
ఏదైనా సినిమా రిలీజ్ అయితే మాట్లాడుకుంటారు. సినిమా విడుదలై హిట్ అయితే మరింత మాట్లాడుతారు. కానీ షూటింగ్ మొదలై.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియకుండా ఉన్న సినిమా గురించి ఎదురుచూసేలా చేసేవి మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో అలాంటి చిత్రమే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ .
రీ ఎంట్రీ ఇస్తూ చిరు చేసిన ఖైది నంబర్ 150 ఇండస్ట్రీ హిట్ అయ్యాక.. మళ్లీ మరో కథను ఫైనల్ చేయడానికి చాలా సమయమే పట్టింది. చివరగా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కథను పట్టాలెక్కించారు. అప్పటి నుంచి ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. గతేడాది చిరు పుట్టిన రోజు కానుకగా విడుదలైన మోషన్ పోస్టర్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఇక అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ సినిమా కోసం ఎదురుచూపులు మరింత ఎక్కువయ్యాయి.
చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) కానుకగా నేడు విడుదల చేసిన టీజర్ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం పన్నెండు సంవత్సరాలు కష్టపడ్డాం. ఈ సినిమా విజయం సాధించడం తథ్యం. చిరంజీవి కళ్లతోనే నటిస్తాడు, టీజర్ చివర్లో గుర్రంపైనుంచి వస్తోన్న చిరంజీవిని చూస్తే బీపీ పెరగడం ఖాయం. నేను గతేడాది మోషన్ పోస్టర్ రిలీజ్ వేడుకలో సినిమాలోని ఓ డైలాగ్ చెప్పాను. అయితే మళ్లీ ఈసారి కూడా ఏదో ఒకటి చెబుతానేమో అని నన్ను హెచ్చరించారు. కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సాయంత్రం జరిగే వేడుకలో ఓ డైలాగ్ చెబుతాను’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment