Dhanush, Samyuktha Menon Starrer Sir Teaser Out Now | Dhanush Birthday Special - Sakshi
Sakshi News home page

Happy Birthday Dhanush-Sir Teaser: ధనుష్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. సార్‌ టీజర్‌ వచ్చేసింది!

Published Thu, Jul 28 2022 6:47 PM | Last Updated on Thu, Jul 28 2022 7:47 PM

Dhanush, Samyuktha Menon Starrer Sir Teaser Out Now - Sakshi

స్టార్‌ హీరో ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సార్‌. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళంలో వాత్తి పేరిట రిలీజ్‌ కానుంది. ఈరోజు ధనుష్‌ బర్త్‌డే కావడంతో సార్‌ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌.

జీరో ఫీజు.. జీరో ఎడ్యుకేషన్‌.. మోర్‌ ఫీజు.. మోర్‌ ఎడ్యుకేషన్‌.. ఇదేరా ఇప్పుడు ట్రెండ్‌.. అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలువుతుంది. ఆ తర్వాత యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయాయి. ఇక టీజర్‌లో ధనుష్‌ పాత్రను రివీల్‌ చేశారు. అతడి పేరు బాలగంగాధర్‌ తిలక్ అని, జూనియర్‌ లెక్చరర్‌గా నటించాడని హీరోనే స్వయంగా వెల్లడించాడు. 'విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సర్‌.. పంచండి, ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో డిష్‌లాగా అమ్మకండి' అని హీరో చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది. టీజర్‌ చూస్తుంటే విద్యావ్యవస్థలో ఉన్న లోపాను ఎత్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.  ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌లతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ధనుష్‌కు ఇది తొలి తెలుగు స్ట్రయిట్‌ ఫిలిం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

చదవండి: విక్రాంత్‌ రోణ సినిమా రివ్యూ
'ఇంద్ర' సినిమాలో అందుకే నటించలేదు: పరుచూరి గోపాలకృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement