తమిళ హీరో ధనుశ్, సంయుక్తి మీనన్ నటించిన తాజా చిత్రం ‘సార్’ . ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆయన కోలీవుడ్‌లో నటించిన చిత్రాలన్ని తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన సమీక్షను వెల్లిడంచారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు ధనుష్ బాడీ లాంగ్వేజ్ సరిపోలేదని అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..' సినిమా చూసినప్పుడు తన బాల్యంలోకి వెళ్లినట్లు అనిపించింది. దర్శకుడు వెంకీ అట్లూరి కొందరి జీవితాల్లోకి పరకాయ ప్రవేశం చేసి ఈ కథను రాసినట్లు ఉంది. పేద విద్యార్థులకు విద్యా అందడం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ధనుష్‌ను హీరోగా వెంకీ అట్లూరి ఓ సాహసమే చేశారని చెప్పుకోవాలి. పేద విద్యార్థులకు చదువును అందించాలని హీరో పడ్డ ఇబ్బందులు చక్కగా చూపించారు. ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించిన కథలా కంటే లైవ్‌లో చూపించినట్లు మార్పు చేసి ఉంటే ఇంకా బాగుండేది. కొన్ని సన్నివేశాల్లో ధనుష్ బాడీ లాంగ్వేజ్ సరిపోలేదు. మరికొన్ని సీన్లలో బాగా నటించారు. హీరోకు గురజాడ అప్పారావు గెటప్ వేయడం గొప్ప ఆలోచన. విద్యార్థులకు సినిమా థియేటర్‌లో పాఠాలు చెప్పడమనే కొత్తదనాన్ని డైరెక్టర్ పరిచయం చేశారు. సుమంత్‌తో కథ చెప్పించడం బాగుంది. హీరోను ఊరి నుంచి వెళ్లమన్నప్పుడు పిల్లలందరూ ఏడుస్తుంటే.. తల్లిదండ్రులు ఆపుతారేమోనని అనుకున్నా. అదే ఊరిలో ఉండి హీరో గెలిచినట్లు చూపిస్తే ఇంకా బాగుండేది. ' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment