
నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా నటించడం విశేషం. ధనిక-పేద తేడా, రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా ట్రైలర్‌ని తాజాగా లాంచ్ చేశారు. సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆదివారం జరిగిన ‘కుబేర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళి ఈ చిత్రం ట్రైలర్, బిగ్ టికెట్స్‌ను లాంచ్ చేశారు. ఈ వేదికపై ఇంకా రాజమౌళి మాట్లాడుతూ – ‘‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో రిచ్, పూర్ ప్రపంచాలను ఎలా కలిపారు? నాగార్జున, ధనుష్‌గార్లను ఏ విధంగా తీసుకొచ్చారు? వీరి మధ్య డ్రామా ఎలా ఉండబోతుందన్న నాకు ఈ సినిమా ట్రైలర్ ఇంకా ఆసక్తిని పెంచింది’’ అని అన్నారు.