మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో దుల్కర్ సల్మాన్. ఈ ఏడాది లక్కీ భాస్కర్ మూవీతో మరోసారి అలరించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. లక్కీ భాస్కర్ ఎలా ఉందో తెలియజేస్తూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు.
ముందు జాగ్రత్త
మధ్యతరగతి జీవితంలో జరిగిన అద్భుతమే ఈ సినిమా. కథ ముంబైలో జరుగుతుంది, పాత్రలు తెలుగులో మాట్లాడతాయి అని ముందే చెప్పేశారు. ముంబైలో తెలుగు మాట్లాడటమేంటని ఎవరూ విమర్శించకుండా జాగ్రత్తపడ్డారు. సినిమా ప్రారంభ సన్నివేశం బాగుంది. దర్శకుడు వెంకీ అట్లూరి స్క్రీన్‌ప్లేతో ఆటాడుకున్నారు. ఎన్నిరకాలుగా డబ్బును కాజేయొచ్చనేది సినిమాలో చూపించారు. దిగువమధ్యతరగతి స్థాయిలో ఉన్న భాస్కర్ వందకోట్లకు అధిపతి అయిపోతాడు.
అసలు గేమ్
ప్రపంచంలో కొందరు కోటీశ్వరులుగా ఎలా ఎదుగుతున్నారన్నది సినిమాలో చూపించారు. ప్రేమకథపై కాకుండా ఒరిజినల్ కథపైనే ఎక్కువ దృష్టి సారించడం బాగుంది. మొదట అతడి కష్టం, కన్నీళ్లు చూపించాక అసలైన గేమ్ మొదలుపెట్టారు. చివర్లో తను సంపాదించిన డబ్బంతా చెక్కులపై రాసిచ్చేసినప్పుడు ప్రేక్షకులకు బాధేస్తుంది. కట్ చేస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించి అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు.
ట్విస్టులు బాగున్నాయి
ప్రతి రూపాయిని బ్లాక్‌మనీలా కాకుండా వైట్ మనీ చేసుకున్న హీరో బ్రెయిన్‌ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. సినిమాలో ట్విస్టులు బాగున్నాయి. వంద కోట్ల కలెక్షన్స్ సాధించిందంటే మూడు రెట్ల లాభాలు వచ్చాయి. చిన్న పాత్ర అని తెలిసినా ఒప్పుకుని నటించిన హీరోయిన్ మీనాక్షి చౌదరిని అభినందించాల్సిందే! అని పరుచూరి చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment