నాగార్జున 'కుబేర'.. ఫ్యాన్స్‌కు దీపావళీ అప్‌డేట్‌ వచ్చేసింది! | Sekhar Kammula Kubera Movie Deepavali Update Goes Viral | Sakshi
Sakshi News home page

Kubera Movie: శేఖర్ కమ్ముల 'కుబేర'.. టీజర్‌ రిలీజ్ ఎప్పుడంటే?

Published Fri, Nov 1 2024 4:58 PM | Last Updated on Fri, Nov 1 2024 5:17 PM

Sekhar Kammula Kubera Movie Deepavali Update Goes Viral

కోలీవుడ్ స్టార్‌ ధనుశ్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కుబేర. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ ‍చెప్పారు మేకర్స్. ఈ సినిమా టీజర్‌ రిలీజ్ డేట్‌ ప్రకటించారు. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌ విడుదల చేస్తూ అనౌన్స్‌మెంట్‌ చేశారు. 

కాగా.. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్‌ కనిపించనున్నరు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్‌ పేర్కొంది. బాలీవుడ్‌ నటుడు జిమ్‌సర్భ్‌ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement