హిట్ ఫిల్మ్ ‘సార్’ (2023) (తమిళంలో ‘వాతి’) తర్వాత హీరో ధనుష్( Dhanush )–దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో మరో మూవీ రానుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుందనే చర్చ కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతోంది.
ఇటీవల సూర్యకు వెంకీ అట్లూరి ఓ కథ వినిపించారనే టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా హీరో ధనుష్( Dhanush )కు వెంకీ ఓ కథ వినిపించారట. ఈ కథకు ధనుష్( Dhanush ) అంగీకారం తెలిపారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో వెంకీ అట్లూరి ఉన్నారని భోగట్టా. అంతేకాదు... ఈ సినిమాకు ‘హానెస్ట్ రాజ్’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. మరి... ధనుష్( Dhanush )–వెంకీ అట్లూరిల కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment