదు. నేనూ ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ► ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌కి దర్శకత్వం వహించే అవకాశం ఎందుకు వదులుకున్నారు? చిరంజీవిగారికి నేను అభిమానిని. ‘లూసిఫర్’ రీమేక్ చేయమని అడిగారు. కానీ, వేరే సినిమాతో నేను బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అంతకు ముందు ‘సైరా నరసింహా రెడ్డి’లో కూడా ఒక పాత్ర చేయమని కోరారు.. అప్పుడూ వీలుపడలేదు. చిరంజీవిగారితో పని చేయాలని ఉంది. నేను ‘లూసిఫర్ 2’ చేస్తున్నాను. ఈ సినిమా తెలుగు రీమేక్ అవకాశం వస్తే చిరంజీవి గారితో చేస్తాను. -
టైమ్ ట్రావెల్ చేయనున్న 'బింబిసార'.. రిలీజ్ డేట్ ఫిక్స్
Kalyan Ram Bimbisara Movie Theatrical Release Date Announced: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న 18వ చిత్రం 'బింబిసార'. కేథరిన్, సంయుక్త మీనన్, వారీనా హుసేన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు విశిష్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ. కె నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది ట్యాగ్‌లైన్. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఈ సంవత్సరం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఉగాది సందర్భంగా శనివారం సినిమా అధికారిక రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడదల చేశారు. The date is locked for BIMBISARA to ascend the throne 🔥#Bimbisara grand release on 5th August 💥#HappyUgadi ❤️#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt @anilpaduri @NTRArtsOfficial pic.twitter.com/cFhr62CmCe — NTR Arts (@NTRArtsOfficial) April 2, 2022 సామాజిక మాధ్యమాల ద్వారా రిలీజైన ఈ పోస్టర్లో కల్యాణ్ రామ్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాలో అత్యున్నత సాంకేతికతను ఉపయోగించాం. ఇందులో కల్యాణ్ రామ్ రెండు విభిన్న పాత్రల్లో కనువిందు చేయనున్నారు. అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. క్రీస్తూ పూర్వ ఐదో శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు కథతో ఈ మూవీ తెరకెక్కనుంది. టైమ్ ట్రావెల్ మూవీగా వస్తున్న 'బింబిసార'లో బింబిసారుడిగా, నేటితరం యువకుడిగా రామ్ నటిస్తున్నట్లు సమాచారం. -
శుభ'మస్తు'గా పర భాష హీరోయిన్లు.. తెలుగులోకి పరిచయం
పేరులోనే శుభాన్ని మోసుకొచ్చింది ఉగాది.. ఇది ‘శుభకృత్’ నామ సంవత్సరం.. శుభకృత్ అంటే ‘మంచి చేసేది’ అని అర్థం. మంచే జరుగుతుందనే ఆశావాహ దృక్పథంతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికిన వేళ. తెలుగు చిత్రసీమ కూడా కొత్త కథానాయికలను ‘శుభమస్తు’ అంటూ ఆహ్వానిస్తోంది. కొత్త తెలుగు సంవత్సరంలో పలువురు నాయికలు పరిచయం కానున్నారు. ఆ కథానాయికల గురించి తెలుసుకుందాం. ముంబై బ్యూటీలు తెలుగు తెరపై మెరవడం కొత్తేం కాదు. ఇప్పటికే ఎంతోమంది హిందీ భామలు ఇక్కడ నిరూపించుకున్నారు. తాజాగా కొందరు ముంబై సే ఆయా (ముంబై నుంచి వచ్చారు). వీళ్లల్లో ఆల్రెడీ హిందీలో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న దీపికా పదుకొణె తెలుగు తెరకు పరిచయం కానున్నారు. దీపికా అనగానే చాలామంది బాలీవుడ్ హీరోయిన్ అనే అనుకుంటారు. కానీ హీరోయిన్గా ఆమె కెరీర్ మొదలైంది ఉపేంద్ర హీరోగా 2006లో విడుదలైన కన్నడ ఫిల్మ్ ‘ఐశ్వర్య’తోనే. ఈ సినిమా తర్వాత దీపికా హిందీలో చేసిన ‘ఓం శాంతి ఓం’ అద్భుత విజయం సాధించడంతో బాలీవుడ్లోనే సెటిలైపోయారు ఈ మంగుళూరు బ్యూటీ. అయితే 2007లో రజనీకాంత్ చేసిన తమిళ ఫిల్మ్ ‘కొచ్చయాడన్’తో మళ్లీ సౌత్‌లో నటించారు. అయితే అది యానిమేషన్ మూవీ కాబట్టి.. ఎక్కువ రోజులు పని చేయలేదామె. ఎనిమిదేళ్ల తర్వాత సౌత్‌లో ‘ప్రాజెక్ట్ కె’లో భాగమయ్యారు. దీపికా పదుకొణెకు తెలుగులో ఇదే తొలి సినిమా. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రధారిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఇక 2019లో హిందీలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో హీరోయిన్గా కెరీర్ ఆరంభించిన అనన్య పాండే ‘లైగర్’తో తెలుగువైపు అడుగులు వేశారు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఇంకోవైపు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందిన మరో ఫిల్మ్ ‘గని’తో తెలుగు గడప తొక్కారు సయీ మంజ్రేకర్. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ‘గని’ చిత్రంలో సయీ మంజ్రేకర్ ఓ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న రిలీజ్ కానుంది. బాలీవుడ్లో వెబ్ సిరీస్‌లు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్న మిథిలా పాల్కర్ తెలుగుకి వచ్చారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘ఓరి దేవుడా..’ చిత్రంలో తెలుగు తెరపై కనిపించనున్నారామె. తమిళ హిట్ ఫిల్మ్ ‘ఓ మై కడవులే..’కి ఇది తెలుగు రీమేక్. ఒకే సినిమాతో ఇరువురు భామలు ఒకే సినిమా (‘టైగర్ నాగేశ్వరరావు’)తో ఇద్దరు బ్యూటీలు పరిచయం కానున్నారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో కథానాయికలు. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రవితేజ హీరోగా పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ఉగాది పర్వదినానా (శనివారం) ఆరంభమైంది. ఇంతకీ నూపుర్ సనన్ ఎవరంటే.. ఇప్పటికే నార్త్, సౌత్‌లో స్టార్ అనిపించుకున్న కృతీ సనన్ చెల్లెలు. మరో భామ గాయత్రీ భరద్వాజ్ ఎఫ్‌బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2018, సెఫోరా మిస్ గ్లామరస్, జియో మిస్ పాపులర్ ఇలా పలు టైటిల్స్‌ను గెల్చుకున్నారు. ఫ్రమ్ ఫారిన్ తమిళ హీరో శివకార్తికేయన్ కోసం ఉక్రెయిన్ నుంచి వచ్చారు మరియా ర్యాబోషప్క. కేవీ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క నటిస్తున్నారు. ఇక నాగశౌర్య కోసం హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు న్యూజిల్యాండ్ బ్యూటీ షిర్లే సేథియా. నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘కృష్ణ వ్రిందా విహారి’ చిత్రంలో షిర్లే సేథియా హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న రిలీజ్ కానుంది. మాలీవుడ్ టు టాలీవుడ్ మలయాళంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన నజ్రియా నజీమ్ సుందరం కోసం తెలుగుకి వచ్చారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అంటే... సుందరానికీ’ చిత్రంలో నజ్రియా కథానాయికగా నటిస్తున్నారు. మరోవైపు మాలీవుడ్‌లో దూసుకెళ్తోన్న సంయుక్తా మీనన్ మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘సర్’ (తమిళంలో ‘వాతి’)లో సంయుక్తా హీరోయిన్గా చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. అలాగే కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న టైమ్ ట్రావెల్ ఫిల్మ్‌లో సంయుక్త హీరోయిన్గా కనిపిస్తారు. అంతే కాదండోయ్.. మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ చిత్రంలో ఓ కీ రోల్ చేస్తున్నారీ బ్యూటీ. ఇక మరో పాపులర్ మలయాళ బ్యూటీ ఐశ్వర్యా లక్ష్మీ సైతం తెలుగులో నిరూపించుకునేందుకు రెడీ అయ్యారు. ‘బ్లఫ్ మాస్టర్’ తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేశ్ కాంబినేషన్లో రిలీజ్‌కు రెడీ అయిన చిత్రం ‘గాడ్సే’. ఈ చిత్రంతో ఐశ్వర్యా లక్ష్మీ తెలుగులో తొలి అడుగు వేశారు. వీరితో పాటు అనిఖా కృష్ణన్ కూడా తెలుగుకు హాయ్ చెబుతున్నారు. మలయాళ హిట్ ఫిల్మ్ ‘కప్పెలా’ తెలుగు రీమేక్ ‘బుట్టబొమ్మ’ (వర్కింగ్ టైటిల్)లో అనిఖా నటిస్తున్నారు. ఇందులో విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ హీరోలు. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాదికి దాదాపు పది మంది కథానాయికలు తెలుగుకి వస్తున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా తెలుగులో పరిచయమై ప్రతిభను నిరూపించుకునేందుకు కథలు వింటున్నారు. -
‘భీమ్లా నాయక్’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్ క్లారిటీ
Samyuktha Menon Disappointed With Bheemla Nayak: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్ మంచి హిట్‌టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ హీరోయిన్లు అయిన నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు భీమ్లా నాయక్‌పై మూతి ముడుచుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణంగా సినిమా నిడివి తగ్గించేందుకు పాటలతో పాటు హీరోయిన్ల సన్నిశాల్లో కోతలు విధించడం. చదవండి: బాలీవుడ్‌పై నటి భాగ్యశ్రీ షాకింగ్ కామెంట్స్.. ఎంతో మంది సంగీత ప్రియుల ఆదరణ పొందిన ‘అంత ఇష్టం ఏందయ్యా..’ సాంగ్‌తో పాటు పలు సన్నివేశాలను చిత్ర బృందం తొలగించిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో ఎంతోమందిని ఆకట్టుకున్న తన పాటను తొలగించడంపై నిత్యా మీనన్ హర్ట్ అయ్యిందని, అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాలేదని వార్తలు వినిపించగా.. రిలీజ్ అనంతరం తన సీన్లను తొలగించడంపై సంయుక్త మీనన్ సైతం చిత్రం బృందంపై కోపంతో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై స్పందించింది సంయుక్త మీనన్. చదవండి: సమంతపై జిమ్ ట్రైనర్ జునైద్ ఆసక్తికర వ్యాఖ్యలు ‘అవును నేను చాలా హర్ట్ అయ్యాననే మాట నిజమే. అయితే నా పాత్ర గురించి కాదు .. దాని నిడివి గురించి కాదు. ఈ సినిమాను రెండోసారి థియేటర్లో చూద్దామనుకుంటే ఇంతవరకూ టిక్కెట్ దొరకలేదు .. అందుకు’ అంటూ చమత్కరించింది. తన కామెంట్స్ విన్న నెటిజన్లు సీన్స్ తొలగిస్తే ఎవరూ బాధపడకుండా ఉంటారని, కానీ ఆమె నిజం ఒప్పుకోవడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిత్యా మీనన్ మాత్రం తన పాట, సన్నివేశాలను తొలగించడం పట్ల మూవీ యూనిట్‌పై తీవ్ర అసహనంతో ఉందని, అందుకే ఆమె భీమ్లా నాయక్ సంబంధించిన ఏ ఈవెంట్లోను పాల్గొనడం లేదంటూ సినీ వర్గాలు నుంచి సమాచారం. ఈ మూవీ పవన్ కల్యాన్ భార్య నిత్యా మీనన్ నటించగా.. రానా భార్య సంయుక్తి మీనన్ కనిపించింది. -
హీరోయిన్ సంయుక్త మీనన్ బ్యూటిఫుల్ ఫోటోలు