Paruchuri gopala krishna
-
లక్కీ భాస్కర్.. హీరోయిన్ను మెచ్చుకోవాల్సిందే! : పరుచూరి గోపాలకృష్ణ
మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో దుల్కర్ సల్మాన్. ఈ ఏడాది లక్కీ భాస్కర్ మూవీతో మరోసారి అలరించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. లక్కీ భాస్కర్ ఎలా ఉందో తెలియజేస్తూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు.ముందు జాగ్రత్తమధ్యతరగతి జీవితంలో జరిగిన అద్భుతమే ఈ సినిమా. కథ ముంబైలో జరుగుతుంది, పాత్రలు తెలుగులో మాట్లాడతాయి అని ముందే చెప్పేశారు. ముంబైలో తెలుగు మాట్లాడటమేంటని ఎవరూ విమర్శించకుండా జాగ్రత్తపడ్డారు. సినిమా ప్రారంభ సన్నివేశం బాగుంది. దర్శకుడు వెంకీ అట్లూరి స్క్రీన్‌ప్లేతో ఆటాడుకున్నారు. ఎన్నిరకాలుగా డబ్బును కాజేయొచ్చనేది సినిమాలో చూపించారు. దిగువమధ్యతరగతి స్థాయిలో ఉన్న భాస్కర్ వందకోట్లకు అధిపతి అయిపోతాడు. అసలు గేమ్ప్రపంచంలో కొందరు కోటీశ్వరులుగా ఎలా ఎదుగుతున్నారన్నది సినిమాలో చూపించారు. ప్రేమకథపై కాకుండా ఒరిజినల్ కథపైనే ఎక్కువ దృష్టి సారించడం బాగుంది. మొదట అతడి కష్టం, కన్నీళ్లు చూపించాక అసలైన గేమ్ మొదలుపెట్టారు. చివర్లో తను సంపాదించిన డబ్బంతా చెక్కులపై రాసిచ్చేసినప్పుడు ప్రేక్షకులకు బాధేస్తుంది. కట్ చేస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించి అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు.ట్విస్టులు బాగున్నాయిప్రతి రూపాయిని బ్లాక్మనీలా కాకుండా వైట్ మనీ చేసుకున్న హీరో బ్రెయిన్‌ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. సినిమాలో ట్విస్టులు బాగున్నాయి. వంద కోట్ల కలెక్షన్స్ సాధించిందంటే మూడు రెట్ల లాభాలు వచ్చాయి. చిన్న పాత్ర అని తెలిసినా ఒప్పుకుని నటించిన హీరోయిన్ మీనాక్షి చౌదరిని అభినందించాల్సిందే! అని పరుచూరి చెప్పుకొచ్చాడు.చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు -
అహం.. అలా చేసుంటే ఇంకా బాగుండేది: పరుచూరి
ఒకే ఒక్క క్యారెక్టర్.. గంటన్నర సినిమా.. సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ అహం- రీబూట్. ఆహాలో రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమాపై దర్శకరచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో రివ్యూ ఇచ్చారు.అలా చేసుంటే..ఆయన మాట్లాడుతూ.. రేడియో జాకీగా పని చేసే ఓ యువకుడి చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఒకే పాత్రతో సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఒకే క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కష్టం. ఇందులో సోలోమ్యాన్ షోలా కాకుండా ప్రియురాలి పాత్రను నెమరువేసుకునే సన్నివేశాలు రూపొందించి ఉంటే ఇంకా బాగుండేది. అప్పుడు ప్రేక్షకులు సినిమాను ఇంకా బాగా చూసేవారు.తాపత్రయం బాగుంటుందిసినిమా గురించి మరింత మాట్లాడుతూ.. తన జీవితంలో ఒకరిని కోల్పోయినందుకు చనిపోదామనుకునే దశ నుంచి దాన్నుంచి బయటపడటం అనేది మంచి సందేశం. తన జీవితంలో జరిగిన సంఘటన మరొకరి జీవితంలో జరగకూడదని హీరో పడే తాపత్రయం బాగుంటుంది. చిన్నచిన్న సమస్యలకే ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది మంచిది కాదని సినిమాలో చక్కగా చెప్పారు.ప్రయోగాలు ఆపకూడదునూతన ఒరవడి కోసం ఇలాంటి సినిమాలను అప్పుడప్పుడు చూడాలి. కొన్నిసార్లు ప్రయోగాలు అద్భుత విజయాలను సాధిస్తాయి. మరికొన్నిసార్లు దెబ్బతింటాయి. దెబ్బతిన్నాం కదా అని ప్రయోగాలు ఆపకూడదు అని పేర్కొన్నారు. కాగా సుమంత్ హీరోగా నటించిన అహం మూవీకి ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించాడు. -
మే డే: ఫిలిం ఫెడరేషన్ ఆఫీసు వద్ద జెండా ఎగురవేసిన పరుచూరి గోపాలకృష్ణ (ఫొటోలు)
-
'నా సామిరంగ'లో అది నచ్చలేదు.. ఇలా చేసుంటే కలెక్షన్స్..
నాగార్జున అక్కినేని. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ మూవీ నా సామిరంగ. ఆషిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి ఇది రీమేక్‌గా వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన రచయిత పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్‌లో రివ్యూ ఇచ్చాడు. ఆ టెక్నిక్ ఫాలో కావట్లే.. ఆయన మాట్లాడుతూ.. 'సినిమా బాగుంది. కానీ వసూళ్లు అంతగా రాలేవు. ఏ దర్శకుడికైనా, రచయితకైనా, నటుడికైనా సంతృప్తినిచ్చే సినిమాలు కొన్నుంటాయి. ఈ మూవీ ఆ జాబితాలోకే వస్తుంది. దిగ్గజ డైరెక్టర్ దాసరి నారాయణరావు టెక్నిక్‌ను చాలామంది యువదర్శకులు ఫాలో అవడం లేదు. ఆయన సినిమాలో ఆఖరి అరగంటే చిత్రానికి గుండెకాయ. అప్పటివరకు ఎలా ఉన్నా చివర్లో మాత్రం ప్రేక్షకులు కన్నార్పకుండా చూసేవారు. కళ్లతో నటించారు నా సామిరంగ మూవీ విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో రొమాన్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. నాగార్జున గడ్డం పెంచి, లుంగీ కట్టి కొత్తగా కనిపించారు. కిష్టయ్య పాత్రను ప్రేమించారు. తన పాత్రకు న్యాయం చేశారు. కళ్లతో నటించారు. ఎప్పుడూ కామెడీ పండించే అల్లరి నరేశ్ ఎక్కువ ఫైట్లు చేశాడు. ఇంటర్వెల్లో రావు రమేశ్ పాత్రను ముగించకుండా ఉంటే బాగుండనిపించింది. ఇంటర్వెల్లో ఆయన పాత్ర క్లోజ్ చేయడంతో సెకండాఫ్‌లో కొత్త విలన్ వస్తాడని సగటు ప్రేక్షకుడికి సులువుగా తెలిసిపోతుంది. కూతుర్ని భయపెట్టే క్రమంలో నిజంగానే ఆయన పాత్ర చనిపోతుంది. ఈ పాత్రను అంతం చేయకుండా అలాగే కొనసాగిస్తే సెకండాఫ్ ఇంకా బాగుండేదనిపించింది. ప్రేక్షకులు భరించలేరు అల్లరి నరేశ్ పాత్రను కూడా ముగించకుండా ఉండాల్సింది. ఎందుకంటే హీరో పక్కన ఉన్నవాళ్లను చంపుకుంటూ పోతే ప్రేక్షకులు భరించలేరు. హీరో విలన్లను చంపుకుంటూ పోతే సినిమా సూపర్ హిట్ అవుతుంది, అదే విలన్.. హీరో మనుషులను చంపుకుంటూ పోతే సినిమా దెబ్బతింటుంది. అయినా లక్కీగా ఈ సినిమా బయటపడింది. నాజర్ పాత్ర చివర్లో చేసిన పని కూడా నచ్చలేదు. సెకండాఫ్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే మరిన్ని కలెక్షన్స్ వచ్చుండేవి' అని చెప్పుకొచ్చాడు. చదవండి: విజయకాంత్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్.. నేను వద్దని తెగేసి చెప్పారు -
మహేష్ సినిమాకు తూటాల్లాంటి మాటలు రాసిన పరుచూరి బ్రదర్స్
-
రాకేశ్ మాస్టర్ కోసం ఆ ప్రయత్నం ఎవరూ చేయలేదు: పరుచూరి గోపాలకృష్ణ
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమంది మాస్టర్లను తయారు చేసిన ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. తాజాగా ఆయన మృతిపట్ల ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన పడిన కష్టాలను వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు.. డ్యాన్స్ చేస్తూ వీడ్కోలు!) పరుచూరి మాట్లాడుతూ..' రాకేశ్ మాస్టర్‌తో ఎక్కువగా పనిచేయలేదు. ఆయన గురువైన ముక్కురాజుతో నేను ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశా. రాకేశ్ మాస్టర్ ఇక లేరంటూ టీవీలో చూడగానే షాకయ్యాను. తాజాగా వాళ్ల అబ్బాయి మా నాన్న గురించి మాట్లాడుకోవడం ఇకనైనా ఆపేయండి అని చెప్పగానే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.' అంటూ విచారం వ్యక్తం చేశారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'రాకేశ్ మాస్టర్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఇండస్ట్రీలో ఆయన అద్భుతాలు సృష్టించాడు. దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేశారు. శేఖర్ , జానీ అనే ఇద్దరు అద్భుతమైన మాస్టర్లను తీర్చిదిద్దాడు. వాళ్లంతా వచ్చి ఆయన మృతదేహం దగ్గర కన్నీరు పెట్టుకుంటుంటే అందరికీ బాధేసింది. ఆయన ఆవేదనను ఎవరైనా పట్టించుకుని ఉంటే ఆయన జీవితం ఇంకో రకంగా ఉండేది. కానీ ఎవరూ ఆయన్ని దగ్గరకు తీసుకొని ఆయన జీవితానికి మంచి మార్గాన్నిచ్చే ప్రయత్నం చేయలేదు.' అని అన్నారు. అలా జరిగి ఉంటే.. పరుచూరి మాట్లాడుతూ.. 'టాలీవుడ్లో ప్రస్తుతమున్న అప్‌కమింగ్ హీరోలు, అప్ కమింగ్ దర్శకులో ఎవరో ఒకరు మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని నా అభిప్రాయం. ఆయన షో చూస్తే నాకు అనుక్షణం ఆవేదనే కనిపించేది. ఎంతలా ఆవేదన అనుభవించాడో. మిత్రులారా.. ఆయన జీవితాన్ని ఉదాహరణగా తీసుకోండి. మనకు భగవంతుడు ఓ ఛాన్స్ ఇచ్చాడు. మన జీవితంలో జరిగే స్ట్రగుల్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆయన ఆత్మ పరమాత్మను చేరుకుని.. శివుడి కూడా ఆయన లయ, విన్యాసాలు చూడాలని ఆశిస్తున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) -
దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ రాలేదు: పరుచూరి
ఇటీవలి కాలంలో వచ్చిన సమంత శాకుంతలం సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. కనీస వసూళ్లు సాధించడంలోనూ విఫలమైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. శాకుంతలం ఓ జ్ఞాపకం.. 'శాకుంతలం నాకొక అద్భుతమైన జ్ఞాపకం. గతంలో నేను తెలుగు ఉపన్యాసకుడిగా పని చేశాను. ఆ సమయంలో నేను శాకుంతలం నాటకం చూశాను. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత గుణశేఖర్ సినిమా తీయడంతో మళ్లీ చూశా. ఆయన తీసిన సినిమాలన్నీ చూస్తే అందులో కొత్తదనం కనిపిస్తుంది. రానాగారితో హిరణ్యకశ్యప చేద్దామనుకున్నాడు, కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అప్పుడు వేరే సోషల్ కథ ఎంచుకోకుండా శాకుంతలం సినిమా తీశాడు. ఆ సీన్ ఒరిజినల్ కథలో లేదు! ప్రేమ, గంధర్వ వివాహం.. ఆ ప్రేమను ఓ శాపం వల్ల మర్చిపోవడం, చివర్లో భార్యాభర్తలు కలవడం.. భారతదేశాన్ని పరిపాలించిన భరతుడు ఎలా పుట్టాడనేదే కథ. శకుంతల గర్భం దాల్చిన తర్వాత మహారాజుని కలవడానికి వెళ్లడం, ఆయన వెళ్లిపోమని కేకలు వేయడం.. బయటకు వచ్చిన ఆమెను గ్రామస్తులు రాళ్లతో కొట్టడం చూపించారు. సానుభూతి కోసం ఈ సీన్ పెట్టారేమో కానీ నాకు తెలిసినంత వరకు అభిజ్ఞాన శాకుంతలంలో ఆమెను రాళ్లతో కొట్టలేదు. చిన్నపిల్లాడికి కూడా తెలిసిపోతుంది శకుంతల- దుష్యంతుల ప్రేమ.. వారికి భరతుడు పుట్టాడనే కథ ఎన్ని సంవత్సరాలైనా సజీవంగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో శకుంతల, దుష్యంతుడు కలుస్తారా? లేదా? ఆసక్తి క్రియేట్ చేశారు. సెకండాఫ్‌లో ఉంగరం చూడగానే దుష్యంతుడికి శకుంతల గుర్తుకు వస్తుంది. దీంతో వాళ్లిద్దరూ కలిసిపోవడం ఖాయమని చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది. గుణశేఖర్ రచన, దర్శకత్వంలో ఎక్కడా తప్పు లేదు. కానీ ఈ ఒక్క సీన్‌తో ఆసక్తి తగ్గిపోవచ్చు. సినిమా కలెక్షన్లపై సెకండాఫ్ ప్రభావం చూపించిందేమోనని నేను భావిస్తున్నాను. సమంత చిన్నమ్మాయే అయినా.. చివర్లో దుష్యంతుడు స్వయంగా వచ్చినా కూడా శకుంతల ఆయన దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడలేదు.. ఇక్కడ మంచి డ్రామా క్రియేట్ చేశారు. సమంత చిన్నమ్మాయే అయినా అద్భుతంగా నటించింది. దుష్యంతుడి పాత్రకు దేవ్ మోహన్ న్యాయం చేశాడు. ప్రజలు మర్చిపోతున్న మహాభారతంలోని ఓ ముఖ్య నాటకాన్ని సొంత డబ్బుతో తెరకెక్కించిన గుణశేఖర్ గట్స్‌కు హ్యాట్సాఫ్' అని చెప్పాడు గోపాలకృష్ణ. చదవండి: ప్రియుడితో టచ్‌లో ఉన్న నటుడి భార్య, అందుకే విడాకులు! -
ఈ సినిమాలో అదొక్కటే అద్భుతమైన షాట్: పరుచూరి
నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేశ్ జంటగా నటించిన ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమా విజయం పట్ల ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నాని నటన అత్యద్భుతంగా ఉందని ప్రశంసించారు. (ఇది చదవండి: లక్షన్నరలో హీరోయిన్ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!) పరుచూరి మాట్లాడుతూ.. ' ఈ సినిమా పూర్తిగా నాని- కీర్తి సురేశ్దే. ప్రారంభం నుంచి చివరి వరకూ తన నటనతో ఆశ్చర్యానికి గురిచేశాడు నాని. సాధారణంగా క్యూట్ లుక్‌లో ఉండే నాని ఈ చిత్రంలో ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. అందుకే ఈ సినిమా విషయంలో ముందు నానినే మెచ్చుకోవాలి. అలాగే హీరో మిత్రుడిగా దీక్షిత్ శెట్టి అదరగొట్టాడు. ఈ చిత్రంలో అంతర్లీనంగా రామాయణం - మహాభారతం కథలు కనిపించాయి. విలన్ ఒక రావణాసురుడి లాంటి వాడు. అందుకే అతడిని చంపేటప్పుడు రావణకాష్ఠం చూపించారు. సాయికుమార్ పాత్ర చిన్నదే అయినప్పటికీ క్లైమాక్స్‌లో డైలాగ్ విని.. ఇతడే విలనా? అన్న సందేహం కూడా ప్రేక్షకులకు వస్తుంది. అలాంటి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను దర్శకుడు శ్రీకాంత్ క్రియేట్ చేశాడు. ఇందులో మరో విచిత్రం ఏమిటంటే.. క్లైమాక్స్‌లో హీరోని అంతం చేయడానికి ఎంతోమంది రౌడీలు వస్తారు. ఆ సమయంలో గ్రామస్థులెవరూ హీరోకు సపోర్ట్ చేయరు. సమాజంలో ఒక వ్యక్తికి భయపడి పేద ప్రజలు ఎలా బతుకుతారో? చెప్పడానికి ఈ సినిమానే ఓ నిదర్శనం. నాకు తెలిసినంతవరకూ ఏదో ఒక గ్రామాన్ని చూసి స్ఫూర్తి పొందే వాళ్లు ఇలాంటి సీన్స్ తీశారు. ఆ గ్రామంలో పెత్తందారు చెప్పిందే అక్కడి ప్రజలు వినాలి అనే రూల్స్ ఉంటాయి. (ఇది చదవండి: ప్యాలెస్‌లో శర్వానంద్ పెళ్లి.. ఒక్క రోజుకు ఎన్ని కోట్ల ఖర్చంటే?) పరుచూరి మాట్లాడుతూ.. 'చిన్నప్పుడు ధరణిపై ఇష్టంగా ఉన్న అమ్మాయి.. ఆ తర్వాత వేరొకరితో పెళ్లి జరుగుతుంది. సూరి (దీక్షిత్ శెట్టి) చనిపోయిన తర్వాత వెన్నెల (కీర్తిసురేశ్)ను వితంతువును చేస్తుంటే.. ధరణి (నాని) అక్కడికి వెళ్లి అదే తాళిని ఆమె మెడలో కడతాడు. అదే ఈ సినిమాలో అద్భుతమైన షాట్. అప్పటి దర్శకులు చేయలేని ధైర్యం ఇప్పుడున్న వాళ్లు చేశారనడానికి నిదర్శనం. విలన్ చనిపోయాక కూడా సినిమా నడుస్తుంది. ధరణి ప్రేమను వెన్నెల ఒప్పుకుందా? అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు. చివర్లో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ప్రేక్షకుల ఉత్కంఠకు తెరదించాడు. నాని జీవితంలో ఇది మరిచిపోలేని చిత్రంగా నిలిచింది. అసలు అక్కడ ఉన్నది నానినేనా అనే సందేహం కలుగుతుంది.' అంటూ ప్రశంసించారు. -
‘రంగమార్తాండ’ క్లైమాక్స్ అలా ఉండి ఉంటే మరింత బాగుండేది
పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన రివ్యూలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవలే విడుదలైన సూపర్ హిట్ టాక్ అందుకున్న 'రంగమార్తాండ' చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ ప్రధానపాత్రల్లో నటించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..'సినిమా గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు. ఈ సినిమాలో జీవితం గురించి ఉంది కాబట్టి చెబుతున్నా. ప్రస్తుత సమాజంలో ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే చూసి కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక అమ్మాయిని చంపుతుంటే ఎవరు పట్టించుకోకుండా వీడియోలు తీసే సీన్‌తోనే సినిమా ప్రారంభమైంది. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, రాహుల్, అనసూయ, శివాత్మిక, ఆదర్శ్ అద్భుతంగా నటించారు. శివాత్మిక పాత్ర అద్దం పట్టేలా ఉంటుంది. ఒక కూతురు తన తండ్రిని సెల్లార్లో పడుకోమని చెప్పినప్పుడు ప్రేక్షకులకు తప్పకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బ్రహ్మానందం అంటే నవ్విస్తాడనుకుంటాం. కానీ ఆయన ఏడిపించగలడని ఈ సినిమాలో నిరూపించారు. మన అమ్మా, నాన్నలను మించినది ఏది లేదు. మనకు ఏది రాదు కూడా. అందుకే వారిని పదిలంగా చూసుకుందాం. ఈ సినిమా చూశాక ఎవరైనా తమ అమ్మా, నాన్న దగ్గరకు వెళ్లి ఉంటే కృష్ణవంశీ జన్మ ధన్యమైనట్లే. కళాభారతిని చూసి రాఘవరావు అంటే ప్రకాశ్ రాజ్ కన్న మూయడం. పిల్లలందరూ వచ్చి చూడడంతో క్లైమాక్స్ చూపించారు. కళాభారతిని పునర్ నిర్మాణం చేయించి.. రాఘవరావు సౌజన్యంతో అని పెట్టి క్లైమాక్స్ సీన్ తీసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ విషయాన్ని కృష్ణవంశీతో చెప్పా. కానీ ఒరిజినల్ కథలో అలా లేదు. అందుకే పెట్టలేదన్నారు. ప్రకాశ్‌రాజ్‌కు, బ్రహ్మనందానికి మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం నటనా ప్రావీణ్యాన్ని తెలిసేలా ఇంకొన్ని షాట్స్ పెట్టి ఉంటే మరిన్ని వసూళ్లు రాబట్టేది. కన్నీళ్లు రావు అనుకున్న వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పించే సినిమా ఇది.' అని పరుచూరి వివరించారు. -
అన్నయ్య మాట కోసం 100 ఎకరాలు పోగొట్టుకున్నా: పరుచూరి గోపాలకృష్ణ
తెలుగు ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరావు.. వీరిద్దరూ 300కు పైగా సినిమాలకు రచయితలుగా పని చేశారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం సైతం వహించారు. ఇద్దరూ సినిమాల్లోనూ నటించారు. అయితే పరుచూరి వెంకటేశ్వరావు వృద్దాప్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉండగా గోపాలకృష్ణ ఎప్పటికప్పుడు సినీవిశేషాలను పంచుకుంటూ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నా డైరెక్షన్లో శోభన్‌బాబుతో ఓ సినిమా తీశాను. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో కోర్టు సీనులో రామానాయుడుగారు ట్రాలీ తోసేవారు. ఏం డైలాగులు రాసావయ్యా అని మెచ్చుకునేవారు. ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని సురేశ్‌బాబు ముందే అన్నారు. అన్నట్లే జరిగింది. మంచి విజయం సాధించింది. దీంతో దేవీప్రసాద్, త్రివిక్రమ్ రావు, అశ్వినీదత్.. అందరూ తమ బ్యానర్లో నెక్స్ట్ సినిమా చేయాలంటూ అడ్వాన్సులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కృష్ణ లేదా శోభన్‌బాబును హీరోగా పెట్టి సినిమా చేయమని డబ్బుల కట్టలు ముందు పెట్టి అడిగారు. ఆరోజు కనక అడ్వాన్స్ తీసుకునుంటే శంకరపల్లిలో నాకు వంద ఎకరాల భూమి ఉండేది. అప్పుడు ఎకరం పదివేల రూపాయలు మాత్రమే! సురేశ్‌బాబు అప్పటికే పక్కనుంచి అంటున్నాడు. మీ అన్న వెంకటేశ్వరావును డబ్బు తీసుకోమనండి. నేను ఆల్రెడీ భూమి కొనుక్కున్నా. మీ అన్నదమ్ములిద్దరికీ చెరో 50 ఎకరాలు కొనిస్తానని చెప్పాడు. భవిష్యత్తులో అది మీకే పనికొస్తుందని సలహా ఇచ్చాడు. కానీ మా అన్నయ్య వద్దన్నాడు. వాడు డైరెక్టర్ అయితే నేను ఫిడేలు వాయించుకోవాలా? అన్నాడు. అన్నకు ఇష్టం లేనిది నేను చేయనని చెప్పాను. కానీ తర్వాత మాత్రం తను చాలా బాధపడ్డాడు' అని చెప్పుకొచ్చాడు. -
రాజమౌళి,కీరవాణి,చంద్రబోస్‌లకి హ్యాట్సాప్... పరుచూరి గోపాల కృష్ణ
-
ఇంత సాహసం ఎవరూ చేయరు.. కానీ చేసి చూపించాడు: పరుచూరి
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం మూవీ సంచలనం సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి. కమెడియన్ వేణు యెల్లండి తెరకెక్కించిన ఈ సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన సమీక్షను వెల్లడించారు. కొత్త సినిమాలను ఎప్పటికప్పుడు ఆయన విశ్లేషిస్తుంటారు. తాజాగా ఆయన ‘బలగం’ మూవీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమా చూసి తనకు కూడా కన్నీళ్లాగలేదని తెలిపారు. చిత్ర దర్శకుడు వేణు, పాటల రచయిత కాసర్ల శ్యామ్‌ను ఫోన్ చేసి అభినందనలు తెలిపానన్నారు. పరుచూరి మాట్లాడుతూ.. 'ఒక సినిమాకు ఏది బలమో అదే ఇందులో ఉంది. ఇదొక వినూత్నమైన ప్రయోగం. నిజానికి సినిమా చేసేటప్పుడు ఇంతటి విజయం సాధిస్తుందని దిల్‌రాజు కూడా ఊహించి ఉండరు. ఖర్చు పెట్టిన దాని కంటే పదిరెట్లు ఎక్కువే వసూళ్లు రాబట్టింది. అగ్రహీరోలు, దర్శకులు, రచయితలను నమ్ముకోవాల్సిన అవసరం లేదు. కథను మాత్రమే నమ్ముకోవాలి. చిన్న బడ్జెటా? పెద్ద బడ్జెటా? అనేది విషయం కాదు. పెద్ద బడ్జెట్ సినిమాతో సమానంగా నిలిచింది ఈ బలగం. వేణులో ఇంత గొప్ప రచయిత ఉన్నాడా అసలు ఇది ఊహించలేదు. ' అని అన్నారు. వేణు గురించి మాట్లాడుతూ.. 'వేణుని ‘జబర్దస్త్’ కమెడియన్‌గా మాత్రమే చూశా. వేణులో ఇంత గొప్ప రచయిత, ఇంత సృజనాత్మకత ఉందా? అనిపించింది. కామెడీ చేసే కుర్రాడు గుండెలను హత్తుకునే సినిమా తీయగలడా అనేది ఊహకందని అంశం. వేణు చేసిన మాయ ఏంటంటే.. సినిమా మొదటి నుంచి కన్నీళ్లు పెట్టించేలా సినిమా తీయొచ్చు. కానీ అతను అలా చేయలేదు. నవ్విస్తూనే.. చివరకు భావోద్వేగానికి గురి చేశాడు.' అని అన్నారు. (ఇది చదవండి: ‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు) నేను కూాడా కన్నీళ్లు పెట్టుకున్నా పరుచూరి మాట్లాడుతూ.. 'ఒక సినిమా చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలా అరుదు. ఈ మూవీ చూసి నేను కూడా కన్నీళ్లు పెట్టుకున్నా. ఒక కుటుంబం విచ్ఛిన్నమవుతున్నప్పుడు మనం కన్నీళ్లు పెడతాం. కానీ ఇందులో కుటుంబ సభ్యులు కలిసేటప్పుడు భావోద్వేగానికి గురవుతాం. ఇది ఓ అపురూప దృశ్యకావ్యం. క్లైమాక్స్ పది నిమిషాల్లో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోకపోతే నాకు మెసేజ్ పెట్టండి. ఒక మనిషి చనిపోయాక 11 రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సాహసమే అని చెప్పాలి. ఇలాంటి సాహసాలు ఎవరూ చేయరు. ఇలాంటి సినిమాలు చూస్తారా? అని భయపడతారు. అలాంటి భయాలేమీ లేకుండా వేణు అద్భుతంగా తెరకెక్కించాడు.' అని అన్నారు. -
కథలో కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
తమిళ హీరో ధనుశ్, సంయుక్తి మీనన్ నటించిన తాజా చిత్రం ‘సార్’ . ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆయన కోలీవుడ్‌లో నటించిన చిత్రాలన్ని తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన సమీక్షను వెల్లిడంచారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు ధనుష్ బాడీ లాంగ్వేజ్ సరిపోలేదని అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..' సినిమా చూసినప్పుడు తన బాల్యంలోకి వెళ్లినట్లు అనిపించింది. దర్శకుడు వెంకీ అట్లూరి కొందరి జీవితాల్లోకి పరకాయ ప్రవేశం చేసి ఈ కథను రాసినట్లు ఉంది. పేద విద్యార్థులకు విద్యా అందడం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ధనుష్‌ను హీరోగా వెంకీ అట్లూరి ఓ సాహసమే చేశారని చెప్పుకోవాలి. పేద విద్యార్థులకు చదువును అందించాలని హీరో పడ్డ ఇబ్బందులు చక్కగా చూపించారు. ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించిన కథలా కంటే లైవ్‌లో చూపించినట్లు మార్పు చేసి ఉంటే ఇంకా బాగుండేది. కొన్ని సన్నివేశాల్లో ధనుష్ బాడీ లాంగ్వేజ్ సరిపోలేదు. మరికొన్ని సీన్లలో బాగా నటించారు. హీరోకు గురజాడ అప్పారావు గెటప్ వేయడం గొప్ప ఆలోచన. విద్యార్థులకు సినిమా థియేటర్లో పాఠాలు చెప్పడమనే కొత్తదనాన్ని డైరెక్టర్ పరిచయం చేశారు. సుమంత్‌తో కథ చెప్పించడం బాగుంది. హీరోను ఊరి నుంచి వెళ్లమన్నప్పుడు పిల్లలందరూ ఏడుస్తుంటే.. తల్లిదండ్రులు ఆపుతారేమోనని అనుకున్నా. అదే ఊరిలో ఉండి హీరో గెలిచినట్లు చూపిస్తే ఇంకా బాగుండేది. ' అని అన్నారు. -
అలా చూపిస్తే వాల్తేరు వీరయ్య హిట్ అయ్యేది కాదు: పరుచూరి
ప్రముఖ lతెలుగు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూను వెల్లడించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'వాల్తేరు వీరయ్య చాలా సింపుల్ స్టోరీ. కానీ రవితేజ బదులు రామ్ చరణ్ చేసి ఉంటే చిరంజీవికి మైనస్ మార్కులు పడేవి. ఎందుకంటే తమ్ముడి పాత్రలో రవితేజ పాత్ర చూశాక.. చరణ్ చేస్తే బాగుండదనే నిర్ణయానికి వచ్చా. అందుకే రవితేజను పెట్టారు. ఆయన అద్భుతంగా నటించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రత్యేకం. పైగా ఒక ఫిషర్ మ్యాన్‌కు జోడిగా శృతిహాసన్ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ చిరంజీవి సినిమా మెగా ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని తీశారు. చిరంజీవి, రవితేజ.. హీరోయిన్స్‌తో ప్రేమాయణం లాంటివి కథలో చూపిస్తే సినిమా హిట్ అయ్యేది కాదు.' అని అన్నారు. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన ‘వాల్తేరు వీరయ్య’, అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్, ఎక్కడో తెలుసా?) చిరంజీవి నటనపై పరుచూరి మాట్లాడూతూ..' తనకు వర్టిగో వ్యాధి ఉందని చెప్పే సన్నివేశాల్లో చిరంజీవి నటన అద్భుతంగా ఉంది. మనకు తెలియకుండా ఆ వ్యాధితో ఏమైపోతాడోననే భయాన్ని ఆసాంతం ప్రేక్షకుల్లో కలిగించాడు దర్శకుడు. సంభాషణలు, పొడి పొడి మాటలు బాగున్నాయి. ఊహకందని ట్విస్టులు సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. మలేషియాకు వెళ్లినప్పుడు బంపర్ ట్విస్ట్ ఇచ్చారు. మలేషియా నుంచి ఓ కాంట్రాక్ట్ తీసుకుని వచ్చిందే కథ. ఇందుకు కథ రచయిత బాబీని మెచ్చుకోవాలి. అప్పట్లో చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో.. ఇప్పుడు అలాగే కనిపించారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కేథరిన్ బాగా నటించారు. వారి పాత్రలూ సినిమా విజయంలో స్థానం దక్కించుకున్నాయని' అని అన్నారు. మెగా ఫ్యాన్స్‌కు అద్భుతమైన అనుభూతిని అందించిన చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. పూనకాలు లోడింగ్' అనే పదం కేవలం అభిమానుల కోసమే పెట్టారని వెల్లడించారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. -
వీరసింహారెడ్డి.. ఆ సీన్ పెట్టుంటే సినిమా ఆడేదే కాదు: పరుచూరి
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను తెగ మెప్పించింది. ఓటీటీలోనూ అదరగొడుతున్న ఈ చిత్రంపై తాజాగా సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. 'వీరసింహారెడ్డి చూశాను. ఈ సినిమా చూస్తుంటే నాకు నందమూరి తారకరామారావుగారి చండశాసనులు మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటే రెండు సినిమాల కథాబీజం ఒకటే. అన్నాచెల్లెళ్ల మధ్య వైరం, అన్నయ్య నాశనమైపోవాలని శపించడం వంటివి రెండింటిలోనూ ఉంటాయి. వీరసింహారెడ్డిలో తాను కోరుకున్నవాడిని చంపించేశాడన్న కోపంతో అన్నయ్య శత్రువులింట్లో ఒకరితో తాళి కట్టించుకుని వాళ్ల సాయంతో సొంత అన్నమీద పగ తీర్చుకోవాలనుకుంటుంది చెల్లెలు వరలక్ష్మి. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు ఇది బాగా సరిపోయింది. ఫస్టాఫ్ చూసినంతసేపు ఇది బోయపాటి శ్రీను సినిమా చూస్తున్నట్లే అనిపించింది. ఫస్టాఫ్ బంగారంలా ఉంది. కానీ సెకండాఫ్ బంగారం, వెండికి మధ్యలో ఉన్నట్లు అనిపించింది. ఒక భయంకరమైన పులి గాండ్రింపులు విన్నాక అది సడన్‌గా కామ్ అయిపోయి చెల్లెలిని చూసి తోకాడిస్తే చూడబుద్ధి కాదు. అయినా అన్నాచెల్లెల అనుబంధమే ఈ సినిమాను కాపాడింది, రూ.130 కోట్లు వసూలు చేయగలిగింది. కానీ ఇదే సినిమాను ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఎలాగంటే.. పెద్ద బాలయ్య పాత్ర చనిపోయాక ఫ్లాష్‌బ్యాక్ చూపించారు. ఎప్పుడైతే ఆయన పాత్ర చనిపోయాడని ప్రేక్షకులకు తెలిసిపోయిందో అప్పుడే ఒక నిరాశ వచ్చేస్తుంది. సెకండాఫ్‌లో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అంత నిడివి అక్కర్లేదు. నవీన్ చంద్ర ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించారు, కానీ అది నిజం కాదని నేను పసిగట్టాను. హీరో మూలంగా అతడు చనిపోయినట్లు ఉంటే మాత్రం సినిమా ఆడేదే కాదు. ఈ సినిమాలో ఉన్న ప్రాథమిక లోపం.. వీరసింహారెడ్డి పాత్రను ముగించి తర్వాత ఫ్లాష్‌బ్యాక్ చూపించడం. కొన ఊపిరితో ఉన్నప్పుడు చిన్న బాలయ్యకు ఫ్లాష్‌బ్యాక్ చెప్పి అతడు విలన్‌ను చంపేసి అత్త, తండ్రికి సమాధులు కట్టినట్లు చూపించి ఉంటే బాగుండేది. చిన్న బాలయ్య ఇష్టపడ్డ హీరోయిన్ తండ్రి కూడా విలన్లలో ఒకడని చూపించాడు, కానీ ఆ పాత్ర ఏమైందో చూపించలేదు. హీరోహీరోయిన్లకు పెళ్లైందా? లేదా? బెంగళూరు నుంచి వచ్చిన వాళ్లు ఏమయ్యారు? ఇలా కొన్నింటిని చూపించకుండానే సినిమా ముగించేశారు. దీంతో సడన్‌గా సినిమా ముగిసినట్లైంది. ఇలాంటి చిన్నచిన్న తప్పులన్నింటినీ జయించి సినిమా అన్ని కోట్లు రాబట్టడానికి బాలయ్య ఒక్కరే కారణం అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. -
దర్శకుడు స్క్రీన్ ప్లేతో గేమ్ ఆడుకున్నారు: పరుచూరి గోపాలకృష్ణ
మాస్ మహారాజా రవితేజ, ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా'. విడుదలైన కొద్ది రోజుల్లోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రవితేజ ఎనర్జీ, శ్రీలీల డ్యాన్స్ ప్రేక్షకులకు కట్టి పడేశాయి. తాజాగా ఈ చిత్రం ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన సమీక్షను వెల్లడించారు. ఈ సినిమా దర్శకుడు నక్కిన త్రినాథరావు స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆడుకున్నారని అన్నారు. రవితేజ డ్యూయల్ రోల్ ఈ చిత్రానికి అదనపు బలాన్నిచ్చిందని తెలిపారు. రావు రమేశ్ పాత్ర పూర్తిస్థాయి క్యారెక్టరైజేషన్ లేనప్పటికీ మెప్పించిందన్నారు. (అఫీషియల్: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'ధమాకా') ఒక్క మాటలో చెప్పాలంటే తన తండ్రి కాని తండ్రి ఆస్తిని లాక్కోవాలని చూసే విలన్ పని పట్టిన ఓ హీరో కథే ఈ సినిమా. ఈ సినిమాలో రావు రమేశ్, శ్రీలీల పాత్రలు చూస్తే ఫర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ అనేది అవసరం లేదని చెప్పడానికి ఉదాహరణలు. రచయిత ఎలాంటి కష్టం లేకుండా ఈ పాత్రలను సృష్టించాడు. రావురమేశ్ పక్కన హైపర్ ఆదిని పెట్టి వారిద్దరి సన్నివేశాలు అలా సరదాగా తీసుకెళ్లిపోతాయన్నారు. హీరోని ఓ వ్యక్తి తలపై కొడితే అతడు కిందపడిపోవడంతో కథ మొదలవుతుంది. సాధారణంగా ఒక మాస్ హీరోకి ఇలాంటి ప్రారంభ సన్నివేశాలు ఉండవు. ఈ విషయంలో దర్శకుడు త్రినాథరావు చాలా ధైర్యం చేశారు. ఎక్కడా సస్పెన్స్ పెడతారో అక్కడ సెంటిమెంట్ పండదని దర్శకుడు నమ్మాడు. అందుకే అక్కడే ఆ ఇద్దరు రవితేజలు ఒక్కరనే విషయాన్ని ఇంటర్వెల్ ముందే చెప్పేశాడు. ఎవరికీ ఎవరనేది చెప్పేశారు. అలాగే 18 రోజుల క్రితమే ఏమై ఉంటుందనేదే కథలో ట్విస్ట్‌తో అక్కడే లాక్ చేశారు. ఇలా చేయడం వల్లే రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.110 కోట్ల వసూళ్లు రాబట్టిందని సినీ విశ్లేషకుల అంచనా. అంటే రూపాయికి రూపాయిన్నర లాభం వచ్చినట్టే. ఆనంద చక్రవర్తి, నందగోపాల్ మధ్య ఆస్తి ఎవరూ తీసుకుంటారనేది ముందే చెప్పేశారు. అందులో ఎలాంటి ట్విస్ట్‌లు పెట్టలేదు. ఈ సినిమా ఏంటీ అంటే ప్రేక్షకులతో దర్శకుడు, రచయితలు ఆడుకున్నారు. ఒక్క క్షణం పక్కకు వెళితే సినిమా అర్థం కాదన్న రీతిలో ఆడుకున్నారు. అతను తాను కాదని చెబుతూ ప్రేక్షకులను ఫుల్స్ చేస్తున్న సీన్లు అద్భుతం. నేను విశాఖలో సినిమా చూశా. థియేటర్లో చూసేటప్పుడు ఆ ఫర్మామెన్స్ కనిపిస్తుంది. రవితేజ కవ్విస్తూ నవ్విస్తాడు. అతను ఎమోషన్‌లోనైనా ఒదిగిపోతారు రవితేజ అంటూ కొనియాడారు పరుచూరి. నక్కిన త్రినాథరావు స్క్రీన్‌ప్లేతో ఆడుకున్న తీరు అద్భుతం. స్క్రీన్ ప్లేతో ఆడుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఆ లిస్ట్‌లో చాలామంది గొప్ప దర్శకులు ఉన్నారు. (ఇది చదవండి: కలెక్షన్ల మోత మోగిస్తున్న రవితేజ) సినిమాలో 'ఆ డైలాగ్.. నీలో నాకు విలన్ కనిపిస్తే.. నాలో నీకు హీరో కనిపిస్తాడురోయ్.' అనే డైలాగ్ తూకం వేసి మరీ రాసుకున్నారు. ఫైట్ సీన్లలో మాటలతో కట్టిపడేశాడు. అందులో మళ్లీ గాంధేయవాదం గురించి చెప్పారు. రావు రమేశ్ రవితేజకు నమస్కారం పెట్టగానే నేను నవ్వాను. నాకు రెండు సినిమాలు గుర్తొచ్చాయి. సమరసింహారెడ్డిలో సత్యనారాయణను చూడగానే నమస్కారం పెడితే అక్కడే అర్థమైపోతుంది. ఇంద్రలో కూడా ప్రకాశ్ రాజ్ చిరంజీవికి దండం పెడితే అంతే క్రేజ్ వచ్చింది. ఇదేదో నాకు చీటింగ్ షాట్లా అనిపించింది. ఇందులో ఉన్నట్లు కొన్ని పాత్రలు కన్ఫ్యూజన్ అనిపించింది. క్లైమాక్స్ పోలీస్ స్టేషన్లో మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ చిత్రంలో అన్యాయంగా ఒకరి సొమ్మును ఆక్రమించొద్దు అనే నీతిని అందించారు నక్కిన. ఇది నిజం. నీది నీదే. నాది నాదే. ఆయన ఇస్తే తీసుకుందాం అనేది మంచి సందేశం. ఈ చిత్రంలో మరో ట్విస్ట్ ఏంటంటే రెండు రవితేజ క్యారెక్టర్స్ ఏంటీ అనేదే. ఈ సినిమా చూస్తే కచ్చితంగా మెచ్చుకుంటారు. పాత్రలన్నింటినీ దాచుకోకుండా రివీల్ చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రబృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు పరుచూరి గోపాలకృష్ణ. -
అలాంటి కథలు చిరంజీవికి సెట్ కావు.. కానీ: పరుచూరి గోపాలకృష్ణ
మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్లు కీ రోల్ పోషించారు. తాజాగా చిరంజీవి సినిమా గాడ్‌ఫాదర్‌పై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ చెప్పారు. సినిమాలో ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే ఇంకాస్త బాగుండేదని ఆయన అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'తెలుగులోనే ఈ సినిమా బాగుందని చెబుతా. పేరుకు మలయాళ రీమేక్ చిత్రమైనా తెలుగు రాజకీయాన్ని ఈ చిత్రంలో పరిచయం చేశారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే నేను చెబుతున్నా. ఈ సినిమాలో కథ చాలా స్లో పేస్‌లో వెళ్లింది. మెగాస్టార్‌కు స్లో కథనం అనేది సరిపోదు. ఇంకా మార్పులు చేయాల్సింది. స్లో పేస్‌తో పాటు చిరు బాడీ లాంగ్వేజ్‌కు తగిన క్యారెక్టర్ కాదు. కానీ ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. చిరంజీవి డ్యాన్స్, పాట లేని సినిమా కాస్త ఇబ్బంది అనిపించింది. షఫీ పాత్రలో సునీల్ ఉండి ఉంటే ఇంకా బెటర్‌గా ఉండేదేమో అనిపించింది.' అని అన్నారు. సల్మాన్ పాత్రపై ఆయన ఏమన్నారంటే.. పరుచూరి మాట్లాడూతూ.. 'ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ ఒకరకంగా ప్లస్. మరో రకంగా మైనస్. ఎందుకంటే మెగాస్టార్ నడుస్తుంటే సల్మాన్ ఫైట్ చేయడం ఫ్యాన్స్‌కు బాధ కలిగించింది. ఆచార్య మాదిరిగా చరణ్ లేదా పవన్ కల్యాణ్‌ను తీసుకుంటే మరోలా ఉండేదేమో. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా మరిన్ని డైలాగ్స్ ఉంటే బాగుండేది. 'రాజకీయానికి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' డైలాగ్ లాగా ఇంకా ఉండి ఉంటే ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చి ఉండేది.' అని అన్నారు. -
ఇల్లు కట్టుకోవడానికి సాయం చేశారు: పరుచూరి ఎమోషనల్
సూపర్ స్టార్ కృష్ణ మరణంపై ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పరుచూరి గోపాలకృష్ణ ఎమోషనలయ్యాడు. కృష్ణ తనకు చేసిన సాయాన్ని ఎన్నటికీ మరువలేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కృష్ణ గురించి ఆయన మాట్లాడుతూ.. 'బంగారు భూమి సినిమాలో నాలుగైదు సీన్లకు డైలాగ్ రైటర్స్‌గా పని చేశాం. పీసీ రెడ్డి గారు సినిమా ఆరంభంలో పేరు వేయించుకోమన్నారు. కానీ ఆ సినిమాకు పెద్ద రచయితలు పని చేశారు, వారి పక్కన మా పేరెందుకని వద్దన్నాను. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. 'పద్మ.. మనిషిని నమ్మితే మన నోట్లో ఇంత మట్టి కొడతాడు. మట్టిని నమ్మితే మన నోటికింత ముద్ద పెడుతుంది. ఆ మట్టికి నమస్కారం చేయి..' ఈ డైలాగ్ కృష్ణగారికి బాగా నచ్చింది, వెంటనే ఎవరు రాశారని అడగడంతో అది నేనే అని పీసీరెడ్డి చెప్పారు. నేను ఇండస్ట్రీలో పెద్దవాడిని అవుతానని ఆయన జోస్యం పలికారు. ఇండస్ట్రీలో ఆయన ఎంతోమందికి సాయం చేశారు. నాకు సినిమాలు లేని సమయంలో ఇల్లు కట్టుకోవడానికి ఆయన డబ్బులు పంపించారు. అది తీసుకున్న మరుసటి రోజే కొబ్బరికాయ కొట్టి ఇల్లు కట్టాను. అందరికంటే ఎక్కువగా కృష్ణగారి 54 సినిమాలకు మా కలం ఉపయోగపడింది. ఆయన బంగారు మనసు మహేశ్‌బాబుకు వచ్చింది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: కృష్ణ సినిమాల్లోకి రావడానికి కారణమెవరో తెలుసా? -
కార్తికేయ 2 హీరో, దర్శకుడికి హ్యాట్సాఫ్: పరుచూరి గోపాలకృష్ణ
కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రళయాన్నే సృష్టించింది. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు 13న రిలీజైన ఈ మూవీ రూ.130 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమాలోని బలాబలాలను విశ్లేషించాడు పరుచూరి గోపాలకృష్ణ. 'కష్టేఫలి అన్న సూత్రం నిఖిల్ విషయంలో నిరూపితమైంది. కార్తికేయ 2.. బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది. చందూ మొండేటి... ఈ జానపద కథను సాంఘిక కథగా మలిచి రాసినట్లు అనిపించింది. కథను నమ్మితే ఆ కథ ఎప్పుడూ మనల్ని మోసం చేయదు. సినిమాలో తల్లి సెంటిమెంట్‌ను వాడుకున్నారు. ఇద్దరు కమెడియన్స్‌ను, హీరోయిన్ను హీరో పక్కన పెట్టుకున్నాడు. సామాన్యంగా ఇలాంటి సినిమాల్లో ప్రేమ మిస్ అవుతుంది. తెలివిగా చందూ మొండేటిగారు ఏం చేశారంటే ప్రతి ఫ్రేములోనూ హీరో హీరోయిన్ ఉండేలా జాగ్రత్తగా రాసుకున్నారు. మధ్యలో హీరోయిన్.. హీరోకు ఝలక్ ఇచ్చి వెళ్లిపోయినట్లు చీట్ చేసినా మళ్లీ తిరిగొచ్చినట్లు చేశారు. క్లైమాక్స్‌లో హీరో పాముల మధ్యలో నడుచుకుంటూ వెళ్లి హంసను తీసుకువచ్చి మురళీకి తగిలించి కృష్ణుడి చేతిలో పెట్టేవరకు కూడా అద్భుతమైన స్క్రీన్‌ప్లే రాశారు చందు మొండేటి. నాలాగా చాలా సినిమాలు రాసిన కొద్దిమంది తప్ప మామూలు ప్రేక్షకులు దాన్ని క్యాచ్ చేయలేరు. చివర్లో కార్తికేయ 2కు సీక్వెల్ ఉంటుందని హింటిచ్చారు. చందూ మొండేటి అత్యంత సాహసం చేశారు. అతడి కెరీర్లో భారీ మొత్తంలో ఖర్చు పెట్టి సినిమా తీశారు. ఎవరికీ అమ్ముడుపోకుండా ప్రపంచానికి మంచి జరగాలనే కోరికతో దీన్ని ముగించారు. స్క్రీన్‌ప్లేలో ఎలాంటి దోషం లేదు. కావాలని కామెడీ సీన్స్ చొప్పించలేదు. కార్తికేయ 2ను కోట్లాది మంది చూడటం అంటే మామూలు విషయం కాదు. హీరో, దర్శకుడికి హ్యాట్సాఫ్' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో నాగార్జున ఘోస్ట్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? జైలుకు వెళ్లే డిజాస్టర్ కంటెస్టెంట్ ఎవరంటే? -
మహేశ్‌బాబును అలా ఎన్నడూ చూడలేదు: పరుచూరి గోపాలకృష్ణ
టాలీవుడ్ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విశ్లేషకుడిగా మారిన విషయం తెలిసిందే! ఏదైనా సినిమాను తీసుకుని అందులో తప్పొప్పులను చర్చిస్తూ ఆ లోపాలను సవరిస్తున్నాడు. ఈ మధ్యే వారియర్ సినిమాలోని ప్లస్ మైనస్‌ల గురించి వీడియో చేసిన ఆయన తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు కుటుంబం గురించి మాట్లాడాడు. ఇటీవలే ఇందిరా దేవిని పోగొట్టుకుని మహేశ్ ఫ్యామిలీ పుట్టెడు శోకంలో మునిగిపోయింది. ఆమె సంస్మరణ సభకు పరుచూరి గోపాలకృష్ణ కూడా హాజరయ్యాడు. ఆ సమయంలో మహేశ్, కృష్ణల పరిస్థితి చూసి విలవిల్లాడిపోయానన్నాడు పరుచూరి. 'ఘట్టమనేని కుటుంబంతో నాకున్న అనుబంధాన్ని ఎన్నోసార్లు తెలియజేశాను. కృష్ణ, మహేశ్‌బాబు, రమేశ్ బాబు, హనుమంతురావు, ఆది శేషగిరిరావు గారితో.. వీరందరితో కుటుంబంలో కుటుంబంలా కలిసిపోయాం. నేను అమెరికా నుంచి వచ్చేలోగా మహేశ్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారని తెలిసింది. ఏకాదశి నాడు వారిని కలిశాను. అప్పుడు కృష్ణగారిని చూస్తే గుండె తరుక్కుపోయింది. ఇన్ని సంవత్సరాల కాలంలో మహేశ్‌బాబును అంత డల్‌గా ఎప్పుడూ చూడలేదు. ఇందిరమ్మ అంటే మా దృష్టిలో మహాలక్ష్మి, దేవత. ఆమె ఎక్కువ మాట్లాడరు, కేవలం చిన్న చిరునవ్వుతో పలకరిస్తుంటారు. ఆమె మరణించాక కృష్ణగారి ముఖం చూసి ఎంతో ఆవేదన చెందాను. సామాన్యంగా అలాంటి సందర్భాల్లో మనం తల్లడిల్లిపోతాం. కానీ సాహసమే ఆయన ఊపిరి అన్నట్లుగా గుండెనిబ్బరం చేసుకుని కూర్చున్నారు. మహేశ్‌బాబును చిరునవ్వు లేకుండా అలా దిగులుగా చూడటం ఇదే మొదటిసారి. అలాంటి రోజు వస్తుందనుకోలేదు. ఆయనకు కోపం వచ్చినప్పుడు కూడా పెదాలపై చిరునవ్వు ఉండేది. అలాంటిది ఆ తల్లి జ్ఞాపకాల్లో మహేశ్ పెదాలపై చిరునవ్వు మాయమైంది. మహేశ్‌బాబు కాశీకి కూడా వెళ్లి వచ్చాడు. తల్లిని గుర్తు చేసుకుంటూ తండ్రిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: కొత్త కారు ఇంటికి తెచ్చిన సింగర్ ప్రముఖ బుల్లితెర నటికి క్యాన్సర్? -
వారియర్ బాగా ఆడాల్సింది, సినిమాలో అదే మైనస్!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన చిత్రం ది వారియర్. లింగుస్వామి దర్శకుడిగా వ్యవహరించారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాలోని ప్లస్, మైనస్‌లను విశ్లేషించాడు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఆయన మాట్లాడుతూ.. 'ప్రాణం పోసే డాక్టర్ జీవితం నుంచి ఒక రౌడీ ప్రాణం తీసే పోలీసాఫీసర్‌గా పరివర్తన చెందిన హీరో కథ ఇది. మానవుడు దానవుడు, సర్పయాగం వంటి హిట్ సినిమాలు ఇలాంటి కోవలోకే చెందుతాయి. అయితే రామ్ పాత్రపై కొంత ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రభావం పడింది. సినిమాలో కీర్తి శెట్టితో లవ్ ట్రాక్, విలన్ డామినేషన్ బాగుంది. అలాగే గురు అంటే వ్యక్తి కాదు, జనం గొంతు మీద కత్తి అన్న డైలాగ్ ఎఫెక్టివ్‌గా ఉంది. కానీ హీరో తన ఫిర్యాదు వెనక్కుతీసుకోకుంటే బాగుండేది. హీరోయిన్ను కిడ్నాప్ చేసిన వారి దగ్గరి నుంచి విడిపించే సీన్ వేరేలా ఉంటే బాగుండేది. ఏదేమైనా రామ్ నటన అద్భుతం. ఇది చాలా బాగా ఆడాల్సిన కథ. దర్శకుడు స్క్రీన్‌ప్లేలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకొనుంటే ఇది ఘన విజయం సాధించి ఉండేది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి. చదవండి: లైగర్ బ్యూటీని కన్నెత్తి చూడని ఆర్యన్ -
ఆర్ఆర్ఆర్లో రామ్‌చరణ్‌దే కష్టమైన పాత్ర: పరుచూరి గోపాలకృష్ణ
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో చెర్రీ, తారక్ ఇద్దరూ పోటాపోటీగా నటించారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. 'కొమురం భీముడిగా నటించిన తారక్ పాత్ర నిడివి సీతారామరాజుగా నటించిన చరణ్ పాత్ర కంటే తక్కువని చాలామంది అన్నారు. కానీ పాత్ర నిడివి ఎప్పుడూ లెక్క చేయకూడదు. ఉదాహరణకు పెదరాయుడులో రజనీకాంత్ పాత్ర నిడివి కొన్ని నిమిషాలు మాత్రమే. కానీ ఇప్పటికీ ఆ సినిమా వస్తుందంటే రజనీకాంత్‌గారే గుర్తొస్తారు. కాబట్టి పాత్ర నిడివి ఎన్ని నిమిషాలు ఉందని చూడొద్దు. సూటిగా చెప్పాలంటే భీమ్ కంటే రామ్ పాత్ర నిడివి కాస్త ఎక్కువే! కానీ రచయిత, దర్శకుడు రెండు పాత్రలను రెండు కళ్లలాగే చూశారన్నది నా ఉద్దేశం. భీమ్ ఓ ముస్లిం పేరుతో అండర్ కవర్లో ఉన్నాడు. రామ్‌చరణ్ అండర్ కవర్లో ఉన్నాడనేది ఫ్లాష్‌బ్యాక్ చూపించేవరకు తెలియలేదు. అంటే అతి కష్టతరమైన పర్ఫామెన్స్ రామ్‌చరణ్‌దే! అతడి మనసులో ఉన్న లక్ష్యాన్ని ఎక్స్ప్రెషన్ ద్వారా బయటపెట్టినా, నటనలో దొరికిపోయినా కథ మొత్తం ఫెయిల్ అవుతుంది. చివరి వరకూ కూడా అతను బ్రిటీషర్ల కోసం పనిచేస్తున్న సోల్జర్లా ఉన్నాడే తప్ప, తండ్రి ఆశయం కోసం అక్కడున్నట్లు మనకు ఎక్కడా అనుమానం రాలేదు. కాబట్టి కష్టమైన పాత్ర రామ్‌చరణ్‌దే! ఏదేమైనా చరణ్, తారక్ ఇద్దరూ అద్భుతంగా నటించారు' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: ఎక్కువగా అబ్బాయి పాత్రలనే పోషించిన ఈ నటి గురించి తెలుసా? పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్! -
'ఇంద్ర' సినిమాలో అందుకే నటించలేదు: పరుచూరి గోపాలకృష్ణ
ఇంద్ర సినిమా ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా పూర్తై 20 సంవత్సరాలైన సందర్భంగా ఈ సినిమా విశేషాలను పంచుకున్నాడు పరుచూరి గోపాలకృష్ణ. 'ఇంద్ర సినిమా చేయుండకపోతే ఆ వైభవాన్ని మేము అనుభవించేవాళ్లం కాదు. చిరంజీవి అభిమానులే కాదు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది ఇంద్ర. ఇందుకు చిన్నికృష్ణ కథ, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, బి.గోపాల్ దర్శకత్వం, చిరంజీవి నటనే కారణం.అంత గొప్ప సినిమా కథను మొదట బి.గోపాల్ వద్దన్నారు. కారణమేంటంటే.. ఆయన తెరకెక్కించిన గత రెండు చిత్రాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడులోని హీరోల పాత్ర చిత్రీకరణ కాస్త ఈ సినిమాలో ఉన్నట్లే ఉంది. కాబట్టి మళ్లీ అలాంటి సినిమానే చేస్తే ఏమవుతుందోనని భయపడ్డాడే తప్ప కథ బాలేదని మాత్రం అనలేదు. అలా బి.గోపాల్, అశ్వనీదత్ సినిమా చేయడానికి సముఖత వ్యక్తం చేయలేదు. చిరంజీవిగారు ఓ అద్భుతమైన సినిమా మిస్ అయిపోతున్నారు.. ఎలా అని బాధపడ్డా. విషయం చిరంజీవికి చెప్పాను. వాళ్లిద్దరూ లేకుండానే రేపు చిన్నికృష్ణతో వచ్చి నాకు కథ చెప్పండి అన్నారు. కథ చెప్పాం.. ఇంటర్వెల్ అవగానే లేచి కిళ్లీ వేసుకుని సెకండాఫ్ వినక్కర్లేదు.. హిట్ అవుతుందన్నారు. కథ పూర్తయ్యే సరికి పక్క గదిలో నుంచి అశ్వనీదత్, బి.గోపాల్ వచ్చి కూర్చున్నారు. అందరం కలిసి చేద్దామన్నారు. ఇంద్రలో తనికెళ్ళ భరణి పోషించిన పాత్ర మొదట నాకే వచ్చింది. కానీ మోకాలి నొప్పితో అంతదూరం ప్రయాణం చేయలేక నేను వదిలేసుకున్నా. అలాగే డైలాగ్స్ రైటర్ అయిన నేను మూగపాత్రలో నటిస్తే జనాలు ఆదరిస్తారా? అనుకున్నా. అందుకే మూగపాత్ర ఎందుకులే అని చేయనని చెప్పా! అలా మంచి సినిమాలో అవకాశం చేజారింది. కానీ మేము రాసిన 'మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా' అనే డైలాగ్ ఇప్పటికీ మారుమోగిపోతూనే ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్, వీడియో వైరల్ నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్ -
అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. తెరపై మహేశ్ చాలా స్టైలీష్‌గా కనిపించడం.. కామెడీ, యాక్షన్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులేయడంతో సినీ ప్రియులు కూడా ‘సర్కారు వారి పాట’కి ఫిదా అయ్యారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో చిన్న చిన్న మార్పులు చేసుంటే మరింత పెద్ద విజయం సాధించేదని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ‘పరుచూరి పాఠాలు’ పేరుతో కొత్త సినిమాలపై రివ్యూ ఇస్తున్న అయన.. తాజాగా ‘సర్కారు వారి పాట’పై తన అభిప్రాయన్ని వెల్లడించారు. (చదవండి: జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాను..అదే నా భయం : తమన్నా) ఈ సినిమా ఫస్టాఫ్‌లో మహేశ్ బాబు, కీర్తి సురేశ్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయని ఆయన అన్నారు. సరదాగా సాగిపోతున్న సమయంలో మహేశ్ ఇండియాకి తిరిగి రావడం అనేది ప్రమాదకరమైన మలుపు అని ఆయన అభిప్రాయపడ్డాడు. అలా కాకుండా కీర్తి సురేశ్, మహేశ్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ నిడివి పెంచి ఉంటే సినిమా మరింత పెద్ద హిట్ అయ్యేదన్నారు. హీరోతో పాటు హీరోయిన్ని కూడా ఒకే విమానంలో తిరిగి ఇండియాకు తీసుకువచ్చేలా కథ రాసుకొని ఉంటే..తెలియకుండానే కొన్ని కామెడీ సన్నివేశాలు, రొమాన్స్ సీన్స్ యాడ్ అయ్యేవని..అలా అయితే ఈ సినిమా మరో వంద కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసేదని పరుచూరి చెప్పుకొచ్చారు. -
కంటికి ఆపరేషన్, అందుకే దూరం: పరుచూరి గోపాలకృష్ణ
పరుచూరి బ్రదర్స్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న పరుచూరి వెంకటేశ్వరరావు ఫొటో ఒకటి ఇటీవల తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే! దీంతో ఆయన సోదరుడు గోపాలకృష్ణ స్పందిస్తూ.. అన్నయ్య బాగానే ఉన్నాడని, బరువు తగ్గడంతో, జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా కనిపించాడని తెలియజేస్తూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే కొన్నాళ్ల నుంచి పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్‌లో కనిపించలేదు. దీంతో అభిమానులు ఆయన ఎందుకు కనిపించడం లేదని ఆందోళన చెందారు. తాజాగా ఈ అనుమానాలకు చెక్ పెట్టాడు పరుచూరి. యూట్యూబ్‌లో ఓ కొత్త వీడియోతో వీక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ గురించి చెబుతూ.. తన కంటికి ఆపరేషన్ జరిగిందని వెల్లడించాడు. తన నేత్రాలకు శస్త్ర చికిత్స జరిగిందని, అందుకే ఓ నెల రోజులుగా యూట్యూబ్‌లోకి రావడం లేదని స్పష్టం చేశాడు. ఇంకో రెండు, మూడు వారాలు లైట్ ఫోకస్ పడకూడదని వైద్యులు చెప్పారన్నాడు. అందువల్లే ఎలాంటి వీడియోలు చేయలేదని క్లారిటీ ఇచ్చాడు పరుచూరి గోపాల కృష్ణ. చదవండి: గతిలేక లైంగిక సంబంధం కొనసాగించా.. డైరెక్టర్‌పై మహిళల ఆరోపణలు గ్రాండ్‌గా హీరోయిన్ సంజన సీమంతం, వీడియో వైరల్