ఇటీవలి కాలంలో వచ్చిన సమంత శాకుంతలం సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. కనీస వసూళ్లు సాధించడంలోనూ విఫలమైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు.
శాకుంతలం ఓ జ్ఞాపకం..
'శాకుంతలం నాకొక అద్భుతమైన జ్ఞాపకం. గతంలో నేను తెలుగు ఉపన్యాసకుడిగా పని చేశాను. ఆ సమయంలో నేను శాకుంతలం నాటకం చూశాను. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత గుణశేఖర్ సినిమా తీయడంతో మళ్లీ చూశా. ఆయన తీసిన సినిమాలన్నీ చూస్తే అందులో కొత్తదనం కనిపిస్తుంది. రానాగారితో హిరణ్యకశ్యప చేద్దామనుకున్నాడు, కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అప్పుడు వేరే సోషల్ కథ ఎంచుకోకుండా శాకుంతలం సినిమా తీశాడు.
ఆ సీన్ ఒరిజినల్ కథలో లేదు!
ప్రేమ, గంధర్వ వివాహం.. ఆ ప్రేమను ఓ శాపం వల్ల మర్చిపోవడం, చివర్లో భార్యాభర్తలు కలవడం.. భారతదేశాన్ని పరిపాలించిన భరతుడు ఎలా పుట్టాడనేదే కథ. శకుంతల గర్భం దాల్చిన తర్వాత మహారాజుని కలవడానికి వెళ్లడం, ఆయన వెళ్లిపోమని కేకలు వేయడం.. బయటకు వచ్చిన ఆమెను గ్రామస్తులు రాళ్లతో కొట్టడం చూపించారు. సానుభూతి కోసం ఈ సీన్ పెట్టారేమో కానీ నాకు తెలిసినంత వరకు అభిజ్ఞాన శాకుంతలంలో ఆమెను రాళ్లతో కొట్టలేదు.
చిన్నపిల్లాడికి కూడా తెలిసిపోతుంది
శకుంతల- దుష్యంతుల ప్రేమ.. వారికి భరతుడు పుట్టాడనే కథ ఎన్ని సంవత్సరాలైనా సజీవంగా ఉంటుంది. ఫస్టాఫ్‌లో శకుంతల, దుష్యంతుడు కలుస్తారా? లేదా? ఆసక్తి క్రియేట్ చేశారు. సెకండాఫ్‌లో ఉంగరం చూడగానే దుష్యంతుడికి శకుంతల గుర్తుకు వస్తుంది. దీంతో వాళ్లిద్దరూ కలిసిపోవడం ఖాయమని చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది. గుణశేఖర్ రచన, దర్శకత్వంలో ఎక్కడా తప్పు లేదు. కానీ ఈ ఒక్క సీన్‌తో ఆసక్తి తగ్గిపోవచ్చు. సినిమా కలెక్షన్లపై సెకండాఫ్ ప్రభావం చూపించిందేమోనని నేను భావిస్తున్నాను.
సమంత చిన్నమ్మాయే అయినా..
చివర్లో దుష్యంతుడు స్వయంగా వచ్చినా కూడా శకుంతల ఆయన దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడలేదు.. ఇక్కడ మంచి డ్రామా క్రియేట్ చేశారు. సమంత చిన్నమ్మాయే అయినా అద్భుతంగా నటించింది. దుష్యంతుడి పాత్రకు దేవ్ మోహన్ న్యాయం చేశాడు. ప్రజలు మర్చిపోతున్న మహాభారతంలోని ఓ ముఖ్య నాటకాన్ని సొంత డబ్బుతో తెరకెక్కించిన గుణశేఖర్ గట్స్‌కు హ్యాట్సాఫ్' అని చెప్పాడు గోపాలకృష్ణ.
చదవండి: ప్రియుడితో టచ్‌లో ఉన్న నటుడి భార్య, అందుకే విడాకులు!
Comments
Please login to add a commentAdd a comment