మాస్టారు... నా మనసును గెలిచారు | Dhanush Next Sir Movie lyrical Song Release | Sakshi
Sakshi News home page

మాస్టారు... నా మనసును గెలిచారు

Published Fri, Nov 11 2022 3:59 AM | Last Updated on Fri, Nov 11 2022 3:59 AM

Dhanush Next Sir Movie lyrical Song Release - Sakshi

ధనుష్, సంయుక్తా మీనన్‌

‘‘శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. సీతకు మల్లే నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంత విన్నాలే.. ’ అని ప్రేమగీతం పాడుకున్నారు సంయుక్తా మీనన్‌. ధనుష్, సంయుక్తా మీనన్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘సార్‌’ (తమిళంలో ‘వాతి’).
శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఎస్‌. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న సినిమా ఇది.

ఈ సినిమా నుంచి ‘మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు.. అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను గురువారం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. మాస్టారు ధనుష్‌ని ఉద్దేశించి సంయుక్త పాడే ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, శ్వేతా మోహన్‌ ఆలపించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. కాగా, ఈ పాట తమిళ వెర్షన్‌కు ధనుష్‌ సాహిత్యం అందించడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement