![Mega Family Celebrates Sye Raa Narasimha Reddy Success - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/2/Chiranjeevi_Ramcharan.jpg.webp?itok=3fNSaeSB)
సీనియర్ నటుడు చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాపై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. బుధవారం ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా బాగుందన్న టాక్ వచ్చింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తమ సంతోషాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు రామ్‌చరణ్. తన తండ్రి తనను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని ఆలింగనం చేసుకున్న ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘మనకు అన్నీ ఇచ్చేసిన వ్యక్తి’ అంటూ తన తండ్రిని ప్రశంసించారు. ‘సైరా’తో సూపర్‌హిట్ అందించినందుకు తన తండ్రికి ధన్యవాదాలు తెలిపారు.
‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో చిరంజీవి ఒదిగిపోయారని, అందరినీ మెప్పించారని సమీక్షకులు పేర్కొన్నారు. అంచనాలకు తగినట్టుగా సినిమా ఉందని అంటున్నారు. తమ హీరో బాగుందన్న టాక్‌తో మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ‘సైరా నరసింహారెడ్డి’ ధియేటర్ల వద్ద పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతున్నారు. ‘సైరా సూపర్‘ అంటూ పండగ చేసుకుంటున్నారు. (చదవండి: ‘సైరా’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment