కులం పేరు చెప్పుకోవడం ఇష్టం లేదు: హీరోయిన్‌ | Actress Samyuktha Menon Removes Menon From Her Name | Sakshi
Sakshi News home page

Samyuktha Menon: కులం పేరు చెప్పుకోవడం ఇష్టం లేదు 

Feb 12 2023 8:31 AM | Updated on Feb 12 2023 8:47 AM

Actress Samyuktha Menon Removes Menon From Her Name - Sakshi

తమిళసినిమా: మలయాళం, తమిళం, తెలుగులో నటిస్తున్న నటి సంయుక్త మీనన్‌. ప్రస్తుతం ధనుష్‌తో చేసిన వాత్తీ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17వ తేదీ విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్‌లలో భాగంగా ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనను అందరూ సంయుక్త మీనన్‌ అని పిలుస్తున్నారని.. అయితే తనకు కులం పేరు చెప్పుకోవడం ఇష్టం లేదని, సంయుక్త అని పిలవడమే తనకు ఇష్టమని పేర్కొంది. తాను నటిగా మలయాళంలో పరిచయమైనా తమిళ చిత్రాలు అంటే చాలా ఇష్టమని పేర్కొంది.

తమిళ భాష, తమిళ సినిమా పాటలు అంటే ఇంకా ఇష్టమని చెప్పింది. చిన్న తనంలోనే ముస్తఫా అనే పాటను పలుమార్లు ఇష్టంగా వినేదాన్నని తెలిపింది. తాను ఇంతకు ముందు తమిళంలో కొన్ని చిత్రాలను అనుభవరాహిత్యంతో అంగీకరించి నటించానని చెప్పుకొచ్చింది. అయితే ఇకపై చిత్రాల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నానని చెప్పింది. అలా ఒప్పుకుని నటించిన చిత్రమే వాత్తీ అని చెప్పింది. ఇందులో ధనుష్‌ వంటి అనుభవమైన నటుడి సరసన నటించడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నానని, ధనుష్‌ సింగిల్‌ టేక్‌ ఆరి్టస్ట్‌ అని, అందు వల్ల తాను ఎక్కువగా తీసుకోరాదని ముందుగానే డైలాగ్స్‌ చెప్పడం నుంచి నటించడం వరకు ప్రిపేర్‌ అయ్యేదాన్ని అని తెలిపింది. అయినా టేక్‌లు తీసుకునేదాన్ని, అందుకు ధనుష్‌ ఎంతగానో సహకరించారని పేర్కొంది. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా సంయుక్త పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement