నాగార్జున అక్కినేని. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ మూవీ నా సామిరంగ. ఆషిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి ఇది రీమేక్‌గా వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన రచయిత పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్‌లో రివ్యూ ఇచ్చాడు.
ఆ టెక్నిక్ ఫాలో కావట్లే..
ఆయన మాట్లాడుతూ.. 'సినిమా బాగుంది. కానీ వసూళ్లు అంతగా రాలేవు. ఏ దర్శకుడికైనా, రచయితకైనా, నటుడికైనా సంతృప్తినిచ్చే సినిమాలు కొన్నుంటాయి. ఈ మూవీ ఆ జాబితాలోకే వస్తుంది. దిగ్గజ డైరెక్టర్ దాసరి నారాయణరావు టెక్నిక్‌ను చాలామంది యువదర్శకులు ఫాలో అవడం లేదు. ఆయన సినిమాలో ఆఖరి అరగంటే చిత్రానికి గుండెకాయ. అప్పటివరకు ఎలా ఉన్నా చివర్లో మాత్రం ప్రేక్షకులు కన్నార్పకుండా చూసేవారు.
కళ్లతో నటించారు
నా సామిరంగ మూవీ విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో రొమాన్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. నాగార్జున గడ్డం పెంచి, లుంగీ కట్టి కొత్తగా కనిపించారు. కిష్టయ్య పాత్రను ప్రేమించారు. తన పాత్రకు న్యాయం చేశారు. కళ్లతో నటించారు. ఎప్పుడూ కామెడీ పండించే అల్లరి నరేశ్ ఎక్కువ ఫైట్లు చేశాడు. ఇంటర్వెల్‌లో రావు రమేశ్ పాత్రను ముగించకుండా ఉంటే బాగుండనిపించింది. ఇంటర్వెల్‌లో ఆయన పాత్ర క్లోజ్ చేయడంతో సెకండాఫ్‌లో కొత్త విలన్ వస్తాడని సగటు ప్రేక్షకుడికి సులువుగా తెలిసిపోతుంది. కూతుర్ని భయపెట్టే క్రమంలో నిజంగానే ఆయన పాత్ర చనిపోతుంది. ఈ పాత్రను అంతం చేయకుండా అలాగే కొనసాగిస్తే సెకండాఫ్ ఇంకా బాగుండేదనిపించింది.
ప్రేక్షకులు భరించలేరు
అల్లరి నరేశ్ పాత్రను కూడా ముగించకుండా ఉండాల్సింది. ఎందుకంటే హీరో పక్కన ఉన్నవాళ్లను చంపుకుంటూ పోతే ప్రేక్షకులు భరించలేరు. హీరో విలన్లను చంపుకుంటూ పోతే సినిమా సూపర్ హిట్ అవుతుంది, అదే విలన్.. హీరో మనుషులను చంపుకుంటూ పోతే సినిమా దెబ్బతింటుంది. అయినా లక్కీగా ఈ సినిమా బయటపడింది. నాజర్ పాత్ర చివర్లో చేసిన పని కూడా నచ్చలేదు. సెకండాఫ్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే మరిన్ని కలెక్షన్స్ వచ్చుండేవి' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: విజయకాంత్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్.. నేను వద్దని తెగేసి చెప్పారు
Comments
Please login to add a commentAdd a comment